సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌లో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు.
కాగా నేడు తుమ్మల కాంగ్రెస్‌లో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది.
చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక
మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తుమ్మలతోపాటు రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోనియా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment