Sanjay Raut
-
మోదీ రిటైర్మెంట్.. మాకు ఆ అవసరమే లేదు!
ముంబై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని(RSS Headquarters) సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంతో.. మోదీ రాజకీయ నిష్క్రమణపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్ మోదీని తప్పించి వారసుడ్ని ఎంపిక చేసే పనిలో ఉందని.. అందుకే ఆయన నాగ్‌పూర్‌కి రావాల్సి వచ్చిందని శివసేన(థాక్రే) నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ‘తండ్రి’ వ్యాఖ్యలతో గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ ఏడాదిలో మోదీ రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారని.. ఆ విషయాన్ని తెలియజేసేందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారంటూ ముంబైలో మీడియా ప్రతినిధుల సమావేశంలో రౌత్ అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ దరఖాస్తును సమర్పించేందుకే ఆయన ఆరెస్సెస్ నాగ్‌పూర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. గత 10 ఏళ్లలో ఆయన ఏనాడూ అక్కడికి వెళ్లలేదు. కేవలం ఆరెస్సెస్ చీఫ్‌కు వీడ్కోలు చెప్పేందుకే ఇప్పుడు వెళ్లారు అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ సమయం ముగిసిపోయింది. ఈ సెప్టెంబర్‌తో ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఆ వయసు, దానిని మించినవాళ్లు పదవుల్లో కొనసాగవద్దని ఆ పార్టీ(BJP)లో అప్రకటిత నిబంధన ఉంది. దేశ నాయకత్వాన్ని మార్చాలని సంఘ్ పరివార్ బలంగా అనుకుంటోందని, బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ త్వరలో మార్పులు ఉండబోతున్నాయని అన్నారాయన. ఇదిలా ఉంటే.. 2000 సంవత్సరంలో ప్రధాని హోదాలో అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal bihari Vajpayee) సందర్శించగా.. మళ్లీ ఇప్పుడు మోదీ ఆరెస్సెస్ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి చేశారు. అయితే మోదీ వారసుడిని ఆరెస్సెస్ ఈ సెప్టెంబర్‌లో ఎంపిక చేయబోతుందన్న రౌత్ వ్యాఖ్యలకు బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తండ్రి ఉండగా వారసుడు అనేవాడి అవసరమే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ నాయకత్వాన్ని మార్చడమా?. మాకు ఆ అవసరమే లేదు. మోదీకి వారసుడిని వెతకాల్సిన అవసరమూ లేదు. మోదీజీనే మా నేత. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం. 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశ ప్రధానిగా కొనసాగుతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని చర్చించడం కూడా తగదు. బీజేపీలో వయసు దాటితే రిటైర్మెంట్లాంటి నిబంధనేదీ బీజేపీలో లేదన్న ఫడ్నవిస్.. 80 ఏళ్ల వయసులో మంతత్రి పదవి చేపట్టిన బీహార్ నేత జితన్ రామ్ మాంజీ పేరును ప్రస్తావించారు. ఈ టర్మ్‌లోనే కాదు.. వచ్చే టర్మ్‌లోనూ ఆయన మా నాయకుడు. మోదీ రాజకీయాలను వీడతారని వ్యాఖ్యానించేవాళ్లది మొఘలుల ఆలోచన ధోరణిగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మన సంప్రదాయంలో తండడ్రి బతికి ఉండగా.. వారసత్వం అనే ప్రస్తావనే ఉండదు. ఇలాంటివి మొఘలుల సంప్రదాయంలోనే ఎక్కువగా ఉంటాయి. వన్ షాట్.. టూ బర్డ్స్‌లాగా ఔరంగజేబ్ సమాధి వివాదం నడుస్తున్న వేళ.. ఫడ్నవిస్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కిందటి ఏడాది స్వార్వత్రిక ఎన్నికల టైంలో మోదీ రాజకీయ రిటైర్మెంట్ గురించి చర్చ నడిచింది. ఆ టైంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోదీ స్థానంలో అమిత్ షా ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. -
శివసేన యువ నేతను వెంటాడుతున్న ‘దిశ’ కేసు
శివసేన (యూబీటీ) యువ నాయకుడు ఆదిత్య ఠాక్రేకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ కోర్టుకెక్కారు. తన కూతురు మరణం కేసులో ఠాక్రేను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించి, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరినట్టు పీటీఐ వెల్లడించింది.అసలేం జరిగింది? 2020, జూన్ 9న దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయింది. ముంబైలోని మలద్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోవడానికి ముందు ప్రియుడు రోహన్, మరికొంత మందితో కలిసి ఆమె పార్టీలో పాల్గొంది. ఈ నేపథ్యంలో దిశపై లైంగిక దాడి చేసి చంపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు మరణించిందని కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి.‘ఆమె మరణం వెనుక వారి హస్తం’దిశ మరణించి వారం రోజులు కూడా గడవకముందే, అంటే 2020, జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వీరిద్దరి మరణాలకు ఏదైనా లింకు ఉందేమోనని అప్పట్లో అనుమానాలు రేగాయి. అయితే దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని అప్పటి బీజేపీ ఎంపీ నారాయన్ రాణె ఆరోపించడంతో సంచలనం రేగింది. ఆమె మరణం వెనుక రాజకీయ నేతలు, బాలీవుడ్‌కు చెందిన వాళ్ల హస్తం ఉందని ఆరోపించారు. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని సుశాంత్‌తో దిశ చెప్పిందని.. దీంతో అతడిని వాళ్లు వేధించడం మొదలుపెట్టారని, అందుకే సుశాంత్ ప్రాణాలు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.మరోసారి తెరపైకి ఠాక్రే పేరు ఇదే అంశాన్ని ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే 2022, డిసెంబర్లో లోక్‌సభలో లేవనెత్తారు. సుశాంత్ మృతి కేసులో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనపై ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పట్లో ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) కొట్టిపారేశారు. ఠాక్రేపై కేసు నమోదు చేసి విచారించాలని దిశ తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించడంపై తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.చదవండి: జట్కా మటన్ అంటే ఏంటి.. ఎక్కడ దొరుకుతోంది?అత్యాచారం చేసి హత్య చేశారుదిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని, దీని వెనుకున్న కొంత మంది రాజకీయ ప్రముఖులను కాపాడటానికి కుట్రపూరితంగా కేసును తప్పుదోవ పట్టించారని దిశ తండ్రి తాజాగా రోపించారు. ముంబై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశామని మొదట్లో తాము నమ్మామని, కానీ కేసును కప్పిపుచ్చారని అనుమానాలు కలుతున్నాయన్నారు. "ముంబై పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు, సందర్భోచిత రుజువులు, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు మరణం కేసుగా తేల్చి హడావిడిగా ముగించారు" అని తన పిటిషన్లో పేర్కొన్నారు.‘తెర వెనుక రాజకీయ కుట్ర’దాదాపు ఐదేళ్ల తర్వాత దిశా సాలియన్ కేసులో మళ్లీ ఆదిత్య ఠాక్రే పేరును తెరపైకి తేవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) పేర్కొన్నారు. ఠాక్రే కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి నిరంతరాయంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడిపై ఈ విధంగా కుట్రలు చేయడం మహారాష్ట్ర సంస్కృతి కాదన్నారు. ఇలాంటి ఆరోపణలు తమ లాంటి నాయకులపై చాలానే చేశారు కానీ అవేవీ నిరూపితం కాలేదని గుర్తు చేశారు. ఔరంగజేబు వివాదం నుంచి ప్రజల చూపును మళ్లించేందుకు ఐదేళ్ల తర్వాత ఈ కేసును మళ్లీ ఇప్పుడు తెరపైకి తెచ్చారని రౌత్ ఆరోపించారు. శివసేన (యూబీటీ) పార్టీ ప్రతినిధి కిషోరి పెడ్నేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
‘ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఒకానొక సమయంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందకు మొగ్గు చూపారన్నారు శివసేన(యూబీటీ) నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు సంజయ్ రౌత్. ఆ విషయం తనతో పాటు కాంగ్రెస్‌లో కొంతమంది నేతలకు సైతం తెలుసంటూ ఎంపీ సంజయ్ రౌత్ నొక్కి మరీ చెప్పారు.ఈ క్రమంలోనే దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తో ఏక్నాథ్ షిండే బేరసారాలు జరపారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి అహ్మద్ పటేల్ మన మధ్య లేరని, ఇంకో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కు ఈ విషయం తెలుసన్నారు. దీనిపై ఇంతకు మించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.అయితే సంజయ్ రౌత్ కామెంట్లపై పృథ్వీరాజ్ చౌహాన్ ను మీడియా సంప్రదించగా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. మరొకవైపు ఏక్నాథ్ షిండే కూడా అందుబాటులో లేరు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఏక్ నాథ్ షిండ్, పృథ్వీరాజ్ చౌహాన్ లు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.2౦22లో శివసేన(యూబీటీ) నుంచి ఏక్నాథ్ షిండే దూరం కావడంతో పాటు ప్రత్యేక వర్గంతో మహాయుతి కూటమిలో జాయిన్ అయ్యారు. దాంతో శివసేన రెండు ముక్కలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. ఆపై 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో పాటు అందులో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు.కొన్ని రోజుల క్రితం ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేల మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఏక్నాథ్ షిండే మీడియా ముఖంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు. తన బలమేమిటో కొంతమంది తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తన చరిత్ర ఏమిటో గతాన్ని అడిగితే చెబుతుందంటూ కూటా శివసేనను ముక్కలు చేసిన చరిత్రను చెప్పుకొచ్చారు. ఇదే వార్నింగ్ మహారాష్ట్ర బీజేపీకి కూడా పరోక్షంగా ఇస్తున్నారా? అని ఏక్నాథ్ షిండే వ్యాఖ్యల ద్వారా అనుమానం కల్గింది. -
‘నాటి వారి పాలన కంటే మీ పాలనే అధ్వానంగా ఉంది’
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుత పాలన అధ్వానంగా ఉందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. ఔరంగజేబు పరిపాలన ఆనాటి పాలన కంటే నేటి రాష్ట్రంలోని బీజేపీ పాలనే అధ్వానమన్నారు. కేవలం బీజేపీ వల్లే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నాయని సంజయ్ రౌత్ విమర్శించారు. ఒక్క రైతులే కాదని, నిరుద్యోగులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పుడుతన్నారన్నారు. ఔరంగజేబు ఇక్కడ 400 ఏళ్ల చరిత్ర ఉంది. మనం దాదాపు ఆయన్ని మరిచిపోయాం. మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు అప్పటి ఔరంగజేబు కారణమా?, మీ వల్లే(బీజేపీ) రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహాయుతి కూటమి వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆనాటి మొఘల్ చక్రవర్తి దౌర్జన్యాలు చేస్తే, మరి నేటి ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. -
స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్‌పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు సరికాదు ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్‌ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు. ఎవరికీ మంచిది కాదు: ఎన్సీపీ(శరద్) శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు. మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. -
‘మహా’ పాలిటిక్స్‌లో ట్విస్ట్..!ఫడ్నవీస్‌పై రౌత్ ప్రశంసలు
ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిట్టనిలువున చీలిపోయిన శరద్ పవార్ కుటుంబం మళ్లీ కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్)పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తాజాగా ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవిస్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రౌత్ అన్నారు. ఈ విషయమై రౌత్ శుక్రవారం(జనవరి3) మీడియాతో మాట్లాడారు.’గతంలో మేం ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం. మా సంబంధాలు కొనసాగుతాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి విషయంలో ఫడ్నవీస్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి’అని రౌత్ ప్రశంసించారు. ఇటీవల కోట్ల రూపాయల రివార్డులన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవిస్ ముందే లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్)ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌పవార్)పార్టీలతో కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టగా ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్) పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం. ఇదీ చదవండి: చొరబాటుదారులకు బీఎస్ఎఫ్ దన్ను -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. ‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. -
మరోసారి తెరపైకి EVM ట్యాంపరింగ్..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
-
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన(ఉద్ధవ్) అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనుక పెద్ద కుట్ర ఉందని తేల్చిచెప్పారు.#WATCH | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "They have done some 'gadbad', they have stolen some of our seats...This cannot be the public's decision. even the public does not agree with these results. Once the results are… pic.twitter.com/Qxx6a0mKsW— ANI (@ANI) November 23, 2024 బిలియనీర్ గౌతమ్ అదానీ సాయంతో ఆ కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి ‘లాడ్లీ భాయ్’గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి ఆఖండమైన మెజార్టీ కట్టబెట్టారంటే తాము విశ్వసించడం లేదని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3— ANI (@ANI) November 23, 2024 -
అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది. -
మోదీ పర్యటనలు.. మహారాష్ట్రకు సురక్షితం కాదు: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ఫడ్నవీస్‌పై ఇజ్రాయెల్ దాడికి ప్లాన్ చేస్తోందా?.. సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నీవీస్‌కు భద్రత పెంచడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఫడ్నవీస్ మీద ఇప్పుడేమైనా ఇజ్రాయెల్ లేదా లెబనాన్ దాడికి దిగుతున్నాయా? అని ప్రశ్నించారు.మహారాష్ట్రలో ఎన్నికల వేళ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు అదనపు భద్రత పెంచుతున్నారనే సమాచారం వచ్చింది. ఫడ్నవీస్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. ఆయన కోసం అదనపు ఫోర్స్ వన్ కమాండోలను నాగపూర్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ భద్రతపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు.ఈ సందర్బంగా రౌత్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు ఆకస్మికంగా భద్రతను పెంచడానికి కారణం ఏంటి?. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. తన కోసం భద్రతను పెంచుకోవడం ఏంటి?. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?. ఫడ్నవీస్ నివాసం వెలుపల ఫోర్స్ కమాండోలు నిలబడి ఉన్నారు. నాగపూర్ మరో 200 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు అంత భయపడుతున్నారు. ఆయనపై దాడి జరగబోతోందా..? అలా ఎవరు చేయాలనుకుంటున్నారు..? ఇజ్రాయెల్ లేదా లెబనాన్ ఏమైనా ఆయనపై దాడికి దిగుతున్నాయా..? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో భద్రతను పెంచడంపై ఫడ్నవీస్, డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దవ్థ్రాకే శివసేన వర్గం పట్టుదలతో ప్రచారంలో బిజీ ఉంది. #WATCH | Mumbai: Shiv Sena (UBT) Sanjay Raut says "The Home Minister of this state, who is a former Chief Minister (Devendra Fadnavis), has suddenly increased his security. The Home Minister gives security to others but he increased his own security. Suddenly we saw Force One… pic.twitter.com/yvDaJwNBIp— ANI (@ANI) November 3, 2024 -
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
దాడుల కోసం.. అమిత్ షా సుపారీ తీసుకున్నారు: సంజయ్ రౌత్
ముంబై: ఇతర పార్టీ చీఫ్‌ల కాన్వాయ్‌లే లక్ష్యంగా బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీల కార్యకర్తలు దాడులు చేయటాన్ని ఇలాగే కొనసాగిస్తే.. తాము కూడా భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటామని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. థానేలో శనివారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాన్వాపై ఎంఎన్ఎస్ కార్యాకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం సంజయ్ రౌత్ మాట్లాడారు. అహ్మద్ షా అబ్దాలీ (హోంశాఖ మంత్రి అమిత్ షాను పరోక్షంగా ఉద్దేశిస్తూ..)కు మహారాష్ట్రంలో దాడుల ద్వారా అరాచకం వ్యాప్తి చేయాలని ఢిల్లీలో ఉండే కేంద్ర పాలకులు సుపారీ ఇచ్చారని మండిపడ్డారు. ‘ఉద్దవ్ ఠాక్రే కాన్వాయ్‌పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఇలాంటి చేయాలనే వాళ్లు ఉన్నారు. అమిత్ షా ఇలాంటి దాడులు చేయించడానికి ఢిల్లీ నుంచి సుపారీ అందుకున్నారు. ఎన్ఎన్ఎస్ కార్యకర్తలను ఇటువంటి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ సదరు నేతలు మాత్రం ఢిల్లీ నుంచి సుపారీ తీసుకొని సైలెంట్‌గా ఉంటున్నారు. ఇలా దాడులకు తెగపడటం మహారాష్ట్రకు మంచిది కాదు. నేను ఏ పార్టీ పేరును ప్రస్తావించటం లేదు. కానీ, కొన్ని పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పటి నుంచే కుట్రలు పన్నుతున్నారు’ అని మండిపడ్డారు. -
చంద్రబాబు ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కులేదు..
-
చంద్రబాబుకు అధికారంలో ఉండే హక్కు లేదు: సంజయ్ రౌత్
ఢిల్లీ: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీ పరిస్థితులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు. .. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూసిన తర్వాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్ జగన్‌కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి..శివసేన(యూబీటీ) ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జరిగిన దాడలకు సంబంధించి.. ఫొటో గ్యాలరీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను శివసేన లోక్‌సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో జగన్ గురించి మాట్లాడుకుంటాము. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు. నేను ఈరోజు ఇక్కడ కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు నీవు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెల్చిన తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు.ఏపీలో సీఎం కుమారుడు ఏకంగా రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు. ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నీవు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్నైనా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైఎస్ జగన్, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. .. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొండి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండగా నిలుస్తా. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం’ అని అన్నారు. -
చంద్రబాబు పై సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్
-
టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..
-
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
చంద్రబాబు, నితీశ్‌కు అందరూ స్నేహితులే: సంజయ్‌రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్‌కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్‌రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. -
గడ్కరీని ఓడించేందుకే వారు పనిచేశారు : రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్‌పై శివసేన(ఉద్ధవ్) కీలక నేత, ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్‌లు పనిచేశారని రౌత్ ఆరోపించారు.‘మోదీ, షా, ఫడ్నవిస్‌లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్ ఆలస్యంగా నాగ్‌పూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్ఎస్ఎస్ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్ కథనం రాశారు. మరోపక్క అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్ తన కథనంలో పేర్కొన్నారు. కాగా, రౌత్ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఫైర్ అయ్యారు. నిజానికి రౌత్ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్సీపీ(శరద్‌పవార్) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌత్‌కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్ విసిరారు. -
‘‘కిచిడీ స్కామ్ ప్రధాన సూత్రధారి సంజయ్ రౌత్’’
ముంబై: కొవిడ్ సమయంలో ముంబైలో జరిగిన కిచిడీ కుంభకోణం అసలు సూత్రధారి శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ అని కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ సీటు నుంచి శివసేన(ఉద్ధవ్) పార్టీ తరపున పోటీ చేస్తున్న అమోల్ కీర్తికార్‌కు కిచిడీ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిరుపమ్ ఈ ఆరోపణలు చేశారు. ‘నేను ఈ కుంభకోణం మీద అధ్యయనం చేశాను. సంజయ్ రౌతే ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారి అని నాకు అప్పుడు తెలిసింది. కొవిడ్ సమయంలో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నుంచి రూ.7లక్షల కాంట్రాక్టులను కూతురు, భాగస్వాముల పేర్ల మీద సంజయ్ రౌత్ తీసుకున్నారు’అని నిరుపమ్ తెలిపారు. కాగా, కొవిడ్ సమయంలో ముంబై మునిసిపాలిటీ పరిధిలో పేదలకు ప్రభుత్వం తరపున ఉచితంగా కిచిడీ అందించింది. ఈ కిచిడీ సప్లై కాంట్రాక్టులను రాజకీయ నాయకులే తీసుకుని తక్కువ కిచిడి సరఫరా చేసి ఎక్కువ బిల్లులు పొందారని ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
కేజ్రీవాల్ ఇప్పుడు మరింత ప్రమాదకరం: ఎంపీ రౌత్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే భయం, అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అయితే అరెస్ట్ తరువాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారని రౌత్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా వచ్చే ఆదివారం (మార్చి 31) ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా ఆప్ బ్లాక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ర్యాలీలో ఇతర నేతలతో కలిసి నేను కూడా పాల్గొంటానని రౌత్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచి పనిచేయడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రజలు కూడా ఆయన మాట వింటారు, మద్దతుగా నిలబడతారని రౌత్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలంగా బయటపడ్డారు పేర్కొన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ప్రధాని దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని పలువురు మండిపడ్డారు. మార్చి 31న అన్ని భారత మిత్రపక్షాల నేతలు ఏకతాటిపై నిలబడి ర్యాలీ చేయనున్నారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "The INDIA alliance is organising a protest rally at Ramlila Maidan, Delhi. We all will attend that rally... PM Modi is afraid of Arvind Kejriwal. Now, Arvind Kejriwal is more dangerous, as he will now work from jail. So, the… pic.twitter.com/6ZhWrjeu7g — ANI (@ANI) March 25, 2024 -
‘ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరణ’.. శివసేన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు. ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారింది. టీఎన్ శేషన్ (మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరించారు’ అన్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్సీపీ అనుభవించాయి. ఎన్సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎన్నికల కమిషన్ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు. ఎన్సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత్ పవార్ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది. -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్‌కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. "రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు. రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు -
రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి!: రౌత్
ముంబై: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయమయం చేస్తోందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహా్వనంపై రౌత్ స్పందించారు. ‘‘ శ్రీరాముని పేరును బీజేపీ తన రాజకీయాలకు విపరీతంగా వాడేసుకుంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్నీ బీజేపీ ఎంతో రాజకీయ చేసింది. తమ ఎన్నికల అభ్యర్థి శ్రీరామచంద్రుడే అని బీజేపీ ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. జనవరి 22న జరిగేది బీజేపీ కార్యక్రమం. ఆ రోజు జరిగేది ఎలా చూసినా జాతీయ కార్యక్రమం కాబోదు. రాజకీయాలతో బీజేపీ రాముడిని కిడ్నాప్ చేసింది’’ అని వ్యాఖ్యానించారు. మరి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆ కార్యక్రమానికి వెళ్తారుగా అని మీడియా ప్రశ్నించగా ‘‘అవును. కానీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తతంగం అంతా ముగిశాక అసలు కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొంటారు’’ అని బదులిచ్చారు. -
ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు
ముంబై: శివసేన(ఉద్ధవ్)నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌పై మహారాష్ట్రలోని యావత్మాల్ పోలిస్స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై పార్టీ పత్రిక సామ్నాలో అభ్యంతరకర ఆర్టికల్ రాశారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యావత్మాల్ బీజేపీ కన్వీనర్ నితిన్ భుటాడా ఫిర్యాదు మేరకు రౌత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం(డిసెంబర్11)న రౌత్ సామ్నాలో ప్రధానిపై అభ్యంతరకర ఆర్టికల్ రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ పత్రిక సామ్నాకు రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రౌత్‌పై రాజద్రోహం(ఐపీసీ 124ఏ)తో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రేపేందుకు ప్రయత్నించారని ఐపీసీ153(ఏ) సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదీచదవండి..యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్ -
కాంగ్రెస్ ఓటమికి కమల్‌నాథ్ కారణం.. సంజయ్ రౌత్
Madhya Pradesh Elections results: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. మిత్రపక్షాల పట్ల పాత పార్టీ తన వైఖరిని పునరాలోచించాలని కూడా ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్‌నాథ్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓటమికి కమల్‌నాథ్ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అఖిలేష్ పార్టీకి (సమాజ్‌వాదీ పార్టీ) కొన్ని ప్రాంతాలలో మంచి మద్దతు ఉందని, ఆ పార్టీకి కంచుకోటలుగా పేరుగాంచిన 10-12 స్థానాలు ఉన్నాయన్నారు. కానీ దీనిని కమల్‌నాథ్ వ్యతిరేకించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విలువైన గుణపాఠం చెబుతాయని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి సమిష్టిగా పాల్గొనాలని రౌత్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, మిత్రపక్షాల వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ “పనౌటీ” వ్యాఖ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందనే ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. “అలా అయితే, ఆ వ్యాఖ్య తెలంగాణలో ఎందుకు దెబ్బతీయలేదని ప్రశ్నించారు. కాగా డిసెంబరు 6న ఇండియా బ్లాక్ సమావేశానికి పిలుపునిచ్చామని, ఈ సమావేశంలో పలు విషయాలు చర్చిస్తామని రౌత్ తెలిపారు. -
పంజరంలో చిలుకలా ఈసీ: రౌత్
ముంబై: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘం కూడా పంజరంలో చిలుకలా మారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కలి్పస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. అదే హామీ విపక్షాలు ఇస్తే వెంటనే షోకాజ్ నోటీసులిచ్చేది’’ అంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో రౌత్ విమర్శించారు. మోదీ హయాంలో భారత క్రికెట్ పూర్తిగా ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలిపోయిందని ఆరోపించారు. ‘‘గతంలో దేశ క్రికెట్‌కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇప్పుడంతా అహ్మదాబాద్‌మయం! ప్రపంచ కప్ ఫైనల్ కూడా అక్కడే జరుగుతోంది! స్వీయ రాజకీయ లబ్ధి కోసం చివరికి క్రికెట్‌ను కూడా కూడా మోదీ సర్కారు పొలిటికల్ ఈవెంట్‌గా మార్చేసింది’’ అని ఎద్దేవా చేశారు. -
వరల్డ్‌కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు
World Cup final: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఫైనల్ మ్యాచ్ సంరంభంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫైనల్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ కంటే కూడా బీజేపీ ఈవెంట్‌లా సాగుతోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు. "క్రికెట్లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్‌లో అదే జరుగుతోంది" అని రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్ కచ్చితంగా కప్ గెలవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. -
చైనా మ్యాప్ విడుదల.. సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము మోదీకి ఉందా?
భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను (standard map) విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 చైనా ఎడిషన్ పేరుతో విడుదలైన ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చూపించడంతోపాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. ఆ దమ్ము ఉందా? అయితే చైనాకు పొరుగు దేశాలతో కలిసి జాతీయ సరిహద్దులను తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్ రాజకీయ దుమారానికి తెరలేపింది. తాజాగా చైనా మ్యాప్ వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనాపై సర్జికల్ స్టైక్ చేసే దమ్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ చెప్పింది నిజమే! ‘చైనాపై దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి. ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాలి. ఇటీవలె మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనా అధికారులను ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలు మా మనసులను గాయపరిచాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్‌లోకి చైనా ప్రవేశించిందటూ రాహుల్ గాంధీ ముందే చెప్పారు. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద మన భూభాగాన్ని చైనా కాజేసిందని రాహుల్ చెప్పింది నిజమే’ నని వ్యాఖ్యానించారు. చదవండి: మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్, అక్సాయిచిన్ మావే! ఎన్నికలొస్తున్నాయి.. అల్లరు జరుగుతాయి 'ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా ఆడుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. పుల్వామా దాడి కూడా కుట్రపూరితంగా జరిగిందని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తుల రైలుపై రాళ్లు రువ్వడం, బాంబులు విసరడం, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో ఉంది. హర్యానా అల్లర్లే ఉదాహరణ ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కోసమే. ప్రధాన రాజకీయ పార్టీల మనస్సులలోనూ ఈ ఆందోళన ఉంది. ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం మన బాధ్యత. అలా జరగని పక్షంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హర్యానాలో జరిగిన అల్లర్లే దీనికి ఉదాహరణ’ అని రౌత్ పేర్కొన్నారు. రాహుల్ ఏమన్నారంటే.. ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో కాంగ్రెస్ పర్యటించిన కాంగ్రెస్ నేత గాంధీ.. మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు. చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని రాహుల్ అన్నారు. -
వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఉద్దవ్ ఠాక్రే వార్గానికి చెందిన శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.ఈ మేరకు సంజయ్ రౌత్ సోమవారం మాట్లాడుతూ.. వారణాసి ప్రజలలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలసుకోగా లేనిది శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ఆదివారం శరద్, అజిత్ పవార్ సమావేశమయ్యారని మీడియా ద్వారా తెలిసింది. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించేందుకే అజిత్ పవార్‌ను.. శరద్ పవార్ కలిసి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై మహారాష్ట్ర ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన -
ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు . పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే. అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం.. -
మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఏకంగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి తాజాగా అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం మారనున్నారని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేకు పదవి గండం మొదలైందని, అజిత్ పవార్ త్వరలోనే మహారాష్ట్ర సీఎంగా బాద్యతలు చేపట్టనున్నారని చెప్పారు. దీంతో షిండే తన పదవిని కోల్పేయే ప్రక్రియ మొదలైందని, ఆయన 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ పేర్కొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "Today I am saying this in front of the camera, the Chief Minister of Maharashtra is going to change. Eknath Shinde is being removed. Eknath Shinde and the 16 MLAs are going to be disqualified" pic.twitter.com/R0YI0MwQwR — ANI (@ANI) July 3, 2023 సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ రోజు కెమెరా ముందు చెబుతున్నాను. ఏక్నాథ్ షిండేను సీఎంగా తొలిగిస్తారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకు గురవుతారు. పవార్‌కు పట్టాభిషేకం చేస్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. అయితే దీని వల్ల వారికి (బీజేపీ) ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మేమంతా కలిసే పోరాడుతాం. ఎన్సీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని మోదీయే చెప్పారు. ఇప్పుడు అదే నేతలు రాజ్భవన్లోప్రమాణం స్వీకారం చేయడం షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "BJP is breaking Shiv Sena, NCP and Congress but this will not benefit them at all. In Maharashtra, we will fight unitedly. It is shocking that PM Modi had said that the leaders of NCP are involved in corruption… pic.twitter.com/6VodgbNNXI — ANI (@ANI) July 3, 2023 -
‘ఇలాంటి డ్రామాలు చేస్తే.. కేసీఆర్‌కు తెలంగాణలో ఓటమి ఖాయం’
ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనతో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ పర్యటన ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పక్షనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ కూడా పోతుందని, ఆయన ఓటమి భయంతో ప్రస్తుతం మహారాష్ట్రలో అడుగుపెట్టారని ధ్వజమెత్తారు. మరో వైపు బీఆర్ఎస్ నేతలు 12 నుంచి 13 మంది కాంగ్రెస్‌లో చేరారని రౌత్ అన్నారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి బలంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా .. బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్... జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆయన సభ నిర్వహించి, బీజేపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు బీఆర్ఎస్ నేతలు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కుస్తీపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్‌లో ఉన్న ఆ పార్టీకి తాజాగా ముఖ్య నేతలు టీకాంగ్రెస్‌లోకి చేరడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. చదవండి: టీడీపీ-జనసేన.. భయం భయంగానే సహజీవన రాజకీయం! -
మహారాష్ట్ర రాజకీయంలో కలకలం.. చంపేస్తామంటూ మరో నేతకు బెదిరింపులు..
మహారాష్ట్ర: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు బెదిరింపు కాల్స్ రావడం మహారాష్ట్ర రాజకీయంలో కలకలం రేపింది. అయితే.. తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్..తనకూ, తన సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. చంపేస్తామంటూ దుండగులు బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేసేందుకే దుండగులు ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి బెదిరింపులను కోరుకుంటోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని గతంలోనూ ఇలాంటివే వచ్చాయని ఆయన అన్నారు. దీని వెనుక 40 మందితో కూడిన సూపర్ పవర్‌గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్.. -
చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత
మహారాష్ట్రలోని కొల్హాపూర్ అల్లర్ల నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొని లైవ్ లోనే తమ పార్టీ నాయకుడిని చంపేస్తానంటూ బెదిరించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్. ప్రభుత్వమే తమ ప్రత్యర్థులను చంపేయమని ఆర్డర్లు వేస్తోందా? మర్డర్లు చేయడానికి టెండర్లు కూడా స్వీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొల్హాపూర్ అల్లర్లు తర్వాత ఆ ప్రాంతంలో గురువారం కర్ఫ్యూ విధించింది ప్రభత్వం. ఈ సందర్బంగా పలు టీవీ డిబేట్లలో పాల్గొన్న శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొని కార్యక్రమం ముగిసిన తర్వాత శవసేన(UBT) నాయకుడు ఆనంద్ దూబేను ఉద్దేశించి నువ్వేమైనా ఛత్రపతి శివాజీ వారసుడు అనుకుంటున్నావా? హద్దుల్లో ఉండు... లేదంటే కాల్చి పారేస్తా... అని బెదిరించారు. దీంతో ట్విటర్ వేదికగా శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్ షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. "మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి పరిస్థితులను నెలకొల్పుతోంది? రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి ప్రభుత్వమే సుపారీ ఇచ్చి మర్డర్లు చేయమని చెబుతోందా? ఇదేమి సంస్కృతి. దీనికి హోంమంత్రి ఫడ్నవీస్ సమాధానం చెప్పాలి" అని హిందీలో రాశారు. महाराष्ट्र में क्या हो रहा है? ये कैसी हालत खोके सरकारने बना रखी हैं ? शिवसेना प्रवक्ता आनंद दुबे जी कल एक टीव्ही न्यूज शो पर चर्चा कर रहे थे तो उन्हे ऑन एअर धमकाया गया..गृहमंत्री फडणविस मुकदर्शक बने बैठे हैं. क्या अपने राजनैतिक विरो धियोकी हत्या करने की सुपारी सरकारने दी… — Sanjay Raut (@rautsanjay61) June 8, 2023 ఇది కూడా చదవండి: ఏకమైన ప్రతిపక్షాలు... బీజేపీని ఓడించడమే లక్ష్యం -
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్‌ను బాలాసాహెబ్‌తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్‌కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
20 రోజుల్లో షిండే సర్కార్ పతనం: సంజయ్
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్‌లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్ రౌత్‌పై కేసు
సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్‌పై శుక్రవారం మెరైన్‌లైన్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ శిర్సాట్, భరత్ గోగవావలే కిరణ్ పావస్కర్ మెరైన్ లైన్స్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నీలేశ్ బాగుల్‌కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. న్యూ ముంబై ఖార్ఘర్లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కాగా, శిందే, ఫడ్నవీస్‌లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్‌పవార్, సంజయ్ రౌత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. -
హస్తినకొస్తే అంతం చేస్తాం
ముంబై: ఓ గ్యాంగ్‌స్టర్ బృందం తనను చంపేస్తానని బెదిరించిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బెదిరింపుల అంశంపై వెంటనే ముంబైలో పోలీసులకు ఆయన ఫిర్యాదుచేశారు. ముంబైలో ఉండే సంజయ్‌రౌత్ ఢిల్లీకొస్తే ఏకే47 తుపాకీతో కాల్చిపడేస్తామని హెచ్చరిస్తూ ఆయనకు వాట్సాప్‌లో సందేశం పంపారు. ఈ ఘటనలో ముంబై పోలీసులు పుణేకు చెందిన 23 ఏళ్ల రాహుల్ తలేకర్‌ను అరెస్ట్‌చేశారు. కంజుర్మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో రౌత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన ఫిర్యాదు, పోలీసు అధికారి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రౌత్‌కు రాహుల్ తలేకర్ ముందుగా ఫోన్లో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో వాట్సాప్‌లో బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. ‘రౌత్ హిందువులకు శత్రువు. నువ్వు ఢిల్లీలో కనిపించావంటే ఏకే47తో చంపేస్తా. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీకు పడుతుంది. లారెన్స్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. నీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ల మరణం తథ్యం. ఇది ఫిక్స్’ అని హెచ్చరించాడు. మూసేవాలాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం చంపేసిందని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. దీంతో మెసేజ్‌లో పేర్కొన్న లారెన్స్‌ను లారెన్స్ బిష్ణోయ్‌గా పోలీసులు భావిస్తున్నారు. తలేకర్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా బిష్ణోయ్ గురించి తెల్సుకుని, మద్యం తాగిన మైకంలో అతను రౌత్‌కు బెదిరింపు సందేశం పంపినట్లు కేసు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలొచ్చాయి. పాత్రా చావల్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, వీటిని భయపడేది లేదని రౌత్ స్పష్టంచేశారు. రౌత్‌ను హత్య చేస్తామని బెదిరింపులు రావడాన్ని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌చేశారు. -
ఏకే-47తో కాల్చి చంపుతాం’.. సంజయ్ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ముంబై: ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే తనను కూడా హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరించినట్లు సంజయ్ రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో కనపడితే, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. సిద్దూ ముసావాలాకు పట్టిన గతే నీకు పడుతుందనిని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం (ఏక్నాథ్ షిండే) మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించింది. దీని గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేసాడు. ఈ నేపథ్యంలో మా భద్రత విషయంగా ఎన్ని సార్లు తెలియజేస్తున్న హోం మంత్రిత్వ శాఖ, వీటన్నింటిని స్టంట్‌గా పరిగణిస్తోంది’ ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెదిరింపుల గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని’ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఆయన్ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించారు. కాగా..రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామన్న పోలీసులు.. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం కొడుకు నుంచి ప్రాణహాని.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై : ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ శిండే నుంచి తనకు ప్రాణానికి హాని ఉందని రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్ ముంబై పోలీసులకు లేఖ రాశారు. తనను చంపమని థానేకు చెందిన నేరస్తుడు రాజా ఠాకూర్‌కు శ్రీకాంత్ శిండే సుపారీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా పోలీసులకు తెలియజేస్తున్నానన్నారు. లేఖను ముంబై పోలీస్ కమిషనర్‌తోపాటు హోంశాఖ మంత్రిగా ఉన్న ఉన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం పంపించారు. దీనిపై మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించాల్సి ఉంది. కానీ.. దురదృష్టవశాత్తు ద్రోహుల వర్గం పట్టించుకోవడం లేదన్నారు. ముంబైలోని మాహింలో ఒక ఎమ్మెల్యే ఫైరింగ్ చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. కాగా సంజయ్ రౌత్ పోలీసులకు రాసిన లేఖపై డిప్యూడీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆరోపణలు చేశారని సంజయ్ రౌత్‌పై విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు. దాని వల్ల తనకు కొంత సానుభూతి వస్తుందని అనుకోవచ్చు. కానీ బూటకపు ఆరోపణలు చేసి సానుభూతి పొందొద్దు.’ అని అన్నారు. అంతేగాక రౌత్‌కు అదనపు రక్షణ కల్పించడంపై ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కొంతమంది నాయకులకు రక్షణ కల్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక నిర్దిష్ట నాయకుడికి రక్షణ కల్పించాలా లేదా పెంచాలా వద్దా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ అధిపతి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ప్యానెల్ రౌత్ లేఖను పరిగణలోకి తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు రౌత్ ఆరోపణలపై ఏక్నాథ్ శిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సాట్ మాట్లాడుతూ.. అవి సానుభూతికోసం ఠాక్రే సేన వేస్తున్న చిల్లర వేషాలని అన్నారు. ఒకవేళ బెదిరింపుపై ఏమాత్రం నిజమున్న సమగ్ర విచారణ జరిపిస్తామని, కానీ శ్రీకాంత్ శిండే అలా చేస్తారని తాను నమ్మనని స్పష్టం చేశారు. -
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని కొనుగోలు చేసేందుకు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అసలైన శివసేన ఎక్నాథ్ షిండేదే అని ఎన్నికల సింగం నిర్ణయం తీసుకోవడం ఓ ఒప్పందంలో భాగంగానే జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో రూ.2,000 కోట్ల లావాదేవి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. ఈ లావాదేవి గురించి అధికార పార్టీతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనకు చెప్పారని రౌత్ పేర్కొన్నారు. ఈమేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఒక ఎమ్మెల్యేను కొనడానికి రూ.50 కోట్లు, ఒక ఎంపీని కొనడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మా కౌన్సిలర్ని, శాఖా ప్రముఖ్‌ని కొనడానికి రూ.కోటి వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వం, నాయకుడు, నీతిలేని వ్యక్తుల సమూహం, మా పార్టీ గుర్తును, పేరును కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయగలరో నేను ఊహించగలను. నా అంచనా ప్రకారం అది రూ.2,000 కోట్లు' అని రౌత్ ఆరోపించారు. #WATCH शिवसेना और उसका निशान (तीर-कमान) चिह्न छीना गया है और ऐसा करने के लिए इस मामले में अब तक 2,000 करोड़ रुपए की लेनदेन हुई है: उद्धव ठाकरे गुट के नेता व सांसद संजय राउत, मुंबई pic.twitter.com/6hyQHLjMZr — ANI_HindiNews (@AHindinews) February 19, 2023 చదవండి: ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం.. -
'ఆ విషయం తెలిస్తే రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'
ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్‌ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్‌ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు. 'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్, రష్మికి చెబితే వారు రౌత్‌ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు. శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు. నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్‌ను స్వీకరించారు. చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్‌లు -
ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్ రౌత్ ధ్వజం
ముంబై: ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ప్రధాని నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా అభివర్ణించడంపట్ల శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని బీజేపీ అంగీకరిస్తే అది మోదీని తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న నవభారతంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగ్యం, ఉగ్రవాదం వంటి సమస్యలు భారీగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఈ మేరకు శివసేన (యూబీటీ) ప్రచార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయంలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌ను జాతి పితగా బీజేపీలో ఏ నాయకుడు కూడా చెప్పరని, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) ఎల్లప్పుడూ జైలుకెళ్లి శిక్ష అనుభవించిన వీర్‌సావర్కర్‌ను వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇలాంటివారే భారతదేశాన్ని కొత్త, పాత భారతావనిగా విభజించారని చెప్పుకొచ్చారు. గాయకురాలు, బ్యాంకు అధికారి అయిన అమృత ఫడ్నవీస్ ఒక ఇంటర్వ్యూలో మన దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు పాత భారతానికి మహాత్మాగాంధీ అయితే కొత్త భారతావనికి ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పారు. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! అయితే అమృత వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మ బలిదానాల నుంచి లభించిన దేశ స్వాతంత్య్రాన్ని బీజేపీ గుర్తించడంలేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో ప్రస్తుతం దేశంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం ప్రధానంగా పెరిగిపోయాయని, ఇలాంటి కొత్త భారతావనికి జాతిపిత మోదీ అని చెప్పడం ఆయనకు తీవ్ర అవమానమని ఎద్దేవా చేశారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటుగా శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రే కూడా గతంలో ఇటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంజయ్ రౌత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతావనికి జాతిపిత ఎవరనేది సమస్య కాదని, అసలు దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ పాత్ర ఏంటనేదే ఇక్కడ సమస్య అని వివరించారు. బీజేపీ గానీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ గానీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి పాత్రపోషించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌తో అనుబంధమున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఆదర్శనేతలను దొంగిలించి తమవారిగా చెప్పుకుంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందని సంజయ్ రౌత్ విమర్శించారు. -
కర్ణాటకతో సరిహద్దు వివాదంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంపై శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించినట్లే తాము కూడా కర్ణాటకలోకి వెళ్తామన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని తాము భావించామని, కానీ ఆయనే అగ్గి రాజేసి రెచ్చగొడుతున్నారని రౌత్ విమర్శించారు. ఇటు మహారాష్ట్రలో ప్రస్తుతం బలహీన ప్రభుత్వం అధికారంలో ఉందని, సరిహద్దు వివాదంపై తటస్థంగా ఉంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈమేరకు రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. #WATCH | Like China has entered, we will enter (Karnataka). We don't need anyone's permission. We want to solve it through discussion but Karnataka CM is igniting fire. There is a weak govt in Maharashtra & is not taking any stand on it: Sanjay Raut, Uddhav Thackeray's faction pic.twitter.com/d0okV6Wq8X — ANI (@ANI) December 21, 2022 మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటివలే చర్చలు జరిపారు. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. చదవండి: జోడో యాత్రపై రాహుల్‌కు కేంద్రం హెచ్చరిక.. -
Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్ తర్వాతే అక్కడ హత్యలు బాగా పెరిగాయ్'
ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్‌కే మద్దతుగా నిలిచారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్‌లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు. నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కటీఫ్ లేనట్టే?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది. సోమవారం ట్వీట్ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. pic.twitter.com/FpaxllR7jk — Sanjay Raut (@rautsanjay61) November 21, 2022 చదవండి: మెగాస్టార్‌పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్ చేసిన మోదీ -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్‌పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్‌ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్‌ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్‌ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్‌భన్‌పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్‌ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్‌రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్‌తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్‌ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్‌జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్‌ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్‌జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్‌జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్‌కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్‌లోని బాల్ ఠాక్రే మెమోరియల్‌కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్‌జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్‌తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్‌జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్‌దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్‌జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే..
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టై విడుదలైన మరుసటి రోజే మహారాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులను వ్యతిరేకించాలి కాబట్టి తాము వ్యతిరేకించమని.. అలా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని నేను భావిస్తున్నాను. ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నేను జైలులో వీలైనప్పుడల్లా న్యూస్‌పేపర్ చదివాను. పేదలకు గృహనిర్మాణం వంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని నేను స్వాగతిస్తాను’ అంటూ కొనియాడారు. కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో కలిసి బీజేపీ గత జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసే ముందు గురువారం తన ఇంటి వద్ద సంజయ్ రౌత్ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. ‘మూడు నెలల్లో ప్రజలు నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కానీ విడుదలైనప్పటి నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నాతో క్రమం తప్పకుండా టచ్‌లో డేవారు. శరద్ పవార్ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన కొన్ని పనుల కోసం ఫడ్నవీస్‌ను కలవనున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నాను. వారిని కలిసి నాకు జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో రాజకీయ దుమారం తగ్గించాలంటూ ఫడ్నవీస్ చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను’ అని తెలిపారు. అదే విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సైతం కలుస్తానని సంజయ్ రౌత్ చెప్పారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సంజయ్ రౌత్ మాట్లాడారు.. ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. నేను జైలులో ఉండగా నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. జైలులో నా ఆరోగ్యం దెబ్బతింది. జైలు జీవితం అంత సులువేమీ కాదు. అక్కడ ఎత్తయిన గోడలు ఉంటాయి. వాటితోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి హిందూత్వ దిగ్గజం సావర్కర్ పదేళ్ళపాటు జైలు జీవితం గడిపారు. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్‌పాయి వంటి నాయకులు జైలులో గడిపారు. వీరంతా ఎలా గడిపారోనని తరచూ అనుకునేవాడిని. కానీ రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని నాకు నేనే చెప్పుకున్నాను. నేను వ్యవస్థను తప్పుపట్టడం లేదు. కోర్టు తీర్పు, ఈడీపై ఎలాంటి కామెంట్ చేయను. నా మౌనం వారికి సంతోషాన్ని కలిగిస్తే.. సంతోషపడనివ్వండి. నా మనసులో ఎవరిపై పగ లేదు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థను నిందించడం లేదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా పాత్రాచల్ రీడెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఈడీ గత ఆగస్టు నెలలో సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా తర్వాత కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపారు. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి సంజయ్ రౌత్ బుధవారం విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన మరునాడే సంజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు.. -
రౌత్ అరెస్ట్ చట్టవ్యతిరేకం
ముంబై: ముంబైలోని గోరేగావ్‌లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్(హెచ్‌డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్చేయలేదో కారణం చెప్పలేదు. కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్‌చేశారు. సంజయ్ రౌత్‌ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్‌చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్‌లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది. -
శివసేన సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిట్ మంజూరైంది. పీఎంఎల్ఏ కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జూలై 31వ తేదీన సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. -
‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ
సాక్షి, ముంబై: పత్రాచల్ భూకుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న శివసేన ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తన తల్లికి భావోద్వేగ లేఖ రాశారు. తను ఖచ్చితంగా తిరిగి వస్తానని, అప్పటి వరకు ఉద్దవ్ ఠాక్రే, శివ సైనికులు నిన్ను(తల్లి) జాగ్రత్తగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. శివసేనకు ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారని, వాళ్ల ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే నేడు తల్లికి దూరంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ లేఖను సంజయ రౌత్ తన ట్విటర్లో బుధవారం పోస్టు చేశారు. ‘నీలాగే(తల్లి) శివసేన కూడా నాకు అమ్మతో సమానం. నా తల్లికి(శివసేన) ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని బెదిరించారు. వారి బెదిరింపులకు లొంగకపోవడం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణం వల్లే ఈరోజు నేను నీకు దూరంగా ఉన్నాను. దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్న వేలాది మంది సైనికులు నెలల తరబడి ఇంటికి రారు. కొందరు ఇంటికి ఎప్పటికీ వెళ్లరు. నేను కూడా మహారాష్ట్ర, శివసేన శత్రువులకు తలవంచలేను. మహారాష్ట్ర, దేశ విధేయుడిని అంత తేలిగ్గా చంపలేరు. చదవండి: తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్ రాజకీయ ప్రత్యర్థుల ముందు తలవంచబోను. ఈ ఆత్మగౌరవాన్ని నేను మీ నుంచే నేర్చుకున్నా. శివసేన, బాలాసాహెబ్ పట్ల నిజాయితీగా ఉండాలని మీరు కునా నేర్పించారు. శివసేన గడ్డు పరిస్థితుల్లో ఉంటే బాలాసాహెబ్ ఏమి చేస్తారో అది చేయాలని నేర్పించారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 8న రాసిన లేఖలో ఈడీ కస్టడీ ఇప్పుడే ముగిసిందని, జ్యుడీషియల్ కస్టడీలోకి వెళ్లే ముందు సెషన్స్ కోర్టు ప్రాంగణంలో కూర్చొని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తల్లికి లేఖ రాసి చాలా ఏళ్లు అవుతోందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖ రాసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు. प्रिय आई, जय महाराष्ट्र, .....तुझा संजय (बंधू) pic.twitter.com/EXAtkcyRLi — Sanjay Raut (@rautsanjay61) October 12, 2022 కాగా పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో (మానీలాండరింగ్ కేసు) ఆగస్టు 1న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆగస్టు 8న ఆయన్ను జ్యూడీషియల్ కస్టడీగి అప్పగించారు అప్పటి నుంచి ఆయన జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూనే ఉన్నారు. కాగా ఈనెల 10న సంజయ్ రౌత్ కస్టడీని అక్టోబర్ 17 వరకు కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఈ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన భార్య, సన్నిహతుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది. చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి.. -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్‌పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
జ్యుడీషియల్ కస్టడీకి సంజయ్ రౌత్.. ఆ వినతికి కోర్టు నో!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ముంబైలోని పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్. ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్ రౌత్ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్‌పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఇటీవలే అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఆయన కస్టడీని పొడింగించింది ముంబై ప్రత్యేక కోర్టు. సోమవారం వరకు ఈడీ అధీనంలోనే విచారణ ఎదుర్కోనున్నారు రౌత్. కస్టడీ పొడిగించిన క్రమంలో.. ఈ కేసు దర్యాప్తులో ఈడీ పురోగతి సాధించినట్లు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ముంబైలోని ఛాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని గత ఆదివారం సంజయ్ రౌత్‌ను సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. అనంతరం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. అలాగే.. ఆయన భార్య, ఇతరులకు ప్రమేయం ఉన్న ట్రాన్సాక్షన్స్‌లను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో గురువారం పీఎంఎల్ఏ కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే ముందు రౌత్‌ను హాజరుపరిచింది ఈడీ. లోతైన విచారణ జరిపేందుకు కస్టడీ పొడగించాలని కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రౌత్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించారు. హౌసింగ్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌లో రౌత్, ఆయన కుటుంబం సుమారు రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో పేర్కొంది ఈడీ. అయితే.. ఈ వాదనలు తోసిపుచ్చారు రౌత్. సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు.. పార్థ ఛాల్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు గురువారం సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసులో రౌత్ కస్టడీ పొడిగించిన కొన్ని గంటల్లోనే సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్ష రౌత్ ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినట్లు బయటకి రావటంతో ఈ సమన్లు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్ష రౌత్ ఖాతాలోకి సుమారు రూ.1.08 కోట్లు నగదు వచ్చినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో?
సాక్షి ముంబై: శివసేన ఫైర్ బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు తర్వాత తరువాత టార్గెట్ ఎవరనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు ఊతం వచ్చింది. ముఖ్యంగా సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఒకరకంగా శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఓవైపు ఇప్పటికే ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడటం ఉద్దవ్ ఠాక్రేకు చిక్కులను తెచ్చిపెట్టింది. మరోవైపు రోజురోజుకీ శిండే వర్గానికి పెరుగుతున్న మద్దతు, ఉద్దవ్ ఠాక్రే మద్దతుగా ఉన్న శివసేన నాయకులపై ఈడీ దర్యాప్తులు ఉద్దవ్ ఠాక్రేకు తలనొప్పిగా మారాయి. పార్టీని, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్నడూలేని విధంగా ఉద్దవ్ ఠాక్రేతోపాటు ఆదిత్య ఠాక్రే పలు ప్రాంతాల్లో పర్యటించి శివసేన పదాధికారులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో సంజయ్ రావుత్ అరెస్టు కొంతమేర శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఆందోళనను రేకేత్తించేలా చేసిందని చెబుతున్నారు. అరెస్టు అయిన సంజయ్ రౌత్ తాను ఎలాంటి బెదిరింపులకు లొంగనని, తాను పార్టీ వీడనని ప్రకటించడం, దీనికి తీడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవంటూ ఉద్దవ్ ఠాక్రే మాట్లాడటం శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఉత్తేజాన్ని నింపేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో సంజయ్ రౌత్ తర్వాత ఈడీ టార్గెట్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడైన శివసేన నాయకుడు అనిల్ పరబ్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ నాయకులు కిరీట్ సోమయ్య పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కేసుల భయంతోనే శిండే గూటికి.. మరోవైపు శిండే వర్గంలో చేరిన శివసేన తిరుగుబాటు నాయకులు కూడా కావచ్చని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో శిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఈడీ దర్యాప్తులు జరిపి చర్యలు తీసుకుంటుందా అనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏక్నాథ్ శిండే తిరుగుబాటుకు మందు ఆయన వర్గంలో చేరిన కొందరిపై ఈడీ దర్యాప్తులు చేసింది. వీరిలో ప్రతాప్ సర్నాయిక్, అర్జున ఖోత్కర్, యవ్వంత్ జాదవ్, భావనా గావ్లీ తదితరులున్నారు. వీరిని కూడా గతంలో ఈడీ విచారించింది. ముఖ్యంగా ప్రతాప్ సర్నాయక్కు చెందిన రూ. 11.35 కోట్లు విలువైన ఆస్తులను జప్తీ చేయగా యశ్వంత్ జాధవ్‌కు సంబంధించిన 40 ప్రాపర్టీలు జప్తీ చేశారు. వీటిలో ముంబై బైకలాలోని 26 ఫ్లాట్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఈడీ రాడార్‌పై ఉన్న నాయకులుగా ఉన్న వారిపై మళ్లీ చర్యలు ఉంటాయా లేదా క్లీన్ చీట్ ఇచ్చారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఏర్పాటు చేసి బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, బీజేపీలో చేరిన వారిపై కూడా ఈడీ, సీబీఐ చర్యలు కొనసాగుతాయా.? కొనసాగుతున్నాయని తెలిస్తే సమాచారం అందించి రూ. ఒక లక్ష బహుమతిని అందుకోవాలని బ్యానర్ ద్వారా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. -
రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్ ప్రస్తావన
సాక్షి, ముంబై: ప్రతీకార రాజకీయాలతో శివ సేనను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించారని శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ‘మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తుడిచిపెట్టేస్తాం’ అనే ధోరణితో దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. సంజయ్ రౌత్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అయినా ఏ దశలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పుష్ప అనే సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఝుకేగా నహీ(తగ్గేదే లే) అని. అది రౌత్‌కు అన్నివిధాల సరిపోతుంది. నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారు. కొందరిలా ఆయన ఈడీ బూచికి భయపడలేదు. పిరికిపందలా వెన్నుచూపలేదు. ఎక్కడా తగ్గలేదు. బాలా సాహెబ్ చూపిన మార్గం ఇదే. రౌత్ నిజమైన శివ సైనికుడు అంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు గుప్పించారు. సోమవారం మధ్యాహ్నాం రౌత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం.. ఉద్దవ్ థాక్రే పైవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రౌత్కుటుంబ సభ్యులు సైతం బీజేపీపై మండిపడ్డారు. బీజేపీపై సంజయ్ రౌత్ సహేతుక విమర్శలతో విరుచుకుపడుతున్నారని, అందుకే భయపడే ఈడీని ఆయనపై ప్రయోగించిందని బీజేపీపై సంజయ్ రౌత్ కుటుంబం ధ్వజమెత్తింది. ఇదిలా ఉంటే.. పత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆరేడు గంటలపాటు ఆయన్ని పశ్నించి.. చివరికి అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేసింది. సోమవారం మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సంజయ్ రౌత్‌ను.. నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది ముంబై కోర్టు. -
Patra Chawl Scam: ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్
సాక్షి, ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. పత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ని దర్యాప్తు విభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సోమవారం వైద్య పరీక్షల అనంతరం ముంబై పీఎంఎల్ఏ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టింది. నాలుగుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఏజెన్సీ ముందు ఆయన ఒక్కసారే హాజరయ్యాడని, ఈ గ్యాప్‌లో ఆయన ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడని, కీలక సాక్షిని ప్రభావితం చేయాలని చూశారని ఈడీ కోర్టులో వాదించింది. ఈ మేరకు 8 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని కోరింది. మరోవైపు సంజయ్ రౌత్ తరపు న్యాయవాది అశోక్ ముండార్గి ఈ అరెస్ట్‌ను.. రాజకీయ కుట్రగా న్యాయస్థానానికి నివేదించారు. రాజకీయ కోణంలో ఈ అరెస్ట్జరిగిందని, ఆయనకు గుండె సమస్య ఉందని, ఈ మేరకు సర్జరీ కూడా జరిగిందని చెబుతూ.. కోర్టుకు పత్రాలు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. చివరికి సంజయ్ రౌత్‌కు ఆగష్టు 4వ తేదీ వరకు రిమాండ్‌కు అనుమతించింది. నాలుగు రోజుల కస్టడీతో పాటు ఇంటి భోజనానికి ఆయన్ని అనుమతించాలని ఈడీని ఆదేశించింది కోర్టు. చదవండి: సంజయ్ రౌత్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది- నవనీత్‌కౌర్ -
Sanjay Raut: ఈడీ అరెస్ట్ మెమోలో ఏముందంటే..
ముంబై: శివ సేన ఎంపీ, ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై మహా రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ చర్చ నడుస్తోంది. రౌత్‌కు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం చివరికి సోమవారం మధ్యాహ్నాం రిమాండ్ కోరుతూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. అయితే ఆయన అరెస్టుకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పలు జాతీయ మీడియా చానెల్స్ ఆయన అరెస్ట్ మెమో కాపీ వివరాలను సేకరించాయి. వాటిలో ఏముందంటే.. సంజయ్ రౌత్ ‘పాత్రా చావల్’ వెయ్యి కోట్ల రూపాయల భూకుంభ కోణంలో భాగం అయ్యారని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు అరెస్ట్ మెమోలో స్పష్టం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. భార్య వర్ష రౌత్ ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్, స్వప్న పాట్కర్(ప్రవీణ్ రౌత్ భార్య)లతో సంబంధాలు, వ్యాపార లావాదేవీల గురించి సంజయ్ రౌత్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘నా వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంజయ్ రాజారామ్ రౌత్ పాల్పడినట్లు నమ్ముతున్నాం. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం’’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 సబ్ సెక్షన్ (1) ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమోలో పేర్కొనబడింది. అంతేకాదు రౌత్‌ను అరెస్ట్ చేసే ముందు.. కారణాలను సైతం అధికారులు ఆయనకి వివరించారు. సంజయ్ రౌత్ విచారణ సమయంలో సహకరించలేదు. అలాగే.. లావాదేవీ వివరాల ఆధారంగా మనీల్యాండరింగ్‌తో లాభపడింది సంజయ్ రౌత్ అని, తద్వారా ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి. అంతేకాదు.. సంజయ్ రౌత్, ఈ వ్యవహారంలో ప్రథమ నేరస్తుడిగా ఉన్న ప్రవీణ్ రౌత్‌కు సహకరించారు. ఇలా మూడు కారణాలతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమో వివరించింది. ఇక ఆదివారం సంజయ్ రౌత్ ఇంట్లో జరిగిన సోదాల్లో రూ.11.50 లక్షల లెక్కల్లోలేని సొమ్మును సీజ్ చేసింది. ఆపై ఆరుగంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించి.. ఆపైనే అరెస్ట్‌చేసి ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈడీ కార్యాలయానికి తన కారులోనే వెళ్లిన సంజయ్ రౌత్.. అంతుకు ముంద తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. గతంలో.. ముంబైలోని ‘పాత్రా చావల్’ఏరియాలో పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకలతో జరిగిన భూ కుంభకోణం విలువ రూ. 1,034 కోట్లుగా అంచనాకు వచ్చింది ఈడీ. గతంలో ఆరోపణల మేరకు దర్యాప్తు జరుగుతుండగా.. సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆపై ఈడీ ఎదుట విచారణకు సైతం హాజరయ్యారు సంజయ్ రౌత్. -
సంజయ్ రౌత్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది: నవనీత్ రాణా
సాక్షి ముంబై: ఈడీ దాడులకి భయపడి మాతో చేరాలనుకునేవారు మా వద్దకి రావద్దని, మాతో చేరవద్దని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే పేర్కొన్నారు. బీజేపీలో కూడా చేరవద్దన్నారు. సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం.. తనను శివసేన నుంచి దూరం చేసేందుకే కేంద్రం ఈడీతో దాడులు చేయిస్తోందని.. ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో పేర్కొనడంపై శిండే స్పందించారు. శనివారం అజిత్ ఖోత్కర్ శిండే వర్గంలో చేరే సమయంలో తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని శిండే వర్గానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏక్నాథ్ శిండే మాట్లాడారు. ముఖ్యంగా ఈడీకి భయపడి ఎవరు మా వద్దకి రావద్దన్నారు. మీరు తప్పుచేయకుంటే ఈడీకి ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. తప్పులేనప్పుడు ఈడీకి సహకరించాలని, ఈడీ తనపని తాను చేసుకుంటుందన్నారు. సంబంధిత వార్త: శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు లెక్కలు చూపించాల్సిందే: కిరీట్ సోమయ్య సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ‘ఇక లెక్కలు చూపించాల్సిందే’ అంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య తనదైన శైలిలో రావుత్‌కు చురకలంటించారు. మాఫియా సంజయ్ రౌత్ అంటూ సంభోదిస్తూ, ఆయనకు ఇక లెక్కలు చూపించాల్సి రానుందన్నారు. రూ. 1,200 కోట్ల పత్రాచాల్ కుంభకోణం, వసాయి నాయిగావ్‌లోని బిల్డర్ల కుంభకోణం లేదా మహారాష్ట్రను దోచుకునే పనిచేసిన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఇలా మాఫియాగిరి, దాదాగిరి చేస్తూ అందరినీ జైల్లో వేస్తానని బెదిరింపులు చేశారు. కానీ ఇప్పుడు వారికి ఈ విషయాలన్నింటిపై లెక్కలు చూపించాల్సిన సమయం వచ్చిందని కిరీట్ సోమయ్య పేర్కొన్నారు. ఎన్నడో అరెస్టు చేయాల్సింది: నవనీత్ రాణా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎంపీ నవనీత్ రాణా తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సింది అని అన్నారు. విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్ రౌత్ వద్ద ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సవాల్ విసిరారు. అదేవిధంగా సంజయ్ రౌత్, ఉద్దవ్ ఠాక్రేలు తమ పదవుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సంజయ్ రౌత్ గతంలోనే అరెస్టు చేసి ఉండాల్సిందన్నారు. చదవండి: గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు..స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ రౌత్‌కు ఇప్పుడు తెలిసొస్తుంది: నితేష్ రాణే అందరి ఉదయం పాడుచేసే సంజయ్ రౌత్‌కు ఇప్పుడు ఆయన ఉదయం పాడవడం తనకు సంతృప్తిగా ఉందని నారాయణ రాణే కుమారుడైన బీజేపీ నాయకుడు నితేష్ రాణే పేర్కొన్నారు. ముఖ్యంగా సంజయ్ రౌత్‌కు నాకు ఎప్పుడు ఏమి జరగదని భావించేవారు. కాని ఈడీ దర్యాప్తు, ఇతరులను ఇబ్బందులు పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు సంజయ్ రౌత్‌కు తెలిసివస్తుందంటూ నితేష్ రాణే మండిపడ్డారు. దేశంలోని ఎవరిపైనైనా దర్యాప్తు చేయవచ్చు: అజిత్ పవార్ సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన ప్రతిపక్ష నేత అజిత్ పవార్ సౌమ్యంగా స్పందించారు. బీడ్ పర్యటనపై ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, ఈడీకి దేశంలోని ఎవరినైన దర్యాప్తు చేసే అధికారం ఉందన్నారు. గతంలో కూడా అనేక మందికి ఈడీ నోటీసులు పంపించిందని గుర్తు చేశారు. మనీలాండరింగ్ కేసులో ప్రమేయంపై ఆరా.. కాగా, అంతకుముందు శివసేన నేత సంజయ్ రావుత్ నివాసంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ముంబై భాండూప్‌లోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకే చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరిపారు. ఈ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రావుత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటికే ఈడీ రెండుసార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలిపి వాయిదా వేశారు. అయితే ఆదివారం ఉదయం ఈడీ అధికారులు ఏకంగా ఆయన నివాసానికే వచ్చి సోదాలు చేపట్టారు. ఈ విషయంపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. విషయం తెలుసుకున్న శివసేన కార్యకర్తలు వందలాది మంది భాండూప్‌లోని ఆయన నివాసస్థానం వద్దకి చేరుకున్నారు. సంజయ్ రావుత్‌కు మద్దతుగా అక్కడే ఆయన నివాసముంటున్న భవనం ముందు భైఠాయించి నిరసనలు తెలిపారు. ముఖ్యంగా శివసేన నేతలను భయపెట్టేందుకు ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. సంజయ్ రావుత్ ఎలాంటి తప్పుచేయలేదని, అన్ని విధాలుగా ఈడీకి తాను సహకరించనున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ విధంగా దాడులు చేపట్టి భయబ్రాంతులకు గురిచేసేలా చేయడం సరికాదని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలా శివసేన నాయకులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు శిందేవర్గం, బీజేపీ నాయకులు ఈడీ సోదాలకు మద్దతు పలుకుతున్నారు. శివసేనను వీడను: సంజయ్ రౌత్ తప్పుడు ఆ«ధారాలు, తప్పుడు సాక్ష్యాలతో నాపై దాడులు చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రావుత్ ఆరోపించారు. సంజయ్ రావుత్ నివాసంలో ఈడీ దాడుల అనంతరం ట్విట్టర్ ద్వారా బీజేపీ పేరు ప్రస్తావించకుండానే ఎవరెన్ని చేసినా, ఎన్ని విధాలుగా బెదిరించినా నేను శివసేనను వీడనన్నారు. నేను మరణించినా లొంగిపోనంటూ ట్విట్టర్లో ఆయన స్పష్టం చేశారు. ఈడీ పేరుతో బీజేపీ బెదిరిస్తోంది: అమోల్ మిట్కర్ సంజయ్ రావుత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన అమోల్ మిట్క ర్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఈడీ దర్యాప్తు పేరుతో బెదిరించి బీజేపీ తమ ప్రత్యర్థులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే నిష్టావంతుడైన శివసైని కుడు సంజయ్ రావుత్ ఈడీ ముందు తలవంచలేదన్నారు. ఇప్పటివరకు ఈడీ దర్యాప్తుల బెదిరింపులకు అనేక మంది బీజేపీలో చేరారని మిట్కర్ ఆరోపించారు. పలువురు శివసేన ఎమ్మెల్యేలు కూడా విడిపోయారు. అనేక ఎమ్మెల్యేలు శివసేనను వీడిపోయినప్పటికీ సంజయ్ రావుత్ మాత్రం తలవంచకుండా పోరాడుతున్నారన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని, అమోల్ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
Sanjay Raut Arrest: బీజేపీ చర్య సిగ్గుచేటు..
ముంబై: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతున్న బలమైన గళాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ రౌత్ అరెస్టును ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీనిపై తామంతా ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. The attempt to silence one of the most vocal opponent of the central/ state BJP and their wrongdoings — Sh @rautsanjay61 ji —is on. It is a shameful attempt to use central agencies to harass the opposition leaders. Condemn this harassment and we will all fight this out unitedly. — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 31, 2022 రూ.1000కోట్ల పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబైలోని ఆయన నివాసంలో గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల అక్రమ నగదును సీజ్ చేశారు. రౌత్ అరెస్టును శివసేన సహా విపక్ష పార్టీల నేతలు ఖండించారు. చదవండి: మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ -
శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు
ముంబై: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల నగదును జప్తు చేశారు. సంజయ్ రౌత్‌తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై రూ.1000కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ED officials take Shiv Sena leader Sanjay Raut along with them after detaining him post conducting raids at his residential premises in Mumbai. Party workers present at the spot pic.twitter.com/6Jubs44s4k — ANI (@ANI) July 31, 2022 సంజయ్ రౌత్ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీకి భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బిగ్ షాక్ -
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
-
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బిగ్ షాక్
Sanjay Raut.. మహారాష్ట్రలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, సంజయ్ రౌత్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వచ్చి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ED Arrives at Sanjay Raut’s Mumbai Home for Questioning After Earlier No-Show https://t.co/WmDw6CS7xk — HuntdailyNews (@HUNTDAILYNEWS1) July 31, 2022 ఇది కూడా చదవండి: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి! -
పాములంటే భయం! ఏక్నాథ్ షిండే పై విమర్శల దాడి
ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతర్గత విభేదాలతో రెండుగా విడిపోయి అనుహ్య రాజకీయ అనిశ్చితికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఏకనాథ షిండే 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసి బీజేపీ మద్దతుతో అనుహ్యంగా మహారాష్ట్ర సీఎంగా భాద్యతలు చేపట్టారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే వర్గాన్ని పాములుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఏక్‌నాధ్ షిండ్ వర్గాన్ని ఉద్దేశించి...సరదాలను కూడా చితకబాదే నైపుణ్యం నేర్చుకోండి. పాముల భయంతో అడవిని వదలకండి. జై మహారాష్ట్ర అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాకక్రే నేతృత్వంలో శివసేన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది మహారాషష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్‌లో ఉండటంతో మరోసారి శివసేన వర్గానికి పెద్ద షాక్ తగలిన నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేశారు. షిండే ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక షిండే సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో 18 మంది శివసేన లోక్‌సభ ఎంపీలు బుధవారం తనను కలుస్తారనే నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు విచారించనుంది. (చదవండి: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!.. ఎమ్మెల్యే ముఖం చింపాంజీ కటౌట్‌తో నిరసన) -
శివ సేనలో సయోధ్య.. భేటీకి సిద్ధమైన షిండే-థాక్రే!
ముంబై: శివ సేన పార్టీ అంతర్గత సంక్షోభం ఓ కొలిక్కి రానుందా? మహారాష్ట్ర సీఎం.. రెబల్ గ్రూప్ నేత ఏక్నాథ్ షిండే, శివ సేన అధినేత..మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే భేటీ కానున్నారా? ఇందుకు బీజేపీనే మధ్యవర్తిత్వం వహించబోతుందా?.. మరాఠీ నటి దీపాలి సయ్యద్ చేసిన ట్వీట్ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. శివ సేన నేతగా చెప్పుకుంటున్న ఆమె ఈ మేరకు వీళ్ల భేటీ గురించి ఓ ట్వీట్ చేశారు. పార్టీలో విభేధాలపై చర్చించేందుకు షిండే, థాక్రేలు భేటీ కాబోతున్నారంటూ ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కొందరు బీజేపీ నేతల దౌత్యంతో రెండు రోజుల్లో ఈ ఇద్దరు భేటీ కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. శివ సైనికుల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని షిండే, పార్టీ అనే కుటుంబానికి పెద్దగా థాక్రే సహృదయంతో సామరస్యంగా చర్చించుకునేందుకు ముందుకు వచ్చారని ఆమె తెలిపారు. @OfficeofUT @mieknathshinde @TawdeVinod @Pankajamunde pic.twitter.com/20JnC3QSma — Deepali Sayed (@deepalisayed) July 16, 2022 దీపాలి సయ్యద్ 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో థానే జిల్లాలోని ముంబ్రా-కల్వా నియోజకవర్గం నుంచి శివసేన టిక్కెట్‌పై పోటీ చేసి ఓడారు. 2014లో ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓడారు. అయితే దీపాలి సయ్యద్ ట్వీట్‌పై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అలాంటి పరిణామం గురించి తనకేం తెలియదని, పార్టీలో తానొక చిన్న కార్యకర్తనంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు కావొస్తున్న మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధమైన చిక్కులతోనే వాళ్లు ఇబ్బందిపడుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ సంజయ్ రౌత్. బుధవారం సుప్రీం విచారణ సేనలోని ఉద్ధవ్, షిండే వర్గాల పిటిషన్లను జులై 20న విచారించనుంది సుప్రీం కోర్టు. మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటుకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేపట్టనుంది. ప్రత్యర్థి పక్షం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ థాక్రే శిబిరం, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని జూలై 11న సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్‌ను కోరింది. అసెంబ్లీలో కొత్త స్పీకర్ ఎన్నికను సవాల్ చేస్తూ థాక్రే వర్గం చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు -
వీడిన ఉత్కంఠ.. ద్రౌపది ముర్ముకే సపోర్ట్
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది. నిన్న(సోమవారం) ఎంపీలతో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మెజార్టీ సభ్యులు ముర్మువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో అధిష్టానం సైతం ఆ దిశగా సానుకూలత చూపిస్తోంది. మహారాష్ట్ర జనాభాలో పది శాతం ఎస్టీ జనాభా ఉంది. ఈ తరుణంలో.. గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని సేన ఎంపీలు.. శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేపై ఒత్తిడి తెచ్చారు. మొత్తం 22 ఎంపీలకుగానూ 16 మంది(ఇద్దరు షిండే గూటిలో ఉన్నారు) ముర్ముకే మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో శివసేన రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. మరోవైపు ఈ మధ్యాహ్నాం సంజయ్ రౌత్.. రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలోనూ ఒక స్పష్టత ఇచ్చేశారు. సోమవారం ఎంపీల సమావేశంలో ద్రౌపది ముర్ము మద్దతు అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే.. ముర్ముకు మద్దతు ఇచ్చినంత మాత్రానా బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలన్నది మా ఉద్దేశం. యశ్వంత్ సిన్హా విషయంలోనూ శివ సేన సానుకూలంగానే ఉంది. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా.. ప్రతిభా పాటిల్‌కు మద్దతు ఇచ్చాం. ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చాం. ఒత్తిడిలో శివసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. అంటూ సంజయ్ మాట్లాడారు. సంకుచిత స్వభావం కాదు.. ఉద్దవ్‌థాక్రే శివసేనది సంకుచిత స్వభావం కాదని, తనపై ఎవరి ఒత్తిడి ఉండదని.. ఉండబోదని శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆమెను బలపర్చకూడదు. కానీ, మేమంతా సంకుచిత స్వభావం ఉన్నవాళ్లం కాదు. అందుకే గిరిజన మహిళకు మద్దతు ప్రకటిస్తున్నాం అని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇక రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన.. రాజకీయాలు పట్టించుకోదని, గతంలో మాదిరే ఇప్పుడు గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చి తీరుతుందని ఎంపీ గజానన్ కిరీట్కర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో మల్లగుల్లాలు పడుతుంటే.. పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది శివసేన. అందుకే కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎవరికి మద్దతు ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ నడుస్తూ వచ్చింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. చంద్రబాబు ఎక్కడ?? -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లు ఉద్దవ్ థాక్రేవే!
ముంబై: శివ సేన రెబల్స్ తిరుగుబాటు సంక్షోభ సస్పెన్స్ తర్వాత.. బీజేపీ మద్దతుతో షిండే వర్గం అధికారంలో కొలువుదీరింది. అయితే.. శివ సేన మాత్రం తమది నైతిక విజయం అని, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాక్రే.. కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్టు కాదని.. మహారాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను(ఈడీ, సీబీఐలను ఉద్దేశిస్తూ..), డబ్బును అడ్డం పెట్టుకుని శివ సేనను హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివ సేన 100 సీట్లకుపైగా గెలుచుకుంటుంది. ఉద్ధవ్ థాక్రేపై ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోతే.. శివ సేన తమ ఓటర్లను కోల్పోయినట్టు కాదు” అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా ఈ విషయంపై ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలకు సవాలు చేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ఉద్ధవ్ సవాల్ చేశారు. దానికి కొనసాగింపుగానే తాజాగా సంజయ్ రౌత్ మాట్లాడారు. -
నాకూ ఆఫర్ ఇచ్చారు.. అందుకే వద్దన్నా: సంజయ్ రౌత్
ముంబై: తిరుగుబాటు వర్గం నుంచి తనకు కూడా ఆఫర్ వచ్చినట్టు శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. గువాహటిలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చేతులు కలిపేందుకు వచ్చిన అవకాశాన్ని తాను తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ఏ తప్పు చేయలేదని కాబట్టే నిర్భయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నాను. అందుకే 10 గంటల పాటు నన్ను విచారించినా బయటకు రాగలిగాను. నేను కూడా గువాహటి వెళ్ళవచ్చు కానీ నేను బాలాసాహెబ్ సైనికుడిని. నిజం మనవైపు ఉన్నప్పుడు, ఎందుకు భయపడాల’ని సంజయ్ రౌత్ అన్నారు. ఏక్నాథ్ షిండే శివసేన ముఖ్యమంత్రి కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ముంబైలో శివసేన బలాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగానే ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కట్టబెట్టిందని ఆరోపించారు. శివసేన పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ వ్యూహం ప్రకారం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తమదే నిజమైన శివసేన అని ఏక్నాథ్ షిండే వర్గం ప్రచారం చేసుకోవడం ఇందులో భాగమని తెలిపారు. శివసేన ఎంపీలంతా తమవైపే ఉన్నారని.. నిజమైన శివసైనికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు. అసలైన శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో ఉందని సంజయ్ రౌత్ దీమా వ్యక్తం చేశారు. కాగా, మనీ ల్యాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 10 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే శివసేన సభ్యత్వం తొలగింపు) -
శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే!
Maharashtra Political Crisis ముంబై: శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్ రౌత్ అనేది ఆ పార్టీ రెబల్స్ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. ‘‘మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్ రౌత్ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు’’ అని రెబల్స్ తరపున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో స్పందించారు. సొంత మనుషులే శివసేనను వెన్నుపోటు పొడిచారని, తనపై ఈడీ కేసు కూడా రాజకీయ ప్రతీకారమంటూ తాజాగా సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. దీపక్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఉద్దవ్ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం’’ అని దీపక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబైకి బయలుదేరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి కోసమే సంజయ్ రౌత్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఉద్దవ్ థాక్రే నిన్న(బుధవారం) రాజీనామా చేశారు. కానీ, మాకు ఆయన్ని తప్పించే ఉద్దేశం లేదు. ఇప్పటికీ మేం శివసేనలోనే ఉన్నాం. ఆయన్ని అగౌరవపరచడం, బాధపెట్టడం మా ఉద్దేశాలు ఎంత మాత్రం కాదు.. అని రెబల్స్ తరపున దీపక్ కేసర్కర్ మీడియాకు తెలిపారు. Maharashtra BJP leader Devendra Fadnavis will decide the oath-taking date. It is the prerogative of the Governor to give him that date. Our negotiations have already started and we will form a govt: Shiv Sena MLA Deepak Kesarkar, spokesperson of the Eknath Shinde camp pic.twitter.com/8skbQ8IgEf — ANI (@ANI) June 30, 2022 చదవండి: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం! -
మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లమీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు(గురువారం) బల నిరూపణ పరీక్ష జరగనుంది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటలలోపు బల పరీక్ష ప్రక్రియ ముగించాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి గవర్నర్ లేఖ రాశారు. దీంతో బలపరీక్షపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు సాయంత్రం 5 గంటలకు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జెట్ స్పీడ్ కంటే వేగంగా.. తాజాగా గవర్నర్ ఆదేశాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ గురువారం బలపరీక్షకు ఆదేశించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా రౌత్ అభివర్ణించారు. గవర్నర్ జెట్ స్పీడ్ కంటే వేగంగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. రాఫెల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదని అన్నారు. అంతేగాక గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బల పరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయిచారని రౌత్ చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు బల పరీక్ష వంటి చర్య ఏదైనా చట్టవిరుద్దమని ఆయన అన్నారు. ‘రెబెల్ మ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫ్లోర్ టెస్ట్ జరగదని మేం చెబుతూనే ఉన్నాం. ఇది చట్టవిరుద్ధమైన చర్య. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ, గవర్నర్ హౌజ్ కలిసి ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతాం. మాతో పోరాడాలనుకుంటే ముందుకు వచ్చి పోరాడండి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి: బలపరీక్ష ఆదేశాలు.. సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ భారీ భద్రత గురువారం బల పరీక్ష నేపథ్యంతో అసెంబ్లీ లోపల, బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఏ కారణంతోనైనా అసెంబ్లీ సమావేశం వాయిదాకు వీల్లేదని అన్నారు. బల పరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు. -
సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు.. షిండే కొడుకు వెటకారం
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శివ సేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తమ ఎదుట హాజరుకావాలని ఇవాళ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో.. సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాల్సి ఉందని ముంబైలోని ఈడీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది ఈడీ. పాత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి.. 1,034 కోట్ల గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్‌కు సంబంధించి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘‘నేను భయపడే రకం కాదు. సీజ్ చేస్తే.. చేస్కోండి, చంపుకోండి.. కాల్చేయండి.. లేదంటే జైలుకు పంపండి’’ అంటూ ఆ సమయంలో ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉంటే.. సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే వెటకారం ప్రదర్శించారు. ‘‘ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్ రౌత్‌కు నా శుభాకాంక్షలు’’ అంటూ ప్రకటన ఇచ్చాడు. అలాగే.. అనర్హత విషయంలో న్యాయస్థానంలో జరుగుతున్న పోరులో రెబల్స్ విజయం సాధిస్తారని ధీమా ప్రకటించాడు. మహారాష్ట్ర ప్రజలు మొత్తం పరిణామాలు చూస్తున్నారని, సరైన టైంలో సరైన బదులు ఇస్తారని పేర్కొన్నాడు. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ చర్చ జరిపి.. ఒక తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని శ్రీకాంత్ షిండే పేర్కొన్నాడు. సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై థాక్రే మద్ధతుదారులు స్పందించారు. షిండే తిరుగుబాటు నేపథ్యంలోనే.. దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. శివ సేన నేత, ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుపై మొదటి నుంచి పార్టీ తరపున గట్టిగా గొంతుక వినిపిస్తున్నారు సంజయ్ రౌత్. ఈ క్రమంలో ఆయనకు ఈడీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారింది. అయితే శివ సేనలో చీలికలకు ఈడీ భయమే కారణమని, ఈడీ ఒత్తిడితో పార్టీని వీడేవాళ్లు నిజమైన బాలాసాహెబ్ భక్తులు కాదని సంజయ్ రౌత్ ఇదివరకే ప్రకటించారు. చదవండి: రెబల్స్‌కు ఆదిత్య థాక్రే వార్నింగ్ -
ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్
ముంబై: మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. మరోవైపు రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం ఉద్దవ్ థాక్రే.. అసెంబ్లీలోనే బలనిరూపణకు పట్టుబడతుంది. ఈ క్రమంలో.. సుప్రీం కోర్టుకు మహా పంచాయితీ చేరుకుంది. అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రెబల్స్ ఇళ్లు, కార్యాలయాలపై శివ సైనికుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం భద్రత కల్పించింది. పదిహేను మంది రెబల్ ఎమ్మెల్యేలకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్‌లో ఏక్నాథ్ షిండే పేరు లేకపోవడం గమనార్హం. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్, సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఆత్మలు చనిపోయాయని, వారి ఉత్త దేహాలు మాత్రమే ముంబైకి తిరిగి వస్తాయని ఆదివారం అన్నారు. ఆ నలభై మంది రెబల్ ఎమ్మెల్యేలు.. బతికి లేరు. తమ చేష్టలతో వాళ్లు వాళ్ల వాళ్ల ఆత్మలను చంపేసుకున్నారు. కేవలం వాళ్ల ఉత్తదేహాలు మాత్రమే మహారాష్ట్రకు తిరిగి వస్తాయి. గువాహతి నుంచి బయటకు అడుగుపెట్టగా.. మనస్ఫూర్తిగా వాళ్లను వాల్లు చంపేసుకున్నట్లే లెక్క. ఆత్మలు లేని వాళ్ల దేహాలు.. పోస్ట్‌మార్టం కోసం వాళ్లను నేరుగా అసెంబ్లీకి పంపడమే మిగిలింది అని రౌత్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలు, అధికార దాహంతోనే ఈ వేరుకుంపటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజుకున్న నిప్పుతో ఏం జరుగుతుందో వాళ్లకు తిరిగొచ్చాక తెలుస్తుందని. అని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ‘వాళ్లు ఇక్కడికి వస్తే.. అసలు తిరుగుబాటు ఎక్కడి మొదలైందో స్పష్టత వస్తుంది. వాళ్లు ఏం కోల్పోతున్నారో వాళ్లకు అర్థం అవుతుంది. నిజమైన సైనికుల తీరు ఇది కాదు. అధికారం కోల్పోయే ప్రసక్తే లేదు.. శివ సేన పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్ రౌత్. చదవండి: రంగంలోకి గవర్నర్.. మహాలో రాష్ట్రపతి పాలన తప్పదా? -
తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్‌థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతోందని, దీనిపై సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. 38 మంది రెబల్ ఎమ్మెల్యే కుటుంబాలకు భద్రతను ఉపసంహరించుకోవడంపై ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ఈ మేరకు సీఎం ఉద్దవ్‌థాక్రేతో పాటు మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాశారు. రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, దుర్మార్గంగా వ్యవహరించొద్దంటూ లేఖలో పేర్కొన్నారాయన. వాళ్లకేదైనా జరిగితే సీఎం థాక్రే, పోలీసులదే బాధ్యత అంటూ హెచ్చరించారు షిండే. Rebel Shiv Sena MLA Eknath Shinde writes to CM Uddhav Thackeray, Maharashtra Home Minister, DGP Maharashtra regarding "Malicious withdrawal of security of family members of the 38 MLAs" "The government is responsible for protecting them and their families," he tweets pic.twitter.com/f4riPwx4xM — ANI (@ANI) June 25, 2022 ఇదిలా ఉంటే.. అనర్హత నోటీసులు జారీ చేసిన డిప్యూటీ స్పీకర్ నరహరి సీతారాం జిర్వాల్‌పై షిండే విమర్శలు ఎక్కువ పెట్టారు. న్యాయ పోరాటానికి దిగుతామని, అవసరమైతే.. డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని షిండే ప్రకటించారు. ఓర్పు నశిస్తే.. శివసేన చాలా పెద్దదని, దానిని ఎవరూ హస్తగతం చేసుకోలేరని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలతో పార్టీ నిర్మాణం జరిగిందని.. దానిని ఎవరూ ధన బలంతో ధ్వంసం చేయలేరని పేర్కొన్నారు. శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. వారిలో సహనం నశిస్తోందని ప్రకటించారు. ఒక వేళ శివ సైనికులు గనుక బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సభకు రండి.. తెలుస్తుంది శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని సవాల్ చేశారు. కాగా.. ఏక్ నాథ్ షిండేతో కలిసి అస్సాం క్యాంపులో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు శనివారం దాడి చేశారు. #WATCH | Shiv Sena workers vandalise office of the party's MLA Tanaji Sawant in Balaji area of Katraj, Pune. Sawant is one of the rebel MLAs from the state and is currently camping in Guwahati, Assam. #MaharashtraPoliticalCrisis pic.twitter.com/LXRSLPxYJC — ANI (@ANI) June 25, 2022 అస్సాం గువాహతిలో రాడిసన్ బ్లూ హెటల్లో రెబల్ ఎమ్మెల్యేలు బస చేశారు. ఆ హోటల్ ముందు అస్సాం శివసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే ముంబైకి వెళ్లి.. ఉద్దవ్ థాక్రేతో కలిసిపోవాలని, సంక్షోభానికి ఓ ముగింపు పలకాలని అస్సాం శివ సేన యూనిట్ చీఫ్ రామ్ నారాయణ్ సింగ్, ఏక్నాథ్ షిండేను కోరుతున్నాడు. షాజీ.. రాష్ట్రపతి పాలన విధించండి శివసేన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, వాళ్ల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఉద్ధవ్ థాక్రేను విడిచిపెట్టి, బాలాసాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని కేంద్రం హోం మంత్రి మిత్ షాను అభ్యర్థిస్తున్నాను. ఉద్ధవ్ ఠాక్రే గూండాయిజానికి స్వస్తి పలకడంతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని ఎంపీ నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. I request Amit Shah to provide security to families of MLAs who are leaving Uddhav Thackeray & making their own decisions, staying connected with Balasaheb's ideology. Uddhav Thackeray's goondaism should be ended...I request for President's Rule in state: Amravati MP Navneet Rana pic.twitter.com/gToy0V0Ugk — ANI (@ANI) June 25, 2022 కాంగ్రెస్, ఎన్సీపీలు.. శివసేన పరిస్థితులు సర్దుమణిగి.. మహా వికాస్ అగాడి కూటమి తిరిగి అధికారం చేపడుతుందనే ధీమాలో ఉన్నాయి. ఈ మేరకు శనివారం శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: శివసేనలో కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే -
పవార్‌ను బెదిరిస్తారా? శివసేన రెబల్స్‌కు ఇక ఛాన్స్‌ల్లేవ్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు రెబల్స్‌కు అల్టిమేటం జారీ చేశారాయన. మహా వికాస్ అఘాడి(కూటమి ప్రభుత్వం)ని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే.. ఇంటికి వెళ్లనివ్వబోమని, రోడ్డుపై అడ్డుకుంటామని ఓ కేంద్ర మంత్రి బెదిరించారు. ఒకవేళ ఈ పని చేసింది బీజేపీనే అయితే.. బయటకు చెప్పుకోండి. ప్రభుత్వం ఉండినా, ఊడినా.. శరద్‌పవార్ లాంటి నేత మీద ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదు అని సంజయ్ రౌత్ ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. महाविकास आघाडीचे सरकार वाचवण्याचा प्रयत्न केला तर शरद पवार यांना घरी जाऊ देणार नाही .रस्त्यात अडवू.अशी धमकी भाजपचा एक केंद्रीय मंत्री देतो.ही भाजपची अधिकृत भूमिका असेल तर तसे जाहीर करा. सरकार टिकेल किंवा जाईल..पण शरद पवार यांच्या बाबत अशी भाषा महाराष्ट्राला मान्य नाहीं@PMOIndia pic.twitter.com/YU1Pc39vCb — Sanjay Raut (@rautsanjay61) June 24, 2022 ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే గూటికి చేరడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా ఆ పార్టీ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాతి అడుగు ఏంటన్నదానిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదు. ఇక సమరమే! సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలంతా పరస్పరం టచ్‌లో ఉన్నాం. మా బలమేంటో పరీక్షలో నెగ్గి చూపిస్తాం. అవకాశాన్ని వదలుకోం.. గెలిచి తీరతాం. వాళ్లు ( రెబల్ ఎమ్మెల్యేలు) చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ముంబైకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇచ్చాం. ఇప్పుడు, ముంబైకి రావాలని వాళ్లను సవాలు చేస్తున్నాం. ఈ పోరాటంలో పశ్చాత్తప పడాల్సిన అవసరం లేదు. ఇంటా(అసెంబ్లీ).. బయటా(రోడ్లపై) గెలిచి తీరతాం. వాళ్లకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఇచ్చాం. కానీ, ఆలస్యమైంది. బలనిరూపణతోనే తేల్చుకోవాలని వాళ్లకు చాలెంజ్ చేస్తున్నా. మహా వికాస్ అగాడి ప్రభుత్వం మిగిలిన రెండున్నరేళ్లు కూడా పూర్తి చేసుకుని తీరుతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. We won't relent...we'll win on floor of the house (State Assembly). If this battle is fought on roads, we'll win that too. We gave opportunity to those who left, now it's too late. I challenge them to come on floor of the house. MVA govt will complete rest of 2.5 yrs: Sanjay Raut pic.twitter.com/OmWtjmuZrs — ANI (@ANI) June 24, 2022 -
మహారాష్ట్ర సంక్షోభం.. హాట్ టాపిక్‌గా మారిన నెంబర్ గేమ్!
ముంబై: మహారాష్ట్ర సస్పెన్స్ అంతకంతకూ పెరిగిపోతుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కఠ రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో నంబర్ గేమ్ హాట్ టాపిక్‌గా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండేకు మద్దతిస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరగుతుంది. తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంబంధిత వార్త: Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన శివసేన, బీజేపీతో చేతులు కలపాలి: షిండే మరోవైపు గౌహతిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రదర్మన నిర్వహించారు. రాడిసన్ హోట్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఓకే వేదికపై వచ్చారు. మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో షిండే వీడియో విడుదల చేశారు. సీఎం పీఠం నుంచి ఉద్దవ్ ఠాక్రే దిగిపోవడం తమకు ముఖ్యం కాదని ఏక్నాథ్ షిండే అన్నారు. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని కోరారు. ఇదిలా ఉండగా గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: సీఎం థాక్రేకు రెబల్ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు శివసేన బలంగా ఉంది: సంజయ్ రౌత్ అయితే గౌహతి గ్రూప్‌లో 22 మంది ఎమ్మెల్యే మద్దతు తమకే ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వారంతా ముంబైకు తిరిగి వస్తున్నట్లు తమకు చెప్పినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మాణం జరిగితే కచ్చితంగా గెలుస్తామన్నారు. థాక్రే మళ్లీ అధికారిక నివాసం వర్షకు వస్తారని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నా శివసేన బలంగా ఉందన్నారు. కొంతమంది ఈడీ భయంతో పార్టీ మారరన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు షిండేతో ఎందుకు వెళ్లారో, పార్టీలో ఎందుకు తిరుగుబాటు ఎందుకు వచ్చిందో తరువాత తెలుస్తుందన్నారు. ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు ఎవరి బలమెంటో తెలుస్తుందన్నారు. బీజేపీ పోస్టర్లు అటు దేవేంద్ర ఫడ్నవీస్‌కు అనుకూలంగా మహారాష్ట్రలో పోర్టు పోస్టర్లు వెలిశాయి. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నాడంటూ బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే.. కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలలో 21 మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వాళ్లంతా ముంబై చేరుకున్నాక పరిస్థితులు చక్కబడతాయన్నారు. ‘రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి కమ్యూనికేట్ చేయకూడదు. ముంబై తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు.. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారని, బలపరీక్షలో అధికార కూటమి మహా వికాస్ అఘాడి గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు’ అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంబంధిత వార్త: శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్! MLAs should not communicate from Guwahati, they should come back to Mumbai and discuss all this with CM. We are ready to consider exiting out of MVA if this is the will of all MLAs, but for that, they have to come here & discuss it with the CM: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/295dmSFsjy — ANI (@ANI) June 23, 2022 మరోవైపు శివసేన పార్టీ పూర్తి ఆధిపత్యంపై ఏక్నాథ్ షిండే పట్టు సాధించారు. గౌహతి హోటల్ నుంచి మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేశారు. 42 మందిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. విల్లు బాణం గుర్తు కోసం ఈసీకీ లేఖ రాసే యోచనలో షిండే ఉన్నారు. శివసేన పార్టీ సింబల్ తమకే కేటాయించాలని అంటున్నారు. కాగా ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. -
శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు పూట పూటకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే ఊహాగానాల నడుమ.. శివ సేన కీలక నేత సంజయ్ రౌత్ తాజా ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని ఆయన మీడియాకు చెప్పడం విశేషం. ఈ తరుణంలో.. దొరికిన అవకాశం చేజార్చుకోవద్దని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అస్సాం నుంచే ఇది మొదలైనట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో సహా మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివ సేన రెబల్స్ గనుక తమతో చేతులు కలపాలని, బదులుగా భారీగా పోర్ట్‌పోలియో వాళ్ల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రెబల్స్ గనుక తమతో కలిసి వస్తే.. ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్ చేసింది. ఒకవేళ శివ సేన ఎంపీలు గనుక వస్తే.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్లు భోగట్టా. ఇదిలా ఉంటే.. సీఎం ఉద్దవ్ థాక్రేను కలవకుండానే.. ఏక్నాథ్ షిండే మూడు పేజీల లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని సంజయ్ రౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్‌లోనే 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వాళ్లు ముంబైకి రాగానే పరిస్థితి సర్దుమణుగుతుందని రౌత్ ప్రకటించడం గమనార్హం. ఈడీకి భయపడి శివసేనకు ద్రోహం చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరంటూ సంజయ్ రౌత్ మీడియాతో వ్యాఖ్యానించారు. బలపరీక్ష ఎప్పుడు జరుగుతుందో అందరూ చూస్తారు, పార్టీని వీడే వారు బాలాసాహెబ్ భక్తులు కాదు.. ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే ఎలాంటి భేటీ నిర్వహించబోవడం లేదంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..? -
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
‘మహా’ సంక్షోభం: సీఎం ఉద్దవ్‌థాక్రే రాజీనామా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆ శివసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.. ఇప్పటికే ట్విట్టర్ ఖాతాలో ఉన్న మంత్రి హోదాను తొలగించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం కేబినెట్ భేటి జరగనుంది. అలాగే, సాయంత్రం 5 గంటలకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ థ్రాకే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने.. — Sanjay Raut (@rautsanjay61) June 22, 2022 -
Maharashtra Political Crisis:ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!
మహారాష్ట్రలో మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగరనుందనే ఊహాగానాల నడుమ.. శివ సేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. బీజేపీపై మండిపడ్డారు. శివ సేన నేత ఏక్నాథ్ షిండే, కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు బలంగానే సాగుతున్నాయి. కానీ, బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లా కాదు. చాలా వేరుగా ఉంటుంది ఇక్కడి రాజకీయం. ఏక్నాథ్ షిండే నిజమైన శివ సైనికుడు. ఎంతో నమ్మకస్థుడు.. నిజాయితీ పరుడు కూడా. ఆయన ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు సంజయ్ రౌత్. ఇదిలా ఉంటే రౌత్ వ్యాఖ్యలపై.. బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ కౌంటర్ ఇచ్చారు. Some MLAs of Shiv Sena and Eknath Shinde are currently not reachable. Efforts are being made to topple the MVA government but BJP has to remember that Maharashtra is very different from Rajasthan or Madhya Pradesh: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/cDUFjfm9pf — ANI (@ANI) June 21, 2022 మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయలేదు. అంతేకాదు ప్రజా ప్రతినిధులు కూడా ఆ విషయంలో అసంతృప్తిగా ఉందనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల్లా కాదేమో.. కానీ, అది వాళ్ల (శివ సేనను ఉద్దేశిస్తూ..) సొత్తేం కాదు. బీజేపీ ఇక్కడ పెద్ద పార్టీ. దేవేంద్ర ఫడ్నవిస్ గొప్ప నేత. రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో అంతా చూస్తున్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం ఏది మంచిదో అది చేసి తీరతాం. అంతేకానీ అధికారం కోసం కాదు. అధికారం కంటే.. ప్రజలే ముఖ్యం అని పేర్కొన్నారు ప్రవీణ్ దరేకర్. Maharashtra is different but is it their property? BJP is the largest party here, Devendra Fadnavis a popular leader. It is nobody's property. It can see what you did in 2.5 yrs. It's our duty to set things right. We care for Maharashtra, they care about power: Pravin Darekar,BJP https://t.co/hpGw5IinrK pic.twitter.com/xNSgi1akQy — ANI (@ANI) June 21, 2022 బీజేపీది అధికార దుర్వినియోగం క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో.. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత నానా పటోల్ స్పందించారు. బీజేపీ గెలుపు గెలుపే కాదని, చివరికి సత్యమే గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేతలతో ఇవాళ(మంగళవారం) భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారాయన. BJP misuses its power, they are taking the Indian democracy towards untruthfulness. I am sure the truth will win. I have called a meeting of all Maharashtra Congress leaders today: Maharashtra Congress leader Nana Patole on MLC elections pic.twitter.com/KRtbJdCdYs — ANI (@ANI) June 21, 2022 -
ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
ముంబై: మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థిని ఎంవీఏ గెలిపించుకోలేకపోయింది. బీజేపీ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురువేసి అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చింది. ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తలొక సీట్ దక్కించుకున్నాయి. ఎవరెవరికి ఎన్ని ఓట్లు? ఆరో స్థానానికి జరిగిన పోటీలో బీజేపీకి చెందిన ధనంజయ్ మహాడిక్.. శివసేన అభ్యర్థి సంజయ్ పవార్‌పై విజయం సాధించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామున ఫలితాలు వచ్చాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ నుంచి గెలిచిన పియూష్ గోయల్, డాక్టర్ అనీల్ బోండేలకు 48 ఓట్ల చొప్పున వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ఘరీకి 44, ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్‌కు 43 ఓట్లు, శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్ 41 దక్కించుకున్నారు. ధనంజయ్ మహాడిక్ 41.56 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ విజయం చాలా చిన్నది ఆరో స్థానంలో పోటీ చేసిన ధనంజయ్ మహాడిక్ గెలిచారని తాము భావించడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తమ అభ్యర్థి సంజయ్ పవార్‌కు 33 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని, మహాడిక్ 27 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారని వెల్లడించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి గట్టెక్కారని ఎద్దేవా చేశారు. బీజేపీ విజయం చాలా చిన్నదని వ్యాఖ్యానించారు. ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది.. రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు ఉందని వ్యాఖ్యానించారు. హనుమాన్ చాలీసాను అవమానించిన వారు ఓడిపోయారని.. దానిని గౌరవించి, దాని కోసం పోరాడిన వారు గెలిచారని అన్నారు. ‘ఎన్నికలు కేవలం పోరాటం కోసమే కాదు గెలుపు కోసమే. జై మహారాష్ట్ర’ అంటూ ట్వీట్ చేశారు. శివసేన నుంచి గెలిచిన సంజయ్ రౌత్ కంటే ఆరో స్థానంలో విజయం సాధించిన తమ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయని వెల్లడించారు. (క్లిక్: బీజేపీ ఎమ్మెల్యే సస్పెండ్.. ఎందుకో తెలుసా..?) ఫడ్నవీస్‌కు పెద్దాయన ప్రశంస రాజ్యసభ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ అద్భుతం చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రత్యర్థి శిబిరాల నుండి ‘విభిన్న మార్గాల’ ద్వారా దూరం చేసి ‘అద్భుతం’ చేశారని కొనియాడారు. ఆరో స్థానంలో శివసేన అభ్యర్థి ఓడిపోడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. సంఖ్యా బలం లేకపోయినప్పటికీ ఆరో సీటును గెలవడానికి తమ కూటమి సాహసోపేతమైన ప్రయత్నం చేసిందన్నారు. అయితే తమ కూటమి నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి పడలేదని, స్వతంత్రులను బీజేపీ తమవైపు తిప్పుకోవడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని ఎంవీఏ ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబిస్తూ.. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని శరద్ పవార్ స్పష్టం చేశారు. (క్లిక్: బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్) -
డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్
ముంబై: రాజ్యసభ ఎన్నికల తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేయాలనుకుంటోందని, ఈ క్రమంలో వారిపై ఒత్తిడి తెస్తోందని శివసేన నేత సంజయ్‌రౌత్ ఆరోపించారు. ఈనెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీ సంకీర్ణ కూటమి (ఎంవీఏ) నాలుగు సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం తరఫున ఏ పార్టీలనూ, ఎమ్మెల్యేలను ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. శివసేన –ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ ఆరు సీట్లలో నాలుగు సీట్లను కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, కాషాయ పార్టీకి ‘డబ్బులు వృధా చేసుకోవద్దని’ సూచించారు. ‘మూడో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ రాజ్యసభ ఎన్నికలలో అనైతికంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వారికి మూడో అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం ఆ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీలపై ఆధారపడుతోంది. ఓట్లకోసం వారిపై ఒత్తిడి తెస్తోందని మాకు మొత్తం సమాచారం అందుతోంది’ అని రౌత్ విమర్శించారు. ‘మహావికాస్ ఆఘాడీ కూడా ఎన్నికలను సీరియస్‌గా తీసుకునే పోరాడుతోంది. అయితే మా వద్ద లేనిది ఈడీ మాత్రమే’ అని రౌత్ కేంద్రంలోని బీజేపీకి చురకలు అంటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ప్రలోభపరచడం, వారిని డబ్బులతో కొనడం ద్వారా ఎన్నికలలో లాభపడాలని కాషాయ పార్టీ ఆలోచన.. అయితే వారికి ఒకటే సలహా ఇస్తున్నాను..వారు డబ్బును వృధా చేయకూడదు (ఎన్నికల కోసం), బదులుగా దానిని సమాజ సేవకోసం ఉపయోగించాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు. అయితే శనివారం లాతూర్‌లో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను రౌత్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా ఆయన నిరాకరించారు. అసలు ‘సంజయ్ రౌత్ ఎవరు? ఆయన ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నేను వారికి ఎందుకు సమాధానం చెప్పాలి?’అని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, మాజీ ఎంపీ ధనంజయ్ మహదిక్‌లను తమ అభ్యర్థులుగా నిలబెట్టిన విషయం తెలిసిందే. చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు ► శివసేన సంజయ్ రౌత్, సంజయ్ పవార్లను తమ అభ్యర్థులుగా నిలబెట్టింది. ►ఎన్సీపీ ప్రఫుల్ పటేల్ పేరును మళ్లీ ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఇమ్రాన్ ప్రతాప్‌గఢ్‌ని బరిలోకి దింపింది. ►ఆరో సీటు కోసం బీజేపీకి చెందిన మహాదిక్, సేనకు చెందిన పవార్ మధ్య పోరు సాగుతోంది. -
ఎంఎన్ఎస్కు బీజేపీ ‘కాంట్రాక్ట్’
ముంబై: మహారాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి బీజేపీ నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కాంట్రాక్టు తీసుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎంఎన్ఎస్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో ఎంఎన్ఎస్ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ‘శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ‘కాంట్రాక్ట్’ కుదుర్చుకున్నంత మాత్రాన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినద’ని ఉద్ఘాటించారు. మే 4వ తేదీలోపు మసీదుల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే అల్టిమేటం జారీ చేశారు. ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన మహారాష్ట్ర దినోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘మే 4 నుంచి మేము వినం. మీరు మీ లౌడ్ స్పీకర్లతో ఇబ్బందిని సృష్టించడం కొనసాగిస్తే, మేము హనుమాన్ చాలీసాను మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో ప్రసారం చేస్తామ’ని రాజ్ థాకరే హెచ్చరించారు. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో రాజ్ థాకరే వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘శివసేనను లక్ష్యంగా చేసుకుని మే 1న ముంబైలో బీజేపీ ‘బూస్టర్ డోస్’ ర్యాలీని ప్లాన్ చేయగా, ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో బీజేపీ ఉంపుడుగత్తె ఎమ్ఎన్ఎస్.. శరద్ పవార్‌ను లక్ష్యంగా చేసుకుంద’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. మహా వికాస్ అఘాదీని ఎదుర్కోవడానికి కొన్ని చిన్న పార్టీలను బీజేపీ వాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించాలని భ్రమల్లో ఉన్నవారు.. వాస్తవంలోకి రావాలని సూచించారు. (క్లిక్: కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన సీనియర్ నేతలు) -
నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
సాక్షి, ముంబై: అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీ-గ్యాంగ్‌తో సంబంధాలున్న యూసుఫ్ లఖడీవాలా నుంచి ఆమె 80 లక్షలు రుణం తీసుకున్నారన్నారని ఆరోపించారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నాడని.. అతనితో సంబంధాలున్న అందరినీ ఈడీ విచారిస్తోందని తెలిపారు. మరి ఎంపీ నవనీత్ రాణా ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కాదా అని అన్నారు. ఆ దంపతులను ఈ కేసుల నుంచి బయటపడేసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని అన్నారు. యూసుఫ్ లఖడీవాలాకు చెందిన అక్రమ సొమ్ము నవనీత్ కౌర్-రాణా దంపతుల ఖాతాల్లో ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. చదవండి👉🏾 అక్కడ గెలుపే టార్గెట్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ డీ-గ్యాంగ్‌తో వారికున్న లింకులపై విచారణ చేపట్టాలని ముంబై ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులకు సంజయ్ రౌత్ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారం రాత్రి ట్వీట్ చేసిన ఆయన ప్రధాని మోదీ, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్యాగ్ చేశారు. కాగా, ఇప్పటికే దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నవనీత్ కౌర్-రాణా దంపతులపై తాజా ఆరోపణలను బట్టిచూస్తే మరో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన యూసుఫ్ లఖడీవాలా ఆర్థర్ రోడ్ జైలులో గతేడాది సెప్టెంబర్‌లో మరణించడం గమనార్హం. अंडरवर्ल्ड कनेक्शन : लकड़ावाला को ED ने ₹200 करोड़ के मनी लांड्रिंग केस में अरेस्ट किया था, लॉकअप में ही उसकी डेथ हो गई। यूसुफ की गैरकानूनी कमाई का हिस्सा अब भी नवनीत राणा के अकाउंट में है।तो ED कब पिलाएगी राणा को चाय?क्यों बचाया जा रहा है इस D-गैंग को? बीजेपी चूप क्यूँ हैं? pic.twitter.com/hJ1itnitlL — Sanjay Raut (@rautsanjay61) April 27, 2022 చదవండి👉 తమిళనాడులో మళ్లీ లాక్డౌన్?.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ -
రెచ్చిపోవద్దు.. ఊరుకోం! నవనీత్ కౌర్‌కు హెచ్చరికలు
ముంబై: మహానగరంలో ‘హనుమాన్ చాలీసా’ ఛాలెంజ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీకి ఎలాగైనా చేరుకుని హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నగర వ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. చాలెంజ్ ప్రకారం.. ఎలాగైనా మాతోశ్రీని తన అనుచరులతో చేరుకోవాలని ఎంపీ నవనీత్‌కౌర్, ఆమె భర్త రవి రానాలు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నవనీత్‌ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టనివ్వకుండా శివ సేన కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇక ఈ పరిణామాలపై సేన నేత, ఉద్దవ్ థాక్రే ముఖ్యఅనుచరుడు సంజయ్ రౌత్ స్పందించాడు. ఎవరైనా మాతోశ్రీని చేరుకునే ప్రయత్నాలు చేసినా చూస్తూ ఊరుకోవద్దంటూ శివ సైనికులకు సూచించాడు. ‘‘అలా చేస్తూ చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దమ్ముంటే రండి. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ భాషకు మీ భాషలోనే సమాధానం ఎలా ఇవ్వాలో శివ సైనికులకు బాగా తెలుసు. బీజేపీ అండతో ఆమె(నవనీత్‌కౌర్‌ను ఉద్దేశించి) రెచ్చిపోతున్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉంది’’ అంటూ స్పందించాడు ఎంపీ సంజయ్ రౌత్. అంతేకాదు రాష్ట్రపతి పాలన ప్రస్తావనపై స్పందిస్తూ.. కేంద్రం చర్యలకు బెదిరే ప్రసక్తే లేదంటూ బదులిచ్చాడు. ఆజాన్, లౌడ్‌స్పీకర్ వివాదాలు నడుస్తున్న వేళ.. ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు, సీఎం ఉద్దవ్ థాక్రేను హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పఠించాలంటూ సవాల్ విసిరారు. లేకుంటే.. తాము మాతోశ్రీ ఎదుటకు వచ్చి హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ పేర్కొన్నారు. ఈ తరుణంలో అప్రమత్తమైన శివ సేన కార్యకర్తలు ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట నిరసనలు శనివారం మోహరించారు. దీంతో ఆమె, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే వాళ్ల దాడి నుంచి మాతోశ్రీని రక్షించుకునే ప్రయత్నమే తమదని సేన కార్యకర్తలు చెబుతున్నారు. ఓ పక్క ముంబై పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పొలిటికల్ జంటకు శుక్రవారం నోటీసులు జారీ చేయగా.. మరోవైపు కేంద్రం అమరావతి లోక్‌సభ సభ్యురాలైన నవనీత్ కౌర్‌కు కేంద్ర సాయుధ కమాండోలతో వీఐపీ భద్రత కలిపించడం విశేషం. చదవండి👉🏼: మేం తగ్గం.. ఆ పని చేసి తీరతాం -
పాలిటిక్స్‌లో మరో సంచలనం.. ముంబై వేదికగా సీఎంల మీటింగ్.!
సాక్షి, ముంబై: దేశంలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ప్రస్తుతం దేశం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై వేదిక కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్టు తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవారు చర్చించారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి మాట్లాడాలని 13 విపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎం సమావేశం జరుగనుండటం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. హిందూ ఒవైసీ.. మరోవైపు.. మహారాష్ట్రలో పరిస్థితులపై సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాజ్ ఠాక్రే ‘హిందూ ఒవైసీ’ అని, ఎంఎన్ఎస్ ‘హిందుత్వ మజ్లిస్ పార్టీ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్ థాక్రే.. బీజేపీ అండతోనే ఇలాంటి కొన్ని విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. ఇది చదవండి: శ్రీరాముడి ఆలోచనకే అది వ్యతిరేకం.. -
మోదీ, అమిత్ షా ఇలాఖాలో దాడులు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్బంగా చోటుచేసుకున్న ఘర్షణలపై రౌత్.. ‘సామ్నా’ పత్రిక వేదికగా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలను ఎండగట్టారు. కాగా, దేశంలో మతకల్లోలాలను రేకెత్తించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహమని సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో జరుగుతున్న పరిణామాలను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడని ఎద్దేవా చేశారు. పండుగ సందర్భంగా చెలరేగిన హింస శ్రీరాముడి ఆలోచనకే వ్యతిరేకమని అన్నారు. రామ మందిర ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో కత్తులు దూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మతకల్లోలాలను రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగానే కొన్నేళ్ల క్రితం శ్రీరామ నవమి వేడుకలు సంస్కృతికి వారధిగా ఉండేవని, ఇప్పుడు మత విద్వేషాలకు రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని విమర్శించారు. ఇలాంటి పనులు శ్రీరాముడి ఆలోచనలకే విరుద్ధమని తెలిపారు. ‘అసలు శ్రీరామనవమి రోజు ఎందుకు హింస జరిగింది? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత ఇలాఖా అయిన గుజరాత్లో శ్రీరామ నవమి యాత్రపై ముస్లింలు దాడి చేస్తారని ఎవరైనా నమ్ముతారా?’ అంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నవమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఇది మంచి సంకేతం కాదని రౌత్ పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని రౌత్ ఆరోపించారు. -
సంజయ్ రౌత్‌కు షాకిచ్చిన ఈడీ
న్యూఢిల్లీ/ముంబై: భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ముంబైలోని పత్రా చాల్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకల కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ కింద రౌత్ భార్య వర్ష రౌత్, మరో నిందితుడు వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్, ఆయన భార్య స్వప్న పాట్కర్‌కు చెందిన ఆస్తుల్ని అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు మంగళవారం ప్రకటించారు. చదవండి: కాంగ్రెస్‌కు అహ్మద్ పటేల్ కుమారుడు షాక్! అలీబాగ్‌లో ఎనిమిది స్థలాలు, దాదర్ శివార్లలో ఒక ఫ్లాట్ ఈడీ అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. రూ.1,034 కోట్ల భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఫిబ్రవరిలో ప్రవీణ్ రౌత్‌ను అరెస్ట్ చేశారు. చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్‌పై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈడీని అడ్డం పెట్టుకొని మరాఠీ మధ్య తరగతిపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు ఈ విషయం గ్రహించాలన్నారు. ‘‘వీటికి బెదరను. లొంగిపోను. ఎంతవరకైనా ప్రతిఘటిస్తా’’ అని స్పష్టం చేశారు. చదవండి: రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆస్తులూ అటాచ్ మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కి చెందిన రూ.4.81 కోట్లకు పైగా ఆస్తుల్ని కూడా అటాచ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. జైన్, ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. జైన్ 2015–16లో ప్రభుత్వాధికారిగా ఉండగా ఆయన కుటుంబీకుల కంపెనీలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. -
ఎంఐఎంతో జట్టు కట్టం: శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్.. కాస్త కటువుగానే స్పందించారు. ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్ జలీల్‌ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్. అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్, భారతరత్న’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్ లేదా భారతరత్న పురస్కారాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం. అఖిలేశ్ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయి. 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయారు? నాలుగు రాష్ట్రాలలో బీజేపీ గెలిచినప్పటికీ.. పంజాబ్ ఓటర్లు కమలం పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా సీనియర్ నేతలంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పంజాబ్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే.. పంజాబ్‌లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని వెల్లడించారు. బీజేపీ వంటి జాతీయ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఆలోచించదగ్గ విషయని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. బీజేపీకి బీ టీమ్.. యూపీ ఎన్నికల్లో బీజేపీకి బీఎస్పీ, ఎంఐఎం బీ టీమ్ పనిచేశాయని ప్రత్యర్థి పార్టీలు బలంగా ఆరోపించాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఈ రెండు పార్టీలు పనిచేశాయని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు తోసిపుచ్చాయి. తాము బీజేపీకి బీ టీమ్ అని తప్పుడు ప్రచారం చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని బీఎస్పీ అధినేత్రి మాయావతి వాపోయారు. బీజేపీని ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె అన్నారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ఉత్తరప్రదేశ్‌లోని మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. (చదవండి: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
నిన్న బీజేపీపై కామెంట్స్.. నేడు మంత్రి ఇంటికి ఈడీ ఎంట్రీ
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకు బీజేపీ, శివసేన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇంతలోనే బుధవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం బుధవారం ఉదయం ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. ముంబై అండర్ వరల్డ్ డాన్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మాలిక్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నవాబ్ మాలిక్‌ను విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఏజెన్సీ మాలిక్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు నవాబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ బరిలో దిగనున్నారన్న వార్తలపై మాలిక్ స్పందించారు. బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈడీ చర్యపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. మాలిక్‌ను అతని ఇంటి నుండి ఏజెన్సీ తీసుకువెళ్లిన విధానం మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేసే విధంగా ఉందని విమర్శించారు. నవాబ్ మాలిక్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అని అన్నారు. ఒక మంత్రిని రాష్ట్రానికి వచ్చి కేంద్ర ఏజెన్సీలు ఇలా తీసుకువెళ్తాయా అని ప్రశ్నించారు. 2024 తర్వాత మీరు కూడా(బీజేపీ) ఇలాగే విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండానే మాలిక్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారని మహారాష్ట్ర ఎన్సీపీ అధినేత, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ అన్నారు. అయితే, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలు, అక్రమ ఆస్తుల లావాదేవీలు, హవాలాకు సంబంధించి ముంబైలో ఫిబ్రవరి 15న ఈడీ కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే నవాబ్ మాలిక్‌ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. Today morning the ED had come to @nawabmalikncp saheb's residence. They accompanied saheb in his vehicle to the ED office. Advocate Amir Malik, Saheb's son has accompanied saheb along with. — Office of Nawab Malik (@OfficeofNM) February 23, 2022 -
‘ఆయనకా సామర్థ్యముంది’.. కేసీఆర్‌పై శివసేన ఎంపీ ప్రశంసలు
నాగపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరినీ కలుపుకుని ఒక్కతాటిపై ముందుకు తీసుకెళ్లగలరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆ సామర్థ్యం ఆయనలో ఉందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘కేసీఆర్ చాలా కష్టపడి పని చేసే నాయకుడు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు నడపగల సామర్థ్యం కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు కోసం బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగడతానని కేసీఆర్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఆ ప్రయత్నాల్లో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఆదివారం ముంబై వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై, బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. భావ సారూప్య పారీ్టలన్నింటితో మాట్లాడుతున్నామని, త్వరలో అంతా సమావేశమై భావి కార్యాచరణకు రూపమిస్తామని అనంతరం సీఎంలిద్దరూ ప్రకటించారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. దేశం కోసం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు వారిద్దరూ చెప్పారు. పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులతో కూడా కేసీఆర్ ఇటీవల ఫోన్లో చర్చలు జరపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలో రాజకీయ మార్పు ఆవశ్యకత తదితరాలపై ఆదివారం నాటి భేటీలో కేసీఆర్, ఠాక్రే లోతుగా చర్చించుకున్నారని రౌత్ వివరించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు కొనసాగింపుగా మరికొందరు ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి వారు త్వరలో మరోసారి భేటీ అవుతారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ ప్రక్రియను కేసీఆర్–ఠాక్రే భేటీ వేగవంతం చేస్తుందని శివసేన పత్రిక సామ్నా ఆదివారం అభిప్రాయపడింది. కాంగ్రెస్ లేకుండా కూటమి లేదు కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు అసాధ్యమని సంజయ్ రౌత్ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని శివసేన ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పడాలని మమతా బెనర్జీ సూచించినప్పుడు కాంగ్రెస్‌ను కూడా అందులో భాగస్వామిని చేసుకోవాలన్న తొలి పార్టీ శివసేనే అని గుర్తు చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వాములన్న విషయం తెలిసిందే. బీజేపీపై రౌత్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకోవడం దానికి అలవాటేనంటూ దుయ్యబట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఆ పార్టీ నేతల ప్రకటనలే అందుకు రుజువని అన్నారు. -
బీజేపీ మంత్రికి శివసేన వార్నింగ్.. మేము మీకు ‘బాప్’ అంటూ..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అధికార శివసేన, బీజేపీ నేతల మధ్య మాటల యుద్థం నడుస్తోంది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందకు రాణే శుక్రవారం మాట్లాడుతూ.. థాక్రే కుటుంబం, శివసేన జాతకం తన వద్ద ఉందని ఎవరినీ విడిచిపెట్టమంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో నలుగురు వ్యక్తుల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులను తాము లెక్కచేయమని, రాణే జాతకం కూడా తన వద్ద ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మీరు కేంద్ర మంత్రి కావచ్చు.. కానీ ఇది మహారాష్ట్ర.. మేము మీకు ‘బాప్’ ఇది మర్చిపోవద్దంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తాము నిజంగా కుంభకోణాలకు పాల్పడితే వాటికి సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపీ సోమయ్యకు సోమయ్యకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగానే తాము కూడా సోమయ్యకు సంబంధించిన కుంభకోణాలను బయటపెడతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమయ్య పోవాయ్‌లోని పెరూ బాగ్‌లో మురికివాడల పునరావాస ప్రాజెక్ట్ ద్వారా సోమయ్య రూ. 300 కోట్లకు పైగా దోపిడీ చేశారని రౌత్ ఆరోపించారు. అలాగే, పాల్ఘార్లో రూ. 260 కోట్ల విలువైన ప్రాజెక్ట్ విషయంలో కుంభకోణాన్ని బయటపెడతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న క్రిమినల్ సిండికేట్‌ను అంతం చేస్తామంటూ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
పార్టీ మారకుంటే రాష్ట్రపతి పాలనేనట!
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలోకి మారాలని లేదంటే రాష్ట్రపతిపాలనకు సైతం వెనకాడబోమని కేంద్రంలోని మోదీ సర్కార్ హెచ్చరికలు చేస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు. దర్యాప్తు సంస్థలు సోదాలు, ఆకస్మిక దాడుల పేరిట మహా వికాస్ అఘాడీ సర్కార్‌లోని అగ్ర నేతలను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సంజయ్ వ్యాఖ్యానించారు. చదవండి: (సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్) ‘‘దాదాపు 20 రోజుల క్రితం కొందరు బీజేపీ నేతలు నన్ను కలిశారు. ‘ఇకపై మాకు విధేయతతో పనిచేయండి. ఏం చేసైనా సరే మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయాలి. రాష్ట్రపతి పాలనకు వెళ్దాం. లేదంటే కూటమిలో చీలిక తెచ్చి ఒక వర్గం ఎమ్మెల్యేలను బయటకు తెద్దాం. మరో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేద్దాం. ఇందుకు మీరు ఒప్పుకోవాలి. దర్యాప్తు సంస్థల దాడులు తప్పవు’’ అని ఆ బీజేపీ నేతలు నాతో చెప్పారని సంజయ్ వెల్లడించారు. వారు చెప్పినట్లు ఆ తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుటుంబ సభ్యుల సంస్థలు, వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిగాయని సంజయ్ గుర్తుచేశారు. చదవండి: (పరీక్షలను బహిష్కరించిన విద్యార్థినులు) ‘నా కుమార్తె పెళ్లికి పనిచేసిన వారినీ ఈడీ వదిలిపెట్టలేదు. పూలు సరఫరా చేసిన వారిని, అలంకరణ చేసిన వారిని, బ్యూటీషియన్‌ను, చివరకు టైలర్‌నూ ప్రశ్నించారు. ఈడీ అంశాన్ని అదే రోజు రాత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చాను. ‘మీరు పెద్ద నేత. హోం మంత్రి. ఇదంతా సరైన పద్ధతి కాదు’ అని చెప్పాను’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోనూ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. -
బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పల్ పారికర్‌కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఉత్పల్ పారికర్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే (కాంగ్రెస్, ఆప్, తృణమూళ్)తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు. ఇలా చేయడం మాజీ సీఎం మనోహర్ పారికర్‌కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు. మరోవైపు ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఉత్పల్ ఆప్‌లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది. If #UtpalParrikar contests Independent frm Panaji seat,I propose all non-BJP parties including @AamAadmiParty @INCIndia @AITCofficial @Goaforwardparty shd support his candidature & not field a candidate against him. This will be a true tribute to ManoharBhai!#Goa pic.twitter.com/q0w96MxZk9 — Sanjay Raut (@rautsanjay61) January 17, 2022 -
యూపీ ఎన్నికల బరిలో శివసేన.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందంటే!
లక్నో: అయిదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో దేశంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికల, ప్రచార వ్యూహాలతో జిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న యూపీ ఎన్నికలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో తాము కూడా బరిలో దిగబోతున్నామని చెప్పారు. యూపీలో రాజకీయ అనిశ్చితి ఉందన్న ఆయన.. యోగి పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. బీజేపీని గద్దె దించేందుకు ఎస్పీ, బీఎస్పీ సహా అన్ని పార్టీలు ఏకీకృతం కావాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అటు ఎన్నికలకు ముందు కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సహా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని సంజయ్ రౌత్ అన్నారు. చదవండి: 10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'.. ప్లాన్ రెడీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ విపక్ష ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఎస్పీ, స్థానిక చిన్న పార్టీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఏం కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఇదిలా ఉండగా మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో.. -
ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ..
సాక్షి, ముంబై(మహారాష్ట్ర): ప్రతి ఒక్కరు తమ జీవితంలో వివాహ వేడుకను గొప్పగా జరుపుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా.. మెహందీ,సంగీత్ వంటి అనేక కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు హజరై డ్యాన్స్‌లు చేస్తుంటారు. పెళ్లివేడుకలలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, పెళ్లి వేడుక డ్యాన్స్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుమార్తె పూర్వాన్షి వివాహం సోమవారం ముంబైలోని ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హజరయ్యారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే కూడా తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకకు హజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా.. సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనిలో ఎంపీ సంజయ్‌రౌత్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయాతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేసి.. వివాహ వేడుకకు హజరైన అతిథులను ఉల్లాసపరిచారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా వీరితో పాటు కలిసి హుషారైన స్టెప్పులు వేశారు. ఎంపీ సుప్రీయా సులే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె . పూర్వాన్షి రౌత్‌కు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మల్హార్ నర్వేకర్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఈయన తండ్రి రాజేష్ నర్వేకర్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
తెరుచుకోనున్న సినిమా హాళ్లు.. ‘తెరవడం అవసరమా?’
మహారాష్ట్రలో సినిమా థియేటర్లను మళ్లీ తెరిచేందుకు రాష్ట్ర సర్కారు ఎట్టకేలకు ఒప్పుకుంది. దీంతో అక్టోబర్ 22 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. అయితే ప్రతిపక్ష బీజేపీ.. ప్రజలకు వినోదం అందిస్తోందని, థియేటర్లు తెరవాల్సిన అవసరం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సెటైర్లు పేల్చారు. ముంబై: మహారాష్ట్రలోని సినిమా హాళ్లు, థియేటర్లను అక్టోబర్ 22వ తేదీ నుంచి తెరిచేందుకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే జారీచేస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమైన సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సీతారాం కుంటే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, సినీ నిర్మాతలు రోహిత్ శెట్టి, కునాల్ కపూర్, మకరంద్ దేశ్‌పాండే, మరాఠీ నటులు సుభోద్ భావే, ఆదేశ్ బండేకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని ఆలయాలను అక్టోబర్ 7వ తేదీ నుంచి తెరుస్తామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీచేసింది. అలాగే, అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించింది. (ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్.. సిద్ధమైన ప్రతిపాదనలు) బీజేపీ ఉండగా.. థియేటర్లు తెరవడం అవసరమా? రాష్ట్ర ప్రజలను రంజింపజేయడానికి బీజేపీ ఉండగా, సినిమా థియేటర్లను తెరవడం అవసరమా అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శివసేనకు చెందిన సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన ఆయన, బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ అన్ని పరిమితులను దాటి వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరోనా, ఆంక్షలు ఉన్నప్పటికీ రాజకీయ డ్రామాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష బీజేపీ ఆడుతున్న డ్రామాలో మిస్టరీతో పాటు కామెడీ కూడా ఉందన్నారు. ప్రస్తుత ప్రతిపక్షం కామెడీ చేస్తోందని, ప్రజా ఉపయోగ పనులు చేయకుండా, ఇతరులను ఈడీ విచారణల పేరుతో భయపెట్టడం, వ్యక్తిత్వాలను మంటగలపడం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. (చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ) -
పరిమితిని తొలగిస్తేనే మరాఠా రిజర్వేషన్లు
ముంబై: రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తప్ప మరాఠా కోటా రిజర్వేషన్లను అమలు చేయలేమని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ వ్యాఖ్యానించారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరాఠా కోటా గురించే తాను సీఎంతో చర్చించినట్లు తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సీఎంకు వివరించానన్నారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ అఖిలపక్ష నాయకులతో వర్చువల్‌గా భేటీ అవుతారని వెల్లడించారు. రాష్ట్రాలు ఓబీసీ జాబితా రూపొందించుకునేలా అధికారం కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడితే చర్చకు పట్టుబడతానని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల పొత్తు గురించి మాట్లాడేందుకు సంజయ్ రావుత్ నిరాకరించారు. డిసెంబర్ 28వ తేదీన రాహుల్ గాంధీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డిసెంబర్ నెల ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటివరకు ఏం జరుగుతుందో చూద్దామని సమాధానమిచ్చారు. -
ఉద్దవ్ ఠాక్రే ఫోన్ నెంబర్ ఉన్నా ఆశ్చర్యం లేదు: శివసేన
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది.ముఖ్యంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రేగినప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నేతల్లో ఆందోళనకు దారి తీసింది. దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా, శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై మండిపడ్డారు. ముఖ్యులు, జర్నలిస్టుల ఫోన్ కాల్స్‌పై ఒక విదేశీ సంస్థ నిఘా చాలా తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఫోన్ కూడా ట్యాప్ చేసినా ఆశ్యర్యం లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో చర్చించినట్లు రౌత్ చెప్పారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ ద్వారా జర్నలిస్టులతో సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై శివసేన ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా బలహీనతకు ఇది నిదర్శమని ఢిల్లీలో విలేకరులతో వ్యాఖ్యానించారు. దీనిపై భయానక వాతావరణం ఉందనీ, తక్షణమే ప్రధాని, హోంమంత్రి క్లారిటీ ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ లేవనెత్తారన్నారు. ఇందులో సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారన్న ఆరోపణలపై తాము దర్యాప్తు చేపట్టామని గుర్తు చేశారు. మరోవైపు రాహుల్‌గాంధీ సహా ఇతర నేతలపై హోంమంత్రి స్నూపింగ్‌కు పాల్పడుతున్నారని మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని, దీనికంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవినుంచి తప్పుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. కాగా పెగాసస్ ట్యాపింగ్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆశ్చర్యం -
మాది అమీర్, కిరణ్‌ల సంబంధం వంటిది
ముంబై: శివసేన, బీజేపీలది అమీర్‌ఖాన్, కిరణ్ రావుల మధ్య సంబంధం వంటిదని ఎంపీ సంజయ్‌రావుత్ వ్యాఖ్యానించారు. ఇరుపార్టీల మధ్య స్నేహం ఉందని స్పష్టంచేశారు. 15 ఏళ్ల వివాహ బంధానికి చెక్ పెడుతూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవలె అమీర్ దంపతులు ప్రకటించారు. ఇద్దరి మధ్య సంబంధం మారిపోయినా, ఇంకా కలిసే ఉన్నట్లు వారిద్దరూ ఓ ప్రకటనలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ, సేనలు శత్రువులు కాదని ఇటీవల మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రావుత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోమవారం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. (వారి) దారులు విడిపోయాయి. కానీ, వారు స్నేహితులు. ఇక్కడ కూడా అంతే. (మా) మార్గా లు వేరు కానీ, స్నేహం అలాగే ఉంది. రాజకీయాల్లో స్నేహం ఉంటుంది. కానీ మేం (మహారాష్ట్రలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దీని అర్థం కాదు. తేడాలు ఉన్నాయి, కానీ నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, మేం (సేన, బీజేపీ) భారతదేశం–పాకిస్తాన్ కాదు. సమావేశాలు, చర్చలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్గాలు వేరయ్యాయి. రాజకీయాల్లో మా మార్గాలు విడిపోయాయి’’ అని అన్నారు. -
ఠాక్రే, మోదీ భేటీ.. ‘రాజకీయాలు వేరుగా ఉంటాయి’
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు మంచి అనుబంధమే ఉందని, కానీ అది రాజకీయంగా కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జూన్ 8న ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ త్వరలోనే రాజకీయంగా కూడా ఒకటవుతారనే వార్తలు వినిపించాయి. ఈ సమావేశంపై కొందరు విమర్శలు కూడా చేశారు. మహారాష్ట్ర పాలక శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) -కాంగ్రెస్ కూటమి ఇబ్బందుల్లో ఉందని, శివసేన బీజేపీతో జట్టు కట్టనుందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘జూన్ 8న మోదీని ఉద్ధవ్ కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య చర్చ కొనసాగింది. వెంటనే అనేక ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. శివసేనతో బీజేపీ మరోసారి చెతులు కలుపుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. మా మార్గాలు వేరు కావచ్చు కానీ మా మధ్య గట్టి అనుబంధమే ఉంది. ఠాక్రే కుటుంబానికి, నరేంద్ర మోదీకి మధ్య చాలా సంవత్సరాలు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు వేరుగా ఉంటాయి’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇక శరద్ పవార్ గురించి స్పందిస్తూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తాము ఎల్లప్పుడూ పవార్ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. అందరితో మమేకమై జీవించడం మహారాష్ట్ర సంస్కృతి అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ల కోటా విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్టు ఆయన తెలిపారు. చదవండి: జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో -
Sanjay Raut: మహావికాస్ ఆఘాడి కూటమి బలంగా ఉంది
ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య బంధం బలంగా ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వం ఎలా పని చేయాలో మహావికాస్ ఆఘాడీ కూటమిని చూసి నేర్చుకోవాలని సోమవారం పేర్కొన్నారు. తమ కూటమిలో చీలికలు తెచ్చే ప్రయత్నం ఫలించదని ప్రతిపక్ష పార్టీలకు ఆయన చురకలంటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మూడు పార్టీల సమన్వయంతో పాలిస్తున్నారని చెప్పారు. ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ భవిష్యత్తులో కలసి పోటీ చేయాలా అన్న విషయంపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మూడు పారీ్టల మధ్య ఉన్న బంధం రీత్యా అయిదేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత చేకూరింది. మరోవైపు ఈ నెల 10న శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఠాక్రేకు లేఖ రాశారు. బీజేపీతో శివసేనకు దూరం పెరగడం వల్ల కేంద్ర విచారణ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై విచారణ జరుపుతోందని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలని సూచించారు. దీనిపై రౌత్ స్పందిస్తూ.. ప్రతాప్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని చెప్పారు. తమ పార్టీ స్టాండ్ ఇప్పటికే నిర్ణయమైందని చెప్పారు. కష్టకాలంలో ప్రతాప్‌కు పార్టీ తోడుంటుందని చెప్పారు. దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ ఎలా వేధిస్తుందో చెప్పడానికి పశ్చిమబెంగాల్లోని తృణమూల్ పార్టీ మంచి ఉదాహరణ అని చెప్పారు. చదవండి: జూలై–ఆగస్టులో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటుంది -
దేశంలో, పార్టీలో మోదీనే టాప్: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మరాఠా కోటా గురించి చర్చించేందుకు ప్రధాని మోదీతో భేటీ అయిన రెండు రోజుల్లోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2019 ఎన్నికల వేళ బీజేపీ, శివసేనల మధ్య విబేధాలు తలెత్తడం.. మిత్రులిద్దరు విడిపోవడం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఠాక్రే-మోదీల భేటీపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో శివసేన తాము వ్యక్తిగత సంబంధాలకు అత్యంత విలువ ఇస్తామని, రాజకీయంగా చూడమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడానికి ముందుండే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనను ఆకాశానికెత్తేశారు. మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలోనే కాక.. బీజేపీలో కూడా టాప్ లీడర్ అని సంజయ్ రౌత్ ప్రశంసించారు. పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర నేతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు, మోదీ ఛరిష్మా తగ్గినట్లేనా.. అన్న మీడియా ప్రశ్నకు సంజయ్ రౌత్ ఈ సమాధానమిచ్చారు. ‘‘మీడియాలో వస్తున్న వార్తలను నేను చూడలేదు. అధికారికంగా కూడా ఎక్కడా ఇలాంటి నిర్ణయం వెలువడలేదు. మోదీ దేశంలోనే టాప్ లీడర్. బీజేపీలో కూడా’’ అని వ్యాఖ్యానించారు. గత 7 సంవత్సరాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక మోదీ కృషి ఉందని, బీజేపీలోనూ మోదీ టాప్ అని రౌత్ కొనియాడారు. అయితే ప్రధాని అన్న హోదా మొత్తం దేశానికి సంబంధించినదని, ఒక పార్టీకి చెందినది కాదన్నారు సంజయ్ రౌత్. అందువల్ల మోదీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని ఆయన సూచించారు. ప్రధాని మోదీ తలుచుకుంటే శివసేనతో కలిసి పోటీ చేస్తారన్న బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై రౌత్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘పులితో (శివసేన గుర్తు) ఎవరూ స్నేహం చేయలేరు. తనతో స్నేహం చేయాలో పులే నిర్ణయించుకుంటుంది’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి: ‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’ -
1975 ఎమర్జెన్సీ కాల దోషం పట్టిన అంశం
ముంబై: ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి అంశం కాలదోషం పట్టిన అంశమని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అప్పటి పరిస్థితులే నయమనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పేనంటూ రాహుల్ గాంధీ ఇటీవల ఒప్పుకోవడంపై శివసేన పత్రిక సామ్నాలో ప్రశ్నించారు. ‘అత్యవసర పరిస్థితి విధించినందుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆమెకు ఒక గుణపాఠం చెప్పారు. అదే ప్రజలు ఆమెను క్షమించి తర్వాత తిరిగి అధికారం కట్టబెట్టారు. ఎమర్జెన్సీ విషయం అంతటితో ముగిసిపోయింది. మళ్లీ ఎందుకు గుర్తు చేయడం?అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సూటిగా, స్పష్టంగా మాట్లాడే వ్యక్తి అంటూ కితాబునిచ్చారు. మీడియా సంస్థలపై ఆధిపత్యం చెలాయించడం, ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ వ్యూహాలు పన్నడం, ప్రతిపక్షాల్లో విభేదాలు పెంచడం, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వంటివన్నీ 1975లో మాదిరిగానే ఇప్పుడూ జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్థానంలో ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు. చదవండి: బెంగాల్ టైగర్‌లా గాండ్రిస్తూ మమతా బెనర్జీ -
మహా కూటమిలో మాటల యుద్ధం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని ఔరంగబాద్ నగర పేరు మార్పు అంశం అధికార మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో చిచ్చు రాజేస్తోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన శివసేన, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ పేరిట శంభాజీనగర్‌గా మార్చాలని శివసేన పట్టుబడుతోంది. ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. క్రూరుడు, మతోన్మాది అయిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును అభిమానించడం లౌకికవాదం అనిపించుకోదని స్పష్టం చేస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఓ వ్యాసం రాశారు. ఔరంగాబాద్ పేరు మార్చడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అలా చేస్తే మైనార్టీ ఓటు బ్యాంకు దూరమవుతుందని ఆ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఔరంగజేబు సెక్యులర్ పాలకుడు కాదని తేల్చిచెప్పారు. (సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం) ఛత్రపతి శంభాజీని చంపిన ఔరంగజేబు పేరు మహారాష్ట్రలో ఓ నగరానికి ఉండడానికి వీల్లేదన్నారు. పేరు మార్చాలనడం మతపరమైన అంశం కాదని, శివభక్తి అనిపించుకుంటుందని పేర్కొన్నారు. శివసేన వాదనలపై మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకుముందు మహారాష్ట్రలో బీజేపీ–శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పేరు మార్పు గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్థిరమైన ఎంవీఏ ప్రభుత్వం ఉందన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) ఆధారంగానే పని చేస్తోందని తెలిపారు. నగరాల పేర్లు మార్చాలంటూ అనైతిక రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలకు స్థానం లేదని వెల్లడించారు. పేరు మార్పు అంశం వల్ల మహా వికాస్ అఘాడీలో చీలికలు వస్తాయని ఎవరూ సంబర పడొద్దని పరోక్షంగా బీజేపీకి చురక అంటించారు. -
ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్..పెను దుమారం
సాక్షి, ముంబై : మొన్నటి వరకు శివసేన, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా బ్యానర్లు ప్రదర్శించుకునే వరకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్’ అని బ్యానర్ ఏర్పాటు చేశారు. శివసేన భవన్ ఎదుట భారీ సంఖ్యలో పోగైన మహిళలు ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. (సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు) శివ సైనికుల ఆగ్రహం.. పీఎంసీ బ్యాంకు నగదు అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్ రావుత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో శివసైనికులు ఆగ్రహానికి గురయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకులపై ఈడీని ఉసిగోల్పుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ రావుత్ సోమవారం విలేకరుల సమావేశంలో బీజేపీపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈడీ ద్వారా తమపై ఒత్తిడి తీసుకొచ్చి మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని రావుత్ ఆరోపించారు. సంవత్సర కాలం నుంచి తమను బెదిరిస్తూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు ఈడీ, సీబీఐ అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, ఏక్నాథ్ ఖడ్సే, ప్రతాప్ సర్నాయిక్ తదితరులకు ఈడీ నుంచి నోటీసులు జారీ అయ్యాయని గుర్తు చేశారు. గత మూడు నెలల నుంచి బీజేపీ నాయకులు తరుచూ ఈడీ కార్యాలయానికి వెళుతున్నారని ఆరోపించారు. శివసేన, ఎన్సీపీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల జాబితాను రౌత్ చూపించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి ఆ తరువాత అరెస్టు చేస్తామంటూ బెదిరించడమేగాకుండా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గత నెల రోజుల నుంచి ఈడీ అధికారులతో తాము సంప్రదిస్తున్నామని, వారికి అవసరైన సంబంధిత పత్రాలన్ని సమర్పించామని అన్నారు. మేం భయపడం.. మంత్రి ఆదిత్య ఠాక్రే సాక్షి, ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌రావుత్ సతీమణి వర్షా రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేయడం రాజకీయ కక్ష్యతోనే జరిగి ఉంటుందని, మేం కేసులకు భయపడమని శివసేన ఎమ్మెల్యే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు. సోమవారం ఈడీ సమన్లపై ఆదిత్య విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 29న పీఎంసీ బ్యాంకు మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించాలని వర్షా రావుత్‌కు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఆదిత్య మాట్లాడుతూ.. ‘మేం భయపడం, మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం స్థిరంగా ఉంది. ఈడీ సమన్లు రాజకీయ కక్ష్యలో భాగమే’ అని వ్యాఖ్యానించారు. ముంబైలోని ఫెడరల్ ఎజెన్సీ ముందు హాజరు కావాలని వర్షా రావుత్‌కు ఈడీ ఇప్పటికే మూడు నోటీసులు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆవిడ ఆరోగ్యం బాగాలేనందున విచారణకు హాజరుకాలేకపోయినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్‌లో పంజాబ్, మహారాష్ట్ర కార్పొరేషన్ (పీఎంసీ) బ్యాంకులో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఆధారాల్లేకుండా నోటీసులు జారీచేయరు ఈడీ, సీబీఐ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా అనవసరంగా ఎవరికీ సమన్లు, నోటీసులు జారీ చేయరని స్వాభిమాని పార్టీ చీఫ్ నారాయణ్ రాణే అన్నారు. రావుత్ భార్య వర్షాకు ఈడీ సమన్లు జారీచేయడాని సమరి్థంచారు. అనవసరంగా ఒకరిపై ఆరోపనలు, ప్రత్యారోపనలు చేయడానికి బదులు నేరుగా ఈడీ అధికారుల ఎదుట హాజరై సంబంధిత పత్రాలు చూపించాలని హితవు పలికారు. రుజువులు లేకుండా ఈడీ ఎవరికి నోటీసులు జారీ చేయదని రావుత్‌పై నారాయణ్ ధ్వజమెత్తారు. వారి వద్ద రుజువులున్నాయి కాబట్టి నోటీసు జారీచేశారని, బీజేపీ వ్యక్తిగత పనులకు ఈడీని వాడుకోబోదని, కేంద్రం ఆ«దీనంలో సీబీఐ, ఈడీ ఉంటుందనే విషయం రౌత్‌కు తెలియదా అని ప్రశ్నించారు. -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై : పీఎంసీ బ్యాంక్ నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో డిసెంబర్ 29న విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి. తొలి రెండుసార్లు అనారోగ్య కారణాలు చూపుతూ ఆమె విచారణకు హాజరుకాలేదు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రుణ కుంభకోణంపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు పవన్ రౌత్ భార్యకు, వర్షా రౌత్‌కు మధ్య 50 లక్షల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ మొత్తాన్ని వర్షా రౌత్ ఆస్తి కొనుగోలు కోసం వినియోగించినట్లు సమాచారం. (చదవండి: ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!) ఇక ఎవరికైనా ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేస్తే.. వారు స్పందించపోతే.. సదరు వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుకునే అధికారం ఈడీకి ఉంటుంది. ఇక సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయంపై బీజేపీ నాయకులు స్పందించారు. శివసేన రెండు నాల్కల ధోరణిని విడిచిపెట్టి.. ఈ ఆరోపణలపై స్పందించాలని.. వాస్తవాలను ప్రజలకు బహిరంగపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల చర్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని తెలిపారు. -
సర్జికల్ స్ట్రైక్ చేయండి: సంజయ్ రౌత్
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన వెనక పాకిస్తాన్, చైనా హస్తం ఉందంటూ కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. రైతుల ఉద్యమం వెనక చైనా, పాక్ హస్తం ఉన్నది నిజమే అయితే ఆ రెండు దేశాల మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ.. ‘రైతుల ఉద్యమం వెనక పాక్, చైనా హస్తం ఉందని స్వయంగా ఓ కేంద్రమంత్రి ప్రకటించారు. అలాంటప్పుడు ఆ రెండు దేశాలపై సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందే. రక్షణ శాఖ మంత్రి వెంటనే దీని గురించి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ ఉన్నతాధికారులతో సీరియస్‌గా చర్చించి.. వెంటనే రంగంలోకి దిగాలి’ అంటూ రౌత్ ఎద్దేవా చేశారు. (చదవండి: ప్రభుత్వం నా చెప్పుల్ని చోరీ చేయించింది) రావుసాహేబ్ దాన్వే రైతుల ఉద్యమం గురించి మాట్లాడుతూ.. ‘ఇది రైతులు చేస్తోన్న ఆందోళన కాదు. దీని వెనక పాక్, చైనాల హస్తం ఉంది. దేశంలో ఏం జరిగినా వెంటనే ముస్లింలను ప్రేరేపిస్తారు. ఎన్ఆర్సీ, సీఏఏ అమల్లోకి వస్తే ఆరు నెలల్లో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఎంత మంది ముస్లింలు దేశం నుంచి వెళ్లిపోయారో చెప్పాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. రావుసాహేబ్ వ్యాఖ్యల్ని ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ కూడా ఖండించింది. -
స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్ తన చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల ఆశ్వీరాదాలు తమ ప్రభుత్వానికి ఉన్నాయని, ఇక ఈడీ, సీబీఐలతో భయమెందుకని? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. 2019 నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహావికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం కొలువుదీరి నేటితో ఏడాది పూర్తయిన నేపథ్యంలో శివసేన ముఖపత్రిక ‘సామ్నా’కు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సామ్నా సంపాదకుడైన శివసేన నేత సంజయ్ రౌత్ తీసుకున్న ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై సీఎం ఉద్ధవ్ మాట్లాడారు. ముఖ్యంగా ఈడీ, సీబీఐ దాడులు, ప్రతిపక్షాల ఆందోళనలపై తనదైన శైలిలో అందరికి వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఘాటైన సమాధానాలిచ్చారు. మహావికాస్ అఘాడి కూటమి గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ‘ఇప్పుడు పడిపోతుంది.. అప్పుడు పడిపోతుంది’అంటూ తరచూ కలలు కంటున్నాయన్నారు. కానీ వారం రోజుల్లో పడిపోతుందని, తాము ప్రభుత్వాన్ని కూలుస్తామని పేర్కొన్న ప్రతిపక్షాలు చూస్తుండగానే తమ ప్రభుత్వం విజయవంతంగా మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోందని ఉద్దవ్ పేర్కొన్నారు. ఈడీ, ఇతర కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ తమపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కుటుంబం, పిల్లల వెంటపడి పైశాచికానందం పొందే వాళ్లకు తమకు కూడా పిల్లలు, కుటుంబం ఉందన్న సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. కానీ తమకు సంస్కారం ఉందని, అందుకే తాము శాంతంగా, సహనంతో ఉన్నామన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇలా అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో సీఎం ఉద్ధవ్ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. (రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి) పవార్ తమకు మార్గదర్శి... ‘ముఖ్యమంత్రి అయినప్పటికీ నా కాళ్లు భూమి మీదనే ఉన్నాయి. అదేవిధంగా బండికి క్లచ్, బ్రేక్‌లు, ఎక్సిలేటర్తో పాటు స్టీరింగ్ కూడా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బండికి కూడా అన్ని ఉన్నాయి, దాని స్టీరింగ్ కూడా నా వద్దే ఉంది’అంటూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఉద్ధవ్ ఠాక్రే సమాధానమిచ్చారు. శరద్ పవార్ తమకు మార్గదర్శకులని, రిమోట్ కంట్రోలర్ కాదని కూడా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది జరగని పని అని ముందు అంతా భావించారు, కానీ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలోని అనుభవమున్న నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కలిసి పనిచేయగలరా అని అనేక ప్రశ్నలు అందరి మదిలోనా మెదిలాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రితో భేటీ కంటే ముందు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో భేటీ అవుతారని, ఆయనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారా..? తదితర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు..? ఉద్ధవ్ ఠాక్రేనా..? లేక అజిత్ పవారా? అంటూ బహుజన్ అఘాడీ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఇటీవలే ప్రశ్నిస్తూ ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో తనదైన శైలిలో ఈ ప్రశ్నలన్నింటికీ ఉద్ధవ్ సమాధానం ఇచ్చారు. అందరి సహకారంతో తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అందరి సహకారంతో నడుస్తున్నప్పటికీ, ప్రభుత్వ స్టీరింగ్ మాత్రం తన చేతిలోనే అంటే తన నేతృత్వంలోనే నడుస్తుందన్నది అందరికీ తెలిసేలా చెప్పారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం.. రాష్ట్రంలో అందరి సహకారంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కరోనా మహమ్మారి వచ్చిందని, అయితే గత సంవత్సరం కాలంలో మిత్ర పక్షాలు, ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించారని ఉద్ధవ్ చెప్పారు. ఇందుకు ఆయన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మా మిత్ర పక్షాల నేతలతో పాటు ఇతర సహకార పార్టీలు కూడా తమ వంతు సహకరించాయన్నారు. (ప్రమాదకరంగా సెకండ్ వేవ్) ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేది.. తమ నానమ్మ (శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ ఠాక్రే తల్లి) తన పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేదని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. అయితే ఆమె పిల్లలు రాష్ట్రంలో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారని, మనుమలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. హిందుత్వమంటే ఆలయంలో గంట కొట్టడం కాదు హిందుత్వం అంటే ఆలయాల్లో గంట కొట్టడం కాదని, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించేలా చేయడమని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలోని మట్టికి హిందుత్వాన్ని ఎవరూ నేర్పించవద్దు. ఎందుకంటే కాషాయ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించారు. నేను శివసేన అధినేత, మా తాతల హిందుత్వ సిద్ధాంతాలను నమ్ముతాను. వారు మనకు ఆలయాల్లో గంట కొట్టేవారు కాదు, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించే హిందువులు కావాలి అనేవారు. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్ర మట్టికి మీరు హిందుత్వం గురించి నేర్పించాల్సిన అవసరం లేదు’అని ఘాటు సమాధానమిచ్చారు. -
‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’
ముంబై : మహారాష్ట్రలో ‘మూడు రోజుల బీజేపీ ప్రభుత్వం’ కుప్పకూలి నేటికి ఏడాది గడిచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గుర్తుచేశారు. నేటితో మొదటి వర్ధంతి పూర్తిచేసుకుందని ఎద్దేవా చేశారు. గత ఏడాది నవంబర్ 23న మాజీ బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నాటకీయ పరిణామాల మధ్య ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్‌కు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రోజులకే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ కేవలం 80 గంటల్లోనే రాజీనామా సమర్పించారు. చదవండి: ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం? దీనిపై సోమవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం మరో నాలుగు ఏళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేస్తుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు విఫలమవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని వారికి బాగా తెలుస్తోంది’ అని ఆయన అన్నారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్ సాహెబ్ ఇటీవల మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రస్తావిస్తూ.. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది జోస్యం చెప్పారు. చదవండి: 'పాక్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలపాలి' కాగా గత ఏడాది అనేక ఉత్కంఠ పరిణామాల నడుమ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. తిరగి ఎన్సీపీలోకి రావటంతో నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ డీప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పవార్ వాఖ్యలను ఖండించిన యడియూరప్ప -
ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!
సాక్షి, ముంబై : దివంగత బాలీవుడు నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్యతో రగిలిన వివాదం, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అనూహ్య అరెస్టు తరువాత మరోసారి రాజుకుంది. బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా అర్నాబ్ గోస్వామి అరెస్టుపై వస్తున్న విమర్శలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ హయాంలో ప్రతీకారం అనే సమస్యే ఉండదనీ, చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో అర్నాబ్ అరెస్టు చట్ట ప్రకారమే చోటు చేసుకుందని వివరించారు. తగిన ఆధారాలుంటే ఎవరిపైనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. అంతేకాదు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) మరోవైపు గతంలో మూసివేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించిన 2018 కేసును విషయంలోనే అర్నాబ్ గోస్వామిని అరెస్టుచేశామని మహారాష్ట్ర హోంమంత్రి ధృవీకరించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుదర్యాప్తు, టీఆర్పీ కుంభకోణంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, అర్నాబ్‌పై రెండేళ్ల కేసును తిరిగతోడారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ ఇలా స్పందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసుల చర్యను పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అర్నాబ్ అరెస్టు సిగ్గు చేటని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అటు మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అర్నాబ్ గోస్వామికి మద్దతుగా నిలిచారు. అర్నాబ్ గోస్వామి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. మౌనంగా ఉంటే అణచివేతకు మద్దతిచ్చినట్టేననిఆమె ట్వీట్ చేశారు. అటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సేన ప్రభుత్వంపై మండిపడింది. (అర్నాబ్ అరెస్టు, పత్రికా స్వేచ్ఛపై దాడి: కేంద్రమంత్రి) Those in the free press who don’t stand up today in support of Arnab, you are now tactically in support of fascism. You may not like him, you may not approve of him,you may despise his very existence but if you stay silent you support suppression. Who speaks if you are next ? — Smriti Z Irani (@smritiirani) November 4, 2020 -
ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు..?
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజ్‌భవన్‌ను వేదికగా చేసుకుని రాజకీయాల చేస్తోందని మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లుల వివాదం నేపథ్యంలో నవనిర్మాణ సేనపార్టీ (ఎమ్‌ఎన్‌ఎస్పీ) చీఫ్ రాజ్ రాక్రేను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బదులుగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలవమని సలహా ఇవ్వడంపై శివసేన నేతలు భగ్గుమంటున్నారు. గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య విబేధాలు సృష్టించేందుకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. పవర్ ఎవరి చేతిలో.. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లుల విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కాకుండా శరద్ పవార్‌తో మాట్లాడమని గవర్నర్ కోశ్యారీ రాజ్ ఠాక్రేకి చెప్పడంతోనే రాష్ట్రంలో పవర్ ఎవరి చేతిలో ఉందో అర్థం అవుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఎద్దేవా చేశారు. శరద్ పవార్ రాష్ట్రాన్ని నడుపుతున్నారని, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవడం వల్ల ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నాయకులు సైతం స్వరం అందుకున్నారు. ముఖ్యమంత్రి ఠాక్రే అయినప్పటికీ అధికారమంతా పవార్ చేతిలోనే ఉందంటున్నారు. (ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?) బీజేపీ నేతల విమర్శలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గట్టిగా స్పందించారు. ఆఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో నెలరోజుల గడిస్తే తమ ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తి అవుతుందని, ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో 15 రోజుల్లోనే కుప్పకూలుతుందని బెట్టింగులు వేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికే అదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రాజ్ ఠాక్రేను ముఖ్యమంత్రికి బదులుగా శరద్ పవార్‌ని కలవాలని గవర్నర్ సూచించి సీఎంను అవమానపరిచారని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ ప్రభుత్వం భాగం మాత్రమేనని, సీఎం మాత్రం ఠాక్రేనే అని స్పష్టం చేశారు. బాల్‌ఠాక్రే నమ్మకాన్ని బేఖాతరు చేశారు దివంగత బాల్ ఠాక్రే నమ్మకం, సిద్ధాంతాలను బేఖాతరు చేసిన పార్టీ తమకు పాఠాలు నేర్పక్కర్లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సీనియర్ నేత సందీప్ దేశ్‌పాండే శివసేనకు చురకలంటించారు. కరోనా కాలంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఇటీవల గవర్నర్‌భగత్‌సింగ్ కొశ్యారీతో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సరైందని కాదని, ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ఉండగా నేరుగా గవర్నర్‌తో భేటీ కావడమంటే రాష్ట్రాన్ని అవమానపర్చినట్లేనని శనివారం శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ రాజ్ ఠాక్రేను విమర్శించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెన్నెస్ సమాధానమిచ్చింది. పరువు, ప్రతిష్ట, అవమానం అంటే ఏంటో రౌత్ నుంచి నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని దేశ్‌పాండే స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉత్తర భారతీయులంటే గిట్టని శివసేన ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల దినోత్సవం నిర్వహించింది. వారికిష్టమైన నానబెట్టిన శెనిగెల కార్యక్రమం నిర్వహించారు. ‘‘కొద్దిరోజుల కిందట రావుత్ కొశ్యారీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రౌత్ కొశ్యారీకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోను చూపించారు. మరి మీరెందుకు భేటీ అయినట్లు, నృత్యం చేయడానికా...?’’ అని దేశ్‌పాండే ఎద్దేవా చేశారు. ముందు ఈ ఫోటో గురించి మాట్లాడాలని, ఆ తరువాత ఇతరుల గురించి వ్యాఖ్యలు చేయాలని విమర్శించారు. శివసేన నాయకులు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు. రాజ్ ఠాక్రేను పీడిం చారు. అప్పట్లో ఎమ్మెన్నెస్‌కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లను ప్రలోభపెట్టి శివసేనలోకిలాక్కున్న సంఘటనలను ఎలా మర్చిపోతామని ఈ సందర్భంగా దేశ్‌పాండే గుర్తుచేశారు. -
‘ఎన్నికల కమిషన్ బీజేపీలో ఓ శాఖ’
ముంబై: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆర్జేడీ చీఫ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్) అంతేకాక ఎన్నికల వేళ బిహార్‌లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్ రౌత్. ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు పంకజా ముండే శివసేనలో చేరారనే పుకార్లపై సంజయ్ రౌత్ తనకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. బిహార్ మొదటి దవ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30 న 71 స్థానాలకు ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 55.69 శాతం ఓటర్లు నమోదయ్యాయి. రెండవ దశ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరగనుంది. -
వ్యాక్సిన్: దేశం మొత్తానికి సమాన హక్కులు!
ముంబై: బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడంపై బీజేపీ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వ్యాక్సిన్‌పై బీజేపీ చేస్తున్న రాజకీయాలను గురించి శివసేన అనుబంధ పత్రిక సామ్నాలో ప్రస్తావిస్తూ.. బిహార్‌లో బీజేపీ గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటున్నారు. మరి మిగిలిన రాష్ట్రాలు భారత్‌లో కాకుండా పాకిస్తాన్లో ఏమైనా ఉన్నాయా..?. బిహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. దేశం మొత్తం వైరస్ బారిన పడుతున్నప్పుడు కేవలం అక్కడకు వెళ్లి వ్యాక్సిన్ కోసం బీజేపీని గెలిపించండి అని కరోనా వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్‌కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి' అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్) గతంలో ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో దేశం మొత్తంగా అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని.. దీనికి కులం, మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదు అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకొని బిహార్ ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా మరో రకంగా వ్యాఖ్యానించడం విచిత్రమైన విషయం. బీజేపీకి ఈ విషయంలో ఎవరు మార్గనిర్దేశం చేస్తున్నారు' అంటూ సామ్నా సందపాదకీయంలో విమర్శించింది. ('అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్‌లా పరిగెడుతోంది') కాగా, శుక్రవారం రోజున ఇదే విషయంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. 'మేం స్కూల్లో చదువుకునే రోజుల్లో 'మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను' అనే నినాదాన్ని వినేవాళ్లం. ఇప్పుడు 'మీరు మాకు ఓటేయండి, మేం మీకు వ్యాక్సిన్ ఇస్తాం' అనే నినాదాన్ని వింటున్నాం. ఆ ప్రకారంగా ఎవరైతే బీజేపీకి ఓట్లు వేస్తారో వాళ్లకే వ్యాక్సిన్ అందుతుంది. ఇది ఆ పార్టీ వివక్షతకు అద్దం పడుతోంది అని సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. -
మహా అస్పష్టత : ఫడ్నవీస్-రౌత్ భేటీపై ఊహాగానాలు
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ భేటీ నేపథ్యంలో బీజేపీ, శివసేన మళ్లీ జట్టు కడతాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరి భేటీపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. శివసేన పత్రిక సామ్నాకు ఇంటర్వ్యూ కోసం రౌత్ దేవేంద్ర ఫడ్నవీస్‌ను సంప్రదించగా యథాతథంగా ప్రచురించాలని ఫడ్నవీస్ స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించకుండా ఇంటర్వ్యూను పూర్తిగా తమ టీంతో ఫడ్నవీస్ రికార్డు చేయించినట్టు తెలిసింది. శివసేన అధిపతులు మినహా మరే నేత ఇంటర్వ్యూను సామ్నాలో ప్రచురించకపోవడంతో ఫడ్నవీస్‌తో రౌత్ ఇంటర్వ్యూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటర్వ్యూ సంగతి ఎలా ఉన్నా ఇరువురి నేతల మధ్యా రెండున్నర గంటల పాటు సాగిన భేటీపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేతల్లో సంజయ్ రౌత్ ఒకరు. ఇక తాను సామ్నాను చదవనని, రౌత్‌ను సామ్నాను పట్టించుకోవద్దని జర్నలిస్టులకు సైతం దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో సూచనలు చేసిన సంగతిని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఇంతలోనే సామ్నా పట్ల, సంజయ్ రౌత్ పట్ల ఫడ్నవీస్ వైఖరిలో వచ్చిన మార్పేంటనే సందేహాలు ముందుకొచ్చాయి. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ఒక్కటయ్యే సూచనలకు ఈ భేటీ సంకేతమని చెబుతున్నారు. శివసేనతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొనసాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పేర్కొనడం కూడా మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణలకు సంకేతంగా భావిస్తున్నారు. పవార్ ఎన్డీయేలో చేరితే ఆయనకు భవిష్యత్‌లో కీలక పదవి దక్కుతుందనీ కేంద్ర మంత్రి చెప్పడం గమనార్హం. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్సీపీ సర్కార్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయనే వాదన ముందుకొస్తోంది. ఇక ఫడ్నవీస్-రౌత్‌ల మధ్య జరిగిన భేటీలో బీజేపీ-సేన మళ్లీ దగ్గరవడం గురించి చర్చ సాగిందనే ప్రచారం ఒకటైతే బీజేపీతో మెరుగైన సంబంధాల కోసం సంజయ్ రౌత్ ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. బీజేపీపై పలు అంశాలకు సంబంధించి రౌత్ విరుచుకుపడుతుండటంతో శివసేన ఎంపీ పట్ల కాషాయ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ ఠాక్రేను మించి రౌత్ బీజేపీపై విమర్శల దాడికి ముందుండేవారు. తాజా పరిస్థితుల్లో సంజయ్ రౌత్ బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఫడ్నవీస్‌తో రౌత్ భేటీ అయ్యారని చెబుతున్నారు. శివసేన-బీజేపీల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకే భేటీ జరిగిందని మరో వాదన తెరపైకి వస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కోవిడ్-19 పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంలో కూటమి భాగస్వామ్య పక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లను పట్టించుకోని బీజేపీ నేరుగా ఉద్థవ్ ఠాక్రే లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడింది. ఆదిత్య ఠాక్రేపైనా పలు సందర్భాల్లో బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఠాక్రేలపై బీజేపీ దూకుడు వైఖరిని తగ్గించే దిశగా రౌత్, ఫడ్నవీస్‌ల భేటీలో చర్చకు వచ్చిందని సమాచారం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఫడ్నవీస్-రౌత్ భేటీ సాగినా రాజకీయాల్లో ఏ అంశాన్నీ కొట్టిపారేయలేం. చదవండి : ఉద్ధవ్ ఠాక్రేపై భగ్గుమన్న బాలీవుడ్ క్వీన్ -
మళ్లీ ఎన్నికలా; ఆరోజు పరిస్థితి మారిపోతుంది!
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భేటీ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవన్న బీజేపీ స్వరం మార్చింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సమావేశమైనపుడు కచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతారని, ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలని ఎవరూ కోరుకోరు. కానీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించగలవా? అస్థిరత నెలకొన్న సమయంలో ఎన్నికలకు మించి వేరేమార్గం ఉండదు కదా. ఒకానొక రోజు పరిస్థితి మారిపోతుంది. నిజానికి ఇద్దరు బడా నాయకులు కలిసినపుడు రాజకీయాల గురించే చర్చిస్తారు. చాయ్, బిస్కెట్ల గురించి కాదు. అయితే ఆ భేటీకి సరైన ముగింపు లభించలేదు’’ అంటూ శనివారం ఫడ్నవిస్- రౌత్ భేటీ గురించి వ్యాఖ్యానించారు. (చదవండి: సంజయ్ రౌత్ వ్యాఖ్యలు; సీఎం ఠాక్రేతో పవార్ భేటీ!) కాగా సంజయ్ రౌత్, ఫడ్నవిస్ శనివారం హోటల్లో శనివారం రహస్యంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ విషయం బయటకు పొక్కడంతో కేవలం సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ రౌత్.. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ మా శత్రువేమీ కాదు. గతంలో ఆయనతో కలిసి పనిచేశాం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఆయనను కలిశాను’’అని చెప్పుకొచ్చారు. అయితే ఈ భేటీ జరిగిన మరుసటి రోజే శివసేన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. (శివసేనకు సీఎం, పవార్‌కు పెద్దపోస్టు : బీజేపీ ఆఫర్!) ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి సోమవారం ముంబైకి చేరుకున్న రాందాస్ అథవాలే.. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక రానున్న ఏడాదికాలం పాటు ముఖ్యమంత్రి పీఠం సేరకు అప్పగించడమే గాకుండా, కేంద్ర ప్రభుత్వంలోనూ పదవులు కట్టబెడతామని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అథవాలే ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత పాటిల్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. దీంతో పాత స్నేహితుడితో జట్టుకట్టి మహారాష్ట్రలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. వ్యవసాయ బిల్లుల నిరసన నేపథ్యంలో అకాళీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, బిహార్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో రామ్ విలాస్ పాశ్వాన్ దూరం కావడం తదితర అంశాల నేపథ్యంలో సుదీర్ఘకాలంగా మిత్రపక్షంగా కొనసాగిన శివసేనను దగ్గరచేసుకుని కూటమిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
కోర్టు ముందుకు సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
ముంబై : కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసిన సమయంలో శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌ను ఆమె తరపు న్యాయవాది బాంబే హై కోర్టులో ఈ రోజు వినిపించారు. కంగనా కార్యాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు నేడు విచారించింది. ఈ సందర్భంగా..కంగనాపై సంజయ్ బెదిరింపులకు పాల్పడినట్లు కలిగిన ఆడియో రికార్డింగ్‌ను కోర్టులో ప్లే చేయగా.. అందులో కంగనాపై సంజయ్ రౌత్ అసభ్యంగా మాట్లాడినట్లు ఉంది. అయితే ఈ ఆడియోను కోర్టులో వినిపించేందుకు సంజయ్ న్యాయవాది ప్రదీప్ తోరట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. (మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంగనా!) ఆ ఆడియోలో పిటిషనర్(కంగనా) పేరు లేదని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు సంజయ్ కంగనాను ఉద్ధేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయలేదని నిరూపించుకునేందుకు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆదేశించింది. దీనికి అంగీకరించిన సంజయ్ రౌత్ తరపు న్యాయవాది తాము రేపు(మంగళవారం) అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. కాగా కంగనా రనౌత్ ముంబై కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూలగొట్టిన విషయం తెలిసిందే. (డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు) కంగనా కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజయ్ రౌత్ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది. (ఫడ్నవిస్ మాకు శత్రువు కాదు...) -
ఫడ్నవిస్ మాకు శత్రువు కాదు...
ముంబై: ఎన్సీపీ అధినేత శరాద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం భేటీ అయ్యారు. సుమారు 40ల నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. కాగా శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో రహస్యంగా సమావేశమైన మరుసటి రోజే వీరిరువురు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే కోవిడ్-19 పరిస్థితులు, అన్‌లాక్ ప్రక్రియ, దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల గురించి చర్చించేందుకే వీరు సమావేశమయ్యారని సంకీర్ణ ప్రభుత్వ మద్దతుదారులు అంటున్నారు. ఫడ్నవిస్ మా శత్రువేమీ కాదు కాగా శివసేన అధికార పత్రిక సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ మా శత్రువేమీ కాదు. గతంలో ఆయనతో కలిసి పనిచేశాం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఆయనను కలిశాను. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ భేటీ జరిగింది. ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఈ విషయం గురించి తెలుసు. అయినా ఫడ్నవిస్‌ను కలవడం నేరమా ఏంటి? ఆయన మాజీ సీఎం. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.(చదవండి: దేవేంద్ర ఫడ్నవిస్‌తో సంజయ్ రౌత్ భేటీ) మా మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయే గానీ మేమేమీ శత్రువులం కాదు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఫడ్నవిస్‌నే గాకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, హోం మంత్రి అమిత్ షాను కూడా తాను ఇంటర్వ్యూ చేస్తానని వెల్లడించారు. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీతో పొత్తుకు గుడ్‌బై చెప్పిన శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న మరాఠా పార్టీ, వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతోంది. ఇక ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి, హీరోయిన్ కంగనా రనౌత్ పీఓకే వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు వర్గాలు పరస్పరం తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దిగాయి. ఇలాంటి తరుణంలో శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఇందులో రాజకీయ కారణాలేవీ లేవని చెప్పినప్పటికీ ఒకప్పుడు మిత్రపక్షాలైన శివసేన- బీజేపీ కీలక నేతలు ఇలా సమావేశమవడం హాట్ టాపిక్‌గా మారింది. -
వరుస ఎదురు దెబ్బలు: ఎన్డీయే విచ్ఛిన్నం..!
సాక్షి, ముంబై : బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) కూటమి నుంచి ఒక్కో పార్టీ జారుకుంటోంది. మొదటి నుంచి బీజేపీతో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందే వైదొలగగా.. ఆ పార్టీ దారిలోనే మరికొన్ని పార్టీలు సైతం నడుస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో అత్యంత పెద్దపార్టీగా ఉన్న శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో గుడ్‌బై చెప్పింది. ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ఏర్పడిన మనస్పర్ధాలు కూటమి నుంచి వైదొలిగి వేరు కుంపటి పెట్టుకునే వరకు సాగాయి. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టుకట్టడంతో పార్లమెంట్లో ఎన్డీయేకు కొంతలోటు ఏర్పడింది. ఇది జరిగిన కొద్ది నెలల్లోనే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 40 ఏళ్ల పాటు బీజేపీతో స్నేహంగా మెలిగిన శిరోమణీ అకాలీదళ్ తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. (ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం) కేంద్ర ప్రభుత్వం గతవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా తొలుత కేంద్రమంత్రికి పదవికి రాజీనామా చేసిన ఆపార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్.. పార్లమెంట్లో బిల్లులకు వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించారు. అనంతరం ఎన్డీయే కూటమి నుంచి శాస్వతంగా తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించి.. చిరకాల స్నేహానికి ముగింపు పలికారు. ఎన్డీయే కూటమిలో కీలకమైన అకాలీదళ్ తప్పుకోవడం బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బగానే భావించవచ్చు. (భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!) మరోవైపు కీలకమైన పంజాబ్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం కాషాయ దళానికి ఊహించని షాకే. ఇలాంటి తాజా పరిస్థితులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. శివసేనతో పాటు, శిరోమణీ అకాలీదళ్ వైదొలగడంతో ఎన్డీయే విచ్ఛిన్నమైందని, తాము ఇరువురం లేని కూటమి ఎన్డీయే కానేకాదని స్పష్టం చేశారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ఎన్డీయే నుంచి తప్పుకుంటున్నాయని గుర్తుచేశారు. అయితే తమ స్థానంలో వచ్చే కొత్త స్నేహితులు కూడా ఎంతకాలం ఉంటారో చెప్పలేమని రౌత్ వ్యాఖ్యానించారు. (ప్రశాంత్ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం..!) -
సంజయ్ రౌత్, ఫడ్నవిస్ రహస్య భేటీ!
ముంబై: మహారాష్ట రాజకీయాల్లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. ముంబైలోని ఓ హోటల్ ఆయనను కలిసి సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కాగా పరస్పరం విమర్శల దాడికి దిగే బీజేపీ- శివసేన పార్టీ కీలక నేతలు ఇలా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్.. ఈ భేటీ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనతో సమావేశమయ్యారని పేర్కొన్నారు. (చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా) ఇక ఫడ్నవిస్ ఇందుకు సానుకూలంగా స్పందించారని, అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తర్వాత మాత్రమే తాను అందుబాటులో ఉంటానని చెప్పినట్లు వెల్లడించారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల తర్వాత తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం బీజేపీ దోస్తీకి కట్ చెప్పిన శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్‌తో జట్టుకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. ఆనాటి నుంచి ఇరు వర్గాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కంగనా రనౌత్ పీఓకే వ్యాఖ్యల నేపథ్యంలో సంజయ్ రౌత్ బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. -
ముంబై నుంచి పార్శిల్ చేస్తాం: రౌత్
ముంబై: బిహార్‌లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీలలో మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో తగినన్ని సమస్యలు లేకపోతే.. ముంబై నుంచి కొన్నింటిని పార్శిల్ చేసి పంపిస్తామని ఎద్దేవా చేశారు. బిహార్‌కు చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటూ లబ్ధి పొందాలని భావిస్తున్నారంటూ ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఎన్నికల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలపై పోరాడాలి. అయితే ఈ సమస్యలు అయిపోయినట్లు మీరు భావిస్తే చెప్పండి.. ముంబై నుంచి కొన్ని సమస్యల్ని పార్శిల్‌గా పంపుతాము’ అన్నారు. అంతేకాక బిహార్ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందన్నారు సంజయ్. దీని గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించి.. రెండు-మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాక బిహార్ ఎన్నికలు కూలం, ఇతర విషయాల మీద జరుగుతాయి. కార్మిక చట్టాలు, రైతులకు సంబంధించిన సమస్యలను వీరు పట్టించుకోరు అంటూ సంజయ్ రౌత్ గ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు!) దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
'పాపడ్'లు తిని కరోనా నుంచి కోలుకున్నారా?
సాక్షి, ఢిల్లీ : కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందన్న వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ఒకప్పుడు రాష్ర్టంలో అత్యధిక కేసులు ప్రబలిన మురికవాడ ధారావిలో కరోనా నియంత్రణ కాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఈ విషయంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చేసిన ప్రయత్నాలను ప్రశంసించిందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యిందని పలువురు పార్లమెంటు సభ్యులు మహారాష్ర్ట సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. (సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్.. చైనా మరో కుట్ర) ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ..కరోనాను అదుపు చేయకపోతే ఇంతమంది ఎలా కోలుకోగలిగారు? ఇప్పుడు కరోనాను జయించిన వాళ్లందరూ పాపడ్ తిని కరోనా నుంచి బయటపడ్డారా అంటూ వ్యంగాస్ర్తాలు సంధించారు. గతంలో పాపడ్ తింటే కరోనా పోతుందని ఉచిత సలహా ఇచ్చి విమర్శలపాలైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. తన తల్లి, సోదరుడు సైతం కోవిడ్ బారినపడ్డరని రాష్ర్టంలో రికవరీ రేటు ఎక్కువగానే ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. కరోనాను రాజకీయం కోసం వాడుకోరాదంటూ పేర్కొన్నారు. ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ర్ట మొదటిస్థానంలో ఉంది. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత బుధవారం నాటికి 1.12 మిలియన్ మార్కును దాటేసింది. వీరిలో దాదాపు ఎనిమిది లక్షలమంది కరోనాను జయించారు. గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 51,18,254కు చేరుకుంది. (దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు) -
‘కంగనా వ్యాఖ్యలపై అక్షయ్ స్పందించాలి’
ముంబై : బీజేపీ, బాలీవుడ్ పరిశ్రమపై శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శనాస్థ్రాలు సంధించారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన వారిని బీజేపీ సమర్ధిస్తోందని విమర్శించారు. ఆ నటి (కంగనా రనౌత్) ముంబైని పీఓకేతో పోల్చితే ఏ ఒక్కరూ మాట్లాడలేదని రౌత్ మండిపడ్డారు. కాగా ముంబైను విమర్శించిన కంగనా వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ముంబై నగరం బాలీవుడ్ నటులకు డబ్బుతో సహా కావాల్సినవన్ని సమకూర్చుంది. కానీ నగరం కేవలం వారికి డబ్బులు సంపాదించేందుకేనా అని బాలీవుడ్ పరిశ్రమను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్, క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నమని సంజయ్ రౌత్ ఆరోపించారు. -
రనౌత్ వర్సెస్ రౌత్ : బీజేపీని టార్గెట్ చేసిన సేన నేత
ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్ నేరుగా బీజేపీపై ఆదివారం విమర్శలు గుప్పించారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన వారిని బీజేపీ సమర్ధిస్తోందని దుయ్యబట్టారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే బీజేపీ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌కు మద్దతివ్వాలని నిర్ణయించిందని కంగనా రనౌత్ పేరు ప్రస్తావించకుండా పేర్కొన్నారు. ముంబైని పీఓకేగా, బీఎంసీని బాబర్ సైన్యంతో పోల్చిన వారికి మహారాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం కొమ్ముకాయడం దురదృష్టకరమని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో సంజయ్ రౌత్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణ రాజ్‌పుత్, క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నమని దుయ్యబట్టారు. మహారాష్ట్రను అవమానపరిచిన వారికి మద్దతిస్తూ బిహార్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. జాతీయవాదులుగా చెప్పుకునే వారికి ఇది తగదని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నా మహారాష్ట్ర బీజేపీ నేతలెవరూ నోరు మెదపడంలేదని అన్నారు. ముంబై ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, నగర ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగా ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహారాష్ట్రలో మరాఠాలంతా ఏకమవ్వాల్సిన సంక్లిష్ట సందర్భమని శివసేన నేత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలను ఓ నటి అవమానిస్తుంటే బీజేపీ నేతలు స్పందించడం లేదని, ఇది ఎలాంటి స్వేచ్ఛకు ప్రతీకని ప్రశ్నించారు. ఆ నటి (కంగనా రనౌత్) ముంబైని పీఓకేతో పోల్చితే ఏ ఒక్కరూ మాట్లాడలేదని రౌత్ బాలీవుడ్‌పైనా విమర్శలు గుప్పించారు. చదవండి : బాలీవుడ్ క్వీన్‌కు మరో షాక్ కంగనా అభిప్రాయాలు సినీ పరిశ్రమ అభిప్రాయాలు కాదని బాలీవుడ్ ప్రతినిధులు స్పష్టం చేయాలని కోరారు. కనీసం అక్షయ్ కుమార్ అయినా స్పందించాలని అన్నారు. ముంబై పట్ల కృతజ్ఞత చూపేందుకు కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చురకలు వేశారు. వారికి ముంబై ప్రాధాన్యత కేవలం డబ్బు సంపాదించేందుకేనని, ముంబైని ఎవరైనా రేప్ చేసినా వారికి పట్టదని రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా నటుడు సుశాంత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడంతో కంగనా, శివసేనల మధ్య వివాదం ముదిరింది. -
కంగన వెనుక ఎవరున్నారు?
(వెబ్ స్పెషల్): ఇప్పుడు అందరి నోటా విన్పిస్తున్న ప్రశ్న ఇదే. శివసేనను సవాల్ చేసి మరాఠా గడ్డపై అడుగుపెట్టిన ‘క్వీన్’వెనుక ఎవరున్నారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాషాయ దళం అండ దండలు ‘ఫైర్ బ్రాండ్’కు మెండుగా ఉన్నాయని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. బాలీవుడ్ మొండి ఘటంగా ముద్రబడిన కంగన రనౌత్..‘మహా’సర్కారును అంతే మొండిగా ఎదుర్కొంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా తారలు ప్రభుత్వాలను, అధికార పార్టాలను ఎదురించే సాహసం చేయరు. కంగన మాత్రం శివసేన నాయకులకు సవాల్ విసిరి మరీ ముంబైలో అడుగుపెట్టారు. అక్కడితో ఆగకుండా శివసేన సర్కారును ఇంకా సవాల్ చేస్తూనే ఉన్నారు. ఇంత ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? వెనకుండి ఆమెను నడిపిస్తున్నది ఎవరు? బంధుప్రీతి.. డ్రగ్స్.. సినీ మాఫియా బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన సర్కారు మధ్య కోల్డ్‌వార్ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడం లేదు. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మొదలైన వివాదం ఇప్పుడు ‘క్వీన్ వర్సెస్ సేన’గా మారిపోయింది. బాలీవుడ్లో బంధుప్రీతికి వ్యతికంగా గళం విప్పి వివాదానికి శ్రీకారం చుట్టిన కంగన ఇప్పటికీ తనదైన శైలిలో కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ మాఫియా నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె పేర్కొనడంలో దుమారం రేగింది. నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణుల మాటల యుద్ధంతో వివాదం రాజుకుంటూ వచ్చింది. సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా లింకులు రట్టు కావడం, రాజకీయ నాయకుల జోక్యంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. రనౌత్ వర్సెస్ రౌత్ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని కంగన ట్వీట్ చేయడంతో రంగంలోకి శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వచ్చారు. అంత భయం ఉంటే ముంబైకి రావొద్దని కంగనకు కౌంటర్‌కు ఇచ్చారు. ‘క్వీన్’ ఏమాత్రం తగ్గకుండా ముంబై ఏమైనా పీఓకేనా? అంటూ ప్రశ్నించారు. తమ రాష్ట్ర రాజధానిని పీఓకేతో పోల్చిన కంగపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ముంబై అధికార యంత్రాంగం కంగన కార్యాలయంలోని అక్రమ నిర్మాణాలను హడావుడిగా కూల్చేసింది. విశేషం ఏమిటంటే 2016-19 మధ్య కాలంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బీఎంసీ అధికారులు కేవలం 10.47 శాతం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. మరోవైపు శివసేన ప్రభుత్వాన్ని సవాల్ చేసి మరీ ముంబైలో అడుగు పెట్టారు కంగనా రనౌత్. కేంద్ర భద్రతా దళాల పహారా నడుమ ‘క్వీన్’ ముంబై చేరుకున్నారు. (భద్రత లేకుంటే నా బిడ్డకు ఏం జరిగేదో!) ముంబైపై కేంద్రం కుట్ర కంగన రనౌత్‌కు కేంద్రం వై-ప్లస్ భద్రత కల్పించడాన్ని శివసేన తీవ్రంగా విమర్శించింది. మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీసే కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని ‘సామ్నా’ సంపాదకీయంలో ఆరోపించింది. ముంబై ప్రతిష్టను దెబ్బతీసి ఆర్థికంగా బలహీనపర్చాలనే కుట్రలు ఢిల్లీలో జరుగుతున్నాయని.. ఇలాంటి వాటి పట్ల మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివసేన రాసుకొచ్చింది. ముంబైని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించిన కంగనకు బీజేపీ బహిరంగంగా మద్దతు పలకడంపై అసహనం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వాన్ని దాడి చేసేందుకు చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ, కేంద్రం విడిచిపెట్టడం లేదని మండిపడింది. కంగన రనౌత్‌కు తమదైన పద్ధతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. కంగనకు ప్రధాని నరేంద్ర మోదీ అండదండలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అయితే కంగన విషయంలో శివసేన అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మరాఠా సెంటిమెంట్‌తో రాజకీయాలు చేసిన శివసేన ఇప్పుడు అధికార పార్టీగా చాలా అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. (ఎన్ని నోళ్లు మూయించగలరు?) ‘క్వీన్’కు కమలనాథుల బాసట శివసేన ఆరోపణల్లో వాస్తవం ఉందని బీజేపీ చర్యలు నిరూపిస్తున్నాయి. కంగన కార్యాలయంలో అక్రమ నిర్మాణాలను బీఎంసీ సిబ్బంది కూల్చివేయాన్ని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ ఖండించారు. అంతేకాదు కేంద్రానికి నివేదిక పంపాలని బీఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చారు. బీజేపీ పాలిత హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా కంగన కార్యాలయం కూల్చివేతను ఖండించారు. కంగనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం బాసటగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కంగనా రౌనత్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ఏకంగా యజ్ఞం నిర్వహించారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కూడా కంగనకు మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలె స్వయంగా కంగన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. క్వీన్ పాలి‘ట్రిక్స్’ శివసేనను సవాల్ చేసిన కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. తనకు అండగా నిలిచిన బీజేపీలో ఆమె చేరతారన్న వార్తలు గత కొద్ది రోజులు షికారు చేస్తున్నాయి. తాజాగా కంగన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. శివసేన.. సోనియా సేనగా మారిందని.. బాల్ థాకరే సిద్ధాంతాలను అధికారం తాకట్టు పెట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పరిణామాలు చూస్తుంటే కంగన రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న భావన కలుగుతోంది. పొలిటికల్ ఎంట్రీపై ఆమె ఇప్పటివరకు విస్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే, మరాఠి ప్రజలు తనకు నైతిక మద్దతు ఇస్తున్నారని.. శివసేన ప్రభుత్వ చర్యలను సమర్థించడం లేదని తాజాగా చేసిన ట్వీట్లో కంగన పేర్కొన్నారు. ఉద్ధవ్ సర్కారు పొకడలు మరాఠీల ప్రతిష్టను ఏమాత్రం దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. కాగా, కంగన నివాసం వెలుపల ముంబై పోలీసులు కాపలా కాయడం కొసమెరుపు. బిహార్ ఎన్నికల కోసమేనా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే సుశాంత్, కంగన వ్యవహారాన్ని బీజేపీ వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనా విలయం, ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో మోదీ సర్కారు విఫలమైందని విరుచుకుపడుతున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని బీజేపీ చూస్తోందని అంటున్నాయి. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కమలం పార్టీ ఈ నాటకాలు ఆడుతోందని ఆరోపిస్తున్నాయి. (4 రోజుల్లో కంగన వెళ్లిపోతున్నారు: బీఎంసీ) -
ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!
సాక్షి, ముంబై : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఎపిసోడ్ ఓ యుద్ధాన్నే తలపిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా వాటిపై లేని చర్చ కంగనా, శివసేన వ్యవహారంపై విపరీతంగా నడుస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ప్రారంభమైన ఈ ప్రకంపనలు ఏకంగా కంగనా ముంబైలో నిర్మించుకున్న కార్యాలయాన్ని కూల్చేవరకు తీసుకెళ్లాయి. బాలీవుడ్లో నెపోటిజం మూలంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడాడంటూ తొలుత కామెంట్ చేసిన కంగనా.. ఆ తరువాత దేశ ఆర్థిక రాజధానిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చుతూ వివాదంలోకి దిగారు. ఆమె వ్యాఖ్యలతో మొదలైన మాటల యుద్ధం ఇరువర్గాల (కంగనా-శివసేన) మధ్య తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే శివసేన నేతలు చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్న నటి.. ఏకంగా కేంద్ర ప్రభుత్వం చేత వై కేటగిరి సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసుకుని ముంబైలో అడుగుపెట్టింది. (కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) ఆ సమావేశంలో ఏం జరిగింది..? అయితే తమనే అవమానిస్తావా అంటూ కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహా ప్రభుత్వం కంగనా ముంబైలో అడుగుపెట్టే సమయానికి ఊహించని షాకే ఇచ్చింది. ఆమె నిర్మించుకున్న కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతగా సిద్ధమైంది. అయితే కంగనా కార్యాలయం కూల్చివేతపై ప్రభుత్వంలో ముందే పెద్ద ఎత్తునే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున అక్రమ కట్టడాన్ని కూల్చివేయగా.. అంతకంటే ముందే అంటే మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రైత్ మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. కంగనా నిర్మాణాన్ని తొలగించి వివాదాన్ని మరింత పెద్దదిగా చేయవద్దని శరద్ పవార్.. సీఎం ఠాక్రేతో వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంగనా వ్యవహారాన్ని వదిలేయాలని, చట్ట పరంగా ఏమైనా చర్యలు ఉంటే అది స్వతంత్ర హోదా కలిగిన బీఎంసీ అధికారులే చూసుకుంటారని చెప్పిన్నట్లు తెలిసింది. (శివసేన సర్కారు దూకుడు) ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి..! అయితే పవార్ వాదనతో ఏకీభవించని ఠాక్రే కంగనాను వదిలే ప్రసక్తే లేదని, అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని తేల్చి చెప్పినట్లు ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిలో ప్రభుత్వం తప్పిందం ఏదైనా ఉంటే ప్రతిపక్ష బీజేపీకి మరింత అవకాశం దొరుకుతుందనీ కూడా పవార్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంగనా-శివసేన ఎపిసోడ్లో ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకుంటోదని పలువరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఓ నటికి వై కేటగిరి భద్రత కల్పించడంపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కంగనా తొలి నుంచీ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దానిని దృష్టిలో ఉంచుకునే ఆమెకు భద్రత కల్పించారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘఢీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే బీజేపీ కంగనాకు మద్దతుగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆగుతుందా.. ముదురుతుందా ఇదిలావుండగా కంగనా కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈనెల 22 వరకు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని బీఏంసీ అధికారులను ఆశ్రయించింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బీఎంసీ సభ్యులు కంగనా కార్యాలయం కూల్చివేత పనులను షురూ చేశారు. కూల్చివేత పనులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. అనంతరం గురువారం మధ్యాహ్నాం తన కార్యాలయన్ని కంగనా పరిశీలించారు. అయితే ఈ వివాదం ఇప్పటితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది వేచిచూడాలి. -
కంగనాను బెదిరించలేదు: సంజయ్ రౌత్
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీస్ కూల్చివేతకు, శివసేనకు ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అదే విధంగా తానెప్పుడూ కంగనాను బెదిరించలేదని, ఆమె ముంబైలో హాయిగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కంగన కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలతో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. బీఎంసీ ఈ చర్యను చేపట్టింది. కావాలంటే ఈ విషయం గురించి మీరు మేయర్ లేదా బీఎంసీ కమిషనర్‌తో మాట్లాడవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇక సంజయ్ రౌత్ బుధవారం ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘నేనెప్పుడూ కంగనా రనౌత్‌ను బెదిరించలేదు. కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాను. అంతే. బీఎంసీ తీసుకున్న చర్యలకు నేను బాధ్యుణ్ణి కాదు. నా వరకు ఆ విషయం ఎప్పుడో ముగిసిపోయింది. కంగన ముంబైకి వచ్చి, ఇక్కడే నివసించడాన్ని స్వాగతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) వివాదానికి దారి తీసిన పరిస్థితులు నటుడు సుశాంత్ సింగ్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం, మాఫియా గురించి గళమెత్తిన కంగనాకు శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు రక్షణ కల్పించాలంటూ బీజేపీ నేత రామ్ కదమ్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీ-టౌన్ మాఫియా కంటే తనకు ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయమని, వారికి బదులుగా హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలంటూ కంగన సోషల్ మీడియా వేదిగకా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు స్పందించిన సంజయ్ రౌత్ చేసిన కంగనపై మాటల యుద్ధానికి దిగారు. ముంబై పోలీసులను కించపరచడం సరికాదంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనికి కంగన సైతం అదే స్థాయిలో బదులిస్తూ.. ముంబై ఏమైనా పాక్ ఆక్రమిత కశ్మీరా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: 4 రోజుల్లో కంగన వెళ్లిపోతున్నారు: బీఎంసీ) అంతేకాదు సెప్టెంబరు 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరిన ఆమె అన్నట్లుగానే బుధవారం రాజధాని నగరంలో అడుగుపెట్టారు. అయితే అదే సమయంలో బీఎంసీ అధికారులు కంగన కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేతలకు దిగడంతో.. తమకు వ్యతిరేకంగా మాట్లాడినందునే శివసేన కంగనపై క్షక్షగట్టిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాక సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఈ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.(చదవండి: మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా) కంగనపై ఫిర్యాదు ఇక ముంబై హైకోర్టు సైతం దురుద్దేశపూర్వకంగానే బీఎంసీ ఈ చర్యకు పూనుకున్నట్లుగా ఉందంటూ మొట్టికాయలు వేసింది. ఇలా అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సంజయ్ రౌత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే ఆయన వెనక్కితగ్గారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా బంగ్లా కూల్చివేత పరిణామాల నేపథ్యంలో కంగన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ‘‘అసలు నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో కలిసి నా ఇంటిని కూల్చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నా అనుకుంటున్నావా? ఈరోజు నా ఇల్లు కూలింది. రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది. కాలచక్ర గమనం మారుతూనే ఉంటుంది’’అంటూ మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రిని మర్యాద లేకుండా నువ్వు అని సంబోధించడమే గాకుండా ఆయనపై ఆరోపణలు చేసినందుకు గానూ శివసేన వర్గాలు కంగనపై విఖ్రోలీ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాయి. -
రనౌత్ వర్సెస్ రౌత్ : శివసేన నేతకు కీలక పదవి
ముంబై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌తో వివాదానికి కేంద్ర బిందువైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఆ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. సంజయ్ రౌత్‌ను పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా శివసేన నియమించింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన కంగనా రనౌత్‌పై సంజయ్ రౌత్ కొద్దిరోజులుగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముంబైని పీఓకేతో పోల్చిన కంగనాను నగరంలో అడుగుపెట్టవద్దని సేన నేత పరోక్షంగా హెచ్చరించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఇక కంగనాపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుకు ఆయన సుముఖత చూపకున్నా తాను ఎంచుకున్న పదాలు మరింత మెరుగ్గా ఉంటే బావుండేదని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.మరోవైపు బాలీవుడ్ క్వీన్ కంగనా ఈనెల 9న ముంబైకు రానుండటంతో ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కంగనాకు వై సెక్యూరిటీ కల్పించడంతో మనాలీలోని ఆమె నివాసం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను నియమించారు. ముంబై పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐబీ, సీఆర్పీఎఫ్ అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’ -
శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా
ముంబై: తనపై విమర్శలు చేస్తున్నవారిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్న ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు. గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్లో వీడియో విడుదల చేశారు. (చదవండి: నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి) సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్ రౌత్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సంజయ్ బహిరంగంగా తనకు వార్నింగ్ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో కంగనాకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. (చదవండి:కంగనా కామెంట్లు; అందుకు నేను సిద్ధం) -
శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా
-
కంగనా కామెంట్లు; అందుకు నేను సిద్ధం
ముంబై: మహారాష్ట్రను కించపరిస్తే సహించేది లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి స్పష్టం చేశారు. మహారాష్ట్ర, ముంబై, మరాఠాలు.. ఈ మూడింటిపై మితిమీరి మాట్లాడొద్దని అన్నారు. ఇక్కడ పుట్టి పెరిగినవారైనా, బయటివారైనా నీడనిచ్చిన ప్రాంతంపై నోరుపారేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పోల్చిన కంగనా రనౌత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కంగనా ట్వీట్లపై స్పందించే క్రమంలో తానేమైనా తప్పుగా మాట్లాడితే క్షమాపణలు కోరడానికి సిద్ధమని సంజయ్ ఆదివారం ప్రకటించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి బాలీవుడ్లో బంధుప్రీతి, అతనికి అవమానాలే కారణమని కంగనా తొలి నుంచీ ఆరోపిస్తోంది. కేసు విచారణకు సంబంధించి ముంబై పోలీసులపై నమ్మకం లేదని ట్వీట్ చేయడంతో వివాదం మొదలైంది. అయితే, ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ అడుగుపెట్టవద్దని ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ వేశారు. దీనిపై స్పందించిన కగనా శివసేన ఎంపీ తనను బహిరంగంగా బెదిరిస్తున్నారని, ముంబై నగరం తనకిప్పుడు పీఓకే కనిపిస్తోందని ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. ఈ నెల 9న ముంబై వస్తున్నాని దమ్ముంటే తనను ఆపాలని కంగనా మరో ట్వీట్‌తో విమర్శకులపై విరుచుకుపడ్డారు. -
ఆమె వ్యాఖ్యలు హిందుత్వకు అవమానకరం!
ముంబై : కోవిడ్-19 ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన దేవుడి చర్య (యాక్ట్ ఆఫ్ గాడ్) వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ దేవుడ్ని నిందించడం హిందుత్వకు అవమానకరమని సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ భేటీలో నిర్మలా సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఉద్దేశించి దేవుడి చర్య కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్థిక మంత్రి చెప్పడం సరైంది కాదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాన్ని దేవుడిపై నెపం వేసి ఎలా చేతులుదులుపుకుంటారని ఆయన నిలదీశారు. ‘దేవుడి తప్పిదమే అయితే ఏ కోర్టులో ఆయనను విచారిసారు..? ప్రభుత్వ చేతికానితనానికి దేవుడిపై నెపం మోపడం హిందుత్వకు అవమానకరమ’ని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా శివసేన నేత విమర్శలు గుప్పించారు. ‘మన ప్రధాని అన్ని విషయాల గురించి మాట్లాడతారు..దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై మాత్రం నోరుమెదపరు..నోట్ల రద్దు నుంచి లాక్డౌన్ వరకూ సాగిన ప్రయాణంలో మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంద’ని రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్రెజిల్ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆర్థికంగా చేయూత అందించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయా ప్రభుత్వాలు కోవిడ్-19 సమస్యను దైవ ఘటనగా చూడలేదని, ఆర్థిక సంక్షోభంగానే పరిగణించి పౌరులను ప్రభుత్వాలు ఆదుకున్నాయని అన్నారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’ -
ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: కంగనా
సాక్షి, ముంబై : ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాటల యుద్ధం కాస్తా తీవ్ర వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నువ్వా నేనా అనే విధంగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేకుంటే ముంబైకు రావాల్సిన అవసరంలేదని ఆమెకు హితవు పలికారు. ముంబై పోలీసులపై విశ్వాసం లేకపోతే నగరంలోకి రావద్దని అన్నారు. అంతేకాకుండా కంగనా ఒక మెంటల్ పేషెంట్‌తో పోల్చారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సైతం కంగనా తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెడు అభిప్రాయముంటే కంగనా ముంబైకి రావొద్దు అన్నారు. (ముంబైని కించపరిస్తే సహించం) ఈ క్రమంలోనే కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నుంచి పార్టీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యలపై కంగనా ఎదురుదాడికి దిగారు. అతన్ని తాలిబన్‌తో పోలుతూ వివాదాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టారు. అంతేకాకుండా ‘ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా’ అంటూ సవాల్ విసిరారు. అయితే కంగనా తాజా వివాదం వెనుక రాజకీయ పార్టీ అండ ఉందని శివసేన నేతలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అండదండలతోనే ఆమె ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని సేనలు విమర్శిస్తున్నారు. మరాఠాను కించపరిస్తే ఏమాత్రం సహించమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కంగనాకు వ్యతిరేకంగా నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వానికి మొదలైన ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. (హీరోయిన్ కంగనా సంచలన వ్యాఖ్యలు) -
‘కంగనా ఓ మెంటల్ కేసు’
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ క్వీన్, ఫైర్‌బ్రాండ్ నటి కంగనా రనౌత్ శివసేన నేత సంజయ్ రౌత్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలోకి రావద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేత స్పందించారు.‘ఆమె ఓ మెంటల్ కేసు..తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం.. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నా’యని రౌత్ వ్యాఖ్యానించారు. ‘మేం ఎవరినీ బెదిరించబోము...ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదు..ముంబై, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము సహించ’మని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. 26/11 దాడుల సమయంలో ముంబై పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పౌరులను కాపాడారని, 1992 ముంబై పేలుళ్లలోనూ నగరాన్ని, నగర ప్రజలను వారు కాపాడారని కొనియాడారు. కరోనా వైరస్‌తో పలువురు ముంబై పోలీసులు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, రోగుల సేవలో పలు త్యాగాలు చేస్తున్నారని ప్రస్తుతించారు. కాగా సుశాంత్ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తుపై కంగనా రనౌత్ ప్రశ్నలు లేవనెత్తడాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై కంగనా అభ్యంతరం తెలిపారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబైలో అడుగుపెట్టరాదని సేన నేత తనను బెదిరించారని, ముంబైని చూస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ఎందుకు కనిపిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. చదవండి : పీఓకేను తలపిస్తోన్న ముంబై -
పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన
ముంబై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టవద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనను బహిరంగంగా బెదిరించడంపై కంగనా రనౌత్ స్పందించారు. సంజయ్ రౌత్ బెదిరింపుల నేపథ్యంలో ముంబై నగరం తనకు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో కంగనా రనౌత్ వ్యాఖ్యలపై పార్టీ పత్రిక సామ్నాలో సంజయ్ రౌత్ ఎండగట్టారు. ముంబై నగరంలో ఉంటూనే ముంబై పోలీసులపై కంగనా సందేహం వ్యక్తం చేస్తున్నారని తప్పుపట్టారు. చదవండి : కంగనా సంచలన వ్యాఖ్యలు ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, దయచేసి ఆమెను ముంబై రావద్దని కోరుతున్నామని సామ్నాలో ఆయన రాసుకొచ్చారు. దీనిపై హోం శాఖ చర్యలు తీసుకోవాలని రౌత్ పేర్కొన్నారు. సుశాంత్ మృతి కేసుపై ముంబై పోలీసుల పనితీరును గతంలోనూ పలుమార్లు కంగనా ప్రశ్నించారు. సుశాంత్ మరణించిన అనంతరం బాలీవుడ్లో బంధుప్రీతి, ఇతరులతో పోలిస్తే స్టార్ కిడ్స్ను ప్రోత్సహించే సంస్కృతిపై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడకం మామూలేనని కంగనా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. నార్కోటిక్స్ బ్యూరో విచారణ చేపడితే బాలీవుడ్లో పలువురు ప్రముఖులు జైలు ఊచలులెక్కపెడతారని ఆమె వ్యాఖ్యానించారు. Sanjay Raut Shiv Sena leader has given me an open threat and asked me not to come back to Mumbai, after Aazadi graffitis in Mumbai streets and now open threats, why Mumbai is feeling like Pakistan occupied Kashmir? https://t.co/5V1VQLSxh1 — Kangana Ranaut (@KanganaTeam) September 3, 2020 -
కాంగ్రెస్‌లో నాయకత్వ చర్చ : శివసేన కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకత్వంపై సాగుతున్న చర్చలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జోక్యం చేసుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా రాహుల్ గాంధీని నిలువరిస్తే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సరితూగే స్ధాయి కలిగిన నేత కాంగ్రెస్‌లో లేరని రౌత్ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా నిరోధించిన వారు ఎవరని ప్రశ్నించారు. రాహుల్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకుంటే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి : శివసేనలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతరుడి ఎన్నిక మంచి ఉద్దేశమే అయినా ఆ 23 మందిలో అలాంటి సామర్థ్యం ఉన్న నేత ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చావులేని వృద్ధ మహిళ వంటిదని ఆ పార్టీ దివంగత నేత వీఎన్ గాడ్గిల్ అభివర్ణించేవారని, అలాంటి పార్టీని ఎలా కాపాడుకోవాలో రాహుల్ నిర్ణయించుకోవాలని రౌత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని, అన్ని స్ధాయిల్లో చురుకుగా ఉండే పూర్తికాల అధ్యక్షులను నియమించాలని 23 మంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి 23 మంది నేతలు సంతకాలు చేశారు. కాగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం పట్ల సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ సీనియర్ నేతలపై మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని సీనియర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన సీనియర్లు రాజీనామాకు సిద్ధపడగా వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
సుశాంత్ కేసు : సేన ఎంపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించిన అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు బాసటగా నిలిచారు. ఈ కేసును ముంబై పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై తాను వ్యాఖ్యానించబోనని, చట్టం గురించి అవగాహన కలిగి ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కోర్టు తీర్పుపై స్పందిస్తారని అన్నారు. తాను సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడలేనని, ముంబై పోలీస్ కమిషనర్ లేదా తమ అడ్వకేట్ జనరల్ దీనిపై వ్యాఖ్యానిస్తారని రౌత్ తెలిపారు. సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మహారాష్ట్ర న్యాయ వ్యవస్ధ దేశంలోనే మెరుగైనదని, ఇక్కడ ఎవరూ చట్టానికి అతీతులు కారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పట్నాలో సుశాంత్ మృతిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం చట్టబద్ధమేనని, బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చదవండి : రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’ -
మోదీ స్వీయ నిర్బంధంలోకి వెళ్తారా?
సాక్షి, ముంబై : అయోధ్య భూమిపూజ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అని శివసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ నిలదీశారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌తోక్ అనే తన కాలమ్‌లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆగస్ట్ 5 న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’అని రౌత్ డిమాండ్ చేశారు. (చదవండి : కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్ ) అలాగే కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందని, రష్యా మాత్రం కోవిడ్ -19 కు వ్యాక్సిన్ కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపిందన్నారు. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని కేంద్రంపై రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి : వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) కాగా, అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, ఆగస్ట్ 13న కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా క్వారంటైన్లోకి వెళ్లాలని శివసేన డిమాండ్ చేస్తోంది.