టాటా గ్లోబల్ బెవరేజస్ చైర్మన్‌గా ఆయనే!
Published Mon, Jul 3 2017 7:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
న్యూఢిల్లీ : టాటా సన్స్ అధినేత ఎన్ చంద్రశేఖరన్‌నే టాటా గ్లోబల్ బెవరేజస్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈయన నియామకం అమల్లోకి రానున్నట్టు బోర్డు పేర్కొంది. నేడు బోర్డు మీటింగ్ నిర్వహించిన సమావేశంలో టాటా గ్లోబల్ బెవరేజస్ లిమిటెడ్ చంద్రశేఖరన్‌ను అదనపు డైరెక్టర్‌గా, చైర్మన్‌గా నియమిస్తున్నట్టు నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్‌గా ఉన్న హరీష్ భట్ రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంద్రశేఖరన్ ఈ పదవిలోకి వచ్చారని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది.
అంతేకాక నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సిరాజ్ అజ్మాత్ చౌదరిని బోర్డు నియమించింది. గతేడాది టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని గ్రూప్ కంపెనీలో ఒకటైన టాటా గ్లోబల్ బెవరేజస్ కూడా తన కంపెనీ చైర్మన్‌గా తొలగించింది. దీంతో సైరస్ మిస్త్రీ స్థానంలో భట్ ఆ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేస్తుండటంతో టాటా సన్స్ అధినేత చంద్రశేఖరన్‌నే ఇక ఈ కంపెనీకీ చైర్మన్‌గా సారథ్యం వహించనున్నారు.
Advertisement