‘సాయం’ చేతగాక దాడులా?.. ఖమ్మం ఘటనపై కేటీఆర్‌ రియాక్షన్‌ | Former Minister KTR Reaction On Khammam Attack Incident | Sakshi
Sakshi News home page

‘సాయం’ చేతగాక దాడులా?.. ఖమ్మం ఘటనపై కేటీఆర్‌ రియాక్షన్‌

Published Tue, Sep 3 2024 3:50 PM | Last Updated on Tue, Sep 3 2024 4:18 PM

Former Minister KTR Reaction On Khammam Attack Incident

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం దాడి ఘటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్‌... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం అసహనానికి నిదర్శనం మంటూ మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక... సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

‘‘మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా?. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు.  ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి.’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

‘‘ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే.. ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం.’’ అంటూ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement