ఆ యాడ్ చేసినందుకు.. జేమ్స్బాండ్ సారీ చెప్పాడు | Bond Actor Pierce Bronson apologies for Pan Masala ad | Sakshi
Sakshi News home page

ఆ యాడ్ చేసినందుకు.. జేమ్స్బాండ్ సారీ చెప్పాడు

Published Sat, Oct 22 2016 8:35 AM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

ఆ యాడ్ చేసినందుకు.. జేమ్స్బాండ్ సారీ చెప్పాడు - Sakshi

ఆ యాడ్ చేసినందుకు.. జేమ్స్బాండ్ సారీ చెప్పాడు

బాండ్ క్యారెక్టర్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ స్టార్ హీరో పీర్స్ బ్రోస్నన్. అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.., పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అదే బాటలో ఇటీవల ఇండియాలో తయారయ్యే ఓ పాన్ మసాలా కంపెనీకి అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించాడు. ఈ మాజీ బాండ్తో యాడ్ను షూట్ చేసిన పాన్ బహర్ కంపెనీ భారీగా ప్రచారం చేస్తోంది.

అయితే మాజీ జేమ్స్ బాండ్గా క్లీన్ ఇమేజ్ ఉన్న బ్రోస్నన్ ఇలాంటి ప్రాడక్ట్కు ప్రచారం చేయటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం బ్రోస్నన్ వరకు చేరటంతో ఆయన స్పందించారు. తనకు అది పాన్ మసాలా యాడ్ అని తెలియదని, తాను టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతో ఈ యాడ్లో నటించానని తెలిపాడు. అంతేకాదు పాన్ బహర్ కంపెనీ వారిని కూడా ఇక తన ఫోటోలను ప్రచారానికి వాడవద్దని కోరాడు. తనకు తెలియకుండా చేసినా..? ఓ హానికరమైన ప్రాడక్ట్కు ప్రచారం చేసినందుకు ఇండియన్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement