'కలెక‍్టరేట‍్ల నిర్మాణం త‍్వరగా పూర్తిచేయండి' | Tummala Nageshwar Rao Review Meet With Officials Women Development | Sakshi
Sakshi News home page

'కలెక‍్టరేట‍్ల నిర్మాణం త‍్వరగా పూర్తిచేయండి'

Published Tue, Apr 11 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

Tummala Nageshwar Rao Review Meet With Officials Women Development

హైదరాబాద్ : నూతన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణం, ఇతర ముఖ్య భవనాలను ఏడాది కాలంలోగా పూర్తి చేయాలని రహదారులు, భవనాల శాఖ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. న్యాక్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర‍్భంగా ఆయన అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణం, గర్భిణి స్త్రీలకు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి విజయేందిర సమీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement