సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఖమ్మం జిల్లాకు తుమ్మల రానున్నారు. మరోవైపు.. తుమ్మల అనుచరులు వెయ్యి కార్లతో ర్యాలీ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలను ఒప్పించి పాలేరు నుంచి బరిలో నిలపాలని తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా.. తుమ్మల కాంగ్రెస్‌లో చేరడానికే మొగ్గు చూపుతున్నారని ఆయన మెజార్టీ అనుచరులు చెబుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తుమ్మల నిర్ణయం ఏవిధంగా ఉండబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. తుమ్మల అంశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలలో ఎంపీ నామా నాగేశ్వర రావు.. తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తుమ్మలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌లో తుమ్మలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నామా తెలిపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ మొండిచేయి.. అలకబూనిన మోత్కుపల్లి.. వాట్ నెక్స్ట్?
Comments
Please login to add a commentAdd a comment