సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (ప్యాక్స్)ల్లో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై, రు ణాలను రికవరీ చేయని అధికారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డీసీసీబీ, ప్యాక్స్‌ల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు.
నిజామాబాద్ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతిపత్రాలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో ఆయన స్పందించారు.ప్యాక్స్‌లను బలోపేతం చేయండి: ప్యాక్స్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా తీసు కున్న రుణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్యాక్స్ లను బలోపేతం చేయాలని సూ చించిన ఆయన రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ స్థాయి వరకు చేర్చే ప్రణాళికను మార్క్‌ఫెడ్ అమలు చేయా లనీ, ఎరువుల కంపెనీలతో చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన స్థాయిలోఎరువులు అందుబాటులో ఉ న్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికా వాల్సిన అవసరం లేదని తుమ్మల భరోసానిచ్చారు.
తుమ్మల ఆదేశాలపై చర్చ
కాగా, మంత్రి తుమ్మల రుణ వసూళ్ల ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై వ్యవసాయశాఖలోనూ చర్చకు తెరలేపింది. రైతులు బకాయిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీసీసీబీ, టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment