N Chandrasekaran
-
స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది
జమ్‌షేడ్‌పూర్: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. వ్యయ నిర్వహణ, సామర్థ్యాలతో దీన్ని ఎదుర్కోవాలన్నారు. టాటా స్టీల్ వ్యవస్థాపకుడు జేఎన్ టాటా 186వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని అందుపుచ్చుకునే విషయంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలతోపాటు ప్రభుత్వం, విధానాల రూపంలో కంపెనీకి సాయం అవసరమన్నారు. ‘‘విస్తరణ విషయంలో సాహసోపేతంగా వ్యవహరించాలి. సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు కొనసాగించాలి. ఉత్పాదకతను పెంచుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు కొనసాగించాలి’’అని టాటా స్టీల్ విషయంలో కర్తవ్యబోధ చేశారు. టారిఫ్‌లపై కొనసాగుతున్న చర్చను ప్రస్తావించగా.. సుంకాల గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదంటూ, ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని సూచించారు. టారిఫ్‌లు అన్నవి ప్రభుత్వం విధించే సుంకాలని, విదేశీ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కంపెనీలు వీటిని చెల్లిస్తాయన్నారు. సెమీకండక్టర్ చిప్‌ల విషయంలో భారత్ స్వావలంబన సాధించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, హెల్త్‌కేర్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు చిప్‌లపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ఇందుకోసమే అసోం, గుజరాత్లో టాటాగ్రూప్ సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
భారత్‌కు ‘తయారీ’ స్వర్ణయుగం
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అన్నారు. ప్రపంచ సరఫరాల చైన్ భారతదేశానికి అనుకూలంగా మారుతుండడం ఇక్కడ సానుకూల అంశమని పే ర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపారాలు సవాళ్లను తట్టుకుంటూ, స్థిరీకరణ సాధిస్తున్నాయని తద్వారా ఈ రెండింట మధ్య (సవాళ్లు–స్థిరీకరణ) కొత్త సమతౌల్యతను సంస్థలు సాధిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రూప్ కంపెనీల సిబ్బందికి చంద్రశేఖరన్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని పంపారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → భారతదేశం ఇప్పుడు తయారీ స్వర్ణయుగంలో ఉంది. 2024 తర్వాత 2025కోసం ఆశావాదంతో ఎదురు చూస్తున్నాను. టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాను కోల్పోవడంతో ఈ సంవత్సరం గ్రూప్‌కు ఒక విచారకరమైన ఏడాదిగా నిలిచింది. → ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నేతృత్వంలోని కీలక చొరవలు జరుగుతాయని, ఇవి మొత్తం మానవాళికి సహాయపడతాయని భావిస్తున్నాం. → తయారీకి భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉంది. → మహమ్మారి స్వల్పకాలిక నష్టాన్ని కలిగించినా ఆన్లైన్, ఏఐ వినియోగం వ్యవస్థలో శాశ్వత ప్రయోజనాలను అందించే స్థాయికి ఎగశాయి. → టాటా గ్రూప్ 5 లక్షల తయారీ ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. → బ్యాటరీలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరికరాలు, హార్డ్‌వేర్ ప్రాజెక్టుల్లో దేశం నేటి పెట్టుడులు రేపటి ఆర్థిక వ్యవస్థలో మున్ముందు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. → గుజరాత్ ధొలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్, అస్సాంలోని సరికొత్త సెమీకండక్టర్– ఓఎస్ఏటీప్లాంట్ సహా ఏడు కొత్త ఉత్పాదక కర్మాగారాలకు భూమిపూజలు, నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలోని నరసపురలో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ ప్లాంట్, తమిళనాడులోని పనపాక్కంలో ఆటోమోటివ్ ప్లాంట్, కర్ణాటకలోని బెంగళూరులో కొత్త ఎంఆర్ఓ చొరవలను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. మనం గుజరాత్‌లోని సనంద్‌లో అలాగే బ్రిటన్‌లోని సోమర్సెట్లో కొత్త బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలను కూడా కలిగి ఉన్నాము. అలాగే గుజరాత్‌లోని వడోదరలో సీ295 ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్)ను ప్రారంభించాము. తమిళనాడులోని తిరునెల్వేలిలో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించాము. కొత్తగా ఐదు లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు, రిటైల్, టెక్ సరీ్వసెస్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఇతర రంగాలలో అనేక సేవల ఉద్యోగాలను అదనంగా గ్రూప్ కల్పించనుంది. → ఇటువంటి వృద్ధి చొరవలు గ్రూప్‌నకు అలాగే భారతదేశానికి ఉత్తేజకరమైనవి. ప్రతి నెలా గ్రూప్ వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే 10 లక్షల మంది యువకులకు ఈ చొరవలు ఆశావాదన్ని కల్పిస్తాయి. → సెమీకండక్టర్ తయారీ వంటి రంగాల నుండి పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. → ఉక్రెయిన్, గాజా, సూడాన్‌లలో సైనిక ఘర్షణలు చూస్తున్నాం. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో మానవతా సంక్షోభాలు తీవ్రం అయ్యాయి. బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో పౌరుల నేతృత్వంలోని ఉద్యమాలను కూడా చూశాము. ఆయా అంశాలు దేశీయ, విదేశీ విధాన కల్పనలపై తీవ్ర ప్రభావితం చూపుతాయి. ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్, సాంకేతికత ఇక్కడ ప్రస్తావనాంశాలు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి టారిఫ్‌లు మరోసారి నాయకుల మనస్సుల్లో ఉన్నాయి. వీటిపై అనిశ్చితి వాతావరణం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రూప్ పురోగతి స్థిరంగా కొనసాగింది. -
5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో తయారీకి సంబంధించి వివిధ విభాగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ మొదలైన పరిశ్రమల్లో ఈ ఉద్యోగాలుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖరన్ ఈ విషయం చెప్పారు. అస్సాంలో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ ప్లాంటుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం ఇతరత్రా పలు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.వీటితో ప్రాథమికంగా ఒక వ్యవస్థ ఏర్పడుతుందని, ఈ వ్యవస్థలో కనీసం 5 లక్షల పైచిలుకు చిన్న, మధ్య తరహా సంస్థలుంటాయని చంద్రశేఖరన్ చెప్పారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించకుండా వికసిత భారత్ లక్ష్యాలను సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలా పది లక్షల మంది యువత ఉద్యోగాల మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో పది కోట్ల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్షంగా ఒక్క ఉద్యోగం కల్పిస్తే పరోక్షంగా ఎనిమిది నుంచి పది మందికి ఉపాధి కల్పించగలిగే సెమీకండక్టర్ల వంటి కొత్త తరం పరిశ్రమలు ఇందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. ముంబై: విమానాలను లీజుకిచ్చిన ఎయిర్ క్యాజిల్, విల్మింగ్టన్ ట్రస్టు సంస్థలతో వివాదాలను పరిష్కరించుకున్నట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. సెటిల్మెంట్లో భాగంగా 23.39 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వివరించింది. దీని ప్రకారం స్పైస్‌జెట్‌పై వేసిన దావాలను రెండు సంస్థలు ఉపసంహరించుకోనున్నాయి. దీర్ఘకాలంగా ఎయిర్‌క్యాజిల్, విల్మింగ్టన్ ట్రస్ట్‌లతో ఉన్న వివాదాలను విజయవంతంగా పరిష్కరించుకున్నట్లు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ ఇటీవలే అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ సంస్థ బీబీఏఎంతో కూడా ఇదే తరహా వివాదాన్ని సెటిల్ చేసుకుంది. -
'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
భారత దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ఇటీవలే కన్నుమూశారు. ఈయన మరణం ప్రతి ఒక్కరినీ బాధించింది. తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లింక్డ్ఇన్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.రతన్ టాటాతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల అతని దయ, ఆప్యాయతను తప్పకుండా తెలుసుకుంటారు. ప్రారంభంలో వ్యాపార అంశాలను గురించి ప్రారంభమైన మా పరిచయం.. కొంతకాలానికి వ్యక్తిగత పరిచయంగా మారిపోయింది. కార్లు, హోటల్స్ గురించి చర్చ ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఇతర విషయాల గురించి చర్చించేవాళ్ళం. అయితే రతన్ టాటా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవారు.2017లో టాటా మోటార్స్, దాని ఎంప్లాయీస్ యూనియన్ మధ్య చాలా కాలంగా ఉన్న వేతన వివాదం పరిష్కరించే సమయంలో చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించడంలో జరిగిన ఆలస్యానికి చింతిస్తూ.. దానిని వెంటనే పరిష్కరించనున్నట్లు రతన్ టాటా హామీ ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆయన ఆలోచించేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బాంబే హౌస్ పునరుద్దరణ అంశం గురించి కూడా చంద్రశేఖరన్ ప్రస్తావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రతి వస్తువును దగ్గరలో ఉండే కార్యాలయానికి తరలిస్తామని రతన్ టాటాతో చెప్పాము. అప్పుడు అక్కడున్న కుక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాటికోసం కెన్నెల్ తయారు చేస్తామని చెప్పాము. ఆ తరువాత రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది.బాంబే హౌస్ రేనోవేషన్ పూర్తయిన తరువాత నేను మొదటి కెన్నెల్ చూస్తానని రతన్ టాటా చెప్పారు. ఆ తరువాత కుక్కల కోసం కెన్నెల్ తయారు చేశాము. రతన్ టాటా ఎంతగానో సంతోషించారు. ఇలా ఎప్పుడూ కుక్కల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రారతన్ టాటాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ప్రదేశాన్ని సందర్శిస్తే.. ఏళ్ళు గడిచినా అక్కడున్న ప్రతిదాన్ని గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పుడు లేరు అన్న విషయం జీర్ణించుకోలేని అంశం. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. -
దేశంలో అత్యధిక వేతనం.. ఈయనదే..
దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్‌లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు.చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు. -
ఒడిదుడుకులకు సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: కొత్త ఏడాది (2024)లో అంతర్జాతీయంగా గవర్నెన్స్‌లో సంక్లిష్టత స్థాయి మరింతగా పెరుగుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. మరిన్ని ఒడిదుడుకులు, మరింత విప్లవాత్మక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరివర్తన చెందుతున్న క్రమంలో టాటా గ్రూప్ .. కొత్త ఏడాదిలో ప్రణాళికల అమలు, కస్టమరు సంతృప్తి, టెక్నాలజీ అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని చెప్పారు. భౌగోళిక, రాజకీయ ఆందోళనలు మొదలుకుని జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరకు వివిధ ట్రెండ్స్‌తో 2023లో ప్రపంచం అస్థిరపర్చే ధోరణులను ఎదుర్కొందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ గవర్నెన్స్ విధానాలను సంక్లిష్టంగా మార్చాయని, మార్పులకు తప్పనిసరిగా అలవాటు పడేలా ఒత్తిడి తెచ్చాయని ఆయన వివరించారు. 2023లో టాటా గ్రూప్ మెచ్చుకోతగిన విధంగా రాణించిందన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో, కొత్త గిగాఫ్యాక్టరీలు మొదలైనవి రాబోయే దశాబ్దాల్లో మరింత వృద్ధికి దోహదపడగలవని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్ టీమ్ కనపర్చిన ఆత్మవిశ్వాసం, చంద్రయాన్ మిషన్ 2023లో గుర్తుండిపోయే రెండు కీలకాంశాలని ఆయన పేర్కొన్నారు. -
భారత వృద్ది, ఏఐపై టాటా చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు
నేడు( ఆగస్ట్ 25న) న్యూ ఢిల్లీలో ప్రారంభమైన మూడు రోజుల B20 సమ్మిట్ ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి, B20 చైర్ నటరాజన్ చంద్రశేఖరన్ భారతదేశ పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అభివృద్ధి ప్రయాణం ప్రపంచ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ఇది తక్కువ లేదా నైపుణ్యం లేని ఎక్కువ మందికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి సాధికారత నిస్తుందన్నారు. B20 సమ్మిట్ ఇండియా 2023లో జరిగిన ప్యానెల్ చర్చలో, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, భారతదేశం టెక్నో-లీగల్ విధానాన్ని తీసుకోవడం ద్వారా డేటా గోప్యత, రక్షణకు సంబంధించి "అద్భుతమైన పురోగతి"ని సాధించిందన్నారు. గత డిసెంబర్లో 2023కి బి20 చైర్‌గా ఎంపికైన చంద్రశేఖరన్ ప్రధానమంత్రి గతి శక్తి పథకం, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలు, తక్కువ కార్పొరేట్ పన్నులు, సాలిడ్ డిజిటల్ వంటి అనేక అంశాలు ప్రస్తుతం దేశ వృద్ధిని నడిపిస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ లాంటి జి20 దేశాలలో భారత్ బుల్లిష్ ధోరణికి సహాయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వాస్తవానికి మనలాంటి దేశంలో, ఉద్యోగాలను సృష్టిస్తుందనీ, ఎందుకంటే ఇది తక్కువ నైపుణ్యం లేదా నైపుణ్యం లేని వ్యక్తులను మరింత శక్తివంతం దనీ, వారికున్న సమాచార నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయగలరన్నారు. దీనికి ఒక నర్సు ఉద్యోగాన్ని ఉదాహరణగా చెప్పారు. ఏఐ ద్వారా నర్సు ఒక వైద్యుని పనిభారాన్ని తగ్గించగలదని పేర్కొన్నారు. అయితే దీని వివిధ మార్కెట్లలో మరియు సమాజంలోని వివిధ విభాగాలలో భిన్నంగా ఉంటుందన్నారు. అయితే ప్రతిచోటా (AI) ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇది ఉన్నత స్థాయి ఉద్యోగాలతో ప్రజలను శక్తివంతం చేస్తుందని చంద్రశేఖరన్ నొక్కిచెప్పారు. దేశంలో వందల మిలియన్ల మంది ప్రజలకు ఏఐ అందుబాటులోకి రావాలనేది తమ భావన అనీ, ప్రజలు మార్కెట్లోకి రాబోతున్న 250 - 300 మిలియన్ల మందిరానున్నారి చెప్పారు. వీటికి ఏఐ సేవల్ని వినియోగిస్తే మొత్తం GDPని ప్రభావితం చేస్తుందని, అలాగే వారి తలసరి ఆదాయం పెరుగడం లాంటి చాలా ప్రయోజనాలున్నాయని ఆయన చెప్పారు. అలాగే ఇండియా ఐటీ చట్టంద్వారా డేటా గోప్యత, రక్షణ విషయంలో భారతదేశం పెద్ద పురోగతిని సాధించిందని, మరోవైపు తాము సృష్టించిన DEPA(ప్రైవేట్ యాప్స్‌కి అవసరమైన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్) రెండూ కలిసి పని చేయడం మంచి పరిణామమన్నారు. కాగా G 20 18 వ సదస్సు భారతదేశం వేదికగా 2023 September లో జరగబోతుంది. -
బ్రిటన్‌లో టాటా గిగాఫ్యాక్టరీ!
ముంబై/లండన్: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల తయారీ కోసం గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు తెలిపింది. తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వాహనాలతో పాటు ఇతరత్రా సంస్థల కోసం కూడా ఇందులో బ్యాటరీలను తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 నుంచి ఈ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీల వాటా దాదాపు సగం పైగా ఉంటుంది. వేల కొద్దీ ఉద్యోగాలకు ఊతం.. గిగాఫ్యాక్టరీపై పెట్టుబడులతో స్థానికంగా 4,000 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, సరఫరా వ్యవస్థలో పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించగలదని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి తమకు అవసరమయ్యే బ్యాటరీల్లో ఈ ప్లాంటు దాదాపు సగభాగం ఉత్పత్తి చేయగలదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్లాలన్న తమ లక్ష్యం మరింత వేగవంతంగా సాకారం కాగలదని వివరించారు. భారీగా సబ్సిడీలు.. గిగాఫ్యాక్టరీ కోసం బ్రిడ్జ్‌వాటర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు జేఎల్ఆర్ మాతృ సంస్థ టాటా సన్స్ తెలిపింది. 40గిగావాట్‌అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో ఇది యూరప్‌లోని భారీ గిగాఫ్యాక్టరీల్లో ఒకటిగాను, భారత్‌కు వెలుపల టాటా గ్రూప్‌నకు తొలి భారీ గిగాఫ్యాక్టరీగా నిలవనుంది. 1980ల్లో నిస్సాన్ రాక తర్వాత బ్రిటన్ ఆటోమోటివ్ రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం టాటా గ్రూప్‌నకు ప్రభుత్వం నుంచి వందల కొద్దీ మిలియన్ పౌండ్ల మేర ప్లాంటుకు సబ్సిడీల హామీ లభించి ఉంటుందని పేర్కొన్నాయి. విద్యుత్, గ్రాంటు, సైటుకు రహదారిని మెరుగుపర్చటం తదితర రూపాల్లో 500 మిలియన్ పౌండ్ల మేర సబ్సిడీలు అందించాలని ప్రభుత్వాన్ని టాటా గ్రూప్ కోరినట్లు సమాచారం. అయితే, ఇటు టాటా గ్రూప్, అటు బ్రిటన్ ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. పారదర్శక విధానాల్లో భాగంగా వీటిని తర్వాత ప్రచురించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్‌లో ప్రస్తుతం ఒక్క బ్యాటరీల తయారీ ప్లాంటు ఉంది. కొత్తగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్‌లో 35 పైచిలుకు ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తుండగా, కొన్ని నిర్మాణంలోనూ, కొన్ని ప్రతిపాదనల దశల్లోనూ ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు.. ‘బిలియన్ల కొద్దీ పౌండ్ పెట్టుబడులు, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసే ప్లాంటు.. ఆటోమోటివ్ రంగం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లేందుకు తోడ్పడగలదు. ఇప్ప టికే బ్రిటన్‌లో వివిధ రంగాల్లో మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్రిటన్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపేందుకు తాజా ఇన్వెస్ట్మెంట్ నిదర్శనం‘ అని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ‘భారత్‌కు వెలుపల తమ తొలి భారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోవడమనేది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, నిపుణులపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా ఆటోమోటివ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది’ – బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
రూ.100 కోట్ల స్కాం: నలుగురు కాదు ఆరుగురు ఉద్యోగులపై టీసీఎస్ చర్యలు
ముంబై: కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలతో కుమ్మక్కై, వాటికి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించినందుకు గాను ఆరుగురు ఉద్యోగులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చర్యలు తీసుకుంది. నైతిక నియమావళిని పాటించలేదని విచారణలో తేలడంతో ఆరుగురు ఉద్యోగులను, అలాగే ఆరు సంస్థలను నిషేధించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపైనా సంస్థ విచారణ జరుపుతోందని ఆయన షేర్హోల్డర్లకు వెల్లడించారు. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) కొందరు ఉద్యోగుల తప్పుడు ప్రవర్తన గురించి ఇద్దరు ప్రజావేగుల నుంచి కంపెనీకి ఫిర్యాదులు రావడం, టీసీఎస్‌లో ఉద్యోగాలకు లంచాలు తీసుకుంటున్నారని.. తత్సంబంధ వ్యక్తులు ఈ రకంగా కనీసం రూ. 100 కోట్లు సంపాదించారని ఇటీవల మీడియాలో వార్తలు రావడం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, సంపన్న దేశాల్లో అనిశ్చితితో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, అయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
గ్లోబల్ ఎకానమీపై వడ్డీరేట్ల పెరుగుదల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఎకానమీ వృద్ధిపై వచ్చే యేడాది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లకు తెలిపారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2022–23కు సంబంధించిన వార్షిక నివేదికలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి కీలక వ్యాసం రాశారు. వడ్డీరేట్ల పెరుగుదల బ్యాంకింగ్ రంగంపై కనపడని ప్రభావం చూపవచ్చని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆయన సందేశంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీని కట్టడికి వడ్డీరేట్ల పెంపుదలకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే అంశం బ్యాంకింగ్ రంగంపై కొంత ఒత్తిడిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ► ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, మహమ్మారి సవాళ్లు, సైనిక సంఘర్షణలు, పెరుగుతున్న అసమానతలు, సప్లై చైన్ సవాళ్లు వంటి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థలు అలాగే సమాజాలలో నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ► మరోవైపు డిజిటల్ ట్రాన్సిషన్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ ప్రధాన స్రవంతి అవుతున్నాయి. సంస్థ విషయానికి వస్తే, టాటా గ్రూప్ పటిష్ట వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది. టాటా మోటార్స్ అనేక సవాళ్లను అధిగమించి పటిష్ట స్థానానికి వెళ్లడం ప్రారంభించింది. ► రాబోయే సంవత్సరం సంస్థకు చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో మనం గరి్వంచే పనితీరుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇందుకు సంబంధించి సాంకేతిక పురోగతి చోటుచేసుకోనుంది. -
భారత్ నాయకత్వ పాత్ర పోషించాలి
దావోస్: భారత్ ఇటీవలి కాలంలో మార్పు దిశగా చక్కని వైఖరి ప్రదర్శించిందని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలంగా పైకి తీసుకొచ్చేందుకు భారత్ నాయతక్వం పోషించాల్సిన స్థానంలో ఉన్నట్టు టాటా గ్రూపు చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా.. ‘10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మార్గం’ అనే అంశంపై చర్చా కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో భారత్ ప్రావీణ్యం సంపాదించినట్టు చెప్పారు. భారత్ అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని, భారత్‌ను అనుకూల స్థితిలో ఉంచేందుకు కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటన్నారు. ‘‘భారత్ కరోనా సమయంలో గొప్ప పనితీరు చూపించింది. కావాల్సిన టీకాలను భారత్‌లోనే తయారు చేసుకోవడాన్ని చూశాం. డిజిటల్ దిశగా అనూహ్యమైన మార్పును చూస్తున్నాం. నా వరకు వృద్ధి, వృద్ధి, వృద్ధి అన్నవి ఎంతో ముఖ్యమైనవి. ప్రపంచం పుంజుకోవాలని చూస్తోంది. సరఫరా వ్యవస్థ సహా నాయకత్వం వహించాల్సిన స్థానంలో భారత్ ఉంది’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. భారత్‌కు అపార అవకాశాలున్నాయంటూ.. హెల్త్‌కేర్, పర్యాటకం తదితర రంగాల్లో ముఖ్య పాత్ర పోషించగలదన్నారు. భారత్‌కు ఏటా కోటి మంది పర్యాటకులు ప్రస్తుతం వస్తుండగా, 10 కోట్ల మందిని ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను నిర్మించాలని, ఎయిర్ పోర్ట్‌లు, ఉపరితల రవాణా, షిప్పింగ్ విభాగాల్లో ఎన్నో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అన్ని లక్ష్యాలను 25 ఏళ్ల అమృత కాలంలో సాధించొచ్చన్నారు. కరోనా సమయంలో భారత్ ఎన్నో అంశాల్లో తన సామర్థ్యాలను నిరూపించుకున్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను భారత్ సునాయాసంగా సాధించగలదన్నారు. -
‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో సిబ్బంది సరిగా స్పందించలేదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ ఘటన వ్యక్తిగతంగా నాకు, ఎయిరిండియా సిబ్బందికి మనస్తాపం కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాల్సిన, స్పందించాల్సిన తీరును సమీక్షించి, సరిచేస్తాం’’ అన్నారు. నిందితుడి అరెస్ట్.. ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఇదీ చదవండి: Shocking: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ -
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
బీ20 చెయిర్‌గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు
ముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్మత్ మహరాష్ట్రియన్ ఆఫ్ ఇయర్ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడారు. టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్‌లైన్స్ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్‌లైన్, రెండు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది. అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్‌తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు. -
టాటా చేతికి ఎన్ఐఎన్ఎల్, మా లక్ష్యం అదే!
న్యూఢిల్లీ: నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్)ను స్వాదీనం చేసుకున్న తర్వాత వార్షిక తయారీ సామర్థ్యాన్ని ఏడాదిలోనే 1.1 మిలియన్ టన్నులకు చేరుస్తామని టాటా స్టీల్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఇది ఆధారపడి ఉంటుందన్నారు. టాటా స్టీల్ 115వ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడారు. జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదతర సంస్థలతో పోటీపడి ఎన్ఐఎన్ఎల్ను టాటా స్టీల్‌కు చెందిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ దక్కించుకోవడం తెలిసిందే. ఎన్ఐఎన్ఎల్లో 93.71 శాతం వాటాకు టాటా స్టీల్ వేసిన రూ.12,100 కోట్ల బిడ్ అర్హత సాధించింది. లాంగ్ ప్రొడక్ట్స్, మైనింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ విభాగంలో గణనీయమైన కొనుగోళ్లు చేసినట్టు చంద్రశేఖరన్ చెప్పారు. తమ కళింగనగర్ ప్లాంట్‌కు ఎన్ఐఎన్ఎల్ సమీపంలో ఉండడం తమకు ఎంతో కీలకమైనదంటూ.. అందుకే కొనుగోలు చేసినట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి ఇది కేంద్రంగా నిలుస్తుందన్నారు. -
టాటాసన్స్ చైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరన్.. జీతం ఎంతో తెలుసా ?
దేశంలోని అతిపెద్ద వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాసన్స్ గ్రూపు చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ తిరిగి నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ 25న జరిగిన షేర్‌హోల్డర్ల సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరోసారి టాటాసన్స్ గ్రూపు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో విజయ్ సింగ్, లియో పూరీలకు బోర్డులో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు. గతేడాది టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రేశేఖరన్కు వార్షిక వేతనంగా రూ.91 కోట్లు చెల్లించారు. వేతనంతో పాటు లాభాల్లో వాటా, ఇతర అలవెన్సులు అందించారు. ఎన్ చంద్రశేఖరన్ పనితీరు నచ్చడంతో 2022 ఫిబ్రవరిలో మరో ఏడాది పాటు అతన్నే చైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వాటాదారులతో 2022 ఏప్రిల్ 25న సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రశేఖరన్‌కు అనుకూలంగా టాటాలు ఓటేశారు. తాజాగా జరిగిన టాటా వాటాదారుల సమావేవానికి మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. టాటా గ్రూపులో మిస్త్రీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. 2016లో మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించారు. దీనిపై మిస్త్రీ కుటుంబం న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తోంది. చదవండి: టాటా ఎలక్సీ డివిడెండ్ రూ. 42.5 -
మా జీతాలు పెంచండి మహాప్రభో!
కరోనా కాలంలో తగ్గించిన తమ జీతాలను మళ్లీ పెంచాలంటూ ఎయిర్ఇండియా పైలెట్లు ఈ సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అప్పుడు పైలెట్ల జీతాల్లో 55 శాతం కోత పెట్టారు. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగినా జీతాలు పెంచలేదు సరికదా వివిధ రకాల అలవెన్సులకు కోత పెట్టారు. ఇటీవల ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా సన్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోవిడ్ అనంతర పరిస్థితులు చక్కబడుతుండటంతో క్రమంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి. దీంతో కోవిడ్ సమయంలో తగ్గించిన జీతాలతో పాటు నిలిపివేసిన పలు అలవెన్సులు పునరుద్ధరించాలంటూ పైలెట్లు కొత్త చైర్మన్‌ను డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ హయంలోనూ ఇదే డిమాండ్లు వినిపించామని అయితే అప్పుల పేరు చెప్పి ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపలేదని పైలెట్ల సంఘం అభిప్రాయపడింది. చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..! -
ఎయిర్ ఇండియా నూతన చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం..!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా నూతన చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్'ను నియామిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఆయన నియమకాన్ని దృవీకరిస్తూ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్ గతంలో టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించింది, కానీ ఈ నియామకం విషయంలో దేశంలో చాలా వ్యతిరేకత రావడంతో టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ టాటా ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండటానికి నిరాకరించారు. అలా, నిరాకరించిన కొద్ది రోజులకే టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. నటరాజ్ చంద్రశేఖరన్.. ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. చంద్రశేఖరన్ అక్టోబర్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరిన ఒక ఏడాదిలోనే జనవరి 2017లో చైర్మన్‌గా నియమించబడ్డారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో సహా పలు గ్రూప్ ఆపరేటింగ్ కంపెనీల బోర్డులకు కూడా ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. వీటిలో కొన్నింటికి 2009-17 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. టీసీఎస్'లో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖరన్ 30 ఏళ్లు సేవలందించి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. గతే ఏడాది అక్టోబర్ నెలలో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి మరి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్(టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల ప్రకటించారు. (చదవండి: భారత్‌లో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అప్పుడే.. రేంజ్ ఎంతో తెలుసా?) -
ఎయిరిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతాం
ముంబై: ఇటీవల వేలంలో దక్కించుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ ఆర్థికంగా పటిష్టంగా చేస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సంస్థకు ఉన్న విమానాలను అప్‌గ్రేడ్ చేస్తామని, కొత్త విమానాలను తీసుకుంటామని, ఎయిరిండియాను ప్రపంచంలోనే టెక్నాలజీపరంగా అత్యాధునిక ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో చంద్రశేఖరన్ ఈ విషయాలు చెప్పారు. సంస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి భారత్‌ను అనుసంధానించాలన్నది తమ లక్ష్యమని చంద్రశేఖరన్ వివరించారు. అత్యుత్తమ కస్టమర్ సర్వీసులు అందించడం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విమానాలను ఆధునీకరించుకోవడం, ఆతిథ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై ఎయిరిండియా ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐ–ఎస్ఏటీఎస్లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా.. వర్చువల్ సమావేశంలో 10,000 మంది పైగా పాల్గొన్నారు. -
మరోసారి టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం..!
ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. "బోర్డు సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పనితీరును ప్రశంసిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలకు ఎన్.చంద్రశేఖరన్‌ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించడానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు" కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడైన రతన్ టాటా, ఎన్.చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూపు పురోగతి & పనితీరుపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పునరుద్ధరించాలని ఆయన సిఫారసు చేసినట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. తనను తిరిగి నియమించడంపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. "గత ఐదు సంవత్సరాలుగా టాటా గ్రూపుకు నాయకత్వం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. టాటా గ్రూపుకు మరో ఐదు సంవత్సరాలు నాయకత్వం వహించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిర్ ఇండియాను జనవరిలో టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న కొద్ది వారాలకే చంద్రశేఖరన్ తిరిగి నియామకం కావడం విశేషం. దాదాపు 70 సంవత్సరాల తర్వాత విమానయాన సంస్థ తిరిగి తన సొంత గూటికి చేరుకుంది. గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే జనవరిలో తెలిపారు. ఈ డీల్ విలువ సుమారు రూ.18,000 కోట్లు. ఇందులో రూ.2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. అయితే, ఎయిరిండియా తిరిగి టాటాల చెంతకు చేరడం.. చంద్రశేఖరన్ సాధించిన విజయాల్లో ముఖ్యమైనది. (చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న పెన్షన్..!) -
ఇక టాటావారి ఎయిరిండియా
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు గురువారం అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిరిండియా తిరిగి ప్రపంచస్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2021 అక్టోబర్‌లో... గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలసి టేకోవర్ వివరాలు తెలిపారు.. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య ఏర్పాటును చేపట్టింది.టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మీడియాకు తెలిపారు. ‘‘ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని టాటాలు స్వీకరించారు. ఇక నుంచి ఎయిరిండియా యజమాని టాలేస్’’ అని పాండే ప్రకటించారు ఆపై ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిరిండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌కు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఎస్ఐబీ కన్సార్షియం నుంచి రుణం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూపునకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతోపాటు, మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పీఎన్బీ, బీవోబీ, యూనియన్ బ్యాంకు ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘‘ఎయిరిండియా రుణ భారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించాయి’’ అని ఓ బ్యాంకర్ తెలిపారు. టాటా వయా న్యూఢిల్లీ టు టాటా టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జేఆర్డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి... ► 1946: టాటాసన్స్ ఏవియేషన్ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు. ► 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. ► 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది. ► 1994–95: ఏవియేషన్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000–01లో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటాగ్రూపు–సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ► 2017 జూన్: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ► 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో ప్రభుత్వం నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంది. ► 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది. కొనుగోలుదారు రూ.23,285 కోట్ల రుణ భారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ► 2020 అక్టోబర్: ఎయిరిండియా రుణ భారం ఎంత స్వీకరించాలన్నది కొనుగోలుదారుల అభిమతానికి విడిచిపెట్టింది. ► 2020 డిసెంబర్: ఎయిరిండియాకు ఆసక్తి వ్యక్తీకరణలు అందుకున్నట్టు దీపమ్ సెక్రటరీ ప్రకటించారు. ► 2021 ఏప్రిల్: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ. ► 2021 సెప్టెంబర్: ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థ నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖ వెసులుబాటు ప్రకటించింది. ► 2021 సెప్టెంబర్: టాటా గ్రూపు, స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నుంచి బిడ్లు వచ్చాయి. ► 2021 అక్టోబర్ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది. ► 2021 అక్టోబర్ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ► 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది. విమానయానం బలపడుతుంది ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు. వారి చేతుల్లో ఎయిరిండియా తప్పకుండా వికసిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగం మరింత బలపడుతుంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనుకున్న వ్యవధిలోపే విజయవంతంగా పూర్తయింది. – జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎయిరిండియా తిరిగి టాటా గ్రూపు కిందకు రావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్)గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఉద్యోగులు అందరికీ టాటా గ్రూపులోకి సాదర స్వాగతం. మీతో కలసి పనిచేయాలనుకుంటున్నాం. సంస్కరణల పట్ల ప్రధాని మోదీ నిబద్ధత, భారత వ్యవస్థాపక స్ఫూర్తి పట్ల నమ్మకాన్ని గుర్తిస్తున్నాం. ఇదే చారిత్రక మార్పునకు దారి చూపింది. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరలకు తీసుకురావాలని, పౌరుల జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రధాని లక్ష్యంతో ఏకీభవిస్తున్నాం. – ఎయిరిండియా ప్రకటన కొత్త అధ్యాయం ప్రారంభం నేడు కొత్త అధ్యాయం మొదలైంది. టాటా గ్రూపు తరఫున నేను ఈ లేఖ రాస్తూ, మీకు (ఎయిరిండియా ఉద్యోగులు) స్వాగతం పలుకుతున్నాను. జాతి మొత్తం మన వైపే చూస్తోంది. మనం కలసికట్టుగా ఏం సాధించగలమన్నది చూడాలి. మన దేశ అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌లైన్‌ను నిర్మించడానికి మనం భవిష్యత్తు వైపు చూడాల్సి ఉంది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
అధిక వృద్ధికి 4 థీమ్‌లు..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ రాబోయే రోజుల్లో అధిక వృద్ధి వ్యూహాల్లో భాగంగా ప్రధానంగా నాలుగు అంశాలపై మరింతగా దృష్టి పెట్టనుంది. డిజిటల్, కొత్త ఇంధనాలు, దీటైన సరఫరా వ్యవస్థ, ఆరోగ్యం వీటిలో ఉండనున్నాయి. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశించి ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఇటు సమాజం, అటు వ్యాపారాలు సన్నద్ధమై ఉండాలని ఆయన సూచించారు. గత ఏడాది అనుభవాలను ప్రస్తావిస్తూ.. గ్రూప్ స్వరూపం ప్రస్తుతం మరింత సరళంగా, ఆర్థికంగా పటిష్టంగా మారిందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘కొత్త టెక్నాలజీల తోడ్పాటుతో కర్బన ఉద్గారాలను నియంత్రించడంలోనూ, మన కంపెనీలు ప్రయోజనాలు అందిపుచ్చుకోవడంలోనూ చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగాం. ఎయిరిండియాను దక్కించుకోవడం ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయి. ఇది చరిత్రాత్మక సందర్భం‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త థీమ్‌లకు టాటా గ్రూప్ సంస్థలు ఇప్పటికే అలవాటుపడుతున్నాయని, పటిష్టమైన పనితీరు కనపరుస్తున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో 5జీ మొదలుకుని టాటాన్యూ (డిజిటల్ ప్లాట్‌ఫాం), టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ విభాగాలు ఈ నాలుగు థీమ్స్‌తో గణనీయంగా ప్రయోజనం పొందగలవని చంద్రశేఖరన్ చెప్పారు. వైరస్‌పై ఆధారపడి ఉంటుంది.. 2024 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న దేశ లక్ష్యాలను సాధించడంలో టాటా గ్రూప్ తన వంతు పాత్ర పోషించగలదని చంద్రశేఖరన్ వివరించారు. ‘సరళతర .. సుస్థిరమైన విధానాలను పాటిస్తూ, అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలి. అలా చేయగలిగితే మన కంపెనీని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. అయితే, ఈ ఆకాంక్షలన్నీ కూడా ఒక అంశంపై ఆధారపడి ఉంటాయి. అదేంటంటే కరోనావైరస్తో కలిసి జీవించడాన్ని నేర్చుకోవడం. కొత్తగా మరింత వ్యాప్తి చెందినా, మరిన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనగలిగేందుకు వ్యాపారాలు, సమాజం అలవాటుపడగలగాలి. సర్వసన్నద్ధంగా ఉండగలగాలి. ఒమిక్రాన్ విషయంలో ఇది కనిపిస్తోంది. దేశీయంగా భారీ స్థాయిలో అమలు చేసిన టీకాల పథకం ఒక రక్షణ గోడను నిర్మించింది. ఇప్పటివరకూ వ్యాప్తి తీవ్రత ఒక మోస్తరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం మంచిది కాదు‘ అని చంద్రశేఖరన్ చెప్పారు. కోవిడ్–19 కారణంగా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటంలో తోడ్పాటునిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. -
ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!
టాటా మోటార్స్ యాజమాన్యంలో గల ఎలక్ట్రిక్ వాహన అనుబంధ సంస్థలో రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ గ్రూప్ నేడు (అక్టోబర్ 12) ప్రకటించింది. వచ్చే 18 నెలల వ్యవధిలో ఈ పెట్టుబడిని విడతల వారీగా పెట్టుబడి పెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ విషయంలో అస్సలు తగ్గేదెలే అనే రీతిలో టాటా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కూడా టాటా దే పై చేయి. "భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మొబిలిటీ వ్యాపారాన్ని సృష్టించడానికి మా ప్రయాణంలో టీపీజీ రైజ్ క్లైమేట్ మాతో చేరడం నాకు సంతోషంగా ఉంది. ఈవీ తయారీకి అనువైన వాతావరణాన్ని సృష్టించేటప్పుడు కస్టమర్లను ఆహ్లాదపరిచే వాటిపై మేం ముందస్తుగా పెట్టుబడి పెడతాం. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించింది. ఆ విషయంలో ప్రముఖ పాత్ర పోషించడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ తెలిపారు. కంపెనీ ఉత్పత్తిలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు. -
ఫోర్డ్ చెన్నై యూనిట్‌పై టాటా మోటార్స్ కన్ను?!
చెన్నై: చెన్నైలోని మరాయ్ నగర్లో ఉన్న ఫోర్డ్ ఇండియా యూనిట్‌ను స్వాధీనం చేసుకునే అవకాశంపై తమిళనాడు ప్రభుత్వం టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి తంగం తెన్నారసుతో సమావేశం అయినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో రెండవసారి జరిగిన ఉన్నత స్థాయి చర్చల సమావేశం ఇది. సెప్టెంబర్ 27న టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సీఎంను కలిశారు.(చదవండి: ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!) అయితే, ఈ సమావేశాల వివరాలు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వాటికి అధ్యక్షత వహించినప్పటి నుంచి తుది నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కూడా ముఖ్యమంత్రి నుంచి వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. చంద్రశేఖరన్ తమిళనాడు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు, మిగిలినవన్నీ ఊహాగానాలు అన్నారు. ఫోర్డ్ మరాయిమలాయి నగర్ ప్లాంట్ 2.40 లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 30 దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది. యుఎస్ కార్ల తయారీసంస్థ ఈ ప్లాంట్‌లో 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. (చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!) ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ లో సనంద్ వద్ద ఒక కర్మాగారం కూడా ఉంది. ఫోర్డ్ భారతదేశం నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన తర్వాత పరోక్షంగా 4 వేల మంది జీవితాలపై ప్రభావం పడనుందని తెలుస్తున్నది. ఈ యూనిట్ గనుక టాటా మోటార్స్ కొనుగోలు చేస్తే ఆ యూనిట్లో పని చేస్తున్న 2600 మంది ఉద్యోగులకు ఉపశమనం లభించినట్లే అవుతుంది. అయితే, ఈ విషయం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడా లేదు. కంపెనీ భారతదేశంలో సుమారు 170 డీలర్ భాగస్వాములను కలిగి ఉంది. ఈ డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్‌తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్ అందించే ప్రపంచ అగ్రగామి సంస్థల్లో టాటా మోటార్స్ ఉండేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశంతో పాటు ఐరోపాలో సెల్, బ్యాటరీ తయారీ కోసం పలు ఒప్పందాలను చేసుకుంటున్నట్లు వివరించారు. టాటా మోటార్స్ గత సంవత్సరం ప్రారంభించిన నెక్సన్ ఈవీ 4,000 యూనిట్లను విక్రయించింది. "రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఈవీ అమ్మకాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఈ మార్పుకు నాయకత్వం వహిస్తుంది. 2025 నాటికి, టాటా మోటార్స్ 10 కొత్త బీఈవీ వాహనాలను మార్కెట్లోకి తీసుకొనిరావలని యోచిస్తుంది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి మేము పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము" అని కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్ 2020-21 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలిపారు. టాటా గ్రూప్ భారతదేశం, ప్రపంచ వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను వేగంగా తీసుకొనిరావడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాగ్వార్ 2025 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వాల్యూమ్ లలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
పరస్పర సహకారంలో నవ శకం : టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభం తాకిడితో.. పరస్పరం సహకరించుకునే విషయంలో యావత్ ప్రపంచం కొత్త శకం ముంగిట్లో నిల్చిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య నిరంతర సహకారం అందించిన ఉద్యోగులుఅందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో ఉద్యోగుల సహకారాన్ని నమ్మకాన్ని ప్రశంసించడమే కాకుండా, మెడిసిన్, పట్టణ ప్రణాళిక, వాస్తుశిల్పం ఇలా లెక్కలేనన్ని అనేక ఇతర రంగాలలో మహమ్మారి పురోగతికి ప్రేరణనిచ్చిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కి, మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలంటే అంతర్జాతీయ సమాజమంతా కృషి చేస్తేనే సాధ్య పడుతుందని టాటా గ్రూప్‌లోని 7.5 లక్షలమంది ఉద్యోగులకు నూతన సంవత్సర సందేశంలో ఆయన తెలిపారు. కరోనా మహమ్మారితో నిబంధనలన్నీ సమూలంగా మారిపోయాయని.. భద్రతకు ప్రాధాన్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ టీకాలు పంపిణీ చేయడమనేది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. వేగవంతమైన టెస్టింగ్, కొత్త చికిత్సలు కనుగొనడం కూడా ఇలాంటిదే. ప్రపంచమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే మళ్లీ సాధారణ స్థితికి రావడం సాధ్యపడుతుంది‘ అని చంద్రశేఖరన్ తెలిపారు. -
భారత్‌కు సువర్ణావకాశం
ముంబై: ఏకైక సరఫరా మార్కెట్‌గా చైనాపై ప్రపంచం అధికంగా ఆధారపడడం కరోనా తర్వాత తగ్గిపోతుందని, ఇది భారత్‌కు మంచి అవకాశమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. గ్రూపు కంపెనీ టీసీఎస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆన్లైన్లో నిర్వహించగా.. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) విధానానికి మారుతోందని.. టీసీఎస్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. చైనాతోపాటు మరో 50 దేశాల్లో టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆయా దేశాల్లోని ఉద్యోగులను స్థానిక ప్రాజెక్టులతోపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులకూ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఏజీఎంలో వాటాదారులు వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించగా.. ప్రస్తుతం ఈ విధానానికి మళ్లడం అన్నది ఖర్చుతో కూడుకున్నదంటూ.. కరోనా తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంటి నుంచే పని చేయవచ్చని చంద్రశేఖరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీసీఎస్ కేంద్రాల్లో 25 శాతం మందే పనిచేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఊహించి రాసినవిగా పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సరికొత్త ధోరణిగా పరిగణిస్తూ దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. అనుసంధానం, కంప్యూటర్ పరికరాలే కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. -
కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..
కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. కరోనా వైరస్ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు. కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్ తెలిపింది. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు. రూ.కోటి చొప్పున బీజేపీ ఎంపీల ఎంపీల్యాడ్స్ కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 386 మంది సభ్యులున్నారు. ఒక్కో ఎంపీకి ఎంపీల్యాడ్స్ కింద ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసే వీలుంది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఎంపీలంతా తమ ఎంపీల్యాడ్స్ నుంచి రూ.కోటి విరాళంగా అందించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. సన్‌ఫార్మా రూ.25 కోట్లు: కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మం దులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తాం: హ్యుండయ్ కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్ మోటార్స్ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది. ఒకరోజు వేతనం ఇవ్వండి: జీఎస్ఐ కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్ఐ డీజీ శ్రీధర్ తెలిపారు. కావాలంటే వెంటిలేటర్లు సరఫరా చేస్తాం: ట్రంప్ కరోనాపై పోరులో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతోపాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన ట్రంప్.. వెంటిలేటర్లు పంపించాలన్న ఒకే ఒక కోరికను బోరిస్ ఈ సందర్భంగా వెల్లడించారని వ్యాఖ్యానించారు. రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయన్నారు. -
టెలికం మంత్రితో టాటా సన్స్ చంద్రశేఖరన్ భేటీ
న్యూఢిల్లీ: టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టెలికం శాఖ మదింపు ప్రకారం గతంలో టాటా గ్రూపు అందించిన టెలికం సేవలపై బకాయిలు రూ.14,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, టాటా గ్రూపు రూ.2,197 కోట్ల వరకు చెల్లింపులు చేసింది. వాస్తవ బకాయిలు ఈ మేరకేనని స్పష్టం చేసింది. దీంతో టాటా మదింపును ప్రశ్నిస్తూ.. పూర్తి బకాయిల చెల్లింపును కోరుతూ టెలికం శాఖ మరో నోటీసును జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికం మంత్రితో చంద్రశేఖరన్ భేటీ కావడం ప్రాధాన్యం నెలకొంది. 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రశేఖరన్ స్పందించకుండానే వెళ్లిపోయారు. చదవండి : టెలికంలో అసాధారణ సంక్షోభం వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్ ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
ఆ ట్యాగ్స్ తీసేయండయ్యా
సాక్షి, ముంబై: మహిళల సాధికారతకు సంబంధించి టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. భారతదేశ శ్రామిక శక్తిలోకి ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవటానికి కొన్ని టాగ్స్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. పలానా ఉద్యోగాలు పురుషులకు మాత్రమే.. మహిళలు ఇది చేయలేరు, అది చేయలేరు, ఇలాంటివే చేయాలి లాంటి టాగ్స్ చాలా వున్నాయి. మహిళల అభివృద్ధికి అవరోధంగా ఉన్న ఇలాంటివాటిని ఇకనైనా తొలగించుకోవాలి. ఎక్కువమంది మహిళలను ఆయా రంగాల్లో ప్రోత్సాహించాల్సిన అవసరం వుందని మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో దేశంలోనే అతి పెద్ద సంస్థగా రికార్డు సొంతం చేసుకున్న టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. తద్వారా మహిళలు చిన్న, మధ్య తరహా కంపెనీలను (ఎస్ఎంఈ) సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళల ఉద్యోగాలు, ప్రోత్సాహానికి సంబంధించి విధాన మార్పులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు వృద్ధులు, పిల్లల సంరక్షణ పరిశ్రమగా చేసుకుంటే అక్కడ భారీ అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ అన్నారు. అలాగే సాంప్రదాయేతర రంగాల్లో మహిళల రోల్-మోడళ్లను తాము సృష్టించామని పేర్కొన్న ఆయన విద్యావంతులైన మహిళలకు మాత్రమే అంటూ వారిని ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించారు. చీఫ్ ఎకనామిస్ట్, పాలసీ అడ్వకసీ టాటా సన్స్ హెడ్ రూప పురుషోత్తమన్‌తో కలిసి చంద్రశేఖరన్ రచించిన "బ్రిడ్జిటల్ నేషన్" పుస్తకం ఆవిష్కరణ సందర్బంగా చంద్రశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సైరస్ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్
న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్సీఎల్ఏటీలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) గురువారం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్సీఎల్ఏటీ.. టాటా సన్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్.. సుప్రీం కోర్టును, అటు ఆర్వోసీ.. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
మిస్త్రీకి టాటా చెల్లదు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్ అప్పీలు చేసుకోవచ్చని ఎన్ఎస్ఎల్ఏటీ తెలిపింది. ‘2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధం. కాబట్టి మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చు. అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుంది’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ తుది ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, డైరెక్టర్ల బోర్డు లేదా వార్షిక సర్వసభ్య సమావేశంలో మెజారిటీ అనుమతులు అవసరమయ్యే ఏ నిర్ణయాలను ముందస్తుగా తీసుకోకూడదంటూ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను, టాటా ట్రస్ట్స్ నామినీని ఆదేశించింది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఆర్టికల్ 75లోని నిబంధనలు ప్రయోగించరాదంటూ డైరెక్టర్ల బోర్డుకు, షేర్హోల్డర్లకు సూచించింది. అటు, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కిందకు మార్చాలన్న కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్వోసీ) నిర్ణయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని రికార్డుల్లో సత్వరం సరిచేయాలంటూ ఆర్వోసీని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఇక, మిస్త్రీకి వ్యతిరేకంగా 2018 జూలై 9న ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా తప్పుబట్టింది. ఇవి మిస్త్రీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టరుగా కొనసాగించడం మినహా... ఆయన్ను చైర్మన్‌గా పునర్నియమించాలన్న ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని టాటా సన్స్ న్యాయవాది ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించారు. చట్టపరంగా చర్యలు: టాటా సన్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు చూస్తుంటే అడిగిన దానికి మించే మిస్త్రీకి ఊరటనిచ్చినట్లు కనిపిస్తోందని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. టాటా సన్స్, ఇతర లిస్టెడ్ టాటా కంపెనీల షేర్హోల్డర్లు.. చట్టబద్ధంగా షేర్‌హోల్డర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్సీఎల్ఏటీ ఏ విధంగా తిరస్కరిస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది. ‘మా కేసు బలంగా ఉందని గట్టిగా విశ్వసిస్తున్నాం. తాజా ఆదేశాలకు సంబంధించి చట్టపరంగా ముందుకు వెడతాం‘ అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తాజా పరిణామాలతో చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. లీగల్ అంశాలను సంస్థ చూసుకుంటుందని.. సిబ్బంది తమ కార్యకలాపాలపై దృష్టిపెట్టి, వాటాదారుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు. గ్రూప్ కంపెనీల షేర్లు పతనం.. అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో.. టాటా గ్రూప్ కంపెనీల షేర్లు 4 శాతం దాకా క్షీణించాయి. బీఎస్ఈలో టాటా గ్లోబల్ బెవరేజెస్ 4 శాతం, టాటా కాఫీ 3.88 శాతం, టాటా మోటార్స్ 3.05 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ షేరు అత్యధికంగా క్షీణించింది. అటు ఇండియన్ హోటల్స్ కంపెనీ 2.48 శాతం, టాటా కెమికల్స్ 1.65 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 1.22 శాతం, టాటా పవర్ కంపెనీ 0.98 శాతం తగ్గాయి. మూడేళ్ల పోరాటం.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు కాలరాస్తున్నారని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు ఎన్సీఎల్టీని (ముంబై) ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: అప్పటి టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ప్రకటించింది. ► 2017 ఫిబ్రవరి 6: టాటా గ్రూప్ సంస్థల హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టరుగా మిస్త్రీ తొలగింపు. ► 2017 మార్చి 6: మిస్త్రీ కంపెనీల పిటిషన్‌ను ఎన్సీఎల్టీ కొట్టేసింది. మైనారిటీ షేర్‌హోల్డర్ల తరఫున పిటిషన్ వేయాలంటే 10 శాతం వాటాలైనా ఉండాలన్న నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలు ఉన్నప్పటికీ.. ప్రిఫరెన్షియల్ షేర్లను పక్కన పెడితే కేవలం 3% వాటా మాత్రమే ఉండటం ఇందుకు కారణం. ఆ తర్వాత 10% వాటాల నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ మిస్త్రీ సంస్థలు చేసిన విజ్ఞప్తిని కూడా ఏప్రిల్ 17న ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. ► 2017 ఏప్రిల్ 27: ఎన్సీఎల్టీ ఆదేశాలపై మిస్త్రీ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2017 సెప్టెంబర్ 21: 10 శాతం వాటాల నిబంధన మినహాయింపు విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎన్సీఎల్ఏటీ.. మిగతా ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఎన్సీఎల్టీని సూచించింది. ► 2017 అక్టోబర్ 5: కేసును ముంబై నుంచి ఢిల్లీకి మార్చాలంటూ ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్‌ను మిస్త్రీ సంస్థలు కోరాయి. అయితే, దీన్ని తిరస్కరించిన ప్రిన్సిపల్ బెంచ్.. రెండు సంస్థలకు కలిపి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ► 2018 జూలై 9: టాటా గ్రూప్, రతన్ టాటాపై మిస్త్రీ ఆరోపణల్లో పసలేదని పిటిషన్లను కొట్టేసిన ఎన్సీఎల్టీ (ముంబై) ► 2018 ఆగస్టు 3: ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ మిస్త్రీ సంస్థలు అపీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆగస్టు 29న మిస్త్రీ వ్యక్తిగత పిటిషన్‌ను కూడా స్వీకరించిన ఎన్సీఎల్ఏటీ.. మిగతా పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని నిర్ణయించింది. ► 2019 మే 23: వాదనలు ముగిసిన అనంతరం ఎన్సీఎల్ఏటీ తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా మళ్లీ నియమించాలంటూ ఆదేశాలిచ్చింది. అప్పీలు చేసుకునేందుకు టాటా సన్స్‌కు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ఇది గుడ్ గవర్నెన్స్ విజయం ట్రిబ్యునల్ తీర్పుతో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు, గుడ్ గవర్నెన్స్ సూత్రాలకు విజయం లభించింది. ఈ విషయంలో మా వాదనలే నెగ్గాయి. ఎలాంటి కారణం లేకుండా, ముందస్తుగా చెప్పకుండా నన్ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఆ తర్వాత డైరెక్టర్‌గాను తొలగించారు. వీటిని వ్యతిరేకిస్తూ మేం చేసిన వాదనలు సరైనవే అనడానికి తాజా తీర్పు నిదర్శనం. టాటా గ్రూప్ వృద్ధి చెందాలంటే కంపెనీలు, వాటి బోర్డులు, టాటా సన్స్ యాజమాన్యం.. బోర్డు, టాటా సన్స్ షేర్హోల్డర్లు .. అందరూ నిర్దిష్ట గవర్నెన్స్ నిబంధనలకు అనుగుణంగా కలిసి పనిచేయడం, అన్ని వర్గాల ప్రయోజనాలూ పరిరక్షించడం అవసరం. – సైరస్ మిస్త్రీ -
వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో కరోడ్‌పతిల సంఖ్య ఇపుడు హాట్ టాపిగా నిలిచింది. అయితే టీసీఎస్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తోందన్న ఆరోపణలను టాటా గ్రూపులో మరో సంస్థ టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. టీసీఎస్ వృద్ధికి, అద్భుతమైన ఫలితాలను సాధించిన ఘనత టీసీఎస్ మేనేజ్మెంట్కు దక్కు తుందన్నారు. ఇందుకు వారికి తగిన ప్రతిఫలం అందివ్వాలని సంస్థ భావించిందని చెప్పారు. ఉద్యోగులను నిలుపుకోవడంపై ప్రధానంగా తాము ఎక్కువ దృష్టి పెట్టామని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. అలాగే నూతన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి-ఆధారిత కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే డిజిటల్ ఇండియా చొరవను పునరుద్ఘాటించే అవకాశం ఉందన్నారు. కరెన్సీలో దీర్ఘ కాల స్థిరత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. టీసీఎస్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు టీసీఎస్‌లోనే కరీర్ ప్రారంభించినవారు కావడం విశేషం. ఈ వివరాలను ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌లో కోటిపైగా వార్షిక వేతనం అందుకున్నవారి సంఖ్య 91. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సీఈవో రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టిసిఎస్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ డెబాషిస్ ఘోష్ రూ .4.7 కోట్లు సంపాదించారు; బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం రూ .14.1 కోట్లు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కె. కృతివాసన్ సంవత్సరానికి రూ .4.3 కోట్లకు పైగా వేతనాన్ని అందుకున్నారు. రూ.1 కోటికిపైగా జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ బరీంద్ర సన్యాల్ (72)గా ఉండగా, అతి తక్కువ వయస్కులు 40 ఏళ్ల వయసు ఉద్యోగి. కాగా ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది. స్టాక్‌మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ ఇన్ఫోసిస్ మాదిరిగా టిసిఎస్ ఉద్యోగులకు స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు లభించవు. -
టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం విడుదల
ముంబై : టాటా మోటార్స్ నుంచి టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి విడుదలైంది. ఈ వాహనాన్ని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్‌టాటాలు ఆవిష్కరించారు. గుజరాత్‌లోని సనంద్ ఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాన్ని టాటా మోటార్స్ విడుదల చేసింది. 2017 సెప్టెంబర్‌లో టాటా మోటార్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి 10వేల ఎలక్ట్రిక్ కార్ల టెండర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా 250 టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను టాటా మోటార్స్ డెలివరీ చేస్తోంది. టాటా మోటార్స్‌కు ఇది ఎంతో కీలకమైన మైలురాయి అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. టీమ్ మొత్తానికి ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌లో ఈ-మొబిలిటీని అభివృద్ధి చేయడానికి తామంతా కలిసి పనిచేస్తామన్నారు. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌కు తమ కస్టమర్లు సానుకూలంగా స్పందిస్తారని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు టాటా మోటార్స్ అంకిత భావంతో ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలను చాలా వేగవంతంగా అందించడానికి సహకార పద్ధతిలో పనిచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ-మొబిలిటీని అభివృద్ధి చేయడానికి టిగోర్ ఈవీతో తమ ప్రయాణం ప్రారంభించామని టాటా మోటార్స్ సీఈవో, ఎండీ గుంటెర్ బుట్చేక్ తెలిపారు. భారత కస్టమర్లకు ఫుల్ రేంజ్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఆఫర్ చేస్తామన్నారు. -
టాటా గ్లోబల్ బెవరేజస్ చైర్మన్‌గా ఆయనే!
న్యూఢిల్లీ : టాటా సన్స్ అధినేత ఎన్ చంద్రశేఖరన్‌నే టాటా గ్లోబల్ బెవరేజస్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈయన నియామకం అమల్లోకి రానున్నట్టు బోర్డు పేర్కొంది. నేడు బోర్డు మీటింగ్ నిర్వహించిన సమావేశంలో టాటా గ్లోబల్ బెవరేజస్ లిమిటెడ్ చంద్రశేఖరన్‌ను అదనపు డైరెక్టర్‌గా, చైర్మన్‌గా నియమిస్తున్నట్టు నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్‌గా ఉన్న హరీష్ భట్ రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంద్రశేఖరన్ ఈ పదవిలోకి వచ్చారని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాక నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సిరాజ్ అజ్మాత్ చౌదరిని బోర్డు నియమించింది. గతేడాది టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని గ్రూప్ కంపెనీలో ఒకటైన టాటా గ్లోబల్ బెవరేజస్ కూడా తన కంపెనీ చైర్మన్‌గా తొలగించింది. దీంతో సైరస్ మిస్త్రీ స్థానంలో భట్ ఆ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేస్తుండటంతో టాటా సన్స్ అధినేత చంద్రశేఖరన్‌నే ఇక ఈ కంపెనీకీ చైర్మన్‌గా సారథ్యం వహించనున్నారు. -
ట్రంప్ ముప్పు ఆ టెక్ దిగ్గజానికి లేదట
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వ్యాపారాలకు విఘాతం కల్గిస్తున్నారంటూ విప్రో సంస్థ బహిరంగంగా ప్రకటన చేస్తే, దీనికి భిన్నంగా దేశీయ అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రకటన చేసింది. ట్రంప్ భయాందోళలను టీసీఎస్ కొట్టిపారేస్తోంది. ట్రంప్ భయంతో వీసాల విషయంలో దేశీయ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతిదారు ఎలాంటి మార్పులను చేపట్టలేదని, అమెరికా మార్కెట్ తో సహా అన్ని మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా వ్యాపారాలను కొనసాగిస్తుందని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ప్రతి మార్కెట్లో తాము రిక్రూట్ మెంట్ చేపడుతున్నామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. నేడు జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ట్రంప్ భయాందోళనలను తగ్గిస్తూ టీసీఎస్ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. టీసీఎస్ కార్యకలాపాలు సాగించే ప్రతి దేశంలోని స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని, ఆ దేశ మార్కెట్లలో టాప్ రిక్రూటర్ గా తమ కంపెనీనే ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రాకముందే అమెరికా వీసా దరఖాస్తులను టీసీఎస్ తగ్గించిందని తెలిసింది. టీసీఎస్ కొత్త సీఈవోగా రాజేష్ గోపినాథన్ పదవి బాధ్యతలు స్వీకరించాక, గతేడాది కంపెనీ గ్లోబల్ గా 79వేలమందిని నియమించుకుంది. వీరిలో 11,500 మంది విదేశీ మార్కెట్లలో నియమించుకుంది. -
టాటా సన్స్‌కి వెళ్లారు, కోట్లు పోయాయ్!
ముంబై : దేశంలోనే అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసు సీఈవో పదవి నుంచి ఏకంగా టాటా గ్రూప్‌లోనే అత్యంత కీలకమైన చైర్మన్ పదవి ఎన్ చంద్రశేఖరన్ ను వరించింది. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు ఉన్న 103 బిలియన్ డాలర్ల గ్రూప్ కు రథసారిథిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన వేతనం మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయింది. కనీసం సీఈవోగా ఉన్నప్పుడు ఇచ్చే వేతనాన్ని కూడా టాటా బోర్డు ఆఫర్ చేయడం లేదు. టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు రూ.14.4 కోట్ల వార్షిక వేతనం మాత్రమే ఇవ్వనున్నట్టు బోర్డు సభ్యులు నిర్ణయించారు. బేసిక్ వేతనం కింద రూ.4.8 కోట్లను అదనంగా 200 శాతం లేదా రూ.9.6 కోట్ల వేరియబుల్ కంపోనెంట్లను అందించనున్నట్టు బోర్డు ప్రకటించింది. అది కూడా కంపెనీ, ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వాటికి తోడు అదనంగా కంపెనీ నుంచి వచ్చే కమిషన్ కు ఆయన అర్హులని తెలిపింది. కానీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవోగా ఉన్నప్పుడు చంద్రశేఖరన్ దానికంటే ఎక్కువ వేతనాన్నే ఆర్జించేవారు. 2016 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.25.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. అదనంగా రూ.10 కోట్లను కంపెనీ బోనస్ ల కింద ఆయనకి ఇచ్చింది. టీసీఎస్ సీఈవో నుంచి టాటా సన్స్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టాకా ఆయనకు వేతనం పెరగాల్సింది పోయి తగ్గినట్టు తెలిసింది. టాటా సన్స్ కు అంతకముందు చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి కూడా 2015లో కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఆ సమయంలో టీసీఎస్ సీఈవోగా ఉన్న చంద్రశేఖరన్ రూ.21.28 కోట్లు ఆర్జించారట. గతేడాది అక్టోబర్ లో అర్థాంతరంగా మిస్త్రీకి ఉద్వాసన పలికి, ఆ స్థానంలో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ను కూర్చోపెట్టిన సంగతి తెలిసిందే. -
నూతన శకంలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్
ముంబై : టాటా గ్రూప్ ఓ నూతన శకంలోకి అడుగుపెట్టింది. బహుళ జాతీయ సంస్థగా పేరొందిన ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నిరోజులు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా నుంచి ఎన్ చంద్రశేఖరన్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. టాటా సన్స్‌కు చైర్మన్‌గా ఉంటూనే చంద్రశేఖరన్ గ్రూప్‌లో అత్యంత కీలకమైన టెక్ అగ్రగామి టీసీఎస్‌కు కూడా ఈయన చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 150 ఏళ్లు కలిగిన టాటా గ్రూప్‌కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. దేశంలో అతిపెద్ద సాప్ట్ వేర్ ఎగుమతిదారిగా టీసీఎస్ ను రూపొందించిన ఘనతతో చంద్రశేఖరన్ ఎక్కువగా పేరొందారు. టాటాసన్స్ చైర్మన్‌గా నేడు బాధ్యతలు చేపట్టిన ఎన్.చంద్రశేఖరన్ నిన్న టీసీఎస్ సీఈఓ హోదాలో ఆఖరి బోర్డు సమావేశం నిర్వహించారు. ఆ బోర్డు సమావేశంలో ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించారు. రూ.16వేల కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించారు. టాటా సన్స్ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రశేఖర్, వివిధ కంపెనీల సీఈవోలతో అధికారికంగా భేటీ అయ్యారు. -
టాటా మోటార్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇటీవలే ఎంపికైన ఎన్ చంద్రశేఖరన్ తాజాగా టాటా మోటార్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. అదనపు డైరెక్టర్‌గా, బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో అంతంతమాత్రం పనితీరుతో సతమతమవుతున్న టాటా మోటార్స్‌ను చీఫ్ హోదాలో చంద్రశేఖరన్ మళ్లీ గాడిలో పెట్టాల్సి ఉంది. అలాగే చిన్న కారు నానోపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రీమియం ఎస్యూవీ బ్రాండ్ హెక్సాను బుధవారం ఆవిష్కరించనుంది. -
టాటా మోటార్స్‌కు కొత్త చైర్మన్
న్యూఢిల్లీ : టాటా సన్స్ చైర్మన్‌గా ఎంపికైన ఎన్ చంద్రశేఖరన్, గ్రూప్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌కు చైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నటరాజన్ చంద్రశేకరన్ను అడిషినల్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా ఎంపికచేసినట్టు కంపెనీ ప్రకటించింది. వెంటనే ఆయన కంపెనీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించిన వారంలోనే టాటా మోటార్స్ కూడా చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా ఎంపికచేసేసింది. రెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్‌గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టాటా-మిస్త్రీ బోర్డు వార్ అనంతరం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రూప్ కంపెనీలు కూడా మిస్త్రీపై వేటువేశాయి. 150 ఏళ్ల టాటా గ్రూప్‌కు మొదటి నాన్-పార్సీ చైర్మన్ చంద్రశేఖరనే. ఫిబ్రవరి 21న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా మోటార్స్ చైర్మన్‌గా ఎంపికైన ఈయన రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్టు నానో కారుపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. భావోద్వేగ కారణాలతో నష్టాల్లో ఉన్న నానో ప్రాజెక్టును టాటా మోటార్స్ మూసివేయడం లేదని మిస్త్రీ ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు
ముంబై: టాటా మిస్త్రీ బోర్డ్ వార్ లో టాటా గ్రూప్ లో కీలక నియామకాలు గురువారం చోటు చేసుకున్నాయి. టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా ఎంపికయ్యారు. అయితే ఎన్ జీ సుబ్రమణియం చంద్రశేఖరన్ కు సోదరుడు. టీసీఎస్ విజన్ రోడ్ మ్యాప్ లో ఎలాంటి మార్పులు ఉండవని టీసీఎస్ కొత్త బాస్ గోపీనాథన్ ప్రకటించారు. తన ఎంపికపై సంతోషాన్ని ప్రకటించిన టాటా సన్స్ కొత్త ఛైర్మన్ చంద్రశేఖరన్ టీసీఎస్ కు గోపీనాథన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మంచి వ్యాపార దక్షత ఉందని కొనియాడారు. టీసీఎస్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో టీసీఎస్ మరింత వ్యాపారంలో్ మరింత ఎత్తుకు ఎదగగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు టాటాసన్స్ కొత్త చైర్మన్ గా చంద్రశేఖరన్ ఎంపిక పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్ తదితర ప్రముఖులు చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించారు. -
టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?
ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడంతో ఖాళీ కానున్న పదవికి తగిన సమర్థులు ఎవరు? అన్న ఆసక్తికరమైన ప్రశ్నపై ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్శరీన్, నోయెల్ టాటా, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్, టాటా గ్రూపునకే చెందిన ఇషాంత్ హుస్సేన్, బి.ముత్తురామన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటాసన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించనున్నప్పటికీ... కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి కావడం ఆలస్యం ఆయన నూతన వారసుడికి బాధ్యతలు అప్పగించి తన పదవి నుంచి తప్పుకోనున్నారు. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవీ... టాటా గ్రూపు నూతన చైర్మన్ ఎంపిక ప్రక్రియ వచ్చే రెండు వారాల్లో ప్రారంభం అవుతుందని... మూడు నుంచి నాలుగు నెలలు ఇందుకు సమయం పడుతుందని ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇద్దరి విషయంలో రతన్ టాటా చాలా సానుకూలతతో ఉన్నట్టు తెలుస్తోంది. వారు నోయెల్ టాటా, ఇంద్రానూయి. నోయెల్ టాటా తమ కుటుంబంలో వ్యక్తి కాగా, ఇంద్రానూయి పనితీరు రతన్ టాటాను ఆకట్టుకుంది. ముఖ్యంగా నోయెల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని, బయటి వ్యక్తి కంటే తమ కుటుంబంలో భాగమైన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో విస్తరించిన టాటాగ్రూపును నడిపించేందుకు లోకల్ వ్యక్తి కాకుండా అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తి అయితే బాగుంటుందన్నది టాటా గ్రూపు ఆలోచనగా తెలుస్తోంది. అలా చూసుకుంటే ఇంద్రానూయి ఈ విషయంలో ముందుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యం నుంచి అర్ధాంతరంగా.. సైరస్ మిస్త్రీ 1968, జూలై 4న జన్మించారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్-టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టా(గ్రాడ్యుయేషన్) పొందారు. తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1991లో తండ్రి స్థాపించిన షాపూర్జీ పలోంజీ గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. కాగా, రతన్ స్థానంలో వారసుడిని ఎంపిక చేయటానికి నియమించిన కమిటీలో డెరైక్టర్ హోదాలో మిస్త్రీ కూడా అప్పుడు సభ్యుడే. అనూహ్యంగా కమిటీ మిస్త్రీనే నియమించింది. ఇక తొలగింపు నిర్ణయం తీసుకున్న బోర్డు సమావేశంలోనూ మిస్త్రీ పాల్గొన్నారు. ఆరుగురు సభ్యులు వేటు వేసేందుకు అనుకూలంగా ఓటేయగా... ఒక్క మిస్త్రీ మాత్రమే ప్రతిఘటించినట్లు సమాచారం. ఇది కూడా ఆయనకు ఒక విధంగా అనూహ్య సంఘటనే. 150 ఏళ్ల టాటా సామ్రాజ్య చరిత్రలో(1868లో ఆవిర్భావం) 1932లో నౌరోజీ సక్లత్వాలా తర్వాత టాటా గ్రూపునకు సారథ్యం వహించిన టాటాల కుటుంబేతర వ్యక్తి మిస్త్రీయే. అంతేకాదు! ఇప్పటివరకూ టాటా సన్స్‌కు ఆరుగురు చైర్మన్లుగా వ్యవహరించగా.. అతితక్కువ కాలం పదవిలో కొనసాగింది కూడా మిస్త్రీయే. మొత్తం తొమ్మిది మంది టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులో, అదేవిధంగా ఇతర గ్రూప్ కంపెనీల్లో కూడా డెరైక్టర్‌గా మిస్త్రీ కొనసాగనున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో 7 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 100కు పైగా విభిన్న వ్యాపారాలను నిర్వహిస్తోంది. పదవీ విరమణ తర్వాత రతన్ టాటా గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.