pan masala
-
అలా చేస్తే డైరెక్ట్‌గా చావును అమ్మినట్లే: జాన్ అబ్రహం కామెంట్స్!
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం యాక్షన్-థ్రిల్లర్ వేదా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో.. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్న హీరోలపై విమర్శలు చేశారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అభిమానులకు తాను రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకుంటానని తెలిపారు.జాన్ అబ్రహం మాట్లాడుతూ.. 'నేను నిజాయితీగా జీవిస్తేనే రోల్ మోడల్‌గా ఉంటా. ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేస్తే తొందరగా దాన్ని గుర్తిస్తారు. ఇక్కడ కొందరు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు. కానీ అదే వ్యక్తులు పాన్ మసాలా గురించి ప్రచారం చేస్తారు. నేను నా సహ నటులందరినీ గౌరవిస్తా. ఇక్కడ కేవలం నా గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మరణాన్ని అమ్మాలనుకోవడం లేదు. మనదేశంలో పాన్ మసాలా వార్షిక టర్నోవర్ రూ.45 వేల కోట్లు అని మీకు తెలుసా? అంటే ప్రభుత్వం కూడా దీనికి మద్దతిస్తోంది. అందుకే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. వీటి గురించి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇన్‌డైరెక్ట్‌గా చావును ప్రజలకు అమ్మినట్లే. అలా వచ్చిన డబ్బులతో మీరెలా బతుకుతున్నారు' అని విమర్శించారు. కాగా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటనలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇలాంటి యాడ్స్‌లో పాల్గొనబోనని అక్షయ్ ప్రకటించాడు. కాగా.. జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహం.. ఆ తర్వాత ధూమ్, గరం మసాలా, టాక్సీ నెం 9211, దోస్తానా, ఫోర్స్, దేశీ బాయ్జ్, రేస్ 2, పఠాన్ వంటి చిత్రాల్లో నటించారు. -
రూ. లక్ష జరిమానా.. పొగాకు కంపెనీలకు షాక్!
పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు జీఎస్టీ (GST) విభాగం భారీ షాక్ ఇచ్చింది. ఆయా ఉత్పత్తుతల ప్యాకింగ్ మెషినరీని తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలో నమోదు చేసుకోవాలని, అలా చేసుకోకపోతే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. పొగాకు తయారీ రంగంలో పన్ను ఎగవేతను నిరోధించడమే దీని ఉద్దేశం. ఈమేరకు కేంద్ర జీఎస్టీ చట్టానికి సవరణలను చేసినట్లు పేర్కొంది. జీసీస్టీ పరధిలో నమోదు కాని ప్రతి మెషిన్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తారు. నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న మెషిన్లను కొన్ని సందర్భాల్లో సీజ్ కూడా చేస్తారు. పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్ మెషినరీల జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక ప్రత్యేక ప్రక్రియను గత సంవత్సరమే జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. తాము వినియోగిస్తున్న ప్యాకింగ్ యంత్రాల వివరాలు, కొత్తగా ఇన్స్టాల్ చేసిన మెషీన్ల ప్యాకింగ్ సామర్థ్యం వంటి వివరాలను GST SRM-I ఫారంలో సమర్పించాలి. అయితే ఇలా వివరాలు ఇవ్వనివారికి ఇప్పటి వరకూ ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ ఇకపై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
పాన్ మసాలా ప్యాకెట్లలో 32 లక్షల యూఎస్ డాలర్లు, కంగుతిన్న అధికారులు
ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్‌లో వందలకొద్ది పాన్‌మసాలా ప్యాకేట్లతో పట్టుబడినట్లు కోల్‌కత్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. వాటిలో ఏకంగా రూ 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీని ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించాడు. దీంతో ఎయిర్పోర్ట్ ఇంటిలిజెన్స్ అధికారులు కోల్‌కతా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కస్టమస్స్ అధికారులు నిందితుడు పాన్‌మసాలా ప్యాకెట్లలో యూఎస్ కరెన్సీని తరలించే విధానం చూసి కంగుతిన్నారు. సుమారు రూ. 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తామ తనిఖీలు చేస్తున్నప్పుడు వందలకొద్ది పాన్ మసాల ప్యాకెట్లు చూసి ఆశ్యర్యపోయాం అన్నారు. ఆ పాన్ ప్యాకెట్లలో ఒక పారదర్శక కవర్లో ఒక జతన యూఎస్ కరెన్సీ దానితో పాటు పాన్ పౌడర్ పెట్టి ప్యాక్ చేశారు. ఒక పెద్ద ట్రాలీ లగేజ్‌లో నిండా ఈ మసాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది) #WATCH | AIU officials of Kolkata Customs intercepted a passenger scheduled to depart to Bangkok yesterday. A search of his checked-in baggage resulted in the recovery of US $40O00 (worth over Rs 32 lakh) concealed inside Gutkha pouches: Customs pic.twitter.com/unxgdR7jSu — ANI (@ANI) January 9, 2023 -
రూ.9 కోట్ల భారీ ఆఫర్.. అయినా ఆ యాడ్‌కు నో చెప్పిన హీరో
పలు వ్యాపార కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం స్టార్ హీరోలను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించుకుంటాయనే విషయం తెలిసిందే. ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లిస్తాయి. అందుకే స్టార్ హీరో ఒకవైపు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే..మరోవైపు యాడ్స్‌లో నటిస్తుంటారు. కొందరు హీరోలు పారితోషికాన్ని బట్టి బ్రాండ్స్ ప్రమోషన్‌కి ఓకే చెబితే.. మరికొందరు మాత్రం డబ్బుని పట్టించుకోకుండా.. ప్రజలకు ఇబ్బందిలేని ఉత్పత్తులకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉంటారు. ఆ లిస్ట్‌లో సాయి పల్లవి, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఉంటారు. (చదవండి: ఎంత పెద్ద సినిమా అయినా.. ఆ రోజు షూటింగ్ బంద్: అక్షయ్ కండీషన్) కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిన పొగాకు కంపెనీ ప్రకటనకి నో చెప్పాడు అల్లు అర్జున్. సాయి పల్లవి కూడా అంతే. ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోట్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినా.. అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక రిజక్ట్ చేసిందట. తాజాగా అదే బాటలో నడిచాడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. పాన్ మసాల యాడ్ కోసం తన వద్దకు వచ్చిన రూ.9 కోట్ల రెమ్యునరేషన్ డీల్ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించే ఉత్పత్తులను తాను ప్రమోషన్ చేయలేనని చెప్పేశాడట. గతంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ లు పొగాకు సంస్థ ప్రకటనల్లో నటించి, నెటిజన్స ఆగ్రహానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అక్షయ్ కుమార్‌పై ట్రోలింగ్, చెప్పిందేంటి? చేస్తుందేంటి?
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ పాన్ మసాలా యాడ్‌లో కలిసి నటించారు. అయితే పాన్ మసాలా యాడ్‌లో అభిమాన హీరో కనిపించడాన్ని చూసి తట్టుకోలేకపోయారు అక్షయ్ ఫ్యాన్స్. ఇలాంటి ప్రకటనలో నటించడమేంటని మండిపడుతున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను తానెప్పటికీ ప్రమోట్ చేయనని చెప్పి ఇప్పుడెందుకిలా చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. గుట్కా, మందు వంటి వాటికి తానెప్పుడూ అడ్వర్టైజ్ చేయనని అక్షయ్ గతంలో చెప్పాడు. పెద్ద పెద్ద గుట్కా కంపెనీలు భారీ ఎత్తున డబ్బులివ్వడానికి కూడా సిద్ధపడ్డాయి, కానీ తాను మాత్రం అలాంటివాటిని ప్రమోట్ చేయనన్నాడు. మరి ఇప్పుడెందుకు మాట తప్పాడు? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అక్షయ్ సార్ మా మనసు విరిచేశాడని మరికొందరు బాధపడుతున్నారు. మరి దీనికి అక్షయ్ ఏమని సమాధానమిస్తాడో చూడాలి! చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, పెళ్లి ఫొటోలు చూసేయండి -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై రేపటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: మ్యూచువల్ బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కాటమనేని భాస్కర్ హెచ్చరించారు. -
లాక్డౌన్: పాన్ మసాలా డ్రోన్ డెలివరీ
గాంధీనగర్: లాక్డౌన్ వల్ల అన్ని సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోగా అత్యవసర పనులకు మాత్రం దీని నుంచి మినహాయింపు లభించింది. అయితే మా గోడు ఎవరూ పట్టించుకోవట్లేదని మందుబాబులు వైన్ షాపులకు కన్నాలు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. మరికొందరైతే చుక్క లేక పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తుంటే కొందరు ఏకంగా ఆత్మహత్యకు సైతం పాల్పడుతున్నారు. దీంతో వారి బాధ చూడలేక రహస్యంగా మద్యం బాటిళ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వ్యాపారులను కూడా పోలీసులు పట్టుకుంటున్నారు. ఇదిలావుంటే కొందరు పాన్ మసాలా వేసుకోక నోరు పిడసకట్టుకుపోయిందంటూ బాధపడటం ఓ వ్యాపారి కంట్లో పడినట్లుంది. (అమ్మకానికి పటేల్ విగ్రహం..!) ఇంకేముందీ, వారికి ఎలాగైనా దాన్ని అందించాలని ఆలోచించి అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నాడు. పాన్ మసాలా ప్యాకెట్లను డ్రోన్ సహాయంతో హోమ్ డెలివరీ చేశాడు. ఈ అరుదైన ఘటన గుజరాత్‌లోని మోర్బిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (ఇటలీ నుంచి దొంగలించారు.. అంతా కాపీ పేస్ట్ ) -
వైరల్: డ్రోన్‌తో పాన్ మసాలా డోర్ డెలివరీ
-
చూయింగ్ గమ్, గుట్కా, పాన్‌పై నిషేధం
హర్యానా: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానా ప్రభుత్వం చూయింగ్ గమ్ అమ్మకాలను జూన్ 30 వరకూ నిషేధించినట్లు తాజాగా ప్రకటించింది. ఉమ్మివేయడం ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో చూయింగ్ గమ్‌తో పాటు పాన్ మసాలా, గుట్కాపై కూడా నిషేధం విధించింది. ప్రభుత్వం ఆదేశించిన ఈ నిషేధాన్ని సమవర్థవంతాగా అమలు చేయాలని అధికారులను కోరింది. ‘కరోనా వైరస్ నోటీలోని లాలాజలంతో కూడా వ్యాపిస్తుంది. దీంతో చూయింగ్ గమ్ తినేవారు ఉమ్మివేయడం వల్ల ఆ లాలాజలం ద్వారా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంది’ అని రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ శాఖ వెల్లడించింది. (కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం) అలాగే గత ఏడాదిలో గుట్కా, పాన్ మసాలా, పోగాకుపై విధించిన నిషేధాన్ని కూడా ఏడాది పాటు అమలు చేయాలని సదరు డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సువాసన, రుచిగల పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సున్నం(చునా) పంపిణీనిలపై కూడా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. ఇక రాష్ట్రంలో కరోనా అనుమానితులు 13000 మంది ఉన్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పాన్ మసాలా తయారి, అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. (ఆ వార్డులన్నీ రెడ్ జోన్లు) -
కిళ్లీ తిన్నారో.. 500 జరిమానా..!
ఒడిశా, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం లోనికి కిళ్లీ తింటూ ప్రవేశిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రవేశించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని పాలక మండలి హెచ్చరించింది. జగన్నాథుని దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టరేట్ సమన్వయంతో దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ నిషేధం పట్ల కార్యాచరణ ఖరారు చేస్తారు. దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ ఉమ్మడం నివారించాలని లోగడ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కార్యాచరణ మరుగున పడేయడంతో ఈసారి పాలక మండలి ఘాటుగా స్పందించింది. పూర్తి స్థాయి నిషేధానికి నడుం బిగించింది. భారీగా జరిమానా విధిస్తేనే ఈ తప్పిదాన్ని నివారించడం సాధ్యమవుతుందని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఏఓ అధ్యక్షతన జరుగుతున్న పాలక మండలి సమావేశం ప్లాస్టిక్ నిషేధం శ్రీ మందిరం ప్రాంగణం, పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించాలని పాలక మండలి ప్రకటించింది. ఈ కార్యాచరణ ఏప్రిల్ నెల ఒకటోతేదీ నుంచి అమలు జరుగుతుందని జగన్నాథ ఆలయం ప్రముఖ పాలన అధికారి (సీఏఓ) కిషన్ కుమార్ తెలిపారు. స్వామి అన్న ప్రసాదాలు నిత్యం ఆనంద బజార్లో విక్రయిస్తారు. ఈ ప్రసాదాల్ని సకాలంలో నివేదించి నిర్ధారిత సమయం కంటే ముందుగా భోగ మండపం నుంచి బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్న ప్రసాదాల్ని తాటి ఆకు బుట్టల్లో పంపిణీ చేస్తారు. ఈ మేరకు 20 రోజులు ముందస్తుగా చైతన్య కార్యక్రమం చేపడతారు. సీఏఓ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో డోలో పూర్ణిమ ఉత్సవ వేళల్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 36 నియోగుల సంఘం ప్రముఖులు, కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హాజరయ్యారు. -
గుట్కా ఫ్రమ్ గుజరాత్!
గుజరాత్లో ఏర్పాటు చేసిన యూనిట్స్‌లో వేర్వేరు ఉత్పత్తులుగా గుట్కా తయారు చేసి.. రైళ్లలో హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి ప్రధాన సూత్రధారి అవల అభిషేక్ సహా నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.4 కోట్ల విలువైన నిషే ధిత ఉత్పత్తులు స్వాధీనం చేసు కున్న ట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించా రు. సమావేశంలో డీసీపీ పి.రాధాకిషన్ రావు పాల్గొన్నారు. –సాక్షి, హైదరాబాద్ ఇక్కడ చిక్కడంతో.. సైదాబాద్‌కు చెందిన అవల అభిషేక్.. 2008 నుంచి బేగంబజార్ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్‌మసాలా వ్యాపారం చేస్తూ మాణిక్‌చంద్ సంస్థకు ప్రధాన ఏజెంట్‌గా ఉన్నాడు. 2015లో సెవెన్‌హిల్స్ మార్కెట్ ప్రాంతంలో సొంతంగా సంస్థ ఏర్పాటు చేశాడు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్‌చంద్’పేరుతో పాన్ మసాలా, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించాడు. మాణిక్‌చంద్ పేరును వినియోగించడంపై పోలీసులు లోతుగా ఆరాతీశారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో గతేడాది బీబీనగర్ పోలీసులు యూనిట్‌పై దాడి జరిపి కేసు నమోదు చేసి అభిషేక్, అతడి తండ్రి ఏవీ సురేశ్ తదితరులను అరెస్టు చేశారు. దీంతో అభిషేక్ తన దందాను గుజరాత్‌కు మార్చాడు. అక్కడ ఉన్న తన ఏజెంట్ శైలేష్ జైన్ ద్వారా అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో యూనిట్లు ఏర్పాటు చేశాడు. రైల్వేస్టేషన్ నుంచే సరఫరా పోలీసుల కన్నుకప్పేందుకు గుజరాత్లో ‘7 ఎంసీ టొబాకో’పేరుతో ఒకటి, ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’పేరిట మరొకటి తయారు చేస్తున్నాడు. ఈ రెండింటినీ వేర్వేరుగా ప్యాక్ చేసి అహ్మదాబాద్ నుంచి రైల్వేలో వివిధ రకాల పేర్లతో సికింద్రాబాద్‌కు పంపిస్తున్నాడు. ఇలా వచ్చిన ఉత్పత్తులను హైదరాబాద్‌లో నిల్వ చేసేందుకు గోడౌన్ నిర్వహించట్లేదు. రైల్వేస్టేషన్లో ఉండే ఏజెంట్లు షబ్బీర్ మొయినుద్దీన్, సయ్యద్ జబ్బార్ అహ్మద్‌లు ఈ ఉత్పత్తులను తీసుకుని అభిషేక్ ఆదేశాల ప్రకారం నేరుగా డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు సయ్యద్ మహ్మద్‌కు చెందిన వాహనం వాడుతున్నారు. షబ్బీర్, జబ్బార్‌లు ఉత్తరప్రదేశ్, ఢిల్లీల నుంచి వచ్చే పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటూ గోషామహల్‌కు చెందిన తబ్రేజ్, బేగంబజార్ వాసి మనీష్‌లకు సరఫరా చేసి అమ్మిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా సాగుతున్న ఈ దందాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్ రావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, పి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వల పన్నారు. గోపాలపురం ప్రాంతంలో రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషిద్ధ ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో అభిషేక్, షబ్బీర్, జబీర్, మొహ్మద్‌లను అరెస్టు చేశారు. ఫ్రాంచైజీల పేరుతో మోసం కాగా, నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే అనేక మందిని అభిషేక్ మోసం చేశాడు. ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’ఉత్పత్తులకు సంబంధిం చిన ఫ్రాంచైజీలు, డిస్ట్రి బ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజె న్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అనేక మంది అభిషేక్‌ను సంప్రదిం చారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. వారితో అక్కడ దుకా ణాలు ఏర్పాటు చేయించి ముందు కొంత సరుకు సరఫరా చేసి తర్వాత అదీ వెనక్కు తీసుకున్నాడు. నగదు ఇచ్చేయాలని అడిగిన వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ముషీరాబాద్, ఏపీలోని విశాఖ పట్నంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. -
‘పొగాకు’ నిషేధంపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పొగాకుతో తయారు చేసే గుట్కా, పాన్ మసాలాలు తదితర ఉత్పత్తుల నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. గుట్కా, పాన్ మసాలాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాన్‌మసాలా ఉత్పత్తుల తయారీ, భద్రపర్చడం, పంపిణీ, రవాణాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ యూనిక్ టుబాకో ప్రొడక్ట్స్ సంస్థ అధిపతి సయ్యద్ ఇర్ఫానుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆహార భద్రత కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీచేశారని, అసలు పొగాకు ఆహారం కాదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. బండ్లగూడలోని తమ పరిశ్రమలోకి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే తనిఖీలకు వస్తున్నారన్నారు. రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, గుంటూరులోని టుబాకో చైర్మన్, ఆహార భద్రత శాఖ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. -
ఈ పాన్బీడాకు 115 ఏళ్లు
శివాజీనగర: మంచి భోజనం చేశాక పాన్ బీడా లేకుంటే ఏదో లోటే. తమలపాకు–వక్క–తీపి–కొన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన పాన్‌ను ఆరగిస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి పాన్‌కు ఈ దుకాణం ప్రసిద్ధి. బెంగళూరు శివాజీనగర్‌లో ఉన్న రస్సెల్ మార్కెట్ ప్రజలందరికీ చిరుపరచితమే. సుమారు 50 సంవత్సరాలకు పైగా పాత బడిన రస్సెల్ మార్కెట్ శివాజీ నగరంలో కేంద్ర బిందువు. అయితే రస్సెల్ మార్కెట్ కంటే పురాతనమైనది ఒకటి ఉంది, అదే హాజీ బాబా పాన్ బీడా దుకాణం. 1903లో దివంగత అబ్దుల్ ఖలీక్ ద్వారా ప్రారంభించిన ఈ పాన్ షాపు వయసు 115 సంవత్సరాలంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. రాత్రి పూట మాత్రమే అబ్దుల్ ఖలీక్ మనవడు అబ్దుల్ బషీర్ ఇప్పుడీ అంగడిని నడుపుతున్నాడు. విందు భోజనం తరువాత మనోల్లాసం కలిగించే పాన్ బీడా తయారీలో మూడుతరాలుగా వీరు ఆదరణ చూరగొంటున్నారు. ఇక్కడ వ్యాపారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారజామున 3 గంటల వరకు మాత్రం జరుగుతోంది. ఆంగ్లేయుల పాలన నుంచి రద్దీ అలాగే ఉందని వారు చెబుతారు. ప్రముఖులతో ప్రశంసలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వారిచేత కూడా పాన్‌బీడా తయారీదారులు ప్రశంసలు అందుకున్నారు. మాజీ మంత్రి శివాజీనగర ఎమ్మెల్యే ఆర్. రోషన్ బేగ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు హాజి పాన్ బీడా అంటే చాలా ఇష్టపడుతారు. పాన్ తినటానికే నగరంలోని ఎక్కడెక్కడి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. 4 రకాల పాన్లు ఇక్కడ బషీర్ తయారు చేసేది కేవలం నాలుగు రకాలైన పాన్లను మాత్రమే. స్వీట్ పాన్, మగై, సాదా, జర్దా ఈ నాలుగు విధాల పాన్లను మాత్రం ఆయన తయారు చేస్తారు. అయితే హాజి బాబా పాన్ దుకాణం రోజంతా ఓపెన్‌లో ఉండదు. పాన్ తయారీకి వీరు ఉపయోగించేది కలకత్తా, బనారస్ ఆకులు మాత్రమే. ప్రారంభంలో ఒక పాన్ ధర 10 పైసలు ఉండేది. ప్రస్తుతం రూ.15 అయింది. ఆ రుచే రప్పిస్తోంది: బషీర్ తమ దుకాణంలో కేవలం నాలుగు విధాల పాన్లు మాత్రం తయారు చేస్తున్నా కూడా ప్రజలు చాలా ఇష్టపడటానికి కారణం సాటి లేని రుచే కారణమని బషీర్ అంటున్నారు. తాము పాన్ బీడాకు ఉపయోగించే దినుసులు ప్రత్యేకమని చెబుతారు. వక్కను తాము కత్తిరించే విధానం కర్ణాటకలో ఏ షాప్‌లోనూ కనిపించదంటారు గర్వంగా. పాన్‌లో యాలకులు, లవంగం ఉపయోగించటంతో రుచి పెరుగుతుందని చెప్పారు. రంజాన్‌లో వ్యాపారం మరింత పెరుగుతుందన్నారు. వంశపారంపర్యంగా కొనసాగించిన ఈ పాన్ బీడా షాపును నడిపేందుకు తమ బిడ్డలు ఇష్టపడడం లేదని చెప్పారు. ఇద్దరు కుమారులు ఉన్నత చదవులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని బషీర్ తెలిపారు. ఈ విద్యను ఎంతో మందికి నేర్పామని, వారు చుట్టుపక్కల సుమారు 50 షాపులు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారని తెలిపారు. -
గుట్కా నిషేధం కొనసాగేనా?
సాక్షి, హైదరాబాద్ : గుట్కా, పాన్ మసాలా నిషేధం కొత్త మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుట్కా నిషేధం రాజకీయ రంగు పులుముకుంటోంది. గుట్కాలపై రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరిలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తోంది. అయితే నిషేధం ముగిసే సమయం దగ్గర పడుతున్న తరుణంలో గుట్కా విక్రయాలపై నిషేధం ఎత్తేయాలని కోరుతూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితి తెలపాలంటూ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ (వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అందులో గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులతో కేన్సర్ రోగులు బాగా పెరుగుతున్నారని, నిషేధం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ నివేదిక ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పొగాకు ఉత్పత్తులపైనా నిషేధం.. నోటి కేన్సర్ బాధితులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగు ణంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013 జనవరి 9న గుట్కా ఉత్పత్తులను నిషేధించింది. ఏటా నిషేధం కొనసాగించేలా గెజిట్ జారీ చేసింది. అయితే గుట్కాను మాత్రమే నిషేధించడంతో పొగాకుతో తయారయ్యే పాన్‌మసాలా ఉత్పత్తులు మార్కెట్లో బాగా పెరిగాయి. ఆ తర్వాత 2014 జనవరి 9న ప్రభుత్వం సమగ్రంగా ఆదేశాలు ఇచ్చింది. నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. చాప్ టొబాకో, ప్యూర్ టొబాకో, ఖైనీ, ఖారా, పొగాకు ముక్కలు, పొగాకు ఆనవాళ్లు ఉండేవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయని వివరణ ఇచ్చింది. ఏటా జనవరి 9న నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలోనూ ప్రభుత్వం ఇవే ఆదేశాలను అమలు చేస్తోంది. గతేడాది జనవరి 10న నోటి ద్వారా తీసుకునే అన్ని రకాల నికోటిన్, పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. అప్పటి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ రాజేశ్వర్ తివారీ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా నిషేధం ఎత్తివేత విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి రావడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో రాజేశ్వర్ తివారీ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదిలీ కావడం మరో మలుపు. 48 శాతం మంది నమిలేస్తున్నారు.. పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల వినియోగంతో అధిక శాతం మంది నోటి కేన్సర్ బారినపడుతున్నారు. 2009–10 ప్రపంచ పొగాకు ఉత్పత్తుల సర్వే ప్రకారం 53.5 శాతం మంది పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు తేలింది. గుట్కా, పాన్ మసాలాను నమిలే వారు 48.07 శాతం మంది ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో పిల్లలు 16 శాతం వరకు ఉన్నారని అంచనా. నోటి కేన్సర్ బాధితులు ఏటా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలాను నిషేధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2011 ప్రకారం ఈ ఉత్పత్తులపై 2012 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రాలు నిషేధించడం మొదలుపెట్టాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంది. -
ఆ యాడ్ చేసినందుకు.. జేమ్స్‌బాండ్ సారీ చెప్పాడు
బాండ్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ స్టార్ హీరో పీర్స్ బ్రోస్నన్. అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.., పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అదే బాటలో ఇటీవల ఇండియాలో తయారయ్యే ఓ పాన్ మసాలా కంపెనీకి అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించాడు. ఈ మాజీ బాండ్‌తో యాడ్‌ను షూట్ చేసిన పాన్ బహర్ కంపెనీ భారీగా ప్రచారం చేస్తోంది. అయితే మాజీ జేమ్స్ బాండ్‌గా క్లీన్ ఇమేజ్ ఉన్న బ్రోస్నన్ ఇలాంటి ప్రాడక్ట్‌కు ప్రచారం చేయటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం బ్రోస్నన్ వరకు చేరటంతో ఆయన స్పందించారు. తనకు అది పాన్ మసాలా యాడ్ అని తెలియదని, తాను టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతో ఈ యాడ్‌లో నటించానని తెలిపాడు. అంతేకాదు పాన్ బహర్ కంపెనీ వారిని కూడా ఇక తన ఫోటోలను ప్రచారానికి వాడవద్దని కోరాడు. తనకు తెలియకుండా చేసినా..? ఓ హానికరమైన ప్రాడక్ట్‌కు ప్రచారం చేసినందుకు ఇండియన్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాడు. -
'పాన్ మసాలా' కోసం ప్రాణం తీశాడు!
అహ్మదాబాద్: పాన్ మసాలా కోసం జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలైంది. పాన్ మసాలా అడిగితే ఇవ్వలేదంటూ స్నేహితుడి ప్రాణాలు తీసిన ఘటన అహ్మదాబాద్‌లోని నరోడా టౌన్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెహాల్ పటేల్ (19) అనే యవకుడు జైఅంబే అపార్ట్మెంట్ లో నివాసముంటున్నాడు. కుర్ణాల్ పాటిల్ (19) అనే యువకుడు కూడా అదే ప్రాంతానికి చెందిన కాలనీలో నివాసముంటున్నాడు. గత రాత్రి 3 గంటల ప్రాంతంలో స్నేహితులతో పాటు ఉన్న పాటిల్ వద్దకు నెహాల్ వచ్చి మాట కలిపాడు. తనకు పాస్ మసాలా కావాలని పాటిల్‌ను అడిగాడు. అయితే తాను ఇవ్వకపోవడంతో వారి ఇరువురి మధ్య చిన్న వైరం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన నెహాల్.. ఆక్రోశంతో తన స్నేహితుడు పాటిల్‌ను కత్తితో పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై పాటిల్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఇరువురి స్నేహితుడైన మహేంద్ర పటేల్ అనే యవకుడు సమీపంలోని కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు నిందితుడు నెహాల్‌ను అరెస్ట్ చేసి, కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ సీఆర్ సంగాడా వెల్లడించారు. -
‘గుట్కా’య స్వాహా!
నగరంలో రోజుకు వంద కోట్ల దందా నిషేధం ఉన్నా యథేచ్ఛగా ఉత్పత్తి, అమ్మకం.. మామూళ్ల మత్తులో అధికారులు పేరుకే నిషేధం.. అంతా బహిరంగం..! నగరంలో ఏ మూలకు వెళ్లినా.. ఏ గల్లీలోకి తొంగి చూసినా గుట్టలుగుట్టలుగా గుట్కా ప్యాకెట్లు..!! ఆర్ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్ గుట్కా, సాగర్ గుట్కా, సూరజ్ జర్దా, అంబర్ ఖైనీ.. ఒక్కటా రెండా.. జనం ప్రాణాలను నమిలేస్తున్న ఇలాంటి అనేక బ్రాండ్లు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్నిచోట్లా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పాన్‌షాపుల నుంచి అనేక దుకాణాల వరకు వీటి వ్యాపారం మూడు గుట్కాలు ఆరు పాన్ మసాలాలుగా సాగుతోంది. ఈ అక్రమ దందా విలువెంతో తెలుసా..? రోజుకు ఏకంగా రూ.100 కోట్లు! ఇది ఒక్క హైదరాబాద్‌లోనే...! మరి నిషేధం ఉన్న ఈ గుట్కాలు, జర్దాలు బహిరంగంగా అమ్ముతుంటే, వాటిని నివాసాల మధ్యే టన్నులు టన్నులుగా తయారు చేస్తుంటే జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇతర అధికారులు ఏం చేస్తున్నారు? మామూలుగానే ‘మామూళ్లు’ పుచ్చుకొని కళ్లు మూసుకుంటున్నారు. ఫలితంగా నగరంలో ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సాక్షి, హైదరాబాద్ గుట్కా దందాకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన చీకటి వ్యాపారం జరుగుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ దందాపై ‘సాక్షి’ బృందం చేసిన పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. నగరం నడిబొడ్డున, నివాసాల మధ్యే గుట్కా కార్ఖానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా టన్నుల కొద్దీ పొగాకు పదార్థాలు తయారు చేయడం, ఆ ఉత్పత్తులు వందల సంఖ్యలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులకు, అక్కడ్నుంచి వేలల్లో ఉన్న రిటైల్ వ్యాపారులకు చేరుతున్నట్టు పరిశీలనలో స్పష్టమైంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం గుట్కా మసాలా తయారీ, నిల్వ, సరఫరా, అమ్మకాలు నిషేధం. పొగాకు, నికోటిన్, ఖైనీ, ఖారా వంటి ఉత్పత్తులనూ ప్రభుత్వం నిషేధించింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న వీటన్నింటినీ నిషేధిస్తూ 2009లో వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ చట్టాలు, ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో నిత్యం వంద కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుట్కా వ్యాపారంపై సుపరిపాలన వేదిక ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం పలు వివరాలు కోరింది. తెలంగాణలో 2014-15లో గుట్కా వ్యాపారంపై 265 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దీని తయారీ, వ్యాపారాన్ని అరికట్టేందుకు తమ వద్ద సిబ్బంది, హెల్త్ అధికారులు లేరంటూ సర్కారు చేతులెత్తేయడం గమనార్హం. గుట్కా డెన్లు ఇక్కడే.. నగరంలో బండ్లగూడ, జల్పల్లి, తలాబ్‌కట్టా, ఈదీ బజార్, కాటేదాన్, శివరాంపల్లి ప్రాంతాలు గుట్కా తయారీ, నిల్వకు కేరాఫ్‌గా మారాయి. ఆయా ప్రాంతాల్లో గుట్కా తయారీ కేంద్రాలు చిన్నతరహా పరిశ్రమలను తలపిస్తున్నాయి. ప్రధానంగా బండ్లగూడ వద్ద జహంగీర్బాద్లో ఇళ్ల మధ్య చుట్టూ ప్రహరీతో అర ఎకరంలో విస్తరించిన పరిశ్రమలో ఆర్ఆర్ గుట్కా(ఆర్ఆర్ పాన్ మసాలా)తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ఇక జల్పల్లిలో సాగర్ గుట్కా ఫ్యాక్టరీ, తలాబ్‌కట్టా (ఈదీబజార్)లో ఆర్ఆర్ గుట్కా నిల్వ చేసేందుకు రెండు పెద్ద గోదాములు ఉన్నాయి. కాటేదాన్‌లో సాగ ర్ గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలా రవాణా చేస్తున్నారు..? గుట్కా తయారీ కేంద్రాల నుంచి బేగంబజార్‌తోపాటు పొరుగు రాష్ట్రాలకూ నిత్యం రూ.100 కోట్ల విలువైన ఉత్పత్తుల అక్రమ రవాణా జరుగుతోంది. ప్రధానంగా అఫ్జల్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, గోషామహల్ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారుల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చేరుతోంది. ఇందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలున్నాయి. తయారీ పరిశ్రమల నుంచి హోల్‌సేల్ వ్యాపారులకు, రిటైలర్లకు అక్కడి నుంచి చిన్నచిన్న దుకాణాలకు చేరిపోతోంది. పాన్ డబ్బాల్లో సోంపు, వక్కపొడి ప్యాకెట్లతోపాటు గుట్కా, జర్దాను బహిరంగంగా విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల పాన్మసాల్లో వినియోగించే కోప్రాను పైన పెట్టి కింది నుంచి గుట్కా ప్యాకెట్లను జననానికి విక్రయిస్తున్నారు. నిషేధం పేరుతో డబుల్ రేటు.. గుట్కాపై నిషేధం వ్యాపారులకు రెట్టింపు లాభాలు తెచ్చిపెడుతోంది. వినియోగదారుల ఒళ్లుతోపాటు జేబులను సైతం గుల్ల చేస్తోంది. ఉదాహరణకు ఒక్క బాక్స్‌లో 65-70 వరకు ఉండే ఆర్ఆర్ గుట్కా ప్యాకెట్లు రూ.165కు కొనుగోలు చేసే రిటైలర్లు.. మొత్తం ప్యాకెట్లను విక్రయిస్తే రూ.300 గిట్టుబాటవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు రెట్టింపు లాభం అన్నమాట! ఇక రూ.135 విలువ చేసే జర్దా అమ్మితే రూ.300, మరో బ్రాండ్‌కు చెందిన రూ.145 విలువైన గుట్కా డబ్బాను విక్రయిస్తే రూ.300 గిట్టుబాటు అవుతోంది. వీటి తయారీ దారులు హోల్‌సేల్ వ్యాపారులకు 50 శాతం డిస్కౌంట్‌తో సరుకు విక్రయిస్తున్నారు. దందాకు పెద్దల అండదండ మహానగరంలో యథేచ్ఛగా గుట్కా తయారీ, అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులకు తెలిసినా వారంతా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వీరేకాదు.. గుట్కా తయారీ, అమ్మకాలకు రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కలంగా లభిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మచ్చుకు కొన్ని ఇవీ.. ♦ నాంపల్లి ప్రాంతంలో ఓ బడా వ్యాపారి పాత నగరంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అండదండలతో నిత్యం రూ.10 కోట్లు విలువ చేసే గుట్కా విక్రయాలు జరుపుతున్నాడు. ఇతనికి నగరంలోని కిందిస్థాయి పోలీసు అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు అండదండలున్నట్లు సమాచారం ♦ బండ్లగూడాలోని ఆర్ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్ గుట్కా, 24 క్యారెట్స్ పాన్‌మసాలాలు ఉత్పత్తి చేస్తున్న వ్యాపారికి ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఒక ఎంపీ, పలువురు ఎమ్మెల్యేల అండదండలు మెండుగా ఉన్నట్లు సమాచారం. నగరంలో పలు ఫంక్షన్ హాళ్లు నిర్మించిన ఈ వ్యాపారి పోలీసు శాఖకు ఉచితంగా వాటిని కేటాయిస్తూ వారి మెప్పు పొందుతున్నాడు ♦ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ఓ వ్యాపారి రూ.కోటి విలువ చేసే జర్దా, అమీ తంబాకులను విక్రయిస్తున్నాడు. ♦ బేగంబజార్ కాశ్మీర్ హౌజ్ లేన్‌లోని ఓ బడా భవనంలో అంబర్ ఖైనీ, జర్దాల వ్యాపారం నిత్యం రూ.2 కోట్ల పైమాటే! ♦ ఫీల్ఖానాలోని రంగాచారి లేన్‌లో ఓ వ్యాపారి నిత్యం రూ.కోటి విలువ చేసే సాగర్గుట్కా, సూరజ్ జర్దా విక్రయిస్తున్నాడు. ఫీల్‌ఖానా డీకే మార్కెట్లోని మహావీర్ బ్యాంక్ ఎదురుగా ఉన్న భవనంలో నిత్యం రూ.2 కోట్లు విలువచేసే బాబా, హీరా, సితార్, నజర్ గుట్కాలను విక్రయిస్తున్నట్లు సమాచారం ♦ బేగంబజార్ స్వస్తిక్ మిర్చీ సమీపంలో నారాయణగూడకు చెందిన ఓ వ్యాపారి నిత్యం రూ.2 కోట్లు విలువచేసే జోడాబైల్, ఇతర కంపెనీల జర్దా విక్రయిస్తున్నాడు ♦ షాహినాత్ గంజ్ బేదర్వాడీ ప్రాంతంలో ఓ వ్యాపారి పలు కంపెనీలకు చెందిన జర్దాలు,గుట్కాలు పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నాడు ♦ఫీల్‌ఖానాకు చెందిన ఓ బడా వ్యాపారి సొంతంగా పాతబస్తీ షంషీర్‌గంజ్‌లో నజర్ గుట్కాను తయారు చేసి బేగంబజార్‌లో అమ్ముతున్నాడు పాతబస్తీలో గుట్టలుగుట్టలుగా.. పాతబస్తీలో ఏ పాన్ షాప్‌లో చూసినా గుట్టలుగుట్టలుగా గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఈ దందా వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక్కడ ఆర్ఆర్, గోవా-1000, సాగర్, 24 క్యారెట్, ఆర్ఎండీ గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజా ఖైనీ, చైనీ ఖైనీలు కూడా సులభంగా లభ్యమవుతున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో ఆర్ఆర్ గుట్కాను పెద్దఎత్తున తయారు చేస్తున్నారు. ఈ గుట్కాను ఈది బజార్, లలితాబాగ్ మహ్మద్‌నగర్, బండ్లగూడ, జల్పల్లి ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వ ఉంచి ఏజెన్సీల ద్వారా మార్కెట్లో చలామణి చేస్తున్నారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన ఈ గోడౌన్ల నుంచి వెలువడుతున్న వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తయారీ కేంద్రాల నుంచి వెలువడుతున్న ఘాటు వాసనలు ముక్కు పుటాలు అదరగొడుతున్నాయి. కొందరు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. -
గుట్కా, పాన్ మసాలాపై ఢిల్లీ సర్కార్ బ్యాన్
న్యూఢిల్లీ : ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే గుట్కా, పాన్ మసాలా, పొగాకు సంబంధిత పదార్థాల ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుట్కా, పాన్ మసాలాలతో పాటు ఖైనీ, జర్దా పాన్లపై కూడా నిషేధం కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాగా ఫుడ్‌సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం గుట్కాలు, పాన మసాలాలతోపాటు చాప్టొబాకో, ఖైనీ, ఖరా, టొబాకో ఫ్లేవర్డ్ మసాలాల తయారీ, అమ్మకాలు, నిల్వ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. -
గుట్కా, పాన్ మసాలలపై నిషేధం పొడిగింపు
విజయవాడ: ప్రజల ఆరోగ్యానికి చేటుచేసే పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ మసాలలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయా ఉత్పత్తుల వినియోగం, తయారీలపై ఉన్న నిషేధం జనవరి 10 నాటికి ముగుస్తుండటంతో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు ఆహార భద్రతా,ప్రమాణాల చట్టం ప్రకారం ..పొగాకు ఉత్పత్తులు, నిల్వలు, పంపిణీ, సరఫరాలు వంటి వాటిపై ఉన్న నిషేధాన్ని 10 జనవరి 2016 నుంచి 9 జనవరి 2017వరకు సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు ఆహార పరిరక్షణా విభాగం కమిషనర్ కె.వి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై నిషేధం
త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్న సీఎం ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినిమయంపై త్వరలోనే నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ల వాడకం వల్ల ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రోగాల బారిన పడబోరని, అతని కుటుంబమంతా నష్టపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి టాటా మెమోరియల్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై త్వరలోనే నిషేధం విధిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్యాన్సర్ సంభావ్యత 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. అందువల్ల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల దరిదాపుల్లో పొగాకు, పాన్ మసాలాల అమ్మకాలు బాగా పెరిగినట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అందువల్ల హోం శా, విద్యా విభాగం సహకారంతో వాటి అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. పొగాకు ఉత్పత్తులపై పంజాబ్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించిందని అన్నారు. అయితే ఆ పన్నుల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో మాత్రం స్పష్టం కాలేదన్నారు. ఏదైనా మంచి ఫలితం ఉంటే ఆ విధానాన్ని తాము కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఫడ్నవీస్ చెప్పారు. -
ఎఫ్డీ కొరడా
సాక్షి, ముంబై : రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్డీ) అధికారులు దాడులు చేసి ఏకంగా రూ.36 కోట్లు విలువ చేసే నిషేధిత పాన్ మసాల పదార్థాలను జప్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్కా, తంబాకు, సుగంధ సుపారిలాంటి ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలు నిషేధించింది. అయినప్పటికీ ఈ పదార్థాలు అక్రమ మార్గాల ద్వారా కొందరు అక్రమార్కులు రాష్ట్రంలోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎఫ్.డి. పరిపాలన విభాగం దాడులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం దేశంలో 35 శాతం పెద్దలు తంబాకు, గుట్కాలాంటి ఆరోగ్యానికి హాని కల్గించే పదార్థాలకు బానిసలయ్యారు. రాష్ట్రంలో 29 శాతం పెద్దలు తంబాకు పదార్థాలు సేవిస్తుంటారు. తొమ్మిది శాతం పెద్దలు పొగతాగుతారు. ప్రభుత్వం రెండు సంవత్సరాల కిందట ఈ మత్తు పదార్థాలను నిషేధించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో గుట్కా, తంబాకు, సుగంధ సుపారి లాంటి పదార్థాలు తయారుచేయడం, వాటిని నిల్వచేయడం, విక్రయించడం లాంటివి చేస్తే నేరం. అయినప్పటికీ కొందరు వీటిని అక్రమంగా నగరంలోకి తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి.. ఎలా వస్తాయి పాన్ మసాల, గట్క, తంబాకు లాంటి పదార్థాలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైల్వే ద్వారా, కర్నాటక నుంచి బస్సులో వస్తాయి. అనేక సందర్భాలలో కోడి మాంసం తరలించే ఫ్రోజెన్ వాహనాల్లో, అలాగే చీరలు, వస్త్ర తాన్లు రవాణా చేసే ట్రక్కుల్లో పోలీసులు, చెక్‌పోస్టులవద్ద సిబ్బంది కళ్లుగప్పి సరఫరా చేస్తారు. వాస్తవంగా అందులో నిషేధిత గుట్క, తంబాకు, సుగంధ సుపారి లాంటి ఆరోగ్యానికి హానీ కలిగించే పదార్థాలుంటాయి. ఈ అక్రమ రవాణా ఇటీవల తీవ్రం కావడంతో అధికారులు సత్వర చర్యలకు పూనుకున్నారు. భారీగా దాడులు నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై అధికారులు దాడులు తీవ్రతరం చేశారు. 2012 జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్.డి. అధికారులు 67,914 చోట్ల దాడులు చేసి రూ.36 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఈ పదార్థాలను విక్రయిస్తున్న 1,212 వ్యాపారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 1,459 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. పట్టుకున్న మొత్తం రూ.36 కోట్లు విలువచేసే సామగ్రిలో రూ.24 కోట్లు విలువ చేసే పదార్థాలను ధ్వంసం చేశారు. మిగతా నిందితులపై చర్యలు తీసుకునేందుకు సాక్షాల కోసం అలాగే ఉంచారు. కోర్టులో విచారణ పూర్తికాగానే వాటిని కూడా ధ్వంసం చేయనున్నామని ఎఫ్.డి. పరిపాలన విభాగం కమిషనర్ మహేశ్ జగడే చెప్పారు. -
చిన్నారులకు మత్తెక్కిస్తున్న పాన్ మసాలా చాక్లెట్లు
-
గారను క్లీన్ చేయిస్తే పళ్లు వదులైపోతాయా?
నా వయసు 25. నాకు పన్ను మీద పన్ను ఉంటుంది. డాక్టర్ని కలిస్తే వాటిలో ఒక పన్ను తీసేసి క్లిప్పుతో సరిచేస్తానన్నారు. ఇంట్లో వాళ్లు పన్నుమీద పన్ను ఉంటే అదృష్టం అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు. - బి. రమ్యశ్రీ, హైదరాబాద్ ఇది చాలామందికి వుండే సమస్యే. వంకరపన్ను వల్ల అందమైన చిరునవ్వు దూరమవుతుంది. చిగుళ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వంకరటింకర పళ్లున్నవారిలో చిగుళ్లనుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్న వయసులోనే వీటిని సరిచేయించడం మంచి ది. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం వస్తుందన్నది పూర్తి అశాస్త్రీయమైనది. మూఢనమ్మకం కూడా. మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్టును కలిసి మీ సమస్యను దూరం చేసుకోండి. నా వయసు 32. చిన్నప్పటినుంచి గుట్కా, పాన్‌పరాగ్ తినడం అలవాటు. దాంతో పళ్లన్నీ నల్లగా అయ్యాయి. నవ్వాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నేను పళ్లను క్లీన్ చేయించి, ఇకపై ఈ దురలవాటును మానేయాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల పళ్లన్నీ వదులై ఊడిపోతాయని కొందరు అంటున్నారు. నిజమేనా? తగిన సలహా ఇవ్వవలసింది. - టి. అరుణ్, నెల్లూరు పాన్‌పరాగ్, పాన్‌మసాలా, గుట్కా, జర్దా, వక్కపొడి, తంబాకు నమలడం తదితర అలవాట్లన్నీ నోటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వీటివల్ల కేవలం పళ్లే కాకుండా నోటిలోని భాగాలన్నీ దెబ్బతింటాయి. పంటిపై ఉండే ఎనామిల్‌పై పొగాకు ఉత్పత్తులలో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇంకిపోయి పంటిపైన ఒక నల్లటిపొరలాగ పేరుకుపోయి క్రమేపీ పంటిరంగు మారిపోతుంది. అంతేకాదు, వీటిలో ఉండే రసాయనాల దుష్ర్పభావం వల్ల లోపలి దవడలు, నాలుక మొద్దుబారిపోతాయి. ఫలితంగా నోరు పెద్దగా తెరవలేకపోవడం, ఆహారాన్ని నమలలేకపోవడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యలతోబాటు నోటిక్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పు తెలుసుకుని గుట్కా మానేయాలని నిర్ణయించుకోవటం అభినందనీయం. మీ స్నేహితులు చెప్పినట్లుగా గార పట్టిన పళ్లను క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్లు వదులైపోవు. స్పెషలిస్ట్‌ను కలిస్తే స్కేలింగ్, పాలిషింగ్‌తో పంటిపైన ఉండే గారను తొలగించి, బాగున్న పళ్లను బ్లీచింగ్ వంటి చికిత్సలతో మరింత తెల్లగా చేస్తారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం మరచిపోవద్దు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్