దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.
చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్‌లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు.
చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment