ప్రముఖ హీరో అభిమానులు.. తనని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు. డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం కాస్త బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?)
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. రీసెంట్‌గా లాతూర్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ కోసం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ మత రాజకీయాలపై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. మతాన్ని భోదించే వాళ్లకు చెప్పండి, మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, వీటి బదులుగా మన జీవితాల్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందని అన్నాడు.
రితేశ్ దేశ్‌ముఖ్ వీడియోని ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో బీజేపీ సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ అభిమానులు ఈమెని టార్గెట్ చేశారు. ఈమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే విషయమై ప్రియాంక ట్వీట్ చేశారు. తనని లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చి మరీ తనపై ట్వీట్‌లు వేస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఈమె చెప్పడం సంచలనంగా మారింది.
(ఇదీ చదవండి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు)
Today some Akshay Kumar fan club and paid blue tick film influencers have been given a hashtag and drafted tweets to target me.🥱
Easy to guess where it’s coming from thanks to grammatical errors in the drafted tweet bank 😂
IYKYK— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 11, 2024
Comments
Please login to add a commentAdd a comment