ఖమ్మం: తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్ రాంజీ నాయక్ భార్య కళావతి డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ టిక్కెట్‌ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని ఆమె తెలిపారు.
తమ డబ్బులు తిరిగివ్వాలంటూ బుధవారం రేణుకా చౌదరి అనుచరుల మీడియా సమావేశాన్ని ఆమె అడ్డుకున్నారు. రేణుక అనుచరుడు సైదులు నాయక్ పై చెప్పుతో దాడి చేశారు. రేణుకా చౌదరి, ఆమె అనుచరులు కలిసి తమను మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించారని కళావతి ఆరోపించారు.
తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే తన పిల్లలతో కలిసి రేణుకాచౌదరి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది. అవసరమైతే సోనియా గాంధీని కలిసి తనకు జరిగిన అన్యాయం వివరిస్తానని తెలిపింది. కళావతి ఫిర్యాదు మేరకు రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
రేణుకా చౌదరి అనుచరుడికి చెప్పు దెబ్బ
Published Wed, Mar 25 2015 4:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM
Advertisement
Advertisement