Crop damage
-
బీమా ఎగ్గొట్టావు 'పరిహారం కట్టు బాబూ': వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో... అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.పెట్టుబడి సాయం... సున్నామన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం. పంటల ధరలు దారుణంగా పతనం.. రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలంఅరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా. – పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలంపెట్టుబడి సాయం ఏది?మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు. – పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంఎప్పుడూ చూడలేదుపదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. – దినేష్‌కుమార్‌రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం -
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వెన్ను విరిచిన వర్షం
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/ మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఒకపక్క బోర్లలో నీళ్లు అడుగంటి ఎండిపోతున్న పంటలు.. మరోపక్క మిగిలిన కొద్దిపాటి పంటలను ముంచెత్తిన అకాల వర్షం.. దిక్కుతోచని స్థితిలో రైతన్న కంటక‘న్నీళ్లు’.. అకాల వర్షాలు అన్నదాతను తీవ్రంగా దెబ్బతీశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వడగళ్ల వాన పంటలను దెబ్బతీసింది. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో భారీ వర్షానికి తోడు ఈదురు గాలుల కారణంగా వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పొగాకు పంట కూడా దెబ్బతిన్నట్లు రైతులు చెపుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో మిరప, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్, ధర్మపురి మండలాల్లో వడగళ్ల వాన కారణంగా సుమారు 1500 ఎకరాల్లో మామిడి రాలిపోగా, మరో 1500 ఎకరాల మేర మొక్కజొన్న పంట నేలకొరిగినట్లు ప్రాథమిక అంచనా. నువ్వులు, పసుపు తడిచిపోయిందని రైతులు వాపోతున్నారు. మొత్తం 5,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీటిపాలైంది. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో వడగళ్లతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. దర్పల్లి మండలంలోని వాడి, లింగంపల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో పిడుగుపాటుకు రెండు గేదెలు, మూడు గొర్రెలు మృతిచెందాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, సూరంపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ తదితర గ్రామాల్లో దాదాపు 175 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. అకాల వర్షం వల్ల చేతికొచి్చన పంట నేల రాలటంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘మా కష్టం అంతా వృథా అయ్యింది. ప్రభుత్వం తక్షణం పరిహారం అందించాలి’అని వరంగల్‌కు చెందిన ఓ రైతు వాపోయారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మోమిన్‌పేట, మర్పల్లి, నవాబుపేటలో కూరగాయ పంటలు, పూల తోటలకు నష్టం వాటిల్లింది. కందుకూరు, చేవెళ్ల, మోమిన్‌పేట, షాద్‌నగర్ మండలాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్ అర్బన్, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకులు, భూత్పూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవటంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. సూత్తుండగానే మక్కలు కొట్టుకుపోయాయి రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. రూ.30 వేల వరకు ఖర్చు చేసిన. కరువు రావడంతో దిగుబడి 36 బస్తాలకు పడిపోయింది. మక్కలను అమ్ముకునేందుకు మూడు రోజుల క్రితం జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చా. తేమ ఉందని తక్కువ ధరకు అడగడంతో కాటన్ యార్డులో ఆరబోసుకున్నా. ఈరోజు అమ్ము కుందామని ఆశపడ్డ. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో మక్కల రాసి వద్ద వరద చేరి మొత్తం తడిసిపోయాయి. సూత్తుండగానే గింజలు కొట్టుకుపోయాయి. దిగుబడి తగ్గి ఒక రకంగా నష్టపోతే, అకాల వర్షం మరింత కుంగదీసింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి. -విజయ, కొండాపురం, పాలకుర్తి, జనగామ జిల్లా -
నిజామాబాద్ జిల్లాలో అన్నదాతకు కడగండ్లు మిగిల్చిన వడగండ్ల వాన
-
వాన కాటు.. సర్కారు పోటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయడం రైతులకు ఆశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడుతున్న రైతులు.. తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు. మరో వైపు కళ్లాల్లోని పంట నేలకొరిగి ముంపునకు గురవుతుంటే.. ఇంకో వైపు కోసిన ధాన్యం రాసులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ధాన్యం మొలకలెత్తి.. రంగు మారిపోతూ.. తేమ శాతం అంతకంతకు పెరిగిపోతుండడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వరుస వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ఏపుగా ఎదిగే వేళ జూలైలో కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రెండోసారి విత్తుకున్నారు. పంట ఏపుగా ఏదిగే వేళ సెప్టెంబర్‌లో వరదలు, భారీ వర్షాలు దెబ్బతీస్తే.. కోత కోసే సమయంలో ఫెంగల్ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. కృష్ణా డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఇంకా పంట పూర్తిగా చేనుపైనే ఉంది. ఉత్తరాంధ్ర మొదలు పల్నాడు వరకు 8 లక్షల ఎకరాల్లో పంట చేలల్లోనే ఉంది. శ్రీకాకుళంలో 70 వేల ఎకరాలు, అనకాపల్లిలో 65 వేలు, కృష్ణా డెల్టాలో 80 వేలు, గుంటూరులో 30 వేల, బాపట్లలో 1.82 వేల ఎకరాలు, పల్నాడులో 50 వేల ఎకరాల్లో పంట చేనుపై ఉంది. ఆయా జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట ముంపు నీటిలో చిక్కుకుని నేలకొరిగింది.మొలకెత్తుతున్న ధాన్యం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆయా జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా కప్పుకునేందుకు టార్పాలిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అద్దెకు తెచ్చుకొని మరీ కప్పుకుంటున్నారు. మరొక వైపు ఒబ్బిడి చేసుకునేందుకు, చేనుపై వరిగిన పంటను కాపాడుకునేందుకు కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరొక వైపు రైతుల వద్ద సిద్ధంగా ఉన్న 3–4 లక్షల టన్నుల ధాన్యం రంగుమారి, మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర లభించక అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖాధికారులు.. దళారీలు, మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో 75 కేజీల బస్తాకు 300–400 వరకు నష్టపోతున్నారు. వరుస వైపరీత్యాలతో తేమ 20–25 శాతం మధ్య నమోదవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలు, మంచు ప్రభావంతో అది 25–30 శాతం వరకు వెళ్లొచ్చని వాపోతున్నారు. 16 లక్షల టన్నుల ధాన్యం మాటేంటి?రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా, 34.92 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 84.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు తొలుత 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించగా, దాన్ని 36–37 లక్షల వరకు పెంచినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే 22.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా, ప్రొక్యూర్మెంట్ వెరైటీస్‌కు సంబంధించి 16 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. అత్యధికంగా శ్రీకాకుళం, కృష్ణ జిల్లాల్లో 2.50 లక్షల టన్నుల చొప్పున, విజయనగరం జిల్లాలో 1.50 లక్షల టన్నులు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో లక్ష టన్నుల చొప్పున ధాన్యం ఉంది. నాన్ ప్రొక్యూర్మెంట్ వెరైటీస్‌కు సంబంధించి మరో 3–4 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
79,574 ఎకరాల్లో పంటనష్టం
సాక్షి, హైదరాబాద్: ‘ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాలలో పంటనష్టం సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి పంట ష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయి’అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంటనష్టం 28,407 ఎకరాల్లో ఆ తర్వాత మహబూబాబాద్‌లో 14,669, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో ఉందన్నారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్టు అధికారులు ఏర్పాటు చేసినట్టు తుమ్మల తెలిపారు. 4.15 లక్షల ఎకరాల్లో నష్టమన్న సీఎంరాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారులు మాత్రం చివరకు 79,574 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిసి, ఆ మేరకే నిధులు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే ఐదోవంతు కంటే తక్కువగా నష్టాన్ని నిర్ధారించారు. దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా పంట నష్టం జరిగిన దాంట్లో దాదాపు 25 శాతం ఇసుకమే ట పేరుకుపోయి నష్టం సంభవించింది. ఇసుక మేటకు పదివేలకు అదనంగా ఇస్తా మని కూడా వ్యవసాయ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన పరిహారంలో ఇసుకమేట విషయం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
రైతు కష్టం వరదపాలు
-
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
పోటెత్తిన తుంగభద్ర డ్రెయిన్
తెనాలి: తుంగభద్ర డ్రెయిన్ పోటెత్తింది... సమీప పంట పొలాలను ముంచెత్తింది. ఫలితంగా గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల్లోకి పంట పొలాలు మునకేశాయి. వరి పొలాలైతే చాలా చోట్ల మొనలు కూడా కనిపించడం లేదు. బీపీటీ వరిపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కూరగాయలు, నిమ్మ, అరటి పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండటంతోపంట నష్టం అనివార్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నల్ల డ్రెయిన్... ఒకప్పుడు రైతుల దుఃఖదాయినిగా పేరు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ దిగువన అదనంగా అండర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తుంగభద్ర డ్రెయినుగా మారుతుంది. వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు, ఆరెమండ్ల, తాళ్లపాలెం, పొన్నూరు, ములుకుదురు, మాచవరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఎప్పుడు వరదలొచ్చినా 24 గంటల్లో డ్రెయిను సాధారణ పరిస్థితికి వస్తుంది. అయితే ఈసారి ఆగస్టు 31, ఈ నెల 1న కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన తుంగభద్ర, వర్షాలు ఆగిపోవడంతో రెండో తేదీ తర్వాత తగ్గుముఖం పట్టింది. మళ్లీ అనూహ్యంగా 3వ తేదీ మధ్యాహ్నం నుంచి నీరు పోటెత్తింది. 36 గంటలుగా ఇదే పరిస్థితి. మార్గమధ్యంలోని వంతెనల అంచులను తాకుతూ, కట్టలపై డ్రెయిన్ పొంగిపొర్లుతూ ప్రవహిస్తోంది. మంగళగిరి, చినకాకాని, కాజ, టోల్గేట్ ప్రాంతాల్లోని నీరు తుంగభద్ర డ్రెయినుకు రావడమే ఇందుకు కారణం. మరోవైపు తుంగభద్రలో కలిసే కొండేరు డ్రెయినుతో సహా పలు మురుగుకాల్వలు ఎగదన్ని పంటపొలాలను ముంచాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా తెనాలి సమీపంలోని పినపాడు–దుండిపాలెం, చుండూరు మండలంలోని నడిగడ్డపాలెం–చుండూరు, చుండూరు–మోదుకూరు గ్రామాల మధ్య రోడ్లు జలమయమయ్యాయి. చుండూరు–మోదుకూరు, నడిగడ్డపాలెం–చుండూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
6 లక్షల ఎకరాల్లో పంట నష్టం?
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి నల్లగొండ/సాక్షి మహబూబాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగగా, అందులో దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సోమవారం నాటికి 4.15 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటికి పంట నష్టం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, ములుగు తదితర జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇప్పుడిప్పుడే పొలాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు అంచనాలను వేగవంతం చేశారు. ఎన్ని ఎకరాల్లో పంటలు చేతికి వస్తాయో పరిశీలిస్తున్నారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో బీమా ఇక అనుమానమే? పంట నష్టం జరిగినప్పుడు బీమా రైతులకు ధీమా ఇస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు కేంద్రం నుంచి కూ డా అనుమతి లభించింది. అనంతరం ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు. అయినా మార్గదర్శకాలు విడుదల చే యడంలోనూ... అమలు చేయడంలో వ్యవసాయశాఖ విఫల మైంది. పార్లమెంటు ఎన్నికలకంటే ముందునుంచే వ్యవసాయ డైరెక్టర్ కంపెనీలతో చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలు తావిస్తోంది. సీఎం ఆమోదం తర్వాత వెంటనే అమలు చేసినట్లయితే ఇప్పటికే బీమా అమల్లోకి వచ్చేది. ఒక కీలక ప్రజాప్రతినిధి పంటల బీమా విషయంలో అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు వానాకాలం సీజన్ ముగుస్తుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికిప్పుడు బీమాను అమలు చేసే పరిస్థితి ఉండబోదని అధికారులు అంటున్నారు. 550 ఎకరాల్లో కొట్టుకుపోయిన వరి మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రావి రాల గ్రామంలోని పెద్ద చెరువు, కోమటి చెరువు తెగిపోయాయి. వీటి కింద 420 మంది రైతులు సాగుచేసే 550 ఎకరాల వరి మొత్తం కొట్టుకుపోయింది. 200 ఎకరాలు ఇసుక, రాళ్లతో నిండిపోయాయి. ఎకరానికి రూ.50 వేల నష్టం జరిగిందనుకున్నా, ఈ ఒక్క గ్రామంలోనే రూ.2.75 కోట్ల పంటనష్టంతో పాటు పొలం మరమ్మతు చేయాలంటే మరో రూ. కోటికి పైగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పొలం నిండా ఇసుక మేటలు నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన మైదం వెంకన్న అనే రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు, దున్నడం, నాట్లు మొదలైన ఖర్చుల కోసం లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు. భారీ వర్షం కారణంగా పడమటిగూడెంలోని గుండ్ల చెరువు తెగడంతో వరద నీరు కొమ్ముల వంచ పాత చెరువు మత్తడి తెగింది. దీంతో కింద ఉన్న వెంకన్న పొలంపై ఇసుక మేటలు కట్టా యి. పంటపోయింది. పెట్టుబడి పోయింది. రూ.2 లక్షలు ఖర్చు పెట్టి ఇసుక మేటలు తొలగిస్తే కానీ పొలం చేతికిరాదు.ఆనవాలే లేకుండా పోయిన పొలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామానికి చెందిన గుగులోతు లోక్యాకు జానకీనగర్ రోడ్డులో రెండెకరాల భూమి ఉంది. అందులో 20 రోజుల కిందట వరినాట్లు వేశారు. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించి పొలమంతా ఇసుక మేట వేసింది. పొలం ఆనవాళ్లే లేకుండా పోయింది. తిరిగి నాటు వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే అప్పు చేసి రూ.40 వేల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నాడు. -
15 లక్షల ఎకరాల్లో పంట మునక
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేని వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పత్తి పూత దశలో ఉండటం... వరి నాట్లు పూర్తయిన దశలో ఉన్న నేపథ్యంలో వరదల ప్రభావం ఆయా పంటలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. పంట మునిగిన ప్రాంతాలపై వ్యవ సాయశాఖ ఇంకా దృష్టి సారించలేదు. ఆదివారం కావడంతో అధికారులంతా సెలవుల్లో ఉండిపోయారు. దీంతో రైతులకు గ్రామాల్లో సలహాలు సూచనలు ఇచ్చే దిక్కే లేకుండా పోయింది. మరోవైపు ఏం చేయాలన్న దానిపై రాష్ట్రస్థాయిలో శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు ఇప్పించడంలో కూడా వ్యవసాయశాఖ విఫలమైంది.8 లక్షల ఎకరాల్లో పత్తికి ఎఫెక్ట్...రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 1.09 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి 47.81 లక్షల ఎకరాల్లో, పత్తి 42.66 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మొక్కజొన్న 4.88 లక్షల ఎకరాలు, కంది 4.60 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.84 లక్షలు ఎకరాల్లో సాగైంది. వర్షాల దెబ్బకు అధికంగా మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం వంటి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. పత్తి 8 లక్షల ఎకరాల్లో నీట మునిగినట్లు అంచనా వేస్తుండగా, వరి 5 లక్షల ఎకరాల్లో నీట మునిగింది. నాట్ల దశలోనే వరి ఉండటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. మిగిలిన పంటలు మరో 2లక్షల ఎకరాల్లో నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయికి వెళ్తే ఈ లెక్కలు మరింతగా ఉండొచ్చని అంటున్నారు.అందుబాటులోకి రాని పంటల బీమా...ప్రభుత్వం ఈ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలులోకి తీసుకొస్తామని హామీయిచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. పంటల బీమా అమలులోకి వస్తే రైతులకు నష్టపరిహారం అందేది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అది ఇప్పటికీ పట్టాలకెక్కలేదు. మార్గదర్శకాలు ఖరారు చేయడంలోనూ నిర్లిప్తత కొనసాగుతోంది. ఎప్పటినుంచో బీమాపై చర్చలు జరుగుతున్నా కొలిక్కి రావడంలేదు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం టమాఠా
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం టమాట సాగుకు పెట్టింది పేరు. ఏటా ఖరీఫ్‌లో 35 వేల ఎకరాలు, రబీలో 20 వేల ఎకరాలు వెరసి 55 వేల ఎకరాల్లో రైతులు టమాట పండిస్తున్నారు. ఎకరాకు సగటున 15 టన్నుల దిగుబడితో ఏటా 6.5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండించే టమాట ఎక్కువగా కోల్‌కతా, నాగ్‌పూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి అవుతోంది.వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లకు పైగా ఉన్నట్లు ఉద్యానశాఖ నివేదిక వెల్లడిస్తోంది. సాధారణ పద్ధతితో ఎకరా టమాట సాగుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతుండగా ట్రెల్లీస్ (కట్టెలు) విధానంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. కనగానపల్లి, రామగిరి, తనకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసము్ర దం, కుందుర్పి, శెట్టూరు, రాయదుర్గం, ముదిగుబ్బ, నల్లచెరువు, ఓడీ చెరువు, కదిరి, పెనుకొండ, అమడగూరు, బత్తలపల్లి, ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, గుంతకల్లు, కూడేరు, అనంతపురం, రాప్తాడు, శింగనమల ప్రాంతాల్లో సాగు అధికంగా ఉంది.మార్కెట్ మాయాజాలంఅనంతపురం నగర శివారు కక్కలపల్లి వద్ద కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, దళారులు పెద్ద ఎత్తున మండీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 70 నుంచి 80 శాతం మంది రైతులు అమ్మకాలకు ఇక్కడికే వస్తుంటారు. కిలో కనీసం రూ.10 నుంచి రూ.12 పలికితేకానీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. కూలీల ఖర్చు, రవాణా, ట్రేల బాడుగ, కమీషన్ ఖర్చులు అధికంగా ఉండటంతో టమాట రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఒక్కసారైనా మంచి ధరలు పలికితే బయట పడతామనే ఆశతో రైతన్నలు టమాట సాగునే నమ్ముకున్నారు. ఇదే అదనుగా దళారులు వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.20 వరకు విక్రయిస్తున్నా టమాటా రైతుకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం మండీకి రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల నుంచి 4,800 మెట్రిక్ టన్నుల వరకు సరుకు వస్తోంది. ‘నో సేల్’ కింద పెట్టిన టమాటాలను చేసేదేమీ లేక రైతులు పారబోసి ఉత్త చేతులతో ఇంటి దారి పడుతున్న దుస్థితి నెలకొంది. సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.330 పలికింది. చాలా వాటిని బాక్సు రూ.150 నుంచి రూ.200 లోపే కొంటున్నారు. ఇక సీ గ్రేడ్ టమాటాలు రూ.100 వరకు పలుకుతున్నాయి. ‘నో సేల్’ వాటికి కనీస ధర కూడా ఇవ్వకుండా మండీ నిర్వాహకులు, వ్యాపారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.రగిలిన రైతన్నలురాప్తాడు రూరల్: నాణ్యత సాకుతో టమాటాలు కొనుగోలు చేయకపోవటాన్ని నిరసిస్తూ రైతన్నలు సోమవారం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి మండీ వద్ద ఆందోళనకు దిగారు. సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకుని బైఠాయించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు లోడింగ్ కోసం బయటి వాహనాలు కాకుండా స్థానికంగా బాడుగకు తీసుకోవాలంటూ లారీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన యువ రైతు చిన్ని క్రిష్ణ 160 ట్రేల టమాటాను అనంతపురం శివారులోని కక్కలపల్లి మండీకి తెచ్చాడు.నాణ్యత వంకతో వేలంపాట దారులు సరుకు కొనడానికి ఇష్టపడలేదు. దీంతో ఏం చేయాలో రైతుకు పాలు పోలేదు. చాలాసేపు ఎదురుచూసి చివరకు ట్రేలను మళ్లీ వాహనంలో ఎక్కించి బయట పారబోశాడు. రిక్త హస్తంతో ఇంటికి చేరాడు. ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు నిర్వేదం వ్యక్తం చేశారు. -
పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గత నెల వడగళ్లు, అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రైతులకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే. మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్లు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. -
చేతి కర్రతోనే పొలం బాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్
Live Updates.. జనగామ జిల్లాలో కేసీఆర్ బస్సు తనిఖీ.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు తనిఖీ అనంతరం మళ్లీ బయలుదేరిన కేసీఆర్. ►జనగామ జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన కేసీఆర్ అలాగే, రైతులను పరామర్శించిన కేసీఆర్ రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో తిరుమలగిరి మండల కేంద్రం చేరుకోనున్న కేసీఆర్ అటు నుంచి అర్వపల్లి మండలం వెలుగుపల్లిలో ఎండిన పంటల పరిశీలన అనంతరం, పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్న కేసీఆర్ తిరుమలగిరి, అర్వపల్లిలో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు ►జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకున్న కేసీఆర్ ►పంట పొలాలను పరిశీలించేందుకకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ►అయితే, రాష్ట్రంలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ రైతులను కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. కేసీఆర్ పర్యటన ఇలా.. ►ఈరోజు ఉదయం 10:30 గంటలకు చేరుకుని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ►మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ రెండు గంటలకు భోజనం చేసి మూడు గంటలకు మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి 4.30కు నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు. -
ఫిరాయింపులకు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరవాలి
దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపునకు గేట్లు తెరవకుండా, అన్నదాతల పంటల రక్షణకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, కడియం శ్రీహరి హితవు పలికారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతబాయితండాలో బోర్లు ఎత్తిపోయి, సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బృందం రైతులతో మాట్లాడింది. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు శివశంకర్ అనే రైతు అప్పులు చేసి మూడు నెలల్లో 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నర్సింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేశారు. అయినా ఫలితం లేదని రైతులు వాపోయారు. హరీశ్‌రావు, ఎర్రబెల్లి, కడియం వీరి కష్టాలను ప్రస్తావిస్తూ, సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి.. రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పలకరించిన పాపానపోలేదన్నారు. గోదావరి నదిలో నీళ్లున్నా ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా నెరవేర్చలేదని, రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో తామిచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని, కౌలు రైతులను సైతం దగా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాల్వలకు పుష్కలంగా నీళ్లు ఇవ్వగా రెండు పంటలు పండించుకుని రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు, కరెంటుకు కష్టాలు ప్రారంభమయ్యాయని, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడమే కాకుండా.. వడగళ్ల వానలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. అయినా ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టడం లేదన్నారు. సత్వరమే దెబ్బతిన్న వరి పంటకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామిరెడ్డి వారి వెంట ఉన్నారు. -
పంటలెండుతున్నా పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు రుణం ఇవ్వకున్నా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ నేత మల్లికార్జున్ రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా.. కుంగిన పిల్లర్ల పేరిట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వెంటనే సమీక్షించాలని, కర్నాటక నుంచి 10 టీఎంసీల నీరు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కేఆర్ఎంబీ ఉన్నా రైతుల కోసం సాగు నీరు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు నీళ్ల మీద పరిజ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు వసూళ్లు, ముడుపుల చెల్లింపులు మొదలు పెట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు బీ టీమ్‌లా పనిచేస్తున్నాయన్నారు. ఈడీ కేసుల పేరిట ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కడం బీజేపీ పనిగా పెట్టుకుందని.. కేజ్రీవాల్, కవిత అరెస్టులే నిదర్శనమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఈదురు గాలులకు ఊయలతో సహా ఎగిరిపడి..
గజ్వేల్ రూరల్/ కౌడిపల్లి (నర్సాపూర్): రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి పక్కింటి డాబాపై పడి మృతిచెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలిన ఘటనలో ఓ టెన్త్ విద్యార్థి కన్నుమూశాడు. వడగళ్ల వాన ధాటికి సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్సింగ్, మంజుల దంపతులకు ఒక కుమా రుడు, కవలలు సీత, గీత ఉన్నారు. దంపతులు కూలిపనులకు వెళ్లగా పిల్లలు, నానమ్మ ఇంటివద్ద ఉన్నారు. మంగళవారం గాలి వాన ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీర ఉయ్యాలలో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతో పాటు ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య–రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ గజ్వేల్‌లో ఐటీఐ చదువుతుండగా, రెండో కుమారుడు వెంకటేశ్ (15) పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. రోజుమాదిరిగానే పొలం వద్ద ఉన్న పశువులను సాయంత్రం వేళ ఇంటికి తోలుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల ధాటికి రోడ్డుపక్కనున్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలు ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కురిసిన వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. పట్టణంలో అత్యధికంగా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గాలి దుమరానికి చెట్లు విరిగి ఇళ్లపై, వాహనాలపై పడి తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ఎకరాకు రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. వచ్చే రెండుమూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో అప్పటివరకు జరిగే మొత్తం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామ ని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అనుమతి తీసుకొని పరిహారం ప్రకటించొచ్చని అంటున్నారు. 50 వేల ఎకరాల్లో పంటల నష్టం అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, మొక్కజొన్న, జొన్న, పొగా కు, వేరుశనగ, మిర్చి, కూరగాయలు, బొప్పాయి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలకు నీరు లేక ఎండిపోయి దెబ్బతినటంతోపాటు ఈ వర్షాల వల్ల ఉన్న కాస్త ధాన్యం రాలిపోయింది. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ నిర్థారించింది. మిగిలిన జిల్లాల్లోనూ పంటలకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు పంపించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఎక్కడికక్కడ పంట న ష్టం అంచనాలు వేయడంపై దృష్టి సారించినట్టు అధికారులు తెలిపారు. అయితే తీవ్రమైన ఎండల వల్ల ఇటీవల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నా యి. వాటి విషయంలో మాత్రం తాము నష్టాలను అంచనా వేయడం లేదని అధికారులు తెలిపారు. ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలి: పశ్య పద్మ దెబ్బతిన్న పంటలన్నింటినీ సర్వే చేసి నష్టం అంచనా వేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని కోరారు. నష్టం జరిగిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభం, చెట్టు విరిగిపడి రైతు మరణించారని, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి తుమ్మల రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం సంభవించినట్టు తెలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు మూడు రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశముందన్నారు. రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం, మిర్చి సహా ఇతర పంటలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కల్లాల్లోగానీ, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యంగానీ దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. -
సాయం చేస్తున్నా గిట్టదా?
సాక్షి, అమరావతి: పంట నష్టం అంచనాలతో పనిలేదు.. కరువొచ్చిన మర్నాడే సాయం అంది తీరాలి! తుపాన్ తీవ్రత తగ్గక ముందే పరిహారం ఇచ్చి తీరాలి అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా ధోరణి! కరువు రావడం, తుపాన్ వల్ల భారీ వర్షాలు కురవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నట్లుగా ఉన్నాయి రామోజీ రాతలు! విపత్తుల వేళ అప్రమత్తతోపాటు రైతన్నలు నష్ట పోయిన ప్రతీ ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ గింజకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పంట నష్టం లెక్కింపులో జాప్యం లేకుండా, పరిహారం చెల్లించి ఆదుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తోంది. సంక్రాంతి లోపు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా తనకు పట్టనట్లుగా యథాప్రకారం బురదలో కూరుకుపోయి దుష్ప్రచారానికి దిగే పెద్ద మనిషిని ఏమనుకోవాలి? ఎలా లెక్కిస్తారో తెలియదా? తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) పరిగణనలోకి తీసుకుంటారు. ఇక తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించిన పంట నష్టపరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తారు. ఆదుకోలేదనడానికి మనసెలా వచ్చింది? ఖరీఫ్ 2023–24లో బెట్ట పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్ సీజన్ ప్రారంభం నుంచి 15 రోజులకోసారి అధికారులతో సమీక్షించారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా 80 శాతం రాయితీపై విత్తనం పంపిణీ చేశారు. 80 శాతం సబ్సిడీతో (రూ.26.46 కోట్ల విలువ) 30,977 క్వింటాళ్ల విత్తనాలను 1.16 లక్షల మంది రైతులకు అందజేశారు. ముందస్తు రబీలో 89 వేల మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువైన 1.23 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. కరువు సాయం కోసమే కేంద్ర బృందాలు ఖరీఫ్ 2023కి సంబంధించి ఏడు జిల్లాలలో 103 కరువు మండలాలను గుర్తించారు. 7.14 లక్షల మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కించి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించారు ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు రూ. 534 కోట్ల పెట్టుబడి రాయితీ కోరుతూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు కేంద్ర బృందం రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 6.39 లక్షల మంది రైతులు 5.33 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు లెక్క తేల్చి రూ. రూ.784.61 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ 2023లో 21, రబీ 2023 –24లో 17 పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప«థకాన్ని వర్తింప చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఖరీఫ్ 2023 నోటిఫైడ్ పంటలకు సంబంధించి 34.7 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం వర్తింప చేశారు ఈ జాబితాలను కేంద్రంతో పాటు బీమా కంపెనీలకు సైతం పంపించారు. ఉదారంగా ధాన్యం కొనుగోళ్లు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉదారంగా వ్యవహరిస్తూ తేమ శాతం నిబంధనలను సడలించి రంగుమారిన, పాడైపోయిన «6.52 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్ద నుంచే సేకరించారు. గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో సహా గత నాలుగున్నరేళ్లలో విపత్తులతో నష్టపోయిన 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ సొమ్మును అదే పంట కాలం చివరిలో బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. సాయం పెంపు కనపడదా? వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలనే సంకల్పంతో 2023 నవంబర్ 14 నుంచి పెట్టుబడి రాయితీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల వల్ల వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట వేస్తే తొలగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇచ్చే పరిస్థితి ఉండగా ఇప్పుడు రూ.17 వేలు ఇస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచగా మామిడి, నిమ్మ జాతి పంటలకు రూ.20 వేల నుంచి రూ.22,500లకు, మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలు చొప్పున పెంచి ఇస్తున్నారు. -
నిబంధనలు సడలించి న్యాయం చేస్తాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అలాగే ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వాళ్లకు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం జగన్ అన్నారు. అవసరమైతే కొన్ని నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని సూచించారాయన. ‘‘రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలి. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలి. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ అన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయి అని అన్నారాయన. ఆ సమయంలో ‘రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించారా?’ అని అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. -
Telangana: భారీ వర్షాలు, వరదల్లో 41 మంది మృతి..
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం సోమవారం నివేదిక సమర్పించింది. మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వరద నష్టాలపై ఇంకా సర్వే నడుస్తోందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు నివేదిక సమర్పించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ తెలిపారు. అయితే, ఈ నివేదికపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించాక తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. చదవండి: HYD: గుడ్‌న్యూస్.. ఐటీ కారిడార్‌కు లేడీస్ స్పెషల్ బస్సులు -
పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తరో?
సాక్షి, సిద్దిపేట : అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే కొందరికి ఈ సాయం అందగా, మరికొందరు వాటి కోసం నిరీక్షిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 52,407 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు 1,146.11 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వారికి గత పదిరోజుల కిందట చెల్లించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదు. ● మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 51,261.08 ఎకరాల్లో 55వేల మంది రైతులు నష్టపోయారు. అందులో వరి 44,601.12 ఎకరాలు, మొక్కజొన్న 475.04, ఉద్యానవన పంటలు 6,158, సన్ ఫ్లవర్ 25.27, నువ్వులు 1.05 ఎకరాలు ఉన్నాయి. ● అత్యధికంగా మద్దూరులో 8,993, చేర్యాలలో 7,630 ఎకరాలు, సిద్దిపేట అర్బన్ 5,674, రూరల్‌లో 5,681, దుబ్బాకలో 4,968 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. అత్యల్పంగా దౌల్తాబాద్‌లో 50.28 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. ● జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యవసాయ, ఉద్యాన వన, రెవెన్యూ శాఖలు మండల, జిల్లా స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ● ప్రభుత్వానికి మే రెండో వారంలో కలెక్టర్ ఆమోదంతో వ్యవసాయ శాఖ నుంచి నివేదికను పంపించారు. ఇప్పటి వరకు మొదటి విడత పంపించిన పంట నష్టపరిహారం మాత్రమే రైతులకు అందింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ● యాసంగిలో అకాల వర్షాలకు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికై న అధికారులు స్పందించి నష్టపరిహారం త్వరగా అందించాలని కోరుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అన్నోజు కనకాచారి, మద్దూరు మండలం లద్నూరు గ్రామం. ఇతనికున్న 8 ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాడు. మార్చి ఏప్రిల్ నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి పంట పూర్తిగా నేలపాలైంది. దీంతో రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. వ్యవసాయ అధికారులు పంట నష్ట వివరాలను సేకరించారు. కానీ ఇంతవరకు పరిహారం అందలేదు. వానాకాలం పెట్టుబడికైనా అందుతుందని ఆశగా రైతు ఎదురు చూస్తున్నాడు. ఇది ఒక్క కనకాచారి ఎదుర్కొంటున్న సమస్య కాదు, జిల్లాలోని అనేక మంది రైతులది ఇదే పరిస్థితి. 12 ఎకరాల్లో నష్టం యాసంగిలో 12 ఎకరాల్లో వరి సాగు చేశాను. పంట చేతికి వచ్చిన సమయంలో వడగళ్ల వాన పడి వడ్లు మొత్తం రాలిపోయాయి. ప్రభుత్వం చేస్తామన్న సాయం ఇప్పటివరకు అందలేదు. త్వరగా అందిస్తే వానాకాలం పెట్టుబడికి అయినా ఉపయోగపడుతుంది. –ఉల్లంపల్లి సాయిలు, అయినాపూర్ నష్టపరిహారం వెంటనే అందించాలి నాకున్న పొలంతో సహా 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశాను. కోతకొచ్చే సమయంలో వడగళ్ల వాన పడి పంట పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం త్వరగా అందించి ఆదుకోవాలి. –గిరక శ్రీనివాస్, తాడూరు -
కొర్రీలు పెట్టొద్దు.. ఉదారంగా ఉండండి
సాక్షి, అమరావతి: అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్న సన్న, చిన్నకారు రైతులను ఆదుకునే విషయంలో ఉదారంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తయారుచేయడంలోగానీ, పరిహారం అందించడంలోగానీ ఎలాంటి కొర్రీలు వేయకుండా ఆదుకోవాలన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో గురువారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే, రబీ పంటలు చేతికొచ్చే వేళ ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని, ఇలాంటి సందర్భంలో వారికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా చూడాలన్నారు. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం సేకరణలో కూడా రైతులకు అండగా నిలవాలని కాకాణి అన్నారు. పక్కాగా ఖరీఫ్ కార్యాచరణ.. ఇక పంట నష్టం అంచనా కోసం ఏర్పాటుచేసిన ఎన్యూమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చెయ్యాలన్నారు. ఖరీఫ్ సీజన్లో 6.18 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ కోసం తయారుచేసిన యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలని మంత్రి సూచించారు. డిమాండ్ మేరకు ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సిద్ధంచేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్æ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర
తణుకు టౌన్: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల కోసమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టింది రైతు పోరుబాట కాదని.. అది రైతు పాడు యాత్రగా మిగిలిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం రాత్రి రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసినట్టు తెలిపారు. దీనివల్ల జిల్లాలో సాగు చేసిన బొండాలు రకం ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసి రైతులకు లాభం కలిగిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు ఐరన్ లెగ్ నాయకుడని, ఆయన వెళ్లిన ప్రతిచోట వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు మరింత నష్టపోతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామంలోకి చేరగానే భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు 10 విద్యుత్ స్తంభాలు కూలిపోయి, రైతులకు మరింత నష్టం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిణామాలతో చంద్రబాబు చేపట్టిన యాత్ర రైతు పాడు యాత్రగా మారి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సంచుల కొరత లేదు ధాన్యం కొనుగోలుకు గోనె సంచుల కొరత లేదని, బియ్యానికి ఉపయోగించే సంచులను కూడా ధాన్యం రైతులకు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించిన 36 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని, 46 మంది అధికారులపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. ధాన్యం రైతులకు బుధవారం ఒక్కరోజే రూ.470 కోట్ల మొత్తం ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్టు చెప్పారు. రైతులు కాపకాయల అయ్యప్పస్వామి, కడియం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతం కంటే ఈ సంవత్సరం ధాన్యం సొమ్ము నాలుగు రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో పడినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రం సేవలు చాలా బాగున్నాయని, ఎప్పటికప్పుడు ధాన్యానికి సంబంధించిన వివరాలు, సమాచారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులను మంత్రి కారుమూరి సత్కరించారు. -
ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏ రైతూ మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి అనుమతిచ్చాం. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్‌లను ఆయా జిల్లాలకు తరలించాలి. రైతులు మిల్లులను సందర్శించడం, మిల్లర్లను కలవడం వల్ల రైతులపై అనవసరమైన ఒత్తిళ్లు తీసుకొస్తారు. ఇది ప్రతికూల సందేశానికి దారితీస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎఫ్‌టీవో జనరేట్ అవుతుంది. చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్ దగ్గరకు వెళ్లనవసరం లేదు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి. ఆఫ్‌లైన్ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్లైన్లో మార్చుకోవాలి. విరిగిన నూక శాతాన్ని అంచనా వేసేందుకు మినీ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఆర్బీకేల ద్వారా నూక శాతాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయొచ్చు. అధిక తేమ, విరిగిన, పగుళ్లు, పలువలు మారడం, మొలకెత్తడం వంటి కారణాలతో కొనుగోళ్లను తిరస్కరించడం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి. వరి విస్తీర్ణం ఎక్కువగా ఉండి.. మిల్లింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్న ఎన్టీఆర్, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆధునిక రైసు మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలి. కాగా ఆదివారం నాటికి కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 6.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే కొనుగోలు సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. కానీ, వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆఫ్‌లైన్‌లో కొనుగోలుకు చర్యలు చేపట్టింది. వాటిని సమీపంలోని మిల్లులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రైతులు వాటిని ఆరబెట్టుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవద్దంటూ ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం సేకరణ పద్ధతి ఇలా.. దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సాధారణంగా తొలుత ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు ఆర్బీకేలోని ధాన్యం సేకరణ సిబ్బంది (వీఏఏ)ను సంప్రదిస్తారు. సదరు అధికారి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ధాన్యం శాంపిళ్లను తీసుకుని ఆర్బీకేలోని ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం.. ధాన్యం ఉన్నది, లేనిది నిర్ధారించి.. తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టేందుకు సూచిస్తారు. ధాన్యం శాంపిళ్లు నిబంధనల ప్రకారం ఉంటే.. రైతుకు ధాన్యం ఎప్పుడు తరలించేది షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ మెసేజ్ రూపంలో రైతు మొబైల్‌కు సమాచారం పంపిస్తారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని వాహనంలో లోడింగ్ చేస్తారు. తర్వాత తూకం వేసి ట్రాక్ షీట్ జనరేట్ చేస్తారు. అప్పుడు మాత్రమే సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళ్లేది తెలుస్తుంది. ధాన్యం లోడింగ్‌లో రైతు సొంతంగా హమాలీలను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని తరలిస్తే ప్రభుత్వం ఆర్బీకే, మిల్లు మధ్య దూరాన్ని బట్టి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎక్కువగా మిల్లరు లేదా ఏజెన్సీ ఏర్పాటు చేసిన హమాలీలు, వాహనాల్లోనే సరుకును రవాణా చేస్తున్నారు. ట్రాక్ షీట్ జనరేట్ అయిన తర్వాత మిల్లుకు ధాన్యాన్ని తరలిస్తారు. ఈ క్రమంలోనే ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) వస్తుంది. అందులో రైతు విక్రయించిన ధాన్యం బరువు, దానికి చెల్లించే నగదు, హామీలు, రవాణా తదితర వివరాలు పొందుపరుస్తారు. ఒకసారి ఎఫ్‌టీవో జనరేట్ అయిన తర్వాత ఆర్బీకే సిబ్బందే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తారు. మిల్లు దగ్గర ప్రభుత్వం నియమించిన కస్టోడియన్ అధికారి ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించి.. మిల్లరు లాగిన్‌కు ఫార్వర్డ్ చేస్తారు. మిల్లరు కూడా ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించుకుంటారు. అనంతరం ఎఫ్‌టీవోలో చూపించిన ప్రకారం రైతుకి నిర్ణీత వ్యవధిలో ధాన్యం నగదు జమవుతాయి. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1967 వివరాలను ఎఫ్‌టీవో రసీదుపై ముద్రించారు. ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి అనేక జిల్లాల్లో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపులను ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలోగా చెల్లిస్తోంది. అక్కడక్కడ రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరు అనుసంధానం కాకపోవటంవల్ల నగదు జమకాకుండా పెండింగ్‌లో ఉంది. మరోవైపు.. ఈ ప్రక్రియలో హమాలీలు, రవాణా చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ అధైర్యపడకుండా ఉండాలని.. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని విక్రయించాలని.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తమకెంతో మేలు చేస్తోందని.. సకాలంలో డబ్బులు చెల్లిస్తోందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దళారీలకు అమ్ముకుని ఉంటే బాగా నష్టం జరిగేదని.. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు అమ్ముకోవడం బాగా కలిసొచ్చిందని వారంటున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ►శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 4,460 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జిల్లాలో తెగుళ్లు తగ్గుముఖం పట్టి అధిక దిగుబడులు, అధిక ధరలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ►బాపట్ల జిల్లాలో ఏప్రిల్ 10 నుంచి రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో 2,244 మంది రైతుల నుంచి 13,516 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ►ప్రకాశం జిల్లాలోనూ ఏప్రిల్‌లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొత్తం 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 3 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో తడిసిన ధాన్యం ఎక్కడాలేదు. వర్షం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గోనె సంచులను ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే అవసరమైనన్ని అందుబాటులో ఉంచారు. ►తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నాటికి 24,766 మంది రైతుల నుండి 1,69,370 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణకు కూపన్లు విడుదల చేశారు. సోమవారం ఆన్లైన్లో 2,579.200 మెట్రిక్ టన్నులు, ఆఫ్‌లైన్‌లో 2,620.748 మెట్రిక్ టన్నులు మొత్తంగా చూస్తే 14,733 మంది రైతులు నుండి 1,33,302.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ►పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్లో ఇప్పటివరకు 33,929 మంది రైతుల నుంచి 3.20 లక్షల టన్నులను కొనుగోలు చేశారు. ►ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 12,581 మంది రైతుల నుంచి రూ.297 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ►కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 19,020 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ►అనకాపల్లి జిల్లాలో ధాన్యం సేకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 39 ఆర్బీకేల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు సిద్ధంచేశారు. ఇందుకు ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించింది. రానున్న రోజుల్లో వర్షాలుపడే అవకాశం ఉన్నందున పంట నష్టం కలుగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి జె. నివాస్ ఆదేశించారు. ప్రభుత్వం చొరవతో 40 క్వింటాళ్లు అమ్ముకున్నా ప్రభుత్వం చొరవ తీసుకుని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టడం శుభపరిణామం. నిజానికి.. మొక్కజొన్నకు ధరలు తగ్గిపోయాయి. మద్దతు ధర రూ.1,962 ఉండగా.. దళారీలు క్వింటా కేవలం రూ.1,500–1,600 ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలూ ఏర్పాటుచేయడంతో సోమవారం 40 క్వింటాళ్లు అమ్ముకున్నా. దళారీలకు అమ్ముకుని ఉంటే దాదాపు రూ.15వేల వరకు నష్టం జరిగేది. మద్దతు ధరతో అమ్ముకోవడం బాగా కలిసొచ్చింది. – సంగ నాగశేఖర్, ముతలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయి నేను సుమారు ఐదెకరాలు సాగుచేస్తున్నా. దాళ్వా వరి సాగుకు సంబంధించి ఇప్పటివరకు మాసూళ్లు చేసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సకాలంలోనే డబ్బులు కూడా అందాయి. వాతావరణంలో మార్పులవల్ల కొంత పంట మాసూళ్లు ఆలస్యమైంది. ఇప్పుడు మిగిలిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గిట్టుబాటు ధర ఉండడం సంతోషం. – బొక్కా రాంబాబు, రైతు, కొండేపూడి, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడూ లేని విధంగా బస్తాకు రూ.1,530 ఇచ్చారు ఎన్నడూ, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం ధాన్యం డబ్బు అందించింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 ఇచ్చింది. గతంలో దళారులు కమీషన్ తీసుకునేవారు. డబ్బులకు రెండునెలలు పట్టేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నేరుగా మా ఖాతాలో డబ్బు జమచేసింది. సంచులు కూడా సకాలంలో ఇచ్చింది. ధాన్యం రవాణాకూ లారీని ఏర్పాటుచేస్తున్నారు. – పొన్నాడ రాఘవరావు, రైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా ఆదాయం బాగుంది.. సంతోషంగా ఉంది నేను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడపల్లి గ్రామంలో సొంత పొలంలో వరి సాగుచేశాను. మొత్తం 30 పుట్ల దిగుబడి వచ్చింది. ఈ ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా విక్రయించా. ఆదాయం బాగుంది. సంతోషంగా ఉంది. – కొండారెడ్డి, రైతు, మడపల్లి, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా రైతులకు సహకరించాం మడపల్లిలో సుమారు 560 ఎకరాల్లో వరిని సాగుచేశారు. పంటను కాపాడేందుకు రైతులకు సూచనలు, సలహాలిచ్చాం. ఏ సమయంలో పంటను కోయాలో వివరించాం. చివరలో ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా సేకరిస్తున్నాం. – ఎ. మమత, మడపల్లి, వీఏఏ, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా వారం రోజుల్లో డబ్బులు జమయ్యాయి బాపట్ల జిల్లా చినగంజాం మండలం, చింతగుంపల్లి గ్రామానికి చెందిన నేను 110 క్వింటాళ్ళ ధాన్యాన్ని ఏప్రిల్ 25న మా గ్రామంలోని ఆర్బీకే ద్వారా రైస్‌మిల్లుకు తోలాను. క్వింటాకు రూ.2,060 చొప్పున రూ.2,26,600 నగదు ఈనెల 4న నా అకౌంట్‌కు జమచేశారు. గతంలో దళారులు మా వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి వారి చుట్టూ తిప్పుకునే వాళ్లు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సకాలంలో నగదు జమచేయటం చాలా సంతోషంగా ఉంది. – కరణం శ్రీనివాసరావు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా -
మక్కకు ‘రంగు’దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు రంగు దెబ్బ పడింది. తడిసిపోయి రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయబోమంటూ మార్క్‌ఫెడ్ చేతులెత్తేసింది. దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్న కొంటే తమకు నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవలి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. అదే తరహాలో మొక్కజొన్నను కూడా కొనాలని కోరుతున్నారు. తడిసి రంగుమారిన మక్కలను మార్క్‌ఫెడ్ కొనకపోవడంతో.. వ్యాపారులు అతి తక్కువ ధర ఇస్తున్నారని, తాము నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. తడిసిన 4 లక్షల టన్నులు రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉండటంతో ఈసారి యాసంగిలో సాగు పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో 6.84 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తంగా 17.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గత నెలన్నర రోజుల్లో పలుమార్లు కురిసిన వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేకచోట్ల గింజలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న తడిసి రంగు మారింది. గింజలు ముడుచుకుపోయాయి. మొత్తంగా 4 లక్షల టన్నుల మేర మొక్కజొన్న రంగు కోల్పోవడమో, గింజ పురుగు పట్టడమో, ముడుచుకుపోవడమో జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. మెల్లగా ధర తగ్గించేసి.. మొదట్లో నాణ్యమైన పంటకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువే ధర పలికింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,962 కాగా.. వ్యాపారులు రూ.2,500 వరకు ధర పెట్టారు. కానీ తర్వాత క్రమంగా రూ.1,650కు ధర తగ్గించారు. వర్షాలకు తడిసి, రంగుమారిన మొక్కజొన్నకు కనీసం రూ.1,200 వరకు కూడా ధరపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా 400 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, 8.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొని వారం రోజులు దాటినా ఇప్పటివరకు 77 కేంద్రాలే ప్రారంభించారు. అయితే రంగుమారిన, దెబ్బతిన్న మొక్కజొన్నను ఏమాత్రం కొనుగోలు చేసేది అధికారులు చెప్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరిలా మక్కనూ కొనాలి.. అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో రంగు మారిన వడ్లకు కొనుగోలు సమస్య తలెత్తడం లేదు. కానీ మొక్కజొన్న విషయంలో మార్క్‌ఫెడ్ కొర్రీలు పెడుతోందని.. తమ కష్టం దళారుల పాలవుతోందని రైతులు అంటున్నారు. వ్యాపారులు అడ్డగోలు తక్కువ ధర ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. వరి తరహాలో మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ నిబంధనలివీ.. తేమ 14 శాతం మించకూడదు దెబ్బతిన్న గింజలు 1.5 శాతం మించకూడదు రంగుపోయినవి, దెబ్బతిన్నవి 3 శాతం మించకూడదు పురుగు పట్టిన గింజలు 1 శాతం మించకూడదు ఇతర పంట గింజలు 2 శాతం మించకూడదు ఇతర పదార్థాలు 1 శాతం మించకూడదు రంగు మారితే కొనలేం వర్షాలకు దెబ్బతిన్న, రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం సాధ్యంకాదు. నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉంటేనే కొనుగోలు చేస్తాం. ఆ పరిధిని దాటి కొనుగోలు చేయడం కుదరదు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు నడుచుకుంటాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అవసరమైన చోట్ల ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తుంది. – యాదిరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ వానలు పడుతున్నాయని కొనడం లేదు ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొన్నటివరకు మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. వానలు మొదలవడంతో కొనుగోలు చేయడం లేదని చెప్తున్నారు. – నారెండ్ల రవీందర్‌రెడ్డి, దూలూరు, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. మా ఊరు నుంచి కేంద్రానికి తీసుకువచ్చినా వర్షాల కారణంగా తేమశాతం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యమంటూ, నిబంధనల ప్రకారం లేదంటూ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. – సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నం ఐదెకరాలు కౌలు తీసుకుని మక్క పంట సాగు చేశాను. ప్రభుత్వ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు. అకాల వర్షాలకు మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నాం. – చిద్రపు లక్ష్మన్న, కౌలు రైతు, ఖాజపుర్, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొంటాం..! అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్నను కొనడం సాధ్యం కాదని.. అలా కొనుగోలు చేస్తే తమకు నష్టం వస్తుందని మార్క్‌ఫెడ్ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఆ మొక్కజొన్న దేనికీ పనికి రాదని, ఒకవేళ కొని నిల్వ చేసినా ఫంగస్ వస్తుందని అంటున్నాయి. అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటామని చెప్తున్నాయి. -
పంట నష్టం సర్వే గడువు పెంపు.. 33 శాతం నష్టం జరిగితేనే పరిగణలోకి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వర్షాలు నిత్యం పడుతుండటం, రోజురోజుకూ పంట నష్టం పెరుగుతున్న నేపథ్యంలో దెబ్బతిన్న పంటల సర్వే గడువును రాష్ట్ర వ్యవసాయ శాఖ పొడిగించింది. ఈ నెల ఒకటో తేదీ వరకే సర్వే నివేదిక పంపించాలని తొలుత వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో వడగళ్లు, మరిన్ని అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంట నష్టం సర్వే గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించారు. ఏఈవోలు పంటల వారీగా, సర్వే నంబర్లు, క్లస్టర్ల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసి ఈనెల 12 వరకు ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయాలని కమిషనర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీచేశారు. సమాచారం మొత్తం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మండలాలు, డివిజన్లు, జిల్లాలవారీగా పంట నష్టం వివరాలను పరిశీలించి మొత్తంగా జరిగిన నష్టం వివరాలను తేల్చనున్నారు. 33 శాతం నష్టం జరిగితేనే నమోదు.. పంట నష్టం వివరాలను 32 అంశాలతో ఏఈవోలు సేకరిస్తున్నారు. సంబంధిత క్లస్టర్లో నష్టపోయిన రైతుల పేర్లు, సర్వే నంబర్లు, సాగుచేసిన పంటల వివరాలు, బాధిత రైతుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పంట నష్టంపై అంచనాకు గతంలో చేసిన క్రాప్ బుకింగ్ పోర్టల్ లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏ రైతు, ఏ సర్వే నంబరులో ఏ పంట వేశారనే వివరాలు క్రాప్ బుకింగ్‌లో నమోదై ఉంటేనే నష్టపరిహారం జాబితాలో రాస్తున్నారు. అలాగే 33 శాతానికి మించి పంట నష్టం జరిగితేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ హామీనిచ్చారు. అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై చైర్మన్ బుధవారం పౌరసరఫరాల భవన్లో అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిచిన ధాన్యం, గన్నీ సంచులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు 1967, 180042 500333 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని సూచించారు. -
జగన్ ప్రభుత్వంపై కక్ష కట్టిన ఈనాడు
-
Telangana: వాన పడి.. కంటతడి
సాక్షి నెట్వర్క్: అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర వేగంతో వీస్తున్న ఈదురుగాలులు దాటికి చాలా చోట్ల వరి నేలకొరిగింది. వరి గింజలు రాలిపోయాయి. మరోవైపు వరి కోతలు పూర్తిచేసి.. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పాట్లు పడుతున్నారు. వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడం, మళ్లీ వానకు తడిసిపోవడం, మళ్లీ ఆరబోయాల్సి రావడంతో అరిగోస పడుతున్నారు. వరుసగా వానలతో తడిసే ఉంటుండటంతో.. చాలాచోట్ల ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. మరోవైపు మామిడి పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర, నువ్వుల పంటలకు నష్టం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులూ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కొనుగోళ్లలో ఆలస్యంతో.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యగా మారిందని.. కొనుగోళ్లు ఊపందుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూడా వర్షాలు తెరిపినివ్వడం లేదని.. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలుచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు మెలిక పెడుతున్నారు. లేకుంటే క్వింటాల్‌కు నాలుగైదు కిలోలకుపైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అకాల వర్షం మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి 19,568 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. అందులో 17 వేల ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. ఇంకా పంట నష్టం సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో 40వేల టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. టార్పాలిన్లు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో భారీగా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. అన్ని పంటలు కలిపి 1,52,577 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వరి చేన్లు నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను కొలుకోలేని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు 91,569 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 13,947 వేల ఎకరాల్లో, సంగారెడ్డిలో 5,682 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతకొచ్చే దశలోని వరి నేలకొరిగింది. మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం గణనీయంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 42వేల మంది రైతులకు చెందిన 60,289 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. అందులో వరి 19,500 ఎకరాలు, నువ్వులు 4,500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 52 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,905 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 8,014 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 40వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితోపాటు మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరితోపాటు మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 15,494 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏన్కూరు, ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వరి నేలవాలింది. జిల్లాలో ఇప్పటివరకు 197 కొనుగోలు కేంద్రాలను తెరవగా.. 102 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురాగా.. వానలకు తడిసిపోతోందని వాపోతున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు 3,299 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వరితోపాటు మామిడికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాను వడగళ్ల వానలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో పంటలు చేలలోనే దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆదివారం రాత్రి కొందుర్గు మండలంలో వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. -
పంటలు అస్తవ్యస్తం.. ఊహకందని నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు... వడగళ్ల వానలు... ఈదురుగాలులు రాష్ట్ర వ్యవసాయాన్ని అతలాకుతలం చేశాయి. నెలలో రెండోసారి కురిసిన వర్షాలతో అంచనాలకు మించి నష్టం జరిగి ఉండొచ్చని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నాలుగైదు లక్షల ఎకరాలే అనుకోవడానికి వీలులేదని, ఊహకందని నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పంటలు ప్రభావితం కాగా, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పంటలు ఊడ్చుకుపోయాయి. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ ఈసారి మొదట్లోనే పూత సరిగా లేదు. కాత రాలేదు. దానికితోడు గత నెల, ఇప్పుడు కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు 75 శాతం ఉత్పత్తి పడిపోతుందని ఉద్యానశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి అంచనాకుగాను, కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులే (25 శాతమే) వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మామిడి తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు, కాత అంచనా ప్రకారం రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాయలు రాలిపోవడంతో అనేకచోట్ల రైతులు వ్యాపారులకు లీజు డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్లనైతే మామిడి కాయంతా రాలి పాడైపోయింది. కనీసం తక్కువ ధరకు కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో మామిడి కాయలు, పండ్ల ధర భారీగా పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులపైనా ప్రభావం పడనుంది. పొలాల్లోనే నేలపాలు... ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి ఇప్పటివరకు 40 శాతం వరకు కోతలు పూర్తయినట్లు అంచనా. అందులో చాలావరకు ఇంకా మార్కెట్‌కు రాకపోవడంతో తడిసిపోయింది. ఆ రకంగా రైతులకు నష్టం వాటిల్లగా, మరోవైపు ఇప్పటివరకు 60 శాతం వరకు పంట కోత దశలోనే ఉంది. అంటే 33 లక్షల ఎకరాలు ఇంకా కోత దశలోనే ఉందని అంచనా. అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పొలాల్లోనే వరి గింజలు నేల రాలాయి. కొన్నిచోట్ల ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయింది. దీంతో ఊహకందని విధంగా వరికి నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతున్నాయి. అలా నేల రాలిన గింజలు ఏమాత్రం పనికి రావని, దాంతో అనేక జిల్లాల్లో రైతులు వాటిని కోయకుండా వదిలేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా చేతికి వచ్చినా అది రంగు మారి ఉంటుంది. దాన్ని అమ్ముకోవడం కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో పంటలు కేవలం నాలుగైదు లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందన్న అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ వర్గాలు నిష్పక్షపాతంగా అంచనా వేస్తే తప్ప రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మొక్కజొన్న పంటలూ దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలులకు చాలాచోట్ల మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి. -
5 రోజులు.. 4.5 లక్షల ఎకరాల్లో నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో గత ఐదు రోజుల్లోనే ఏకంగా 4.5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంతేకాదు గత నెల రోజుల్లో రెండు సార్లు కురిసిన గాలివానలు, వడగళ్లతో మొత్తంగా 9.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా 3.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని అంచనా. మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న, పొద్దు తిరుగుడు, బొప్పాయి, నిమ్మ, ఇతర పండ్ల తోటలు, కూరగాయల పంటలకూ భారీగానే నష్టం వాటిల్లింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పంట నష్టం వాటిల్లగా.. పలు జిల్లాల్లో ఐదు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురవడం, వడగళ్ల కారణంగా ఎక్కువ నష్టం జరిగింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టం జరిగిందని.. తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని వ్యవసాయశాఖ నిర్ధారించింది. గాలివానలు ఇలా కొనసాగితే ఇంకా నష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. రైతులకు అందని పరిహారం గత నెల 17 నుంచి 22వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2.28 లక్షల ఎకరాలుగా తేలి్చంది. అందులోనూ 1.51 లక్షల ఎకరాలకు నష్టపరిహారంగా రూ.151 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము ఇంకా రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లని ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఇంతగా పంట నష్టం జరిగినా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద విపత్తు సంభవిస్తే అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలి. వారి నేతృత్వంలో బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి జిల్లా స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వాలి. రైతుల వేదనను తెలుసుకోవాలి. కానీ వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతుతోపాటు అడిషనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు ఎవరూ జిల్లాలకు వెళ్ల లేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం రైతులకు తగిన సలహాలు, సూచనలైనా ఇవ్వడం లేదని.. వానల తర్వాత పంటల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించే ప్రయత్నమూ చేయడం లేదని వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. కమిషనరేట్‌లో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎవరూ రైతులకు అందుబాటులో ఉండటం లేదని, మీడియా ద్వారా రైతులకు సమాచారం ఇవ్వడంలోనూ వైఫల్యం కనిపిస్తోందని, కనీసం ఫోన్లలోనూ అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయశాఖకు కమిషనర్, కార్యదర్శి ఒకరే కావడంతో సమస్యలు వస్తున్నాయని.. కమిషనర్ వారానికోసారి వచ్చిపోతుండటంతో రైతులు, రైతు ప్రతినిధులు కలసి విజ్ఞప్తులు చేసే పరిస్థితి లేదని విమర్శలు ఉన్నాయి. -
రైతులు ఏడుస్తుంటే.. తండ్రీ, కొడుకులు ఊరేగుతున్నారు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వదలకుండా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. కల్లాలపై అరబెట్టిన ధాన్యం వానకు కొట్టుకుపోయి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అకాల వర్షాలతో రైతన్నలు అరిగొస పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే.. అయ్యా ఔరంగాబాద్‌లో, కొడుకు ప్లీనరీల పేరుతో రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు మానవత్వం ఉందా.. బాధ్యత ఉందా.. ఇది ప్రభుత్వమేనా.. ? రైతు-యువత ఏకమై బీఆర్ఎస్ను బొందపెట్టే సమయం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే... అయ్యా ఔరంగాబాద్ లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారు. వీళ్లకు మానవత్వం ఉందా... బాధ్యత ఉందా... ఇది ప్రభుత్వమేనా... ? రైతు - యువత ఏకమై బీఆర్ఎస్ ను బొందపెట్టే సమయం… pic.twitter.com/90Bbn0hchw— Revanth Reddy (@revanth_anumula) April 26, 2023 ‘ప్రభుత్వం పార్టీ ప్లీనరీలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో సభలు పెడుతుంది. చేతికొచ్చిన పంట ఆగమైపాయే దేవుడా కేసీఆర్ కొనకపాయే ఎండకు ఎండిపాయే వానకు తడిసిపాయే చేతికొచ్చిన పంట ఆగమైపాయే ఎట్ల బతకాల్నో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటున్న రైతు.’ అంటూ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతన్న గోస పట్టని @TelanganaCMO @KTRBRS ప్రభుత్వం పార్టీ ప్లీనరీలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో సభలు పెడుతుంది. చేతికొచ్చిన పంట ఆగమైపాయే దేవుడా కేసీఆర్ కొనకపాయే ఎండకు ఎండిపాయే వానకు తడిసిపాయే చేతికొచ్చిన పంట ఆగమైపాయే ఎట్ల బతకాల్నో దేవుడా అంటూ గుండెలు భాదుకుంటున్న రైతు. pic.twitter.com/D2kmaG3P9P — Telangana Congress (@INCTelangana) April 26, 2023 మరోవైపు అకాల వర్షాలపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని రైతులకు మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు మంత్రి భరోసా. - యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి స్పష్టమైన ఆదేశం. 2/2 pic.twitter.com/gFSr3YRBra — Office of Harish Rao (@HarishRaoOffice) April 26, 2023 -
వణికిస్తున్న అకాల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వదలకుండా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. వ్యవసాయ శాఖ మాత్రం 2.28 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమింకగా అంచనా వేసి, చివరకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి సంబంధించి రైతులకు పరిహారం ప్రకటించింది. ఇలావుండగా మళ్లీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వడగండ్లతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా, ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వరి, మొక్కజొన్న.»ొబ్బర్లు, మినప పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు 95 శాతం వరకు రాలిపోయాయి. కూరగాయల పంటలకూ నష్టం వాటిల్లింది. టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి తోటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అలాగే రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. తాజా వర్షాలతో కోతకు వచ్చిన వరి గింజలోకి నీరు చేరి రంగుమారే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి... ఏటా ఎండాకాలంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. గతేడాది యాసంగి సీజన్లో కురిసిన వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్లకు దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మూడేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యేది. దానినుంచి బయటికొచ్చిన తర్వాత పంట నష్టాలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. గత నెలలో దెబ్బతిన్న పంటలకు మాత్రం ఎకరానికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కొత్త పంటల బీమా విధానాన్ని తీసుకొస్తామని వ్యవసాయ శాఖ చెబుతున్నా అది అమలుకు నోచుకోవడం లేదు. కనీసం కసరత్తు కూడా చేయడం లేదు. దీనివల్ల పంట వేసిన తర్వాత అది చేతికొచ్చే వరకు అకాల వర్షాల వల్ల నష్టం జరిగితే పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. రైతుబంధుతో ఊరట పొందుతున్న రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే మాత్రం పరిహారం అందడంలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పంటల బీమా వల్ల గతంలో రైతులు ఎంతోకొంత లాభపడ్డారని వ్యవసాయ శాఖ వర్గాలు సైతం అంగీకరిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటలకు బీమా చేయించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు, ఆ కంపెనీలను బాగు చేసేవిగా ఉన్నాయన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్ర భుత్వం వాటినుంచి బయటకు వచ్చింది. కానీ మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. -
ఉరిమేసి... కుమ్మేసి
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మంగళవారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ వాగుల్లా మారాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, పలు బస్తీలు జలమయమయ్యాయి. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వరద కాలువల్లా మారిన రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 150 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. భీకర గాలులకు హుస్సేన్‌సాగర్‌లో భాగమతి బోటు అదుపు తప్పింది. రాత్రి 9 గంటల వరకు రాంచంద్రాపురంలో 7.9 సె.మీ., గచ్చిబౌలిలో 7.7 సె.మీ., గాజులరామారంలో 6 సె.మీ. వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వడగండ్ల వాన కురిసింది. పంటలకు నష్టం వాటిల్లింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. కాగా బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉక్కపోత..కుండపోత మంగళవారం సాయంత్రం వరకు వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాతవారణంలో మార్పులతో కొంత ఉపశమనం పొందారు. వాతావరణం చల్లగా మారిన కొద్దిసేపటికే వర్షం మొదలై ఊపందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడయ్యాయి. దీంతో వాతవారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ జీహెచ్ఎంసీ హెచ్చరించింది. కాగా రాంచంద్రాపురం, గచ్చిబౌలిలో భారీ వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, చార్మినార్, ఖైరతాబాద్, పటాన్చెరు, మల్కాజిగిరి, అల్వాల్, నేరేడ్మేట్, ముసాపేట, ఈసీఐఎల్, బాలనగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఉప్పల్ పరిధిలో, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కీసరలో ఈదురుగాలులతో రహదారుల వెంట ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఎస్పీఆర్ హిల్స్‌లోని ఒక దేవాలయంలో గల మహావృక్షం నేలకూలడంతో చుట్టు పక్కల ఇళ్ల గోడలు కూలాయి. దీంతో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్‌పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట్‌లలో ప్రధాన రహదారులు వాగుల్ని తలపించాయి. అదుపు తప్పిన భాగమతి లుంబినీ పార్క్ నుంచి సందర్శకులను ఎక్కించుకుని హుస్సేన్‌సాగర్‌లో విహారానికి బయలుదేరిన భాగమతి బోటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. బోట్స్ క్లబ్ వైపునకు వెళ్లింది. బోటులోని సిబ్బంది సమాచారంతో స్పీడ్ బోట్లలో వచ్చిన ఇతర సిబ్బంది భాగమతి వద్దకు చేరుకుని తాళ్ల సాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భాగమతిలో ఒకేసారి 150 మంది వరకు ప్రయాణించవచ్చు. పలు జిల్లాల్లో వానలు..పంటలకు నష్టం మంగళవారం ఆదిలాబాద్, జనగామ, నల్లగొండ, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్యాలలో 8 సె.మీ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో 7 సెం.మీ, గంగాధరలో 5 సె.మీ, జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో 5 సె.మీ వర్షపాతం నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలైన వడగళ్ల వాన సుమారు 45 నిమిషాల పాటు ఏకధాటిగా కురిసింది. పలు మండలాల్లో జొన్న, నువ్వులు, వేరుశనగ, కూరగాయల పంటలు నేలకొరిగాయి. నిర్మల్ జిల్లాలో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. సారంగపూర్ మండలంలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. భైంసాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయానికి తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. నిజామాబాద్ మార్కెట్లో విక్రయించడానికి రైతులు తీసుకొచ్చిన పసుపు రాశులు తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి బచ్చన్నపేట, జనగామ, నర్మెట, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండల పరిధిలోని 25 గ్రామాల్లో 3,757 మంది రైతులకు చెందిన వరి, మామిడి, కూరగాయల పంటలకు (10,169 ఎకరాల్లో) నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. నలుగురి మృతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం నలుగురు మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన నీల పద్మ (38) చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మంగళవారం రామాయంపేటలో పండ్లు అమ్ముకొని, మరొక వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈదురుగాలులు వీయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన అంద్యాల పద్మ (45)పై ఇంటి రేకులు పడడంతో అక్కడికక్కడే మరణించింది. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కనపర్తి విజయ్‌కుమార్ (38) పిడుగుపాటుకు గురై మరణించాడు. విజయ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో కూలీకి వెళ్లేవాడు. మంగళవారం సమీప బంధువు మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగివస్తుండగా వైరా నది సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూరా గ్రామానికి చెందిన పాతకుంట మోహన్ (21) కూడా మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. నేడు రేపూ వడగళ్ల వాన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు కురవచ్చని హెచ్చరించింది. దక్షిణ /ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ వైపు దిగువస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40ని డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, కొన్నిచోట్ల 35ని డిగ్రీల కన్నా తక్కువగా కూడా నమోదు కావొచ్చునని తెలిపింది. -
50 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది. రోడ్డెక్కిన రైతులు వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు. -
ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
-
కొట్టుకుపోయిన వడ్లు.. దెబ్బతిన్న పంటలు
నల్లగొండ/జగిత్యాలఅగ్రికల్చర్/డొంకేశ్వర్ (ఆర్మూర్): ఈదురుగాలులు.. అకాల వర్షంతో శుక్రవారం రాత్రి పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మార్కెట్‌యార్డులు, ఐకేపీ కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఇంకొన్ని కేంద్రాల్లో వర్షపు నీటితో పాటే వడ్లు కొట్టుకుపోయాయి. వర్షం తగ్గిన తరువాత చీకట్లోనే రైతులు ధాన్యాన్ని కాపాడుకునే యత్నాలు చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 23,560 ఎకరాల్లో మామిడి, వందల ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన పసుపు కుప్పలు తడిసిపోయాయి. -
ఖమ్మంలో కేసీఆర్.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు..
సాక్షి, ఖమ్మం: సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించారు. బోనకల్ మండలంలోని రామపురంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతంర సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు నిరాశకు గురికావొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సమావేశంలో ప్రసింగిస్తూ.. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోందని కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయానికి లాభం చేకూర్చే పాలసీలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నట్లు విమర్శలు గుప్పించారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా రూపాయి కూడా రాదన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని స్పష్టం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు నిరాశకు గురికావద్దని సూచించారు. 'కేంద్రానికి రాజకీయాలు తప్పితే రైతుల మీద ప్రేమ లేదు. కేంద్రానికి ఏం చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపవలసిన అవసరం లేదు. గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు పంపాల్సిన అవసరమే లేదు.' అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. అనంతరం రామపురం నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట బయల్దేరారు సీఎం. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులకు భరోసా కల్పిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తారు. ఆ తర్వాత రెడ్డికుంట నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం వెళ్లి పంటల నష్టం వివరాలు తెలుకుంటారు. రైతులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు. కాగా.. ఇటీవల కురిసిన వడగంట్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. చదవండి: నడుచుకుంటూ సిట్ ఆఫీస్‌కు రేవంత్.. తీవ్ర ఉద్రిక్తత -
Hyderabad: ఎండల్లో వానలు.. ఏందిరా ఈ బాధలు!
సాక్షి, హైదరాబాద్: మార్చి నెలలో అకాల వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. వేసవిలో ఊహించని విధంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపోతున్నాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవున్నారు. శివారు ప్రాంతాల్లో వడగళ్లు పడటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటల అపార నష్టం వాటిల్లుతోంది. అల్పపీడంతో ఏర్పడిన ద్రోణి ఆదివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుండటంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు రోజులు నుంచి వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ద్రోణుల ప్రభావంతో వేసవిలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్చి నెలలో సాధారణ వర్షపాతం కంటే పదింతలు అధికంగా నమోదు కావడం గమనార్హం. -
వదలని వర్షాలు.. బెంబేలెత్తిస్తున్న వడగళ్లు, ఈదురుగాలులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: రాష్ట్రంలో ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో అనేకచోట్ల శనివారం అర్ధరాత్రి, ఆదివారం కూడా వానలు దంచికొట్టాయి. వర్షాలకు తోడు వడగళ్లు, ఈదురుగాలులు, పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావం నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 53 మండలాల్లోని 188 గ్రామాలపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించారు. పల్నాడులో ఇద్దరు, నంద్యాల, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురంలో 81.2 మిల్లీమీటర్లు, సఖినేటిపల్లి మండలంలో 79.4, రాజోలు 64.4, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామిడి, జీడిమామిడితో పాటు ఇతర వాణిజ్య పంటలకు, చెరకు, మొక్కజొన్న పంటలకు ఈ వర్షం మేలు చేసింది. నర్సరీ రైతులకూ ఈ వర్షం ఊరటనిచ్చింది. కోనసీమలో వరి రైతులకు వర్షం చేసిన మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా శివారు పొలాల్లో రబీ నీటి ఎద్దడి సమస్య తీరేలా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఆదివారం ఉదయం 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డతీగల మండలంలో వంతెన కొట్టుకుపోయింది. ► తిరుపతి జిల్లా వ్యాప్తంగా వడగండ్లతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలోని అక్కడక్కడా ఎనిమిది చోట్ల పిడుగులు సైతం పడ్డాయి. ద్రోణి కారణంగా తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 8 మీటర్లు ముందుకు వచ్చింది. గడిచిన 20 రోజులు జిల్లాలో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎర్రగుంట గ్రామంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతినగా, పలు ఇళ్లల్లో టీవీలు కాలిపోయాయి. ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలతోపాటు పెద్దఎత్తున గాలులు వీచాయి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరించారు. ► పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది. నరసరావుపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వడగండ్లు పడడంతో జనం పరుగులు తీశారు. మాచర్ల, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసింది. ► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆదివారం జల్లులు కురిశాయి. శ్రీకాకుళంలోని భద్రమ్మ తల్లి ఆలయంపై పిడుగు పడింది. తూపిలిపాళెం సముద్ర తీరంలో ఒడ్డుకు చేరిన వేట సామగ్రి నేడు కూడా వర్షాలు.. రేపటి నుంచి తగ్గుముఖం ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. ఆందోళన వద్దు.. ఆదుకుంటాం : మంత్రి కాకాణి రాష్ట్రంలో అకాల వర్షాలవల్ల నష్ట్టపోయే ప్రతీ రైతును అన్ని విధాలా ఆదుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వారం రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పంటనష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని, సీజన్ ముగియకుండానే ఈ పరిహారం జమచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆదివారం రాత్రి మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. -
అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి: అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సూచించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కాగా, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపారు. చదవండి: భారీ వర్షాలు.. పిడుగులు -
వడగళ్లు.. ఈదురుగాలులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం సైతం అకాల వర్షాలు కురిశాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం వందనం గ్రామంలో వర్షానికి తెగిపడిన కరెంటు తీగలు తగిలి వృద్ధ దంపతులు మృతిచెందగా పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నేలరాలిన పంటలు.. జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల, జనగామ, భూపాలపల్లి జిల్లా గణపురం, మొగుళ్లపల్లి, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, తొర్రూరు మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి వరి పైరు నేలకొరగగా, మామిడి, ఇతర తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం మంచినీళ్లబావిలో నిమ్మతోటలు వేర్లతో సహా కూలిపోయాయి. సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌లో వరిపైరు నెలకొరిగింది. తిరుమలగిరి మండలంలో కురిసిన వడగళ్లకు పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గద్వాల జిల్లా గట్టు, ధరూర్ మండలంలో వడగండ్ల వానకు వందల ఎకరాల్లో పొగాకు, మామిడి, ఆముదం పంటలు నాశనమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్, కోస్గి మండలంలో మునగ, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు పాన్‌గల్, చిన్నంబావి, ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, రేవల్లి మండలాల్లో కురిసిన గాలివానకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దాదాపు 365 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దంపతుల మృతి ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన దంపతులు బానోతు రాములు (65), రంగమ్మ (62) ప్రతిరోజు మాదిరిగానే మేకలను మేపేందుకు శనివారం ఉదయం పొలాలకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కొదుమూరు గ్రామానికి చెందిన రైతు తాళ్లూరి వెంగళరావు సుబాబుల్ తోటలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాటిపై రాములు, రంగమ్మ కా లుపెట్టడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. 4 మేకలు కూడా మృతిచెందాయి. గ్రేటర్లో దంచికొట్టిన వాన.. భాగ్యనగరంలో శనివారం సాయంత్రం సుమా రు అరగంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫి క్ స్తంభించింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా పంజగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, సైదాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్‌లను భారీ వర్షం ముంచెత్తింది. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కుషాయిగూడ, టోలిచౌకీ, బేగంపేట, సికింద్రాబాద్‌ల పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యధికంగా గాజులరామా రంలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురవగా జీడి మెట్లలో 4.2, రామచంద్రాపురంలో 4.0, చర్లపల్లిలో 3.6 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. నేడు అక్కడక్కడా తేలికపాటి వానలు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదు గా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో శనివారం అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
రైతుల ఆశలకు ‘గండి’.. సాగర్ ఎడమకాల్వ తెగడంతో పంటలకు తీవ్ర నష్టం
నిడమనూరు: నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టకు నల్లగొండ జిల్లా నిడమనూరు సమీపంలో బుధవారం పడిన గండి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద ఆ ప్రాంతంలోని పొలాలను ముంచెత్తింది. సమీప వరి పొలాల్లో ఇసుక మేట వేసింది. ఆధునీకరణ సమయంలో కాలువ అడుగు భాగంలో కొత్తగా నిర్మాణం చేపట్టకపోవడంతోనే కాలువకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నీళ్లు సుడి తిరగడం కారణంగానే గండి పడిందని సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మా పేర్కొన్నారు. గండి పడటంతో సుమారు 750 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిడమనూరులోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి మీదుగా వరద నీరు ప్రవహించడంతో రోడ్డు దెబ్బతిన్నది. ఈ రహదారిని ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. సాగర్ ఎడమ కాల్వ తెగడంతో ప్రభుత్వానికి రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మరో వారం పది రోజులపాటు సాగునీటి విడుదల నిలిచిపోతుండటంతో మిగతా వరి పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంలో శాశ్వత మరమ్మతులు... కాలువ కట్ట తెగిన ప్రాంతాన్ని గురువారం రాష్ట్ర అధికారులు, ప్రత్యేక ఇంజనీర్ల బృందం పరిశీలించింది. ఇందులో సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌ముఖ్‌పాండే, చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి అరవింద్‌తో పాటు సాగర్ ప్రాజెక్ట్ సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్ఈ ధర్మా, సబ్ కలెక్టర్ రాహుల్ ఉన్నారు. వారంలో శాశ్వత మరమ్మతులు చేపడతామని శ్రీకాంత్‌రావు తెలిపారు. సాయంత్రం గండి పూడ్చే పనులు ప్రారంభించారు. కాగా, ఎమ్మెల్యే నోముల భగత్ కూడా గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో జరిగిన ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపం కారణంగానే కాలువలు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. -
ప్రాణం తీసిన పంట నష్టం
సోన్/ఆదిలాబాద్ రూరల్: వర్షాలు, వరదలు మిగిల్చిన పంట నష్టం ఇద్దరు రైతుల ఉసురు తీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనల వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన మాముళ్ల గంగాసాగర్(37) తన రెండెకరాల భూమితో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇందుకోసం మూడేళ్ల క్రితం రూ.3 లక్షలు అప్పుచేశాడు. గతేడాది, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ నది ఉప్పొంగడంతో పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. గతేడాది పంటలు నష్టపోయినా అప్పులుచేసి కౌలు డబ్బులు చెల్లించిన గంగాసాగర్, ఈ ఏడాది కూడా పంటలను వరదలు తుడిచిపెట్టుకుపోవడంతో మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీరియస్‌గా ఉండటంతో అక్కడినుంచి నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య వర్షిణి, శ్రేహన్, శ్రీనిధ, శ్రీహర్ష అనే ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. పురుగుల మందు తాగి మహిళా రైతు.. ఆదిలాబాద్ రూరల్ మండలం ఎస్సీగూడకు చెందిన కాంబ్లే జైమాల (45)కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల వివాహమెంది. తమకున్న మూడెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని భర్త కాంబ్లే గౌతమ్‌తో పాటు అమె వ్యవసాయం చేస్తోంది. భూమికి పట్టా లేకపోవడంతో రైతుబంధు డబ్బులు రావట్లేదు. రూ.1.50 లక్షల వరకు అప్పుతెచ్చి పత్తి సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురై పంట పూర్తిగా దెబ్బతింది. సాగుకు చేసిన అప్పుతో పాటు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన మరో రూ.3 లక్షల అప్పు ఉంది. అది ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందిన ఆమె ఆదివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై జహీరొద్దీన్ తెలిపారు. కాగా, జైమాలకు ఇటీవల దళితబంధు కింద రూ.10 లక్షల విలువ చేసే యూనిట్ మంజూరైంది. నిధులు సైతం ఖాతాలో జమ అయ్యాయి. ఇంతలో ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. -
పంట పోయిందని ప్రాణం తీసుకున్నాడు
ముధోల్: భారీ వర్షాలకు సాగుచేసిన పంట మొత్తం పోయింది. దీంతో మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడ్బిడ్ గ్రామానికి చెందిన మంగారపు లక్ష్మణ్(38) తనకున్న రెండెకరాల్లో వానాకాలం సోయా పంట వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. గతేడాది కూడా వర్షాలకు పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాలేదు. ఆ నష్టాలను పూడ్చుకుందామని ఈ ఏడు వేసిన పంట కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీనికితోడు ప్రైవేటుగా చేసిన అప్పులు రూ.80 వేల వరకు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గం లేక లక్ష్మణ్ శుక్రవారం గ్రామ శివారులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
500 కోట్లు వర్షార్పణం.. 10 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజులకుపైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భారీ స్థాయిలో సాగు దెబ్బతింది. వేసిన విత్తనాలు కుళ్లిపోవడం, మొలకెత్తినచోట మొక్కలు కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో.. సుమారు 10 లక్షల ఎకరాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో రైతుల పెట్టుబడి కష్టం వర్షార్పణమైంది. అనధికార అంచనా ప్రకారం రైతులకు సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వానలు బాగా పడతాయని..: ఈ ఏడాది వర్షాలు బాగుంటాయన్న వాతావరణశాఖ అంచనాల మేరకు 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు కూడా జూన్ రెండో వారం నుంచే సాగు మొదలుపెట్టారు. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారమే.. ఇప్పటివరకు 53.79 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉండటంతో భారీ వర్షాలకు, వరదలకు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. మొలకస్థాయిలో ఉన్న పత్తి మునిగి దెబ్బతింది. వరినారు కొట్టుకుపోయింది. వానలు తెరిపినిచ్చినా పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మళ్లీ పంట పెట్టుబడుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వెంట భారీగా నష్టం: ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరికి భారీ వరద రావడంతో.. నదికి రెండు పక్కలా ఒకట్రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తడంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలపై ప్రభావం పడింది. ♦నిజామాబాద్ జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో సాగైన 1.89 వేల ఎకరాల్లో పావువంతు పంటలు మునిగిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 65వేల ఎకరాల్లో పంటలు సాగుకాగా 60 శాతం నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో, ములుగు జిల్లాలో 10 వేల ఎకరాలు వరద పాలయ్యాయి. వరంగల్ జిల్లాలో సాగైన 1.31 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ చిత్రంలో చెరువులా కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కౌలు రైతు చౌదరి శంకరయ్య సాగు చేస్తున్న చేను. ఆయన 12 ఎకరాలు కౌలు తీసుకుని పత్తి వేయగా ప్రాణహిత వరదలు చేనును ముంచెత్తాయి. పదెకరాల మేర పూర్తిగా నీట మునిగింది. ఎకరానికి రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టానని.. అంతా వరద పాలైందని శంకరయ్య వాపోయారు. మళ్లీ విత్తనాలు వేద్దామంటే పెట్టుబడికి సొమ్ము ఎక్కడి నుంచి తేవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం -
నల్ల తామరతో జాగ్రత్త!
మిరప పంటను నల్ల తామర పురుగులు గత ఏడాది తీవ్రంగా నష్టపరిచాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన రైతులు ఎక్కువగా పంట నష్టాన్ని చవిచూశారు. రసాయన రహిత పద్ధతుల్లో సేద్యం చేసిన రైతులు తక్కువ ఖర్చుతోనే పంటను చాలా వరకు రక్షించుకోగలిగారు. బ్లాక్ త్రిప్స్ లేదా నల్ల తామర (త్రిప్స్ పర్విస్పినస్).. కొత్త రకం పురుగు ఇది. గత ఏడాది మిరప తోటల్లో విధ్వంసం సృష్టించి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో వందలాది గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) నిపుణులతో కూడిన కమిటీ లెక్క తేల్చింది. బ్లాక్ త్రిప్స్ 2015లో తొలిసారి బెంగళూరు పరిసరాల్లో బొప్పాయి తోటల్లో మొదటిసారి ఈ కొత్త రకం తామరపురుగు ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 2018–19లో కర్ణాటకలో అనేక జాతుల అలంకరణ మొక్కలకు సోకింది. 2021లో మిర్చి పంటను తొలి సారి ఆశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తిస్‌ఘడ్ రాష్ట్రాల్లో పంటలకు నష్టం కలిగించింది. మిరపకు అత్యధికంగా దిగుబడి నష్టం కలిగించింది. మిరపతో ఆగలేదు. 2021 అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో కేంద్ర శాస్త్రవేత్తల బృందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పర్యటించినప్పుడు మిరపతోపాటు వంగ, మినుము, కంది, పుచ్చ, కీర దోస, సొర, మామిడి, పత్తి పంటల్లోనూ బ్లాక్ త్రిప్స్ కనిపించింది. ప్రపంచ మిరప సాగు విస్తీర్ణంలో 40% మన దేశంలోనే ఉంది. అత్యధిక మిరప ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కూడా మన దేశమే. హెక్టారుకు రూ.2.5 లక్షల నుంచి 4 లక్షల మేరకు రైతులు పెట్టుబడి పెట్టే వాణిజ్య పంట కావటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిరప పంటను సాగు చేసుకునే పద్ధతిని ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రం రైతులకు ఈ కింది విధంగా సూచించారు. తామర పురుగులు 1–2 ఎం.ఎం. పొడవుంటాయి. మిరప పైరును ఆశించి ఆకులు, పూత నుంచి రసం పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి. మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత రాలిపోతుంది. కాయలు గిడసబారి పొట్టిగా ఉంటాయి. దిగుబడులు పూర్తిగా తగ్గుతాయి. తామర పురుగుల బెడద తగ్గాలంటే మిరప రైతులు ఈ పద్ధతులను పాటించాలి. 1. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడొద్దు. ఘన, ద్రవ జీవామృతాలను మాత్రమే వాడాలి. ఘన జీవామృతం ఎకరాకు 1500 కిలోలు దుక్కిలో వేసి బోదెలు తోలాలి. మిరప మొక్కలు నాటే రోజు 500 కిలోల ఘన జీవామృతాన్ని మొక్కల మొదళ్ల దగ్గర వేస్తూ నాటాలి. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతంను నీటి తడులతో పారించాలి. స్ప్రే కూడా చేయాలి. 2. మిరప పంటను ఏకపంటగా సాగు చేయకూడదు. అంతర పంటలుగా.. ఉల్లి, కొత్తిమీర, ముల్లంగి వంటి పంటలను.. ప్రతి రెండు మిరప మొక్కలకు మధ్య నాటాలి. 3. మిరపలో ఎర పంట (ట్రాప్ క్రాప్)గా ఎకరానికి 200–300 బంతి మొక్కలు నాటాలి. 4. ప్రతి ఎకరాకు 25–30 నీలి రంగు జిగురు అట్టలను పొలంలో అక్కడక్కడా పెట్టాలి. 5. మిరప పొలం చుట్టూ 3 లేదా 4 వరుసల్లో మొక్కజొన్న/జొన్నను రక్షక పంటగా విత్తాలి. 6. మిరప మొక్కలు నాటిన 10వ రోజు నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: ► మొదట 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙3 రోజుల తర్వాత గంజి ద్రావణం పిచికారీ చేయాలి. ∙7 రోజుల తర్వాత కోడిగుడ్లు+నిమ్మ రసం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙15 రోజులకు పేడ+మూత్రం+ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ► 22వ రోజు వంద లీటర్ల నీటిలో 10 లీ. ద్రవ జీవామృతంతోపాటు 250 గ్రా. వర్టిసిల్లియమ్ లెకాని స్ప్రేచేయాలి. ► 30వ రోజు దశపర్ణి కషాయం స్ప్రే చేయాలి. ► 37వ రోజు మట్టి ద్రావణం స్ప్రే చేయాలి. ► 45వ రోజు నల్లేరు కషాయం స్ప్రే చేయాలి. తదుపరి అవసరాన్ని బట్టి పై షెడ్యూల్ ప్రకారం తిరిగి అదే వరుసలో మరోసారి పిచికారీ చేయాలి. ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రంను 90004 00515 నంబరులో సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Telangana: అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షం.. నగరాలు, పట్టణాల్లో కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రతిఫలం సరిగ్గా చేతికొచ్చే సమయంలో ఈదురుగాలుల వానకి మొత్తం నాశనం అయ్యింది. బుధవారం వేకువ ఝామున కురిసిన భారీ వానతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వాన ప్రభావాలతో రాష్ట్రంలోని పలు చోట్ల పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం సైతం.. టార్ఫిన్లు లేక తడిసి ముద్దయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు పెద్దగా తీసుకోలేదని తెలుస్తోంది. ఇక బుధ, గురువారాల్లో సైతం వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. చదవండి: భారీ వర్షం.. నగరం ఉలిక్కిపడిన వేళ -
అకాల వర్షంతో పంట నష్టం
ఎర్రుపాలెం: అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని నర్సింహాపురం, వెంకటాపురం, నారాయణపురం తదితర గ్రామాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన మొక్కజొన్న పంట దాదాపు 150 ఎకరాల్లో పూర్తిగా నేలరాలింది. అలాగే, మామిడితోటల్లోని పిందెలు, పూత నేలరాలాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, కాపుకొచ్చిన మామిడి పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అకాల వర్షాలతో చేతికొచ్చిన మిర్చి నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో పంట దెబ్బతింది. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నాం. పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి న్యాయం జరిగేలా చూస్తాం. అధైర్యపడొద్దు..’అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నిరంజన్‌రెడ్డి మంగళవారం హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం చేసి బతకాలో తెలుస్తలేదు ‘కౌలుకు తీసుకుని ఆరెకరాల్లో మిర్చి పంట వేసిన నేను రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన.. నా భార్య, నేను, ముగ్గురు ఆడపిల్లలు పంట మీదే ఆశలు పెట్టుకున్నం. తామర పురుగు సోకితే మందులు కొట్టినా.. పరిస్థితి చక్కబడి పంట చేతికందే సమయం లో వడగళ్లకు మొత్తం నేలరాలింది.. ఏం చేసి బతకాలో తెలుస్తలేదు..’అంటూ నడికుడ యువరైతు తోర్నె అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఐదెకరాల్లో మిర్చిపంట వేసి ధర బాగా పలుకుతుండటంతో తాహ తుకు మించి ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన. అకాల వర్షం వచ్చి మొ త్తం ఊడ్చుకెళ్లింది.. మీరు ఆదుకోకుంటే మాకు చావే శరణ్యం’అంటూ నడికుడకు చెందిన రైతు మాషబోయిన బాబు బోరుమన్నారు. అనంతరం మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కేంద్ర విధానాలు లోపభూయిష్టం దేశ పాలకుల అసంబద్ధ విధానాల వల్ల రైతులకు న్యాయం జరగడం లేదని, వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని మంత్రులు విమర్శించారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్ సర్కారేనని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతోంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని చెప్పారు. అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవమేనని, నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని తెలిపారు. రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పంటలను పరిశీలించిన అనంతరం మంత్రులు నర్సంపేటలో అధికారులతో పంట నష్టంపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. కాగా.. మంత్రుల బృందం నష్ట పరిహారంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడంపై నర్సంపేట మండలంలోని ఇప్పల్‌తండా, ఆకులతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. -
34 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇందులో మొక్కజొన్నతో పా టు వేరుశనగ, పెసలు, జొన్న, మినుములు, మిర్చి, వరి, కంది పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. వరంగల్, హనుమకొండ, మహ బూబాబాద్ జిల్లాల పరిధిలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని నివేదించింది. అత్యధికంగా మిర్చి పంట 20 వేల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇంకో 4 వేల ఎకరాలు ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమా లేక సబ్సిడీపై విత్తనాలు అందజేయడమా అనే విషయంపై సర్కారు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామని తెలిపారు. 3 రోజుల్లో .. 300 గ్రామాల్లో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారం పాటు వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొదటి మూడు రోజుల్లోనే 20 మండలాల్లోని 300 గ్రామాల్లో కోట్ల రూపాయల విలువైన పంటలకు నష్టం జరిగిందని అంచనా. ఒక్క వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే ఎక్కువ పంట నష్టం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. బీమా లేక నష్టపోయిన రైతాంగం రెండేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ బీమా పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగింది. దీంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. నష్ట పరిహారం చెల్లించాలి వారం రోజులు కురిసిన వడగండ్ల వర్షం వలన పొలాల్లో పంటలు దెబ్బతినడమే కాక, మార్కెట్‌కు వచ్చిన ధాన్యం, మిర్చి తడిచిపోయింది. కొంత ధాన్యం వరద లో కొట్టుకుపోయింది. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాం. గత సంవత్సరం 12.60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ సం వత్సరం 8.5 లక్షల ఎకరాల్లో వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తో డు ఈ నెలలో వచ్చిన అధిక వర్షాలు, రా ళ్ళ వర్షాల వల్ల రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. అయినా ఇంతవరకు ప్రభు త్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి. – సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం -
తెలంగాణలో అపారనష్టం మిగిల్చిన అకాలవర్షం
-
పంట నష్టంతో యువరైతు ఆత్మహత్య
బజార్హత్నూర్: ఇటీవల కురిసిన భారీ వర్షా ల కారణంగా పంట నష్టపోయిన ఓ రైతు పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకెలారి శశిధర్(28)కు బజార్హత్నూర్ మండలం కొలారి శివారులో మూడెకరాల పొలం ఉంది. ఈ ఏడాది మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. నాలుగు ఎకరాల్లో పత్తి, మరో ఏడు ఎకరాల్లో సోయా పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం గ్రామీణ బ్యాంకులో రూ.90 వేలు, ప్రైవేటుగా రూ.3.8 లక్షలు అప్పు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పులు తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం పొలానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం కొందరు రైతులు శశిధర్ తన చేను సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. శశిధర్‌కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆంధ్రప్రదేశ్: పంట నష్టం అంచనాలకు ప్రత్యేక ఫీచర్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే ప్రతీ రైతన్నను ఆదుకోవాలన్న సంకల్పంతో పంట నష్టం అంచనాలను పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ– క్రాప్‌తో సహా ఇతర సేవల కోసం ఇటీవల వినియోగంలోకి తెచ్చిన వైఎస్సార్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫాం (ఆర్బీ– యూడీపీ) యాప్‌లో అదనంగా విపత్తు నిర్వహణ సేవ(డిజాస్టర్) పేరిట ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ – క్రాప్‌తో అనుసంధానించిన ఈ యాప్ ద్వారా పంట నష్టం అంచనాలు రూపొందించడం ద్వారా పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత రానుంది. జాప్యం లేకుండా శరవేగంగా ‘గులాబ్’ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1,62,721 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 8,637 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాధ్యమైనంత త్వరగా తుది అంచనాలను లెక్క తేల్చి సీజన్ ముగిసేలోగా పంటలు దెబ్బతిన్న ప్రతీ రైతుకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పంట నష్టం అంచనాలను మదింపు చేస్తున్నాయి. గతంలో నిర్దేశిత ఫార్మాట్లో పంట నష్టం వివరాలను నమోదు చేసి ఫొటోలు తీసుకునే వారు. ఆ వివరాలను మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే వారు. అయితే ఈ విధానం వల్ల పంటనష్టం అంచనాలు రూపొందించడం, పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకునేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్బీ యూడీపీ యాప్‌లో ప్రత్యేకంగా తెచ్చిన డిజాస్టర్ ఫీచర్ ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం అంచనాలు పక్కాగా లెక్కతేల్చే అవకాశం ఏర్పడింది. జియో కో ఆర్డినేట్స్‌తో సహా వివరాలు నమోదు ఆర్బీ యూడీపీ యాప్‌లో డిజాస్టర్ ఐకాన్‌ను క్లిక్ చేసి పంట దెబ్బతిన్న రైతు ఆధార్ నంబర్ నమోదు చేస్తే చాలు. ఈ – క్రాప్‌తో అనుసంధానించడం వల్ల రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేశారు? తదితర వివరాలన్నీ చూడవచ్చు. అవన్నీ సరైనవిగా నిర్ధారించుకున్న తర్వాత డిజాస్టర్ బాక్స్‌లో పంట నష్టం తీవ్రతను బట్టి పూర్తిగా లేదా పాక్షికం అని పేర్కొనాలి. దెబ్బతిన్న పంట విస్తీర్ణం వివరాలతో పాటు ఎలాంటి వైపరీత్యం (వరద/ కరువు/ భూమికోత) వల్ల జరిగిందో నమోదు చేయాలి. ఆ తర్వాత నష్ట తీవ్రతను బట్టి ముంపు/నేలకొరగడం/ఇసుక మేటలు వేయడం లాంటి వివరాలను పొందుపర్చిన తర్వాత ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయగానే జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం వివరాలను ఆటోమేటిక్‌గా నమోదు చేస్తుంది. సీజన్ ముగిసేలోగా పరిహారం ‘వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లింపులో మరింత పారదర్శకత తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తెచ్చాం. ఆర్బీ యూడీపీ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ సేవ (డిజాస్టర్) ఫీచర్ ద్వారా గులాబ్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం తుది అంచనాలను ప్రత్యేక బృందాలు రూపొందిస్తున్నాయి. సీజన్ ముగిసేలోగా నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’ – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి బోగస్, బినామీలకు ఆస్కారం లేని రీతిలో.. చివరగా నష్టపోయిన రైతుతో పాటు పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఆర్బీకేలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) తమ అభిప్రాయాలను ఆడియో రికార్డ్ ద్వారా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. పంట వేయగానే పంట వివరాలను ఆర్బీ యూడీపీ యాప్ ద్వారా ఈ క్రాప్‌తో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. డిజాస్టర్ ఫీచర్‌తో వివరాలను అనుసంధానించడం వల్ల బోగస్ లేదా బినామీ పేర్లు నమోదు చేసే అవకాశం ఉండదు. అంతేకాదు దెబ్బతిన్న పంటల ఫొటోలు, వీడియోలు జియో కో ఆర్డినేట్స్‌తో సహా నమోదు చేస్తుండడం ద్వారా ఇష్టమొచ్చినట్లు నష్ట తీవ్రత నమోదు చేసే అవకాశం ఉండదు. యాప్ ద్వారా పంట నష్టం వివరాలను నమోదు చేస్తుండడం వల్ల భవిష్యత్‌లో తుపాన్లు, వరదలు లాంటి వైపరీత్యాల వేళ పంట కోల్పోయే వాస్తవ సాగుదార్లకు మాత్రమే పెట్టుబడి రాయితీ అందే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. గులాబ్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు అక్టోబర్ 15 కల్లా కొలిక్కి వస్తాయని, ఆ వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. -
నష్టపరిహారం చెల్లిస్తామని స్పీకర్ తమ్మినేని హామీ
-
‘అద్భుతం’ చేశారా?: తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సుమారుగా 5.65 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్ట పోయారని, కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. ఇప్పుడేమో ఒక్క ఎకరాలోనూ పంట నష్టపోలేదని అంటున్నారు. ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది. పంట నష్టం జరిగిందని, రూ.595 కోట్లు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి బృందం విచారణ జరిపి రూ.186 కోట్ల వరకు నష్టం జరిగిందని పేర్కొంది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధా రాలు ఉన్నా అసలు నష్టమే జరగలేదని ఎలా చెబు తారు’’అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. తొలుత నష్టం వచ్చిం దని అనుకున్నామని, తర్వాత రైతులు, అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఏజీ నివేదించారు. పంటనష్టం జరగలేదని గుర్తించినప్పుడు సాయం అవసరం లేదని కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ఏజీని ప్రశ్నించింది. విపత్తుల నిధి డబ్బు రాష్ట్రానికి ఇచ్చామని, ఈ డబ్బును వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజశ్వేరరావు చెప్పారు. రైతులే రానవసరంలేదు.. రాష్ట్రంలో భారీవర్షాలకు పంటలు నష్టపోయి ఉంటే, పరిహారం పంపిణీకి ఆదేశించాలంటూ సదరు రైతులు హైకోర్టును ఆశ్రయిస్తారన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రంలో 60.84 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇందులో పంట నష్టపోయిన రైతులంతా పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయిస్తే ఎన్ని వేల కేసులు పడతాయో ఊహించు కోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 2.35 లక్షల కేసుల విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇక కొత్తగా వేలల్లో కేసులు వచ్చిపడితే హైకోర్టు న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించాలని స్పష్టం చేసింది. రైతులందరూ కోర్టుకు రాలేరని, వారికి పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలంటూ దాఖలయ్యే ఇలాంటి ప్రజాహిత వ్యాజ్యాల్లో వచ్చే ఉత్తర్వులతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశాలత దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనమే లేదని ఏజీ నివేదించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో డబ్బు పంచారు ‘‘హైదరాబాద్‌లో గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయినవారికి దాదాపు రూ.500 కోట్లు పరిహారంగా చెల్లించారు. ఇంటికి రూ.10 వేల చొప్పున పంచారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బు పంచారు. అయితే అదే వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి మాత్రం ఎటువంటి సాయం చేయకుండా వివక్షత చూపిస్తున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించండి’’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
పంట నష్టంపై పొంతన లేని వాదన
సాక్షి, హైదరాబాద్: ‘గత ఏడాది భారీ వర్షాలు, వరదల తో రాష్ట్రంలో భారీగా పం టలు దెబ్బతిన్నాయని, సాయం చేయాలంటూ ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని అభ్యర్థించి నట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం రూ.9,400 కోట్ల నష్టం జరిగిందని, సాయం చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసినట్లుగా కథ నాలు వచ్చాయి. ఇప్పుడేమో అందుకు పూర్తి విరు ద్ధంగా భారీ వర్షాలు, వరదలతో ఎటువంటి నష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు, ఇప్పుడు చేస్తున్న వాదనకు పొంతన లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తోంది..’అని హైకోర్టు ధర్మాసనం మండిపడింది. గత ఏడాది భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆర్థిక సాయం కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను బుధ వారంలోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావును ఆదేశించింది. నీళ్లు నిలిచి వెళ్లిపోయాయ్: ఏజీ గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశాలతలు గతంలో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. గత ఏడాది వర్షాలతో రాష్ట్రంలో పంటలకు ఎటువంటి జరగలేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. పంట పొలాల్లో కొన్ని రోజులపాటు నీరు నిలిచిపోయినా వర్షాలు తగ్గిన తర్వాత నీరు వెళ్లిపోవడంతో పంటలకు ఏమీ నష్టం జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు యజమానులకేగా: ధర్మాసనం ‘రైతు బంధు వ్యవసాయ భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయేది కౌలు రైతులే. పంట భీమా ఉంటే వారికి లబ్ధి చేకూరేది..’ అని ధర్మాసనం పేర్కొంది. నష్టం జరగలేదనడం అశాస్త్రీయం ‘పొలాల్లో కొన్ని రోజులపాటు నీరు నిలిస్తే çపంటలు పూర్తిగా పాడవుతాయి. నీరు నిలిచినా పంటలకు నష్టం జరగలేదనడం అశాస్త్రీయంగా ఉంది. గతం లో సాయం చేయాలని కోరామని, అయితే నష్టం జరగలేదు కాబట్టి సాయం చేయాల్సిన అవసరం లేదంటూ సీఎం, సీఎస్ మళ్లీ కేంద్రానికి ఏమైనా లేఖ రాశారా?’ అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి బదిలీలు -
వరద ముంచేసింది.. 4 లక్షల ఎకరాల్లో పంటల మునక!
►అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు- 43,601ఎకరాలు ►వ్యవసాయ శాఖ ప్రకారం పంట నష్టం అంచనా.. 2,00,000ఎకరాలు ►రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 90.98 లక్షల (78%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 49.63 లక్షల (104.3%) ఎకరాల్లో సాగు చేయగా, 20.68 లక్షల (60.8%) ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ►అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గత వారం కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద తగ్గినా.. రైతుల కన్నీటి ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. ఉప్పొంగిన వరదలతో పంటలు దెబ్బతిని పెట్టుబడులు కోల్పోయిన రైతులు, జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ.. పొలాల్లో ఇసుక మేటలు చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంట లకు నష్టం జరిగింది. కానీ వివరాలను అధికారులు బయటకు వెల్లడించడం లేదు. ఇంకా నష్టాన్ని అం చనా వేస్తున్నామని చెబుతున్నారు. నష్టం తాము ప్రాథమికంగా వేసిన దానికంటే పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అత్యధికంగా పత్తికి నష్టం జరిగినట్లు చెబుతుండగా.. తర్వాతి స్థానంలో వరి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలు ఉన్నాయి. చాలాచోట్ల వరినాట్లు కొట్టుకుపోయాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు కలుపుకొని ఎకరానికి సగటున రూ.30 వేల చొప్పున పెట్టుబడి అవుతుందని అంచనా. కాగా.. అనధికారిక లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఎకరాల్లో పంటల మునకకు గాను రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం పాడై పోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 90.98 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఇప్పటివరకు 90.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానలు ముందే కురవడంతో జూన్ మొదటి వారంలోనే రైతులు పత్తి వంటి పంటలు వేశారు. విత్తనాలు వేసి నెల రోజులు కూడా గడవకముందే వర్షాలు బాగా పడటంతో పత్తి, మొక్కజొన్న, పెసర, కంది పంటలు మొలక దశలోనే దెబ్బతిన్నాయి. దీంతో కొన్నిచోట్ల పత్తి విత్తనాలు మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నందున ఆ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. దీంతో పత్తి సాగు గణనీయంగా పెరగ్గా.. వర్షాలకు అత్యధికంగా పత్తి పంటే దెబ్బతింది. తర్వాత వరి, మొక్కజొన్న, సోయాబీన్లకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో పత్తి చేనులో నిలిచిన వర్షపు నీరు మంచిర్యాల జిల్లాలో 6,864 ఎకరాల్లో.. మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత రైతుల పత్తి, వరి పంటలు నీట మునిగాయి. పంట నష్టంపై అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎక్కువగా పత్తి పంట నీట మునిగింది. ఈ జిల్లాలో 6,864 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. అందులో పత్తి 5 వేల ఎకరాలు, వరి 1400 ఎకరాలు, మిర్చి 284 ఎకరాలు ఉంది. మొత్తం 2,743 మంది రైతులు నష్టపోయారు. దాదాపు రూ. 3.24 కోట్లు నష్టం జరిగిందని అంచనా వేశారు. ►అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 43,601 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క పత్తి పంటే 40,795 ఎకరాల్లో దెబ్బతింది. 2,401 ఎకరాల్లో కందికి, 45 ఎకరాల్లో సోయాకు, 90 ఎకరాల్లో వరికి, 270 ఎకరాల్లో పెసరకు నష్టం వాటిల్లింది. ►ఆదిలాబాద్ జిల్లాలో 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందులో పత్తి 11 వేల ఎకరాలు కాగా సోయా 4 వేల ఎకరాలు ఉంది. జిల్లాలో కంది, ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలో 8,400 ఎకరాలలో పంట నష్టం జరిగింది. వరద నీటితో వచ్చిన ఇసుక మేటలు వేయడం వల్ల పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌లో దెబ్బతిన్న వరి, సోయా నిజామాబాద్ జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 6,205 రైతులకు సంబంధించిన 12,597 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాగా మరో 6 వేల ఎకరాల్లో కూడా పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఉద్యానపంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ►కామారెడ్డి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 2,240 మంది రైతులకు సంబంధించి 18,392 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి మరో పదివేల ఎకరాల్లో కూడా పంటలు దెబ్బతిని ఉంటాయని అంచనా. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 11,635 ఎకరాల్లో సోయా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. 4 వేల ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. 1,847 ఎకరాల్లో వరి, 837 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1,605 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి 596.3 ఎకరాలు, పత్తి 929 ఎకరాలు, మొక్కజొన్న 80 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. బ్యాక్ వాటర్‌కు పంటలు బలి పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో గోదావరి, మానేరు ఉగ్రరూపం దాల్చడంతో, సరస్వతి, పార్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో మంథిని, ముత్తరాం, అంతర్గం, రామగిరి, రామగుండం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో మొత్తం 3,374 ఎకరాల్లో 1,620 మంది రైతులకు చెందిన వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి నాట్లు నీట మునగడంతో పాటు చాలాచోట్ల మొక్కలు కొట్టుకుపోయాయి. ►ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 5 జిల్లాల్లో అధిక వర్షాలకు తెగిన కుంటలు, చెరువులతో మొత్తం 2,512 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,964 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో వరి, 428 ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లాలో అధికంగా 1,300 ఎకరాల్లో పత్తి, 428 ఎకరాల్లో కంది రైతులు నష్టపోయారు. యాదాద్రి జిల్లాలో 1,205 ఎకరాల్లో పంట దెబ్బతింది. 600 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మూడెకరాలు నీళ్ల పాలు మానేరు పక్కన నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ. 60 వేలు కూలీలకే ఖర్చయ్యి ౌది. మానేరులో నీటి ప్రవాహం ఎక్కువై నా పంట పొలం మీద నుండి నీరు పోవడంతో మూడెకరాల పంటకు నష్టం జరిగింది. అంతేకాకుండా పొలంలో ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుక మేటలు తీసి భూమి చదును చేయడానికి సుమారు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి. -నిమ్మతి రమేష్, అడవి శ్రీరాంపూర్ గ్రామం, ముత్తరాం, పెద్దపల్లి జిల్లా పొలం మొత్తం కొట్టుకుపోయింది నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తే వర్షాలతో మొత్తం పొలం కొట్టుకుపోయింది. దాదాపు రూ.75 వేల నష్టం వాటిల్లింది. మళ్లీ వరి నాట్లు వేయాలంటే నారు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మళ్లీ పెట్టుబడి పెట్టాలంటే అప్పు చేయాలి. వరితో పాటు సోయా పంటను కూడా నష్టపోయాను. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాల్సిందే. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇన్పుట్ సబ్సిడీని నిలిపివేశారు. రైతులకు రైతుబంధు కంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే మంచిది. నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి. – సాయిని సమ్మారావు... పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామం. మానేరు పక్కన ఉన్న 7 ఎకరాల 10 గుంటల భూమిలో వరి వేశాడు. ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున 1.15 లక్షల దాకా కూలీలకు ఖర్చు అయ్యింది. ఇటీవల లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం పంట పొలం మీద నుండి పారడంతో పంటకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పొలంలో ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటలు తీసి భూమి చదును చేయడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా పొలం మీద నుండి వరద పోయి పంట నష్టం జరిగింది. అప్పుడు అధికారులు వచ్చి చూశారు కానీ ఎలాంటి నష్టపరిహారం అందలేదు. తాజా పంట నష్టంతో అతను రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. -
పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి వెంటనే పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమ వారం బహిరంగ లేఖ రాశారు. విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించే సంప్రదాయం గతంలో ఉండేదని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర బృందాలతో పంట నష్టం అంచనా వేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అటకెక్కించారని, పంటల బీమా అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమైనందున బాధిత రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. -
అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం: మంత్రి సురేష్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నివర్ తుపాను నష్టంపై అధికారులతో చర్చించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో సమీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష జరిపారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు అర్ధరహితమన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. (చదవండి: అక్కడ పొగడ్తలు.. ఇక్కడ తిట్లు) జిల్లాలో ఎవరు ఊహించని విధంగా వెయ్యి రెట్లు నీటి ప్రవాహం సాగిందని.. బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి అధిక స్థాయిలో నీరు చేరుకుందన్నారు. తుపాను ప్రభావంతో మృతి చెందిన వారికి సత్వరమే రూ.5 లక్షలు అందజేశామని, నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలో 22 వేల మందికి 500 రూపాయలు అందజేశామని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం అందించడంలో ప్రభుత్వం ముందుందని, ప్రతి రైతును ఆదుకుంటామని.. అధైర్య పడొద్దన్నారు. బుడ్డ, శనగ పంట పూర్తిస్థాయిలో నీట మునిగింది. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. బుగ్గవంక సుందరీకరణకోసం ఇప్పుడు 30 కోట్లు, గతంలో ఇచ్చిన 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. బురేవీ, అర్నబ్ తుపాన్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.(చదవండి: కొమ్మాలపాటి.. అవినీతి కోటి) -
రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
తొట్టంబేడు (చిత్తూరు జిల్లా)/నాయుడుపేట టౌన్/చిల్లకూరు: నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చొప్పున వెంటనే పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పొయ్యలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా గ్రామస్తులెవరూ హాజరు కాలేదు. పంట నష్టం పరిహారాన్ని సీఎం తమకు ఖాతాల్లోనే వేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ముఖాముఖికి హాజరు కాబోమని జనసేన నేతలకు గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో జనసేన నేతలు ముచ్చివోలు నుంచి కొంతమందిని పొయ్యకు తీసుకొచ్చి గ్రామస్తులను తిట్టించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముఖాముఖికి ఎవరూ రాకపోవడంతో పవన్ రోడ్ షో మాత్రమే చేశారు. అధికార పార్టీ నేతలు.. జనసేన కార్యకర్తల జోలికొస్తే ఊరుకోనని హెచ్చరిస్తూ రెండే నిమిషాల్లో ప్రసంగం ముగించి తర్వాత నాయుడుపేటలో పర్యటించారు. కాగా, తిరుపతి నుంచి గూడూరు బయలుదేరిన పవన్.. చిల్లకూరు మండల బూదనం టోల్‌ప్లాజా వద్ద రోడ్‌షో నిర్వహించగా వెలవెల పోయింది. -
డిసెంబర్ 31 నాటికి ఇన్పుట్ సబ్సిడీ..
సాక్షి, కృష్ణా జిల్లా: నివార్ తుపాన్ కారణంగా భారీగా పంటనష్టం సంభవించిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.41 లక్షల హెక్టార్లలో 16.12లక్షల టన్నుల వరి పండుతుందని ఆశించామని తెలిపారు. నాగాయలంక, మండవల్లి మండలాల్లో వరి పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. 1.08 వేల హెక్టార్లలో పంట నష్టానికి ఎన్యూమరేషన్ మొదలుపెట్టాం. క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ 31 నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతామన్నారు. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు) పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని, వ్యవసాయాధికారులకు ఎన్యూమరేషన్ ప్రధాన బాధ్యతగా చేయాలని ఆదేశించామని తెలిపారు. మంత్రులు, స్పెషల్ ఛీప్ సెక్రెటరీలు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారని తెలిపారు. డయల్ యువర్ జేసీ రేపు(శుక్రవారం) నిర్వహిస్తామని తెలిపారు. కౌలు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1800425440 కంట్రోల్ రూమ్ నంబరు రైతుల కోసం ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి, 50 రోజుల క్యాంపైన్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు కలిసి ఈ క్యాంపైన్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 8.4 లక్షల కోవిడ్ టెస్టులు జిల్లాలో జరిగాయని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: మంత్రి పేర్నిపై దాడి.. టీడీపీ కుట్రే?) -
రైతులకు శుభవార్త: రూ. 113.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 113.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సోమవారం విడుదల చేసింది. జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు చేయనుంది. గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అందనుంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. చదవండి: తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో ఆయుధ పూజ విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయగా.. నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ సబ్సిడీ చెల్లింపులు జరపాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. అదే విధంగా వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన పంటలకు రూ. 22.59 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు. మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లించాలని మంత్రి తెలిపారు. చదవండి: గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు -
వరద నష్టం 10,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని శాఖల వారీగా గణాం కాలను వివరించింది. పంట నష్టం రూ.8,633 కోట్లు, రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.567 కోట్లు నష్టం వాటిల్లిం దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వరద సహా యక చర్యలకు తక్షణంగా రూ.550 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. వరదల సమ యంలో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ సం యుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన ఐదుగురు సభ్యుల కేంద్ర బృందంతో గురువారం సోమేశ్‌కుమార్ బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఇరిగే షన్, మున్సిపల్ శాఖ, ఆర్అండ్బీ, జీహెచ్ ఎంసీ, వాటర్ బోర్డ్, వ్యవసాయం, ఇంధన, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధి కారులు ఈ భేటీలో వరద నష్టం, సహాయక చర్యల తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో అత్యధిక వర్షాల వల్ల హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. మూసీ నదికి వరద ముంపు ఏర్పడటంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడటం వలన నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీగా నష్టం జరిగిందని, ఆ మేరకు ప్రాథమిక అంచనాను రూపొందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి ఆహార పొట్లాలను అందజే శామన్నారు. వరద ముంపునకు గురైన 15 సబ్స్టేషన్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్టు చెప్పారు. నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం సమావేశం అనంతరం కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలుగా విడిపోయి జీహెచ్ఎంసీ, సిద్దిపేట జిల్లా మర్కూక్‌లకు వెళ్లింది. హైదరాబాద్‌లోని పూల్‌బాగ్, అల్‌జుబేల్ కాలనీ, ఘాజి మిల్లత్ కాలనీ, బాలాపూర్, హఫీజ్‌బాబానగర్, గగన్‌పహాడ్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు, తెగిన చెరువులను పరిశీలించింది. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. పూల్‌బాగ్ వద్ద హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర బృందానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. ఆర్ఓబీ, చెరువు కట్టల మరమ్మతులు, నాలా నుంచి తొలగిస్తున్న పూడికతీత తదితర పనుల్ని కూడా బృందం పరిశీలించింది. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెరువుల పటిష్టతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తదితర అధికారులు కేంద్ర బృందం వెంట ఉన్నారు. -
తెలంగాణ: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. గురు, శుక్రవారాల్లో వరద ప్రభావిత ప్రాం తాల్లో పర్యటించి నష్టం తీవ్రతను తెలుసుకోనుంది. ఈనెల 13 నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్ నగరం తో పాటు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడనుంది. వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1,350 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
పంట నష్టం అంచనాను ప్రారంభించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రెండు రాష్ట్రాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలగజేశాయి. పంట చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం నేల పాలవడంతో. అన్నదాతలకు ఆవేదనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టం అంచనాను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 71,821 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. చదవండి: నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం అత్యధికంగా 54,694 హెక్టార్లలో వరి పంట నష్టం జరగగా.. 12 వేల హెక్టార్లలో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా గోదావరి జిల్లాల్లో పంటలు నిట మునిగినట్లు అధికారుల గుర్తించారు.తూర్పుగోదావరి జిల్లాలో 29వేల హెక్టార్లలో పంట నష్టపోగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 13,900 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇక కృష్ణా జిల్లాలో 12,466 హెక్టార్లు, విశాఖ జిల్లాలో 4,400 హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు. చదవండి: భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ -
వైజాగ్‌పై చంద్రబాబుకు ఎందుకు కక్ష?
సాక్షి, విశాఖ : భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోందన్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వమని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి సినిమాపై మూడు శత దినోత్సవాలను చంద్రబాబు పూర్తి చేశారని వ్యాఖ్యానించారు. వైజాగ్‌పై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. సీపీఐ నారాయణ చంద్రబాబు ఎజెండాను మోస్తున్నారని, బాబు మాట్లాడిందే సీపీఐ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. విశాఖకు టీడీపీ నేతల ద్రోహం: మంత్రి అవంతి జిల్లాలో వరద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారని, వర్షాలు వల్ల జిల్లాలో నష్టాన్ని అంచనా వేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు విశాఖ రాజధాని కాకుండా ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలి అనడంలో తప్పులేదని, విశాఖ రాజధానిగా వద్దని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు బినామీలకు అమరావతి అభివృద్ధే ముఖ్యమన్నారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు నగరాలను అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. (చదవండి: భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం) -
పొంగిన వాగులు, వంకలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాల ప్రభావంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వాగుల్లో కొట్టుకుపోయి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ► గుంటూరు జిల్లాలో పోటేళ్లవాగు, ఓగేరు, పెరమవాగు, మొద్దువాగులు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. దీంతో సచివాలయంతోపాటు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల మండలంలో అత్యధికంగా 151 మి.మీ. వర్షపాతం నమోదైంది. ► ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. గుండ్లకమ్మ వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. వాగులో చిక్కుకున్న ఇద్దరిని గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. పెంచికలపాడు వాగులో చిక్కుకున్న అంకయ్య అనే వ్యక్తిని కాపాడారు. కొత్తకోట వాగు ఉధృతిలో చిక్కుకున్న హరియాణకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. తూర్పు వాగులో చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు శ్రావణ్‌కుమార్ (11), గుంజి విశాల్ అనే విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. గాలించి ఇరువురిని వైద్యశాలకు తరలించగా అప్పటికే శ్రావణ్ మృతిచెందాడు. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 186.2 మి.మీ. వర్షం కురిసింది. ► వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజులోనే 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ముద్దనూరు చెరువు కట్ట తెగింది. కలసపాడు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ► అనంతపురం జిల్లాలోని 63 మండలాల పరిధిలో ఒకే రోజు 23 మి.మీ. వర్షపాత సగటు నమోదైంది. వందలాది చెరువుల్లోకి పెద్దఎత్తున వర్షపునీరు చేరింది. ► చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తంగేళిమిట్ట వద్ద మద్దెలవంకలో సుమంత్ (14) అనే విద్యార్థి వాగులో కొట్టుకుపోయాడు. తనతో పాటు వాగులో జారిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సుమంత్ ఆచూకీ తెలియరాలేదు. ► కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణ పరిధి పెద్దకొట్టాల సమీపంలోని నంది ఫారŠుచ్యనర్ వెంచర్లోకి భారీగా వరద నీరు చేరడంతో తొమ్మిది కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వెంచర్ ప్రహరీని పగలగొట్టించి వరదనీరు బయటకు వెళ్లేలా చేశారు. ఆర్టీపీపీ యూనిట్లలోకి నీరు ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో శనివారం భారీ వర్షం కురవడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) యూనిట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో మోటార్లు, యంత్ర సామాగ్రి మునిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీటి పంపింగ్ చేపట్టారు. ఆర్టీపీపీ సీఈ ఎల్ మోహన్‌రావు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతంలో నీరు చేరిందని, ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. నేడు, రేపు కోస్తాకు భారీ వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: తూర్పు బిహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ 3.1కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. -
26 జిల్లాలు.. 3.30 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక తయారుచేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి వివరాలు అందజేసింది. దీని ప్రకారం సుమారు 26 జిల్లాల్లోని 3.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి, పత్తి , పెసర, కంది పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 10 రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల ఫలితంగా పంట చేలు నీట మునిగాయని, అయితే రైతులు సకాలంలో అప్రమత్తమై ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం తప్పిందని నివేదికలో తెలిపింది. అయితే, నీటిని తీసేసిన తరువాత పంట దెబ్బతిందా? లేదా? అనే విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసినట్లు వెల్లడించింది. దీని ప్రకారం 26 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని, సుమారు 3.30 లక్షల ఎకరాల్లో 33 శాతానికి పైగా పంట దెబ్బతిన్నట్లు పేర్కొంది. కొన్నిచోట్ల వరినాట్లు కొట్టుకుపోగా, మరి కొన్ని చోట్ల కోత దశకు వచ్చిన పంటలకు నష్టం జరిగిందని వివరించింది. అత్యధికంగా వరి 1.40 లక్షల ఎకరాల్లో దెబ్బతిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత పత్తి 1.09 లక్షల ఎకరాలు, పెసర 58 వేలు, కందులు 10 వేలు, వేరుశనగ 6 వేలు, మొక్కజొన్న 5 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వెల్లడించింది. 1.8 లక్షల మంది రైతులకు నష్టం.. జిల్లాల వారీ చూస్తే అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 99,500 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, జయశంకర్ భూపాలపల్లిలో 35,200, మహబూబాబాద్‌లో 28,500, ఖమ్మంలో 24,000, భద్రాద్రి కొత్తగూడెంలో 22,370, నారాయణపేటలో 21,200, కరీంనగర్లో 19,000, వరంగల్ అర్బన్ 17,500, సూర్యాపేటలో 17,000, సంగారెడ్డిలో 11,350, ములుగు 7,650, వికారాబాద్ 6,100, కామారెడ్డి 5,600, సిద్దిపేట జిల్లాలో 4,964 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లోని 3,200 గ్రామాల్లో దాదాపు 1.80 లక్షల మంది రైతులు వర్షాల వల్ల నష్టపోయారని వెల్లడించింది. ఈ నష్టాన్ని 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ద్వారా వారిపై భారం పడకుండా చూడొచ్చని, అయితే దీనికి కనీసం రూ.100 నుంచి రూ.130 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. -
పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలతో పంటలకు కలిగిన నష్టంపై వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 27 వేలకు పైగా హెక్టార్లలో ఆహార, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 22,160.5 హెక్టార్లలో ఆహార పంటలు, 5,570.22 హెక్టార్లలో ఉద్యాన పంటలున్నాయి. ► వరదలు తగ్గాక ఉభయగోదావరి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. ప్రాథమికంగా పది రకాల ఆహార పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నష్టపోయిన పంటల్లో మొక్కజొన్న, పెసర ఎక్కువ. ఒక్క కర్నూలు జిల్లాలోనే సుమారు 13,368.8 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ జిల్లాలో ప్రధానంగా మొక్కజొన్నకు నష్టం జరిగింది. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 205, పశ్చిమగోదావరిలో 1,813.07, తూర్పుగోదావరిలో 2,812, కృష్ణాలో 3,909, విశాఖలో 52 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి. ► గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నారుమళ్లల్లో నీళ్లు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. ► కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో పెసర పంట దెబ్బతింది. ► ఇక నష్టపోయిన ఉద్యాన పంటల్లో ప్రధానంగా అరటి, పసుపు, కంద, బొప్పాయి, తమలపాకు తోటలు, కూరగాయల పంటలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 44.60, తూర్పుగోదావరిలో 4,839.10, పశ్చిమగోదావరిలో 686.52 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
20 వేలకు పైగా హెక్టార్లలో పంట నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు 20 వేలకు పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పంటలు ఎంత మేర దెబ్బ తిన్నాయో పరిశీలన చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ సోమవారం ‘సాక్షి’కి చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం పది రకాల ఆహార పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల్లో మొక్కజొన్న, పెసర పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో 11,968.8 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో 205 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 1,613.07 హెక్టార్లు, తూర్పుగోదావరిలో 2,610, కృష్ణాలో 3,715 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నారుమళ్లలో నీళ్లు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలో పెసర పంట దెబ్బతింది. నష్టపోయిన పంటలకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారు. -
అకాల వర్షాలు.. 8,314 హెక్టార్లలో పంట నష్టం
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పాడైన రబీ పంటలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు పరిశీలించారు. కాకినాడ రూరల్‌లో సోమవారం పర్యటించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 7,455 వరి దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. మొక్కజొన్న 539 హెక్టార్లలో, నువ్వులు 275, వేరు శెనగ 23, సన్‌ఫ్లవర్ 5 హెక్టార్లలో.. మొత్తం 8,314 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2266 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. (అయ్యా బాబోయ్.. ఈ స్టంట్ ఎప్పుడూ చూడలేదు) తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతు ఆందోళనలో ఉన్నాడని ఎవరైనా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తక్షణమే బొండాలు రకం ధాన్యం కొనుగోలు చేయమని మిల్లర్లను కోరుతున్నామన్నారు. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. (ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు! ) -
రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు
-
నేలకొరిగిన పంటలు..అన్నదాతల ఆవేదన
-
కుండపోత.. గుండెకోత
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్) : మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నేదురు చంద్రమౌళి. ఇతనికి మూడున్నర ఎకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేశాడు. ఇప్పటికే సుమారుగా ఎకరాకు రూ.25 వేల చొప్పున ఖర్చు చేశాడు. ఖరీఫ్ సీజన్లో ఆఖరికి కాలం కావడంతో తీవ్ర కష్టాలకోర్చి సాగు చేశాడు. మరో రెండు రోజుల్లో వరి కోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శుక్ర, శనివారం కురిసిన వర్షంతో వరి మొత్తం నేలవాలింది. కోయరాకుండా పొలం అంతా నీటితో నిండింది.’ ఇది ఒక్క చంద్రమౌళి పరిస్థితి కాదు జిల్లాలోని రైతులందరూ వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలు అన్నదాతకు గుండెకోత మిగను మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత కుదేలవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి సాగుచేసి పంట చేతికొచ్చేవేల నేలపాలు కావడంతో దిక్కుతోచరి స్థితిలో పడ్డారు. మూడేళ్లుగా వరుణుడు తమను పగబడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 మండలాల్లో అత్యధిక వర్షపాతం... ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు కురువక పంటల సాగు ఆలస్యమైంది. సీజన్ ముగింపుదశలో కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు, కుంటలన్ని నిండి జలకళను సంతరించకున్నాయి. ఈ నెలలో తొమ్మిది రోజుల్లో రికార్డుస్ధాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని రామడుగు, శంకరపట్నం, మానకొండూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 13 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. శనివారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు నీటమునిగాయి. ప్రధానంగా శంకరపట్నం, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరిపంటకు ఎక్కువగా నష్టం జరిగింది. సైదాపూర్ మండలంలో అత్యధికంగా 103.2మి.మీ, జమ్మికుంటలో 80.2, వీణవంకలో 70.2, చిగురుమామిడిలో 65.6మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 45.5 మిమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మికుంట మండలంలో వాలిన పొలాన్ని చూపుతున్న రైతులు 4,627 హెక్టార్లలో వరి పంట నష్టం.. జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 52 వేల హెక్టార్లు కాగా, ఈ ఖరీఫ్‌లో 79,327 హెక్టార్లు సాగైంది. 4.25 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 119 గ్రామాల్లో 6,298 రైతులకు చెందిన 4,627 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న పంటలను ఆదివారం ఏవోలు, ఏఈవోలు గ్రామాలవారీగా సర్వే చేసి వివరాలను సేకరిస్తున్నారు. దూది రైతుకు దుఃఖం.. పత్తి రైతుకు మళ్లీ కష్టమొచ్చింది. అవసరం లేని సమయంలో కురుస్తున్న వర్షం తీరని నష్టాల్ని మిగిలిస్తుంది. ప్రస్తుతం పత్తి పంట కాయ దశకు రాగా, కొన్ని ఏరియాల్లో మొదటి సారి ఏరుతున్నారు. ఎకరాలకు కనీసం పది క్వింటా ళ్లు రావాల్సిన దిగుబడి పంట కీలక సమ యం లో అకాల వర్షాలతో నష్టం వాటిల్లి ఆశించిన మేరకు దిగుబడి రాకపోగా, పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పత్తి సాధారణ విసీ ్తర్ణం 42,918 హెక్టార్లు కాగా, ఈసారి 36,762 హెక్టార్లు సాగైంది. హెక్టారుకు కనీసం 14 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచ నా వేశారు అధికారులు. అయితే అకాల వర్షాలతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చే పరి స్థితి కనిపించడం లేదు. వానలతో పత్తి కాయ నల్లబడగా, పలిగే దశలో ఉన్న కాయ మురిగిపోయే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
రైతు చేతికే పంటనష్టం పరిహారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల 90 మండలాలు, 484 గ్రామాలు ప్రభావితం అయ్యాయన్నారు. సుమారు 22,022 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని.. ఫలితంగా రూ.95.23 కోట్ల నష్టం వాటిల్లిందని కన్నబాబు పేర్కొన్నారు. వాణిజ్య పంటలు ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం లేదనే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓ కమిటీ వేసి వచ్చే సీజన్లో వారికి న్యాయం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. మినుము, పెసలపై మొదటిసారిగా 100శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చే పరిహారం ప్రత్యేక అకౌంట్లో వేసి.. రైతు చేతికే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు కన్నబాబు. గ్రామ సచివాలయాలు ప్రారంభం కాగానే కౌలు రైతులకు ఇచ్చే కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకు గాను వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. పరిశోధన కేంద్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించి నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసేందుకు ఎమ్ఓయూ కుదుర్చుకుంటామని తెలిపారు. 24 గంటలు రైతులకు సేవలు అందించేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. రైతుకు సమగ్ర సేవలు అందించేలా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భూసార పరీక్షల నుంచి ప్రతి అంశం మీద అధికారులు ముందుండాలన్నారు. ప్రతి గ్రామంలో ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కల్తీ ఎక్కడ కనిపించినా కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారన్నారు కన్నబాబు. -
హమ్మయ్య డ్యామ్ దాటేశాయ్!
సాక్షి, కొమరాడ (విజయనగరం): హమ్మయ్య... ఎట్టకేలకు ఏనుగులు డ్యామ్ దాటేశాయి. ఏడాదిగా జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలతోపాటు మైదాన ప్రజలను హడలెత్తించిన గజరాజులు ఒడిశావైపు తరలి వెళ్లాయి. ఇలా వెళ్లడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ వెళ్లాయి. కానీ అక్కడి అధికారులు అంతే జాగ్రత్తగా వాటిని తిప్పి పంపించేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోవడం... ఒడిశా అధికారులతో చర్చించకపోవడం... వాటిని ఎలిఫెంట్ జోన్లోకి తరలించకపోవడం... ఇలాంటి కారణాల వల్ల మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారైనా... ఆ సమస్య నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. ఏడాదిగా ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గజరాజుల గుంపు మంగళవారం తెల్లవారుఝామున రాజ్యలక్ష్మీపురం, కందివలస మీదుగా జంఝావతి రిజర్వాయర్ డ్యామ్ గట్టు దాటాయి. గతంలో కూడా ఒక సారి ఇలానే జరిగింది. అయితే ఒడిశా అటవీ శాఖ అధికారులు, గిరిజనులు తిప్పికొట్టారు. మళ్లీ వెనుదిరిగాయి. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే అటవీశాఖ ఉన్నతాధికారులు ఒడిశా అధికారులతో మాట్లా డి ఒడిశా ప్రాంతంలోని ఎలిఫెంటి జోన్‌కు తరలించే ఏర్పాటు చేయాలి. లేకుంటే మళ్లీ వెనక్కు పంపించేస్తే మనకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు కొద్ది పాటి పంటలనే తొక్కి నాశనం చేసిన గజరాజులు మళ్లీ వస్తే రైతులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ఈ ప్రాంత రైతులు కూరగాయలు, చెరకు, అరటి, వరి ఆకుమడులు తదితర పంటలు వేశారు. వాటిని ధ్వంసం చేస్తే తీరని నష్టం వాటిల్లుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అం తేగాదు. ఒంటరిగా వచ్చేవారి ప్రాణాలకూ ముప్పువాటిల్లుతుందని భయందోళన చెందుతున్నా రు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జోన్‌కు తరలించే యత్నం చేయాలి గత సంవత్సరం సెప్టెంబర్‌లో వచ్చిన ఎనిమిది ఏనుగుల్లో ప్రమాదవశాత్తూ రెండు ఏనుగులు చనిపోయాయి. మిగతా ఏనుగులు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీనివల్ల అన్నదాతలకు ఆవేదనే మిగిలింది. గత ప్రభుత్వం కనీసం పంట నష్టపరిహారమైనా మంజూరు చేయలేదు. ఇప్పుడు ఎలాగోలా ఒడిశా ప్రాంతానికి తరలాయి. అక్కడ ఉన్న ఎలిఫెంట్ జోన్‌కు తరిలి స్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – అంబటి తిరుపతి నాయుడు, స్వామినాయుడువలస పంటలు పాడవుతున్నాయి నాగవళి నది ఒడ్డున మా గ్రామం ఉండటంతో మా పోలాల్లోని చెరకు, అరటి, జొన్న, వరి తదితర పంటలు వేస్తాం. ఇక్కడ తినడానికి తిండి, తాగడానికి నీటి సౌకర్యం ఉండడంతో ఈ ప్రాంతం విడిచి వెళ్లకుండా ఇక్కడే తిష్టవేస్తున్నాయి. మా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అటవీశాఖ సిబ్బంది పుణ్యమాని మంగళవారం జంఝావతి డ్యామ్ దాటాయి. ఉన్నతాధికారులు స్పందించి ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించాలి. – ఫైల వెంకటరమణ, రైతు, గుణానుపురం -
నిజామాబాద్ జిల్లలో వడగండ్ల వాన పంట నష్టం
-
నా పంట యాప్ రైతుకు చేదోడు!
రైతులకు తోడ్పడటానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో నవీన్ కుమార్ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన ప్రస్థానం రైతులకు చేదోడుగా నిలుస్తోంది. సకాలంలో సమాచారం సాంకేతిక సలహా అందక పంట నష్టపోవడం, దళారీ వ్యవస్థ వల్ల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించగలిగితే రైతుల జీవితాల్లో వెలుగులు పూయించవచ్చని నవీన్‌కుమార్ తలపెట్టాడు. ఐఐఐటీ హైద్రాబాద్, ఇక్రిశాట్ నిపుణుల తోడ్పాటుతో ‘నా పంట’ అనే మొబైల్ యాప్‌ను 2017 జూన్‌లో రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘నా పంట’ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3,500 మార్కెట్లలో 300 వ్యవసాయోత్పత్తులకు పలుకుతున్న తాజా ధరవరలతోపాటు మూడేళ్లలో వాటి ధరల్లో హెచ్చుతగ్గులను ఈ యాప్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చు. ప్రకృతి, సేంద్రియ, రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన 120 పంటలకు సంబంధించిన ఎరువులు, చీడపీడల యాజమాన్య మెలకువలు, కషాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు. పంటల బీమా.. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు.. యంత్రపరికరాల లీజు సమాచారం, వ్యవసాయ డీలర్ల వివరాలు.. వంటి మొత్తం 16 రకాల సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషంలోనే పొందవచ్చని నవీన్ వివరించారు. గ్రామీణ రైతులు ఉపయోగించుకోగలిగేలా తెలుగు భాషలోనే ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలోనే ఈ యాప్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షా పది వేల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారని నవీన్(95059 99907) చెబుతున్నారు. బాల వికాస, రెడ్డీ ల్యాబ్స్ వంటి ప్రైవేటు సంస్థలతోపాటు ప్రభుత్వ సంస్థలతోనూ కలిసి పనిచేస్తూ రైతులకు చేరువ అవుతున్నామన్నారు. అనతికాలంలోనే అనేక అవార్డులను అందుకున్న ‘నా పంట’ యాప్‌ను ఉపయోగించుకోగలిగిన రైతులు సాగు వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. -
నష్టం కొండంత.. పరిహారం గోరంతే
-
పెథాయ్ పగ.. సర్కారు దగా!
పైచిత్రంలోని రైతు పేరు పాశం పూర్ణచంద్రరావు. స్వగ్రామం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గాంధీనగరం. ఖరీఫ్‌లో 3.5 ఎకరాల్లో బీపీటీ రకం ధాన్యం సాగు చేశాడు. పంట కోత కోసిన వెంటనే పెథాయ్ తుపాను ప్రభావంతో వర్షం మొదలైంది. కనీసం పంటను కుప్పగా వేసే అవకాశం సైతం లేకుండాపోయింది. వర్షపు నీరు పంట పొలంలో చేరడంతో ధాన్యమంతా నీళ్లపాలై మొలకలు వచ్చింది. పంట సాగుకోసం పూర్ణచంద్రరావు ఎకరాకు రూ.35 వేల చొప్పున మొత్తం రూ.1,19,500 పెట్టుబడి పెట్టాడు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని భావిస్తే.. గాలికి వాలి మొలకెత్తిన ధాన్యానికే పరిహారం ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్వర్క్: పెథాయ్ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. నిబంధనల పేరిట బంధనాలు వేస్తోంది. నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకో వడానికి పెథాయ్ తుపాను వల్ల పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చిత్రీకరించేందుకు ప్రయత్ని స్తోంది. తమను మోసగించడానికే సీఎం చంద్రబాబు టెక్నాలజీతో తుపాను నష్టాన్ని నివారించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పెథాయ్ తుపాను వల్ల కేవలం 66 వేల ఎకరాల్లోనే పంటలు పాడయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక్క రోజులో వివరాలు సేకరించేదేలా? తుపాను వల్ల నష్టపోయిన పంటల వివరాలను సేకరించే బాధ్యతను ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు అప్పగించింది. కానీ, నిబంధనలను మాత్రం మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు విడుదల చేసింది. బుధవారం సాయంత్రంలోగా అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వివరాలను సేకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 12 గంటల వ్యవధిలో వేలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని ఎలా సేకరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు పంట నష్టం వివరాల నమోదుకు ప్రభుత్వం ‘సైక్లోన్ అప్లికేషన్’ పేరిట కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 29 ఆంశాలను నమోదు చేయాల్సి ఉంది. రైతు ఆధార్ నెంబర్‌తో లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ ఆకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ బ్రాంచ్ పేరు వంటి అన్ని అంశాలను ఎంటర్ చేసి, రైతు పొలాన్ని ఫొటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ అంతంతమాత్రంగానే ఉండటంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క రైతు వివరాలను నమోదు చేయడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన 12 గంటల సమయంలో పంట నష్టం వివరాలను నమోదు చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రైతులు మండిపడుతున్నారు. ఎన్నెన్ని తిరకాసులో... పంట నష్టం వివరాలను నమోదు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఎన్నో తిరకాసులను పెట్టింది. సర్కారు నిబంధనల ప్రకారం.. కోతలు పూర్తయి పొలాల్లో వర్షానికి తడిసిన వరి పంట వివరాలను నమోదు చేయొద్దు. సరిగ్గా కుప్ప వేయని వరి తడిస్తే నష్టపరిహారం ఇవ్వరు. కేవలం కోతకు సిద్ధంగా ఉండి నేలకొరిగి, మొలకెత్తిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అందులో కూడా 33 శాతం కంటే అధికంగా నేలకొరిగిన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. దీనిప్రకారం 90 శాతం పొలాలను జాబితాలోంచి తొలగిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో 47,000 హెక్టార్లలో పంట నష్టపోతే 8,231 హెక్టార్లను మాత్రమే నమోదు చేస్తున్నారు. ఈ–క్రాప్‌లో రైతుల వివరాలేవీ? సైక్లోన్ యాప్‌లో రైతుల పంట నష్టం వివరాలు నమోదు కావాలంటే ఈ–క్రాప్‌లో ఇదివరకే ఆ రైతు పేరు నమోదై ఉండాలి. గతంలో అధికారుల అలసత్వంతో ఈ–క్రాప్‌లో రైతులందరి వివరాలు నమోదు చేయలేదు. ఇన్ని సమస్యల మధ్య అధికారులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ నెల 20వ తేదీన తుపాను బాధిత రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం పంట నష్టాన్ని పరిశీలించడానికి కూడా అధికారులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టం కొండంత.. పరిహారం గోరంతే ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని పెథాయ్ బాధిత రైతులు అంటున్నారు. వరి పంటకు హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఎకరాకు రూ.6 వేలు ఇవ్వనున్నారు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టారు. తడిసిన పంట కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా సగం ధరకే విక్రయించాల్సి వస్తుంది. అంటే ఎకరాకు రూ.50 వేల ఆదాయం రావాల్సి ఉండగా, తుపాను ప్రభావం వల్ల రూ.25 వేలు మాత్రమే అందనుంది. పరిహారం కింద ఎకరాకు రూ.6 వేలు మాత్రమే ఇస్తామనడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరిలో 500 హెక్టార్లకే పరిహారం ఇస్తారట! పెథాయ్ తుపాను ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో 12 వేల ఎకరాల్లో రబీ నారుమళ్లు దెబ్బతిన్నాయి. 25 వేల ఎకరాల్లో పనలపై ఉన్న ధాన్యం తడిసిముద్దయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. 5,705 ఎకరాల్లో అరటి, 8,400 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. కానీ, అధికారికంగా ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి 5,484 హెక్టార్లలో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో వరి 3,059 హెక్టార్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా 2,450 హెక్టార్లలో జీడి, మామిడి, అరటి, బొప్పాయి తోటలతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు నివేదికలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను బట్టి చూస్తే 500 హెక్టార్లకు మించి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు. కౌలు రైతులకు మొండిచేయి పంట నష్టం వివరాల నమోదుకు ప్రవేశపెట్టిన సైక్లోన్ యాప్‌ను పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం రాత్రికి కూడా ప్రభుత్వం యాక్టివేట్ చేయలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయికి వెళ్లకపోవడంతో వివరాలు చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. చాలామంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవు. గుర్తింపు కార్డు ఉంటేనే సాఫ్ట్వేర్ వారి వివరాలను స్వీకరిస్తుంది. అంటే కార్డులు లేని కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రాదు. పెథాయ్ తుఫాన్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో 14,788 హెక్టార్లలో పనలపై ఉన్న వరి పంట నీటమునిగింది. కుప్పల రూపంలో 59,150 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పంటను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే బాధిత రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. నిబంధనలే శాపం విశాఖ జిల్లాలో ఖరీఫ్‌లో 99 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 37 వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయింది. పెథాయ్ తుపానుకు ముందు 29 వేల హెక్టార్లలో ధాన్యం కోతలు పూర్తయ్యాయి. 33 వేల హెక్టార్ల పంట కోతకు సిద్ధంగా ఉంది. పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లాలో 23 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందులో 90 శాతం పంటకు నష్టపరిహారం రాదని అధికారులు తేల్చిచెబుతున్నారు. సర్కారు కాకిలెక్కలు శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఇందులో దాదాపు 2 లక్షల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. పెథాయ్ ప్రభావం వల్ల ఇందులో 1.36 లక్షల హెక్టార్లలో వరి పనలు నీటిలో తడిసి పాడయ్యాయి. దాదాపు లక్ష హెక్టార్లలో పెసర, మినప వేయగా, 40 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. అయితే, పెథాయ్ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్దగా పంట నష్టం వాటిల్లలేని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నష్టపరిహారం ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
42 మండలాల్లో ‘పెథాయ్’ పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 6,168 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరం దాటే సమయంలో దాని ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై పడిందని, దీంతో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ రూరల్, భద్రాది కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని మొత్తం 42 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, పత్తి పంటలు పెథాయ్ తుపాను ప్రభావంతో వచ్చిన ఈదురు గాలులు, వర్షానికి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలే అధికంగా నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం కల్పించండి: సీఎస్ పెథాయ్ తుపాను ప్రభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలకు అవసరమైన మందులు, దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని సీఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. అవసరమైతే జిల్లా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. -
పెథాయ్ ఎఫెక్ట్: వేలాది ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడ్డ పెథాయ్ తుపాన్ రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతిసింది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డ తుపాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 3,488 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 182 హెక్టార్లలో కూరగాయలు, 630 హెక్టార్లలో అరటి పంట, 21 హెక్టార్లలో మిరప, 4 హెక్టార్లలో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. తెలిపారు. విద్యుత్ సరాఫరాకు పలు చోట్ల తీవ్ర అంతరాయం కలిగింది. ఉప్పాడ బీచ్ రోడ్ 6 కి.మీ మేర రోడ్డు పాడవ్వటంతో కోటి రూపాయల మేర నష్టం ఏర్పడింది. కాట్రేనికోనలో 250 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. కృష్ణా జిల్లాలో పదివేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు అనేక వాణిజ్య పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో నీటిలోనే చిక్కుకుని ఉండటంతో ప్రభుత్వం మంగళవారం కూడా పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది. -
పరిహారం అందేనా..?
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో రైతులను ఓసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి వెంటాడుతూనే ఉంది. పంటలు నష్టపోతున్నా పరిహారం అందకపోవడం వారిని కుంగదీస్తోంది. నష్టంపై సర్వే చేసి నెలలు గడుస్తున్నా పరిహారం ఊసే లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. పంటల నష్టపరిహరం అందుతుందో లేదోనని ఎదురుచూడాల్సి వస్తోంది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలగా మారింది. ఏటా పంటలు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలో 58 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. రెవెన్యూ, వ్యవసాయ ఆధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి దాదాపుగా రెండు నెలల కావస్తున్నా పంటల నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. జిల్లాలోని 18 మండలాల్లో వర్షాల కారణంగా 58 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు కొట్టుకుపోయాయి. 45 వేల ఎకరాల్లో పత్తి, 7,500 ఎకరాల్లో సోయా, 3,750 ఎకరాలలో కంది పంటలు వరదలో కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి పంటల నష్టం, రైతుల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా.. 45 వేల ఎకరాల్లో పంట వరదలకు కొట్టుకుపోయినట్లు తేల్చారు. పంట నష్టంపై వివరాల నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేశారు. పరిహారంపై స్పష్టత ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండడంతో పంటల నష్టపరిహారంపై నిర్ణయం తీసుకునే వారు లేకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే కొట్టుకుపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం అందజేసే పరిహారంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించడానికి పోటీపడ్డ నాయకులు నష్టపరిహారం ఇప్పించడంలో చొరవ చూపాలని, త్వరగా ఇప్పించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. సర్వే నివేదిక అందజేశాం జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాం. నష్టపోయిన పంటల వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి పంటల నష్టపరిహారం నిధులు విడుదల చేస్తే రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి. -
రైతన్న వెన్నువిరిచిన.. తుపాను
శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/విజయనగరం గంటస్తంభం: అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క సిక్కోలులోనే 75 శాతం మేర వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలవాలాయి. వేలాది ఎకరాల్లోని అరటి, బొప్పాయి, జీడిమామిడి తోటలు నేలమట్టమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,350 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో వరి నష్టమే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.09 లక్షల హెక్టార్లలో వరి వేయగా.. 1.44 లక్షల హెక్టార్లకు పైగా పంట దెబ్బతింది. ఈ నష్టం విలువ రూ.875 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరి చేతికందే తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన తుపాను తమను కష్టాల పాల్జేసిందని సిక్కోలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 700 హెక్టార్లలోని అరటి తోటలు నేలకొరిగాయి. వీరఘట్టం, వంగర, రాజాం, జి.సిగడాం, గార మండలాల్లోని అరటి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. 1,640 హెక్టార్లలోని జీడిమామిడి, 13 హెక్టార్లలోని బొప్పాయి, మరో 13 హెక్టార్లలోని కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఒక్క ఉద్దానం పరిసరాల్లోనే మూడు లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.475 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘విజయనగరం’లో రూ.31.30 కోట్ల నష్టం.. విజయనగరం జిల్లావ్యాప్తంగా అరటి, చెరకుతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మొత్తం రూ.31.30 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2,500 హెక్టార్లలో అరటి పంట నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అరటి తోటలు భారీగా నెలకొరిగాయి. అరటికి మంచి డిమాండ్ ఉన్న సమయంలో తోటలు నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పంట.. కొమరాడలో 32.5 హెక్టార్లు, జియ్యమ్మవలసలో 44.8 హెక్టార్లు, మక్కువలో 2 హెక్టార్లు, చీపురుపల్లిలో 24 హెక్టార్లు, గరుగుబిల్లిలో 50 హెక్టార్లలో దెబ్బతింది. ఇక 106.1 హెక్టార్లలోని పత్తి పంట తుడిచి పెట్టుకుపోయింది. సాక్షి, అమరావతి: ‘తిత్లీ’ తుపాను వల్ల ఏడుగురు మృత్యువాతపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 5,23,232 ఎకరాల్లోని పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని.. ఇందులో 16 మండలాల్లో దీని తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. మొత్తంగా 1,864 గ్రామాలు దెబ్బతినగా.. 1,021 ఇళ్లకు నష్టం వాటిల్లిందని, 509 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది. 589 పశువులు మృతి చెందాయని పేర్కొందిది. ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి రూ.4.80 కోట్లు నష్టం వాటిల్లిందని, పంచాయతీరాజ్ శాఖలో రూ.6.92 కోట్లు నష్టం సంభవించిందని తెలిపింది. మున్సిపల్ శాఖలో రూ.2.81 కోట్లు, ఇరిగేషన్లో రూ.7.20 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో రూ.88.50 లక్షలు, విద్యుత్ శాఖలో రూ.3 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసింది. 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం 3 వేల మందిని శిబిరాలకు తరలించినట్లు వివరించింది. 105 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని.. 3 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మాయదారి తుపాను ముంచేసింది.. నాలుగు ఎకరాల్లో వరి వేశా. తెగుళ్లు అదుపులోకి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో.. ఈ మాయదారి తుపాను వచ్చి నిండా ముంచేసింది. నా పంటను బాగా దెబ్బతీసింది. చేను పచ్చగా కనిపించినా పూర్తిగా గింజకట్టదు. దీంతో సగం దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు. – కణితి యోగానంద్, రైతు, కుమ్మరిపేట, శ్రీకాకుళం జిల్లా. ఉద్దానం కొబ్బరికి ఊపిరి తీసిన తిత్లీ కవిటి: ఉత్తరాంధ్రలో మరో కోనసీమగా పేరొందిన ఉద్దానం తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైంది. శ్రీకాకుళం జిల్లాలో గురువారం తెల్లవారు జామున తీరం దాటిన తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ సుమారు 14 గంటలపాటు వీచిన ప్రచండ గాలులకు లక్షలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులు కొబ్బరి రైతు గుండెలపై నిప్పులకుంపటిగా మారాయి. వాస్తవానికి వాతావరణశాఖ ఈ తుపాను కళింగపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటుతుందని హెచ్చరించింది. ఓ దశలో విజయనగరం వైపు దిశమార్చుకుందనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటినీ వమ్ముచేస్తూ పలాస వద్ద తీరం దాటి ఉద్దానాన్ని ఊడ్చుకుపోయింది.గతంలో తుపాన్లు వచ్చిన సమయంలో గాలులు పశ్చిమదిశనుంచి తూర్పువైపుగా వీచేవి.. ఈ సారి అందుకు భిన్నంగా తూర్పువైపు నుంచి పశ్చిమదిశగా గాలులు వీచాయి. దీంతో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి మండలాల్లో భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. 1999లో సంభవించిన సూపర్‌సైక్లోన్ కంటే అధికంగా ఉద్దానం ప్రాంతంలో ఆస్తినష్టం వాటిల్లింది. 11 వేల హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. మరో 25 లక్షల కొబ్బరి చెట్లు మొవ్వు విరిగిపోవడం, మొవ్వు దెబ్బతినడం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొబ్బరి రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరగాల్సి ఉంది. ఏటా నష్టపోతున్న కొబ్బరి రైతు ఉద్దానం కొబ్బరి రైతు ఏటా ఏదో ఒక విధంగా నష్టపోతున్నాడు. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ సందర్భంగా వేలాది కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. భీకర గాలులకు చెట్ల మొవ్వు దెబ్బ తినడం.. ఆ తరువాత చీడపీడలు దాడి చేయడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. కొన్నాళ్లు అవస్థలు పడిన ఉద్దానం రైతు.. ఆ తరువాత కొద్దికొద్దిగా కోలుకుంటుండగా ఇంతలో 2013 అక్టోబర్ 12న వచ్చిన ఫై–లీన్, 2014 అక్టోబర్ 14న వచ్చిన హుద్‌హుద్ తుపానుతో మరోసారి ఆర్థికంగా చితికిపోయాడు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉద్దానం రైతుకు తిత్లీ రూపేణా మరోసారి గట్టిదెబ్బ తగిలింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలకూలాయని, వేలాది చెట్లు పనికిరాకుండాపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ నేలకొరిగిన కొబ్బరిచెట్లు 3 లక్షలకు పైగా ♦ దెబ్బతిన్న కొబ్బరి పంట 11 వేల హెక్టార్లలో ♦ మరో 25 లక్షల చెట్లు భవిష్యత్‌లో పనికిరాకుండా పోయే ప్రమాదం ♦ 1999 సూపర్ సైక్లోన్ కంటే అధికంగా ఆస్తినష్టం పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశాం శ్రీకాకుళం కలెక్టరు ధనంజయరెడ్డి శ్రీకాకుళం సాక్షి ప్రతినిధి: తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ, సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి గురువారం మీడియాకు తెలిపారు. టెక్కలి డివిజన్‌తో పాటు పలుచోట్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తద్వారా తాగునీరు తదితర సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైన విద్యుత్ స్తంభాలు, ఇతరత్రా పరికరాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వివరించారు. నదుల్లో వరద పోటెత్తే ప్రమాదమున్నందున.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలను కూడా సన్నద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు పనిచేస్తున్నాయని.. గురువారం మూడో బృందాన్ని రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులందర్నీ ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. -
ముంపు భయం..!
సాక్షి, కొత్తగూడెం (ఖమ్మం): గత నెలలో వరదలు వచ్చినప్పుడు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక దాటితే ఇక భారీ నష్టమే. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మిస్తే భవిష్యత్తులో ముంపు భయం మరింతగా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, ముంపు వాసులను అప్రమత్తం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం వద్ద ఈ నీటిమట్టం నిరంతరం కొనసాగుతుంది. ఇక ప్రతి ఏటా వచ్చే వర్షాలకు ప్రవాహం పెరిగితే అత్యంత వేగంగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో 53 అడుగుల మేర నీటిమట్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే పంటలు, 53 అడుగులకు చేరగానే పరీవాహక ప్రాంతాల్లోని రోడ్లు మునిగిపోతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చితే నష్టం అపారంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతులకు ఇప్పటినుంచే ‘పోలవరం’ భయం పట్టుకుంది. ఆనకట్ట నిర్మిస్తే ప్రతి ఏటా నష్టం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవితవ్యంపై ఆందోళన.. ఎగువ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలతో పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మొత్తం 1,258 హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. ఇక గోదావరి ఎగపోటు కారణంగా చర్ల మండలంలోని తాలిపేరు, బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని నదులు సైతం పొంగిపొర్లుతాయి. దీంతో రైతులకు నష్టం మరింతగా పెరుగుతుంది. పోలవరం నిర్మాణం పూర్తయితే గోదావరి ఉధృతి పెరిగి భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, మంగపేట మండలాలకు సైతం ముంపు బెడద వాటిల్లే ప్రమాదం ఉంది. అప్పుడు తమ భవితవ్యమేంటని ఆయా మండలాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న గోదావరి వరదల స్థితిగతులు తెలిసిన ఈ మండలాల ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమ భూములు నీటమునుగుతాయని గగ్గోలు పెడుతున్నారు. పరిహారం ప్రశ్నార్థకమే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర విభజన సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని సీతారామనగరం, శ్రీధర వెలేరు, గణపవరం, ఇబ్రహీంపేట రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చింతూరు, వేలేరుపాడు, నెల్లిపాక, వీఆర్‌పురం మండలాలను కూడా ఏపీలో కలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య విలీన మండలాల అంశం కొనసాగుతూనే ఉంది. ఈ మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు ముంపునకు సంబంధించి నష్టపరిహారం అందించారు. అయితే భవిష్యత్తులో తెలంగాణలోని భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో మునిగిపోయే పంటలకు పరిహారం చెల్లింపులో తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తున్నారు. బూర్గంపాడు మండలం నుంచి ఆంధ్రాలో కలిపిన గ్రామాల్లో వరద ముంపునకు గురయ్యే భూములలోకి వరదనీరు చేరేటప్పటికీ గోదావరి, కిన్నెరసాని నదులకు ఇవతల ఉన్న తెలంగాణలోని బూర్గంపాడు మండలంలో వేలాది ఎకరాలు ముగునుతాయి. అయితే ఈ గ్రామాలకు పోలవరం ముంపు ప్యాకేజీ వర్తించడం లేదు. గోదావరి వరద వచ్చినప్పుడు మొదటగా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, సారపాక, మోతె , ఇరవెండి గ్రామాలలోని వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ భూములకు పరిహారం చెల్లించే విషయంపై స్పష్టత లేదు. భూములు ముంపునకు గురైతే తమ పరిస్థితి ఏమిటనేది స్థానికులకు ప్రశ్నార్థకంగా మారింది. కిన్నెరసానికి అవతల ఉన్న గ్రామాలు ఆం«ధ్రప్రదేశ్‌లో విలీనం కావటంతో అక్కడి ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందిస్తుంది. కాగా, కిన్నెరసాని, గోదావరి నదులకు ఇవతల ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ముంపు గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరదలను ప్రామాణికంగా తీసుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ముంపు భూములపై నీటిపారుదల శాఖ అధికారులు బూర్గంపాడు మండలంలో సర్వే చేశారు. ఈ మండలంలోని పలు గ్రామాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని నిర్ధారించి అక్కడ సర్వే రాళ్లు పాతారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటంతో బూర్గంపాడు మండలం రెండు ముక్కలైంది. మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అయితే గతంలో వచ్చిన గోదావరి వరదలను లెక్కలోకి తీసుకుంటే ఏపీలో విలీనమైన గ్రామాల కంటే ప్రస్తుతం భద్రాచలం డివిజన్లోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, మోతె, ఇరవెండి, భద్రాచలం పరిసర గ్రామాలే ఎక్కువ ముంపునకు గురవుతాయి. గతంలో గోదావరి వరదల ముంపు రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకుని పోలవరం ముంపును గుర్తించాలని మండల వాసులు కోరుతున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే మండలాల్లోని వ్యవసాయ భూములకు తగిన పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని, లేకుంటే మండలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. బాగా నష్టపోతాం సీతారామనగరం వైపు నాకున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు సర్వే చేశారు. అదే సమయంలో అంతకంటే ముందుగా మునిగే బూర్గంపాడు వైపు భూములకు ఎలాంటి సర్వే చేయలేదు. కిన్నెరసాని వరద కుడివైపు కంటే ఎడమవైపే ఎక్కువ నష్టం చేస్తుంది. అటు పరిహారం ఇచ్చి, ఇటు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి. – దారం వెంకటరెడ్డి, సంజీవరెడ్డిపాలెం భూములన్నీ మునుగుతాయి ప్రస్తుతం సీతారామనగరం వైపున ముంపునకు గురవుతాయని సర్వే చేస్తున్న భూముల ప్రకారం తీసుకుంటే బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలులో ఎక్కువ భూములు మునుగుతాయి. ప్రభుత్వాలు వేరైనా వరదముంపు మాత్రం భూముల లెవల్‌ను బట్టే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – మేకల నర్సింహారావు, బూర్గంపాడు -
బాబు పాలనలో వర్షం జాడే లేదు
-
నేడు కలెక్టరేట్ వద్ద కరువు పై వైఎస్సార్ సీపీ పోరు
-
బీ(ధీ)మా కల్పించేనా..!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ప్రధానంగా పత్తి, సోయా పంటలను పూర్తిగా కోల్పోయిన రైతాంగం కుదేలైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటకు సంబంధించి ప్రాథమిక అంచనాలు వేసినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకవేళ ఈ సర్వే నిర్వహించి నివేదిక పంపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల అవుతుందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులకు బీమానే ధీమా ఇవ్వాల్సింది. గతేడాది వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదు. అసలు ఆ పరిహారం వస్తుందా.. రాదా అనేది తెలియని పరిస్థితి. వాతావరణ ఆధారిత బీమాలో అటు వర్షాభావ పరిస్థితుల్లోనూ, ఇటు అతివృష్టిలోనూ పరిహారం అందజేసే పరిస్థితి ఉంటుంది. ప్రీమియం చెల్లించినా పరిహారం ఎప్పుడొస్తుందో అనే విషయంలో స్పష్టత లేకపోవడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ బీమాకు సంబంధించిన కార్యాలయం ఆదిలా బాద్‌లో లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో వ్యవసాయ అధికారులను రైతులు సంప్రదించినా పరిహారం విషయంలో వారు ఒక స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు. అసలు పరిహారం వస్తుందా.. రాదా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోవడంతో రైతుల్లో అయోమయం కనిపిస్తోంది. దీంతో అసలు ప్రీమియం చెల్లించి లాభమేమిటన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతోనే పలువురు రైతులు వాతావరణ ఆధారిత, ఫసల్‌బీమా యోజన ప్రీమియం గడువులోగా బ్యాంకుల్లో రుణం తీసుకునేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు సంబంధించి ప్రీమియం డబ్బులను రుణం నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీంతో రైతులు గడువు తర్వాతే రుణం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారంటే ఈ బీమాలపై ధీమా లేకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం లక్షా 92,626 హెక్టార్లు కాగా, అందులో లక్షా 86,007 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా లక్షా 28,300 హెక్టార్లలో పత్తి పంట సాగైంది. ఇది సాధారణ విస్తీర్ణం కంటే 3 శాతం అధికం. సోయాబీన్ 30,120 హెక్టార్లలో సాగైంది. కందులు 21,260 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు కొద్దిమొత్తంలో సాగయ్యాయి. కాగా పత్తిని మండల యూనిట్‌గా వాతావరణ ఆధారిత బీమా కింద, సోయా, కందులు, ఇతర పంటలు గ్రామ యూనిట్‌గా ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించేందుకు గత నెలలో గడువులోగా కొద్ది మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించారు. బ్యాంక్ రుణం ద్వారా కొంతమంది, నాన్‌లోనింగ్ రైతులు కూడా మీసేవ ద్వారా నేరుగా ఈ ప్రీమియం కట్టి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫసల్ బీమాలో రైతులు 10వేలలోపే ఉండడం గమనార్హం. ఇక వాతావరణ ఆధారిత బీమాలో వేల మంది రైతులు ప్రీమియం కట్టారు. పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఏ యేడాదికి సంబంధించి ఆ యేడాది బీమా పరిహారం డబ్బులు అందజేయాలని రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. తద్వారా తదుపరి పంటల సాగులో పెట్టుబడికి కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో పలువురు రైతులు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లించినా వారికి పరిహారం రాకపోవడంతో ఈయేడాది పలువురు రైతులు ఈ బీమా పొందేందుకు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. సర్వే ప్రారంభం.. జాతీయ బీమా కంపెనీ(ఎన్ఐసీ) జిల్లాలో ఫసల్ బీమా యోజనకు సంబంధించి సర్వే మొదలు పెట్టింది. ప్రధానంగా పంట నష్టం సంభవించిన తర్వాత రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఈ బీమా అధికారులపై సర్వేను త్వరగా ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ కూడా ఎన్ఐసీ అధికారులతో సమావేశమై రైతులకు పరిహారం అందించే విషయంలో సర్వే చేసి పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కాగా మంగళవారం జైనథ్, బేల, ఆదిలాబాద్‌రూరల్ మండలాల్లో ఈ సర్వే మొదలుపెట్టారు. ఎన్ఐసీ క్లస్టర్ మేనేజర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులతో కలిసి సర్వే ప్రారంభించారు. ఇచ్చోడ, తలమడుగు, తాంసి, భీంపూర్లలో బుధవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత పరిహారం విషయంలో స్పష్టత వస్తుంది. అత్యధికంగా వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించి ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తేనే జిల్లాలో అధిక మంది రైతులకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. -
6 జిల్లాల్లో కరువు కాటు!
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు వల్ల భారీగా పంట నష్టం సంభవించిందని వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దాదాపు 5 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట దెబ్బతిందని, దీనివల్ల 3.10 లక్షల టన్నుల మేర వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోయినట్లేనని పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో జూన్, జూలై నెలల వర్షపాతం, వర్ష విరామం (డ్రైస్పెల్), ఇతర నిబంధనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఈ నెల 8న 275 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నష్టాలను మదించి త్వరగా నివేదికలు పంపాలని ఆరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. దీంతో ఈ జిల్లాల్లోని 275 కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నివేదికలు రూపొందించి సంయుక్త వ్యవసాయ కమిషనర్లు కలెక్టర్లకు సమర్పించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సూత్రప్రాయ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర కరువు నిబంధనావళి ప్రకారం 33 శాతం లోపు పంట నష్టం వాటిల్లిన వారికి ఎలాంటి సాయం (పెట్టుబడి రాయితీ) ఇవ్వరు. అందువల్ల ఇలాంటి నష్టాలను వ్యవసాయ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 5 లక్షల హెక్టార్లలో(12.5 లక్షల ఎకరా) 3.10 లక్షల టన్నుల మేరకు పంట దిగుబడి కోల్పోయినట్లు ఆయా జిల్లాల అధికారులు పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. కరువు మండలాల్లో పంట నష్టంపై ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి పంపామని వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు తెలిపారు. పంట నష్టపోయిన 7.40 లక్షల మంది రైతులకు రూ.695 కోట్లు పైగా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులు నివేదించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను వ్యవసాయ శాఖ క్రోడీకరించి పంట నష్టం వివరాలతో సమగ్రమైన నివేదిక రూపొందించి రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌కు పంపుతుంది. విపత్తు నిర్వహణ కమిషనర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితో సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి పంపించి వారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి కరువు సాయం కోసం నివేదిక పంపనున్నారు. తుది నివేదికను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో అత్యధిక నష్టం క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ప్రకారం కరువు వల్ల కర్నూలు జిల్లాలో అధిక నష్టం సంభవించింది. ఈ జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు పంటలు కోల్పోయారు. 2.17 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట నష్టం వాటిల్లింది. ఈ ఒక్క జిల్లాలోనే లక్ష టన్నులపైగా వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోనుందని అంచనా. అనంతపురం జిల్లాలో 2.20లక్షల మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. 1.5లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 1.10 లక్షల టన్నులకుపైగా పంట దిగుబడికి నష్టం జరిగినట్లు అంచనా. చిత్తూరు జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు కరువు వల్ల పంటలు నష్టపోయారు. 90 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల జిల్లాలో 60 వేల టన్నుల వ్యవసాయోత్పత్తుల దిగుబడి తగ్గిపోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
సాగని సాగు.. జాడలేని వానలు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అప్పులు చేసి పంటలు వేసినవారు కొందరు.. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కాలని దుక్కి దున్నినవారు ఇంకొందరు.. ఎకరాలకొద్దీ కౌలుకు తీసుకొని విత్తు వేసిన వారు మరికొందరు.. చినుకు జాడ లేకపోవడంతో ఇప్పుడు వీరందరికీ కంటిమీద కునుకు లేదు! నేలను నమ్ముకొని నింగివైపు ఆశగా చూస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. జూన్ చివరి వారంలో కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసిన అన్నదాతలు తలలు పట్టుకున్నారు. మరో 10 రోజులు ఇలాగే వర్షాలు పడకుంటే పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల వర్షాల్లేక మొలకెత్తిన విత్తనాలు మాడిపోయాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందిన కాడికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పత్తికి ట్యాంకర్లతో నీళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 5.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చెరువులు నిండి బావులు, బోర్లలోకి నీరు వస్తుందని భావించిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. మరో పది రోజులపాటు వర్షాలు కురవకపోతే పత్తి, మొక్కజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటల పరిస్థితి దారుణంగా మారుతుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి కోసం నారుమళ్లు పోసిన రైతులు ఇప్పటిదాకా నాట్లు వేయలేదు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. ఈ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలో గడచిన ఏడాది ఇదే సమయానికి 2.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లోనే సాగయ్యాయి. కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పోస్తున్నారు. ‘‘మరో వారం రోజుల్లో ఓ మోస్తరు వర్షం అయినా కురవకపోతే పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ విభాగం చెప్పడం వల్ల కూడా రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలు ఎండిపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలి’’అని వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. తాజా పరిస్థితిపై సీఎంకు లేఖ రాస్తానని, వనపర్తి జిల్లాలో మంచినీటికి కూడా సమస్యగా ఉందని సాక్షి ప్రతినిధితో చెప్పారు. వరి మరీ దారుణం రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే వరి పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. గడచిన ఏడాది ఇదే సమయానికి సాగు చేసిన దానికన్నా 25 శాతం అధికంగా వరి వేశారు. కానీ వానల్లేక పలుచోట్ల నారుమళ్లు ఎండిపోతున్నాయి. వర్షాలు బాగా పడతాయని ఆశించి గ్రామాలకు వచ్చిన వలసదారులు ఉపాధి కోసం మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘‘నాకు 2 ఎకరాల భూమి ఉంది. ముంబైలో కూలీ పని చేస్తా. మంచి వర్షాలు కురుస్తాయంటే వరి పండించుకుందామని వచ్చి నారుమడి పోశా. కానీ వానల్లేక ఎండిపోయింది. రూ.14 వేలు నష్టపోయా. మళ్లీ ముంబై వెళ్లక తప్పడం లేదు’’అని మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన అంజయ్య ఆవేదన చెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతాల్లో వరి నారుమళ్ల దశలోనే ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖకు ప్రాథమిక సమాచారం అందింది. -
పంట చేలపై అడవి పందుల దాడి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఏటేటా అడవి పందుల సంఖ్య వేలల్లో పెరిగిపోతోంది. సహజ అటవీ సంపద రోజురోజుకూ పలుచబడి అడవి పందులు పంట చేల మీదకు మళ్లుతున్నాయి. విత్తనం వేసిన నాటి నుంచి మొదలుపెట్టి పంట చేతికొచ్చే వరకు రైతు కళ్లలో ఒత్తులేసుకొని కాపు కాసినా... అర్ధరాత్రి వేళ ఆపదొచ్చినట్టు వచ్చి పంట విధ్వంసం చేసి పోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం 1.50 లక్షల ఎకరాలపై అడవి పందుల ప్రభావం ఉన్నట్లు తేలింది. అడవి పందులు రెండేళ్ల కాలంలో ఇద్దరు రైతులపై దాడి చేసి చంపివేయగా.. 12 మందికి గాయపరిచాయి. అయితే.. ఇవేవి అటవీ రికార్డులకెక్కకపోవడం గమనార్హం. పంట చేలపై దాడి చేసే అడవి పందులను చంపవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా.. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనలను ముందు పెట్టి రైతుల చేతులు కట్టేస్తున్నారు. పంట కంటే ముందే పందులు.. మహబూబ్‌బాద్ జిల్లాలో 16 మండలాలు ఉండగా.. దాదాపు అన్ని ప్రాంతాల్లో అడవి పందుల గుంపులు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు నిర్ధారిం చారు. మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లోని గూడూరు, బయ్యారం, గార్ల, కొత్తగూడెం, గంగారం మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఐదు మండలాలల్లో సుమారు 80 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుండగా.. 45 వేల ఎకరాల సాగుపై అడవి పందుల ప్రభావం ఉంటోంది. తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలోని 16 మండలాల్లో కలిపి 5 వేలకు పై గానే అడవి పందుల సంచారం ఉన్నట్లు అంచనా. జయశంకర్ జిల్లాలో.. గత ఏడాది భూపాలపల్లి జిల్లా మహాముత్తారం స్తంభంపల్లిలో రైతు జాడి రాజయ్య (45) పత్తి చేలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. అడవి పంది దాడి చేసి చంపేసింది. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడ, గూడూ రు, వాజేడు, కన్నాయిగూడెం, కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, పలిమెల తదితర మండలాల్లో 1.75లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది. పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో అడవి పందుల సమస్యతో రైతులు పం టలు వేయడానికే భయపడుతున్నారు. ఇక్కడ దాదాపు 75 వేల ఎకరాలపై అడవి పందుల ప్రభావం ఉంటుం దని రైతు సంఘాలు చేసిన ఒక సర్వేలో తేలింది. జనగామ, రూరల్ జిల్లాలో.. జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట, జనగామ, రఘునాథపల్లి, లింగాలఘనపురం 25వేల ఎకరాల్లో, వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్, నల్లబెల్లిలో 5వేల ఎకరాలపై అడవి పందుల తీవ్ర ప్రభావం ఉంది. ప్రత్యేక చట్టం తెచ్చినా.. అడవి పందుల పంట విధ్వంసం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పంట లపై దాడి చేసే అడవి పందులను వేటాడి చంపవచ్చని అందులో పేర్కొంది. ఈ చట్టం రైతులకు కొంత ఊరట నిచ్చింది. అయితే.. ఎలా చంపాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పంట చేలల్లోకి వచ్చే అడవి పందులను వేటాడటానికి రైతులు ఉచ్చులు వేయడం, విష ప్రయోగం, బాణాలు సంధించడం, వలలు పెట్ట డం, కరెంటు తీగలు అమర్చడం వంటి నాటు పద్ధతుల ను అవలంబించేవాళ్లు. ఇందులో కరెంటు తీగలు పెట్టే విధానం అత్యంత ప్రమాదకరం కావడంతో ఇలాంటి రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ మే ఆదేశించింది. ఈ క్రమంలో అటవీశాఖ తన తెలివి తే టలను ప్రదర్శించింది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అడవి పందులను చంపడానికి వీల్లేదని, గన్ ఫైరింగ్‌లో నిపుణులను ఎంపిక చేసి.. వారితోనే కాల్చివేయాలనే నిబంధన ను ప్రభుత్వం ముందు పెట్టింది. ఇలాంటి వాళ్లను తామే ఎంపిక చేస్తామని, రైతుకు రూపాయి ఖర్చు లేకుండా అడవి పందులను చంపిస్తామని ప్రభుత్వానికి చెప్పింది. ఆ ఇద్దరు వస్తేనే.. గన్ ఫైరింగ్ చేయగలిగే ఔత్సాహికులు ఉంటే ఫారెస్టు శాఖలో పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే వాటిని చంపేందుకు ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మాజీ డీజీపీ పేర్వారం రాములు కొడుకు సంతాజీ, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సఫత్ అలీఖాన్ అనే ఇద్దరు ఫైరింగ్ నిపుణులు మాత్రమే ఇందుకు ఒప్పుకున్నారు. పంట చేల మీదపడి పందులు విధ్వంసం చేస్తున్నా.. వాటిని ఏమి అనకుండా రైతులు ముందుగా డీఎఫ్‌ఓకు సమాచారం ఇవ్వాలి. సదరు అధికారి నిజనిర్ధారణ చేసిన తర్వాత ఫైరింగ్ నిపుణులను సంప్రదిస్తారు. వారు సమయం కేటాయిస్తే.. అదే వేళలో పందులు ఎక్కడ ఉన్నాయో రైతులు పసిగట్టి చూపించాలి. వాటిని నిపుణులు ఫైరింగ్ చేసి కాల్చి చంపుతారు. అంతేకాని రైతులు నేరుగా అడవి పందులను వేటాడకూడదనే నిబంధన కఠినతరం చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక చట్టం అమలవుతున్నా... రైతన్నలు అడవిపందుల నుంచి తమ పంటను కాపాడుకోలేక పోతున్నారు. ఇక్కడో దబాయింపు సెక్షన్.. న్యప్రాణులతో పంట నష్టం జరిగితే వరి, చెరుకు పంటలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున , పత్తి, సోయ, పెసర తదితర పప్పు రకాల పంటలకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున పంట నష్టపరిహారం అందిస్తారు. అడవి పందుల దాడిలో మరణిస్తే రూ.5 లక్షలు, గాయపడితే రూ.70 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లిస్తారు. అయితే.. జిల్లాలో అడవి పందుల దాడులు జరుగుతున్నా.. ఫారెస్టు రికార్డుల్లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ క్రమంలో వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తే ఏజెన్సీ ప్రాంతంలోని 50 శాతం భూముల పట్టా హక్కులపై ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తేలింది. ఇటువంటి భూముల్లో పంటలు సాగు చేస్తున్న రైతాంగంపై అడవి పందులు దాడి చేస్తే.. ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. పైగా వన్య ప్రాణుల ఆవాసంలోకి అక్రమంగా చొరబడి వాటి సహజ జీవనానికి విఘాతం కలిగిస్తున్నారని ఉల్టా కేసు పెడుతున్నారు. దీంతో రైతులు పంట నష్టం జరిగినా.. ప్రాణాపాయం వచ్చినా ఫారెస్టు అధికారులకు మాత్రం చెప్పడం లేదు.పంటలు సాగుచేస్తే పందులపాలైతాంది. అష్టకష్టాలు పడి పంటలను సాగు చేస్తే అడవి పందుల పాలైతాంది. రాత్రి వేళల్లో చేలు, పొలాల్లో కలియతిరుగుతూ పంటను పనికి రాకుండా చేస్తున్నాయి. గ్రామస్తులంతా ఏకమై తరమాల్సిన పరి స్థితి వచ్చింది. వాటికి హాని కలిగిస్తే అటవీ అధికారులు కేసులు పెడుతున్నారు. పంటలు కోల్పోయినందుకు మాత్రం అటవీశాఖ అధికారులు పరిహారం ఇవ్వరు. – కోరం నర్సయ్య, గిరిజన రైతు,సర్వాయి(ఏటూరునాగారం) అడవి పందులతో నష్టపోతున్నాం.. గుంపులు గుంపులుగా అడవి పందులే సేండ్ల మీదకొస్తున్నయి. 30 ఏండ్ల నుంచి ఇదే తంతు. మక్క, పత్తి, వరి, కూరగాయలను సర్వనాశనం చేస్తున్నాయి. వ్యవసాయ బావి వద్దకు వెళ్లాలంటేనే వణికిపోతున్నాం. చాలా మంది రైతులు వ్యవసా యం మానుకునే పరిస్థితి నెలకొంది. అడవి పం దుల నుంచి రక్షించాలి. – గీస సందీప్, మన్సాన్పల్లి, బచ్చన్నపేట, జనగామ -
తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టించిన వర్షాలు
-
ప్రకృతి వైపరీత్యంతో రాష్ట్రంలో చాలా నష్టం జరిగింది
-
అకాల వర్షంతో భారీగా పంట నష్టం
-
అకాల వర్షం..అపార నష్టం
-
గాలి వాన బీభత్సం
సాక్షి, కొయ్యలగూడెం : గాలివాన బీభత్సానికి కొయ్యలగూడెం గ్రామ ప్రజలు భీతిల్లారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ గాలులు, దానికి తోడు వర్షం రావడంతో బీభత్స వాతావరణం నెలకొంది. చేతికి అంది వచ్చిన మామిడికాయలు నేలరాలి పోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశోక్ నగర్‌లోని ఆకుల వెంకటేశ్వరరావుకి చెందిన ఇంటిపై తాటిచెట్టు కూలింది. ఆ సమయంలో ఇంట్లోని వారు పక్క గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. అరగంట వ్యవధిలో భారీ వాన, గాలులకు చెట్లు విరిగి నేలకొరిగాయి. -
చేనుపై రాళ్లు.. రైతు కంట నీళ్లు
..ఇలా ఒక్కరిద్దరు కాదు.. రాష్ట్రంలో వేలాది మంది రైతులది ఇదే గోస! అకాల వర్షం అన్నదాతలను కుదేలు చేసింది. ఇప్పటివరకు 16 జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క వరి పంటే 72 వేల ఎకరాల్లో దెబ్బతింది. అదంతా కోతకు సిద్ధంగా ఉన్నదే కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే 15 వేల ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. 7,500 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. బత్తాయి, నిమ్మ తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా నల్లగొండలో 32 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. తర్వాత ఖమ్మం జిల్లాలో 29 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు అనేకచోట్ల గ్రీన్హౌస్ నిర్మాణాలు కూలిపోయాయి. వడగండ్లు పడడంతో చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో అందులో వేసిన పూలు, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. – సాక్షి, హైదరాబాద్ అంచనాలు సిద్ధం చేయండి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలపై సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని, రాబోయే రోజుల్లో పడే వర్షాలతో కలిగే నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. పంట నష్టాన్ని అంచనా వేసి పంపాలని సూచించారు. అధి కార బృందాలు తక్షణం గ్రామాల్లో పర్యటిం చాలని ఆదేశించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అంచనా నివేదికలను రూపొందిస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేశాక కేంద్రానికి పంపుతామని అధికారులు తెలిపారు. 6న గాలి బీభత్సం! గత 24 గంటల్లో హయత్‌నగర్‌లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బూర్గుంపాడులో 4, భద్రాచలంలో 3, భువనగిరి, ములుగు, కూసుమంచి, కంపాసాగర్, గోవిందరావుపేట, దేవరకొండల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉపరితల ద్రోణి కారణంగా ఈ నెల 6న రాష్ట్రంలో అక్కడక్కడ గాలి బీభత్సం, వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాల్లో బీభత్సం నెట్వర్క్: పలు జిల్లాల్లో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో వరి, అరటి, మొక్కజొన్న, మామిడి తోటలు నేలకొరిగాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు స్తంభాలు నేలకొరగడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కోదాడ మండలం ఎర్రవరంలో మొక్కజొన్న నష్టాన్ని చూసి తట్టుకోలేక కౌలు రైతు బంటు హుస్సేన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేరేడుచర్ల మండలం దాసారంలో పొలం పనులు చేస్తుండగా తాటి చెట్టు కూలి కోటా మట్టయ్య (25) అనే రైతు మృతి చెందాడు. తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో 80 సైబీరియన్ కొంగలు మృత్యువాత పడ్డాయి. తిరుమలగిరి మండలం మాలిపురంలో కోళ్లషెడ్డు ధ్వంసమవడంతో వెయ్యి కోళ్లు చనిపోయాయి. -
కడప జిల్లాలో గాలివాన బీభత్సం పంట నష్టం
-
ఆగని ఏనుగుల దాడి
సాక్షి, గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం జరావారిపల్లె సమీపాన పంటపొలాలపై బుధవారం అర్థరాత్రి ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాయి. ఏనుగులు గ్రామ సమీపాన ఉన్నవరి, చెరకు, కాలీఫ్లవర్ పంటలపై పడి నాశనంచేయగా మామిడి చెట్లను విరిచేశాయి. గ్రామానికి చెందిన శివన్న, సరసమ్మ, చంగల్రాయప్ప, భూలక్ష్మి, గురప్ప, ఆదినారాయణ, పురుషోత్తం రైతులకు చెందిన వరి, కాలీఫ్లవర్, చెరుకు పంటలను నాశనం చేశాయి. ఏనుగుల దాడిని గమనించిన రైతులు డప్పులతో శబ్దాలు చేస్తూ వాటిని పొలిమేర దాటించారు. ఏనుగుల దాడిలో పంటల నష్టం రూ.5లక్షల వరకు ఉంటోందని బాధిత రైతులు తెలిపారు. విషయాన్ని అటవీ,రెవెన్యూ శాఖ అధధికారులకు తెలియజేశారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెలే పెద్దిరెడ్డి పర్యటన
-
సీబీఐ వలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గోపాల కృష్ణమూర్తి సాక్షి, హైదరాబాద్: సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో యాంటీ ఇవాషన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎస్.గోపాల కృష్ణమూర్తి.. కాటేదాన్‌లోని కేఎం ప్లాస్టిక్ కంపెనీకి అనుకూలంగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఆ సంస్థ యజమాని జగదీశ్ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన గోపాల కృష్ణమూర్తి బృందం కంపెనీలో తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో అనుకూలంగా రిపొర్ట్ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం రూ.6 లక్షలను గోపాల కృష్ణమూర్తికి జగదీశ్ ఇచ్చాడు. మిగతా రూ.4 లక్షలు మధ్యాహ్నం ఇస్తానని చెప్పాడు. అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ ద్వారా ఈ సమాచారం అందుకున్న సీబీఐ ఇన్స్పెక్టర్ రాందాస్.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని రూ.4 లక్షలు ఇస్తున్న సమయంలో గోపాల కృష్ణమూర్తితోపాటు జగదీశ్ప్రసాద్ను అరెస్ట్ చేశారు. గోపాల కృష్ణమూర్తి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు రూ.5.6 లక్షల నగదుతోపాటు కీలకమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ డీఐజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు. -
కష్టాల వర్దా
► చీకట్లో చెన్నై శివార్లు ►నగరంలో ఆందోళనలు ► మంత్రి కారు ముట్టడి ►50 వేల హెక్టార్లలో పంట నష్టం ►త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందం రాక వర్దా తుపాను తమిళనాడును కకావికలంచేసింది. పచ్చని చెట్లను నేలకూల్చింది.విద్యుత్ స్తంభాల్ని విరిచేసింది. ఈకష్టాలు.. కన్నీళ్ల నుంచి జనం ఇంకాతేరుకోలేదు . చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో మూడు రోజులైనా సాధారణ పరిస్థితులు కానరావడం లేదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత ఏడాది డిసెంబర్లో ఏర్పడిన వరద బీభత్సాన్ని ప్రజలు మరువక ముందే ఈ నెల 12వ తేదీన వర్దా తుపానుతో మరో విలయతాండవాన్ని చవిచూశారు. గంటకు 130–140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దెబ్బకు మూడు జిల్లాలు కకావికలమయ్యాయి. వర్దా విలయతాండవం ముగిసి మూడు రోజులైనా విషాదకర దృశ్యాలు ఇంకా అలానే ఉన్నాయి. ఒక్క చెన్నై నగరం లోనే లక్షవృక్షాలు నేలకొరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రధాన రహదారుల్లో అడ్డంగా పడిన వృక్షాలను తొలగించినా ఇతర రోడ్లలో భారీ వృక్షాలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి. నగరంలో 238 రహదారులు కూలిపోయిన వృక్షాలతో నిండిపోయాయి. సుమారు 20వేల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నా పనులు వేగంగా సాగడం లేదు. రోడ్లకు ఇరువైపునా కూలి ఉన్న వృక్షాలతో చెన్నై నగరం అడవిని తలపిస్తోంది. మూడురోజుల్లో మొత్తం వృక్షాలను తొలగిస్తామని కార్పొరేషన్ హామీ ఇస్తాంది. ప్రస్తుతం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ సరఫరా పునునరుద్ధరణకు 8వేల మంది పనిచేస్తున్నా ఇంకా అనేక ప్రాంతాలు చిమ్మచీకట్లో ముగ్గుతున్నాయి. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ తండియార్పేట, పుదువన్నార్పేట, వవుసీనగర్ తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం ప్రజలు రాస్తారోకో జరిపారు. తిరువొత్తియూరు, దాని పరిసర ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మంత్రి కరుప్పన్నన్ కారును బాధితులు అడ్డగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీకి దిగడంతో ప్రజలు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో సహాయ కమిషనర్, ఇన్స్పెక్టర్లకు గాయాలయ్యాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని, రెండురోజుల్లో పూర్తవుతాయని విద్యుత్ శాఖా మంత్రి తంగమణి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు ఐఏఎస్ అధికారి సబితా నేతృత్వంలో గురువారం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విద్యుత్ కోసం శివారు ప్రాంతాల ప్రజలు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. నిత్యావసరాలకు సైతం నీళ్లు లేకపోవడంతో జనరేటర్లకు గంటకు రూ.2వేలు అద్దె చెల్లిస్తున్నారు. వర్దా తుపాన్ శాంతించినా రాష్ట్రం లో అక్కడక్కడ వర్షాలు కరుస్తూనే ఉన్నా యి. ఊటి కొండ రోడ్డు మార్గంలో కొండచ రియలు విరిగి పడడంతో మూడున్నర గంటల పాటూ ట్రాఫిక్ స్తంభించింది 50వేల హెక్టార్లలో పంట నష్టం: కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో 50వేల హెక్టార్లలో పంటనష్టం సంభవించడంతో రైతన్నలు బావురుమంటున్నారు. అరటి, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. కాంచీపురంలో 55వేల ఎకరాల్లో వరిసాగు కోతలకు వచ్చింది. వర్దా తుపానుతో చేతికందిన పంటను కోల్పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంచీపురం, చెంగల్పట్టు, ఉత్తిరమేరూరు ప్రాంతాల్లో 10వేల ఎకరాల చెరుకుతోట, 10వేల ఎకరాల అరటితోట దెబ్బతింది. తిరువళ్లూరు జిల్లాలో మాత్రమే 30వేల హెక్టార్ల పంటనష్టం సంభవించినట్లు అంచనా. త్వరలో కేంద్ర బృందం రాక: వర్దా తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు త్వరలో కేంద్రబృందం రాష్ట్రానికి చేరుకోనుంది. వర్దా తుపాన్ వల్ల రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా. తుపాన్ సహాయార్థం వెంటనే రూ.1000 కోట్లు కేటాయించాల్సిందిగా సీఎం పన్నీర్‌సెల్వం రెండురోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రం రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపి నష్టం అంచనాలు సిద్ధం చేసేందుకు అంగీకరించింది. -
అన్నదాత ఆగమే
పంట చేలపై చీడపీడల దాడి నీట మునిగి ఎర్రబారిన సోయాబీన్ నేల రాలుతున్న పత్తి పూత, కాయలు తొలి అంచనాలో 50 వేల హెక్టార్లలో నష్టం తాజాగా 25 వేల హెక్టార్లకు కుదింపు గగ్గోలు పెడుతున్న రైతన్న సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అది సెప్టెంబర్ 22.. వర్షం కురిసిన రాత్రి. ఆ రోజు నుంచి కుండపోతే. విస్తారమైన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. చేలను ముంచెత్తాయి. కోత కొచ్చిన పునాస నీటి పాలైంది. కోసిన పంట మొలకెత్తింది. రైతన్న కాయకష్టం గంగలో కలిసింది. యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. వరద పాలైన పంటల వివరాలను లెక్కగట్టింది. 53377.20 హెక్టార్ల పంట నష్టం జరిగిందని ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. తాజాగా వ్యవసాయ శాఖ ఆ నివేదికను ఉపసంహరించుకుంది. కేవలం 25.5 వేల హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందని నివేదించింది. ఈ నివేదికతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. తొలి నివేదిక ఇలా... వరుసగా వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు పునాస పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. జిల్లాలో కురిసిన కుండపోతే కాదు కర్ణాటక, మహారాష్ట్ర వరదలు తోడవడంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లి పంట చేల వైపు నీళ్లు మళ్లాయి. కొన్ని చోట్ల పంట పూర్తిగా నీళ్లలో మునిగిపోగా... మరికొన్ని చోట్ల ఎడతెరిపి జల్లుల కారణంగా పంటలు చీడపీడల బారిన పడ్డాయి. జిల్లాలోని 46 మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లాలో ప్రధాన పంటలైన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ కోత కొచ్చిన సమయంలో నీటి పాలయ్యాయి. కొన్ని కోసిన మొక్కజొన్నలు కళ్లాలోనే నీళ్లలో తడిసి మొలకెత్తాయి. పంట నష్టం వివరాలను అంచనా వేయడానికి రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ 53377.20 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, రూ.48.47 కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని అంచనా వేసింది. 25,076 హెక్టార్లలో మొక్కజొన్న, 11,937 హెక్టార్లలో పత్తి, ఆరు వేల హెక్టార్లలో సోయాబీన్, 2,944 హెక్టార్లలో వరి, 1,424 హెక్టార్లలో జొన్న, 1,270 హెక్టార్టలో కంది, 3.20 హెక్టార్లలో చెరకు పంటలు దెబ్బతిన్నాయని నివేదించింది. తొలి నివేదిక ప్రకారం మండలాల వారీగా నష్టం ఇలా.. మెదక్ మండలంలో 40 హెక్టార్లు, మనూరు మండలంలో 32 హెక్టార్లు, కోహీర్‌లో 84, కొండాపూర్‌లో 39.20, జిన్నారంలో 522, చిన్నశంకరంపేటలో 250, పాపన్నపేటలో 20, కోహీర్‌లో 2,240, రేగోడ్‌లో 250 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రాయికోడ్‌లో 3,750 హెక్టార్లు, మునిపల్లిలో 650, జహీరాబాద్‌లో 2,600, న్యాల్కల్లో రెండు వేలు, ఝరాసంగంలో 150, కొల్చారంలో 13 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ములుగులో 3,906, జగదేవ్‌పూర్‌లో 10,275, వర్గల్లో 4,504, గజ్వేల్‌లో 9,070, కొండపాకలో 6,160, తూప్రాన్‌లో 2,098 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నదని స్పష్టమైన లెక్కలు వేసి నివేదిక ఇచ్చింది. సీఎం దత్తత గ్రామాల్లో ఇలా... ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు నర్సన్నపేట-ఎర్రవల్లిలో విత్తనోత్పత్తి పథకం కింద 790 ఎకరాల్లో సోయాబీన్ వేశారు. పంట చేలు ఏపుగా పెరిగాయి. దాదాపు పంట కూడా చేతికంది వచ్చింది. కాయలు పండుబారిన దశలో కోయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామస్తులు నిర్ణయించారు. ఇంకో వారం పదిరోజులైతే పంట కోతకు వచ్చేది. అనుకోకుండా భారీ వర్షాలు రావటం, కూడవెల్లి వాగు పొర్లటంతో జోన్ -1 వ్యవసాయ పరిశోధన క్షేత్రంలోని పంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. రెండు రోజుల తరువాత పంట తేలింది. కానీ నీటిలో మునగటంతో మొక్కలు ఎర్రబడి పంట పూర్తిగా పోతోంది. ఇది ఒక్క నర్సన్న పేటలో కాదు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. తాజా నివేదిక... నిజానికి ప్రాథమిక అంచనా కంటే పూర్తి స్థాయి సర్వేలో పంట నష్టం పెరగాలి. కానీ విచిత్రంగా ఇక్కడ మాత్రం సగానికి సగం తగ్గింది. 25,501 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిన్నదని కేవలం రూ.19 కోట్ల విలువైన నష్టం జరిగిందని అధికారులు మలి నివేదికలో పొందుపరిచారు. తొలి నివేదికలో మొక్కజొన్న పంట నష్టం 25,076 హెక్టార్లని చెప్పిన అధికార్లు మలి నివేదికలో కేవలం 1,887 హెక్టార్లు మాత్రమే అని నివేదించారు. సోయాబీన్ తదితర పంటల నష్టం విస్తీర్ణం కూడా కుదించి నివేదించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకొచ్చిన మొక్కజొన్న నీటిలో తడవటంతో గింజ నాణ్యత, రంగు కోల్పోతాయని, రంగు పోయిన ధాన్యానికి ధర వచ్చే అవకాశం లేదని, వారం రోజులపాటు ఎండలు లేకుండా కంకి పూర్తిగా నీళ్లలో తడవటం ఫంగస్ సోకిందని, ఆ గింజలకు మార్కెట్లో కొనేదిక్కు ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొట్టకొట్టి నష్ట పరిహారం నుంచి తప్పించుకునేందుకే అధికారులు ఇలాంటి తప్పుడు నివేదికలు సృష్టించారని రైతులంటున్నారు. -
పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు గార్ల : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గార్ల మండలంలోని పూమ్యాతండా, సేరిపురం ప్రాంతాల్లో దెబ్బతిన్న మిర్చి తోటలను మంగâýæవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాలకు నష్టపోయిన మిరప, పత్తి, వరి చేలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సర్వే చేయించి ఎకరాకు రూ.30,000 నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటినప్పటికీ రైతులకు మూడవ విడత రుణమాఫీ నగదును బ్యాంకుల్లో జమ చేయకపోవడంతో రైతులకు నేటికీ పంట రుణాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, నానా అగచాట్లు పడుతున్నారని ఆందోâýæన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలును సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, మండల అధ్యక్షుడు ధరావత్ సక్రు, నాయకులు నాదెండ్ల రామారావు, గుగులోత్ హరి, ఎండి.మైనొద్దీ¯ŒS, బి.స్వామి, పి.సాదిక్ఖా¯ŒS, ఎం.రాజ, షఫియా, మహబూబి, ఇస్తావత్ సాలి తదితరులు ఉన్నారు. -
ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండి
ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద తగ్గు ముఖం పట్టడంతో సహాయక చర్యలు చేపట్టడానికి, పంటనష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. -
చెప్పేదొకటి.. చేసేదొకటి..
♦ ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు రెయిన్గన్లు ఇస్తారట! ♦ 13,933 మంది రైతుల నోట్లో మట్టికొట్టనున్న సర్కారు ♦ రూ.18.22కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎసరు కడప అగ్రికల్చర్: ఘనమైన హామీలిచ్చే పాలక ప్రభుత్వం, మంత్రులు ఆపదలో ఉన్న రైతులను నిలువునా దోపిడీ చేయడానికి సిద్ధమైంది. పంటలు నష్టపోయి పరిహారం కోసం ఏళ్ల తరబడి రైతన్న నిరీక్షిస్తున్నా పైసా కూడా పరిహారం అందిచక పోగా ఆ నిధులను ఇతర ప్రచారాలకు, స్కీములకు మళ్లించడానికి సిద్ధమవుతోంది. అదేమంటే వర్షాభావ పరిస్థితుల్లో పంటకు నీటి తడులు అందించే రెయిన్గన్ల కొనుగోలుకు ఇన్పుట్ సబ్సిడీ పరిహార నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నేడో రేపో ప్రభుత్వం జీవో జారీ చేయనున్నట్లు అధికారులు అంటున్నారు. అంతకు ముందుగానే అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైతులకు చెందాల్సిన పరిహారాన్ని అందించకుండా ఇలా ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలతో కమీషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల సొమ్ములను ఇలా వాడుకుంటారా? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 50 వేల హెక్టార్లకు రెయిన్గన్లు.... ఈ ఖరీఫ్ సీజన్లో ఉద్యాన పంటలకు రాబోయే విపత్తులను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా పంటలను కాపాడతామని, ఇందుకుగాను రెయిన్గన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రభుత్వం ఇటీవల విజయవాడలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ప్రకటించింది. అదేమంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పరిహారానికి ఈ రెయిన్‌గన్‌ను ముడిపెట్టారు. జిల్లాలో 50 వేల హెక్టార్లకు ఈ రెయిన్గన్లను వినియోగించాలని, అందుకు తగ్గ ప్రణాళికలను తయారు చేయాలని ఉద్యానశాఖను ఆదేశించింది.జిల్లా ఉద్యాన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఎసరు పెట్టింది ఈ పరిహారానికే.... జిల్లాలో 2010లో ఫిబ్రవరి నుంచి 2015 నవంబరు వరకు ప్రకృతి విపత్తులతో 70,566.361 హెక్టార్లలో ఉద్యాన పంటలు తోటలు దెబ్బతినగా 13933 మంది రైతులు రూ. 18.22 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంత వరకు పైసా కూడా ప్రభుత్వం విదిల్చకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీనే ప్రభుత్వం ఇలా వినియోగించడానికి సిద్ధమవుతుండడంతో రైతులు మండిపడుతున్నారు. -
పంటపొలాలపై ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గురువారం వేకువజామున పందేలమడుగు, రామకుప్పం గ్రామాల రైతులకు చెందిన మామిడి తోటలు, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 10 ఏనుగులు సమీపంలోని అట వీ ప్రాంతం నుంచి వచ్చి రూ.8 లక్షల వరకు నష్టం కలిగించాయని రైతులు తెలిపారు. -
వర్షం మిగిల్చిన నష్టం
♦ వరుస వర్షాలతో మొయినాబాద్ అతలాకుతలం ♦ పంటనష్టం కన్నా.. ప్రాణ నష్టమే ఎక్కువ ♦ తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు ♦ సాధారణం కన్నా వందశాతం ఎక్కువగా వర్షపాతం నమోదు వర్షాలు మండలాన్ని అతలాకుతలం చే శాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో వర్షం కురవడంతో పిడుగుపాటుకు ఇద్దరు రైతులతో పాటు ఏడు పశువులు మృతి చెందాయి. ప్రహరీ కూలి 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలు ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. చెట్లు కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి కాయలు రాలడంతో పాటు పలు కూరగాయలు, పూల పంటలకు నష్టం జరిగింది. - మొయినాబాద్ మండలంలో ఈ నెల 2వ తేదీ నుంచి అకాల వర్షాలు మొదలై ఏకదాటిగా కురుస్తూనే ఉన్నాయి. రెండో తేదీన భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అదేరోజు తోలుకట్ట గ్రామానికి చెందిన రైతు కోమటి నర్సింహ (48)తో పాటు పెద్దమంగళారంలో రెండు ఆవులు, కుత్బుద్దీన్‌గూడలో ఓ గేదె, ఓ ఆవు, రెడ్డిపల్లిలో ఓ ఎద్దు మృతి చెందాయి. సురంగల్‌లో ఈదురుగాలులకు ప్రహరీ కూలి 30 గొర్రెలు మృతి చెందాయి. ఈదురు గాలులతో పెద్దమంగళారంలో రెండిళ్లు కూలి పోయాయి. 3వ తేదీన ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పెద్దమంగళారంలో ఒక ఇల్లు, పశువులపాక రేకులు ఎగిరిపోయాయి. 5వ తేదీ సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కాశీంబౌలిలో ఓ విద్యుత్ స్తంభం విరిగిడ పోయింది. 7వ తేదీన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ పడ డంతో తోలుకట్టలో పిడుగు పడి రైతు చెన్నం భిక్షపతి (45) మృతి చెందాడు. ఎత్బార్పల్లిలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందాయి. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ చెట్టు పడడంతో ప్రహారీ కూలిపోయింది. నేలరాలిన మామిడి కాయలు... ♦ మండల వ్యాప్తంగా సుమారు రెండువేల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలు తొమ్మి ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలకు సగానికిపైగా మామిడి కాయలు నేలరాలిపోయాయి. దీంతో పాటు వడగళ్ల వర్షానికి గ్రామాల్లో కూరగాయ, పూల పంటలకు నష్టం జరిగింది. ♦ ఇప్పటి వరకు 106.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.. ♦ మేనెలలో సాధారణ వర్షపాతం 5 మిల్లీమీటర్లే అయినప్పటికీ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా మే ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు 106.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కరీంనగర్లో వడగండ్ల వాన
- భారీగా పంట నష్టం తిమ్మాపూర్ (కరీంనగర్) ఉరుములు మెరుపులతో కురిసిన వడగండ్ల కరీంనగర్ రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో పంటనష్టం సంభవించింది. జిల్లాలో పలు చోట్ల వడగండ్లతో కూడిన వాన పడింది. ఈ వానతో చేతికి అందివచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఐదెకరాల్లో చెరకు దగ్ధం
కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో ఐదెకరాల చెరకు పంట మంగళవారం దగ్ధమైంది. ఇమామ్‌సాహెబ్ అనే రైతు ఈ పంటను సాగు చేస్తున్నాడు. తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పంట అంతా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఎకరాకు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టానని రైతు వాపోయాడు. -
చిత్తూరులో నీటమునిగిన గ్రామాలు
-
జలదిగ్బంధం
జిల్లా అంతటా భారీ వర్షాలు కేవీబీపురంలో అత్యధిక వర్షపాతం నమోదు పలు చెరువులకు గండ్లు నేలమట్టమైన ఇళ్లు 12వేల హెక్టార్లలో పంట నష్టం నీటమునిగిన లోతట్టు గ్రామాలు స్తంభించిన రాకపోకలు చిత్తూరు (అగ్రికల్చర్): రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. జిల్లావ్యాప్తంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కేవీబీపురంలో 143.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చెరువులకు గండ్లుపడగా, లోతట్టు గ్రామాలు నీటమునిగి ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలశయాల గేట్లు ఎత్తివేయడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 12వేల హెక్టార్ల మేరకు ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. అరణియార్ ప్రాజెక్టులో నాలుగు గేట్లు, కృష్ణాపురం జలాశయంలో రెండు గేట్లు, బహుదా ప్రాజెక్టులో రెండు గేట్లు, ఎన్టీఆర్ జలాశయంలో ఆరు గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో ఐదువేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. ముచ్చువోలు రోడ్డు దెబ్బతినడంతో పోలవరం, చిట్టత్తూరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కేవీబీపురం మండలంలో రాజులకండ్రిగ, ఎగువ పూడి రోడ్లు దెబ్బతినడంతో వడ్డిపాళెం, పోలినాయనికండ్రిగ, జయలక్ష్మీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం పేరూరు చెరువు ప్రమాదస్థాయికి చేరుకుని నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతంలోని తారకరామ నగర్, హరిపురం కాలనీ, జనార్థన్ కాలనీలలో 250 ఇళ్ళు జలమయమవ్వగా, ఒక ఇల్లు కూలిపోయింది. పాకాల మండలంలో ఒక ఇల్లు నేలమట్టమయ్యింది. రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లె వద్ద వరి పంట పూర్తిగా నీట మునిగింది. రామచంద్రాపురం మండలం రాయలచెరువు మొరవ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తిరుపతి, పచ్చికాపల్లం రోడ్డు జలమయమై వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం దివిటిగారిపల్లె అమ్మచెరువు, మొరంపల్లె కోనగుంట చెరువు, పేయనగారిపల్లె చెరువు, దామరగుంటచెరువులు కట్టలు లీకేజీ అవుతూ గండిపడే స్థితికి చేరుకుంది. బంగారుపాళెం మండలంలో టేకుమంద, తుంబపాళెం, శెట్టేరి, నల్లంగాడు, వెంకటాపురం, రామాపురం చెరువుల కట్టలు లీకేజీ అవుతున్నాయి. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలంలోని శ్రీరంగం చెరువు మొరవ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వంద ఇళ్లు జలమయమయ్యాయి. నగరి మండలం బీమానగర్ చెరువు ఉధృతంగా మొరవ పోతుండడంతో నగరిపేట కాలనీలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. వడమాలపేట మండలం చీమలవారివంక పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బైపాస్ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. వరి, చెరకు పంట వంద ఎకరాల మేరకు దెబ్బతింది. పుత్తూరు, మేషనూరు రోడ్డు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.చిత్తూరు నియోజకవర్గంలో గుడిపాల మండలంలో రాసనపల్లె గ్రామం చుట్టూ వరదనీరు చేరడంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తు తం గ్రామసమీపంలోని రైల్వేట్రాక్‌పై నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సత్యవేడు నియోజకవర్గంలో రాళ్లకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడం తో సత్యవేడు, తొండంబట్టు, అంబికాపురం, నాగనందాపురం, ఎంజీ నగర్, సీఎస్.పురం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బాలకృష్ణాపు రం చెరువుకు తమిళనాడుకు చెందిన తెలుగు గంగ ద్వారా నీరు రావడంతో చెరువుకట్టకు గ్రామస్తులు గండికొట్టారు. పాములకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరదయ్యపాళానికి దారి పూర్తిగా మూసుకుపోయింది. సంతవెల్లూరు రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణాపురం జలాశయం నిండిపోవడంతో మూడు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జలాశయంలో ఆరు గేట్లు ఎత్తివేసి రోజుకు 350 క్యూసెక్కల మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన చెరువు, కార్వేటినగరం మండలం కొత్తచెరువు, వెదురుకుప్పం మండలం కసవనూరు చెరువులకు గండిపడడంతో లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వెదురుకుప్పంలో నాలుగు, పాలసముద్రం మండలంలో పది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎస్ఆర్పురం మండలంలో 17 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పెనుమూరు, వెదురుకుప్పం, గంగాధరనెల్లూరు మండలాల్లో దాదాపు 200 హెక్టార్ల పంట దెబ్బతింది. -
పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. వైఎస్సార్ జిల్లా పెండ్లి మర్రి మండలంలో ఆయన గురువారం పర్యటించారు. భారీ వర్షాల కారణంగా మండలంలో భారీ స్థాయిలో వరిపంట నీట మునిగిందని.. ఆయన అన్నారు. రైతులతో మాట్లాడి.. పంటనష్టంపై సమాచారం సేకరించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు. -
భారీ వర్షాలపై బాబు టెలీ కాన్ఫరెన్స్
మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రాంతాల కలెక్టర్లతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి పై ఆరా తీశారు. పంట నష్టం పై నివేదిక సమర్పించాల్సిందిగా కోరారు. ఫార్మ్ పాండ్స్ కాన్సెప్ట్ ను నాలుగు జిల్లాలో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం కింద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. పంట నష్టంపై సర్వే నిర్వహించి.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
పంట నష్టం.. అప్పుల బాధతో 10 మంది బలవన్మరణం సాక్షి, నెట్వర్క్: వర్షాభావంతో పంటల నష్టం.. అప్పుల బాధతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 8 మంది గుండెపోటుతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిమనగుం టపల్లికి చెందిన నారాయణరెడ్డి(61) రూ.లక్షన్నర వరకు చేసిన అప్పు తీర్చలేక శనివారం పురుగుల మందు తాగాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన ఖానాపురం రమేష్ (25).. రూ. 4.5 లక్షల అప్పు తీర్చేమార్గం కనిపించక శనివారం పొలంలో ఉరేసుకున్నాడు. ఇదే జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌కు చెందిన కడాల వెంకటేష్(42) బోర్లు, పంటల సాగుకు చేసిన రూ. 3 లక్షల అప్పు తీర్చలేక చెట్టుకు ఉరివేసుకున్నాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురానికి చెందిన మహ్మద్ బడేసాహెబ్ (44) రూ. 4 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చలేక శుక్రవారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లా ఖానాపూరం మండలం చిలుకమ్మనగర్‌కు చెం దిన రేసు రావుులు(45).. పంటలు అంతంత వూత్రంగా ఉండడం, పెళ్లికి ఎదిగిన కూతురు ఉండటంతో దిగులు చెంది ఈ నెల 7న క్రిమిసంహారక వుందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల సేవాలాల్‌తండాకు చెందిన జాదవ్ దత్తు(50) తన కుమార్తె పెళ్లి కోసం, పంటల సాగు కోసం చేసిన రూ.2.85 లక్షల అప్పు తీర్చలేక పురుగుల మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన గోర్గంటి సాయిలు(43) రూ.లక్ష వరకు చేసిన అప్పు తీర్చలేకపోవడం, పంటలు ఎండిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం సదర్శాపురానికి చెందిన తుంగపాటి నరేష్ పత్తిసాగు, బావిపూడికతీతకు చేసిన 5 లక్షల అప్పు తీర్చలేక పురుగులమందు తాగాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం పంచాయతీ పోచారానికి చెందిన సక్రూ(55) రూ. 7 లక్షల వరకు బ్యాంకు, ప్రైవేటు అప్పులయ్యూరుు. అప్పులు తీరే మార్గం లేక సక్రూ పురుగుల మందు తాగాడు. ములకలపల్లి మండలం సుబ్బనపల్లికి చెందిన సోయం గోవిందరావు (45).. మల్బరీ సాగుతో ఆర్థిక బాధలు అధికమయ్యాయని, షెడ్డు నిర్మాణానికి 3 లక్షల అప్పు అయిం దని, రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన ఫలితంలేకుండా పోయిందని లేఖ రాసి ఆత్మహత్మకు పాల్పడ్డారు. గుండెపోటుతో 8 మంది మృతి పంటల సాగు కోసం చేసిన అప్పులు, పంటలు దెబ్బతినడంతో ఆవేదన చెంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామానికి చెందిన పొనగంటి మొండయ్య(83), సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన రైతు గోనెల పోచయ్య(55), హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకి చెందిన జెట్టి కొమురయ్య(56), రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎలుకగూడకు చెందిన మోకిల కిష్టయ్య(60), మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం గోటూర్కి చెందిన కుర్వ బాలప్ప(48), నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లికి చెందిన గట్టుపల్లి వెంకట్‌రెడ్డి(41), ఖమ్మం జిల్లా జగన్నాథపురం పంచాయితీ సండ్రకుంటకి చెందిన కొర్సా నాగేశ్వరరావు (50), నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ రైతు బొజ్జా పుల్లయ్య(70) గుండెపోటుతో మృతి చెందారు. -
అప్పుల బాధతో ఆగిన రైతు గుండె
చేసిన అప్పులు తీర్చే మార్గం లేక .. ఓ రైతు గుండె ఆగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని మక్తాకొత్తగూడెంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన గుండాల దేవలింగం(38)కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అందులో దేవలింగం పన్నెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా పంటలు లేక పోవడం.. బోర్లు వేసినా.. నీళ్లు పడక పోవడంతో అప్పుల పాలయ్యాడు. రెండేళ్లుగా వస్తున్న నష్టాలతో పాటు.. ప్రై వేటు వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెరిగింది. ఈ ఏడాది వేసిన పత్తి వేశాడు.. నీరు లేక పంట ఎండి పోయింది. ఈ క్రమంలో గురువారం ఉదయం చేను వద్దకు వెళ్లివచ్చిన దేవలింగం గ్రామంలో తోటి రైతులతో పంట ఎండి పోయిందని మాట్లాడుతూ.. కుప్పకూలి పోయాడు.. గ్రామస్తులు ఆటోలో సూర్యాపేటకు తరలిస్తుండగానే.. మార్గ మధ్యలో మృతిచెందాడు, సమాచారం తెలుసుకున్న తహశీల్దారు, ఏవో, ఎస్సైలు గ్రామానికి చేరుకుని.. మృతికి గల కారణాలు విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు దేవలింగంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రి మృతిని తట్టుకోలేక పెద్ద కుమార్తె సొమ్మ సిల్లి పోయింది. ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. -
పొలాల్లో ఏనుగుల మంద విధ్వంసం
శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం జంబాడ గ్రామ శివార్లలోని పొలాల్లో ఏనుగుల మంద బుధవారం విధ్వంసం సృష్టించింది. నాలుగు ఏనుగులు స్వైర విహారంతో పొలాలు, తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో గిరిజనులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు. -
అప్పుల బాధ తో రైతు బలవన్మరణం
అప్పుల భారం మరో కౌలు రైతు ఉసురు తీసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శేరిపల్లి యాదయ్య(52) గత కొన్నేళ్లుగా 15 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. పత్తి, మొక్కజొన్న పంటలు సరిగా పండకపోవటంతో రూ.లక్ష అప్పు మిగిలింది. కూతురు పెళ్లి కోసం రూ.2 లక్షల అప్పు అయింది. పంటలు సరిగా లేక అప్పులు తీరేదారి కానరాక మనస్తాపం చెందిన యాదయ్య మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య అంజమ్మ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
400 ఎకరాలు, 100 ఇళ్లు జలమయం
శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో సుమారు 400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పెరవలి, బసినేపల్లి గ్రామాల్లో 100 ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదోని ఆర్డీవో ఓబులేసు నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. -
ప్రొద్దుటూరులో భారీ వర్షం..
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నీటమునిగాయి. వర్షం శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. వర్షంలోనే పారిశుద్ధ్య సిబ్బంది నాలాల్లో పూడికను తొలగిస్తున్నారు. మరోవైపు మండలంలోని మడూరు, కానపల్లె తదితర గ్రామాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. సుమారు 80 ఎకరాల్లో మినుము, పత్తిపంటలకు నష్టం వాటిల్లింది. పట్టణంలో 30 భారీ వృక్షాలు నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు. -
హంద్రీనీవా కాల్వతూమును పరిశీలించిన ఎమ్మెల్యేలు
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూమును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరిశీలించారు. నీటి ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతంలో వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. కాలువ వరదతో పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు ఐజయ్య, చరితారెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి ఉన్నారు. -
హంద్రీనీవా నీరు వృథా: భారీగా పంట నష్టం
హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ తూముకు షట్టర్ వేయకపోవటంతో నీరు పంట పొలాలపైకి ప్రవహించి భారీగా పంట నష్టం సంభవించింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూము ఉంది. నీటి అవసరం తీరాక ఈ తూము షట్టర్‌ను రైతులు కిందికి దించుతుంటారు. మంగళవారం రాత్రి అలా చేయకపోవటంతో నీటి ఉధృతికి కాలువలో అడ్డుగా ఉంచిన ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. వరద దిగువనున్న పంట పొలాలను ముంచెత్తింది. దీంతో దాదాపు వందెకరాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న, పొగాకు నీటి పాలైంది. అర్థరాత్రి దాటిన తర్వాత గమనించిన రైతులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఈ శ్రీనివాస నాయక్ నీటిని ఆపివేయించి, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టారు. -
అన్నదాతలకు పరిహాసమే!
- 2014 జూన్ 2 నుంచి 1,115 మంది రైతుల ఆత్మహత్య - పరిహారం పెంచినా బాధిత కుటుంబాలకు వర్తించని వైనం - బలవన్మరణాలకు పాల్పడింది 409 మందేనని సర్కారు కాకిలెక్కలు సాక్షి, హైదరాబాద్: పంటనష్టం ఆవేదనతో, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం... పరిహారం ప్రకటనలో మాత్రం వారికి అన్యాయమే చేసింది. ఇప్పటికే తమ ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు... పెంచిన పరిహారం వర్తించదని చెప్పి మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (2014, జూన్ 2) నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,100 మందికి పైగా రైతులు బలవన్మరణం చెందగా... వారి కుటుంబాలను ప్రభుత్వం విస్మరించింది. శనివారం నుంచి జరిగే ఘటనలకు మాత్రమే రూ.6 లక్షల కొత్త పరిహారం వర్తిస్తుందని ప్రకటించింది. ఇందులో రూ.5 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేసి, మిగతా రూ.లక్షతో వన్‌టైం సెటిల్మెంట్ కింద అప్పులు తీరుస్తామని పేర్కొంది. అయితే వన్‌టైం సెటిల్మెంట్లో ప్రైవేటు అప్పులు మాత్రమే కాకుండా బ్యాంకు రుణాలు కూడా తీర్చాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై సర్కారు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అన్నీ తప్పుడు లెక్కలే! ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్యపైనా సర్కారు కాకిలెక్కలు చూపుతోంది. ఇటీవల సర్కారు వెల్లడించిన లెక్కల ప్రకారం 409 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 141 మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. మిగతా వారికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వ్యవసాయ సంబంధిత అప్పుల కారణంగా ఆత్మహత్యగా ప్రభుత్వం పరిగణించడం లేదు. ఇలా అనేక కొర్రీలు పెడుతోంది. అయితే రైతు సంఘాలు వేసిన లెక్కల ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్య 1,115కు పైనే. -
రాజధానిలో రైతు ఆత్మహత్య
హైదరాబాద్: పంట నష్టం ఆవేదన.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలన్న ఆందోళన.. కన్న కొడుకు అనారోగ్యం.. వైద్యం చేయించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దైన్యం.. అన్నీ కలసి ఓ రైతన్న ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇంతకాలం గ్రామాల్లోనే జరుగుతు న్న రైతుల ఆత్మహత్యలు దీనితో రాజధానికి చేరాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన లింబయ్య అనే రైతు బుధవారం హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో కరెంట్ స్తంభానికి ఉరి వేసుకొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రాతాలరామరెడ్డికి చెందిన నేరళ్ల లింబయ్య(50), శ్రీలక్ష్మి దంపతులు. లింబయ్యకు ఐదెకరాల పొలం ఉంది. దీనిపై వచ్చే ఆదాయంతోనే కుటుం బాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నరేష్ (25) డిగ్రీ పూర్తిచేయగా, నవిత (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. మరో కుమారుడు నవీన్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం కామారెడ్డిలో చదువు తున్నాడు. మూడేళ్లుగా పెద్ద కుమారుడు నరేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజుల నుంచి మూర్ఛలు రావడంతో చాదర్‌ఘాట్‌లో న్యూలైఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఒకవైపు రాబడి లేకపోగా మరోవైపు దాదాపు రూ.4 లక్షల అప్పు కావడంతో కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. ఆస్పత్రిలో కుమారుడి వద్ద ఉన్న లింబయ్య బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య లక్ష్మికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఉద యం 8 గంటలకు లోయర్ ట్యాంక్‌బండ్‌లో కట్టమైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్నాడు. పూజారిని కలసి రూ.10 వేలు అక్కడ పెట్టి ఆస్పత్రిలో ఉన్న తన కొడుక్కి అందజేయాలని చెప్పి వెళ్లాడు. తొలుత బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లింబయ్యను అక్కడున్న స్థానికులు, పోలీసులు కాపాడి పక్కనే కూర్చోబెట్టారు. తర్వాత ఆలయం సమీపంలోని చెత్త డంపింగ్‌యార్డ్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు స్తంభానికి వైర్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో పోలీసులు కాస్త పసిగట్టినా లింబయ్య ప్రాణం దక్కేది. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా మారింది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రి మృతి విషయాన్ని ఆస్పత్రిలో ఉన్న కొడుకుకు చెప్పలేదు. ప్రస్తుతం నరేష్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పోషణ భారమైంది: లక్ష్మి మూడేళ్లుగా పంటలు రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయని, కొడుకు ఆరోగ్యం క్షీణిం చిందని లింబయ్య భార్య లక్ష్మి వాపోయింది. వీటికితోడు కుటుంబ పోషణ భారమవడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విలపిం చింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ లక్ష్మి రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. -
ఆగని ఆత్మహత్యలు
- ఒక్కరోజే నలుగురు రైతుల బలవన్మరణం - రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఇప్పటికీ - కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి - శనివారం వరకు బెళగావి, మండ్య, శివమొగ్గ, - మళవళ్లి, జిల్లాల్లో నలుగురు రైతులు - ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరు(బనశంకరి) : బెళగావికి చెందిన రైతు బాబాసాహేబజమతి (42)కి 4 ఎకరాల పొలం ఉంది. సాగుకు పెట్టుబడుల నిమిత్తం ఎస్బీఐ బ్యాంకులో రూ.లక్ష 5 వేలు అప్పుతోపాటు ప్రైవేటు వ్యక్తులనుంచి కూడా అప్పులు చేశాడు. పంటనష్టం రావడంతో అప్పులు తీర్చేదారి కానరాక రైతు పొలంలోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఈఘటనపై రామదుర్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు నెలల నుంచి బెళగావిలో 10 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కల్లుదేవనహళ్లికి చెందిన రైతు కుమార్(33)కు ఒకటిన్నర ఎకరాపొలం ఉంది. దాన్ని సాగు చేయడానికి పెట్టుబడుల నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పుచేశాడు. పంట నష్టం రావడంతో అప్పు తీరే దారి లేక తన పొలంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండ్య గ్రామాంతర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైతు లోకేశ్ (45) ఏడెకరాల భూమిలో చెరకు పంటవేశాడు. బోరు తవ్వడానికి, సాగుకు పెట్టుబడుల నిమిత్తం రూ.6 లక్షలు, బ్యాంకులో రూ.లక్ష 50 వేలు అప్పు చేశాడు. చెరకు పంట రావడం, బోరులో నీరు రాకపోవడంతో అప్పులు తీర్చే దారిలేక శనివారం విషం తాగి ఆత్మహత్మకు పాల్పడ్డాడు. శివమొగ్గ జిల్లా కుంసి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేజికొప్ప గ్రామానికి చెందిన రైతు నారాయణప్ప(55)కు సాగు కోసం బ్యాంకులో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.లక్ష అప్పులు చేశాడు. నారాయణప్ప మూడురోజుల క్రితమే అదృశ్యం అయ్యారు. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని శవంలా కనిపించాడు. దీనిని గమనించిన స్థానికులు తక్షణం కుంసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మళవళ్లి జిల్లా త్యాజ్య గ్రామానికి చెందిన రైతు కెంపేగౌడ(45) తన పొలంలో రేష్మపంట, చెరకు పంట వేశాడు. అయితే పట్టుగూళ్ల ధర అకస్మాత్తుగా పడిపోవడంతో కంగారుపడిన ఇతను తీవ్ర మన స్థాపం చెంది శనివారం మధ్యాహ్నం తోట నుంచి ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో వారికి తెలిపి, కాస్త దూరంలో తోట వద్దనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. -
ఆగని రైతు ఆత్మహత్యలు
రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదుగురు బలవన్మరణం బెంగళూరు(బనశంకరి) : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటనష్టం, అప్పుల బాధతాళలేక తీవ్ర మనస్థాపం చెందిన అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నారు. హవేరి జిల్లాలో... హవేరిజిల్లాకు మద్లేరి గ్రామానికి చెందిన రైతు దిళ్లప్పసణ్ణకంచేళెర(50) తనకున్న మూడెకరాల భూమిలో చెరుకు ఇతర పంట పెట్టుబడుల నిమిత్తం వివిధ బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులనుంచి రూ.4 లక్షల మేర అప్పులు చేశాడు. పంటనష్టం రావడంతో అప్పులు తీర్చేమార్గం కానరాక దిక్కుతోచని స్దితిలో గురువారం ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే హవేరి గ్రామాంతర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కెరెమత్తెహళ్లికి చెందిన రైతు మంజుబీమప్పనవర్(32) తనకున్న 1.5 ఎకరాల భూమిలో చెరుకు పంట పెట్టుబడుల కోసం సహకారబ్యాంక్లో రూ. 1 లక్ష మేర అప్పుచేశాడు. నీరు లేక చెరుకు పంట ఎండిపోయింది. పెసరుపంట సక్రమంగా దిగుబడిరాలేదు. ఈ నేపథ్యంలోనే అప్పు చెల్లించాలంటూ బ్యాంకుల అధికారులు నోటీసులు పంపారు. పంటనష్టం రావడంతో అప్పుతీర్చేమార్గం లేక రైతు మంజుబీమప్పనవర్ ఇంటిలో గురువారం ఉరివేసుకున్నాడు. మండ్య జిల్లాలో మండ్య జిల్లా మద్దూరు తాలూకా బీదరహొసహళ్లి కి చెందిన రైతు కెంపేగౌడ(45) తనకున్న 30 గుంటల భూమిలో చెరుకు, రేషం పంట పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పు చేశాడు. చెరుకు పంటకు మద్ధతు ధర లభించకపోవడంతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో గురువారం తెల్లవారుజామున కెంపేగౌడ తన పొలం వద్దకు చేరుకుని చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లాలోని కృష్ణరాజపేటె తాలూకా కిక్కేరి హొబళి సొళ్లాపుర గ్రామానికి చెందిన రైతు పాపేగౌడ(75) తనకున్న రెండన్నర ఎకరాల పొలంలో చెరుకు పంట వేశాడు. దీని పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పులు చేశాడు. చెరుకు పంట ఫ్యాక్టరీకి తరలించినా అప్పుతీర్చడానికి సాధ్యం కాకపోవడంతో బుధవారం రాత్రి విషం తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని హసన్ జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను మరణించాడు. కాగా, మండ్య జిల్లాలో ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతుల సంఖ్య 24కు చేరుకుంది. తుమకూరు జిల్లాలో బంగారునగలు కుదవపెట్టి బోరు తవ్వించినా నీరు లభించకపోవడంతో తీవ్రమనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శిరా తాలూకాలో చోటుచేసుకుంది. నాదూరు గ్రామానికి చెందిన రైతు సిద్దేశ్వరప్ప(40) తనకున్న ఆరున్నర ఎకరాల పొలంలో కొబ్బరితోట, వక్కచెట్లు వేశాడు. గత ఏడాది బోరు బావి ఏర్పాటు చేయించాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో అందులో నీరు లభ్యం కాలేదు. పంటను కాపాడుకోవటానికి భార్య, అమ్మ వద్ద ఉన్న నగలను కెనరాబ్యాంకులో కుదవపెట్టి వారం రోజుల క్రితం మళ్లీ బోరు వేయించాడు. దీనిలో కూడా నీరు లభించ లేదు. నీరు లేకపోవడంతో కొబ్బరి, వక్కచెట్లు ఎండిపోవడం మొదలయ్యాయి. మొక్కజొన్న పంట కూడా ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారి కనిపించలేదు. దీంతో గురువారం ఉదయం అతను ఉరి వేసుకున్నాడు. -
రామకుప్పంలో గాలి, వాన బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఆదివారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఈ వర్షానికి మండలంలోని పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 300 ఎకరాల్లోని మామిడి తోట పూర్తిగా దెబ్బతింది. మామిడి కాయలు నేలరాలాయి. వర్షానికి సుమారు రూ.25 లక్షల పంట నష్టం వాటిల్లింది. వీటితో పాటు కూరగాయల పంటలు కూడా నాశనమయ్యాయి. 10 రేకుల షెడ్లు పాక్షికంగా, బందార్లపల్లి గ్రామంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమయింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. (రామకుప్పం) -
వస్తాండ్రు.. చూస్తాండ్రు.. పోతాండ్రు!
డిచ్పల్లి: ఏటా పంటలు సాగు చేస్తున్నాం.. నష్టపోతూనే ఉన్నాం.. నష్టం జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు వచ్చి చూస్తున్నారు.. పోతున్నారు. అయితే ఇప్పటి వరకు నష్ట పరిహారం అందించి ఆదుకున్నవారు ఎవరూ లేరూ.. అంటూ బాధిత రైతులు కేంద్ర కమిటి సభ్యుల ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి తాము బాధపడుతుంటే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాం..పరిహారం అందేలా చూస్తామని హామీలు గుప్పిస్తారు, గొప్పలు చెబుతారే తప్ప ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా వరుసగా పంటలు నష్ట పోతున్నామని, కానీ ఇప్పటి వరకు ఒక్కరూపాయి నష్ట పరిహారం అందలేదని వాపోయారు. పంటల బీమా చేసుకోండి.. నష్టం వస్తే ఉపయోగపడుతుందని చెబుతూ బీమా సొమ్మును తీసుకుంటున్నారు కానీ పరి హారం ఇవ్వడం లేదన్నారు. వ్యక్తిగతంగా బీమా సొమ్ము వసూలు చేస్తున్నప్పుడు, గ్రామాన్ని, మండలాన్ని యూనిట్ గా తీసుకుని పరిహారం అందిస్తామని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వ నిబంధనల్లో ఎక్కడ లోపం ఉందో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా కేంద్రప్రభుత్వానికి నివేదిక అం దజేస్తామని కేంద్ర పరిశీలన కమిటీ కన్వీనర్ డాక్టర్ మోహన్‌లాల్ హామీ ఇచ్చారు. పరిహారం కూడా సత్వరం అందేలా చూస్తామన్నారు. ఒక్క గ్రామంలోనే 1800 ఎకరాల్లో పంట నష్టం సిరికొండ మండలం కొండూర్ గ్రామంలోనే సుమారు 1800 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వానకు పంటలు పూర్తిగా నష్టపోయి ఒక్క మా కుటుంబంలోనే సుమారు 15 లక్షలు నష్టపోయాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప, ఇప్పటికీ రూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. -చల్ల గోపాల్‌రెడ్డి, కొండూర్ గ్రామం, సిరికొండ మండలం పంటను అలాగే వదిలేశాను రబీలో పది ఎకరాల్లో వరి పంటను వేశాను. రేపు పంట కోస్తమని అనంగా వడగళ్లు కురిసి పంట పూర్తిగా నేల పాలైంది. కోయడానికి కూడా రాకపోవడంతో అలాగే పొలంలో వదిలేశాను. వంద శాతం నష్టం జరిగింది. ఎకరానికి రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. మా ఊర్లో 140 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. -చాగంటి లక్ష్మన్, కలిగోట్, జక్రాన్‌పల్లి మండలం -
అకాల వర్షాలతో రైతులు విలవిల
హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్నే తెచ్చిపెట్టాయి. జిల్లాలోని సుల్తానాబాద్, ఓదేలు మండలాల్లో ఆకాల వర్షాలతో భారీగా ధాన్యం తడిసిపోయింది. ఐకేపి, సహాకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యానికి మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతులను ఆదుకుంటాం : మంత్రి తుమ్మల
పెనుబల్లి (ఖమ్మం): ఖమ్మం జిల్లా పెనుబల్లి, తల్లాడ మండలాలలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పెనుబల్లి, తల్లాడ మండలాలలో అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను, నేల రాలిన మామిడికాయ తోటలను, వడగండ్ల వానకు పంట కోల్పోయిన మొక్కజొన్న తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల.. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతీ రైతు పొలాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి, ప్రభుత్వానికి నష్టపోయిన రైతుల వివరాలతో సమగ్రంగా నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదిక అందగానే ప్రభుత్వం నుంచి కొత్త జీవో ప్రకారం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా సాయం చేస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి సమాచారాన్ని అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
అకాల వర్షం.. అపార నష్టం
- దెబ్బతీసిన ఈదురు గాలులు సిద్దిపేట రూరల్: మండలంలోని నాంచారుపల్లి, బక్రిచెప్యాల, ఎల్లుపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలుల వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గాలులు వీయడంతో వరి పొట్ట దశలో ఉండడంతో భారీగా నష్టం చోటుచేసుకుంది. అదే విధంగా మామిడి తోటలతో పాటు పలు ఇళ్లు సైతం కూలిపోయాయి. అలాగే పౌల్ట్రీ ఫారల్లో కోళ్లు కూడా చనిపోయాయి. నాంచారుపల్లి, బక్రిచెప్యాల గ్రామాల రహదారిపై భారీ వృక్షాలు కూలిపోగా, అదే గ్రామంలో చెట్టు కరెంట్ తీగలపై పడింది. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఎన్వై గిరి పంటలను పరిశీలించారు. మూడు గ్రామాల్లో 120 ఎకరాల్లో వరి పంట, 52 ఎకరాల్లో మామిడి తోటలు, నాలుగు ఇళ్లతో పాటు పౌల్ట్రీలో కోళ్లు మృత్యువాత పడ్డట్లు సిద్దిపేట తహశీల్దార్ పేర్కొన్నారు. -
గాలివానతో ఏపీలోనూ పంట నష్టం
సాక్షి నెట్వర్క్: ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పంటనష్టం వాటిల్లింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని వరి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, మామిడి, అరటి, బొప్పాయి, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి. విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తం భాలు నేలకొరిగాయి. అనంతపురం జిల్లాలో అరటి, బొప్పాయి, మామిడి, వరి, పత్తి, కూరగాయలు, ఆకు, వక్కతోటలకు నష్టం వాటిల్లింది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో సూళ్లూరుపేట- గుమ్మిడిపూండి రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పిడుగులు రైల్వేలైన్‌పై పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది -
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షం వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో వరి, మామిడి రైతులతోపాటు ఇతర రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ జిల్లాలో వడగళ్లు, ఈదురు గాలులకు పంటల కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 2,393.4 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఏజెన్సీ ప్రాంతంలో 68.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాంనగర్ వద్ద జీడివాగు ఉప్పొం గి ప్రవహిస్తుండగా, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలమట్టం కాగా, వాహనాల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాడ్వారుు మండలంలోని మేడా రం వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా గుండ్రాతి మడుగులోని రైలు సిగ్నల్ ప్యానెల్ బ్లాంక్ డెడ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు రైల్వే అధికారులు తెలి పారు. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో చెట్టు కింద ఉన్న బెడిద భీరయ్యతో పా టు మరో ఇద్దరు రైతులు రాజు, జయరాములు పిడుగుపాటుకు గురయ్యారు. భీరయ్య శరీరం కాలిపోగా, మిగ తా ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసుకున్న సుమారు ఐదు వందల టన్నుల ధాన్యం శుక్రవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దరుుంది. మండల వ్యాప్తంగా సుమారు కోటీ యూభై లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తం గా 470 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఉద్యానవన శాఖ ఒకటో డివిజన్ పరిధిలో 234 హెక్టార్లలో మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. కొడంగల్, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. -
అకాల వర్షం : నీటమునిగిన మిర్చి
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం పరిధిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి పొలంలో ఉన్న మిర్చి నీటిపాలైంది. మిర్చితో పాటు మిగతా పంటలకు నష్టం చేకూరింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెల్సిందే. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడం వల్ల తీవ్రంగా నష్టపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
పంట నష్టం 500 కోట్లు
వరి, మొక్కజొన్న (హెక్టార్లలో) 40,000 ఉద్యాన పంటలు (హెక్టార్లలో) 30,000 - వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, మోహనభాయి కాందా రియా సందర్శన సాక్షి, హైదరాబాద్: కాలంగాని కాలంలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో రైతన్న కుదేలైపోయాడు.. వరి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు రూ.500 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి మోహనభాయి కాందారియా పర్యటించారు. నల్లగొండ జిల్లాలో నష్టపోయిన పంటలను వెంకయ్య, మోహనభాయి కాందారియా, కరీంనగర్ జిల్లాలో బండారు దత్తాత్రేయ పరిశీలించారు. అలాగే పంట నష్టం అంచనాకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసన్.. రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని సహా ఇతర అధికారులను కలిశారు. పర్యటన అనంతరం పంట నష్టంపై ప్రధాని మోదీకి నివేదిక అందజేస్తామని, అనంతరం రాష్ట్రానికి సాయంపై నిర్ణయం తీసుకుంటారని కేంద్ర ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. 40వేల హెక్టార్లలో..: ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40,131 హెక్టార్లలో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఇక 30 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. వరి 26,632 హెక్టార్లలో, నువ్వులు 7,806, సజ్జలు 3,230, మొక్కజొన్న 1,474, జొన్న 933, పెసర పంటకు 51 హెక్టార్లలో నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని ప్రకటించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో అన్ని పంటలు కలిపి 15,403 హెక్టార్లలో దెబ్బతిన్నాయని... నల్లగొండ జిల్లాలో 11,969 హెక్టార్లు, నిజామాబాద్ జిల్లాలో 7,039 హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్పారు. ఇక ఉద్యాన పంటల్లో ప్రధానంగా మామిడికి 15 వేల హెక్టార్లలో నష్టం జరిగిందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘బీమా’ అందేనా..? భారీగా పంట నష్టం జరిగినా... రైతులకు ఏమేరకు బీమా అందుతుందో కూడా వ్యవసాయశాఖలోని బీమా విభాగం అధికారులు అంచనా వేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నష్టపోయిన రైతుల్లో ఎంతమంది రైతులు రబీలో ప్రీమియం చెల్లించారో కూడా లెక్కలు లేకపోవడం దారుణం. ఇక ఉద్యానశాఖలో రైతులు రూ.56 లక్షల మేరకు ప్రీమియం చెల్లించినా... బీమా సంస్థ అధికారులు పంట నష్టంవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఒక అధికారే పేర్కొనడం గమనార్హం. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం: జిల్లాల్లోని అధికారులు మాత్రమే పంట నష్టపోయిన ప్రాంతాల్లో అక్కడక్కడా పర్యటిస్తున్నారు. కేంద్ర బృందంతో రాష్ట్రస్థాయి అధికారి ఒకరు మాత్రమే ఉన్నారు. వర్షాలు, నష్టాలు తమ పని కాదన్నట్లుగా.. అది పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం పని అన్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. కనీసం రాష్ట్రస్థాయిలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంలోనూ వ్యవసాయశాఖ విఫలమైంది. వ్యవసాయశాఖలోని ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారుల వద్ద ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఉండటం లేదు. మంత్రి కార్యాలయానికి కూడా తాజా సమాచారాన్ని అందించడంలేదన్న విమర్శలున్నాయి. వర్షాలు తగ్గుముఖం నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్తంత తగ్గుముఖం పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని.. ఆ తర్వాత కురవబోవని పేర్కొంది. గత 24 గంటల్లో అత్యధికంగా వరంగల్ జిల్లా తాడ్వాయిలో 5 సెంటీమీటర్లు, ఘన్‌పూర్‌లో 3.4, వెంకటాపూర్‌లో 2.4, అమ్రాబాద్‌లో 2.6, భూపాల్పల్లి, వెంకటాపురంలలో ఒక్కో సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. 30% నష్టం జరిగినా పరిహారం: వెంకయ్య భువనగిరి: ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు 30 శాతం పంటలను నష్టపోయినా పరిహారం చెల్లిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించాలన్న మోదీ ఆదేశం మేరకు తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నామన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి మోహన్‌భాయ్ కందారియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఇటీవలి వర్షాలకు నష్టపోయిన పంటలను వెంకయ్య పరిశీలించారు. అనంతరం భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 50 శాతం పంట నష్టం జరిగి తేనే పరిహారం ఇచ్చేవారన్నారు. అధికారులు గ్రామాల్లో నష్టం అంచనాలను తయారుచేసి పంచాయతీల వద్ద ఉంచాలన్నారు. తాము ప్రాథమిక అంచనాలను రూపొందించి ప్రధానికి నివేదిక అందిస్తామని, తర్వాత అధికారుల బృందం మళ్లీ నష్టం అంచనాలను సేకరిస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సాయం: దత్తాత్రేయ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాలను బుధవారం పరిశీలించిన దత్తాత్రేయ.. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ పంట నష్టపరిహారాన్ని 50 శాతం మేరకు పెంచారని దత్తాత్రేయ పేర్కొన్నారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వీలైనంత త్వరగా పరిహారం అంచనాలను రూపొందించి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల నుంచే పెంచిన పరిహారం అమల్లోకి వస్తున్నందున, అందుకు తగినట్లుగా అంచనాలను రూపొందించాలన్నారు. రైతాంగాన్ని ఆదుకుంటాం: కేటీఆర్ జగిత్యాల: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్గల్ , మేడిపెల్లి మండలం కట్లకుంట, కోరుట్ల మండలం జోగిన్‌పెల్లి, మాదాపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు, త్వరలోనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాథమిక సర్వే ప్రకారం దాదాపు 25 శాతం పంటలకు నష్టం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి, పెగడపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు అధికారుల నివేదిక వచ్చిన తర్వాత 2 నెలల్లోగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలో దెబ్బతిన్న పంటలను మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. నివేదికలు అందిన వెంటనే పరిహారం అందిస్తామన్నారు. వెంటనే వివరాలు సేకరించాలి: జానా, ఉత్తమ్ అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల వివరాలను 24 గంటల్లో పూర్తిస్థాయిలో సేకరించాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్లో వానకు దెబ్బతిన్న వరి పంట, మామిడి తోటలను వారు బుధవారం పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైతులు నష్టపోయి 2 రోజులైనా.. వారికి భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అకాల వర్షంతో భారీగా పంట నష్టం
నిజామాబాద్ : అకాల వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులతో కూడిన భారి వర్షం కారణంగా ఎర్రజొన్నలు, పసుపు పంట నీట మునిగింది. లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ( సిరికొండ) -
7,027 ఎకరాల్లో పంట నష్టం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రెండు రోజుల పాటు జిల్లాలో కురిసిన వర్షాల మూలంగా 7,027 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పంట నష్టంపై రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. మార్చి రెండో తేదీన అత్యధికంగా 8.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం జిల్లాలో నమోదైంది. అలంపూర్, కొల్లాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, జడ్చర్ల, భూత్పూరు మండలాల్లో అత్యధికరంగా వర్షం కురిసింది. అయితే వీపనగండ్ల, కొల్లాపూర్, అలంపూర్, పెబ్బేరు మండలాల్లో వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల మూలంగా పంటలు దెబ్బతిన్నాయి. వీపనగండ్ల మండలం చిన్నమరూరు, పెద్దమరూరు, కొప్పునూరు, వెల్టూరు, పెద్దదగడ, బెక్కెం, జటప్రోలు, లక్ష్మీపూర్ గ్రామాలు పంట నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు కొల్లాపూర్ మండలం సిరిసాల, మల్లేశ్వరం, పెబ్బేరు మండలం యాపర్ల, అలంపూర్ మండలం లింగన్వాయి మండలాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, శనగ పంటలు తీవ్రంగా దెబ్బతినగా, మినుము, పెసర, వేరుశనగతో పాటు బీన్స్, ఉల్లి, మిర్చి పంటలు కూడా దెబ్బతిన్న పంటల జాబితాలో ఉన్నాయి. మామిడి తోటలకు మాత్రం ప్రస్తుత వర్షాలు ఊతమిచ్చేవిగా ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పంటనష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు భగవత్ స్వరూప్ ‘సాక్షి’కి వెల్లడించారు. పంట నష్టం వివరాలు పంట నష్టం (ఎకరాల్లో) మొక్కజొన్న 3,554 శనగ 1,123 మినుము 612 పెసలు 376 వేరుశనగ 400 బీన్స్ 102 చెరుకు 216 మిర్చి 279 నువ్వులు 280 ఇతరాలు 85 మొత్తం 7,027 -
రూ.32.81 కోట్ల పంట నష్టం
కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. కరువు పరిస్థితులపై రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కరువు పరిస్థితులపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం డిసెంబరు నెల15వ తేదీ రాత్రి జిల్లాలో 48 మండలాలను కరువు బారిన పడినట్లు ప్రకటించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కరువులో దెబ్బతిన్న పంటల తుది జాబితా తయారీకి సిద్ధమైంది. డిసెంబరు నెల 23 నుంచి 31వ తేదీ వరకు నివేదిక తయారు చేసేందుకు ఏఓ, ఏఇఓలు, గ్రామ రెవిన్యూ అధికారుల బృందాలు పంటలను సందర్శించి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీ సంబందింత అధికారులను ఆదేశించారు. దీంతో యంత్రాంగం క్షేత్రస్థాయిలో 20 మండలాల్లో ఎలాంటి నష్టంలేదని, మిగతా 28 మండలాల్లో తొమ్మిది రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంగళవారం క్షేత్రస్థాయి యంత్రాంగం తుది జాబితాను జిల్లా వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీకి సమర్పించింది. ఆ నివేదికను కలెక్టర్‌కు ఇన్చార్జ్ జేడీ సమర్పించారు. జిల్లాలోని 28 మండలాల్లో అత్యధికంగా పంట నష్టాలు జరిగాయని అంచనాలు వేశారు. గతంలోనే రైతులు ఆయా పంటలకు సంబందించి ఫోటోలను తయారు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఆ విధంగా రైతులు తీసుకున్న పంటల ఫోటోలను అధికారులకు సమర్పించారు. ఆ ఫోటోల ఆధారంగా అలాగే గ్రామ రెవిన్యూ అధికారులు ముందుగనే రైతులు సాగు చేసిన పంటలను అడంగళ్‌లో రాసి ఉన్నారు. ఆయా పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో రెవిన్యూ కార్యాలయాల్లో బృందాలు పరిశీలించి నివేదికలు తయారు చేశాయి. పంటలు విస్తీర్ణం పంట నష్టం బాధిత (హెక్టార్లలో) (రూ.లలో) రైతులు వరి 471.282 47,12,820 1074 వేరుశనగ 13273.026 13,27,30,760 9854 కంది 132.712 8,29,450 309 పత్తి 18619.623 18,61,96,230 18971 నువ్వులు 118.212 5,91,060 167 జొన్న 22.86 1,14,300 28 ఉలవలు 283.78 17,73,625 540 సజ్జ 243.116 12,15,580 404 చెరకు 1.8 8,000 02 మొత్తం 33165.461 32,81,71,825 41349 -
పరిహారం..పరిహాసం..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటేనే ఆ సాయానికి సార్ధకత ఉంటుంది. బాధితులకు మేలు జరుగుతుంది. కాని ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పంటనష్టం పరిహారం గురించి నోరు మెదపడం లేదు. అరకొరగా నిధులు మంజూరు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. 2012లో నీలం తుపాను నష్ట పరిహారం ఇప్పటికీ పూర్తిగా రైతులకు అందలేదంటే రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధేపాటిదో అర్థమవుతోంది. ఇక గతేడాది వర్షాలకు జరిగిన పంట నష్టానికి ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ విషయాన్ని కొత్త ప్రభుత్వం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతలో హుదూద్ ఈ ఏడాది ఖరీఫ్ పంటను తుడిచిపెట్టేసింది. ఇంకా పంట నష్టం అంచనాలు తయారు పనిలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు. విశాఖ రూరల్: పంటనష్టం పరిహారం చెల్లింపు పరిహాసమవుతోంది. పరిహారం వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం పెట్టుబడి రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికి రోజుకో ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఈక్రమంలో ఇప్పట్లో అన్నదాతలకు హుదూద్ ఇన్పుట్ సబ్సిడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రబీ ప్రారంభమైంది. రుణ మాఫీ పేరుతో బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాలను రద్దు చేయలేదు. ఫలితంగా ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు లేకుండాపోయాయి. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మదుపులు పెట్టిన అన్నదాతలను హుదూద్ కోలుకోలేకుం డా చేసింది. ఇప్పటికైనా రైతాంగానికి పరి హారాన్ని వెంటనే అందించే ఏర్పాట్లు చేస్తే కనీ సం రబీసాగుకైనా సంసిద్ధులవ్వడానికి అవకాశముంటుంది. లేకపోతే జిల్లాలో రబీ సాగు లక్ష్యం 50 శాతం కూడా చేరుకొనే అవకాశముండదని అధికారులే భావిస్తున్నారు. రూ.12.25 కోట్లు పరిహారం వచ్చేనా! గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అధిక వర్షాలు పంటలను ముంచెత్తాయి. వరుసగా అల్పపీడనం, హెలెన్ కారణంగా జిల్లాలో 13,341 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 52,426 మంది రైతులకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఇంతకు రెట్టింపు నష్టం జరిగినప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షలు కారణంగా కేవలం రూ.12.25 కోట్లు పెట్టుబడి రాయితీకే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ఆ వరదలకు 1191.29 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 9212 మంది రైతులకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీరికి రూ.1.87 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఈ పరిహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం దృష్టి సారించలేదు. ఇదిలా ఉంటే 2012 నీలం తుపాను పరిహారం ఇప్పటికీ పూర్తిగా అందకపోవడం విశేషం. అప్పట్లో రూ.30.41 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ఇంకా 20,364 మంది రైతులకు రూ.1.23 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది. ఉద్యాన పంటలకు సంబంధించి 7920 మంది రైతులకు రూ.3.45 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు ఈ పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఖజానా ఫ్రీజ్ చేయడంతో నిధులు విడుదల కాలేదు. రైతులు ఎదురుచూపులు ఏటా తుపాన్లు రైతులను నిలువునా ముంచుతున్నాయి. కాని పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతులు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడి రాయితీని వెంటనే మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పరిహారం విషయంపై కనీసం నోరెత్తడం లేదు. -
ఎన్నాళ్లీ గజగజ!
దశాబ్దాలుగా తీరని ఏనుగుల సమస్య తరచూ పంట పొలాలపై దాడులు అడవిని వదిలి ప్రాణాలు కోల్పోతున్న ఏనుగులు మూడు రాష్ట్రాల కారిడార్ ఎప్పుడో? పలమనేరు: జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో దశాబ్దాలుగా గజరాజుల దాడులతో రైతు లు నష్టపోతూనే ఉన్నారు. పంట పొలాల వైపునకు ఏనుగులు రాకుండా అటవీ శాఖ సోలార్ ఫెన్సింగ్ నిర్మించినా లాభం లేకపోతోంది. ఏటా వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతూనే ఉంది. రైతుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లింది. ఏనుగులు సైతం మృత్యువాత పడుతున్నాయి. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం పంటలను ధ్వంసం చేసే ఏనుగు గుంపులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో 1984లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదు. లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం చూపుతుండడంతో ఏనుగులు పంటలను నాశనం చేస్తూనే ఉన్నాయి. పొలాల వద్ద కాపలా ఉన్న మనుషులను కూడా చంపేస్తున్నాయి. అసలు సమస్య ఇదీ పలమనేరు, కుప్పం పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర వ్యాపించి ఉంది. ఇందులో 36 ఏనుగులున్నట్లు అటవీ శాఖ చెబుతోంది. ఇవి అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం బంగారుపాళెం మం డలం నుంచి కుప్పం వరకు 230 కి.మీ. మేర సోలార్ ఫెన్సింగ్‌ను రెండు దఫాలుగా ఏర్పా టు చేసింది. 40 కి.మీ. మేర ఏర్పాటు చేయాల్సి ఉంది. పలుచోట్ల ఫెన్సింగ్ ఇప్పటికే దెబ్బతింది. వీటిని పర్యవేక్షించేందుకు లైన్ వాచర్లను ఏర్పాటు చేసినా వారు పట్టించుకోవడం లేదు. అడవిలో మేత, నీటిసౌకర్యం లేకపోవడంతో ఏనుగులు ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి మరీ పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 225 ఎకరాల్లో ఏనుగులు పంటను ధ్వంసం చేసినట్టు అధికారుల అంచనా. అడవిని వదిలి ప్రాణాలు కోల్పోతున్న ఏనుగులు అడవి నుంచి బయటకొచ్చే ఏనుగులు తరచూ మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఆరు ఏనుగులు వివిధ రకాల కారణాలతో చనిపోయాయి. ముఖ్యంగా వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలతోనే చాలా వరకు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని దాహం తీర్చుకునేందుకు వచ్చి లోయల్లో పడి చనిపోయాయి. మూడు రాష్ట్రాల కారిడార్ ఎప్పుడో.. ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బన్నేరుగట్ట, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్‌ను నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొజెక్ట్‌కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. ఏనుగుల సంరక్షణ కోసం అడవుల్లో నీటి కుంటలు, షెల్టర్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు కందకాలు (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్) చేపడితేగానీ సమస్య పరిష్కారమయ్యేలా లేదు. పదేళ్లుగా బాధపడుతున్నాం.. నా పొలం అడవికి ఆనుకొని ఉంది. పదేళ్లుగా ఏనుగుల కారణంగా పంట నష్టపోతూనే ఉన్నా. సోలార్ ఫెన్సింగ్ అలంకారంగా ఉంది. ఇక గవర్నమెంట్ నుంచి సాయం ఎప్పుడొస్తుందో తెలీదు. -మురుగన్, రైతు, చెత్తపెంట,పలమనేరు మండలం ప్రభుత్వం స్పందించాలి.. ఏనుగుల కారణంగా రైతులు పంటలను నష్టపోతూనే ఉన్నారు. అడవిని వదిలి ఏనుగులు బయటకు రాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు రైతులకందాల్సిన నష్టపరిహారాన్ని పెంచి పంపిణీ చేయాలి. -ఉమాపతి నాయుడు, రైతు సంఘం నాయకులు త్రీ స్టేట్స్ కారిడార్‌తోనే పరిష్కారం ఈ సమస్య మూడు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ప్రత్యేక కారిడార్ నిర్మాణంతోనే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. ఇప్పటికే తమ ఉన్నతాధికారులు రెండు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించారు. త్వరలోనే పనులు ప్రారంభం కావచ్చు. -బాలవీరయ్య, ఎఫ్ఆర్వో, పలమనేరు -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో ఇంకొకరు.. విద్యుదాఘాతంతో మరొకరు మృతి కరెంటు కోసం రైతుల ఆందోళన వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ శనివారం వరంగల్ జిల్లా కురవిలోని మానుకోట- ఖమ్మం రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న రైతులు రామడుగు/వర్ని: పంటనష్టం.. అప్పుల బాధతో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన ఊకంటి మధుసూదన్‌రెడ్డి(44) రెండేళ్లుగా తనకున్న రెండెకరాల భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతేడాది అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతినగా, ఈసారి వర్షాభావంతో పంట ఎండిపోరుుంది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఇద్దరు కుమారుల పై చదువులకు సైతం అప్పు చేశాడు. ఈ క్రమంలో మొత్తం అప్పులు రూ.3.50 లక్షలయ్యాయి. వీటిని తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది శనివారం వేకువజామున వ్యవసాయ భూమి వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే, నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన ఖైరొద్దీన్ (35) తనకున్న 20 గుంటల పొలంతోపాటు మూడెకరాలు పొలం కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు.పెట్టుబడులకు, ఇతర ఖర్చులకు రూ. రెండు లక్షల వరకు అప్పుచేశానని, రబీలో పంట రాలి పోయిందని, ఖరీప్‌లో పంట ఎండిపోతోందని చెబుతూ బాధపడే వాడు. ఈ క్రమంలో ఈనెల 9న నిజాంసాగర్‌లో దూకగా, శనివారం చందూర్ గ్రామ శివారులో మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య , కుమారుడు పాషా , కూతురు జరీనా ఉన్నారు. గుండెపగిలి రైతు మృతి నల్లగొండ : అప్పులబాధ తాళలేక గుండెపోటుతో ఓ రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మాదు నారాయణ(55) గ్రామంలో రైతుల వద్ద భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ అవసరాలు, వ్యవసాయ సాగు అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. పంటల దిగుబడి ఆశాజనకంగా లేదు. మరో వైపు అప్పుల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురవడంతో శనివారం తెల్లవారుజామున నారాయణకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ గ్రామానికి చెందిన డాంగె శ్రీనివాస్ (40) అనే రైతు శుక్రవారం అర్ధరాత్రి తన పంట పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కరెంట్ ట్రిప్పు కావడంతో బోరు వేసేందుకు చీకట్లో తన పొలానికి వెళ్లాడు. బోరు ఆన్‌చేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇంటికి రాకపోయేసరికి ఉదయం కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. -
నష్టం @26 వేల ఎకరాలు
ఖమ్మం వ్యవసాయం: ఈనెల 7 నుంచి నాలుగు రోజుల పాటు వచ్చిన గోదావరి వరదలతో జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతంలో 26,014 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే ఏ పంటలు ఎంతశాతం మేర నష్టపోయాయో అంచనా వేసేందుకు అధికార యంత్రాగం సమాయత్తమవుతోంది. మూడు, నాలుగు రోజుల పాటు పొలాల్లో నీరు నిలిచి పైర్లు కుళ్లిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో మటి ్టకొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. వరి దుబ్బు నుంచి గుండ్రకు తిరిగే దశలో ఉండగా, పత్తి పూత నుంచి కాత దశలో ఉంది. మొక్కజొన్న కంకి దశలో, పెసర, మినుము పూత దశలో ఉన్నాయి. మిర్చి మాత్రం మొక్క దశలో ఉంది. అయితే ఆయా దశల్లో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు మాత్రమే నష్ట పరిహారం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిరప మొక్కలు వేసి నాటి కొద్ది రోజులే అవుతున్నందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటికి పరిహారం వర్తించదని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. అయినా.. పై రెండు శాఖల అధికారులు మాత్రం నష్టపోయిన పంటలన్నింటి వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి పంట నష్టం అంచనా వేయనున్నారు. నిబంధనల మేరుకు 50 శాతం పైగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం ఇస్తారు. వరి, పత్తి పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న హెక్టారుకు రూ. 8,333, పెసర, మినుము పంటలకు హెక్టారుకు రూ. 6,250, ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టం జరిగిన మిర్చి హెక్టారుకు రూ.10 వేలు నష్ట పరిహారంగా చెల్లిస్తారు. నష్టం వివరాలివీ... ఇటీవలి గోదావరి వరదలతో వీఆర్ పురం, కూనవరం, చింతూరు, భద్రాచలం, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, చర్ల, మణుగూరు, పినపాక, అశ్వాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లోని 13,233 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాలకు చెందిన 4291 మందికి చెందిన 8,287 ఎకరాల వరి, 7260 మంది రైతులకు చెందిన 13,522 ఎకరాల పత్తి, 11 మంది రైతులకు చెందిన 30 ఎకరాల మొక్కజొన్న, 41 మంది రైతులకు చెందిన 65 ఎకరాల పెసర, 12 మంది రైతులకు చెందిన 13 ఎకరాల మినుము పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇక 1618 మంది రైతులకు చెందిన 3,607 ఎకరాల మిర్చికి నష్టం వాటిల్లినట్లు ఉద్యానవనశాఖ తేల్చింది. ఇందులో కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో అధిక నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పటికీ ఆయా మండలాల్లో ఇక్కడి సిబ్బంది పని చేస్తుండటంతో అక్కడ కూడా జిల్లా అధికారులే పంట నష్టం అంచనా వేస్తున్నారు. నష్ట పోయిన పంటల నివేదికలు అందించిన తర్వాత పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ ఆదేశాల మేరకు నష్టం అంచనాలు వేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పి.బి.భాస్కర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. -
20 వేల ఎకరాల్లో పంట నష్టం
ఖమ్మం వ్యవసాయం: గోదావరి ఉప్పొంగడంతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీఆర్.పురం, కూనవరం, భద్రాచలం, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, చర్ల, మణుగూరు, పినపాక, అశ్వాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల పరిధిలోని 170 గ్రామాల్లో 20,867 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.బి.భాస్కర్ రావు తెలిపారు. 5,020 మంది రైతులకు చెందిన 11,077 ఎకరాల్లో పత్తి నీట మునిగిందని, ఇందులో అత్యధికంగా వేలేరుపాడు మండలంలో 2,600 ఎకరాలు ఉందని చెప్పారు. 3,310 మంది రైతులకు చెందిన 7,622 ఎకరాల్లో వరి పంట నీట మునిందన్నారు. ఇందులో పినపాక మండలంలో 2,300 ఎకరాలు, వెంకటాపురం మండలంలో 2,250 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదని వివరించారు. 632 మంది రైతులకు చెందిన 2,130 ఎకరాల్లో మిర్చి నీట మునిగిందన్నారు. ఇంకా 30 ఎకరాల్లో మొక్కజొన్న, 68 ఎకరాల్లో వేసిన పప్పుదినుసుల పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. ముందే వేసిన పంటలు.. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మే, జూన్ నెలల్లో వర్షాలు కురియటంతో ముందుగానే పత్తి వేశారు. ఈ ప్రాంతంలో పత్తి దాదాపు పూత, కాత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మొక్క దశలోనే ఉంది. ఇప్పటికే ఈ పంటకు రైతులు ఎకరాకు రూ.12 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. నీట మునిగిన పంట కుళ్లి పోతుంది. వరదల తరువాత ఈ పంట ఎర్రబారి తెగుళ్లు సోకి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల వరి నాట్లు వేయగా, మరికొన్ని ప్రాంతాల్లో నెల రోజుల క్రితమే వేశారు. ప్రస్తుతం ఈ పంట కూడా నీట మునిగి, కుళ్లి పోయి పనికి రాకుండా పోతుందని, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలు కూడా నీట మునిగాయని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలకు సౌకర్యాలు కల్పించటంతో పాటు ఆయా శాఖల అధికారులు నష్టాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. దీంతో జేడీఏ పి.బి.భాస్కర్ రావు గోదావరి పరివాహక ప్రాంత మండలాల వ్యవసాయాధికారులకు నీట మునిగిన పంటలపై పలు సూచనలు చేశారు. వరదలు పూర్తిగా తగ్గితే కానీ నష్టం అంచనాలు వేయలేమని అధికారులు చెప్పారు. 50 శాతానికి పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
1,462 హెక్టార్లలో పంటనష్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం రైతాంగానికి భారీ నష్టాన్ని చేకూర్చింది. మూడు రోజుల పాటు విస్తారంగా కురిసిన వానలకు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. కాగ్నా, ఈసీ, మాల, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పంటలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల పైరు నీటిపాలైంది. జిల్లావ్యాప్తంగా గత నెల 28 నుంచి ఈ నెల 2వ తేదీవరకు కురిసిన వానలకు 1,462 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం కలిగిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. ముఖ్యంగా తాం డూరు, పరిగి, యాలాల, బషీరాబాద్, పూడూరు మండలాల్లో వర్షాలతో భారీ నష్టం కలిగింది. పత్తి, మొక్కజొన్న, వరి, కంది, పెసలు, మినుప పంటలు దెబ్బతిన్నాయి. పరిగిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఈ డివిజన్లలో మెట్ట పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లో 50 శాతం దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసిన యంత్రాంగం... క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు శంషాబాద్, మొయినాబాద్ మండలాల్లో ఉద్యాన పంటలు కూడా బాగా దె బ్బతిన్నాయి. ఈసీ వాగు పరివాహక ప్రాంతంలో పూలతోటలు నీట మునగగా, వరిపైరు కొట్టుకుపోయింది. ఈ వాగుకు ఇరువైపులా ఉన్న మెట్ట పంటలు ఇసుకమేటతో నిండిపోయాయి. సకాలంలో వర్షాలు కురవలేదని బెంగపడ్డ రైతాంగానికి ఏకధాటిగా కురిసిన వానలు కంటిమీద కునుకులేకుండా చేశాయని చెప్పవచ్చు. -
కాండం తొలిచే పురుగులకు కషాయాలతో కట్టడి!
* వరిలో 20-80% వరకు దిగుబడి * నష్టం జరిగే అవకాశం * అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలతో నివారణ సాధ్యమే * వీటిని స్వల్ప ఖర్చుతో రైతు స్వయంగా తయారు చేసుకోవచ్చు రైతుల ఆశలకు నీరు పోసి, పాదుచేస్తుందని ఆశపడిన విజయనామ సంవత్సరం నిప్పులు పోసింది. సగం వానాకాలం వెళ్లిపోయినా నీరు నిండి మసక్కమ్మిన కళ్లతో రైతులింకా వాన మేఘాల జాడ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. బోర్లలో అందుబాటు నీటితో అక్కడో ఇక్కడో కొద్దిమంది సాగుబాటు చేసి వరినాట్లు పూర్తి చేసుకున్నారు. గోరుచుట్టు మీద రోకటిపోటులా వరిలో కాండం తొలిచే పురుగు, తాటాకు తెగులు ఆశించినట్లు తెలుస్తోంది. వరి పంటను నష్టపరిచే పురుగుల్లో కాండం తొలిచే పురుగు ముఖ్యమైనది. దీని వల్ల పంట నష్టం 20-50 శాతం వరకు ఉంటుంది. తీవ్రత పెరిగితే నష్టం 80 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉంది. కాండం తొలిచే పురుగు వరి సాగు చేసే ప్రాంతాలంతటా ఉంది. ఇందులో ప్రధానంగా ఆరు రకాలున్నాయి. పసుపు పచ్చ, తెలుపు, గులాబీ, చారల పురుగు, బంగారు అంచు పురుగులు ఆశిస్తుంటాయి. ప్రధానంగా పసుపు, తెల్ల పురుగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాండం తొలిచే పురుగు నారు పోసింది మొదలు వెన్నువేసే వరకు ఏ దశలోనైనా దాడి చేసే అవకాశం ఉంది. నిలువ నీరు అధికంగా ఉండే డెల్టా ప్రాంతాల్లో కాండం తొలిచే పసుపు పచ్చ పురుగులు, మెట్ట ప్రాంతాల్లో ఇతర రకాలు ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఆకుల అంచుల మీద గుడ్డు పెట్టి పొదుగుతాయి. వెలువడిన లార్వాలు అక్కడి నుంచి మొగిని చేరుకొని కాండాన్ని తినివేస్తాయి. కాండం తొలిచే పురుగు ఉధృతికి చేలో కలుపు, అధిక నత్రజని వినియోగం దోహదం చేస్తాయి. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో దీని దాడి మరింత పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి మెలకువతో ఉంటే వీటి నివారణ సాధ్యమే. ఎలా గుర్తించాలి? ఎదిగే దశలో కర్రను లాగితే మొగి ఊడి వస్తుంది. దానిలో లార్వాలు కనిపిస్తాయి. వరి పిలకల మీద చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వెన్నువేసే దశలో ఐతే తాలు కంకులు కనిపిస్తాయి. కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులకు సుభాష్ పాలేకర్ రూపొందించిన అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి. అగ్ని అస్త్రం తయారీ ఇలా.. అగ్ని అస్త్రం తయారీకి 20 లీటర్ల ఆవు మూత్రం సేకరించాలి. అర కిలో పచ్చిమిర్చి ముద్ద, కిలో పొగాకు రద్దు, అర కిలో వెల్లుల్లి ముద్ద ఆవు మూత్రానికి కలిపి, ఆ ద్రావణాన్ని ఓ బాణలిలో పోయాలి. మూడుసార్లు పొంగు వచ్చేటట్లు మరగకాచిన తరువాత.. పొయ్యి మీద నుంచి దించి నీడలో పెట్టాలి. రెండు రోజుల పాటు ఈ ద్రావణం పులిసిన తరువాత వడకట్టి మరో పాత్రలో నిలువ చేసుకోవాలి. ఎకరా పొలానికి పిచికారీ చేసేందుకు రెండున్నర లీటర్ల అగ్ని అస్త్రం ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. పురుగు ఉధృతిని బట్టి వారం ఎడంతో రెండుసార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది. బ్రహ్మాస్త్రం తయారీ ఇలా.. బ్రహ్మాస్త్రం తయారీకి 2 కిలోల ముద్దగా నూరిన వేపాకు, రెండు కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్దను సిద్ధం చేసుకోవాలి. వీటిని 20 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించి చల్లార్చాలి. వడకట్టిన ద్రావణం ప్లాస్టిక్ డబ్బాలో నిలువ చేసుకొంటే ఆరు నెలల వరకు వినియోగించుకోవచ్చు. రెండు నుంచి రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవచ్చు. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటే పూర్తి ఫలితం ఉంటుంది. కాండం తొలిచే పురుగు నివారణకు ఇతర చర్యలు:ఙఞ్చట- పురుగు ఆశించిన పొలాన్ని ఆరగట్టాలి. దీని వలన లార్వాలు మరణిస్తాయి. ఆరగట్టడం వీలుకాని డెల్టా ప్రాంతంలో నీటి మట్టం పెంచి, తీస్తూ ఉండాలి. దీని వలన లార్వాలకు ప్రాణవాయువు అందక మరణిస్తాయి. సాగు నీటి కాలువలో పచ్చి పేడ వేయాలి. ఇది నీటిలో కరిగి పొలమంతా విస్తరించి లార్వాలను నాశనం చేస్తుంది. వాసనకు పురుగులు పారిపోతాయి. - ఉత్తరాంధ్ర ప్రాంతంలో కంపురొడ్డ, మిడత కర్ర అనే కలుపు మొక్కలు విరివిగా పెరుగుతాయి. వీటిని కోసి తెచ్చి గట్ల మీద కుప్పలుగా వేయడం, నీటి కాలువలో వేయడం వలన ఈ వాసనకు పురుగులు పారిపోతాయి. - పొలం గట్ల మీద వాయిలాకు, సీతాఫలం ఆకులను కాల్చి పొగపెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలుంటాయన్నది తమిళనాడు రైతుల అనుభవం. - ఆవు మూత్రం, వాయిలాకు, ఇంగువ కషాయం తయారు చేసుకొని వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసి కూడా ఈ పురుగు బెడదను వదిలించుకోవచ్చు - అరలీటరు వేప నూనెను 4 కిలోల మట్టిలో కలిపి.. దానికి మరో 4 కిలోల పేడతో పిసికి ముద్ద చేసి పెట్టుకోవాలి. పులిపచ్చిగా ఉన్న దశలో పొలమంతా వెదజల్లుకోవాలి - వాయిలాకు, పిసింగి ఆకు, వేపగింజల పొడి, కలబందలను కిలో చొప్పున సేకరించి.. 20 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి.. బాగా మరిగించి వడకట్టి పెట్టుకోవాలి. 100 లీటర్లకు 2 లీటర్ల ఈ ద్రావణం కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవచ్చు. - సహజ క్రిమినాశక ద్రావణాలను పిచికారీ చేసిన తరువాత వారం రోజుల్లో పంటను పరిశీలించి.. అవసరమైతే రెండోసారి పిచికారీ చేసుకోవాలి కాండం తొలిచే పురుగు ఆశించిన పైరు కోసిన తరువాత కొయ్యకాళ్లు తగలబెడితే అందులోని లార్వాలు, గుడ్లు నశిస్తాయి. జీవనియంత్రణ పద్ధతిలో ట్రైై కోగ్రామా కార్డులను వాడడం ద్వారా నియంత్రించవచ్చు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ -
ఆరు రాష్ట్రాలకు మన టమాటా
- పంట నష్టంతో పెరిగిన డిమాండ్ - మార్కెట్లోనే కిలో రూ.46 - మార్కెట్‌కు చేరుతోంది - కేవలం 220 టన్నులే బి.కొత్తకోట: మన జిల్లా టమాటాకు ఆరు రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. దీంతో ఆది, సోమవారాల్లో ఊహించని విధంగా ధరలు పలికాయి. అయితే స్థానికంగా దిగుబడి కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పలుకుతున్న ధరలు కొంతకాలం వరకూ ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సగటు ఏడాది పొడవునా 35 వేల ఎకరాల్లో టమాటా సాగవుతుంటే.. అందులో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో 30 వేల ఎకరాల్లో సాగులో ఉంది. గత పది రోజుల క్రితం వరకు బొటాబొటిగా ధరలు పలికిన టమాటా రెండు రోజులుగా అత్యధిక ధర పలుకుతోంది. ఆదివారం కిలో రూ.41 పలికితే సోమవారం రూ.46 పలికింది. ఒకరోజు వ్యవధిలోనే కిలోకు రూ.5 పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలతో టమాటా పంటకు నష్టం వాటిల్లడమే. దీంతో మదనపల్లె టమాటాపై వ్యాపారులు దృష్టి పెట్టారు. ఈనెల 5 నుంచి 14వతేదీ వరకు పలికిన ధరలు చూస్తే డిమాండ్ తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో పండిస్తున్న టమాటా దిగుబడులు తగ్గాయి. దీంతో వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఫలితంగా రైతులకు ఆశించిన ధరలు దక్కుతున్నాయి. మదనపల్లె మార్కెట్‌కు వస్తున్న టమాటాలు భారీగా తగ్గాయి. ఈనెల 5న 475 టన్నుల టమాట విక్రయానికి రాగా వరుసగా తగ్గుతూ వస్తూ సోమవారం 226 టన్నుల టమాటా మాత్రమే వచ్చింది. ఫలితంగా ధర భారీగా పెరిగింది. పది కిలోల టమాటా రూ.460 పలికింది. ఇక్కడ కొనుగోలు చేసిన టమాటా ఆరు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. తమిళనాడులోని చెన్నై, మధురై, పాండిచ్చేరి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటకలోని గదగ్, తెలంగాణలోని కరీంనగర్, హైదరబాదు, వరంగల్, ఖమ్మం, ఇల్లందు, భువనగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, గుడివాడ, నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాలకు తరలిస్తున్నారు.