ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిట్టనిలువున చీలిపోయిన శరద్ పవార్ కుటుంబం మళ్లీ కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్)పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తాజాగా ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవిస్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రౌత్ అన్నారు. ఈ విషయమై రౌత్ శుక్రవారం(జనవరి3) మీడియాతో మాట్లాడారు.’గతంలో మేం ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం. మా సంబంధాలు కొనసాగుతాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి విషయంలో ఫడ్నవీస్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి’అని రౌత్ ప్రశంసించారు. ఇటీవల కోట్ల రూపాయల రివార్డులన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవిస్ ముందే లొంగిపోయిన విషయం తెలిసిందే.
కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్)ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌పవార్)పార్టీలతో కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టగా ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్) పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం.
ఇదీ చదవండి: చొరబాటుదారులకు బీఎస్‌ఎఫ్ దన్ను
Comments
Please login to add a commentAdd a comment