
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ పాన్ మసాలా యాడ్‌లో కలిసి నటించారు. అయితే పాన్ మసాలా యాడ్‌లో అభిమాన హీరో కనిపించడాన్ని చూసి తట్టుకోలేకపోయారు అక్షయ్ ఫ్యాన్స్. ఇలాంటి ప్రకటనలో నటించడమేంటని మండిపడుతున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను తానెప్పటికీ ప్రమోట్ చేయనని చెప్పి ఇప్పుడెందుకిలా చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.
గుట్కా, మందు వంటి వాటికి తానెప్పుడూ అడ్వర్‌టైజ్ చేయనని అక్షయ్ గతంలో చెప్పాడు. పెద్ద పెద్ద గుట్కా కంపెనీలు భారీ ఎత్తున డబ్బులివ్వడానికి కూడా సిద్ధపడ్డాయి, కానీ తాను మాత్రం అలాంటివాటిని ప్రమోట్ చేయనన్నాడు. మరి ఇప్పుడెందుకు మాట తప్పాడు? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అక్షయ్ సార్ మా మనసు విరిచేశాడని మరికొందరు బాధపడుతున్నారు. మరి దీనికి అక్షయ్ ఏమని సమాధానమిస్తాడో చూడాలి!
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, పెళ్లి ఫొటోలు చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment