ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షం.. నగరాలు, పట్టణాల్లో కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రతిఫలం సరిగ్గా చేతికొచ్చే సమయంలో ఈదురుగాలుల వానకి మొత్తం నాశనం అయ్యింది.
బుధవారం వేకువ ఝామున కురిసిన భారీ వానతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వాన ప్రభావాలతో రాష్ట్రంలోని పలు చోట్ల పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
మరోవైపు కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం సైతం.. టార్ఫిన్లు లేక తడిసి ముద్దయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు పెద్దగా తీసుకోలేదని తెలుస్తోంది. ఇక బుధ, గురువారాల్లో సైతం వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment