
రేణుకాచౌదరి(ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై ఖ మ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. గిరి జన మహిళను కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదుతోపాటు, తన భర్తను రేణుకా చౌదరి మోసం చేశారని గిరిజన మహిళ, డాక్టర్ రాం జీనాయక్ భార్య కళావతి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై రాంజీనాయక్ సతీమణి కళావతి హైకోర్టును ఆశ్రయించారు.
ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ఈ అంశంపై కేసు నమో దు చేయాలని ఖమ్మం అర్బన్ పోలీసులను ఆదేశించింది. రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న కేసు నమోదైంది. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచ డం చర్చనీయాంశంగా మారింది. కాగా, రేణుకా చౌదరిపై 420, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
ఖమ్మంకు చెందిన డాక్టర్ భూక్యా రాంజీకు 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ టిక్కెట్‌ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. టిక్కెట్ రాకపోగా కోటి రూపాయలు ఖర్చు కావడంతో మానసికంగా కుంగిపోరుు మనోవేదనతో తన భర్త మృతి చెందాడని పేర్కొన్నారు. టికెట్ కోసం రాంజీ రేణుకా చౌదరికి, ఆవిడ అనుచరులకు ఎప్పుడు, ఎక్కడ ఎంత మొత్తంలో నగదు చెల్లించింది ఫిర్యాదులో వివరించారు.
2013 మే 30న ఇల్లెందు రోడ్డు లో ఉన్న ఎన్నెస్పీ విశ్రాంతి భవనంలో రూ . 10 లక్షలు, ఖమ్మంలోని ఆఫీసర్స్ విశ్రాంతి భ వనంలో 2013 డిసెంబర్1న రూ. 60 లక్షలు రేణుకాచౌదరికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదే రోజు రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డిలకు రూ. 15 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
2014 మార్చి30 హైదరాబాద్‌లో రేణుకాచౌదరి ఇంటి వద్ద రూ. 50 లక్ష లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తమను కులం పేరుతో దూషిం చారని పేర్కొన్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణు కాచౌదరితో పాటు రామారావు, పుల్లయ్య, సైదులు, రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.