Pay
-
ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే
ఖాట్మాండు: అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలుగంటుంటారు. అలాంటి వారికి నేపాల్ ప్రభుత్వం ఒక చేదువార్త వినిపించింది. ఇకపై ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అత్యంత ఖరీదైనదిగా మారబోతోంది.ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి విదేశీయులు ఇకపై దాదాపు 21 లక్షల రూపాయలు, అంటే ఐదు లక్షల నేపాలీ రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు ఇందుకోసం రూ. 15,17,780 రుసుము చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు దానిని రూ. 20,69,676కి పెంచారు.నేపాల్ ప్రభుత్వం పర్వతారోహణ మాన్యువల్‌ను ఆరోసారి సవరించింది. ఇటీవల జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశంలో పర్వతారోహణ నియమాలను సవరిస్తూ, అధిరోహణ రుసుమును పెంచింది. ఈ కొత్త నియమం 2025, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్మి మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల కారణంగా చెత్త పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త సవరణల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులకు బీమా, ఇతర నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పర్వతారోహణ గైడ్లు, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, సామాను క్యారియర్లకు రోజువారీ భత్యం, బీమా రేట్లు పెంచారు. నూతన రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఎవరెస్ట్ ఎక్కే అధిరోహకులు తమ పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వశాఖకు సమర్పించాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది? -
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
దేశంలో అత్యధిక వేతనం.. ఈయనదే..
దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్‌లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు.చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు. -
SmilePay: నగదు చెల్లింపునకు ఓ ‘నవ్వు’ చాలు!
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సరికొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది. ‘స్మైల్ పే’ అనే ఫేషియల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు కేవలం కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవతో డబ్బు లావాదేవీల కోసం మీకు నగదు, కార్డ్ లేదా మొబైల్ అవసరం ఉండదు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖలలో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది.పైలట్ ప్రాజెక్టుప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ చెల్లింపు వ్యవస్థ 'భీమ్ ఆధార్ పే'పై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్మించిన అప్‌గ్రేడెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇది ఉపయోగించుకుంటుంది. యూజర్లు తమ ఫేస్‌ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కార్డు లేదా మొబైల్ లేకుండా కూడా వ్యాపారులకు చెల్లింపులు చేయగలరు. మొత్తం లావాదేవీ ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది.స్మైల్‌పే ఫీచర్లుస్మైల్పే ద్వారా నగదు, కార్డ్ లేదా ఫోన్‌ని తీసుకెళ్లకుండానే మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. సురక్షితమైన ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలతో భద్రత చింత ఉండదు. స్మైల్‌పే ఫీచర్ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఆ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత విస్తరించాలని ఫెడరల్ బ్యాంక్ యోచిస్తోంది.ఎలా పనిచేస్తుందంటే..స్మైల్పేను వినియోగించాంటే మొబైల్లో ఫెడ్ మర్చెంట్ (FED MERCHANT) అనే యాప్ ఉండాలి.ఫెడరల్ బ్యాంక్‌తో అనుసంధానమైన దుకాణాల్లో షాపింగ్ చేసి బిల్లు చెల్లింపు సమయంలో స్మైల్ పే ఎంచుకోవాలి. తర్వాత దుకాణదారు.. కస్టమర్ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి యాప్ ద్వారా చెల్లింపును ప్రారంభిస్తారు. దుకాణదారు మొబైల్ కెమెరా కస్టమర్ ఫేస్‌ను స్కాన్ చేస్తుంది. ఆధార్ సిస్టమ్ ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ డేటాతో సరిపోల్చుకుని చెల్లింపు పూర్తవుతుంది. కస్టమర్ ఖాతా నుండి డబ్బు దుకాణదారుడి ఖాతాలో జమవుతుంది. -
‘హోర్డింగ్ ప్రమాదాలకు కంపెనీలదే బాధ్యత’
ఇటీవలికాలంలో దేశంలోని పలు నగరాల్లో హోర్డింగ్‌లు కూలిపోయి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందుకు, ప్రభుత్వం త్వరలో అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ-2024ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం రోడ్లు లేదా ఇంటి పైకప్పులపై అమర్చిన హోర్డింగ్‌లు పడిపోవడం వల్ల ఎవరైనా చనిపోతే లేదా వికలాంగులైతే ఈ ప్రకటనలు ఏర్పాటుచేసే కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదేవిధంగా ఇటువంటి ప్రమాదాల్లో ఆస్తులకు నష్టం జరిగినప్పుడు కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు పరిహారం చెల్లించాలి. ఈ పరిహారం ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ అడ్వర్టైజింగ్ పాలసీలో ప్రమాదాల్లో పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈ పాలసీని అమలుచేయనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ఈ ప్రతిపాదిత విధానానికి ఉన్నత స్థాయిలో అంగీకారం లభించింది. అవసరమైన కొన్ని సవరణలు చేసిన తర్వాత కేబినెట్లోనూ ఆమోదం పొందింది.ప్రతిపాదిత విధానం ప్రకారం ఇళ్లు లేదా పైకప్పులపై హోర్డింగ్‌లు పెట్టే ముందు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పురపాలక సంస్థలు నగరాల్లో ఏర్పాటు చేసిన అన్ని హోర్డింగ్‌లను జియో ట్యాగింగ్ చేసి 90 రోజుల్లోగా పౌర సంస్థల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలాగే చట్టవిరుద్ధమైన ప్రకటనలను ఏర్పాటు చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. -
భారత్‌పే, ఫోన్‌పే మధ్య వివాదం పరిష్కారం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజాలు భారత్‌పే గ్రూప్, ఫోన్‌పే గ్రూప్‌ల మధ్య ’పే’ పదం ట్రేడ్‌మార్క్‌పై నెలకొన్న వివాదం ఓ కొలిక్కి వచి్చంది. సుమారు అయిదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరును సామరస్యంగా సెటిల్ చేసుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో పరస్పరం ఒకదానిపై మరొకటి దాఖలు చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. దీనితో తమ తమ ట్రేడ్‌మార్క్‌లను రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతుందని వివరించాయి. ఇది రెండు కంపెనీలకూ ప్రయోజనకరమని ఫోన్‌పే ఫౌండర్ సమీర్ నిగమ్, భారత్‌పే చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శాంక్షన్ పోస్టుల్లో నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, పారా మెడికల్ సిబ్బందికి వంద శాతం గ్రాస్ వేతనం (పే+హెచ్ఆర్ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ -
టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్! ఏకంగా 80 శాతం..
HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు. ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్ బోనస్ 1.43 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లు) కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం. కారణం ఇదే.. హెచ్‌సీఎల్ కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్‌టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్టీఐ రూపంలో 12.50 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..! అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్‌టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్‌సీఎల్ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్గోయింగ్ సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది. -
ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా
మనం ఇప్పుడూ ఏ వ్యవహారమైన ఫోన్ల ద్వారా లేదా మెసేజ్‌ల ద్వారా చక్కబెట్టేస్తున్నాం. దీంతో పని సులువుగా అవ్వడమే గాక టైం కూడా కలిసిస్తోంది. సాధారణంగా మెసేజ్‌లలో మన భావాలను వ్యక్తపరిచేలా.. ఎమోజీలు ఉపయోగించడం అనేది పరిపాటే. అలానే ఓ రైతు కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆ ఎమోజీని ఉపయోగించాడు. దీంతో ఆ రైతుకి కోర్టు ఏకంగా రూ. 50 లక్షల జరిమాన విధించింది. అసలేం జరిగిందంటే..కెనడాలోని క్రిస్ అచ్టర్ అనే రైతు ఓ కొనుగోలుదారుతో ఫోన్లో.. మెసేజ్‌లతో సంప్రదింపులు చేశాడు. అతను సుమారు 86 టన్నుల అవిసె గింజలు కొనగోలు చేస్తానని, కేజి రూ 1048/- చొప్పున చేసి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. అందుకు సదరు రైతు అంగీకరించడమే గాక నవంబర్ కల్లా డెలివరి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారయ్యినట్లే కదా అని అడగగా.. ధృవీకరిస్తున్నట్లుగా రైతు ఈ థంబ్స్ అప్ ఎమోజీని పంపాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు ఒప్పందం ఖరారయ్యిందని భావించాడు. తీరా చూస్తే..అనుకున్న సమయానికి రైతు అవిసె గింజలు పంపిణీ చేయలేదు. దీంతో కొనగోలుదారుడు రైతుని ప్రశ్నించగా..తాను కాంట్రాక్ట్ తీసుకుంటున్నా అని ధృవీకరించానేగాని డెలివరీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని వాదించాడు. దీంతో కోర్టుని ఆశ్రయించారు ఇద్దరూ..కొనగోలుదారుడు ఒప్పందాన్ని నెరవేర్చలేదని మెసేజ్‌ల స్క్రీన్ షాట్ ఆదారాలను కోర్టుకి సమర్పించాడు. కాంట్రాక్ట్‌ను అందుకుంటున్నట్లుగా ఆ గుర్తుని పంపిచానని చెప్పాడు. ఐతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు నిరూపించేలా ఏ ఆధారాన్ని సమర్పించలేకపోయాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమోదాన్ని సూచించడానికి 'థంబ్స్ అప్ ఎమోజి'ని సాధారణంగా ఉపయోగిస్తారని పేర్కొంది. అలాగే ''డిక్షనరీ.కమ్" అందించిన ఎమోజీ నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తూ..డిజిటల్ కమ్యూనికేషన్లో ఒప్పందం ఆమోదం లేదా ప్రోత్సాహాన్ని వ్యక్తికరించడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. దేన్నైనా ఒప్పందం చేసుకున్నారు అని నిర్థారించడానికి సంతకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇది సర్వసాధారణంగా జరిగే సాంప్రదాయపద్ధతి. అదే ఎమోజీలు ఉపయోగించడం అనేది ఆధునిక పద్ధతి అని కోర్టు వెల్లడించింది. ఇక్కడ థంబ్స్ అప్ ఎమోజీ సాంప్రదాయేతరమైనది అయినప్పటికీ ఆ వ్యక్తి అంగీకరించాడు అనడానికి అతని మొబైల్ నెంబర్ ద్వారా చేసిన మెసేజ్‌లే ఆధారమని స్పష్టం చేసింది. అందువల తమ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే గాక అంగీకరించలేదని వాదించినందుకు గానూ రైతుకి ఏకంగా రూ. 50,88,893/-లు జరిమానా విధించింది. (చదవండి: యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్నికూడా కలగజేస్తుందా!) -
ధోని సంవత్సరానికి కట్టే టాక్స్ ఎంతంటే ..?
-
మస్క్ క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూటిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూటిక్‌ను నిలుపుకోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.700) చెల్లించాల్సి ఉంటుందని ట్విటర్ ఏకైక డైరెక్టర్ మస్క్ మంగళవారం ప్రకటించారు. దేశంలోని కొనుగోలు శక్తి ప్రకారం ధరలను సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు బ్లూటిక్ యూజర్లు అదనపు ప్రయోజనాలు పొందుతారని ముఖ్యంగా స్పామ్, స్కామ్‌ల నుంచి తప్పించుకోవడానికి అవసరమైన రిప్లైలు పొందడంలో ప్రాధాన్యత, ప్రస్తావనలు, సెర్చ్‌లో ప్రాధాన్యత లభిస్తుందని మస్క్ ప్రకటించారు. అంతేకాదు పెద్ద వీడియోను, ఆడియోను కూడా పోస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు తమతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణ కర్తలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇలా వచ్చే ఆదాయం కంటెంట్ క్రియేటర్ల చెల్లింపులకు తోడ్పడు తుందని కూడా మస్క్ ట్వీట్ చేశారు కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తక్షణమే మస్క్ అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్ , పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పునరుద్ధరిస్తున్నానని చెప్పిన మస్క్, నెలకు 20 డాలర్ల ఫీజును వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి ప్రస్తుతం ట్విటర్ ఏకైక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా బ్లూటిక్ ఫీజును నెలకు 8 డాలర్లుగా నిర్ణయించారు. అయితే ఈ బ్లూటిక్ బాదుడుపై చాలామంది యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. You will also get: - Priority in replies, mentions & search, which is essential to defeat spam/scam - Ability to post long video & audio - Half as many ads — Elon Musk (@elonmusk) November 1, 2022 This will also give Twitter a revenue stream to reward content creators — Elon Musk (@elonmusk) November 1, 2022 -
రోడ్డున పడిన నిండు గర్భిణి... కనికరం చూపని అంబులెన్స్ డ్రైవర్: వీడియో వైరల్
లక్నో: నడిరోడ్డుపై నిండు చూలాల్ని వదిలి వెళ్లిపోయాడు ఒక అంబులైన్స్ డ్రైవర్. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఆ గర్భిణి కుటుంబం అంబులెన్స్ డ్రైవర్ అడిగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో అమానుషంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనను జర్నలిస్ట్ రాజేష్ సాహు వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేస్తూ.... ఉత్తరప్రదేశ్‌లోని అంబులెన్స్ కంపెనీలకు వారి డ్రైవర్ల వైఖరి గురించి తెలియదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టాడు. సదరు మహిళ హమీర్‌పూర్‌లోని పండరి గ్రామానికి చెందిన మహిళ అని, ఆమె కుటుంబాన్ని రూ 1000 ఇవ్వాల్సిందిగా అంబులైన్స్ డ్రైవర్ డిమాండ్ చేశాడని వివరించాడు. బాధిత మహిళ కుటుంబం ఇవ్వలేక పోవడంతోనే గర్భిణి రోడ్డున పడిందని ట్విట్టర్లో తెలిపాడు. దీంతో నెటిజన్లు సదరు అంబులెన్స్ డ్రైవర్ని శిక్షించాలని ఒకరు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని సదరు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ మరొకరు కామెంట్లు చేస్తూ... ట్వీట్ చేశారు. यूपी में एंबुलेस कंपनी और उनके ड्राइवरों की बदमाशी कौन नहीं जानता। ये वीडियो हमीरपुर के पंधरी गांव का है। परिवार के पास देने के लिए 1000 नहीं थे इसलिए गर्भवती महिला को सड़क पर ही छोड़ दिया। इतने निर्मम लोगों हैं कि क्या ही कहा जाए। pic.twitter.com/So8OKthLsP — Rajesh Sahu (@askrajeshsahu) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
టీసీఎస్ క్లారిటీ: ఉద్యోగులకు పండగే
సాక్షి,ముంబై: దేశంలోని మేజర్ ఐటీ కంపెనీలన్నీ వేరియబుల్ పే విషయంలో ఉద్యోగులకు షాకివ్వగా దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. జూన్ క్వార్టర్లో సీనియర్ ఉద్యోగులకు వేరియబుల్ పే రోల్ అవుట్‌ను టీసీఎస్ ఒక నెల ఆలస్యం చేసిందన్న నివేదికల నేపథ్యంలో టీసీఎస్ ఈ క్లారిటీ ఇచ్చింది. పలు నివేదికల్లో తెలిపినట్టుగా 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి-జూన్ త్రైమాసికంలో సీ3ఏ, సీ3బీ, సీ 4, ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లింపు ఆలస్యం చేయడం లేదని తెలిపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వేరియబుల్ పే ఒకటి లేదా రెండు నెలల్లో చెల్లిస్తామని, ఈ ప్రక్రియలో ఎలాటి జాప్యం లేదని పేర్కొంది. 100 శాతం చెల్లిస్తామని టీసీఎస్ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. కాగా మార్జిన్లపై ఒత్తిడి, సప్లై చెయిన్ సమస్యలు, టెక్నాలజీలో కొత్త పెట్టుబడుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రోతో సహా ఇతర ఐటీ మేజర్లు కూడా తమ ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించడమో, లేదా ఆలస్యం చేసిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విప్రో సి-సూట్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు మేనేజర్ల వేరియబుల్ పేని కూడా నిలిపివేసినట్టు సమాచారం. ఫ్రెషర్స్ నుండి టీమ్ లీడర్లవరకు గ్రేడ్లలోని ఉద్యోగులు మొత్తం వేరియబుల్ పేలో 70 శాతం మాత్రమే పొందనున్నారని తెలుస్తోంది. -
ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే రెండో ర్యాంకులో నిలుస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా చేపట్టే చెల్లింపుల(వేరియబుల్ పే)లో తాజాగా కోత పెట్టింది. సగటు చెల్లింపులను 70 శాతానికి పరిమితం చేసేందుకు నిర్ణయించింది. మార్జిన్లు మందగించడం, ఉపాధి వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ వేరియబుల్ పేను కుదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాన్ని ఉద్యోగులకు సైతం తెలియజేసినట్లు వెల్లడించాయి. వేరియబుల్ పే విషయంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో సైతం ఇటీవల వెనకడుగు వేసిన విషయం విదితమే. ప్రధానంగా టెక్నాలజీపై పెరిగిన పెట్టుబడులు, మార్జిన్లపై ఒత్తిడి, నైపుణ్య సరఫరా చైన్ బలహీనపడటం వంటి అంశాలు ప్రభావం చూపాయి. కాగా.. ఐటీ సేవలకు నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కొంతమంది ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ పే చెల్లింపుల విషయంలో నెల రోజులపాటు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు డీలా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం అంచనాలకంటే తక్కువ వృద్ధిని సాధించింది. పెరిగిన వ్యయాల కారణంగా 3.2 శాతానికి పరిమితమైంది. అయితే పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను మాత్రం కంపెనీ 14–16 శాతానికి పెంచింది. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ సహకరించింది. ఇక 21–23 శాతం మార్జిన్లను ఆశిస్తోంది. క్యూ1లో 20 శాతం మార్జిన్లను అందుకుంది. ఉద్యోగలబ్ది, ప్రయాణ ఖర్చులు, సబ్‌కాంట్రాక్టు వ్యయాలు వంటివి ప్రభావం చూపాయి. దీనికితోడు భారీగా పెరిగిన ఉద్యోగ వలస(అట్రిషన్) దేశీ ఐటీ రంగ లాభదాయకతను దెబ్బతీస్తోంది. అయితే నిపుణులను ఆకట్టుకోవడం, పోటీస్థాయిలో వేతనాల పెంపు వంటివి చేపట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఇటీవల పేర్కొనడం గమనార్హం! ఇది స్వల్ప కాలంలో మార్జిన్లను బలహీనపరచినప్పటికీ అట్రిషన్‌ను తగ్గిస్తుందని, భవిష్యత్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
డిజిట్ ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్ ఆన్ ఫీచర్ ..
ముంబై: ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థ గో డిజిట్ తాజాగా వాహన బీమా పాలసీలకు సంబంధించి ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్–ఆన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తక్కువగా డ్రైవింగ్ చేసే కస్టమర్లు ఈ యాడ్–ఆన్‌తో తక్కువ ప్రీమియం చెల్లించే వీలుంటుందని సంస్థ తెలిపింది. షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పట్నుంచి సగటున సంవత్సరానికి 10,000 కిలోమీటర్ల కంటే తక్కువ డ్రైవింగ్ చేసే వారు ఎవరికైనా ఈ డిస్కౌంటు వర్తిస్తుందని పేర్కొంది. ఓడోమీటర్ రీడింగ్, టెలీమాటిక్స్ డేటా అలాగే వార్షిక కిలోమీటర్లు మొదలైన వివరాల ఆధారంగా డిస్కౌంటును డిజిట్ లెక్కిస్తుంది. ఓన్ డ్యామేజీ ప్రీమియంలో గరిష్టంగా 25 శాతం వరకూ డిస్కౌంటు పొందవచ్చు. టెక్నాలజీ ఆధారిత వీడియో ప్రీ ఇన్స్పెక్షన్ తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే పాలసీ జారీ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. కారును తక్కువగానే వినియోగిస్తున్నప్పటికీ .. ఎక్కువగా వినియోగించేవారితో సమానంగా అధిక ప్రీమియంలు చెల్లించే వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది. -
కరోనా పోరు: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ (కోవిడ్ -19) లాక్డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న తమ ఉద్యోగులకు ప్రముఖ టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారీ ఊరట కల్పించింది. భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో తన ఉద్యోగులకు సహాయం చేసేందుకు నిర్ణయించింది, అసోసియేట్ స్థాయి వరకు ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. తాజా నిర్ణయం భారత్‌లో ఉన్న మూడింట రెండు వంతుల కాగ్నిజెంట్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది. (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?) ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించేందుకు, ఖాతాదారులకు సురక్షతమైన సేవలను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటినుంచే పనిచేసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగులకు కొత్త ల్యాప్‌టాప్‌లను అందించడం, డెస్క్‌టాప్ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్ కార్డులను అందించడం లాంటి కీలక చర్యల్నికూడా తీసుకుంది. అన్ని గ్లోబల్ కంపెనీల మాదిరిగానే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావానికి తాము కూడా గురవుతున్నామని కంపెనీ తెలిపింది. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) ఈ క్లిష్ట సమయంలో మనమందరం ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం..అయినా ఒకరికొకరం సాయం చేసుకుంటూ కలిసికట్టుగా, ధైర్యంతో పనిచేస్తూ సవాళ్లను అధిగమిద్దాం అని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరోచితంగా పనిచేస్తున్న ఉద్యోగ బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల్నీ ఎప్పటికీ మర్చిపోలేమనీ, విశేష సేవలందించిన కీలక ఉద్యోగులు, ముఖ్య వ్యక్తులకు బహుమతి ఇచ్చేలా భవిష్యత్తులో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?) -
సుందర్ పిచాయ్ వార్షిక వేతనం ఎంతో తెలుసా
అల్ఫాబెట్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్ మరో అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు. అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్ ఇపుడు అతిపెద్ద స్టాక్ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్ళలో పనితీరు-ఆధారిత స్టాక్ అవార్డు రూపంలో 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17వందల కోట్ల) అందుకుంటారు. అలాగే 2020 నుండి పిచాయ్ అందుకోనున్న (టేక్ హోం) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు అల్ఫాబెట్ శుక్రవారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోలలో సుందర్ పిచాయ్ ఒకరు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ అందుకున్న వార్షిక వేతనం 1300 కోట్ల రూపాయలు. 2015లో గూగుల్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిచాయ్ వార్షిక వేతనం 652,500 డాలర్లు. మరుసటి సంవత్సరం అతని ఆదాయాలు ఆకాశాన్నంటింది. ముఖ్యంగా 199 మిలియన్ల డాలర్ల భారీ స్టాక్ అవార్డును గూగుల్ సంస్థ అందించింది. కాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే. గూగుల్ మాతృసంస్థ , ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత రిటైర్మెంట్ తీసుకుంటున్న కారణంగా అల్ఫాబెట్‌కు సీఈవోగా పిచాయ్ ఎంపికయ్యారు. దీంతో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా అవతరించారు. ఈక్విలార్ ప్రకారం అమెరికాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మిడియాన్ సీఈఓ మూలవేతనం 1.2 మిలియన్ల డాలర్లు. -
వాలెట్ వార్ : వాట్సాప్ (VS) పేటీఎం
న్యూఢిల్లీ: అమెరికా–చైనా సంస్థల మధ్య వాణిజ్య పోరు ఆయా దేశాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. తాజాగా ఆ కంపెనీలు భారత మార్కెట్లోనూ ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో ఆధిపత్యం కోసం రెండు దేశాల కంపెనీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఒకవైపు అత్యధిక యూజర్లు ఉపయోగించే అమెరికన్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్, మరోవైపు చైనా ఇన్వెస్టర్ల అండ ఉన్న దేశీ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం మధ్య గట్టి పోటీ ఉండబోతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డీమోనిటైజేషన్ అనంతరం భారత్‌లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా పేమెంట్ యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. రిటైల్ సంస్థ అమెజాన్ సొంత వాలెట్‌ను ప్రవేశపెట్టింది. పరిశ్రమవర్గాల సమాఖ్య అసోచాం, ఆర్‌ఎన్‌సీవోఎస్ సంస్థ అంచనాల ప్రకారం.. దేశీ మొబైల్ వాలెట్ లావాదేవీల విలువ 2016లో రూ.154 కోట్లు. ఇది 2022 నాటికి రూ.275 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో ఈ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దిగ్గజాలు పోటీపడుతున్నాయి. మిగతా వాటన్నింటికంటే ముందుగా రంగంలోకి దిగిన పేటీఎం సంస్థ ప్రస్తుతం ఈ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 30 కోట్ల మందికి పైగా యూజర్లు, 33% మార్కెట్ వాటాతో దేశీయంగా పేటీఎం అతి పెద్ద మొబైల్ పేమెంట్ కంపెనీగా నిలుస్తోంది. టెక్ దిగ్గజం గూగుల్ నెమ్మదిగా ఈ విభాగంలో ముందుకెళుతోంది. 2017 సెప్టెంబర్‌లో ఈ సంస్థ గూగుల్ పే పేరుతో పేమెంట్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు దీన్ని ప్రారంభించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. నెలవారీ క్రియాశీలకంగా ఉండే యూజర్ల సంఖ్య ఏడాది క్రితం 1.4 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి ఇది 4.5 కోట్లకు చేరింది. ‘వాట్సాప్’కు అంత ఈజీ కాదు.. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్.. వాట్సాప్ కూడా భారత్‌లో భారీగా పేమెంట్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. విస్తృతంగా యూజర్లు ఉండటం వాట్సాప్‌కు సానుకూలాంశం. దీనికి భారత్‌లో ప్రస్తుతం సుమారు 30 కోట్ల మంది పైగా యూజర్లున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు చేరువయ్యేందుకు దీన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి వాట్సాప్‌కు సానుకూలాంశాలే అయినప్పటికీ చెల్లింపుల మార్కెట్లో.. అయితే, చైనాకి చెందిన ఆలీబాబా గ్రూప్ అండ ఉన్న దేశీ పేమెంట్ సర్వీసుల సంస్థ పేటీఎం నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రానుంది. అంతేకాక ఇతరత్రా సవాళ్లూ తక్కువేమీ కాదు. కేంద్రం నిర్దేశించినట్లుగా డేటా లోకలైజేషన్, డేటా భద్రత నిబంధనలను వాట్సాప్ అమలు చేయడం లేదంటూ సుప్రీం కోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలైంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా చెల్లింపుల డేటాను (ట్రయల్ దశలోనైనా సరే) భారత్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వాట్సాప్ కూడా అంగీకరించింది. ఈ రకంగా చూస్తే భారత్‌లో వాట్సాప్ పే ఆరంగేట్రం చాలా ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. పోటాపోటీ... ఈ మార్కెట్లో దూసుకుపోవడం వాట్సాప్‌కు అంత ఆషామాషీగా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గూగుల్ పే, అమెజాన్ పే, వాల్‌మార్ట్– ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ఫోన్‌పే లాంటి ఇతర దిగ్గజాలతోనూ పోటీపడాలి. అదీ గాకుండా టెక్ సంస్థ యాపిల్ త్వరలోనే తమ యాపిల్ పే మొబైల్ వాలెట్‌ను కూడా భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమెజాన్, వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల పరిస్థితి కాస్త వేరుగా ఉంటుంది. ఈ పేమెంట్స్ వాలెట్స్‌ను వాటి సొంత కస్టమర్లే .. అదీ ఎక్కువగా క్యాష్‌బ్యాక్ కోసమే ఉపయోగించుకుంటూ ఉంటారు. టెలికం కంపెనీల వాలెట్స్ కూడా దాదాపు ఇలాంటివే. ఆ రకంగా చూస్తే ఇలాంటి సంస్థల నుంచి పోటీ కాస్త సాధారణ స్థాయిలోనే ఉన్నా.. పేటీఎంతో చిక్కు తప్పకపోవచ్చన్నది పరిశ్రమవర్గాల అంచనా. డీమోనిటైజేషన్ సమయంలో మొబైల్ వాలెట్ సంస్థలు కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చాయి. కానీ చాలా మటుకు సంస్థలు ఆ తర్వాత క్రమంగా కనుమరుగవుతున్నాయి. 2017 ఆఖరు నాటికి దేశీయంగా 60 పైగా మొబైల్ వాలెట్లు ఉండేవి. కానీ నెమ్మదిగా వ్యవస్థలో నగదు చెలామణీ మళ్లీ పెరగడం మొదలయ్యాక.. వీటి సంఖ్య క్రమంగా తగ్గి.. ప్రస్తుతం 50 లోపునకు పడిపోయింది. వాట్సాప్ ఇలాంటివాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. -
ఫ్రెషర్స్‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ ఉద్యోగార్ధులుకు గుడ్ న్యూస్. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐటీ ఫ్రెషర్స్‌కు ఈ శుభవార్త అందించింది. లేటెస్ట్ నైపుణ్యాలున్న ఫ్రెష్ ఇంజనీర్లకు చెల్లించే ప్యాకేజీని రెట్టింపు చేసింది. డిజిటల్ రంగంలో నైపుణ్యాలు కలిగిన టెకీలకు ఇకపై టీసీఎస్ వార్షిక ప్రాతిపదిక 6.5 లక్షల రూపాయల జీతాన్ని చెల్లించనుంది. ఐటీ పరిశ్రమలో భారతీయ ఇంజనీర్ల ఎంట్రీ స్థాయి జీతం సంవత్సరానికి సుమారు 3.5 లక్షల రూపాయలు మాత్రమే. టీసీఎస్‌లో ఉద్యోగం పొందాలనుకునే ఇంజనీర్లు ఆన్లైన్ పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. సంస్థలో నియామక ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసిన టీసీఎస్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ప్రారంభించింది. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సంపాదించిన అనంతరం వీడియో లేదా ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరోవైపు టీసీఎస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఐఆన్(iON )పరీక్ష కోసం నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 24 రాష్ట్రాల్లోని వంద నగరాలనుంచి 2లక్షల 80వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. మెషీన్‌లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ప్లాట్‌ఫాంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన తాము ఇప్పటికే వెయ్యిమందిని ఎంపకి చేశామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి అజయ్ ముఖర్జీ ప్రకటించారు. అయితే ఇంకా ఎంతమందిని నియమించుకోనున్నారనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉండవచ్చని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్‌ను వెనక్కి నెట్టిన టీసీఎస్ ఈ రేసులో టాప్ కంపెనీగా నిలిచింది. 8 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ కంపెనీగా టీసీఎస్ అవతరించింది. ఆగస్టు 23న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును అధిగమించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనాలను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖామంత్రి మనోజ్ సిన్హా మీడియాకు తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల బేసిక్ సాలరీ గరిష్టంగా 14,500 రూపాయలుగా నిర్ణయించినట్టు చెప్పారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 2.6లక్షలమంది గ్రామీణ డాక్ సేవక్‌లు లబ్ది పొందనున్నారు. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లకు సంబంధించి ఇప్పటివరకూ 2,295 రూపాయల వేతనం పొందుతున్న వారు ఇకపై నెలకు 10వేల రూపాయల చొప్పున, రూ. 2,775 పొందుతున్నవారు ఇకపై 12,500 రూపాయలు, రూ.4,115 పొందుతున్న జీడీఎస్‌లకు ఇకపై నెలకు 14,500 రూపాయల బేసిక్ పే చెల్లించనున్నామని మనోజ్ సిన్హా తెలిపారు. దీనికి అదనంగా రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్సులను తొలిసారి అందించనున్నట్టు చెప్పారు. ఈ సవరించిన వేతనాలు జనవరి1, 2016 నుంచి వర్తిస్తాయని, వీటిని బకాయిలతో సహా చెల్లిస్తామన్నారు. అలాగే మూడు షిప్ట్‌ల్లో కాకుండా ఇకపై వీరు రెండు షిప్ట్‌ల్లో మాత్రమే పనిచేయనున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతేకాదు జీడీఎస్‌లపై ఆధారపడిన వారికుద్దేశించిన పరిహార నియామకాలను కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇప్పటివరకూ ఈ సదుపాయం ఈ ఉద్యోగులకు అందుబాటులో లేదని పేర్కొన్నారు. -
శాంసంగ్ పే యాప్ లాంచ్
న్యూఢిల్లీ: సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియా తన మొబైల్ వాలెట్ పేమెంట్ యాప్‌ను భారత దేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. బీమ్, పేటీఎం లాంటి ఆప్‌ల తరహాలోనే శాంసంగ్ పే ఆప్ సేవలను బుధవారం ప్రారంభించింది. డీమానిటేజేషన తరువాత డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యం పెరగడంతో ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఈ పే ఫీచర్‌ను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజిస్టర్డ్ కస్లమర్లకోసం శాంసంగ్ పే సేవలను ప్రారంభించింది. అయితే హై ఎండ్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. శాంసంగ్ పే ద్వారా డబ్బులు చెల్లించడానికి పాస్వర్డ్, ఓటీపీ అవసరం లేదట. కేవలం పే అండ్ గో బటన్స్ద్వారా సులువుగా చెల్లింపులు చేయవచ్చు. మాగ్నటిక్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 అంచు, గెలాక్సీఎస్6 ఎడ్జ్ + గెలాక్సీ జవాబు 7 (2017), గెలాక్సీ ఏ5 (2017), గెలాక్సీ ఏ 7 (2016), గెలాక్సీ ఏ5 (2016) మొబైల్స్‌కు మాత్రమె ఈ ఆప్ పని చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు చెల్లింపు కార్డులద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఎస్బీఐకు సంబంధించి కేవలం క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే అవకాశం. ఇప్పటికే ఈయాప్ దక్షిణ కొరియా, అమెరికా, చైనా, స్పెయిన్, సింగపూర్, ఆస్ట్రేలియా, ప్యూర్టో రికో, బ్రెజిల్, రష్యా, థాయిలాండ్, మలేసియా సహా 12 అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. -
రేపు అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ పునరుద్ధరణ
-
పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలి
నల్లగొండ టౌన్: ఆదర్శపాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందికి పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఆదర్శ పాఠశాలల పొరుగుసేవల సిబ్బంది సంఘం అధ్యక్షుడు ఎ.రాములు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విడుదల చేసిన జీఓ 19 ప్రకారం వేతనాలను ప్రతి నెల చెల్లించాలన్నారు. ఆదర్శ పాఠశాలలో ఆట స్థలం, పరికరాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అనురాధ, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, నగేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయపు పన్ను చెల్లించడం గురుతర బాధ్యత
ఐటీ జాయింట్ కమిషనర్ సత్యానందం కాకినాడ సిటీ : ఆదాయపు పన్ను చెల్లించడం పన్ను మదుపరుల గురుతరమైన బాధ్యతగా గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ విశాఖ రేంజ్ జాయింట్ కమిషనర్ టి.సత్యానందం అన్నారు. కాకినాడ రోటరీ క్లబ్ సమావేశ హాలులో బుధవారం మూల ఆదాయంపై పన్ను వసూలు (టీడీఎస్) అంశంపై ఉద్యోగులు, వ్యాపారులకు అవగాహన సదస్సును టీడీఎస్ విభాగ అధికారులు నిర్వహిచారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ ఆదాయపు పన్ను మదుపరులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధికి ఖర్చు చేసే రూ.వేల కోట్లను వివిధ శాఖలు అందించాల్సి ఉందన్నారు. ఇందుకు ఆదాయపు పన్నుశాఖ పేద, ధనిక అంతరాన్ని తొలగించి టీడీఎస్ ద్వారా సమతుల్యతను పాటిస్తుందన్నారు. రాజమహేంద్రవరం టీడీఎస్ ఐటీవో జె.శైలేంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ ఎన్.సురేష్ టీడీఎస్‌పై అవగాహన కల్పించారు. సదస్సులో ఐటీ అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు గార్ల : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గార్ల మండలంలోని పూమ్యాతండా, సేరిపురం ప్రాంతాల్లో దెబ్బతిన్న మిర్చి తోటలను మంగâýæవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాలకు నష్టపోయిన మిరప, పత్తి, వరి చేలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సర్వే చేయించి ఎకరాకు రూ.30,000 నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటినప్పటికీ రైతులకు మూడవ విడత రుణమాఫీ నగదును బ్యాంకుల్లో జమ చేయకపోవడంతో రైతులకు నేటికీ పంట రుణాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, నానా అగచాట్లు పడుతున్నారని ఆందోâýæన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలును సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, మండల అధ్యక్షుడు ధరావత్ సక్రు, నాయకులు నాదెండ్ల రామారావు, గుగులోత్ హరి, ఎండి.మైనొద్దీ¯ŒS, బి.స్వామి, పి.సాదిక్ఖా¯ŒS, ఎం.రాజ, షఫియా, మహబూబి, ఇస్తావత్ సాలి తదితరులు ఉన్నారు. -
టాటా స్టీల్ ఉద్యోగులకు శుభవార్త!
జంషెడ్ పూర్: ప్రయివేట్ స్టీల్ మేజర్ టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బోనస్ చెల్లించడానికి నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులందరికీ బోనస్ గా రూ.130 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. ఈ మేరకు కంపెనీ, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించిన మెమోరాండంపై ఇరువర్గాలు సోమవారం సంతకం చేసినట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో జంషెడ్ పూర్ లోని ట్యూబ్స్ డివిజన్ కు చెందిన 15,575 ఉద్యోగులకు రూ 75.77 కోట్లు పంపిణీ చేయబడుతుందనీ, అలాగే కనీసంగా రూ.16,800లు, గరిష్టంగా రూ.12,1365 లను ఆయా ఉద్యోగులకు చెల్లించనున్నట్టు వెల్లడించింది. 1965 బోనస్ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి అధిక వేతనాలు తీసుకుంటున్నప్పటికీ అందరికీ బోనస్ చెల్లిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఒప్పంద పత్రంపై టీవీ నరేంద్రన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, (భారతదేశం, దక్షిణ తూర్పుఆసియా), ఆనంద్ సేన్ అధ్యక్షుడు, త్రిపాఠ్ వైస్ ప్రెసిడెంట్ ఇతర సీనియర్ అధికారులు, వర్కర్స్ యూనియన్ తరపున,బీకే దిండా,రవి ప్రసాద్, సంజీవ్ కె చౌదరి తదితరులు సంతకాలు చేశారు. -
విమాన ప్రయాణికులకు భారీ ఊరట
-
విమాన ప్రయాణికులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: త్వరలోనే అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు దేశీయ విమాన యాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండగా విమాన ప్రయాణికులకు భారీ పరిహారం కోసం లభించనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీలో ప్రయాణికుల లగేజీ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఒకవేళ విమానం క్యాన్సిల్ అయితే టికెట్ ధరతో పాటు అదనపు పన్నుల రూపంలో వసూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాలని చెప్పింది. ఇకపై విమానం ఆలస్యమైనా....రద్దయినా ఆయా విమానయాన సంస్థ సదరు ప్రయాణికులకు భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. రెండుగంటల లోపు విమానం రద్దయితే 10వేల రూపాయలు చెల్లించాలి. దీంతోపాటుగా 24 గంటల లోపు వేరే విమానాన్ని సమకూర్చలేకపోతే మరో రూ.20వేలు పరిహారం చెల్లించాల్సిందేనని విమానాయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టికెట్ క్యాన్సిల్ అయితే అదనపు పన్నులతో సహా చార్జీలను ప్రయాణికులకు రీఫండ్ చేయాలని చెప్పింది.ఈ రీఫండ్ కూడా దేశీయ ప్రయాణాలకైతే 15 రోజుల్లోగా, అంతర్జాతీయంగా అయితే 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈచెల్లింపుల ప్రక్రియలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయనీ, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ విధానం పారదర్శకంగా లేదనీ, కొన్ని అంశాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నిజాలను నిర్ధారించిన బాధ్యత ఆయా విమాన సంస్థలపై పెట్టడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాగా ఇటీవల విమానాయాన మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త విధానం విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. లగేజీ చార్జీల తగ్గింపు తోపాటు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ కు భారీ షాక్ తగిలింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 5 కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని ఆగస్టు 12 వ తేదీలోపుగా చెల్లించాలని యునిటెక్ సీనియర్ మేనేజ్ మెంటును ఆదేశించింది. లేని పక్షంలో జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం హెచ్చరించింది. యూనిటెక్ గ్రూప్, బుర్గుండి సొసైటీలో నోయిడా సెక్టార్ 76 ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోబాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ ( ఎన్సీడీఆర్సీ ) ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాల్సింది ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడం సీరియస్ గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.తక్షణమే పరిహారం చెల్లించాలని ఆగస్టు 12 వరకు గడువిచ్చింది. దీంతోపాటుగా ఈ గడువు లోపు చెల్లించడంలో విఫలమైతే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో మార్కెట్లో షేరు ఢమాల్ అంది. శుక్రవారం నాటి ఇంట్రా డే మార్కెట్ లో సుమారు రెండు శాతం నష్టాలతో ట్రేడవుతోంది. కాగా గుర్గావ్ కు చెందిన సంజయ్ అరోరో 2006 నవంబరులో గ్రేటర్ నోయిడాలోని యూనిటెక్ లిమిటెడ్ ప్రాజెక్టులో బుక్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం 36 నెలల్లో ఫ్లాట్‌ను అప్పగించలేదు సరికదా తనను తీవ్రంగా వేధించిందంటూ సంజయ్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై కమిషన్ విచారణ జరిపింది. యూనిటెక్‌పై అనేక కేసులు కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, 144 మంది ఉమ్మడిగా చేసిన ఫిర్యాదు కూడా విచారణలో ఉందని తెలిపింది. ఇంటిని కొనాలన్న కోరిక పిటిషనర్ సంజయ్ అరోరా జీవితాన్ని నాశనం చేసిందని వ్యాఖ్యానించింది. యూనిటెక్ ఆయనను తీవ్రంగా వేధించిందని పేర్కొంది. ప్రాజెక్టు పనులు జరగని సమయంలో అరోరా చెల్లింపుల్లో ఆలస్యం జరిగినపుడు, ఆ సొమ్ముపై వడ్డీ చెల్లించాలని యూనిటెక్ కోరడం సహేతుకం కాదని తెలిపింది. దాదాపు తొమ్మిదేళ్ళు గడచిన తర్వాత అనేక సమస్యలు ఉన్న మరో ఫ్లాట్‌ను తీసుకోమని చెప్పడం సరికాదని పేర్కొంది. ఫిర్యాదుదారు ఆరోగ్యాన్ని కోల్పోయారని, ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న కమిషన్ సంజయ్ అరోరాకు రూ.59,98,560ను సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు వ్యాజ్య ఖర్చుల కోసం మరో రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశించింది. యూనిటెక్ వద్ద డిపాజిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో యూనిటెక్ షేర్ ధర శుక్రవారం 1.5 శాతం ఇంట్రా డే పడిపోయింది. -
ఎక్కువ కరెంటు వాడితే డబ్బులిస్తారు!
జర్మనీ: సాధారణంగా విద్యుత్ వినియోగించినందుకు గాను ప్రజలు ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి కరెంటు ఎక్కువగా వాడకపోయినా లక్షలకొద్దీ తప్పుడు బిల్లులు రావడం చూశాం. కానీ అక్కడ మాత్రం విద్యుత్ అధికంగా వినియోగించండి... డబ్బులు సంపాదించండి అంటూ ప్రభుత్వమే ప్రజలను ప్రాధేయపడిందట. వింతగా ఉంది కదూ! సహజ విద్యుత్ ఉత్సత్తి సామర్థ్యంలో (35,900 మెగావాట్లతో) ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న జర్మనీ... ప్రజలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. విద్యుత్ ఎక్కువగా వినియోగించినవారికి మేమే డబ్బు చెల్లిస్తామంటూ ప్రకటనలు చేసింది. గతనెల్లో వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎండ, గాలులతో జర్మనీలో విద్యుత్ పునరుత్సాదకత భారీగా పెరిగి, కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని సౌర, పవన, జల, బయోమాస్ ప్లాంట్లలో విద్యుత్ 55GW నుంచి 63GW వరకూ... అంటే సుమారు 87 శాతం వరకూ ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్ ధరలు ప్రతికూల పరిస్థితుల్లోకి చేరడంతో అత్యధిక విద్యుత్ వినియోగించినవారికి, వాణిజ్య వినియోగదారులకు ప్రభుత్వమే ఎదరు డబ్బు చెల్లించే పరిస్థితులు నెలకొన్నాయి. జర్మనీలో గత ఏడాది సగటున సునరుత్సాదకత 33 శాతం ఉన్నట్లు జర్మన్ క్లీన్ ఎనర్జీ థింక్ ట్యాంక్ 'అగోరా ఎనర్జీ వెండే' నివేదికలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన విద్యుత్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2050 నాటికి వందశాతం ఉత్పాదకతను చేరుకునేందుకు జర్మనీ యోచిస్తుండగా... డెన్మార్క్ గాలి టర్బైన్లు ఇప్పటికే అత్యధిక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, మిగులు విద్యుత్ ను జర్మనీ నార్వే, స్వీడన్ లకు ఎగుమతి చేస్తోంది. కాగా.. జర్మనీలో ఏర్పడ్డ మిగులు విద్యుత్ అన్నది మంచి పరిణామం కాదని, ఈ విషయంలో సమయానికి ఇటు సరఫరాదారులు, అటు వినియోగదారులు ధరల సూచికపై స్పందించాల్సి వస్తుందని, లేదంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. పైగా గ్యాస్ పవర్ ప్లాంట్లు ఆఫ్ లైన్లో ఉన్నపుడు, న్యూక్లియర్, లోకల్ ప్లాంట్లు మూసే వీలుండకపోవడంతో వాటిని గంటల తరబడి కొనసాగించాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో వారు విద్యుత్తుకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రిఫైనరీలు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక వినియోగదారులు మాత్రం విద్యుత్ ను వాడుకొని డబ్బు సంపాదించగల్గుతున్నారని చెప్తున్నారు. -
మాల్యా.. బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకో!
న్యూఢిల్లీ: ''బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు'' అంటూ విజయ్ మాల్యాలాంటి ఎగవేతదారులను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరికలు చేశారు. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత కేసుల్లో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని, పెద్ద గ్రూపుల విషయం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ఎగవేసిన విజయ్ మాల్యా విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు. బ్యాంకులకు సెక్యూరిటీలు ఉంటాయని, ఇతర సంస్థలు కూడా చట్టపరమైన చర్యల ద్వారా ఎగవేతదారుల వద్ద నుంచి బకాయిలు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయని, వీటన్నింటిని సంబంధింత ఏజెన్సీలద్వారా పరిశోధన చేస్తున్నారని జైట్లీ అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారతదేశం విడిచి మార్చి 2న లండన్ పారిపోయే ముందు... అతని గ్రూప్ సంస్థలనుంచి రికవరీ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకులు సుప్రీంకోర్లును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం వల్ల అనేక కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వాటి మొండి బకాయిల సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ప్రస్తుతం మొండి బకాయిల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ముందే చెప్పినట్లుగా ఇవి రెండు రకాలుగా ఉంటాయని, ఆర్థిక వాతావరణంలో కొన్ని, పరిశ్రమల వైఫల్యంవల్ల కొన్ని ఉంటాయని, ఇప్పుడు ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జైట్తీ తెలిపారు. -
గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు
ఉపాధిహామీ పనులు చేసిన కూలీలకు నెలన్నరగా వేతనాల్లేవ్ {పస్తుతం రోజుకు 1.70 లక్షలకు మించని కూలీల సంఖ్య కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర విభాగాలకు మళ్లించిన సర్కారు బకాయిల చెల్లింపునకు తక్షణం రూ.200 కోట్లు కావాలంటున్న అధికారులు హైదరాబాద్: గ్రామీణ ప్రాంత పేదలకు ‘ఉపాధి’ దూరమవుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. పనులు చేసేందుకు కూలీలు మొగ్గు చూపడం లేదు. రాష్ట్రంలో ఉపాధిహామీ పనులకు నిధుల కొరతే దీనికి కారణమని తెలుస్తోంది. తొమ్మిది జిల్లాల్లో ఉపాధి పనులకు వెళుతున్న సమారు 9 లక్షల మంది కూలీలకు కొన్నాళ్లుగా వేతన చెల్లింపులు నిలిచిపోయాయి. దాదాపు నెలన్నరగా రోజువారీ వేతనాలు చేతికి అందకపోవడంతో పనులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో 44.86 లక్షల పనిదినాలు నమోదు కాగా, మార్చి మొదటి వారంలో 30.79 లక్షలు, రె ండో వారంలో 8.37 లక్షల పనిదినాలే నమోద య్యాయి. గత నెల ప్రారంభంలో రోజుకు 9 లక్షల మంది పనులకు హాజరుకాగా, ఈ నెల ప్రారంభంలో 6.52 లక్షల మంది హాజరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతవారం కేవలం 1.60 లక్షల మందే హాజరు కావడం ఉపాధిహామీ పనులపై కూలీల్లో నెలకొన్న అనాసక్తిని చెబుతోంది. ఉపాధి హామీ కింద కేంద్రం గత ఆగస్టులో రూ. 550 కోట్లు విడుదల చేసినా.. రాష్ట్రంలో ఉపాధి పనులకు నిధుల కొరత ఏర్పడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 10 శాతం నిధులను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర ప్రాజెక్ట్‌లకు మళ్లించింది. సర్కారు నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో కూలీలకు వేతనాలు చెల్లించలేక గ్రామీణాభివృద్ధి శాఖ చేతులెత్తేస్తోంది. రూ.200 కోట్ల బకాయిలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిహామీ పనులు జరిగిన ప్రాంతాల్లో సుమారు కోటికిపైగా పనిదినాలు పూర్తి చేసిన కూలీలకు దాదాపుగా రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద రోజుకు కూలీ రూ.180గా కేంద్రం నిర్ణయించినా సగటున రూ.130కి మించి లభ్యం కావడం లేదు. వేసవిలో ఉపాధిపనులు చేసే కూలీలకు కేంద్రం 20 నుంచి 35 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను ప్రకటించినా రూ.170 నుంచి 180లోపే వస్తుండడం, గత నెలన్నరగా అదీ చేతికి అందకపోవడంతో పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. ఫలితంగా గ్రామాల్లో పనులు మందగించాయి. కూలీలకు నెలన్నరగా వేతనాలు అందకపోవడంపై గ్రామీణాభివృద్ధి విభాగం సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో వేతనాల కోసం కూలీల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచే నిధులు రాకపోవడంతో కూలీలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని, పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఉపాధి పనులు సమృద్ధిగా ఉన్నా.. సకాలంలో వేతనాలు రాక కూలీలు ఇతర పనులు చూసుకుంటున్నారని చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తార కరామారావు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఉపాధిహామీకి నిధుల కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 12 లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నామని చెప్పడం విశేషం. మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు విని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
బడికొస్తే బహుమానాలు
భారత గ్రామీణ బాలికలు విద్యావంతులు కావాలన్నదే ఆయన ఆశయం.. అందుకే వారిని సరికొత్త పద్ధతిలో ప్రోత్సహిస్తున్నాడు. పాఠశాలకు రప్పించేందుకు అనేక ఆకర్షణీయమైన బహుమానాలను అందిస్తన్నాడు. ప్రతిరోజూ స్కూలుకు వచ్చిన వారికి పది రూపాయలతో పాటు... హాజరు విషయంలో ముందున్న వారికి ఇంట్లో టాయిలెట్ ఉండేట్లు ఏర్పాట్లు చేస్తున్నాడు. ముఖ్యంగా యువతులు స్వతంత్రంగా బతికేందుకు... వారి కాళ్ళపై వారు నిలబడేందుకు... ఆ ఎన్ ఆర్ ఐ ప్రోత్సహిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు, యువతుల విద్యకు ఆయా కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించకపోవడం, బాధ్యతను తీర్చుకునేందుకు మైనర్లకే పెళ్ళిళ్ళు కూడ చేసేయడాన్ని వీరేంద్ర శామ్ గమనించాడు. అటువంటి వారిని విద్యాకుసుమాలుగా తీర్చి దిద్దేందుకు తన వంతు కృష్టి ప్రారంభించాడు. అందులో భాగంగానే పధ్నాలుగేళ్ళకే పెళ్ళికి తలవంచిన నీతూ తోమర్, ఇంటినుంచీ అడుగు కూడ బయటపెట్టలేని స్థితిలో ఉన్న రీతా, కోరిక ఉన్నా చదువుకు అంగీకరించని తల్లిదండ్రులు కలిగిన రాధారాణి వంటి అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు వీరంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరే కాదు ఇటువంటి ఎందరో విద్యాధికులైన బాలికల జీవితాల వెనుక వీరేంద్ర శామ్ సింగ్ కృషి ఎంతగానో ఉంది. పర్దాడా పర్దాడి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని అనుప్షహర్, బులంద్‌షహర్ లోని వేలమంది బాలికల విద్యాభివృద్ధికి ఆయన చేయూతనిస్తున్నాడు. 2000 సంవత్సరంలో ఆమెరికాలోని డుపాంట్ లో పనిచేసే వీరేంద్ర.. స్వదేశంలో సమస్యలపై దృష్టి సారించాలకున్నాడు. అనుకున్నదే తడవుగా ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా విరమించి భారత్ కు తిరిగి వచ్చేశాడు. బాలికలకు ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్రాన్ని కల్పించేందుకు పరిష్కారాన్ని ఆలోచించాడు. వారి పేరుతో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. అయితే ఆ డబ్బు పై వారికి 18 సంవత్సరాలు దాటే వరకూ ఎటువంటి అనుమతి కల్పించలేదు. విద్య పూర్తయిన తర్వాత వివాహ సమయానికి ఆ డబ్బు వారి చేతికందేలా వీరేంద్ర ప్లాన్ చేశాడు. దీంతో బాలికలను విద్యకు ప్రోత్సహించడంతోపాటు, వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయపడ్డాడు. మరోవైపు బాలికలు ఆరోగ్యంగా లేకపోతే విద్యపై దృష్టి సారించలేరన్న ఉద్దేశ్యంతో ఆ దిశగా చర్యలు చేపట్టిన వీరేంద్ర... వారికి పాఠశాలలో పీపీఈఎస్ ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడ ప్రారంభించాడు. మొదట్లో ఎన్ని ప్రోత్సాహకాలు అందించినా బాలికలను పాఠశాలకు రప్పించలేని సంస్థ సభ్యులు... ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. అప్పట్లో అనుప్షహర్ లో 35 మంది బాలికలతో ప్రారంభమైన పాఠశాల నేడు చుట్టుపక్కలి అరవై రెండు గ్రామాలనుంచి వచ్చే 14 వందల మంది విద్యార్థులతో కొనసాగుతోంది. ముఖ్యంగా నెలకు మూడువేలకన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని బాలికలపై పీపీఈఎస్ దృష్టి సారిస్తోంది. పాఠశాల విద్య పూర్తయిన అమ్మాయిలకు వృత్తి శిక్షణా, నైపుణ్యం కలిగించే అనేక కోర్సులను కూడ అందిస్తోంది. దీనిలో ఇప్పటికే 150 మంది వరకూ విద్యార్థినులు శిక్షణ పొంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కూడ సంపాదించారు. పీపీఈఎస్ సంస్థ బాలికల విద్యతో పాటు గ్రామీణ మహిళల్లో ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించడం, వారికి తిరిగి చెల్లించేట్లుగా చిన్నతరహా రుణాలు అందించడంతో పాటు అనేక వస్తువులు సబ్సిడీలో కూడ ఇస్తున్నట్లు సంస్థ సభ్యులు రేణుక చెప్తున్నారు. ఈ పీపీఈఎస్ కు వివిధ సంస్థలు, వ్యక్తులు నిధులు సమకూరుస్తుంటారు. దీనికి హెచ్ సీ ఎల్ గ్రాంట్ కూడ వర్తిస్తుంది. దీంతో వచ్చే మూడేళ్ళలో 44 గ్రామాల్లో, 4 వేలమంది బాలికలకు మొబైల్ లెర్నింగ్ ట్రక్ ద్వారా ఇంటివద్దే నాణ్యమైన విద్యతో పాటు, స్కిల్ ట్రైనింగ్ అందించనుంది. పీపీఈఎస్ లో 2 వందలమంది పూర్తి సమయం ఉద్యోగులతో పాటు అనేక మంది వాలంటీర్లుగా కూడ పనిచేస్తున్నారు. -
పెళ్లికి అప్పిస్తారు కానీ..
వంద అబద్ధాలాడయినా ఓ పెళ్లి చేయమంటారు. అంటే వివాహ బంధానికి అంతటి ప్రత్యేకత ఉందన్నమాట. అందుకే కాబోలు స్వాన్ లవ్ పేరిట ఓ కంపెనీ ఏకంగా పెళ్లిళ్ళకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది... కానీ నిర్వాహకులు దానికి కొన్ని కండిషన్లు మాత్రం పెట్టారు. అప్పు తీసుకున్నవారు వివాహ బంధాన్ని సజావుగా కొనసాగించారా సరి... విడాకులకు సిద్ధపడ్డారో అంతే.. తీసుకున్న డబ్బును వడ్డీతో కలిపి అణాపైసాలతో సహా చెల్లించాల్సిందే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పెళ్లి చేసుకోడానికి అష్ట కష్టాలు పడుతుంటారు. అధిక వడ్డీరేట్లను చెల్లించి అప్పులపాలౌతుంటారు. అటువంటివారితో పాటు.. ప్రేమ జంటలకూ ఆర్థికంగా అండగా నిలిచేందుకు వినూత్న ఆలోచనతో సీటెల్ లోని స్వాన్ లవ్ కంపెనీ ముందుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి పదివేల డాలర్లను సహాయంగా ఇస్తుంది. అయితే వారి కాపురం సజావుగా సాగిందా ఫర్వాలేదు. తీసుకున్న అప్పునుంచీ ఒక్క పైసా కూడ తిరిగి చెల్లించాల్సిన అవసరరం లేదు. ఒకవేళ విడాకులకు దారి తీసిందంటే మాత్రం... అప్పుతీసుకున్ననాటినుంచీ వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అందుకు ఎంత వడ్డీ కట్టాలి అన్నది కంపెనీ ముందుగానే నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన నిబంధనలతో కూడిన డాక్యుమెంట్లపై సంతకాలు కూడ చేయించుకుంటుంది. కంపెనీ పెట్టే షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే డబ్బును ఇచ్చేందుకు ఆ జంటను ఎంపిక చేస్తారు. స్వాన్ లవ్ సీఈవో స్కాట్ యావీకి ఈ వినూత్న ఆలోచన తన స్నేహితుడి పెళ్లి సందర్భంలో వచ్చిందట. ఇది క్రేజీగానే ఉన్నా ఆచరించడానికి ఎంతో ఆనందంగా ఉందంటున్నాడతడు. ఓ వ్యవస్థను రక్షించేందుకు ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నానని, వివాహ జీవితంలో అసమానతలు చోటు చేసుకున్నపుడు రుణభారం ఒక్కరిపైనే పడుతోందని, అంతేకాక సమాన బాధ్యతలు పంచుకొని సమస్యలను అధిగమిస్తారనే ఆలోచనతోనే ఈ విధానాన్ని పరిచయం చేస్తున్నామని స్కాట్ సావీ చెప్తున్నారు. అయితే తమ కంపెనీకి ఇన్వెస్టర్లు వస్తారా లేదా అన్నవిషయం ఇంకా తేలలేదన్నారు. ఇప్పుడిప్పుడే ధరఖాస్తులు స్వీకరిస్తున్న సంస్థ... అనుకున్నట్లుగా అన్నీ జరిగితే ఫిబ్రవరినాటికి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే కంపెనీకి రాబడి వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టొచ్చని, భవిష్యత్తులో లాభదాయకంగా నడిచే అవకాశం ఉందని స్కాట్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వ్యక్తుల ప్రవర్తనలు, ఆలోచనలను ఆధారంగా చేసుకుని వ్యాపారం చేయడం స్కాట్ కు ఇదే మొదటిసారి కాదు. మొబైల్ యాప్ కంపెనీ అటాక్ టచ్, యాప్ అనలిటిక్స్ కంపెనీ... వై స్లైడ్స్, స్నాప్ డేర్ స్నాప్ ఛాట్ వంటివెన్నో స్థాపించాడు. అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా... పూర్తిగా వివాదాస్పదమైన స్వాన్ లవ్ సంస్థను స్థాపించి బిజినెస్ మోడల్ గా నిలుస్తున్నాడు. భవిష్యత్తులో వివాహాలు విచ్ఛిన్నం అవుతాయన్న గట్టి నమ్మకంతోనే అతడీ సంస్థను స్థాపించాడన్న విమర్శలూ వస్తున్నాయి. ఇది వ్యక్తుల జీవితాలతో వ్యాపారం చేయడం కాదా అని స్కాట్ ను అడిగితే మాత్రం... తాను పరిశీలించినంతలో ఇప్పటివరకూ సానుకూల స్పందనే ఉందని చెప్తున్నాడు. -
రూ. 2,000 కోట్లు కట్టండి..
లెసైన్సుల విలీన ప్రక్రియలో వొడాఫోన్‌కు సుప్రీం సూచన న్యూఢిల్లీ: వేర్వేరుగా ఉన్న నాలుగు లెసైన్సుల విలీనానికి రూ. 2,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ (వీఎంఎస్ఎల్)కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ చెల్లింపులు ఎప్పుడు పూర్తయితే అప్పుడు... కేంద్రం విలీన ప్రక్రియకు అనుమతిస్తుందని న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. లెసైన్సుల తాత్కాలిక విలీనానికి అనుమతి ఇస్తూ... టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఇచ్చింది. ఐపీఓ బాటలో... భారత్‌లో అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రావాలని వొడాఫోన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా నాలుగు వేర్వేరు లెసైన్సులను (వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సెల్యులార్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ డిజిలింక్)ను తనలో విలీనం చేసుకోవాలని వీఎంఎస్ఎల్ భావిస్తున్నట్లు సమాచారం. విలీన ప్రక్రియకు వివిధ విభాగాల కింద దాదాపు రూ.6,678 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసు విచారణ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి తెలిపారు. వీటిలో వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జ్, అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిల వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. -
కరెంటు కనెక్షన్ మరిచారు బిల్లులు మాత్రం ఇచ్చారు
రామనాథపురం(తమిళనాడు): విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండానే నిరక్షరాస్యులనై దంపతుల వద్ద నుంచి కరెంటు బిల్లులు వసూలు చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమ ఇంటికి విద్యుత్ కనెక్షన్కోసం మీటర్ పెట్టిన అధికారులు ఆ తర్వాత కనెక్షన్ ఇవ్వకుండానే దాదాపు మూడు నెలల బిల్లు వసూలు చేశారు. రామనాథపురంలోని ఓ దంపతులు విద్యుత్ కనెక్షన్ కోసం రూ.6000 వేలు చెల్లించారు. డబ్బు చెల్లించాక ఇంటికొచ్చిన అధికారులు ముందు మీటర్ పెట్టారు. త్వరలోనే వారి ఇంటికి సమీపంలో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుచేస్తామని, ఆ వెంటనే కరెంట్ వస్తుందని చెప్పారు. కానీ, వారు చెప్పిన మాట ప్రకార విద్యుత్ రాకపోగా, తాము మీటర్ పెట్టినందున పవర్ వచ్చినా రాకపోయినా నెల నెలా సగటు చార్జీల కింద బిల్లు చెల్లించాలని మార్చి, ఏప్రిల్, మే నెలలకు వరుసగా రూ.86, రూ.86, రూ.110 చార్జీ విధించారు. దీంతో ఆ మొత్తం చెల్లించిన దంపతులు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కు ఫిర్యాదు చేరవేయగా.. వారు పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. -
ఇకపై ఆన్ లైన్ లోనే ట్రాఫిక్ చలాన్లు: ట్రాఫిక్ సీపీ
హైదరాబాద్: ఇకపై ట్రాఫిక్ చలాన్లు పోస్టాఫీస్, మొబైల్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలని హైదరాబాద్ అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్) సూచించారు. పోలీసులు నగదు రూపంలో చలాన్లు స్వీకరించరన్నారు. -
బకాయిల చెల్లింపు కోసం బాదుడు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఎమ్మెస్సార్టీసీ) బస్ చార్జీలను 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన చార్జీలు మొదటి రెండు స్టేజీ (12 కి.మీ.)లకు వర్తించవని, ఆపై ప్రయాణానికి 2.5 శాతం చొప్పున చార్జీలు వసూలు చేస్తారన్నారు. ఎమ్మెస్సార్టీసీ ఉద్యోగులకు ఏరియర్స్‌ను పెంచి ఇచ్చేందుకే ఈ చార్జీలను పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ఏరియర్స్ పెంచకపోతే జూన్ 4 నుంచి ఆందోళనకు దిగుతామని సిబ్బంది, యూనియన్లు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో ఏసీ బస్సు చార్జీలు కూడా... ఏసీ బస్సుల చార్జీలను కూడా పెంచే అవకాశముందని, త్వరలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు పెంచాలని నిర్ణయించిన చార్జీల పట్టిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారని, పట్టిక సిద్ధమవుతోందన్నారు. శ్రమ ఫలించింది..: యూనియన్లు ఏరియర్స్ పెంపు కోసం తాము చేస్తున్న ఆందోళన సత్ఫలితాలనిచ్చిందని యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏరియర్స్, కరవు భత్యాన్ని పెంచాలని కొన్ని నెలలుగా కోరుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో మంగళవారం పలు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, జూన్ 4వ తేదీన 80 వేలకుపైగా సిబ్బందితో ఆందోళనకు దిగుతామని హెచ్చరించామని యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చార్జీలను పెంచిన తర్వాత కూడా ప్రభుత్వం ఏరియర్స్‌ను చెల్లించేందుకు నిరాకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు నెలల్లోపే... మార్చిలో చార్జీలను పెంచుతూ ప్రయాణికులపై భారం మోపిన ఎమ్మెస్సార్టీసీ మూడు నెలలు తిరగకుండానే మరోసారి చార్జీలను పెంచింది. గత మార్చిలో ఏసీ బస్ చార్జీలను రూ.15 పెంచారు. దాదర్-పుణే ఏసీ బస్ చార్జీలను రూ.390 నుంచి 405కు పెంచారు. బోరివలి నుంచి పుణే వరకు ప్రయాణించేవారికి రూ.465 నుంచి 480 వరకు చార్జీలను పెంచారు. ఏసీ బస్సు చార్జీలను కూడా త్వరలో పెంచనున్నారు. -
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు
- తొలిరోజు మిశ్రమ స్పందన - ఉన్నతాధికారులతో చర్చలు విఫలం - సమ్మె కొనసాగిస్తామంటున్న ఉద్యోగులు విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి విద్యుత్ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉన్నప్పటికీ అది జరగకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో విద్యు త్ ఉద్యోగులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో 825 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు మరో 300 మంది కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్లినట్లు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్ పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతున్న విధంగా పూర్తి స్థాయిలో ఉద్యోగులు తొలిరోజు సమ్మెకు సహకరించలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీచిన ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగటంతో పలుచోట్ల మరమ్మతు పనులకు ఉద్యోగులు హాజరైనట్లు సమాచారం. తొలిరోజు ఆది వారం సెలవు దినం కావటంతో ఎవరూ సమ్మెలోకి వచ్చింది, ఎవరూ విధులు నిర్వర్తిస్తున్నది తెలియని పరిస్థితి ఉందని ఉద్యోగులే పేర్కొం టున్నారు. తొలి రోజు సమ్మెను నిలువరించేందుకు భావి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎస్ మహంతి, విద్యుత్ శాఖ సీఎండీలు విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. పీఆర్సీ అమలు పై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోవటంతో సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుం డా సమ్మెలో భాగంగా తొలిరోజు ఆదివారం దాసన్నపేటలో గల విద్యుత్ సహకార సంఘ భవనం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జి. శివకుమార్ మాట్లాడుతూ వేతన సవరణను అమలు చేసేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చి ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలం కావటంతో తాము సమ్మె కు దిగినట్లు పేర్కొన్నారు. అంతే తప్ప ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులను ఇబ్బందులు పెట్టడం తమ ఉద్దేశం కాదని తెలి పారు. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారు లు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే విధుల్లో చేరుతామని చెప్పారు. ధర్నాలో జేఏసీ ప్రతిని ధులు బి.కె.వి.ప్రసాద్, ఎం.నిర్మలమూర్తి, రాజేంద్రప్రసాద్, వర్మ పాల్గొన్నారు. నిలిచిన విద్యుత్ సరఫరా విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో తొలిరోజు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో చాలా చోట్ల సరఫరా నిలిచిపోగా ఆదివారం నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. అధికారులు సమాచారం మేరకు విజయనగరం పట్టణంలో మయూరి జంక్షన్, ఇందిరానగర్, ప్రదీప్ నగర్, రైల్వే న్యూకాలనీ తదితర ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిచిపోయింది. ఎస్‌కోట డివిజన్లో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగినట్లు తెలుస్తోంది. ఇదే తరహలో మిగిలిన ప్రాంతాల్లో కూడా సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం. ఇదే విషయమై ఏపీఈపీడీసీఎల్ టెక్నికల్ డీఈటీ దైవప్రసాద్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఓ వైపు సమ్మె, మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోవటం వాస్తవమేనన్నారు. సమస్యను పరిష్కరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 245 మంది సిబ్బందిని తీసుకు వచ్చామని మరమ్మ తు పనులు చేపడుతున్నామని వివరించారు. -
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు