ముంబై: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతున్న బలమైన గళాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ రౌత్ అరెస్టును ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీనిపై తామంతా ఐక్యంగా పోరాడుతామని చెప్పారు.
The attempt to silence one of the most vocal opponent of the central/ state BJP and their wrongdoings — Sh @rautsanjay61 ji —is on. It is a shameful attempt to use central agencies to harass the opposition leaders. Condemn this harassment and we will all fight this out unitedly.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 31, 2022
రూ.1000కోట్ల పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబైలోని ఆయన నివాసంలో గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల అక్రమ నగదును సీజ్ చేశారు. రౌత్ అరెస్టును శివసేన సహా విపక్ష పార్టీల నేతలు ఖండించారు.
చదవండి: మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ
Comments
Please login to add a commentAdd a comment