'కలెక్టరేట్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయండి'
హైదరాబాద్ : నూతన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణం, ఇతర ముఖ్య భవనాలను ఏడాది కాలంలోగా పూర్తి చేయాలని రహదారులు, భవనాల శాఖ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. న్యాక్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ సెంటర్ల నిర్మాణం, గర్భిణి స్త్రీలకు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి విజయేందిర సమీక్షలో పాల్గొన్నారు.