Khammam: TRS Leader Tammineni Krishnaiah Death, Wife Accuses CPI Leaders - Sakshi
Sakshi News home page

Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య హత్య.. ‘నా భర్త చావుకు వాళ్లే కారణం’

Published Mon, Aug 15 2022 7:12 PM | Last Updated on Mon, Aug 15 2022 8:03 PM

Khammam: TRS leader Tammineni Krishnaiah Death, Wife Accuses CPI Leaders - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం తెల్దారుప‌ల్లి గ్రామ స‌మీపంలో టీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు త‌మ్మినేని కృష్ణ‌య్య దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. తమ్మినేని కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తన భర్త హత్య వెనక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు హస్తం ఉందని తమ్మినేని కృష్ణయ్య భార్య ఎంపీటీసీ మంగతాయారు, కూతురు రజిత ఆరోపించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

గతంలోనే తన భర్తను హత్య చేస్తానని కోటేశ్వరరావు పలుమార్లు బెదిరిస్తూ వచ్చారన్నారు. గ్రామంలో తన భర్తకు రాజకీయంగా మంచి పేరు ఉండటంతో కోటేశ్వరరావు చంపాలని ప్లాన్ వేశారన్నారు. తమ్మినేని వీరభద్రంతో పాటు కోటేశ్వరరావును హత్యతో సంబంధం ఉన్న సీపీఎం నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి వచ్చిన పరిస్థితి భవిష్యత్తులో ఏ కుంటుంబానికి రావద్దని కన్నీటి పర్యంతమయ్యారు.
చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఉద్రిక్త పరిస్థితులు.. రెండు చేతుల్ని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement