
ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి
పంట నష్టానికి భారీగా కోత పెట్టిన ప్రభుత్వం
ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలో ఐదో వంతేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాలలో పంటనష్టం సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి పంట ష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయి’అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంటనష్టం 28,407 ఎకరాల్లో ఆ తర్వాత మహబూబాబాద్‌లో 14,669, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో ఉందన్నారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్టు అధికారులు ఏర్పాటు చేసినట్టు తుమ్మల తెలిపారు.
4.15 లక్షల ఎకరాల్లో నష్టమన్న సీఎం
రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారులు మాత్రం చివరకు 79,574 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిసి, ఆ మేరకే నిధులు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే ఐదోవంతు కంటే తక్కువగా నష్టాన్ని నిర్ధారించారు.
దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా పంట నష్టం జరిగిన దాంట్లో దాదాపు 25 శాతం ఇసుకమే ట పేరుకుపోయి నష్టం సంభవించింది. ఇసుక మేటకు పదివేలకు అదనంగా ఇస్తా మని కూడా వ్యవసాయ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన పరిహారంలో ఇసుకమేట విషయం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.