Renuka Chowdhury
-
దవడ పగలకొడతా..రేణుకా చౌదరి వార్నింగ్..
-
పెద్దల సమక్షంలోనే.. రసాభాసగా ఖమ్మం కాంగ్రెస్ సమావేశం
సాక్షి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ ఎత్తున తుక్కుగూడలో(రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో) బహిరంగ సభకు సిద్ధమవుతోంది. అయితే ఈ సభకు సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయగా.. అది రసాభాసకు దారి తీసింది. సీనియర్ నేత వీహెచ్ మాట్లాడే సమయంలో కార్యకర్తలు అడ్డుపడడంతో.. ఆయన వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంలో తుక్కగూడ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌తో పాటు వీ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నియోజకవర్గ ఇంఛార్జిలు, కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే వీహెచ్ మాట్లాడే సమయంలో కొందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జిల్లాలో మీ కో అర్డినేషన్ ఏమిటి? అంటూ వీహెచ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీహెచ్ సైతం కౌంటర్‌గా వాళ్లపై మండిపడ్డారు. దీంతో.. అరుపులు కేకలు వేసిన కార్యకర్తలపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కార్యకర్తలు ఎవరికి వారే.. ‘జై పొంగులేటి’, ‘జై రేణుకా చౌదరి’, ‘జై భట్టి’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా తయారైంది. పెద్దల్ని గౌరవించండి మనలో మనం కొట్టుకుంటే పార్టీకే నష్టమంటూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పొంగులేటి, రేణుకాచౌదరి. పార్టీ పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ లో గ్రూప్ గొడవలు ఉండొద్దు. అందరం కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పది కి పది స్థానాలు గెలుస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ‘‘నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉంది. నలభై ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదు. పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగాలి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఖబర్దార్ అజయ్ కుమార్(మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఉద్దేశించి).. దమ్ముంటే రా. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు. గాలి మారిపోయింది. రాబోయేది కాంగ్రెస్.. ఉండబోయేది కాంగ్రెస్.. గుర్తుంచుకో. కేసీఆర్, మోదీ తోడు దొంగలు. ఈ విషయం.. కవిత లిక్కర్ కేసుతో రుజువైందని రేణుక చౌదరి మండిపడ్డారు. -
ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్..
ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటలే మంటలు రేపుతున్నాయి. పంచ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్‌ను పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలని రేణుకకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. కారు, కాంగ్రెస్ సై అంటే సై అంటున్న ఖమ్మంలో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మధ్య మంటలు రేగుతున్నాయి. ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఖమ్మంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్న నిరుద్యోగ ర్యాలీలో మాట్లాడుతూ..మంత్రి అజయ్‌ను అరే అంటూ సంభోదిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అజయ్ కూడా రేణుకకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేణుకకు దమ్ముంటే ఖమ్మంలో తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన మీద రేణుక గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మంత్రి అజయ్ సవాల్ చేశారు. రాష్ట్ర మంత్రి అజయ్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి..రాజకీయ విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగిపోయారు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలతో ఖమ్మంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒరిజినల్‌గా బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకుంటున్న ఇతరులంతా కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కినవారే. అందుకే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కసితో రగలిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందంటూ మైండ్ గేమ్‌కు తెర తీసారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక ఖమ్మం జిల్లాకు గాని, నగరానికి గాని చేసిందేమీ లేదని, రేణుక అంటే పబ్బులు, గబ్బుల చరిత్రే గుర్తుకు వస్తుందని పువ్వాడ అజయ్ రివర్స్‌లో కౌంటర్ వేశారు. ఖమ్మం నుంచి రెండుసార్లు గులాబీ పార్టీ తరపున గెలిచిన మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం కూడా తక్కువేమీ కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంత్రి అజయ్‌ను ఓడించాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకుని కసితో పనిచేస్తున్నారు. రేణుకకు దమ్ముంటే తనపైన ఖమ్మంలో పోటీ చేయాలంటూ పువ్వాడ అజయ్ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ నేత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీచేస్తారనే ప్రచారం ఓ వైపు..అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేస్తారంటూ మరోవైపు కాంగ్రెస్‌లో టాక్ నడుస్తోంది. ఒకవేళ రేణుక బరిలో ఉంటే ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. పువ్వాడ, రేణుక ఇద్దరూ ఒకే సామాజికవర్గం గనుక ఆ వర్గంలోనే చీలిక తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు పువ్వాడ అజయ్ సవాల్‌ను రేణుక ఎలా స్వీకరిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? -
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్.. దమ్ముంటే పోటీ చేసి గెలువ్!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. ఖమ్మం వేదిక నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీలో మంత్రి అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేణుకా చౌదరి. అరే మంత్రి అజయ్ అని సంబోధిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కలని వ్యాఖ్యలను చేశారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ గుట్టలను మింగేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దమ్ముంటే రేణుక తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ‘చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు సంస్కారం ఉంది. నా తల్లిదండ్రులు అది నాకు నేర్పించారు. నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు. న్యాయపరంగా నీచులపై పోరాటం చేస్తాను. అజయ్ కుమార్‌ను మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మంలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్నట్లు ఉంది. రేణుకా చౌదరి అంటే పబ్భులు, గబ్భులు చరిత్ర అని ఫైర్ అయ్యారు మంత్రి. కేంద్రమంత్రిగా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంటి? ఖమ్మానికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుకా చౌదరికే దక్కుతుంది’ అని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. చదవండి: Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్.. -
ప్రధాని మోదీపై పరువునష్టం కేసు వేస్తా: రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. 2018లో పార్లమెంట్లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని, మోదీ తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని ఆమె పేర్కొన్నారు. సభలో అందరిముందు అవమానిస్తూ మోదీ మాట్లాడిన మాటలు తనను బాధించాయని, అందుకు మోదీపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చుద్దాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు మోదీ పార్లమెంట్లో ప్రసంగించిన వీడియోను ఆమె ట్వీట్ చేశారు. ఇందులో.. రామాయణం సీరియల్ ప్రసారం అయిన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరి నవ్వును కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్ర మోడీ రాజ్యసభ ఛైర్మన్‌ను కోరినట్లు కనిపిస్తుంది. కాగా ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. ఈ ఆదేశాలపై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించడాన్ని విపక్షాలన్నీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ తనను శూర్పణఖతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళతానని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ విషయంలో కోర్టులు చాలా వేగంగా స్పందించాయని చెబుతూ.. ఈ కేసు విచారణను ఎంత వేగంగా పూర్తి చేస్తాయో చూడాలని ఆమె అన్నారు. చదవండి: ‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house. I will file a defamation case against him. Let's see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW — Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023 -
ట్రాక్టరే కాదు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు: రేణుకా చౌదరి
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి): ‘సత్తుపల్లి సింగరేణి బాధితులకు ఇళ్లు కట్టిస్తే సరి.. లేకపోతే నాకు ట్రాక్టర్‌తో పాటు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా..’ అని కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకాచౌదరి హెచ్చరించారు. సత్తుపల్లిలో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ అధ్యక్షతన నియోజకవర్గ ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికైనా ఏమైనా అయితే రేణుక నుంచి రేవంత్‌రెడ్డి వరకు ఇక్కడకు వస్తామని భరోసా ఇచ్చారు. డబ్బు తీసుకుని ఓట్లు వేయటం వల్లే ఇలాంటి పాలకులు వస్తున్నారని, ఇక సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో విలువైన ఓటుహక్కును దుర్వినియోగం చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా మానవతారాయ్‌ను ఎన్నుకోవాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటుకు యత్నిస్తానని తెలిపారు. ట్రాక్టర్ నడుపుతున్న రేణుకాచౌదరి, పక్కన మానవతారాయ్ తదితరులు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి సింగరేణి నిధుల వినియోగంపై ఇప్పటికే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానని మానవతారాయ్ తెలిపారు. పదమూడేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి పేదలకు గజం కూడా పంచలేదని మండిపడ్డారు. సభలో నున్నా రామకృష్ణ, మానుకొండ రాధాకిశోర్, ఎడవల్లి కృష్ణ, మద్ది శ్రీనివాసరెడ్డి, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కట్ల రంగారావు, బుక్కా కృష్ణవేణి పాల్గొన్నారు. మట్టి అక్రమాలపై చర్యలు ఉండవా? రఘునాథపాలెం: ఖమ్మం శివారు పువ్వాడనగర్ గుట్టలపై అనుమతికి మించి మట్టి తవ్వినట్లు అధికారులు గుర్తించినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రశ్నించారు. మండలంలోని కోయచెలక రెవెన్యూ పరిధి పువ్వాడనగర్ గుట్ట వద్ద క్వారీని సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈ విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నాయకులు మానుకొండ రాధాకిశోర్, దీపక్‌చౌదరి, మిక్కిలినేని నరేంద్ర, మందా బుచ్చిబాబు, మాధవిరెడ్డి, వాంకుడోత్ దీపక్‌నాయక్, దుంపటి నగేశ్ పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఖమ్మంరూరల్: ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. మండలంలోని తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించి మాట్లాడారు. పోలీసులు ఇకనైనా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ, కళ్లెం వెంకటరెడ్డి, ధరావత్ రాంమూర్తినాయక్, మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో తమకు తెలుసు: రేణుకా చౌదరి
-
ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: మర్రి శశిధర్‌రెడ్డి చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డే సర్దుకోవాలని సూచించారు. అన్ని పార్టీల్లో మనస్పర్ధలు ఉంటాయని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్‌లో పరిణామాలు సహజమని, కొత్తేం కాదని రేణుక చౌదరి తెలిపారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయన్న మాజీ మంత్రి.. నితిన్ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లను అవమానించే శక్తిమాన్ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసన్నారు. ఖమ్మంలో తనను ఎదురించే మొనగాడు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని, మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. -
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రేణుక చౌదరి
-
ఎస్సైతో దురుసు ప్రవర్తన!.. రేణుకా చౌదరిపై కేసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్‌భవన్ సందర్భంగా.. పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్ పట్టుకున్నారు ఆమె. దీంతో ఎస్ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. చలో రాజ్‌భవన్‌లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది. ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్‌కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు. #WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE — ANI (@ANI) June 16, 2022 -
ఎస్ఐ కాలర్ పట్టుకున్నరేణుకా చౌదరి
-
Hyderabad: ఉద్రిక్తంగా చలో రాజ్‌భవన్.. పోలీసుల సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి కాంగ్రెస్ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ రచ్చపై పోలీసుల సీరియస్ కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు సీరియస్ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. రణరంగంగా మారిన ఖైరతాబాద్ రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ రాహుల్ గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలోరాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్‌కు వెళ్లే ఇరువైపులా రోడ్లను మూసివేయడంతో ఖైరతాబాద్ జంక్షన్లో భారీ ట్రాఫిక్ జాం అయింది. ఖైరతాబాద్-పంజాగుట్ట రూట్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బేగంపేట మార్గంలోనూ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను రాజ్‌భవన్ రూట్లోకి అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. రేణుకా చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రోజుల వ్యవధిలో తెలంగాణలో ముగ్గురు మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. తెలంగాణలో పసి పిల్లలకు కూడా రక్షణ కరువైంది. ఇదేనా బంగారు తెలంగాణ అంటే..?. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారు. వేలల్లో కేసులు నమోదయితే.. 46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ మైనర్ కేసును వదిలేది లేదు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడంలేదు. షీ టీమ్స్ ఏమయ్యాయి..?. మైనర్ వీడియోను బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దోషే. రఘునందన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదు. ఆయన సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త వాంగ్మూలంలో మంత్రి పువ్వాడనే తన చావుకు కారణం అని చెప్పినా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. నగరంలో రక్షణ లేనప్పుడు..పెట్టుబడులు ఎలా వస్తాయి. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది. లైసెన్స్‌లు ఇస్తుంది.. ఎక్సైజ్ శాఖ కాదా..?’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు రేణుకా చౌదదరి ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. -
కేంద్ర మాజీ మంత్రి రేణుకపై వారెంట్ ఎత్తివేత
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కోర్టుకు హాజరైన కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిపై గత నెలలో జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. గతంలో రేణుకా చౌదరిపై నమోదైన ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మంకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి సోమవారం రేణుకాచౌదరి ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకాచౌదరిపై గతంలో జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జడ్జి ఎత్తివేస్తూ రీకాల్ చేశారు. వచ్చే నెల 17వ తేదీకి కేసు వాయిదా వేశారు. -
రేణుకా చౌదరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్
సాక్షి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసుకు సంబంధించి ఆమెకు ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ వారెంట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక చౌదరి తన భర్తను మోసగించారంటూ కళావతి బాయి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై రేణుకా చౌదరిపై ఖానాపురం హవేలీ పోలీసులు సెక్షన్ 420, 417 కింద నాలుగేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు రేణుకకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు అందుకోకపోవడంతో పాటు, విచారణకు గైర్హాజరు కావడంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. -
ఖమ్మం మెట్టు.. ఎవరిదో పట్టు!
విప్లవ రాజకీయాల పురిటిగడ్డ ఖమ్మం ఖిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేసేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీఆ తర్వాతి పరిణామాలతో పుష్పక విమానంలా మారిన‘కారు’లోని సైన్యం కలిసికట్టుగా పనిచేస్తే విజయం పెద్దకష్టమేమీ కానప్పటికీ, ఏం జరుగుతుందోననే మీమాంస ఆ పార్టీలో కనిపిస్తుండటం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామా నాగేశ్వరరావుకు జిల్లాలోని ప్రధాన నేతల నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందన్న దానిపైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే,వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ మళ్లీ రేణుకా చౌదరిని రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బీజేపీ, సీపీఎం, న్యూడెమొక్రసీ బరిలో ఉన్నా.. ప్రభావంనామమాత్రమేనని, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి.-మేకల కల్యాణ్ చక్రవర్తి టీఆర్ఎస్: బలం,బలగంతో జోష్ తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే.. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో నాయకులు, ఎమ్మెల్యేలు, కేడర్‌తో పరిపుష్టంగా కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించిన గులాబీ దళానికి పెద్ద బలగమే కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాములు నాయక్, జెడ్పీ చైర్మన్ కవిత, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు అండగా ఉన్నారు. వీరంతా నామా నాగేశ్వరరావు విజయానికి కృషి చేస్తే సానుకూల ఫలితం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, నామా అభ్యర్థిత్వమే ఇక్కడ సమస్య అవుతుందా అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గ ప్రజలు గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీ నుంచి తీసుకువచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను బరిలోకి దించడం సామాన్య ప్రజలతో పాటు టీఆర్ఎస్ కేడర్‌కు కూడా రుచించడం లేదనే వాదన ఉంది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు.. పథకం ప్రకారమే నామా నాగేశ్వరరావును బరిలో దించారని, జిల్లాలోని పార్టీ నేతలంతా ఆయన విజయానికి కృషి చేస్తారని, నామా విజయం తథ్యమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో వైరి వర్గాలుగా తలపడిన రెండు గ్రూపులూ ఇప్పుడు తమ గూటికే రావడం కచ్చితంగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ‘పొంగులేటి’ కదలికలను బట్టి.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ రాజకీయాన్ని పరిశీలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించాలంటే మాత్రం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం పరిపూర్ణంగా ఉండాల్సిందేనని అర్థమవుతుంది. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పాలేరు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు సొంత కేడర్ ఉంది. ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో ఆయన పట్టు నిలుపుకునేందుకు మంచి ప్రయత్నమే చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా కేడర్‌కు అందుబాటులో ఉంటూ తనకంటూ ఎప్పుడు పిలిచినా పలికే కేడర్‌ను తయారు చేసుకున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ పట్టు సాధించారు. గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, సొంత ఖర్చుతో కొన్ని గ్రామాల సమస్యలు పరిష్కరించడం, ఏ కష్టమున్నా, కార్యక్రమమున్నా తానున్నాంటూ ఆర్థిక సాయం చేయడంతో ఎంపీగా పొంగులేటి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కారణమేదైనా టీఆర్ఎస్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో పొంగులేటి కేడర్ అంతా పూర్తిగా నైరాశ్యంలో ఉంది. తమ నాయకుడు పోటీ చేయడం లేదన్న నిస్తేజం నుంచి ఆయన అనుచరులు ఇంకా కోలుకోలేదు. పొంగులేటి కూడా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతోనే బహిర్గతమయ్యారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడా తన అనుచరులకు దిశానిర్దేశం చేయలేదు. అయితే, ఏప్రిల్ 4న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పొంగులేటికి ఇచ్చే ప్రాధాన్యం, హామీ గురించి ఆయన అనుచరగణం ఎదురుచూస్తోంది. ఆ సభ తర్వాతే పొంగులేటి అనుచరుల్లో పూర్తి స్థాయి కదలిక వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లో ఎవరి బలమెంత? ఖమ్మం: పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సానుకూలత కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ (టీఆర్ఎస్) గట్టి పట్టున్న నాయకుడు. ఆయనకు తోడు ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కేడర్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక వర్గం కూడా ఉన్నా కాంగ్రెస్ సంస్థాగతంగా పట్టు కోల్పోయింది. అయితే, ఇక్కడ నామా, రేణుకల్లో కమ్మ సామాజిక వర్గం ఎవరిని ఎంచుకుంటుంది..? మైనార్టీలు, మున్నూరు కాపులు ఎవరివైపు మొగ్గు చూపుతారనేవి అభ్యర్థుల జాతకాలను తారుమారు చేయనున్నాయి. పాలేరు: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిని గెలిపించాయి. ఇప్పుడు ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించగా, టీడీపీ కేడర్ కూడా నామాతో పాటు టీఆర్ఎస్ గూటికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తప్ప నేతలు లేని పరిస్థితి. అయితే, ఉపేందర్‌రెడ్డి పార్టీ మార్పుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్దే పైచేయి అయ్యే అవకాశాలు మెండుగాకనిపిస్తున్నాయి. మధిర: రెడ్డి, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం ఎటు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నందున కాంగ్రెస్‌కు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అయితే, టీఆర్ఎస్ కూడా బలంగానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపిన రెడ్డి సామాజికవర్గం ఈసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్పై గుర్రుగా ఉందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకకు కూడా ఇక్కడి ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. నామాకు ఇక్కడ మెజార్టీ రావాలంటే పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటేనే సాధ్యమవుతుంది. వైరా: ఈ నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు గత ఎన్నికల్లో సహకరించి పనిచేసింది కాంగ్రెస్ నేతలే. అయినా, మహాకూటమి తరఫున నిలబడ్డ సీపీఐ అభ్యర్థికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే, రాములు నాయక్, ఆయన ప్రత్యర్థి మదన్‌లాల్‌కు కలిపి లక్ష ఓట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయితే, మదన్‌లాల్ కంటే ఎక్కువ పొంగులేటి టీఆర్ఎస్ పక్షాన ఇక్కడ ప్రభావం చూపగలరు. కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సహకారం తప్పనిసరి. కొత్తగూడెం: ఇక్కడ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ అంటేనే వనమా.. వనమా అంటేనే కాంగ్రెస్ అనే పరిస్థితి. కానీ, ఆయన కూడా టీఆర్ఎస్లో చేరడంతో యడవెల్లి కృష్ణతో పాటు నలుగురైదుగురు నేతలు మాత్రమే పార్టీలో మిగిలారు. వనమా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఇక్కడ కూడా మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కలిసి పనిచేస్తే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ తప్పదు. అయితే, వనమాతో పాటు కొందరు నేతలే వెళ్లారని, కేడర్ తమతోనే ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. సత్తుపల్లి: ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ పక్షానే చేరారు. ఈయనతో డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఇక్కడ నామా విజయం కోసం పనిచేస్తే ఇక్కడా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే, పార్టీ మారిన సండ్రపై నియోజకవర్గ ప్రజల్లో కొంత అసహనం కనిపిస్తోంది. నామా కూడా ఎన్నికల ముందే పార్టీ మారి బరిలో నిలవడంతో ఇక్కడి ఓటర్లు కొంత ప్రతికూల అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అశ్వారావుపేట: ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విషయానికి వస్తే అటు పార్టీగా కన్నా ఎంపీ పొంగులేటి వర్గంగానే బలంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక నేతలు ఎక్కువ మంది పొంగులేటి అనుచరులే. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తాటి వెంకటేశ్వర్లు కూడా ఆయన వెంట ఉన్న నాయకుడే. తాటితో పాటు ఆలపాటి రాము ఇతర నేతలు సహకారం సంపూర్ణంగా లభించాల్సి ఉంటుంది. ఇక, ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ), పార్టీ కేడర్ కాంగ్రెస్‌కు ఇక్కడ బలాలుగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. 16 సార్లు.. 10 మంది ఎంపీలు ఖమ్మం లోక్‌సభకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే 10 మంది మాత్రమే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. అంటే ఇక్కడ వరుసగా గెలవడం పరిపాటి అయిపోయింది. కానీ, 1991 తర్వాత ఇక్కడి రాజకీయాల్లో మార్పు వచ్చింది. అప్పటివరకు పదిసార్లు ఎన్నికలు జరిగితే నలుగురే ఎంపీలుగా గెలుపొందారు. కానీ 91లో పి.వి.రంగయ్యనాయుడు గెలిచిన తర్వాత ఒక్కసారి తప్ప ప్రతిసారీ ఖమ్మం ఎంపీ మారుతూనే వచ్చారు. 91లో రంగయ్యనాయుడు, 96లో తమ్మినేని వీరభద్రం, 98లో నాదెండ్ల భాస్కరరావు, 99లో రేణుకా చౌదరి గెలిచారు. 2004లోనూ రేణుకాచౌదరి గెలవగా, 2009లో నామా నాగేశ్వరరావు, 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ పొంగులేటి బరిలో లేకపోవడంతో 2019 ఎన్నికల్లోనూ ఖమ్మం ఎంపీ మారబోతున్నారు. కాంగ్రెస్: కేడర్..లీడర్ కరువు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఓ వైపు నిలబడగా, ఖమ్మం జిల్లా ప్రజానీకం మాత్రం మరోవైపు నిలబడింది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థులు 8 మంది ఇక్కడ విజయం సాధించారు. ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, మరొకరు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని కొత్తగూడెం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ గెలిచింది. వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ శ్రేణుల పూర్తి సహకారంతో విజయం సాధించారు. అంటే ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఒక్క ఖమ్మం అసెంబ్లీ తప్ప మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లోక్‌సభ పరిధిలో పోలైన ఓట్ల ఆధారంగా కూడా కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ కంటే ఆధిక్యత ఉంది. ఈ పరిస్థితుల్లో ఖమ్మం లోక్‌సభ పరిధిలో తమ విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ, రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ రెబల్ లావుడ్యా రాములు నాయక్ (వైరా), కొత్తగూడెం, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ కీలకనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా పార్టీ వీడిపోవడంతో ఆ ప్రభావం కూడా రేణుక విజయావకాశాలపై పడనుంది. ప్రస్తుతం మధిర, అశ్వారావుపేటల్లో మాత్రమే కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు మిగిలారు. ఆ రెండు స్థానాలు తప్ప అన్నిచోట్లా ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ కకావికలమైంది. కనీసం ప్రచారానికి, పోలింగ్ వ్యవస్థ నిర్వహణకు కేడర్ లేక కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో పోరాడి మరీ టికెట్ తెచ్చుకున్న రేణుకాచౌదరి గెలుపు కోసం కష్టపడుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న కొంతమంది నేతలు, కేడర్‌ను ఉత్తేజితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ ప్రచారం నియోజకవర్గ స్థాయి సమావేశాల వరకు మాత్రమే వచ్చింది. ఏడాదికి మూడు నెలలే పని– రాజు, జ్యూస్ వ్యాపారి, అశ్వారావుపేట జ్యూస్ వ్యాపారం ఏడాది మొత్తానికి మూడు నెలలే ఉంటుంది. మిగిలిన 9 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. మాలాంటి సీజనల్ వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం మంచి విధానాలు రూపొందించాలి. అలాంటి వారికే మా ఓటు వేస్తాం. మాలాంటోళ్లకష్టాలు తీరిస్తే బాగుండు– పానుగంటి నర్సింహారావు, సత్తుపల్లి ఎర్రని అగ్గిలో కూడా పని చేయాల్సిందే.. ఎండా లేదు.. వానా లేదు.. పగలస్తమానం కష్టపడితేనే కడుపునిండేది. మా గురించి అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. పని ఉంటే తింటున్నాం.. లేకపోతే పస్తులుండాల్సిందే. గతంలో మా కమ్మర కులం ఎస్టీలో ఉండేది. ఇప్పుడు తీసేశారు. మళ్లీ ఎస్టీలో చేర్చితేనే మా బతుకులు బాగుపడతాయి. చిరువ్యాపారులకు ఆసరా కావాలి– జోజి, కొబ్బరి బోండాల వ్యాపారి, వైరా మాలాంటి చిరు వ్యాపారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. అధికార పార్టీకి దగ్గర ఉన్న వారికి, పలుకుబడి ఉన్న వారికే ప్రభుత్వ సాయం, రుణాలు అందుతున్నాయి. మాలాంటి వారిని పట్టించుకున్న వారే లేరు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. రుణాలు ఇచ్చి ఆదుకోవాలి– అక్కిరాజు శివకృష్ణ, పండ్ల వ్యాపారి, సత్తుపల్లి మా కుటుంబం అంతా పండ్లు, కొబ్బరి బోండాల వ్యాపారంపైనే ఆధారపడి బతుకుతున్నాం. 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నాం.. ఏం మిగలడం లేదు. అప్పు తీర్చడానికే సరిపోతుంది. మాలాంటోళ్లకు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తే కొంతలో కొంత కష్టం తీరుతుంది. పార్టీలు మారడం తప్ప ప్రజలకేం ఒరిగేది లేదు– ఖాజా, టీ వ్యాపారి నా టీకొట్టు దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలు రోజుకో పార్టీ కండువా కప్పుకొని వస్తున్నారు. ఇదేమిటంటే మా ఎమ్మెల్యే పార్టీ మారాడు.. మా ఎంపీ పార్టీ మారాడు.. మేమూ మారిపోయామంటున్నారు. ఒక ఎన్నికల్లో పోటాపోటీగా తిరిగిన వారు కలిసి తిరుగుతున్నారు. ప్రజలే అమాయకులు.. వీరి స్వార్థం కోసం ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. లోక్‌సభ ఓటర్లు పురుషులు 7,39,525 మహిళలు 7,73,503 ఇతరులు 66 మొత్తం ఓటర్లు 15,13,094 లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లుఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి,అశ్వారావుపేట, కొత్తగూడెం. -
నా ప్రచారాస్త్రం నేనే..
‘ఖమ్మం నా రాజకీయ ఎదుగుదలకు గుమ్మం. నాకు జన్మతః వచ్చిన ప్రశ్నించే తత్వాన్ని జిల్లా మహిళలు స్వాగతించారు. ఎవరైనా అక్రమంగా, అమానుషంగా ప్రవర్తిస్తే ఇదేమిటని ప్రశ్నించే చైతన్యాన్ని అలవరుచుకున్నారు మహిళలు. జిల్లాను అభివృద్ధి చేయాలన్న నా సంకల్పానికి ఖమ్మం ప్రజల సహకారం ఎల్లవేళలా ఉంటోంది. ఇక ముందు కూడా ఉండబోతుంది’.. అంటోన్న కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గారపాటి రేణుకాచౌదరి ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ఉక్కులాంటి ఉపాధి... బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పరిశ్రమలు స్థాపించడం, జిల్లాలో 80 శాతం పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడం, సమీకృత వ్యవసాయ విధానం తీసుకురావడం నా ముందున్న తక్షణ కర్తవ్యం. సమస్యలన్నీ ఎరుకే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి పల్లెతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. అక్కడి అవసరాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో 20 ఏళ్ల నుంచి చూçస్తూ్తనే ఉన్నా. అనేక సమస్యలను.. సామాజిక రుగ్మతలను రూపు మాపాను కూడా. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. సీజనల్‌గా వచ్చే వ్యాధులను అరికట్టడానికి కార్యాచరణ లేకుండా అభివృద్ధిని అంకెల్లో చూపెట్టడం వల్ల ఏం ప్రయోజనం? జిల్లాలో దోమల బెడద తగ్గనే లేదు. రేణుకా చౌదరి స్వస్థలం: విశాఖపట్నం భర్త పేరు: శ్రీధర్ చౌదరి సంతానం: ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులు: వసుంధరరావు, కె.ఎస్.రావు పుట్టిన తేది: ఆగస్టు 13, 1954 విద్యార్హతలు: పీజీ (ఇండస్ట్రియల్ సైకాలజీ) రాజకీయ ప్రస్థానం: 1986, 1992, 2012లలో రాజ్యసభ మెంబర్, 1999–2004, 2004 – 2009 లోక్‌సభ మెంబర్ మంత్రి పదవులు: 1997– 98లో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, 2004 – 2006కేంద్ర పర్యాటక శాఖ, 2006– 2009మహిళ, శిశు అభివృద్ధిశాఖ. నా ప్రచారాస్త్రం నేనే.. ఖమ్మం ఎంపీగా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి, కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు శ్రమించాను. కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వ గ్రాంటుతో ఏర్పాటు చేసిన ఇర్రేడియేషన్ ప్లాంట్ ఊసే లేకుండా పోయింది. రెండో కేంద్రీయ విద్యాలయం నా హయాంలో మంజూరైతే ఇప్పటికీ భవనాల నిర్మాణం పూర్తి కాలేదింకా. నా ప్రచారానికి ప్రధాన అస్త్రాన్ని నేనే. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించడమే ప్రస్తుతం నా లక్ష్యాలు. నా పోరాటం వ్యక్తులతో ఉండదు. అవినీతి, అరాచకత్వం, ప్రజలకు జరగాల్సిన అభివృద్ధిపై మాత్రమే ఉంటుంది. నేను చేసిన పనులు, ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను గెలిపిస్తాయి. గృహహింస నిరోధక చట్టం మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అత్యున్నత స్థితికి చేరాలి. గృహహింస నిరోధక చట్టంతో మహిళలకు చట్టపరమైన రక్షణ లభించింది. ఆ చట్టానికి రూపకల్పన జరిగింది నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు ఒక మహిళగా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.– మాటేటి వేణు, సాక్షి–ఖమ్మం ప్రతినిధి -
రేణుక ప్రాబల్యం తగ్గుతోందా?
సాక్షి, మధిర: దశాబ్దకాలానికిపైగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కీలకంగా పనిచేశారు. ఒక రకంగా శాసించారు. ఏకచత్రాధిపత్యంగా పట్టుసాధించిన ఆమె ప్రాబల్యం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నానాటికీ తగ్గిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ సభ్యురాలిగా 1999, 2004 ఎన్నికల్లో గెలుపొంది కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేసి కాంగ్రెస్‌లో తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఆమె చెప్పిందే వేదంగా నడిచింది. కోట్లాదిరూపాయల నిధులు జిల్లా అభివృద్ధికి మంజూరు చేయించారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఆమె ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా.. ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆమెకు ఉన్న పలుకుబడితో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవీకాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్‌లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. భట్టి సహకారంతోనే ఐతం సత్యం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడయ్యారు. భట్టి అనుచరుడిగా ఉన్న సత్యంను పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు ఆమె అప్పట్లో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐతం సత్యం మృతి చెందిన తర్వాత ఆ పదవిని నేటికీ భర్తీ చేయలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమె వర్గీయులకు టికెట్లు దక్కలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో రేణుకా అనుచరుడిగా ఉన్న ఎడవల్లి కృష్ణకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖమ్మం సీటుకోసం ఆమె అనుచరులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పాలేరు సీటుకోసం రాయల నాగేశ్వరరావు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఖమ్మం సీటు టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు.. పాలేరు సీటు కందాల ఉపేందర్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆమె పట్టుకోల్పోతున్నారని రాజకీయపార్టీలు చర్చించుకుంటున్నాయి. అంతేకాంకుండా రేణుకా వర్గీయులుగా మధిర మండలంలో గెలుపొందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ సభ్యుడితోపాటు కొంతమంది అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. వైరా నియోజకవర్గంలో రేణుకాచౌదరి వర్గీయులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరంపల్లి రామారావు, కారేపల్లి మాజీ ఎంపీపీ పగడాల మంజుల తదితరులు పార్టీకి రాజీనామా చేసి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లావుడ్యా రాములు నాయక్‌కు మద్దతు ఇచ్చారు. దీనికితోడు మల్లు భట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ స్థానంనుంచి మూడుసార్లు గెలుపొందడం.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టం.. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆయనకు అధిష్టానం దగ్గర పరపతి పెరిగినట్లు క్షేత్రస్థాయి కేడర్‌లో చర్చజరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా రేణుకా చౌదరికి మాట్లాడే అవకాశం కూడా రాకపోవడంపై ఆమె వర్గీయులు ఆవేదనకు గురయ్యారు. అదేవిధంగా ఈ సారి కాంగ్రెస్ తరఫున భట్టికి సీఎల్పీ లీడర్ కానీ, మరేదైనా ప్రాధాన్యత కలిగిన పార్టీ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో భట్టి పట్టు సాధిస్తుండగా.. రేణుకాచౌదరి ప్రాధాన్యత తగ్గిపోతుందని వివిధ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. -
అవసరమైతే సీనియర్ నాయకులు త్యాగాలు చేస్తారు
-
ముందస్తు ఎన్నికలుకు మేము ముందే సిద్ధం
-
ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏడాది క్రితమే చెప్పా!
సాక్షి, ఖమ్మం : ముందుస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమాయత్తమై ఉందని, ఈ యుద్ధానికి తాము సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో రోజుకోక వ్యవహారం వెలుగుచూస్తోందని అసమ్మతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం నడిపే అనుభవం తమకు ఉందన్నారు. సంవత్సరం ముందే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను ఆన్ రికార్డు చెప్పానని ఆమె పేర్కొన్నారు. పొత్తులపై స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుతున్నామని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, ప్రజలకు మేలు చేయడం లక్ష్యంగా పొత్తులు ఉంటాయని అన్నారు. టీడీపీ- కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారంపై ప్రస్తావించగా ఆ ప్రచారం నిజమయ్యేవరకు తాను కామెంట్ చేయనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం, ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం తదితర విషయాల్లో పార్టీ అధినాయకత్వం నిర్ణయం, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. -
వైరా టికెట్ ఇప్పిస్తానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి టికెట్ ఇప్పిస్తానని చెప్పి పలువుర్ని మోసం చేశారని కాంగ్రెస్ నేత రవిచంద్ర చౌహాన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్ మీకేనంటూ.. ఆమె చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా 2014లో డాక్టర్ రాంజీ నాయక్ దగ్గర కోటి 30లక్షల రూపాయలు తీసుకున్నారని, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కేసులు పెట్టించారని అన్నారు. వైరా టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి.. రేణుకా చౌదరి వైరా టికెట్ ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద కోటి 30లక్షలు రూపాయలు తీసుకున్నారని రాంజీ నాయక్ భార్య కళావతి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రేణుకా చౌదరిని డబ్బులు అడుగుతున్నాపట్టించుకోవటం లేదని వాపోయారు. ఈ నెల 14వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని అన్నారు. అలా కుదరకపోతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. -
వీళ్లు ఆయనకు వారసులా?..ఖర్మ!
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ల వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. విచిత్రమైన వ్యాఖ్యలతో బీజేపీ ముఖ్యమంత్రులిద్దరూ వార్తల్లో నిలిచింది తెలిసిందే. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వీరి వ్యాఖ్యలపై మండిపడుతోంది. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వీళ్ల వ్యవహారంపై స్పందించారు. ‘ఒకయాన(విజయ్ రూపానీ) గూగుల్‌ను-నారదుడ్ని పోలుస్తూ మాట్లాడతారు. ఆయన జ్ఞానం ఇంతేనేమో. ఇంకోకరేమో(విప్లవ్) మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందంటాడు. ఆయన అక్కడితోనే ఆగలేదు. యువకులను ఉద్దేశించి ‘ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకండి’ అంటాడు. మరోసారి అందాల పోటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు. వాళ్లిద్దరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మోదీగారి వారసులు ఇలా ఉన్నారు. వీళ్లేం ముఖ్యమంత్రులు. వీళ్లా ప్రజల్ని పాలించేంది?. జనాలకు వీళ్లసలు ఏం చెప్పదల్చుకున్నారు. ఇది ఇంతటితోనే ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు’ అని రేణుకా చౌదరి తెలిపారు. సోమవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విప్లవ్ కుమార్ దేవ్‌కు అధిష్టానం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిందన్నది తెలిసిందే. అయితే ఆ వార్తలను విప్లవ్ తోసిపుచ్చారు. ‘మోదీ నన్ను కొడుకులా భావిస్తారు. ఆయన నాపై ఆగ్రహంగా ఉన్నారన్నది నిజం కాదు. చాలా కాలం క్రితమే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నా. అది ఇప్పుడు కుదరటంతో వెళ్లి కలవబోతున్నా’ విప్లవ్ వివరణ ఇచ్చుకున్నారు.