సాక్షి, ఖమ్మం జిల్లా: బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొండలు.. గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతున్నారని.. సీఎంని, మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
ఈ రోజు హరీశ్‌రావు 8 గంటలకే మార్కెట్‌కి వెళ్లి పర్యటన చేయడం హాస్యాస్పదం. వ్యవసాయం గురించి తెలిసివాళ్లకు రైతులు ఏ సమయానికి మార్కెట్‌కు వస్తారో తెలుస్తుంది. మీకు ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమిషన్ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు.’’ అంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగులకు మొదటి తేదీ నాడే జీతాలు చెల్లిస్తోంది. సుజాతనగర్‌లో నకిలీ విత్తనాలు రైతులను నష్ట పరిచిన కంపెనీ యాజమాన్యంతో వారందరికీ పరిహారం చెల్లించేలా చేశాం. కొత్తగూడెం విమానాశ్రయం ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే ఎయిర్‌పోర్ట్ రాబోతుంది’’ అని రేణుకా చౌదరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment