భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక కృషి: తుమ్మల
Published Wed, Feb 1 2017 3:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
భద్రాచలం: భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి బుదవారం భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, పట్టణ శాశ్వత అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విధంగా భద్రాచలం అభివృద్ధికి శ్రీ చిన్నజీయర్‌స్వామితో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పాల్గొన్నారు.
Advertisement
Advertisement