పూమ్యా తండాలో నీట మునిగిన మిర్చి తోటను పరిశీలిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
- వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు
గార్ల : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గార్ల మండలంలోని పూమ్యాతండా, సేరిపురం ప్రాంతాల్లో దెబ్బతిన్న మిర్చి తోటలను మంగâýæవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాలకు నష్టపోయిన మిరప, పత్తి, వరి చేలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సర్వే చేయించి ఎకరాకు రూ.30,000 నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటినప్పటికీ రైతులకు మూడవ విడత రుణమాఫీ నగదును బ్యాంకుల్లో జమ చేయకపోవడంతో రైతులకు నేటికీ పంట రుణాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, నానా అగచాట్లు పడుతున్నారని ఆందోâýæన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలును సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, మండల అధ్యక్షుడు ధరావత్ సక్రు, నాయకులు నాదెండ్ల రామారావు, గుగులోత్ హరి, ఎండి.మైనొద్దీ¯ŒS, బి.స్వామి, పి.సాదిక్‌ఖా¯ŒS, ఎం.రాజ, షఫియా, మహబూబి, ఇస్తావత్ సాలి తదితరులు ఉన్నారు.