thummala nageswara rao
-
79,574 ఎకరాల్లో పంటనష్టం
సాక్షి, హైదరాబాద్: ‘ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాలలో పంటనష్టం సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి పంట ష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయి’అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంటనష్టం 28,407 ఎకరాల్లో ఆ తర్వాత మహబూబాబాద్‌లో 14,669, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో ఉందన్నారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్టు అధికారులు ఏర్పాటు చేసినట్టు తుమ్మల తెలిపారు. 4.15 లక్షల ఎకరాల్లో నష్టమన్న సీఎంరాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారులు మాత్రం చివరకు 79,574 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిసి, ఆ మేరకే నిధులు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే ఐదోవంతు కంటే తక్కువగా నష్టాన్ని నిర్ధారించారు. దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా పంట నష్టం జరిగిన దాంట్లో దాదాపు 25 శాతం ఇసుకమే ట పేరుకుపోయి నష్టం సంభవించింది. ఇసుక మేటకు పదివేలకు అదనంగా ఇస్తా మని కూడా వ్యవసాయ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన పరిహారంలో ఇసుకమేట విషయం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
హైదరాబాద్ : పీపుల్స్‌ప్లాజాలో నర్సరీ మేళా (ఫొటోలు)
-
హరీష్ రావు కామెంట్స్.. కంటతడి పెట్టిన మంత్రి తుమ్మల
-
రైతు రుణాలను రికవరీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (ప్యాక్స్)ల్లో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై, రు ణాలను రికవరీ చేయని అధికారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డీసీసీబీ, ప్యాక్స్‌ల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. నిజామాబాద్ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతిపత్రాలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో ఆయన స్పందించారు.ప్యాక్స్‌లను బలోపేతం చేయండి: ప్యాక్స్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా తీసు కున్న రుణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్యాక్స్ లను బలోపేతం చేయాలని సూ చించిన ఆయన రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ స్థాయి వరకు చేర్చే ప్రణాళికను మార్క్‌ఫెడ్ అమలు చేయా లనీ, ఎరువుల కంపెనీలతో చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన స్థాయిలోఎరువులు అందుబాటులో ఉ న్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికా వాల్సిన అవసరం లేదని తుమ్మల భరోసానిచ్చారు. తుమ్మల ఆదేశాలపై చర్చ కాగా, మంత్రి తుమ్మల రుణ వసూళ్ల ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై వ్యవసాయశాఖలోనూ చర్చకు తెరలేపింది. రైతులు బకాయిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీసీసీబీ, టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. -
మే నెలాఖరుకల్లా ‘సీతారామ’ పనులు పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెకు కింద కాలువల పనులను మే నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఆదివారం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సీతారామ ప్రాజెక్టు పురోగతి, చేపట్టాల్సిన పనులపై మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా ఉత్తమ్‌తో కలిసి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రాజెక్టుపై సుమారు రూ. 7,500 కోట్లు ఖర్చు చేశారని, మూడు పంప్‌హౌస్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. టెండర్లు పూర్తి చేయాలి.. రూ. 70 కోట్లతో ఏన్కూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు వేగంగా చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇటీవల గండుగులపల్లిలో జరిగిన సమావేశంలో సమీక్షించిన అంశాలను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లగా సంబంధిత పనులను దశలవారీగా ప్రాధాన్యతను బట్టి పూర్తిచేసి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. యాతాలకుంట భూసేకరణ త్వరగా తేలిస్తే కెనాల్ కింద నీరు ఇవ్వొచ్చన్నారు. ఈ పనులు పూర్తయితే సీతారామ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్‌కు సంబంధించి భూసేకరణకు చెల్లించాల్సిన రూ. 12 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పై పనులన్నీ పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్ కింద 1.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. -
బీఆర్ఎస్ దోపిడీ పత్రాలను విడుదల చేస్తాం
నల్లగొండ: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుబారా ఖర్చు, దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయని, వాటన్నింటిపై దోపిడీ పత్రాలను విడుదల చేస్తామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయన్నారు. వాటన్నింటిపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే.. వారు ఏదో చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శ్వేద పత్రం విడుదల చేశారని విమర్శించారు. అందుకే వారు పదేళ్లలో తెలంగాణలో చేసిన దోపిడీపై పత్రాలను విడుదల చేస్తామన్నారు. దేశమే సిగ్గుపడేలా రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసి తామేదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 1వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిదన్నారు. రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి ఉత్తమ్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కుర్చీలు వేసుకుని కట్టిస్తామని చెప్పిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టించలేదన్నారు. 28వ తేదీ నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పది జాతీయ స్థాయి రోడ్లు వస్తే చాలు: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రోడ్లు తక్కువగా నిర్మించారని, తాను గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత ముందుకు తీసుకుపోయానని, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్డు భవనాల మంత్రి కావడంతో పది జాతీయ స్థాయి రోడ్లను మంజూరు చేయిస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతిరెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. -
మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
-
ఖమ్మంలో ఎవరిదో పైచేయి?
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ ప్రచారం సాగించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా... ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అటు గులాబీ పార్టీ.. ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది నేనే
-
ఖమ్మం కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఖరారు
సాక్షి, ఢిల్లీ: ఖమ్మం కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఓ కొలిక్కి వచ్చాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పోటీ చేయబోయే స్థానాలపైన స్పష్టత వచ్చింది. పాలేరు పొంగులేటి, ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ ఇద్దరు నేతలు ఇవాళ(అక్టోబర్ 14, శనివారం) ఢిల్లీ వెళ్లి అగ్రనేతల్ని కలిశారు. అయితే.. రాహుల్ గాంధీ సూచన తర్వాత తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది. వామపక్ష పార్టీల పొత్తుపై.. వామపక్షాల పొత్తు అంశంపై కేసీ వేణుగోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి, ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు, అలాగే సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
తుమ్మల చేరిక.. కాంగ్రెస్ అంచనా ఇది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ కీలక నేతల సమక్షంలో.. కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ పరిణామానికి కొన్ని గంటల ముందే.. ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం కీలక నేత అయిన తుమ్మల అధికార పార్టీ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో కారు దిగి హస్తం గూటికి చేరారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తుమ్మల కాంగ్రెస్ చేరికతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడున్నర దశాబ్దాల రాజకీయానుభవం. ఖమ్మం రాజకీయాలను చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడు. ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే వ్యక్తి. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలతోనూ పని చేసిన నేత. అక్కడి అభివృద్ధి విషయంలోనూ ఆయనకు మంచి పేరుంది. పైగా సొంతంగా.. బలమైన క్యాడర్ కూడా ఉంది. అందుకే తుమ్మల ప్రభావంతో కాంగ్రెస్ మరిన్ని సీట్లు పెంచుకోవచ్చని ఆశిస్తోంది. ప్రత్యేకించి.. కమ్మ సామాజిక వర్గం నుంచి ఓట్లు రాబట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. గతంలో లాగానే ఈసారి కూడా ఖమ్మంను కంచుకోటగా నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. కాగా నేడు తుమ్మల కాంగ్రెస్‌లో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తుమ్మలతోపాటు రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోనియా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. -
కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి తుమ్మల.. డేట్ ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్యనేతలు శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తుమ్మల నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు వెళ్లి మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా తుమ్మలను ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. తుక్కుగూడ విజయభేరీ సభలో పార్టీలో చేరాలని సూచించారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్న తుమ్మల ఇక రేపో మాపో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనిపిస్తోంది. రేపు తాజ్ కృష్ణా హోటల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌లో జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. చదవండి: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. -
సోనియా సమక్షంలో కాంగ్రెస్ లోకి తుమ్మల
-
ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం
తుమ్మలకు(తుమ్మల నాగేశ్వరరావు) అపారమైన అనుభవం ఉంది. ఏ పార్టీలో ఉన్నా చిత్తశుధ్దితో పని చేస్తారు. కానీ, పొమ్మనకుండా పొగ బెట్టారు. అనేక అవమానాలకు గురి చేసి బయటకు పంపిస్తున్నారు. ముందు నన్ను అవమానించి బయటకు పంపారు. ఇప్పుడు తుమ్మలను అలాగే పంపిస్తున్నారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం. ప్రజల కోరిక మేరకే తుమ్మల నిర్ణయం తీసుకుంటారు. ::మీడియాతో పొంగులేటి ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా ముఖ్యనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. నిన్న(గురువారం) రేవంత్‌రెడ్డి తుమ్మల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఆపై తుమ్మల ఖమ్మం వెళ్లిపోయారు. ఒకే పార్టీలో ఉన్నా.. అయితే ఊహించని విధంగా శుక్రవారం తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగేటి.. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆయన ఆహ్వానం పలికినట్లు స్పష్టం అవుతోంది. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. తుమ్మల కామెంట్లు.. పొంగులేటి నా శ్రేయోభిలాషి. నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు. నా రాజకీయాలు ప్రజల కోసమే. జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నా. అభిమానుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటా. ఇదీ చదవండి: తుమ్మలగారు.. మా పార్టీలోకి రండి -
Thummala: తుమ్మల చేజారిపోకుండా..
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాజకీయ అడుగులు ఎటు అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ప్రస్తుతానికి బీఆర్ఎస్లో ఉన్న ఆయన పాలేరు టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కాకుండా.. ప్రజల కోసం, తనను నమ్ముకున్న అనుచరుల కోసం ఎన్నికల బరిలోకి దిగుతానంటూ ప్రకటించి మరింత ఆసక్తిని రేకెత్తించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో ఉంటూనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదంటే పార్టీ వీడి మరో పార్టీలో చేరి పోటీ చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. అయితే.. ఖమ్మంలో బలమైన నేత అయిన తుమ్మలను వదులుకునేందుకు ఇతర పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ ఆహ్వానించినా.. చేరొద్దంటూ ఆయన అనుచరులు ఇప్పటికే ఆయనకు సూచించారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ ఆయన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తుమ్మల చేజారిపోకుండా ఉండేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ స్పష్టత వస్తేనే.. పాలేరు కేంద్రంగానే తుమ్మల గత కొంతకాలంగా రాజకీయాలు నడిపిస్తున్నారు. దీంతో అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే పాలేరు లేదంటే ఖమ్మం.. ఈ రెండు నియోజక వర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ గురించి చేయాలని అనుచరులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ చేరికతోనే కాదు.. పోటీ విషయంలోనూ అనుచర గణం ఆయన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. దీంతో డైలమా కొనసాగుతోంది. ఇక.. తుమ్మల గనుక పార్టీలో చేరితే.. తుమ్మలతో పాటు పొంగులేటి సీట్ల విషయంలో సర్దుబాటు ప్రక్రియ గురించి కాంగ్రెస్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత రాగానే.. తుమ్మలో కాంగ్రెస్‌లో చేరవచ్చనే ప్రచారం నడుస్తోందక్కడ. కాంగ్రెస్ వ్యూహాలు తుమ్మల చేరికకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక జిల్లా నేతలైన సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తుమ్మల చేరికపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో తుమ్మల కాంగ్రెస్ చేరికకు ఎలాంటి అవాంతరాలు లేవనే చెప్పాలి. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుండగా.. పరిస్థితులు అందుకు ఎంత వరకు సహకరిస్తాయో అనేది వేచి చూడాలి. మరో రెండు, మూడు రోజుల్లో తుమ్మల రాజకీయ భవితవ్యంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
తలవంచేది లేదు.. ఎన్నికల్లో నిలబడతా: తుమ్మల
సాక్షి, ఖమ్మం: గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేదాకా రాజకీయాల్లో ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరుల్ని ఉద్దేశించి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తాను పోటీ చేసి తీరతానని తుమ్మల ప్రకటించారు. శుక్రవారం వెయ్యి కార్లు, రెండు వేల బైకుల భారీ కాన్వాయ్‌తో ఖమ్మంలో అనుచరులు ఆయనకు ఘన స్వాగతం పలకగా.. ఊహాగానాలకు తెర తీస్తూ ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేశారు. శ్రీ రాముడి ఆశీస్సులు తో పది నియోజకవర్గం లో అందరు చిరు నవ్వు తో బతకాలని 40 సంవత్సరాలు పాటు అందిరికి సౌకర్యాలు కోసం జీవితాన్ని త్యాగం చేశా. మొన్న ఎన్నికల సమయంలోనే జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా. రాజకీయాలకు స్వస్తి చెబుతానని సీఎంకు కూడా చెప్పాను. కానీ, మీ ఆందోళన, అభిమానం చూశాక మనసు మార్చకున్నాను. నాగలి దున్నుకునే వాడిని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేశారు. మూడు ప్రభుత్వాలలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు కష్టం వచ్చిన ప్పుడు నన్ను కాపాడారు. గోదావరి జలాలు తో మీ పాదాలు కడిగేంత వరకు ఎంఎల్ఏ గా ఉంటా. నా చేతులు తో పాలేరు , వైరా, బేతుపల్లి లో కానీ ఉమ్మడి జిల్లాలో నింపి మీకు దూరం అవుతా. మీ కోసమే రాజకీయ జీవితం తప్ప.. నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నాకు పదవి అధిపత్యం కోసం కాదు. నన్ను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారు. ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. ఎక్కడా తలవంచేది లేదు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నా. మీ కీర్తి కోసం ఆత్మాభిమానం కోసం నిలబడుతా. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా. అసలైన పనులు పూర్తి చేసి .. మీతో శెభాష్ అనిపించుకుంటా అని అనుచరుల్ని ఉద్దేశించి పేర్కొన్నారాయన. అయితే తన ప్రకటనలో ఎక్కడా బీఆర్ఎస్పైగానీ.. కేసీఆర్‌పైగానీ అసంతృప్తి వ్యక్తం చేయని తుమ్మల.. పార్టీ మార్పుపై నుంచి గానీ, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే(పాలేరు నుంచేనా) అనే దానిపైనా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
తుమ్మల ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్
సాక్షి, ఖమ్మం: తుమ్మల ఎపిసోడ్‌తో ఖమ్మం రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ నుంచి.. అదీ ఆశిస్తున్న పాలేరు టికెట్ దక్కకపోవడంతో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుబోతున్నారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు కాంగ్రెస్.. తాజాగా ట్విస్ట్ ఇస్తూ బీజేపీ కూడా ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ తరుణంలో.. గొల్లగూడెంలోని తన నివాసంలో ఆయన కార్యకర్తలతో భేటీ అయ్యాక.. పార్టీ మార్పుపై అభిప్రాయం వక్తం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా ప్రకటించాక.. పాలేరు టికెట్ దక్కకపోవడంపై తుమ్మల అనుచరగణం రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని పార్టీ మారాలని కోరుతూనే.. ఇవాళ భారీగా ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నంచి భారీ ఎత్తున తరలి వచ్చారు అనుచరులు. ఇక తుమ్మల బలప్రదర్శన ఎపిసోడ్‌ను బీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. అయితే.. రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల డిసైడ్ అయినట్లు ఆయన తనయుడు యుగంధర్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. కానీ, ఇప్పటికే పాలేరు టికెట్ సిట్టింగ్ ఎమ్మేల్యే కందాలకు కేటాయించింది బీఆర్ఎస్. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో దిగొచ్చనే ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీ ఆహ్వానం.. జరగదన్న అనుచరులు బీఆర్ఎస్ జెండా లేకుండా.. తుమ్మల ఫొటోతో కూడిన జెండాతోనే ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. అయితే ఆ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలు కూడా కనిపించాయి. అంతేకాదు.. జై తుమ్మల జై కాంగ్రెస్ నినాదాలు మారు మ్రోగాయి కూడా. అలాగే.. ఆయన్ని కాంగ్రెస్‌లో చేరాలని ఉమ్మడి ఖమ్మం అనుచరులు ఇప్పటికే తీర్మానం చేసినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయాలనుకునేవాళ్లు.. పీసీసీకి దరఖాస్తు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఇవాళే ఆఖరు తేదీ కూడా!. ఇక.. తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు పొంగులేటి సుధాకర్‌రెడ్డి. ఈ ప్రాంత వాసుడిగా తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా. బీజేపీలోకి రండి.. కలిసి పని చేద్దాం. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అన్ని వర్గాలకు సమనాయకత్వం దొరుకుతోంది. దేశ హితమే పరమావధి అయిన బీజేపీలోకి తుమ్మలను ఆహ్వానిస్తున్నా అని పొంగులేటి తెలిపారు. అయితే.. తుమ్మల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం లేదంటున్నారు అనుచరులు. -
‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’
సాక్షి, ఖమ్మం: ప్రజల నిర్ణయం మేరకు పాలేరు నుంచే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ఆయన తనయుడు యుగంధర్ ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఖమ్మంలో భారీ కాన్వాయ్‌తో తుమ్మలకు ఘన స్వాగతం పలకగా.. యుగంధర్ అక్కడి మీడియాతో మాట్లాడారు. అనుచరులతో మాట్లాడి తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రజల నిర్ణయం మేరకే పాలేరు నుంచి ఆయన పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచి సీతారామా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ఆయన అభిమతం అని తనయుడు తుమ్మల యుగంధర్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరపున పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల.. గత మూడు నాలుగు రోజులుగా అనుచరులతో హైదరాబాద్ నుంచే చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన పార్టీ నుంచి జారిపోకుండా అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేయించారు. ఎంపీ నామా నాగేశ్వరరావును దూతగా పంపి.. తుమ్మలను నిలువరించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే అందుకు తుమ్మల ఎలా స్పందించారో తెలియదుగానీ.. పాలేరు నుంచే పోటీ చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తాజాగా ఆయన తనయుడి ప్రకటన చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఒకవేళ అదే జరిగినా ఖమ్మం నుంచే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: భావోద్వేగంతో తుమ్మల కన్నీటి పర్యంతం -
హైదరాబాద్ నుంచి బయలుదేరిన తుమ్మల.. కన్నీటి పర్యంతం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా బీఅర్ఎస్లో తుమ్మల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానంతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధమయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరే ముందు బాగోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి. కాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. నేడు భారీ బల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంకు వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీగా బల ప్రదర్శన చేయనున్నారు. ఇక తుమ్మల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించగా.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన అశ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భంగపడ్డారు. పాలేరు టికెట్‌ను కందాల ఉపేందర్ రెడ్డికి అధిష్టానం కేటాయించడంతో.. పార్టీలో కనీస గౌరవమర్యాదలు లేకపోవడంపై అలకబూనారు. రాయబారాలు, బుజ్జగింపులపై అసహనంతో ఉన్న తుమ్మల.. పొలిటికల్‌గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అటు తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని మాజీ మంత్రిపై ఒత్తిడి చేస్తున్నారు. చదవండి: Paleru Assembly Constituency: పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర కాగా.. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు. -
ఖమ్మంలో పొలిటికల్ ట్విస్ట్.. తుమ్మల దారెటు?
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఖమ్మం జిల్లాకు తుమ్మల రానున్నారు. మరోవైపు.. తుమ్మల అనుచరులు వెయ్యి కార్లతో ర్యాలీ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలను ఒప్పించి పాలేరు నుంచి బరిలో నిలపాలని తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా.. తుమ్మల కాంగ్రెస్‌లో చేరడానికే మొగ్గు చూపుతున్నారని ఆయన మెజార్టీ అనుచరులు చెబుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తుమ్మల నిర్ణయం ఏవిధంగా ఉండబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. తుమ్మల అంశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలలో ఎంపీ నామా నాగేశ్వర రావు.. తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తుమ్మలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్లో తుమ్మలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నామా తెలిపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది కూడా చదవండి: కేసీఆర్ మొండిచేయి.. అలకబూనిన మోత్కుపల్లి.. వాట్ నెక్స్ట్? -
కేసీఆర్ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్: అసంతృప్తులను చల్లార్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఖమ్మం సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం భేటీ అయ్యారు. గంటకు పైనే ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించింది అధిష్టానం. దీంతో తుమ్మల అనుచరులు అసమ్మతి గళం లేవనెత్తారు. నిన్నంతా సమావేశమై పార్టీ నుంచి బయటకు రావాలంటూ తుమ్మలకు సూచించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తుమ్మల సైతం టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపు ఆయన చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుమ్మలతో చర్చించాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇవాళ వాళ్ల భేటీ జరిగింది. మరోవైపు తుమ్మల తరహా నేతలు మరికొందరితోనూ చర్చించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారాయన. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు. -
తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది. ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌కే తుమ్మల అనుచరులు జై.. పాలేరు బీఅర్ఎస్లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం. కాగా, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్ ప్రగతిభవన్‌కు వెళ్లి టికెట్ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది. -
అది నా కల.. అందుకోసమైనా ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే తన కల అని మనసులో మాటను ప్రజలకు చెప్పుకొచ్చారు. కాగా, తుమ్మల నాగేశ్వర రావు నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే అభివృద్ధి చేశాను. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి అభివృద్ధి చేశాను. రైతుల కోసం పాలేరు పాత కాలువకు రూ.70కోట్లతో రిపేర్ చేయించాను. రైతు బాగుంటేనే అందరం ఆనందంగా ఉంటాం. ఆనాడు నేను చేసిన అభివృద్ధితో పాలేరు అత్యంత ఖరీదైన ప్రాంతంగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను. గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే నా కోరిక. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకే నేను పోటీ చేస్తున్నాను. శాశ్వత ప్రాతిపదికన తప్ప తాత్కాలిక కార్యక్రమాల ద్వారా ప్రజలు బాగుపడరు. నేను పోటీలో నిలుస్తున్నాను.. ఈసారి సీపీఐ సహా పలు పార్టీలు నేతలు మద్దతిస్తున్నారు. మీ మనసులో కోరిక, ఈ ప్రాంత ప్రజల కోరిక తీరాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్ వ్యాఖ్యలు -
కేసీఆర్ పర్యటనలో తుమ్మల.. మళ్లీ జిల్లాలో కీలకంగా మారబోతున్నారా?
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో.. మంత్రి హరీష్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయనే చెప్పాలి. ఇవాళ కొత్తగూడెం సీఎం సభ కేసీఆర్ సభకు మాజీ మంత్రి తుమ్మల హాజరయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడే అవకాశం ఉండటంతో తుమ్మల కూడా పార్టీ వీడితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల పార్టీ నుంచి వెళ్లకుండా బీఆర్ఎస్ అధిష్టానం చర్చలు జరిపినట్లు తాజా రాజకీయ సమీకరణాలు బట్టి చూస్తే తెలుస్తుంది. చర్చలు సానుకూలంగా సాగడంతో ఖమ్మంలో తుమ్మల మళ్లీ కీలకంగా మారబోతున్నారనే చర్చ నడుస్తోంది. చదవండి: (తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్) -
తుమ్మల వ్యూహం అర్థం కావడంలేదంటున్న అనుచరులు
-
కడ వరకూ కేసీఆర్ వెంటే
వాజేడు: టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడంపై మాజీ మంత్రి, ఖమ్మం సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం అభిమానులతో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు సమ్మేళనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ వెంటే ఉంటానని, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ’నా అనుచరులు నా వెంట ఉంటే కొండలను కూడా పిండిచేస్తా’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని అభిమానులకు సూచించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, ఎవరూ అధైర్య పడొద్దని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. మన అభివృద్ధికి పాటుపడే నాయకుడు కేసీఆరే అని స్పష్టం చేశారు.. తుమ్మలను కలిసిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. దూరంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు వాజేడుకు వచ్చిన తుమ్మలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కలిశారు. కేవలం మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. కాగా.. టీఆర్ఎస్ ప్రధాన నాయకులు మాత్రం ఈ ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా ఉన్నారు. -
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, ఖమ్మం జిల్లా: పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులకు ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఒడి దుడుగులు సహజం. రాబోయేవి మన రోజులే.. ఎవరు అధైర్య పడొద్దు.. ఆందోళన చెందవద్దని తుమ్మల అన్నారు. 40 ఏళ్లు రాజకీయంగా ఏ విధంగా ఉన్నానో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉంటాను. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారు. మనకు మేలు చేసే వ్యక్తులనే మనం ఆదరించాలి. తాత్కాలిక అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి’’ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చదవండి: అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
అనుచరులతో కలిసి 350 కార్లతో భారీ ర్యాలీ.. తుమ్మల పార్టీ మారుతున్నారా?
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆత్మయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం భద్రాద్రి రామయ్య ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తుమ్మల.. దాదాపు 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు బయలుదేరారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్టు సమాచారం. ఇక, కొంత కాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తుమ్మల.. కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలను ఒకానొక సమయంలో తుమ్మల కొట్టిపారేశారు. ఈ క్రమంలో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం హాట్ టాపిక్‌గా మారింది. -
తమ్మినేని కృష్ణయ్య హత్య.. ‘నా భర్త చావుకు వాళ్లే కారణం’
సాక్షి, ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ సమీపంలో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తమ్మినేని కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తన భర్త హత్య వెనక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు హస్తం ఉందని తమ్మినేని కృష్ణయ్య భార్య ఎంపీటీసీ మంగతాయారు, కూతురు రజిత ఆరోపించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలోనే తన భర్తను హత్య చేస్తానని కోటేశ్వరరావు పలుమార్లు బెదిరిస్తూ వచ్చారన్నారు. గ్రామంలో తన భర్తకు రాజకీయంగా మంచి పేరు ఉండటంతో కోటేశ్వరరావు చంపాలని ప్లాన్ వేశారన్నారు. తమ్మినేని వీరభద్రంతో పాటు కోటేశ్వరరావును హత్యతో సంబంధం ఉన్న సీపీఎం నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి వచ్చిన పరిస్థితి భవిష్యత్తులో ఏ కుంటుంబానికి రావద్దని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఉద్రిక్త పరిస్థితులు.. రెండు చేతుల్ని.. -
ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య
-
తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!
సాక్షి, ఖమ్మం: జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో కొడవళ్లతో దారుణంగా హతమార్చారు దుండగులు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. అయితే.. సీపీఎంతో విభేదించి.. టీఆర్ఎస్లో చేరాడు కృష్ణయ్య. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇదీ చదవండి: దారుణాతీ దారుణం .. దళిత చిన్నారిని కొట్టి చంపిన టీచర్ -
ఖమ్మంలో సై అంటే సై! స్పీడ్ పెంచిన తుమ్మల, మట్టా, మదన్‌లాల్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్లో ఆశావహ నేతలు దూకుడు పెంచారు. ప్రధానంగా ఆ పార్టీలో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి అనుచరగణమూ ఇదే స్థాయిలో సై అంటే సై అంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అశావహ నేతలు నువ్వా.. నేనా అన్నట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ తమకే పార్టీ టికెటన్న ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. పార్టీ సర్వేల్లో జాతకాలు మారుతాయన్న నమ్మకంతో ఆశావహులు ఉన్నారు. ఇటీవల ఆశావహ నేతలు హాట్‌హాట్‌గా ప్రకటనలు చేస్తూ తమ అనుచరులను క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. (చదవండి: Munugode Bypoll: పోటీయా? మద్దతా?) పాలేరులో పోటా పోటీ.. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్ రెండుగా చీలింది. గత కొంతకాలంగా రెండు వర్గా ల మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కందాల హాజరవుతున్నారు. ఈ జోష్‌తో తన అనుచర నేతలు, కేడర్‌తో మళ్లీ పోటీలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టడంతో పాటు గతంతో పోలిస్తే గ్రామ పర్యటనలకు ఇటీవల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తన అనుచర నేతలు, కేడర్ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చినా తుమ్మల వదులుకోవడం లేదు. వీటిల్లో పాల్గొంటూనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ ‘ఎప్పుడైనా పిడుగులు పడొచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. త్వరలో ఎన్నికలు వస్తాయని, టికెట్ తనకేనన్న నమ్మకంతో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. వైరా ‘గులాబీ’లో వార్.. జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న వైరా నియోజకవర్గ ‘గులాబీ’లో వార్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ తమకే టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే రాములునాయక్, మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగా చేస్తుండడం గమనార్హం. అంతేగాకుండా ఇరువురూ తమ కేడర్, నేతలతో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ ముగ్గురితోపాటు మరో ఒకరిద్దరు కూడా ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండడంతో చివరికి పోటీలో ఎవరు ఉంటారన్నది సర్వేల్లో తేలుతుందన్నది పార్టీ వర్గాల సమాచారం. సత్తుపల్లిలోనూ ఇదే సీన్.. ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలకు పుట్టినిల్లు సత్తుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారిదే గెలుపన్నది ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారం. ఇటీవల ఏ ఎన్నికలు వచ్చినా.. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీర్వాదం ఎవరికి ఉంది.. దీంతో బరిలో ఉండే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో నాలుగోసారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. 2009, 2014, 2018 లో టీడీపీ నుంచి సండ్ర గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా సండ్రకే ఉంటాయని ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ మట్టా దయానంద్ ఈసారి వేగం పెంచారు. తన వర్గం కేడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. నాలుగో సారి విజయం తనదేనంటూ సండ్ర, తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో దయానంద్ ఉండడంతో ఈ నియోజవర్గంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. (చదవండి: డిగ్రీ విద్యార్హతగల వీఆర్ఏలకు పేస్కేల్! రెవెన్యూలోనే కొనసాగింపు? ) -
తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చు.. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావొద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చ నడుస్తోంది. పార్టీ మార్పుపై తుమ్మల నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటూ ఓవైపు.. మరోవైపు ఆయన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలను ఉద్దేశించి చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పర్యటనలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడంటూ కొందరు కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించగా.. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం టీఆర్ఎస్లో చాలాకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తుమ్మల క్రియాశీలక రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పాలేరు నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ క్రియాశీలకంగా మారారు. అయితే.. ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ కార్యకర్తల చేరికతో తన వర్గ బలాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల పార్టీ మారతారనే చర్చ సైతం జోరుగా నడుస్తూ వస్తోంది. అయితే టికెట్ విషయంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది. -
'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ‘ఇప్పటివరకు ఏ విషయంలోనూ ఎక్కడా రాజీపడ్డది లేదు.. ఇకపై పడేదీ లేదు. నాన్న నాకు ఇచ్చిన పొలం అమ్ముకుని మరీ రాజకీయాలు చేస్తున్నా. ఎక్కడా చేయి చాచింది లేదు.. నా నిజాయితీ, విశ్వసనీయతే ప్రజలు నా వెంట ఉండేలా చేశాయి. మా మేనమామ కూతురు శ్యామల, నేను ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అవేర్ సంస్థ ద్వారా ప్రజలకు దగ్గరయ్యా. రాజకీయాల్లోకి వచ్చి రెండెకరాల భూమి అమ్ముకున్నా తప్ప సంపాదించింది లేదు. నలుగురికి మంచి చేయడం కోసం నేను నష్టపోయినా బాధపడను’ అంటున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ‘సాక్షి’ పర్సనల్ టైమ్. మాది దమ్మపేట మండల పరిధిలోని మొద్దులగూడెం పంచాయతీలో గల తాటి సుబ్బన్నగూడెం అనే మారుమూల గిరిజన గ్రామం. మా తల్లిదండ్రులకు ఆరుగురం సంతానం. మా నాన్న రాములుకు వ్యవసాయమే జీవనాధారం. నాకు పదేళ్ల వయసప్పుడే ఆయన మృతిచెందారు. అప్పటి నుంచి అమ్మ ఆదెమ్మే మాకు అన్నీ తానై పెంచింది. మేం పెద్దయ్యేంత వరకు మా మేనత్త భర్త నర్సింహులు మా పొలాలు సాగు చేసి, మాకు సంరక్షకుడిగా నిలిచారు. నాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ముగ్గురు అక్కలను అంతగా చదివించలేదు. నేను మూడో తరగతి వరకు మా ఊరికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న తొట్టిపంపు గ్రామానికి కాలి నడకనే వెళ్లి చదువుకున్నాను. నాలుగో తరగతి నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అప్పట్లో ఇలా తారురోడ్లు లేవు. పొలాల నుంచి అడ్డదారుల్లో దుగాల మీద నడుచుకుంటూ వెళ్లేది. 5 నుంచి 10 వరకు అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్లో ఉండి జమీందారు గారి దివాణం బడిలో చదువుకున్నాను. అప్పట్లో అశ్వారావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్.మాధవన్ గిరిజనులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. లోన్లు ఇవ్వడం, పొదుపు చేయించడంతోపాటు విద్యారంగంలో ప్రోత్సహిస్తుండే వారు. ఆయన దగ్గర గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు నేను ఆర్గనైజర్‌గా పనిచేసే వాడిని. అప్పట్లో నా రాజ్‌దూత్ వాహనంతోనే అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులను చైతన్యం చేస్తూ అవేర్ సంస్థ పథకాలను వారికి చేరవేసేవాడిని. రాజ్‌దూత్‌పై మారుమూల గ్రామాల్లో తిరిగిన రోజులు, నా రాజ్‌దూత్ నంబర్ ఏటీడబ్ల్యూ 5370 ఇప్పటికీ గుర్తుంది. ఆనాటి నుంచి ప్రజలతో నాకున్న సంబంధాలే నన్ను ఎమ్మెల్యేను చేశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. నా భార్య శ్యామల మా ఊర్లోనే ఉండే మా మేనమామ కూతురు. తాటి వారి ఆడపడుచు. వరసకు మరదలే అయినా అప్పట్లో ఇద్దరం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకు పిల్లలు లేనందున సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నాం. బాబు రాము అనంతపురంలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక నా మేనల్లుడు తాటి ప్రదీప్‌చంద్ర నా వ్యక్తిగత వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. నా భార్య మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మాటకు అడ్డు చెప్పలేదు. ఆమెకు తెలిసిందల్లా నా నిర్ణయానికి కట్టుబడి ఉండడమే. రాజకీయాల్లో తిరగడం వల్ల మానాన్న నుంచి నాకు సంక్రమించిన 14 ఎకరాల్లో రెండెకరాలు అమ్మేశా. భూమి అమ్మినప్పుడు కూడా శ్యామల పల్లెత్తు మాటనలేదు. నాపై ఆమెకున్న నమ్మకం.. ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఆ సమయంలో శ్యామల మాట్లాడుతూ.. ‘ఆయనకు ఏది నచ్చితే అదే చేస్తారు.. నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు.. నలుగురికి మంచి చేయడం కోసం నష్టపోయినా తప్పు లేదనే వ్యక్తిత్వం ఆయనది. ఇంటి పేరు మెచ్చా.. ఆయనకు లేదు మచ్చ.. అని అందరూ మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంటుంది’ అన్నారు. ఇల్లూ.. పొలమే లోకం.. మొద్దులగూడెం గ్రామ పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఉంటే ఇంట్లో, లేకుంటే పొలంలో.. ఈ రెండూ కాకుంటే పార్టీ ఆఫీస్‌లో ఉంటానని ప్రజలందరికీ తెలుసు. అందుకే అశ్వారావుపేటలో క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా కూర్చోలేక మారుమూల గ్రామమైనా మా ఊర్లోనే ఉంటాను. నియోజకవర్గం దాటితే.. అసెంబ్లీకే. నాకు కాంట్రాక్టులు లేవు.. టెండర్లకు వెళ్లేదీ లేదు. మా ఇంట్లో నాకొక్కడికే రాజకీయాలపై ఆసక్తి. మా తమ్ముడికి ఆ ఊసే ఉండదు. జలగం వెంగళరావు హయాంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశాను. ఏడో తరగతి పూర్తికాగానే ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం వచ్చినా.. రాజకీయాలపై ఉన్న మక్కువతో అందులో చేరలేదు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు మా పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకు పది ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది నా వల్లే అని తెలుసుకుని ఓ రోజు అర్ధరాత్రి బుల్లెట్ వేసుకుని మా ఇంటికొచ్చి నన్ను టీడీపీలో చేర్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అదే పది ఓట్లు వచ్చాయి. అంతే అప్పటి నుంచి నన్ను తుమ్మల వదలిపెట్టలేదు. జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావుతో మంచి సంబంధాలున్నాయి. 2009లో అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడింది. టీడీపీ నుంచి నేను.. మా బావ తాటి వెంకటేశ్వర్లు టికెట్ కోసం పోటీపడ్డాం. ఈ పంచాయితీ తేల్చలేక అప్పట్లో అధిష్టానం గెలిచే సీటును సీపీఎంకు ఇచ్చి చేజార్చుకుంది. ఆ తర్వాతా మా ఇద్దరికే పోటీ. 2014లో తాటి నన్ను ఓడించాడు. 2019లో నేను ఆయనను ఓడించి బాకీ తీర్చుకున్నా. నేను ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటూ.. నన్ను కూడా రావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే వారం రోజులు ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు వెళ్లి ఆయనకు దొరక్కుండా తప్పించుకున్నాను. మళ్లీ నేను గెలిచి.. ఆయన ఓడాక కూడా ఒత్తిడి మొదలెట్టారు. చివరకు సీఎం కూడా నాకేం కావాలన్నా సరే అన్నారు. కానీ.. నా వ్యక్తిత్వాన్ని అమ్ముకునేది లేదని తేల్చి చెప్పేశాను. నేను మట్టిని నమ్ముకున్న రైతును.. ఆ మట్టికున్న నిజాయితీ మనకుంటేనే ప్రజలు విశ్వసిస్తారనేది నా నమ్మకం. నాకు ఆ దేవుడు.. ఈ దేవుడనే తేడా లేదు. కాకుంటే సాయిబాబా గుడికి ఎక్కవగా వెళుతుంటా. సాధ్యమైనంత వరకు కుటుంబంతో.. చిన్ననాటి స్నేహితులతో గడుపుతుంటాను. -
నన్ను ఓడించి తప్పు చేశారు: తుమ్మల
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కూసుమంచి: గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పుచేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం లో భాగంగా కూసుమంచిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నామా నాగేశ్వరరావు తన మనిషిగా వచ్చారని, ఆయన్ను గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని అన్నారు. తాను గతంలో పాలేరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్‌తో ఈప్రాంతంలోని 360 చెరువులు నింపి పచ్చని పంటలు పండించేలా కృషి చేశానని చెప్పారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకవచ్చినా..తనను ఓడించారని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా..అభివృద్ధి చేసినా తనను ఓడించటం బాధ కలిగించిందని అన్నారు. పాలేరు ప్రజలు ఏవేవో ఆశల పల్లకీలో ఉండి ఈ తప్పుచేశారని చెప్పుకొచ్చారు. అయినా తాను సీఎం సహకారంతో ఈప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధిని పూర్తిచేస్తానని చెప్పారు. ఎంపీగా నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తుమ్మల ఓడితే సీఎం బాధ పడ్డారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే సీఎం కేసీఆర్ ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించుకోవడం ద్వారా ఆ బాధను తీర్చాలన్నారు. 16 మంది ఎంపీలు గెలిస్తే దేశ రాజకీయాల్లో సీఎం కేసీర్ ఎదురులేని శక్తిగా ఉంటారని, తద్వారా రా>ష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధిని సీఎం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లుకు కృషి చేశా: నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను తెలంగాణా ఉద్యమ సమయంలో అప్పుడు ఎంపీగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కృషి చేశానని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి తాను టీఆర్ఎస్లో కొనసాగాలని పార్టీలో చేరినట్లు తెలిపారు. తనను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన ఈ సభలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, నాయకులు స్వర్ణకుమారి, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్త్యి రాంచంద్రునాయక్, సీడీసీ చైర్మన్ గోపాలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి ఆసిఫ్‌పాషా తదితర నాయకులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో చేరనున్న ఎమ్మెల్యే కందాల
-
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్..
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ’హ్యాండ్’ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ...కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కారు ఎక్కనున్న ఆయన గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కందాల మాట్లాడుతు...త్వరలో తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి...టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. అయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కొన్నిచోట్ల ...బలహీనంగా ఉండగా, రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కందాల చేరిక టీఆర్ఎస్కు లబ్ది కానుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ... ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అలాగే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్... టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే. -
కుట్రల వల్లే ఓటమి: మాజీ మంత్రి
అశ్వారావుపేటరూరల్: స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రెండింటినీ సమానంగా చూడాలని, ఉభయ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, వేరే వాళ్లను నిందించవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోవడంపై తమతోపాటు సీఎం కేసీఆర్ గుండెల్లో కుడా బాధ నెలకొందన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుస్తామని ఆశపడ్డానని, అలాగే అశ్వారావుపేట అసెంబ్లీ సీటు మొదట గెలవాల్సిన స్థానమని, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాల కోసం బలి పెట్టుకున్నారని, ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఈ స్థానాన్ని చేజేతులారా పొగట్టుకున్నామని, ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని, జరిగింది మనస్సులో పెట్టుకోవద్దని, జరగాల్సినది చూడాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడిచిన నాలుగేళ్లలో మిగిలిన జిల్లాల కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 800 మెగావాట్లతో కేటీపీఎస్‌ను, 12వందల మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్లను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలని, కొట్లాడుకొని వేరే పార్టీల వద్ద చులకన కావద్దని కోరారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ అంతా సిద్ధం కావాలని, సర్పంచ్ టికెట్ల కోసం పొట్లాడుకోవద్దన్నారు. గ్రామ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని కోరారు. అన్ని సర్పంచ్ స్థానాలనూ గెలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్, మండలాధ్యక్షుడు బండి పుల్లారావు, నాగమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ బాధ్యులు జూపల్లి రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి రావాలి: తాటి నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి వస్తేనే జిల్లా లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. సస్పెండ్ డిమాండ్‌తో రసాభాస టీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ ఇన్చార్జ్ రవీందర్ ప్రసంగిస్తున్న క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్గీయులు, ఖమ్మం ఎంపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెంచ్ చేయాలంటూ.. ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. ఒకరినొకరు నెట్టుకుంటున్న క్రమంలో స్థానిక నేత జూపల్లి రమేష్ ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. 10 నిమిషాలపాటు సభలో గందరగోళం నెలకొంది. తోపులాట, మాటల యుద్ధం సాగింది. పార్టీ ఇన్చార్జ్ హెచ్చరించడంతో వారంతా శాంతించారు. -
ఖమ్మంలో టీఆర్ఎస్ భవన్ ప్రారంభం
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు మంచి స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యాలయం దేవాలయంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తామని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని తుమ్మల తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
అంగన్వాడీల్లో అక్రమాలను ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే బాధ్యులను విధులనుంచి శాశ్వతంగా తొలగిస్తా మని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సరుకుల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే ప్రత్యేక బృందంతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. తనిఖీ నివేదిక ఆధారంగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల్లో అవకతవకలపై పలు ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. సరుకుల పంపిణీపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను క్రమబద్ధీకరించి, ఖాళీల భర్తీకి కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల దత్తతకు సంబంధించి త్వరలో ఆరు గురు సభ్యులతో రాష్ట్రస్థాయిలో అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. కొత్త జిల్లాల్లో సఖీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికా రులకు సూచించారు. -
మంత్రి తుమ్మలకు రక్తపు వాంతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంత కాలంగా అల్సర్ సమస్యతో బాధపడుతున్న మంత్రి తుమ్మలకు రక్తపు వాంతులు అయ్యాయి. యశోదా ఆస్పత్రిలో డాక్టర్. ఎంవీ రావు మాట్లాడుతూ.. మంత్రి తుమ్మలకు రక్తంతో కూడిన వాంతులు అయినట్లు తెలిపారు. మంత్రికి బీపీ తగ్గించి బ్లీడింగ్‌ను అదుపు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తుమ్మలకు ఎలాంటి సమస్య లేదన్నారు. అయితే పూర్తిగా కోలుకునేందుకు మరో రెండ్రోజుల పాటు ఆయనను ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించనున్నట్లు వివరించారు. -
అమ్మ మాట ఏనాడూ జవదాటలేదు: మంత్రి
దమ్మపేట(ఖమ్మం): 'నాకు 12 ఏళ్ల వయసులోనే నాన్న చనిపోతే.. అమ్మే(మాణిక్యమ్మ) నన్ను పెంచి పెద్ద చేసింది. రాజకీయంగా ఏ పని చేపట్టాలన్నా అమ్మకు పాదాభివందనం చేయడం నాకు అలవాటు. ఏ స్థాయిలో ఉన్నా.. అమ్మ కష్టపడి నా కుటుంబ సభ్యులను పెంచిన తీరును నేను ఎన్నడూ మరచిపోలేను. ఆమె ఉన్నంత వరకు నా ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకునేది. సమయానికి భోజనం చేస్తున్నావా అని అడిగేది. ఆమె కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మ నన్ను నడిపోడు అనే పిలిచేది. రాజకీయంగా ఎంత బిజీ అయినా.. నాకు తెలిసినంత వరకు అమ్మ మాటను ఏనాడూ జవదాటలేదని' మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమ్మతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. -
'కలెక్టరేట్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయండి'
హైదరాబాద్ : నూతన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణం, ఇతర ముఖ్య భవనాలను ఏడాది కాలంలోగా పూర్తి చేయాలని రహదారులు, భవనాల శాఖ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. న్యాక్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ సెంటర్ల నిర్మాణం, గర్భిణి స్త్రీలకు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి విజయేందిర సమీక్షలో పాల్గొన్నారు. -
భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక కృషి: తుమ్మల
భద్రాచలం: భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి బుదవారం భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, పట్టణ శాశ్వత అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విధంగా భద్రాచలం అభివృద్ధికి శ్రీ చిన్నజీయర్‌స్వామితో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పాల్గొన్నారు. -
సీతారామ పనులను సమీక్షించిన తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్షించారు. జిల్లాలో రూ. 7,900 కోట్లతో నిర్మిస్తున్న శ్రీ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను సోమవారం కొత్తగూడెం క్లబ్లో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత, ఎంపీ సీతారాం నాయక్, ఐదుగురు ఎంఎల్యేలు, ఎంఎల్సీలు జడ్పీ చైర్ పర్సన్ పాల్గొన్నారు. -
ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీః తెలంగాణలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూలు జారీచేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఈనెల 26న నోటిఫికేషన్ జారీకానుంది. అక్టోబరు 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 4న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అక్టోబరు 6 వరకు గడువు విధించారు. అక్టోబరు 17వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈసీఐ తన షెడ్యూలులో ప్రకటించింది. -
పని చేయకుంటే ‘బ్లాక్ లిస్టే’
ఖమ్మం : నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానా విధించడంతోపాటు పేర్లు బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో జిల్లా అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్, జిల్లా పరిషత్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి మంత్రి తుమ్మల సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాకతీయ మిషన్ పనుల్లో చెరువు పూడిక పనులకంటే ముందు సిమెంటు పనులు పూర్తిచేయాలన్నారు. మొదటి దశలో 851 పనులకు.. 801 పనులు పూర్తయ్యాయని, రెండో దశలో 927 పనులు మంజూరు చేయగా.. 41 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 865 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జూన్ 15 నాటికి ఆ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా 4,517 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో చెరువుల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. పాలెం వాగు పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. దీనిద్వారా 12,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చెక్‌డ్యామ్ పనులను వేగవంతం చేయాలని, పదిహేను రోజుల్లో సేఫ్ లెవల్ వంతెన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భగీరథ పనులతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానీయవద్దన్నారు. 740 గ్రామాలకు డిసెంబర్ నాటికి తాగునీరు అందిస్తామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ పనితీరు సరిగా లేదంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథలో పర్ణశాల, పూసూరు, కూసుమంచి ఇన్‌టేక్, వాటర్ టెస్టింగ్ ప్లాంటును సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు భూసేకరణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. -
పాలేరులో ఓట్లు పోలయ్యాయి ఇలా...
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఆయనకు 94,933 ఓట్లు పోలైనాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డికి 49,252 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు 15,538 ఓట్లు వచ్చాయి. అలాగే నోటా కింద 2,785 ఓట్లు పోలయ్యాయని అధికారులు వెల్లడించారు. -
'ఓటమి భయంతోనే విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి'
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. శుక్రవారం పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అజయ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలేరు ఉప ఎన్నిక మే 16వ తేదీన జరగనుంది. ఫలితాలు 19న ప్రకటిస్తారు. -
రాములోరి పెళ్లికి ఏర్పాట్లు ఇలాగేనా..!
దేవస్థానం ఈఓకు మంత్రి తుమ్మల క్లాస్ సరెండర్ చేయాలంటూ ఆదేశం భద్రాచలం : భద్రాచలం దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. శ్రీరామనవమికి చేస్తున్న ఏర్పాట్లపై మంగళవారం ఆయన జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారి పెళ్లి వేడుక జరిగే మిథిలా ప్రాంగణాన్ని పరిశీలించారు. కల్యాణ మండపం వద్ద పందిళ్లను సరిగా వేయకపోవడాన్ని గుర్తించారు. ఆయన దీనిపై ఈఓ జ్యోతిని వివరణ కోరారు. ఆ పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరంటూ పిలిపించి అతడిని మందలించారు. ‘‘ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాములోరి పెళ్లికి ఏర్పాట్లు చేసేది ఇలాగేనా..? నీకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవా..? నువ్వు ఉద్యోగం చేయడానికేవచ్చావా తల్లీ... పుష్కరాల నుంచీ చెబుతున్నా... నీ పద్ధతి మార్చుకోవా..నీకు చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అంటూ ఈఓ జ్యోతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మిథిలా ప్రాంగణమా అనుకున్నారా..? పందుల గుడిసెలు అనుకున్నావా..? రామయ్యకు ఎంత ప్రతిష్ట ఉందో తెలిసి కూడా ఇలా ఏర్పాట్లు చేయటం సరైంది కాదన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై మీరు అసలు తిరుగుతున్నారా..అంటూ’’ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారూ వీరిద్దరినీ సరెండర్ చేయండి అంటూ దేవస్థానం ఈఓ జ్యోతితో పాటు డీఈపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వల్ల కాదుకానీ,ఈ రెండు రోజులు భద్రాచలంలోనే ఉండి మీరే ఏర్పాట్లన్నీ చూసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో పందిళ్లు సరిగా వేయలేదని, గాలీ,వెలుతురు వచ్చేలా తగిన రీతిలో అమర్చాలన్నారు. శ్రీసీతారాముల వారి పెళ్లి వేడుకల ఏర్పాట్లు చూసేందుకని వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవస్థానం అధికారులను, అందులోనూ ఈఓ జ్యోతిపైనే తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయటం సర్వత్రా చర్చకు దారితీసింది. ఉత్సవాలకు మరో రెండు రోజులు గడువు ఉందనగా, ఈ పరిణామాలు చోటుచేసుకోవటంతో జిల్లా అధికారుల్లో దీనిపైనే చర్చసాగుతోంది. -
రోడ్డెక్కిన 12 నూతన బస్సులు
ఖమ్మం: ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం కేటాయించిన 12 నూతన బస్సులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నెస్పీ ప్రాంతంలో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ బస్సులో మంత్రి తుమ్మలతోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, కలెక్టర్, ఇతర అధికారులు నగరంలో పర్యటించారు. -
రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యానికి గురైన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. శనివారం నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తుమ్మల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి వైద్యులతో కూడా వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తుమ్మల వాకబు చేశారు. వెంకట్‌రెడ్డి తొందరగా కోలుకోవాలంటూ తుమ్మల ఆకాంక్షించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. నేపథ్యంలో ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
'బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వొద్దు'
న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వకూడదంటూ కేంద్రమంత్రి అశోక గజపతిరాజును తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం మంత్రి తుమ్మల ఢిల్లీలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజును కలిశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్టు సమాచారం. అశోక గజపతిరాజు దీనికి సమాధానంగా దేశం కోసం ఆర్మీ పని చేస్తోంది.. ఇవ్వకూడదంటే ఎలా అని తుమ్మలను ప్రశ్నించారు. అదే విధంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తుమ్మలను కోరారు. కొత్తగూడెంలో నూతన ఎయిర్ పోర్టు కోసం స్థలం సేకరిస్తే పరిశీలిస్తామని బదులిచ్చారు. అశోకగజపతిరాజుతో పాటు నితిన్ గడ్కరి, మేనకా గాంధీలను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా కలిశారు. జాతీయ రహదారుల విస్తరణలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ వారికి వివరించారు. -
పార్టీల్లో ‘ఎమ్మెల్సీ’ కోలాహలం
ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు టీఆర్ఎస్లో భారీగా ఆశావహులు కడియం, తుమ్మలకు అవకాశం మరో రెండింటి కోసం నేతల్లో పోటీ ఐదోస్థానానికీ టీఆర్ఎస్ వ్యూహాలు ఓ సీటు కావాలంటున్న మజ్లిస్ కాంగ్రెస్‌కు ఒకటి ఖాయం, పోటీ చేస్తామంటున్న టీడీపీ హైదరాబాద్: శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్సీ ఆశావహుల్లో సందడి నెలకొంది. పదవులపై ఆశలు పెట్టుకున్న ఆయా పార్టీల్లోని నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. శాసనసభలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాలుగు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానం కోసం టీడీపీ బరిలో నిలవనుంది. ఈ స్థానానికి పోటీకి దిగాలని టీఆర్ఎస్ చూస్తోంది. మరోవైపు టీఆర్ఎస్తో స్నేహపూర్వక సంబంధాలున్న ఎంఐఎం కూడా తమకు ఓ సీటు కావాలని ఆశిస్తోంది. టీఆర్ఎస్లో తీవ్ర పోటీ అధికార టీఆర్ఎస్లో ‘మండలి’ కోలాహలం మొదలైంది. ఎమ్మెల్సీ ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీకి నాలుగు స్థానాలు ఖాయంగా వచ్చే అవకాశం ఉండటంతో ఈ పదవులకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. రాష్ర్ట విభజన తర్వాత మండలిని సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకొని మండలి చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇందుకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి మరోమారు అవకాశమివ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేబినెట్లోకి తీసుకున్నారు. వీరికి అనివార్యంగా మండలి సభ్యత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో వీరిద్దరినీ ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయడం ఖాయం. ఇక మిగిలిన రెండు స్థానాలకు అధినేత మదిలో ఎవరున్నారో అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, గతంలో ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికై కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన కేఆర్ ఆమోస్, నాగపురి రాజలింగం, కె.యాదవరెడ్డి వంటి వారు రేసులో ఉన్నారు. అలాగే టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై గులాబీ తీర్థం పుచ్చుకున్న బోడకుంటి వెంకటేశ్వర్లు పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. కాగా, నాగపురి రాజలింగానికి మరోరకంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చి రేసు నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా రెండు స్థానాలకు ఇద్దరి పేర్లు ఖాయం కాగా, మరో రెండు స్థానాలకు ఎవరని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఐదో స్థానం కోసమూ అభ్యర్థిని పోటీకి పెట్టే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్న ఎం ఐఎం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోందని, ఐదో స్థానానికి ఆ పార్టీ తర ఫున ఎవరినైనా బరిలోకి దిం పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీ చేయనున్న టీడీపీ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి 16 మంది మద్దతు కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపనుంది. వరంగల్ జిల్లాకు చెందిన వేమిరెడ్డి నరేందర్‌రెడ్డికి అవకాశమిస్తారని ప్రచారంలో ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌కుమార్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మొన్నటిదాకా ఎమ్మెల్సీగా పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఒక్క సీటుకు.. ఢిల్లీ నిర్ణయం? కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఆ పార్టీకి శాసనసభలో 21 మంది సభ్యుల బలమున్నా, నలుగురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 17కి తగ్గింది. అయితే నర్సంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు కూడా ఉన్నందున ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా దక్కుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్నాథరావు కుటుంబంలో ఒకరికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వారెవ్వరికీ అవకాశం ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది. -
'ప్రణాళిక లోపంతోనే ఓటమి'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రణాళిక లోపం వల్ల హైదరాబాద్ లో ఓటమిని ఎదుర్కొన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ముందు నుంచి హైదరాబాద్, రంగారెడ్డి లలో బలహీనతలు ఉన్నాయన్నారు. నాలుగేళ్లలో తెలంగాణ రోడ్లను గుజరాత్ కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో జరిగే గోదావరి పుష్కరాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు రోడ్లు, వసతిగృహాలు, భక్తుల ఏర్పాట్లపై దృష్టి పెట్టామన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలు, హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని , కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తుమ్మల తెలిపారు. -
అంగన్వాడీ సిబ్బందిపై తుమ్మల ఆగ్రహం
ఖమ్మం : అంగన్వాడీ సిబ్బందిపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం ముకుందాపురం గ్రామంలో మంత్రి తుమ్మల సోమవారం ఉదయం పర్యటించారు. ముకుందాపురం నుంచి ఆసన్నగూడెం గ్రామం వరకు రూ.1.96 కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ స్కూల్‌ను సందర్శించారు. నిర్వహణ సరిగా లేకపోవడం, రికార్డుల్లో వివరాలను సరిగా పొందుపరచకపోవడాన్ని గుర్తించిన తుమ్మల అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్ కవిత, ఉన్నతాధికారులు పలువురు ఉన్నారు. (దమ్మపేట) -
కేంద్రానికి రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు
ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సరసన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లను కేంద్రం ప్రభుత్వం చేర్చిందని తెలంగాణ రహదారులు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో తీవ్రవాద ప్రాబల్యమున్న జిల్లాల సంఖ్య నాలుగుకు పెరిగిందని, ఈ జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించామన్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)ను బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులు/టెండర్లకు సీఓటీ అనుమతి తప్పనిసరి చేసే యోచనలో ఉన్నామన్నారు. సీఓటీ విధివిధానాలను పునః సమీక్షించి కొత్త విధాన రూపకల్పన చేస్తామన్నారు. ఈ అంశంపై నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మునిసిపల్ శాఖలతో చర్చించి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. టెండర్లకు అనుమతుల జారీలో సీఓటీ రెండూ మూడు నెలల సమయం తీసుకుంటుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల అనుమతికి నిర్ణీత గడువు విధిస్తామన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.2 కోట్లకు పైగా వ్యయం చేసే పనులకు సీఓటీ అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. గోదావరి, సీలేరు నదులపై ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న వంతెనలను ఈ ఏడాది మేలోగా పూర్తిచేస్తామన్నారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుల పురోగతిపై ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు హామీ ఇచ్చామని తెలిపారు. -
'గాలి' తీసి మరీ వెళ్లాడు
తుమ్మల నాగేశ్వరరావు... సైకిల్ చక్రాల్లో గాలి తీసి మరీ కారు ఎక్కేశాడని ఖమ్మం జిల్లాలోని తెలుగుతమ్ముళ్తు తెగ ఇదైపోతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ సింగిల్ సీటు మాత్రమే గెలుచుకుందని... ఆయన ఈ పనేదో శాసనసభ ఎన్నికల ముందు చేసి ఉంటే జిల్లాలో పార్టీకి మరిన్నీ సీట్లు వచ్చేవని పచ్చ తమ్ముళ్లు అనుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. ఆ తర్వాత స్థానాన్ని టీడీపీ 15 స్థానాలతో నిలిచింది. అదేదో తుమ్మల ముందే కారు ఎక్కిఉంటే తమ పాట్లు ఏవో తామే పడి... జిల్లాలో 10 స్థానాల్లో కనీసం సగానికిపైగా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారమని చెబుతున్నారు. ఆ ఛాన్స్ కావాలనే మిస్ చేశాడని తుమ్మలపై పచ్చ తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన ఒక్కడే పోకుండా జిల్లాలోని పార్టీకి చెందిన ముఖ్యనేతలు అనుచరగణాల పచ్చ కండవాలను మరీ విప్పించి గులాబి కండువాలు కప్పించారని వారు ఆరోపిస్తున్నారు. దాంతో జిల్లాలో దాదాపు పచ్చ పార్టీ పరిస్థితి హ్యాండిల్ మాత్రమే మిగిలిన సైకిల్లా ఉందని ఫీలైపోతున్నారు. నామాతో పాటు మరి కొందరు నేతలు ఉన్నా జిల్లాలో పచ్చపార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఇప్పడప్పుడే సాధ్యం కాదని అవేదన పడిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు గెలుచుకున్న టీడీపీ... భవిష్యత్తులో ఆ ఒక్కసీటు కూడా కోల్పోయే పరిస్థితి ఉందని... ఇక పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఎన్నాళ్లు పడుతుందోనని పచ్చ తమ్ముళ్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. -
తుమ్మ(ల) ముల్లుతో సైకిల్‌కి పంక్చర్ !
అంతా అనుకున్నట్టే అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైకిల్ దిగి... కారెక్కెందుకు రంగం సిద్ధమైంది. అందుకు ముహూర్తం కూడా దాదాపు ఖరారైపోయింది. బహుశా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వినాయకచవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం నాడు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి ముచ్చటించారు. దాంతో తుమ్మల పచ్చ చొక్కా విప్పేస్తారంటూ ఇన్నాళ్లుగా వచ్చిన కథనాలకు మరింత బలం చేకూరింది. అసలు తుమ్మల రెండు చక్రాల సైకిల్ దిగి నాలుగు చక్రాల కారు ఎందుకు ఎక్కుతున్నట్లు? ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కారు హైస్పీడ్‌తో దూసుకెళ్లినా, ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అటు తెలుగుదేశం పరిస్థితీ అంతే. దాంతో ఆ జిల్లాలో 'గులాబీ' గుబాళించాలంటే ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహాచరులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆ జిల్లాలో పచ్చపార్టీ అగ్రనేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు వర్గాల మధ్య వైరం తారస్థాయికి చేరింది. దాంతో అక్కడ సైకిల్‌కు పంక్చర్ పెట్టి తుమ్మలను కారు ఎక్కిస్తే సరిపోతుందని మంత్రి వర్గ సహచరుడొకరు కేసీఆర్ చెవిలో ఊదాడు. అంతే.. చకచకా పావులు కదిలాయి. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రంగంలోకి దిగారు. అయినా తుమ్మల సైకిల్ దిగడానికి ససేమిరా అనడంతో.... ఇక తప్పదని కేసీఆరే రంగంలోకి దిగారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే అడగడంతో.. ఇక కాదనలేక తుమ్మల కారెక్కెందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సైకిల్ టైర్‌కు తుమ్మ(ల) ముల్లు గుచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్ధమైపోయింది.