ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. శుక్రవారం పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అజయ్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలేరు ఉప ఎన్నిక మే 16వ తేదీన జరగనుంది. ఫలితాలు 19న ప్రకటిస్తారు.