Priyanka Chaturvedi
-
స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ
ప్రముఖ హీరో అభిమానులు.. తనని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు. డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం కాస్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?)మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. రీసెంట్గా లాతూర్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ కోసం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ మత రాజకీయాలపై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. మతాన్ని భోదించే వాళ్లకు చెప్పండి, మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, వీటి బదులుగా మన జీవితాల్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందని అన్నాడు.రితేశ్ దేశ్‌ముఖ్ వీడియోని ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో బీజేపీ సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ అభిమానులు ఈమెని టార్గెట్ చేశారు. ఈమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే విషయమై ప్రియాంక ట్వీట్ చేశారు. తనని లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్లకు హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చి మరీ తనపై ట్వీట్లు వేస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఈమె చెప్పడం సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు)Today some Akshay Kumar fan club and paid blue tick film influencers have been given a hashtag and drafted tweets to target me.🥱 Easy to guess where it’s coming from thanks to grammatical errors in the drafted tweet bank 😂IYKYK— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 11, 2024 -
ఏపీలో రాజకీయ హింస సుప్రీం సుమోటోగా తీసుకోవాలి
-
తొమిదేళ్ళు పట్టిందా? అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ సీరియస్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కపటమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2014 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే మహిళా రిజర్వేషన్ సాధిస్తామని హామీ ఇచ్చారని, అది జరిగిన తొమ్మిదేళ్లకు వారిలో చలనం వచ్చిందని అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కపటమైనవని తొమ్మిదేళ్ల క్రితం 2014లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకోస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఈ బిల్లుకు లోక్‌సభలో మోక్షం కలిగించారన్నారు. ఇక ఈ బిల్లు విషయంలో కూడా వారు కపట మాటలనే చెబుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడమనేది జనగణన, డీలిమిటేషన్ వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వారు 2021 నుంచి జనగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాకు తెలిసి 2029 కంటే ముందు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం లేదు. దాని తర్వాత జనగణన 2031లో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లోనే మహిళలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అంతకుముందు బిల్లుపై చర్చలు జరుగుతున్నసమయంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఎన్నికలు జరిగిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెడతామన్నారు. దానికోసం అవసరాన్ని బట్టి చట్టంలో కొన్ని మార్పులు చేస్తామన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, దానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. #WATCH | Delhi: On Union Home Minister Amit Shah's statement in parliament, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "His (HM Amit Shah) statement is hypocritical because a commitment made to the women of the country 9 and a half years ago in the 2014 manifesto and coming and… pic.twitter.com/LV61OqKV5N — ANI (@ANI) September 20, 2023 ఇది కూడా చదవండి : Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి -
'దేశానికి క్షమాపణలు చెప్పండి' ఆదిపురుష్ టీంపై మహిళా ఎంపీ ఫైర్..
ఢిల్లీ: శివ్ సేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ సినిమా టీంపై విరుచుకుపడ్డారు. హిందూ పురాణమైన రామాయణానికి తగ్గట్టుగా సినిమాలో డైలాగ్స్ లేవని ఆరోపించారు. చిత్ర బృందం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'డైలాగ్ రచయిత మనోజ్ముంతాషిర్, డైరెక్టర హోం రౌత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డైలాగ్‌లు గౌరవప్రదంగా లేవు. ముఖ్యంగా హనుమంతుని డైలాగ్‌లు సరిగా లేవు. వినోదం పేరుతో హిందు దేవుళ్లపై తీసిన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే భాషను వాడారు. మర్యాద పురుషోత్తమ రామునిపై సినిమా తీసి.. త్వరగా రిలీజ్ చేయాలని మర్యాదను మరిచారు' అని ప్రియాంక చతుర్వేది అన్నారు. మైథాలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ఆదిపురుష్ శుక్రవారం రిలీజ్ అయింది. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ షోలో ఓ సీటు హనుమంతుని కోసం ఉంటుందని దర్శకుడు హోం రౌత్ చెప్పారు. సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో దృశ్యాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ -
Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి!
బాగా చదువుకుని, తాము చాలా ఓపెన్‌గా.. నిష్కపటంగా(ఫ్రాంక్‌గా) ఉన్నామని, భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలైనా తమంతట తాముగా తీసుకోగలమని భావించే అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు సహజీవనం అనేది ఎందుకు? ఒకవేళ అలాంటి బంధాలు అవసరం అనుకుంటే.. అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి!. ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి ఒప్పుకోకపోతే.. న్యాయబద్ధంగా పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి... ! శ్రద్ధావాకర్ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన పైవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అమ్మాయిలు సహజీవనం పేరుతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లడం సరికాదంటూ వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలను శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఖండించారు. తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారామె. ‘‘అలా ఎందుకు చేస్తున్నారో అనే విషయంపై అమ్మాయిలే జాగ్రత్త పడాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి బంధాలకు దూరంగా ఉండాలి. అసలు తల్లిదండ్రులు అలాంటి బంధాలకు ఒప్పుకోనప్పుడు.. పూర్తి బాధ్యత ఆ చదువుకున్న అమ్మాయిలదే అవుతుంది కూడా’’ అని మంత్రి కౌశల్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశంలో పుట్టడానికి ఆడపిల్లలే కారణమని చెప్పకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. సిగ్గులేని, హృదయం లేని, క్రూరమైన వాళ్ల వల్ల అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం అభివృద్ధి చెందుతూనే ఉంది అని ఆమె పేర్కొన్నారు. నారీశక్తికి కట్టుబడి ఉంటే తక్షణమే ఆయన్ని తొలగించాలంటూ ప్రధాని కార్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. Surprised he didn’t say girls are responsible for being born into this nation. Shameless, heartless and cruel, blame-the-woman-for-all problems mentality continues to thrive. https://t.co/ILYGHjwsMX — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 17, 2022 ఇదీ చదవండి: అఫ్తాబ్‌పై ఆ పరీక్షలు నిర్వహిస్తారా? -
Sanjay Raut Arrest: బీజేపీ చర్య సిగ్గుచేటు..
ముంబై: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతున్న బలమైన గళాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ రౌత్ అరెస్టును ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీనిపై తామంతా ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. The attempt to silence one of the most vocal opponent of the central/ state BJP and their wrongdoings — Sh @rautsanjay61 ji —is on. It is a shameful attempt to use central agencies to harass the opposition leaders. Condemn this harassment and we will all fight this out unitedly. — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 31, 2022 రూ.1000కోట్ల పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబైలోని ఆయన నివాసంలో గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల అక్రమ నగదును సీజ్ చేశారు. రౌత్ అరెస్టును శివసేన సహా విపక్ష పార్టీల నేతలు ఖండించారు. చదవండి: మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ -
హ్యుందాయ్ ‘సారీ’.. మరో మలుపు తిరిగిన వివాదం
హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో #BoycottHyundai బాయ్‌కాట్ హుందాయ్ ట్విటర్లో ట్రెండ్ అయ్యింది. వాహనదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరారు. కశ్మీర్ కోసం పాక్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ కడిగిపడేశారు హ్యుందాయ్‌ని. ఈ నేపథ్యంలో కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్.. భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా.. హ్యాందాయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యూందాయ్(హెచ్ఎంఐఎల్) భారత విభాగం చెప్పుకొచ్చింది. కానీ.. Hi Hyundai. So many wishy-washy words not needed. All you need to say is - we are unequivocally sorry. Rest is all unnecessary https://t.co/wjqNh7YsXv — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 6, 2022 Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd — Hyundai India (@HyundaiIndia) February 6, 2022 రాజకీయ విమర్శలు అయినా వివాదం చల్లారడం లేదు. పైగా ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ వివాదం రాజకీయ అంశంగా మారింది. పలువురు రాజకీయ నేతలు.. హ్యుందాయ్‌పై విరుచుకుపడుతున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది హ్యుందాయ్ తీరును తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. హ్యూందాయ్ ఇండియా ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన సందేశంలో అనవసరమైన పదాలు అక్కర్లేదని, స్పష్టంగా సారీ చెప్తే సరిపోయేదని, మిగతాదంతా అనవరసరమని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత డాక్టర్ విజయ్ చౌథాయివాలే సైతం హ్యుందాయ్‌పై విరుచుకుపడ్డారు. కేవలం సారీ సరిపోదని, వివరణ ఇవ్వాల్సిందేనని, ఇలా భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలపై హ్యుందాయ్ గ్లోబల్ స్టాండ్ ఏంటో తెలియజేయాలని కోరారు. .@HyundaiIndia , this is not sufficient. You must explain if you endorse statements of @PakistanHyundai ? What's your global stand on such anti-India rhetoric? @Hyundai_Global https://t.co/jA0QQjU3Az — Dr Vijay Chauthaiwale (@vijai63) February 6, 2022 ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారుతీ సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ప్రముఖ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV అయిన క్రెటాతో సహా కంపెనీ 12 మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో, హ్యుందాయ్ 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశంలో సుమారు ₹ 4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించుకుంది. చదవండి: హ్యుందాయ్ కంపెనీపై ఫైర్! ఏ రేంజ్లో అంటే.. -
‘ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారు’
ట్రాఫిక్ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు. ఆర్థిక రాజధానిలో రోడ్ల పరిస్థితిని గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధంగా విచిత్రమైన వాదనను వినిపించారు. అంతేకాదు తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. గుంతలు, ట్రాఫిక్‌తో తాను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. పైగా ఈ ట్రాఫిక్ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఒక విచిత్రమైన లాజిక్‌ని చెప్పారు. దీంతో శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆమె పేరు ఎత్తకుండానే సోషల్ మీడియా వేదికగా ఆమె స్టేట్మెంట్పై విరుచుకుపడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అంతేకాదు బెంగుళూరు కుటుంబాలు ఈ స్టేట్మెంట్ని క్లైయిమ్ చేసుకుంటారే ఏమో! జాగ్రత్తా అంటూ ప్రియాంక చతుర్వేది చమత్కరించారు. పైగా విడాకులు తీసుకోవడంపై దృష్టి సారించకుండా కుటుంబంతో గడిపేందుకు హాలీడే బ్రేక్ తీసుకోండి అన్నారు. అంతేకాదు దయచేసి ఈ విచిత్రమైన స్టేట్మెంట్ని అనుకరించకండి మీ వివాహబంధానికి ప్రాణాంతకం కావచ్చు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలతో విమర్శిస్తూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. #WATCH: BJP leader Devendra Fadnavis' wife Amruta Fadnavis says, "I'm saying this as common citizen. Once I go out I see several issues incl potholes,traffic. Due to traffic,people are unable to give time to their families & 3% divorces in Mumbai are happening due to it." (04.02) pic.twitter.com/p5Nne5gaV5 — ANI (@ANI) February 5, 2022 Best (il)logic of the day award goes to the lady who claims 3% Mumbaikars are divorcing due to traffic on roads. Please take a holiday break rather than having a mind on brake.. Bengaluru families please avoid reading this , can prove fatal for your marriages 😂 — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 5, 2022 (చదవండి: నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి) -
ప్రముఖ మహిళల ఫొటోలు యాప్‌లో వేలానికి
న్యూఢిల్లీ: ప్రముఖ ముస్లిం మహిళల ఫొటోలను యాప్‌లోకి అప్లోడ్ చేసి వేలానికి పెట్టిన దారుణ వికృత చేష్ట ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై భిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత జులైలో ‘సలీ డీల్స్’ పేరిట జరిగిన అరాచకాన్ని గుర్తుచేస్తూ ‘బుల్లి బాయ్’ యాప్ ఒకటి తెరమీదకొచ్చింది. దాదాపు 100 మంది ప్రముఖ ముస్లిం మహిళలు, మహిళా పాత్రికేయుల ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాల నుంచి సేకరించి వాటిని బుల్లి బాయ్ యాప్‌లో అప్లోడ్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేలానికి పెట్టారు. దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు, ముంబై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. యాప్ కార్యకలాపాలకు వేదికగా వాడుతున్న ‘గిట్‌హబ్’ ప్లాట్‌ఫామ్‌లోని యూజర్ ఐడీని బ్లాక్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆన్లైన్ నెట్‌వర్క్‌లోకి హ్యాకింగ్ యత్నాలపై ఆయా సంస్థలను అప్రమత్తం చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్), ఢిల్లీ, ముంబై పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, బుల్లి బాయ్ వెబ్సైట్లో తన ఫొటోను వాడారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్ట్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ డెవలపర్లు, ట్విట్టర్ హ్యాండిల్ హోల్టర్లపై ముంబై సైబర్ విభాగం మరో కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు మహిళా జాతీయ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ సూచించారు. మహిళలను అవమానించడం, మత విద్వేషంపై ప్రజలు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వారికి అధికార అండదండలు: మెహబూబా ముఫ్తీ ఆరోపణ యాప్ ద్వారా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న వారికి ‘అధికార అండదండలు’ అందుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు వెనకుండి నడిపించడం వల్లే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు స్వేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. -
సంసద్ టీవీ హోస్ట్‌లుగా శశిథరూర్, ప్రియాంక
న్యూఢిల్లీ: రాజకీయ రంగంలో వాళ్లిద్దరికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అభిప్రాయాలను చెప్పడంలో, ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టేలా సమాధానం ఇవ్వడంలోనూ వారికి వారే సాటి. అయితే ఇప్పుడు వారు తమ స్థానాన్ని మార్చుకొని ప్రశ్నించే స్థానంలోకి వస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచి్చన సంసద్ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘టు ది పాయింట్’ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. -
జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన లఢక్, కశ్మీర్‌లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో బుధవారం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ 5, 2019న జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తు కల్పిస్తున్న 370, 35ఏ అధికరణలను కొట్టివేశారు. వాటిని రాజ్యాంగం నుంచి తొలగించి జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. రెండూ ప్రశ్నలకు కలిపి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 2020లో 59 శాతం ఉంటే జూన్ 2021 వరకు 32 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై నిరంతర నిఘా పెట్టినట్లు చెప్పారు. లోయలో కశ్మీరీ పండితుల పునరావాసం.. భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 900 కశ్మీరీ పండిత్, డోగ్రా హిందూ కుటుంబాలు కశ్మీర్లో ఉన్నాయని వెల్లడించారు. -
గాల్వన్ లోయను చైనాకు వదిలేశారా?
ముంబై: లద్ధాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంపై సర్వ అధికారాలు తమకే చెందుతాయన్న చైనా ప్రకటనపై కేంద్రం స్పందించాలని శివసేన ఉపాధ్యక్షురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చర్యలకు సిద్ధమంటూనే చైనా పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మోదీ దేశానికి హామీ ఇచ్చారు. కానీ గాల్వన్ లోయ తమదిగా చైనా చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు కొన్ని అనుమానాలున్నాయి. గాల్వన్ లోయను మనం విడిచిపెట్టామా లేదా అక్కడి నుంచి చైనా సైన్యాన్ని వెళ్లగొట్టారా? దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ చతుర్వేది ట్వీట్ చేశారు. (మరి మన జవాన్లు ఎక్కడ గాయపడ్డారు: చిదంబరం) Yesterday PM Modi assured the nation that no posts/territory have been ceded to China, but here China claims Galwan Valley as theirs. This is unacceptable& GoI needs to clarify or respond to this. Have we ceded our Galwan Valley or ousted the PLA from there? Nation needs to know. pic.twitter.com/FhVH4vvW4j — Priyanka Chaturvedi (@priyankac19) June 20, 2020 జూన్ 15న లద్ధాఖ్‌లో గాల్వన్ లోయలో సరిహద్దు వివాదంలో తలెత్తిన ఘర్షణలో భారత్‌కు చెందిన కల్నల్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కు అటు (చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని శుక్రవారం చైనాకు భారత్ స్పష్టం చేసింది. మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒక్క అడుగు కూడా మన భూభాగాన్ని వదులుకునేది లేదని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలతో మోదీ అన్నారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్ ) -
శివ సైనిక
చదువు కళ ఉన్న ముఖం తెలిసిపోతుంది. ప్రియాంక చతుర్వేది అలాంటి కళే కలిగిన నాయకురాలు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రియాంకను నామినేట్ చేస్తున్నట్లు శివసేన ప్రకటించగానే పార్టీలోని అనేక ముఖాలు కళావిహీనం అయ్యాయి. అయితే శివసేన ప్రియాంకను రాజ్యసభకు పంపించాలని నిశ్చయించుకోడానికి తగిన కారణమే ఉంది. ప్రియాంక చక్కటి ఇంగ్లిష్ మాట్లాడతారు. హిందీ కూడా బాగా వచ్చు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రలో స్థిరపడిన కుటుంబం కనుక మరాఠీ కూడా కొట్టిన పిండే. మహారాష్ట్రలో ఉండేవారంతా మరాఠీలోనే మాట్లాడాలని శివసేన అంటున్నా.. రాజ్యసభలో మాత్రం తన స్వరం వినిపించడానికి ఆ పార్టీకి ఇంగ్లిష్, హిందీ తప్పనిసరి అవుతోంది. అందుకే ప్రియాంకను ఎంచుకుంది. ప్రియాంక గత ఏడాది ఏప్రిల్ వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2010 లో పార్టీలో చేరి, రెండేళ్లలోనే నార్త్–వెస్ట్ ముంబై జాతీయ యువజన కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అయితే ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కొందరు ఆమెతో అమర్యాదగా ప్రవర్తించినప్పుడు.. వారిని పార్టీనుంచి బయటికి పంపించిన కాంగ్రెస్.. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లను వెనక్కు తీసుకోవడంతో ఆగ్రహించి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వచ్చిన రెండో రోజే శివసేనలో చేరిపోయారు. ‘పార్టీలో నేను మామూలు శివసైనికురాలిగా ఉంటాను’ అని ఆమె అన్నారు కానీ, ఠాక్రేనే.. సైనిక దళానికి ఒక నేతగా ఉండమని కోరారు. ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు. ప్రియాంక జన్మస్థలం ఉత్తర ప్రదేశ్. పెరిగిందీ, చదువుకున్నదీ ముంబైలో. జూహూలోని సెట్ జోసెఫ్స్ హైస్కూల్లో చదివారు. విలేపార్లే లోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్‌లో కామర్స్ డిగ్రీ చేశారు. తర్వాత పెళ్లి, ఇద్దరు పిల్లలు. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా మంచి కాలమిస్టుగానే ఆమెకు పేరు. బాగా రాస్తారు, రాసినంత బాగా మాట్లాడతారు. ‘తెహల్కా’, ‘డైలీ న్యూస్ అనాలిసిస్’, ‘ఫస్ట్‌పోస్ట్’.. వీటికి వ్యాసాలు రాశారు. రెండు మూడు ఎన్జీవోలకు ధర్మకర్త కూడా. బాలల విద్య, స్త్రీ సాధికారత, స్త్రీ ఆరోగ్యం.. ఇవీ.. వ్యాసకర్తగా, సామాజిక కర్యకర్తగా ఆమె స్వీకరించిన బాధ్యతలు. ఏ ప్రభుత్వమైనా మొదట స్త్రీ శిశు సంక్షేమం కోసం పని చేయాలని ప్రియాంక అంటారు. అప్పుడు అభివృద్ధి దానంతటే వస్తుందని చెబుతారు. ముంబైలో ‘ఎంపవర్ కన్సల్టెంట్స్’ అని.. మీడియా, పి.ఆర్. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి ఉంది. డిగ్రీ అయిపోగానే ఆ కంపెనీ డైరెక్టర్‌గా చేరారు ప్రియాంక. ముంబైలోనే ‘ప్రయాస్ చారిటబుల్ ట్రస్ట్’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో రెండు పాఠశాలు ఉన్నాయి. స్థోమత లేని 200 మంది పిల్లలకు ఆ పాఠశాలల్లో ఉచిత విద్య లభిస్తోంది. ఆ సంస్థకు కూడా ట్రస్టీగా ఉన్నారు ప్రియాంక. మోదీ అంటే ఆమెకు పడదు. ఇక చూడాలి.. ఈ శివసైనికురాలు రాజ్యసభలో మోదీ సైన్యాన్ని తన వాక్పటిమతో, సామాజికాంశాలలో తనకున్న పరిజ్ఞానంతో ఎలా అదరగొట్టి, బెదరగొట్టి దారికి తెస్తారో! -
అది బ్యాంక్ ఉద్యోగి పనికాదు..
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, శివసేన నేత ప్రియాంక చతుర్వేదిల మధ్య సంవాదం ముదురుతోంది. తనను టార్గెట్ చేస్తున్నారన్న అమృత వ్యాఖ్యలపై ప్రియాంక తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చాలని థానే మేయర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువైంది. అమృత ఫడ్నవీస్ యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి అయినందునే అప్పట్లో యాక్సిస్ బ్యాంకుకు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలను మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. యాక్సిస్ బ్యాంకుకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రియాంక సందేహం వ్యక్తం చేశారు. యాక్సిస్ బ్యాంకుకు ఖాతాలు బదలాయించిన తర్వాత బ్యాంకు సీఎస్ఆర్ నిధుల నుంచి బీజేపీ పథకాలకు ఎంత నిధులు వచ్చాయనేది విచారణలో నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సలహాలివ్వడం, బోధనలు చేయడం యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి పరిధిలోకి రాని అంశాలని అమృతా ఫడ్నవీస్‌కు ప్రియాంక చతుర్వేది చురకలు అంటించారు. మరోవైపు ఖాతాలను జాతీయ బ్యాంకులకు బదలాయించాలని, యాక్సిస్ బ్యాంక్‌ను పోషించింది చాలని బీఎంసీ సేన కార్పొరేటర్ సమాధాన్ సర్వంకర్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌లో ఫడ్నవీస్ భార్య పనిచేస్తున్నందునే ప్రభుత్వ ఖాతాలను ఆ బ్యాంకుకు మళ్లించారని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. చదవండి : యాక్సిస్‌కు దూరమైన ‘అమృత’ ఘడియలు! -
‘అదో రోగం.. అవును త్వరగా కోలుకోండి’
థానే: యాక్సిస్ బ్యాంక్‌లో సీనియర్ అధికారిణి అయిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు, శివసేన డిప్యూటీ నేత ప్రియాంక చతుర్వేదికి మధ్య ట్విటర్ వేదికగా గొడవ తలెత్తడంతో యాక్సిస్ బ్యాంక్‌కు తలనొప్పి తెస్తోంది. ఏడాదికి రూ.11వేల కోట్ల లావాదేవీలుండే మహారాష్ట్ర పోలీసు విభాగం తన వేతన ఖాతాలను వేరే బ్యాంక్‌కు మార్చనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా శివసేన చేతుల్లోని థానే మున్సిపల్ కార్పొరేషన్ సైతం తన ఉద్యోగుల వేతన ఖాతాలను యాక్సిస్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చాలని నిర్ణయించుకుంది. ‘నా పేరు రాహుల్ సావర్కర్ కాదు’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను అమృత విమర్శించడంతో వివాదం ముదిరింది. తన పేరు వెనుక ఠాక్రే ఇంటి పేరు తగిలించుకున్న వ్యక్తి విలువలకు తిలోదకాలు ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారంటూ పరోక్షంగా ఉద్ధవ్‌పై విమర్శలు చేశారు అమృత. దీనికి ప్రియాంక సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలలోపే రైతు రుణాలు మాఫీ చేశారని, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉద్ధవ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అంతకుముందు కూడా అమృత, ప్రియాంకల మధ్య ట్విటర్ వార్ జరిగింది. బాల్ ఠాక్రే మెమొరియల్ కోసం ఔరంగాబాద్‌లోని ప్రియదర్శిని పార్క్‌లో వెయ్యి చెట్లను నేలమట్టం చేయనున్నారని వార్తలు వచ్చినప్పడు శివసేన పార్టీని విమర్శిస్తూ అమృత ట్వీట్ చేశారు. ఆరే ప్రాంతంలో చెట్ల కూల్చివేతను వ్యతిరేకించిన శివసేన.. ఔరంగాబాద్‌లో చెట్ల నరికివేతకు పూనుకోవడాన్ని విమర్శిస్తూ.. ‘సంకుచిత్వం అనేది వ్యాధి లాంటిద’ని అమృత పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఒక్క చెట్టు కూడా కొట్టేయడం లేదని ఔరంగాబాద్ మేయర్ ధ్రువీకరించారు. పదేపదే అబద్ధాలాడటం పెద్ద రోగం. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలువాల’ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
శివసేన గూటికి చతుర్వేది
న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం ఆ పార్టీని వీడారు. ఆ వెంటనే ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. చతుర్వేది కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి పంపారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా, మీడియా విభాగం ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. పార్టీలో కొందరు నాయకులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది వారాలుగా తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆమె కొద్దిరోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అధిష్టానం సస్పెండ్ కూడా చేసింది. అయితే, ఆ పార్టీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి జ్యోతిరాదిత్య జోక్యంతో ఇటీవల వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో తన సేవలకు విలువలేదని, అందుకే పార్టీని వీడుతున్నానని రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రియాంక చతుర్వేదిని ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ శివసేన కార్యకర్తలకు మంచి సోదరి లభించిందని అన్నారు. తన స్వస్థలం ముంబై అని, అందుకే శివసేనలో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణలేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. -
‘మా తప్పిదంతోనే ఆమె పార్టీని వీడారు’
సాక్షి, ముంబై: తమ నాయకత్వ తప్పిదం కారణంగానే ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ పార్టీని వీడారని, ఈ పరిణామం పార్టీపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఒప్పుకుంటున్నానని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. కీలక నేతలు పార్టీని విడిచిపెట్టిన ప్రతిసారి బాధగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేసి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సూర్జేవాలా స్పందిస్తూ, ఎవరు పార్టీని వీడినా తమకు బాధగానే ఉంటుందని చెప్పారు. ఎవరైనా భవిష్యత్తు పురోగతి వైపు అడుగులు వేయడం సహజమేనని, చతుర్వేది సహా అలాంటి వారందరికీ మంచి జరగాలని తాము అశిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో తనపట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని పార్టీని బహిష్కరించి.. ఎన్నికల వేళ మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ప్రియాంక చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కోసం చెమటోడ్చినవారికన్నా, దుష్టులకే పెద్ద పీట వేస్తున్నారని మండిపడుతూ.. రెండు రోజుల క్రితం ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గురువారం ఆమె తన రాజీనామా లేఖను పంపించారు. శుక్రవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలిసి ఆ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్‌కు బై బై..శివసేనకు జై
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి గుడ్ చై చెప్పిన పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంత పార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కొంతమంది నేతలు తమ అనుచిత ప్రవర్తనతో బాధించారంటూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండానే.. వెంటనే శివసైనకు జై కొట్టారు. ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ఆమె శుక్రవారం ఉదయమ సమావేశమయ్యారు. అనంతరం థాక్రే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల లేఖను రాశారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు తన ట్విటర్ ప్రొఫైల్‌లో తక్షణమే కాంగ్రెస్ పార్టీ హోదాలను తొలగించారు.. -
కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి భారీ ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంతపార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక ఊహించినట్టుగా గత రాత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు గాలి బ్యాచ్‌కు ప్రోత్సాహం ఇస్తోందంటూ చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపింది ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఆమె రాహుల్ గాంధీకి లేఖ రాశారు. మరోవైపు తన ట్విటర్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్యాగ్‌ను తీసివేయడం గమనార్హం. కాగా కొద్ది కాలం క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు తనపై అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ ప్రియాంక చతుర్వేది పార్టీ నాయకత్వానికి పిర్యాదు చేశారు. అపంతనం పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కానీ తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సిధియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేసినట్లు ప్రకటించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి : ఆ విషయం నిజంగా బాధిస్తోంది : ప్రియాంక -
సొంత పార్టీపై ప్రియాంక ఫైర్!
న్యూఢిల్లీ : తనతో అసభ్యంగా ప్రవర్తించిన నాయకులను తిరిగి పార్టీలో కొనసాగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తీరు తనను ఎంతగానో బాధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘ఎంతోమంది త్యాగాలతో రూపుదిద్దుకున్న పార్టీలో కొంత మంది గూండాలకు ఇంకా ప్రాధాన్యం దక్కుతోంది. అభ్యంతరకరంగా మాట్లాడి, నన్ను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోంది. నిజంగా ఇది విచారకరం అని ట్వీట్ చేశారు. అదే విధంగా ప్రియాంక చతుర్వేదితో అసభ్యంగా ప్రవర్తించిన నాయకులను పార్టీలో పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన లేఖ అంటూ ఓ జర్నలిస్టు షేర్ చేసిన ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు. అసలేం జరిగిందంటే.. యూపీలోని మథురలో ప్రియాంక చతుర్వేది నిర్వహించిన పత్రికా సమావేశంలో రఫేల్ ఒప్పందం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. దీంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారిని సస్పెండ్ చేసింది. అయితే పశ్చిమ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా జోక్యంతో సస్పెండ్ అయిన నాయకులను పార్టీ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఆవేదనకు గురైన ప్రియాంక సొంత పార్టీపై ఫైర్ అయ్యారు. కాగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. సోదరీసోదరులకు వందనం అంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న ప్రియాంక.. యూపీలో మహిళా నాయకురాలి పట్ల పార్టీ నేతలు వ్యవహరించిన తీరుపై ఏవిధంగా స్పందిస్తారోనన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for the party but yet those who threatened me within the party getting away with not even a rap on their knuckles is unfortunate. https://t.co/CrVo1NAvz2 — Priyanka Chaturvedi (@priyankac19) April 17, 2019 -
టీఎన్ శేషన్ మళ్లీ పుట్టాలేమో!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచే కాకుండా కేరళలోని వయనాడ్ నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేయడం అంటే ‘ మెజారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీకి భయపడి పారిపోవడమే’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. ‘మెజారిటీలైన హిందువుల వ్యతిరేకతకు భయపడి రాహుల్ గాంధీ హిందువులు తక్కువగా ఉన్న నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారని మోదీ విమర్శించారు’ అంటూ ఆ వెంటనే ‘టైమ్స్ నౌ’ ఛానల్ ట్వీట్ చేసింది. దాంతో పలువురు నరేంద్ర మోదీ ఫాలోవర్లు మెజారిటీలైన హిందువులకు భయపడి ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్నారంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. వాస్తవానికి వయనాడ్ జిల్లాలో హిందువులు 49.48 శాతం, ముస్లింలు 26.65 శాతం మంది ఉన్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఇచ్చిన ట్వీట్‌తో మోదీ ఫాలోవర్లు కాస్త తగ్గారు. వయనాడ్‌లో ఏ మతస్థులు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని పక్కన పెడితే, రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ విమర్శించడం ద్వారా క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ లౌకిక స్వరూపాన్నే విమర్శించడం అవుతోంది. ఆయన ఒక్కరే కాదు, ఆయన పార్టీ నాయకులంతా మతం ప్రాతిపదికగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి కూడా కుల, మత, జాతి, భాష పరంగా ఓటు అడగరాదు, అదే కారణంగా ఓటు వేయరాదంటూ కోరరాదు’ ఈలెక్కన మోదీ కూడా ఈ నియమావళిని ఉల్లంఘించినట్లే. (చదవండి: కేరళ నుంచి రాహుల్ పోటీ ఎందుకు?) ఇక మోదీ తరఫున ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో రెండు అడుగులు ముందుకేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. యూపీలోని ఓ ర్యాలీలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘2015లో గోమాంసం తిన్న ఓ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికితే దాన్ని అణచివేసేందుకు అప్పటి సమాజ్‌వాది పార్టీ ప్రయత్నించింది’ అంటూ విమర్శించగా, ఆ సభలో ముందు వరుసలో కూర్చున్న నాటి సంఘటనలో ప్రధాన నిందితుడు లేచి ఈల వేసి గోల చేశాడు. యూపీలోని దాద్రిలో 2015, సెప్టెంబర్ 28వ తేదీన గోమాంసం తిన్నాడన్న అనుమానంతో అక్లాఖ్ అనే ముస్లింను మూక దాడిలో చంపిన విషయం తెల్సిందే. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడు ఓ ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీని మరోసారి గెలిపిస్తే ‘మతపరమైన చట్టాలన్నింటిని సవరిస్తాం’ అని చెప్పారు. అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులకు, బౌద్ధులకు, సిక్కులకు సానుకూలంగా సవరిస్తారు కావచ్చు! 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి ప్రాతిపదికన సబ్కే వికాస్, అచ్చేదిన్ నినాదాలతో మోదీ, ఆయన పార్టీ నేతల గణం ప్రచారం చేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు మతపరంగా ఓటర్లను విభజించి ఓట్లు అడుగుతుందంటే ‘హంగు’ భయమే కావచ్చు! ఏదీ ఏమైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు వచ్చే వరకు నిరీక్షించకుండా ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు టీఎన్ శేషన్ మళ్లీ పుట్టాలేమో! -
ప్రియాంకకు ట్యాగ్.. అభాసుపాలైన కాంగ్రెస్..
సాక్షి, హైదరాబాద్ : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. భూ పరీక్షల ల్యాబ్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్దాలు చెబుతున్నారని, రైతులకు ఆయా ల్యాబ్‌ల నుంచి ఇస్తున్న భూ పరీక్ష రిపోర్టులు తప్పనే ఆరోపణలు చేస్తూ గురువారం ఆ ట్వీట్ చేసింది. యూపీఏ హాయాంలో 1141 భూ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు చెబుతూ ప్రియాంక చతుర్వేదిని ట్యాగ్ చేయబోయి, ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. దాంతో ట్విట్టర్లో కాంగ్రెస్‌పై జోకులు పేలాయి. వాటితో నాలుక్కరచుకున్న పార్టీ సదరు ట్వీట్‌ను డిలీట్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఐదేళ్ల కిందట ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్లో ఆ పార్టీ క్షమాపణలను కూడా కోరింది. -
ప్రియాంక చతుర్వేది కుమార్తెకు బెదిరింపులు
సాక్షి, ముంబై : తన పదేళ్ల బాలికపై లైంగిక దాడి జరుపుతామంటూ ట్విటర్ వేదికగా హెచ్చరిస్తూ ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరీష్‌కే1605 ట్విటర్ ఖాతా నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయని ఆమె చెప్పారు. దీనిపై తాను గోరెగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చతుర్వేది చెప్పారు. శ్రీరాముడి ప్రొఫైల్ పిక్‌ను పెట్టుకున్న సదరు ట్విటర్ యూజర్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంలో వెనుకాడలేదని ఆమె ట్వీట్ చేశారు. ముంబై పోలీసులు తన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, సమాజంలో చెడు ఉన్నట్టే మంచి కూడా ఉందని అన్నారు. కాగా చతుర్వేది కుమార్తెకు ఈ తరహా హెచ్చరికలు చేయడాన్ని ఎన్సీపీ నేత సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై చట్టప్రకారం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. -
మోదీజీ..అమిత్ షా అంటే భయమెందుకు?
సాక్షి,పనాజీ: బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడిపై వచ్చిన ఆరోపణల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనందాల్చడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. జే షాపై నిష్పాక్షిక విచారణ జరిగేందుకు అమిత్ షా తన పదవి ఉంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. షెల్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రధాని తీవ్ర చర్యలు చేపడుతుంటే ఆ తరహాలోనే అమిత్ షా కుమారుడు జే షాకు చెందిన టెంపుల్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలకు పాల్పడిందని ఏఐసీసీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పారదర్శకత గురించి మాట్లాడే ప్రధాని, అమిత్ షాలు ఈ ఆరోపణలపై విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అమిత్ షాను ప్రధాని ఎందుకు కాపాడుతున్నారని..తనకు సన్నిహితుడైన వ్యక్తిని జవాబుదారీగా ఉండాలని కోరేందుకు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. షెల్ కంపెనీలపై పోరాడుతున్నానని, డొల్ల కంపెనీలను మూసివేయిస్తానని చెబుతున్న ప్రధాని అమిత్ షా కుమారుడి డొల్ల కంపెనీలపై మౌనం దాల్చారని విమర్శించారు. జే షా డొల్ల కంపెనీలపై విచారణ చేపడితే వాటిలో డొల్లతనం నిగ్గుతేలుతుందని అన్నారు.ఈ వ్యవహారంలో విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు. అమిత్ షా కుమారుడికి చెందిన కంపెనీ టర్నోవర్ కేవలం ఒక్క ఏడాదిలోనే (2015-16) రూ 50,000 నుంచి 80.5 కోట్లకు పెరిగిందన్న ఓ వెబ్సైట్ కథనం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ ఎన్బీఎఫ్సీ నుంచి హామీ రహిత రుణం పొందడం వల్లే టర్నోవర్ భారీగా పెరిగిందని దివైర్ వెబ్సైట్ పేర్కొంది. -
'స్మృతి ఇరానీ... ఈగో పక్కనపెట్టు'
న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ కారణమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. స్మృతి అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ధ్వజమెత్తారు. అహం తగ్గించుకుని, తన శాఖపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. 'అధికారంలో ఉన్నవారికి అహం పనికిరాదు. పాలకులకు ఈగో పెద్ద శత్రువు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం మానేసి తన శాఖపై దృష్టి పెట్టాలని స్మృతి ఇరానీని సవియనంగా కోరుతున్నామ'ని రణదీప్ సూర్జివాలా పేర్కొన్నారు. ఇరాని బాగా చదువుకున్నారని, అయితే అన్ని యూనివర్సిటీల నుంచి ఆమె పట్టాలు ఎలా సాధించారో తెలియడం లేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, స్మృతి ఇరానీ మధ్య ట్విటర్ లో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.