న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు: సీఎం రేవంత్‌ కవితాత్మక ట్వీట్‌ | Telangana CM Revanth Reddy Tweet On Delimitation, Check His Tweet Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు: సీఎం రేవంత్‌ కవితాత్మక ట్వీట్‌

Published Sat, Mar 22 2025 9:45 PM | Last Updated on Sun, Mar 23 2025 10:56 AM

CM Revanth Reddy Tweet On Delimitation

హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.  ఈరోజు(శనివారం) తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం  రేవంత్ కూడా హాజరయ్యారు. అ‍యితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్.

ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది.

ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో… డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి…విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం.

ఉత్తరాదిని గౌరవిస్తాం… దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. అది డీ లిమిటేషన్ ఐనా… విద్యా వ్యవస్థపై పెత్తనమైనా… అంగీకరించేది లేదు…

ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది… ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది… న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు’ అంటూ ట్వీట్ చేశారు రేవంత్.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement