శరద్‌పవార్‌కు రేణుక విందు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగానికి హాజరైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కొద్దిసేపు ఆగారు. కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి ఇచ్చిన విందుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్బంగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పవార్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి గీతారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎంకే ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, దానం నాగేందర్ తదితరులున్నారు.