James Bond
-
Aaron Taylor-Johnson: కొత్త జేమ్స్ బాండ్?
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’లోనూ డేనియల్ క్రెగ్ బాండ్‌గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించింది. కానీ మరోసారి బాండ్‌గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్ బాండ్‌గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్‌గా ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు కొందరు హాలీవుడ్ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్‌బాండ్ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్ టేలర్. -
సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్
జేమ్స్‌బాండ్ అంటే ఎవరండీ? ‘ఇది రిస్క్ సుమీ’ అని భయపడకుండా దూసుకుపోయేవాడు. పదిరూట్లు కనిపించినా... తనదైన సెపరేట్ రూట్ సృష్టించుకునేవాడు. విజయాలెప్పుడూ తన వెంటపడేలా కనిపించేవాడు. ఈ లక్షణాలు ఉన్న కరణ్‌ను జేమ్స్‌బాండ్ అని పిలుచుకోవచ్చు. అయితే తన పేరునే ‘బ్రాండ్’ చేసుకున్న అతడిని కాస్త సరదాగా జేమ్స్‘బ్రాండ్’ అని పిలుచుకుంటే మరీ బాగుంటుంది... ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. కరణ్ తొరాని దిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న సమయంలో తండ్రి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఫ్యాషన్ డిగ్రీ చేతికి అందగానే ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనుకున్న తన కలలకు బ్రేక్ పడింది. చదువు పూర్తయిన తరువాత ఇద్దరు డిజైనర్ల దగ్గర పనిచేశాడు. మనసులో ఉన్న తన కల మాత్రం రోజూ పొద్దుటే హలో చెబుతూనే ఉంది. తన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రిస్క్–టేకర్’ అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఫ్యాషన్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు. ‘అది అందరికీ వర్కవుట్ కాదు’ అని నిరుత్సాహ పరిచారు. ‘ఎలాగైనా చేయాల్సిందే’ అని అకాడమీ మెట్లు ఎక్కినప్పుడు ‘రిస్క్–టేకర్’ అనే బిరుదు తగిలించారు. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు ‘కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు!’ అన్నారు. ‘చేయక తప్పదు’ అని మరోసారి అనుకున్నాడు కరణ్. మొదట తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో తాను డిజైన్ చేసిన గార్మెంట్స్ ఇమేజ్‌లను పోస్ట్ చేశాడు. అనూహ్యమైన స్పందన లభించింది. వారాల వ్యవధిలోనే అవి మల్టీ–బ్రాండ్ స్టోర్స్లలోకి వెళ్లాయి. హాట్‌కేకుల్లా అమ్ముడు అయ్యాయి. దీంతో తనలోని ఆత్మవిశ్వాసానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. బాలీవుడ్ అంటే తనకు వల్లమాలిన ఆసక్తి, అభిమానం. బాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడానికి కరణ్‌కు ఎంతో కాలం పట్టలేదు. ఫ్యాషన్ ప్రపంచం ‘ఇతడొకడున్నాడు’ అని మన వైపు దృష్టి సారించడానికి, మనలో ‘మనదైన ప్రత్యేకత’ ఉండాలి. మరి కరణ్లోని ప్రత్యేకత గురించి చెప్పడానికి ముందు కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... దేశవిభజన సమయంలో కరణ్ పూర్వీకులు పాకిస్థాన్‌లోని సిం«ద్ నుంచి మనదేశానికి వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి పూర్వీకుల కథలు వింటూ పెరిగాడు కరణ్. కరణ్ బాల్యం ఎక్కువగా భోపాల్‌లోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. అది ఇల్లు అనడం కంటే మ్యూజియం అంటే బెటర్. ఎందుకంటే ఇంటినలుమూలలలో చిన్న చిన్న దారుశిల్పాలు కనిపించేవి. అమ్మమ్మ వాటిని అంగట్లో కొని తెచ్చేది. రకరకాల చీరలు కనిపించేవి. చందేరి చీర తనను ఎంతో ఇన్స్పైర్ చేసింది. దిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో తండ్రికి ‘సింధి టెంట్‌హౌజ్’ ఉండేది. చిన్నప్పుడు తండ్రితో పాటు ఎన్నో వివాహవేడుకలకు వెళ్లేవాడు. ప్రతి పెళ్లివేడుకకు తనదైన గ్లామర్ గ్రామర్ ఉండేది. ఆ పాఠాలన్నీ తన మదిలో అలా నిలిచిపోయాయి. ఈ జ్ఙాపకాలన్నీ తన సృజనాత్మకతకు పదనుపెట్టాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను తన విజయసూత్రంగా చేశాయి. కరణ్ డిజైన్లలో జ్ఞాపకాలు పలకరిస్తాయి. కథలు చెబుతాయి. మరీ ఎక్కువగా మోడ్రన్‌గా ఉండకుండా, అలా అని తక్కువ కాకుండా గార్మెంట్స్ డిజైన్ చేస్తూ పాతజ్ఞాపకాల కొత్తలోకంలోకి తీసుకెళ్లడంలో చేయి తిరిగిన డిజైనర్ అనిపించుకున్నాడు కరణ్. ‘సైకిల్ ఆఫ్ ఫ్యాషన్’ అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. అలనాటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కొత్త లుక్‌తో తీసుకువచ్చాడు. ఇద్దరు ఉద్యోగులతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు కరణ్. ఇప్పుడు రెండు వందల మంది ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు! -
తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్
R Madhavan Says Nambi Narayanan Is James Bond: ‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్‌ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని హీరో ఆర్. మాధవన్ అన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆర్. మాధవన్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించారు. మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్. మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను నంబి నారాయణన్ పాకిస్థాన్‌కి అమ్మేశారనే నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు ? అదే ఈ చిత్రకథ. ఆయన లైఫ్ నాకు పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీలా అనిపించింది. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. ఏడాదిన్నర పాటు ఈ కథను తయారు చేశాను. సైన్స్, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను ప్రోస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌లా కనిపించటానికి బాగా కష్టపడ్డాను. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ కోసం మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ అని మాధవన్ తెలిపారు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. -
నెక్ట్స్ జేమ్స్ బాండ్ అతడేనా !.. మేకర్స్ ఏమంటున్నారంటే ?
జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన చివరి బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై'. ఈ సిరీస్‌లో 25వ బాండ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఏజెంట్ బాండ్ చనిపోవడంతోపాటు చక్కని భావోద్వేగపు వీడ్కోలు ఇచ్చారు మేకర్స్. అయితే డేనియల్ తర్వాత జేమ్స్ బాండ్‌గా సందడి చేయనుంది ఎవరా అనే అంశం ఆసక్తిగా మారింది. అనేక మంది హాలీవుడ్ స్టార్స్ సైతం ఆ పాత్రను చేయాలని ఉత్సుకతతో ఉన్నారు. ఈ క్రమంలో తర్వాతి జేమ్స్ బాండ్‌గా 'మండేలా: లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' యాక్టర్ 'ఇడిస్ ఎల్బా' (Idris Elba) నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నిర్మాతలు బార్బరా బ్రోకలీ, మైఖేల్ జీ విల్సన్‌లు స్పందించారు. స్క్రీన్రాంట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాతలు ఇలా చెప్పుకొచ్చారు. 'మాకు ఇడిస్ చాలా బాగా తెలుసు. మాకు అతను మంచి స్నేహితుడు. అలాగే అద్భుతమైన నటుడు. కానీ జేమ్స్ బాండ్ గురించి ఇలా మాట్లాడటం ఎప్పుడూ కష్టమే. మీకు తెలుసా. నో టైమ్ టు డై సినిమా విడుదల వరకు డేనియల్నే బాండ్‌గా నిర్ణయించుకున్నాం. అలాగే అతను బాండ్‌గా ఎంతగా అలరించాడో చూశాం. తర్వాత బాండ్ గురించి మేము ఇంకా ఎవరి గురించి ఆలోచించలేదు. ఎవరితో మాట్లాడలేదు.' గతేడాదే తదుపరి జేమ్స్ బాండ్ తానే అనే పుకార్లకు చెక్ పెట్టాడు ఇడిస్. లండన్‌లో ఒక సంభాషణల మధ్య 'కాదు. నేను జేమ్స్ బాండ్‌ను కాను. మార్పును కోరుకున్నట్లయితే నలుపు, తెలుగు వంటి వర్ణం గురించి మాట్లాడనప్పుడే ఆ పాత్ర చేస్తాను.' అని ఇడిస్ తెలిపాడు. అయితే ఈ తర్వాతి బాండ్ కోసం నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను తీసుకోనుట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇడిస్ అలా మాట్లాడి ఉండోచ్చని తెలుస్తోంది. -
తెలుగులో వచ్చిన జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు ఇవే..
బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఆ డైలాగ్‌లో ఏదో మత్తు ఉందని తెగ సంబరపడిపోతారు. జేమ్స్ బాండ్ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీస్‌లో ఏజెంట్ 007 చేసే సాహసకృత్యాలు ప్రతి ఒక్కరినీ ఔరా అనిపిస్తాయి. ఇక హీరోయిన్స్‌తో బాండ్ చేసే రొమాన్స్ గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా డానియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై మూవీతో ఇప్పటివరకు 25 బాండ్ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్లో వచ్చిన ఈ సినిమాల్లో మొత్తం ఏడుగురు యాక్టర్స్ బాండ్ క్యారెక్టర్‌ను పోషించారు. అయితే మన తెలుగు వాళ్లకు జేమ్స్ బాండ్ అంటే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఏజెంట్ 116 పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116తో పాటు తెలుగులో వచ్చిన బాండ్ చిత్రాలపై ఓ స్టోరీ చూసేద్దామా..! 1. గూఢచారి 116 తెలుగులో వచ్చిన మొదటి జేమ్స్ బాండ్ చిత్రం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, జయలలిత హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేయగా మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. పలు నేరాలకు సాక్ష్యాలైన ఫొటో ఎవిడెన్స్ కోసం సీక్రెట్ ఏజెంట్ 303ను ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హత్య చేస్తుంది. ఈ కేసును చేధించడానికి ఏజెంట్ 116కు సీఐడీ అప్పగిస్తుంది. దానిని ఏజెంట్ 116 ఎలా చేధించారు, ఆ ఫొటోలో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనేది సినిమా కథ. 2. గూఢచారి నెం. 1 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన గూఢచారి నెం.1లో మెగస్టార్ చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1983లో విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించారు. 3. విశ్వరూపం ‘విశ్వరూపం’ సినిమాలో కమల్... భారత్ జేమ్స్‌బాండ్‌గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో నటించారు. 4. గూఢచారి అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం 2020లో విడుదలైంది. ఇది పూర్తిగా జెమ్స్ బాండ్ తరహాలో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అడవి శేష్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితం దక్కించుకుంది ఈ చిత్రం. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నారు. 5. చాణక్య గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం చాణక్య. ఇందులో గోపిచంద్ రా ఏజెంట్‌గా మెప్పించారు. ఈ సినిమాకు అబ్బూరి రవి కథ రాయగా డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహాలో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక డార్లింగ్‌ను సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చూస్తే ప్రభాస్ అభిమానులకు పండగే. మరోవైపు ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క చిత్రం కూడా సీక్రెట్ ఏజెంట్ కథాంశంతోనే నవంబర్ 12న రిలీజ్ కానుంది. -
జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని జేమ్స్‌బాండ్ 007తో పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ.. జేమ్స్ బాండ్ వేషధారణలో ఉన్నట్లు ఓ మీమ్‌ను క్రియేట్ చేసి ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తన ఫేస్బుక్లో షేర్ చేశారు. మోదీ బాండ్ పోస్‌లో ఉన్న మీమ్‌లో.. ‘నన్ను జేమ్స్ 007 అని పిలుస్తారు. 0 అభివృద్ది, 0 ఆర్థిక వృద్ధి, 7 ఏళ్ల ఆర్థిక విధ్వంసం’ అని వివరిస్తూ తీవ్రంగా విమర్శించారు. టీఎంసీ ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం అధకారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏం అభివృద్ది జరగలేదని పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులకు ఇబ్బందిగా మారుతోందని దుయ్యబట్టారు. ఆయన షేర్ చేసినా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. -
జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నటించిన యాక్టర్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సుదీర్ఘకాలం అలాంటి కేరక్టర్ చేసిన హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్. ఆయనకి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌తో డేనియల్ని సత్కరించింది హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఈయనే. అయితే ఇప్పటి వరకు అయిదు బాండ్ సినిమాల్లో నటించిన డేనియల్‌కి తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ చివరిది. దీంతో తన టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 53 ఏళ్ల స్టార్ బాండ్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లేకుండా తాను అలాంటి అరుదైన గౌరవాన్ని పొందేవాన్ని కాదని చెప్పాడు. అయితే ఇటీవలే విడుదలైన 24 వ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధించింది. ఈ తరుణంలో 2006లో ‘క్యాసినో రాయల్’తో బ్రిటీష్ గూఢచారిగా ప్రస్థానం ప్రారంభించి.. సుదీర్ఘకాలం బాండ్ పాత్రలో జీవించిన డేనియల్‌కి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది హాలీవుడ్. చదవండి: ఓకే ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్! -
జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా!
జేమ్స్ బాండ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్ బాండ్ నుంచి 24పైగా సిరీస్‌లు వచ్చాయంటే ఈ బాండ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్ అత్యంత క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: జేమ్స్ బాండ్.. బై బై డేనియల్ ఇటీవల ఈ సిరీస్ నుంచి ‘నో టైమ్ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విడుదలైంది. భారత్‌లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో ఈ సిరీస్ రూ. 2. 25 కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. చదవండి: OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్ సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో 5 సార్లు జేమ్స్ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్‌కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని లండన్, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు. -
జేమ్స్ బాండ్.. బై బై డేనియల్
No Time To Die: బ్రిటిష్ నటుడు డేనియల్ క్రెయిగ్ బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఈ నెల 30న యూకేతో పాటు భారత్‌లోనూ(తెలుగులో కూడా) రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మంగళవారం లండన్‌లో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్ యాక్టర్స్ తరలివచ్చారు. ఇక బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా యాభై మూడేళ్ల డేనియల్ క్రెయిగ్ రెడ్ కార్పెట్‌పై కనిపించారు. క్రెయిగ్‌తో పాటు ఈ సినిమాలో బాండ్‌గర్ల్‌గా కనిపించనున్న అన డె ఆర్మస్, విలన్ పాత్ర పోషించిన రామీ మాలేక్ కూడా సందడి చేశారు. Rami Malek, the villainous Safin in #NoTimeToDie, has made his appearance at the @RoyalAlbertHall. pic.twitter.com/vwj4u59aMl — James Bond (@007) September 28, 2021 Ana de Armas (Paloma) is lighting up the @RoyalAlbertHall's red carpet at the #NoTimeToDie World Premiere. pic.twitter.com/oyzjLVou8d — James Bond (@007) September 28, 2021 ఇదిలా ఉంటే బాండ్ ఫ్రాంచైజీలో ఏడో జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్. ఈ బ్రిటిష్ స్పై సిరీస్‌లో డెనియల్ క్రెయిగ్ 2006 కాసినో రాయల్‌లో తొలిసారి బాండ్‌గా కనిపించాడు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తన నటనతో అలరిస్తూ వచ్చాడు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008), స్కైఫాల్(2012), Spectre (2015)లో బాండ్‌గా అలరించాడు డేనియల్ క్రెయిగ్. నిజానికి నో టైం టు డై సినిమా కంటే ముందే రిటైర్ అవ్వాలని భావించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ కమిట్మెంట్ కారణంగా చేయాల్సి వచ్చిందని క్రెయిగ్ క్లారిటీ ఇచ్చాడు. We've been expecting you... Daniel Craig has arrived on the red carpet at the World Premiere of #NoTimeToDie at the @RoyalAlbertHall. pic.twitter.com/WhG226rKus — James Bond (@007) September 28, 2021 క్రెయిగ్ రిటైర్మెంట్ తరుణంలో తర్వాతి బాండ్ ఎవరనే చర్చ కూడా నడుస్తోంది. నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను లేదంటే ఫిమేల్ బాండ్‌ను జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఈయోన్ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం. చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా? -
జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?
అందమైన లొకేషన్లలో మత్తెక్కించే.. కైపెక్కించే అమ్మాయిలతో సరదా షికారు. ‘‘ ఏమి హాయిలే హలా’’ అంటూ ఆహ్లాదమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న టైంలో.. ఊహించని విధంగా ఊడిపడే ముప్పు. ఒక్కసారిగా మీద దూకే శత్రువులు.. వాళ్లతో ఫేస్ టు ఫేస్ ఫైట్, ‘ధడేల్’మంటూ పేలే బాంబులు.. దడ్దడ్ అంటూ బుల్లెట్ల వర్షం.. వాటి మధ్య నుంచే కారులో ‘జుయ్’ మంటూ దూసుకుపోతుంటాడు జేమ్స్ బాండ్.. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో హీరోలు మాత్రమే రాయల్ లుక్‌లో కనిపించరు. ఆ సినిమాల్లో కనిపించే ప్రతీదానికి ఓ రిచ్‌నెస్, ప్రత్యేకతలు ఉంటాయి. జేమ్స్ బాండ్ నడిపే కారుకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ కారు బుల్లెట్లను కక్కుతుంది. కత్తులు దూస్తుంది. కొండలు ఎగబాగుతుంది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో దూసుకుపోతుంది. అద్దాలు బద్దలు గొట్టుకుని ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌లోకి పోతుంది. అవసరమైతే గాల్లో అమాంతం ఎగురుతుంది. ఛేజింగ్‌లో బుల్లెట్లను, బాంబులను తట్టుకునే కార్లు బాండ్ బాబుకి శ్రీరామ రక్షగా నిలుస్తుంటాయి. అందుకే బాండ్ బాబు వాడే బ్రాండ్ కార్లకు అంతే క్రేజ్ ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ ఆ కార్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు. బాండ్.. జేమ్స్ బాండ్ పేరుకే ఈ 007 ఏజెంట్.. ఓ గూఢచారి బ్రిటిష్ క్యారెక్టర్. కానీ, ఏళ్లుగా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ వస్తున్నాడు. బాండ్ రోల్లో కనిపించేది ఎవరైనాసరే.. అభిమానులు మాత్రం ఆ క్యారెక్టర్‌ను అతుక్కుపోతుంటారు. జేమ్స్ బాండ్ ఇరవై ఐదవ సినిమా ‘నో టైం టు డై’.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈమూవీ.. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌లో రిలీజ్ కానుంది. అమెరికా నుంచి అక్టోబరు 8న కొంచెం ఆలస్యంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా దాదాపు యాభై ఏళ్లుగా బాండ్ వాడిన కార్ల మీద ఓ లుక్కేద్దాం. సన్‌బీమ్ అల్పైన్ బాండ్ ఎక్కువగా లోకల్ మేడ్ కంపెనీ కార్లను ఉపయోగిస్తుంటాడు. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో 1962లో ‘నో డాక్టర్’ నుంచి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ స్పెషల్ కార్లను ఉపయోగిస్తోంది. సన్‌బీమ్ అల్పైన్ కంపెనీ సిరీస్ 2 కారును ఉపయోగించాడు. క్లాసిక్ ఫ్యాషన్‌లో ఈ బ్లూ కలర్ కారులో నటుడు సీన్ కానరీ వెళ్తుంటే.. ఎంతో స్టైలిష్‌గా అనిపించకమానదు. అయితే సినిమాలో బాండ్ పర్సనల్ కారు కాదు. జమైకా ఏజెంట్ జాన్ వేస్ సొంత కారు. బెంట్లీ మార్క్ ఫ్రమ్ రష్యా విత్ లవ్(1963) లో అప్పటికే మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు గడిచిన బెంట్లీ మార్క్ IV కారును ఉపయోగించారు. టయోటా యూ ఓన్లీ లివ్ ట్వైస్(1967)లో జపాన్ ఫస్ట్ సూపర్ కార్ టయోటా 2000 జీటీని ఉపయోగించారు. అయితే సీన్ కానరీ పొడగరి కావడంతో ఆ కారుకు కొన్ని మార్పులు చేసి ప్రత్యేకంగా కారును డిజైన్ చేశారు. మెర్క్యూరీ కూగర్ ఆన్ హర్ మెజెస్టీస్ సీక్రెట్ సర్వీస్(1969)లో ప్రేయసి ట్రేసీ కారును ఉపయోగిస్తాడు బాండ్. అందులో ఆమెది మెర్క్యూరీ కూగర్ ఎక్స్ఆర్-7 మోడల్ కారు. ఫోర్డ్ డైమండ్స్ ఆర్ ఫర్ఎవర్(1971)లో అప్పటిదాకా సినిమాల్లోకెళ్లా బెస్ట్ ఛేజింగ్ సీన్ ఉంటుంది. ఎర్రకలర్ ఫోర్డ్ మస్టాంగ్ మాచ్ 1 మోడల్ కారును అందుకోసం ఉపయోగించారు. ఈ ఛేజ్ సీన్ బాండ్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. డై అనదర్ డే(2002)లో ఐదు దశాబ్దాల కిందటి మోడల్ ఫోర్డ్ ఫెయిర్లేన్ను ఉపయోగించారు. ఏఎంసీ హోర్నెట్ ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్(1974) హోర్నెట్ ఎక్స్ హాట్చ్బ్యాక్ కారును ఉపయోగించారు. మేరీ గుడ్నైట్ను కాపాడే ప్రయత్నంలో బాండ్ చేసే ఛేజింగ్ కోసం ఈ కారును ఉపయోగించారు. లోటస్ ఎస్ప్రిట్ ది స్పై హు లవ్డ్ మీ(1977) కోసం ఎస్ప్రిట్ ఎస్1 కారును ఉపయోగించారు. అయితే సినిమాలో ఇదొక సూపర్ కార్గా చూపించేశారు. నీరు, గాలి, నేల మీద ఛేజ్ సీన్ల కోసం డిజైనింగ్ ఉండడం ప్రత్యేకం. రాకెట్లు సైతం పేల్చేది ఈ కారు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981) కోసం లోటస్ ఎస్ప్రిట్ ఎస్సెక్స్ టర్బో మోడల్ కారును ఉపయోగించారు. సిట్రోయిన్ పాపం.. బాండ్ లోటస్ కారు నాశనం అయ్యాక కొత్త కారును వాడుతుంటాడు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981)లో సిట్రోయిన్ 2 సీవీ కారును ఉపయోగించారు. బజాబ్ ఆర్ఈ ఆటో బాండ్ కేవలం కార్లు మాత్రమే వాడతాడా? అనే అనుమానాలు రావొచ్చు. అవసరమైతే బైకులు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఫస్ట్ టైం బాండ్ కోసం భారత్ ‘దేశీ’ టచ్ ఇచ్చారు. ఆక్టోపస్సీ(1983) సినిమాలో ఓ సీన్లో బాండ్ ఛేజింగ్ బజాజ్ ఆర్ మోడల్ ఆటోలో నడుస్తుంది. రెనాల్ట్ ఏ వ్యూ టు కిల్(1985)లో రెనాల్ట్ ట్యాక్సీని ఉపయోగించారు. రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ 2 మోడల్ కారును ‘ ఏ వ్యూ టు ఏ కిల్’(1985) సినిమా కోసం ఉపయోగించారు. మార్కెట్లోకి వచ్చిన దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ మోడల్‌ను బాండ్ మూవీలో ఉపయోగించారు. బీఎండబ్ల్యూ గోల్డెన్‌ఐ(1995) కోసం బీఎండబ్ల్యూ జీ3 మోడల్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత టుమారో నెవర్ డైస్(1997) కోసం బీఎండబ్ల్యూ 740ఐఎల్ను(750ఐఎల్ బ్యాడ్జ్‌లు) కారును బాండ్ వాడాడు. ఇక 1999లో వచ్చిన ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’ కోసం బీఎండబ్ల్యూ జీ8 మోడల్ కారును ఉపయోగించారు. ఆస్టోన్ మార్టిన్ బాండ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించిన కారు బ్రాండ్ ఇది. సుమారు పది సినిమాలకు పైగా ఈ కారునే బాండ్ క్యారెక్టర్ వాడుతుంది. ‘ది లివింగ్ డేలైట్స్’(1987) అస్టోన్ మార్టిన్ వీ8, గోల్డెన్ ఐ(1995), టుమారో నెవర్ డైస్(1997) కోసం అస్టోన్ మార్టిన్ డీబీ5, డై అనదర్ డే(2002) కోసం అస్టోన్ మార్టిన్ వీ12 వాన్క్విష్, కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008) కోసం డీబీఎస్ వీ12, అస్టోన్ మార్టిన్ డీబీ5 మోడల్ కారును కాసినో రాయల్(2006), స్కైఫాల్(2012) కోసం ఉపయోగించారు. రాబోయే ‘నో టైం టు డై’(2021)లోనూ జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్ కోసం ఈ కంపెనీ కారునే ఉపయోగిస్తున్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి: గన్నులున్న బాండ్ కారు.. ధరెంతో తెలుసా? -
త్రీడీలో విడుదల కానున్న మొదటి జేమ్స్‌బాండ్ మూవీ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్ చిత్రాలకి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో 25వ మూవీగా ‘నో టైమ్ టూ డై’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొట్టమొదటి సారి ఓ బాండ్ మూవీని ఇండియాలో 3డీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కరోనా ఉన్న ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారో లేదోనని అందరూ సంశయంలో ఉన్నారు. ఈ తరుణంలో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘షాంగ్ ఛీ: ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. దీంతో జేమ్స్‌బాండ్ ‘నో టైమ్ టూ డై’ చిత్రాన్ని భారీ స్థాయిలో 1600పైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీలో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఇంతకుముందు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 వంటి ఇతర సినిమాలు ప్రపంచం అంతా త్రీడిలో విడుదలైన ఇక్కడ మాత్రం 2డీలోనే రిలీజ్ చేశారు. ఈ సమయంలో ఈ సినిమాని 3డీ విడుదల చేయనుండడం విశేషం. అయితే గతేడాది విడుదల అవ్వాల్సిన ఈ మూవీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకాదరణని పొందింది. కారీ జోజి దర్శకత్వం వహిస్తున్న ‘నో టైమ్ టూ డై’ అమెరికాలో మాత్రం కొంచెం లేట్‌గా అక్టోబరు 8న ప్రేక్షకులను పలకరించనుంది. చదవండి: జేమ్స్‌బాండ్ ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్! -
గన్నులున్న జేమ్స్‌బాండ్ కారు.. అమ్మకానికి రెడీ !
సీక్రెట్ ఏజెంట్ జేమ్స్‌బాండ్ స్టైలే వేరు. నడిచే తీరు నుంచి నడిపే కారు వరకు ప్రతీది ప్రత్యేకమే. బాండ్ సినిమాల్లో ఎంఐ6 ఏజెంట్ ఉపయోగించే కార్లలను సైతం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలాంటి స్పెషల్ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు బాండ్ వాడే కార్లంటీని ఆస్టోన్ మార్టిన్ సంస్థనే తయారు చేసింది. త్వరలో విడుదల కాబోతున్న నో టైం టూ డై సినిమా కోసం స్పెషల్ ఎడిషన్ కార్లను సిద్ధం చేసింది. డీబీ 5 జూనియర్ పేరుతో ఈ కార్లను తయారు చేస్తోంది. రెగ్యులర్ కార్లతో పోల్చితే జేమ్స్‌బాండ్ కార్లు జమీన్ ఆస్మాన్ ఫరక్ అన్నట్టుగా ఉంటాయి. శత్రువులపై పోరాడేందుకు వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా బాండ్ కార్లలో అధునాతమైన ఆయుధాలు, గ్యాడ్జెట్లు ఉంటాయి. డీబీ 5 జూనియర్లో కూడా ఇలాంటి గ్యాడ్జెట్లు వెపన్స్ పొందు పరిచారు. జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్ డీబీ 5 జూనియర్లో డిజిటల్ నంబర్ ప్లేట్‌ను అమర్చారు. ఇందులో నంబర్లు ఆటోమేటిక్‌గా మారిపోతుంటాయి, అంతేకాదు స్విచ్చ్ నొక్కితే చాలు హెడ్లైట్ల స్థానంలో గన్స్ స్రత్యక్షం అవుతాయి. స్మోక్ స్క్రీన్, హిడ్డెన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Introducing the DB5 Junior NO TIME TO DIE Edition.#AstonMartin #LicenceToThrill #NoTimeToDie — Aston Martin (@astonmartin) September 21, 2021 ఆస్టోన్ మార్టిన్ సంస్థ ఎలక్ట్రిక్ కారుగా డీబీ 5 జూనియర్ని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరని 90,000 డాలర్లుగా నిర్ణయించింది. ఈ కారు కావాల్సిన వారు ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టోన్ మార్టిన్ సంస్థ కేవలం 125 కార్లను మాత్రమే తయారు చేసింది. వీటిని ఆస్టోన్ మార్టిన్ మెంబర్షిప్ ఉన్న వారికే కేటాయించనుంది. అయితే ఈ కార్లను సొంతం చేసుకున్నా ... రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. బాండ్ తరహాలో వెపన్స్, లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నందున వీటికి అనుమతి నిరాకరించారు. స్పెషల్ ఈవెంట్స్, రేస్ట్రాక్లపై నడుపుకోవచ్చు. సెలబ్రిటీలు, బిజినెస్ బ్యాగ్నెట్లు తమ గ్యారేజీలో అదనపు ఆకర్షణగా ఈ కార్లను ఉంచుకునేందుకు ఇష్టపడతారు. Raw and instinctive – Vantage deserves to be driven. Watch @007 put his Aston Martin to the test in NO TIME TO DIE from 30th September.#NoTimeToDie #AstonMartin #LicenceToThrill pic.twitter.com/TIvZ7ArdX1 — Aston Martin (@astonmartin) August 31, 2021 చదవండి : సూపర్ కార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ -
ఒకే ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్!
హాలీవుడ్ మూవీస్‌లో జేమ్స్‌బాండ్ సిరీస్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాటిలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే మరో రేంజ్లో ఉంటాయి. అంతేకాకుండా వాటికి అదే రేంజ్ ఖర్చు కూడా పెడుతుంటారు మేకర్స్. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ సిరీస్‌లో ప్రస్తుతం 25 జేమ్స్‌బాండ్ మూవీగా ‘నో టైమ్ టు డై’ రూపొందుతోంది. ఇటలీలో ఇటీవల ఓ ఫైట్ సీన్‌ని చిత్రికరించింది చిత్రబృందం. దాని కోసం ఏకంగా 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్‌ను ఉపయోగించారంట. ఆ ఒక్క సీన్ కోసమే ఏకంగా 50లక్షలకు పైగా ఖర్చుయిందట. గత నాలుగు చిత్రాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించిన డేనియల్ క్రేగ్ ఈ సినిమాలోనూ గూఢచారిగా చేస్తున్నారు. దాదాపు 2000 వేల కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం 2019 నుంచి అభిమానులు నిరీక్షిస్తున్నప్పటికీ అది ఇంతవరకూ రిలీజ్ కాలేదు. కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అది సాధ్యపడటం లేదు. ప్రధానంగా లాక్డౌన్ నిబంధనలు కారణంగా నో టైమ్ టు డై’ విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. -
జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ వాయిస్తున్న ముంబై పోలీసులు
-
ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట!
జేమ్స్‌బాండ్ సినిమాలంటే మీకు ఇష్టమా? జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సినిమాలను మీరు ఇప్పటికే చూసేశారా? పోనీ మరోసారి వాటన్నింటినీ చూసే ఇంట్రస్ట్ ఉందా? ఉంటే ఈ వార్త మీకోసమే.. జేమ్స్‌బాండ్ ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటివరకు రిలీజైన 24 సినిమాలు అన్నీ చూస్తే వెయ్యి డాలర్లు ఇస్తామంటోంది నెర్డ్బియర్ అనే వెబ్సైట్. అయితే ఓ షరతు విధించింది. కేవలం 30 రోజుల్లోనే వాటన్నింటినీ వరుస పెట్టి చూసేయాలని మెలిక పెట్టింది. దీనికి గానూ వెయ్యి డాలర్లు అంటే 72 వేల రూపాయలు ఇస్తామని ఆఫరిచ్చింది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు చూసేందుకు ఏడు వేల రూపాయల గిఫ్ట్ కార్డు, త్వరలో విడుదల కానున్న జేమ్స్‌బాండ్ 25వ సినిమా టికెట్ కొనుక్కునేందుకు మూడున్నర వేల రూపాయల విలువ చేసే ఏఎమ్‌సీ గిఫ్ట్ కార్డు సైతం ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం Nerd Bear- a nerd culture వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్ 16 దరఖాస్తులకు చివరి తేదీ. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్. కేవలం అమెరికా వాసులకు మాత్రమే! కాగా జేమ్స్‌బాండ్ 25వ సినిమా 'నో టైమ్ టు డై' సెప్టెంబర్ 30న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా గతేడాది వేసవిలో థియేటర్లలోకి రావాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల నవంబర్‌కు, ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అయితే అప్పుడు కూడా కుదరకపోవడంతో చివరాఖరకు సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించారు. జేమ్స్‌బాండ్ 24 సినిమాల లిస్టు ఇదే.. 1. Dr. No (1962) 2. From Russia with Love (1963) 3. Goldfinger (1964) 4. Thunderball (1965) 5. You Only Live Twice (1967) 6. On Her Majesty’s Secret Service (1969) 7. Diamonds Are Forever (1971) 8. Live and Let Die (1973) 9. The Man with the Golden Gun (1974) 10. The Spy Who Loved Me (1977) 11. Moonraker (1979) 12. For Your Eyes Only (1981) 13. Octopussy (1983) 14. A View to a Kill (1985) 15. The Living Daylights (1987) 16. Licence to Kill (1989) 17. GoldenEye (1995) 18. Tomorrow Never Dies (1997) 19. The World Is Not Enough (1999) 20. Die Another Day (2002) 21. Casino Royale (2006) 22. Quantum of Solace (2008) 23. Skyfall (2012) 24. Spectre (2015) -
జేమ్స్ బాండ్ హీరో కన్నుమూత
బహమాస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు యూకే మీడియా వెల్లడించింది. జేమ్స్ బాండ్ పాత్రలతో అలరించిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆస్కార్‌తో పాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సీన్ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఇక బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. -
నెక్ట్స్ బాండ్ ఎవరు?
చురుకైన చూపులు, బులెట్లకు ఎదురెల్లే నైజం, దిగాలన్నా, దూకాలన్నా మరో ఆలోచన చేయని ధైర్యం, శత్రువుల ఎత్తుల మీద ఎక్కిÐð ళ్లే సాహసం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నీ జేమ్స్ బాండ్‌కి నిర్వచనాలే. ‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. 007’ అంటూ 58 ఏళ్లుగా స్క్రీన్ మీద సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్నో ఆపరేషన్స్ విజయవంతం చేస్తున్నాడు బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఈ సీక్రెట్ ఏజెంట్ ఆన్ స్క్రీన్ సూపర్ సక్సెస్ఫుల్. 58 ఏళ్లలో 25 బాండ్ చిత్రాలు తెరకెక్కాయి. ఆరుగురు హీరోలు జేమ్స్ బాండ్‌గా ఈ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. తాజాగా మరోసారి బాండ్ ముఖం మారనుంది. జేమ్స్ బాండ్‌గా కొత్త హీరో తెరమీదకు రానున్నాడు. ఇప్పటివరకు కనిపించిన బాండ్లు 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. ఆ తర్వాత రోజర్ మూరే రికార్డు స్థాయిలో ఏడు సినిమాల్లో బాండ్ అవతారమెత్తారు. ‘లివ్ అండ్ లెట్ డై, ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, ది స్పై హూ లవ్డ్ మీ, మూన్రాకర్, ఫర్ యువర్ ఐస్ ఓన్లీ, ఆక్టోపస్సీ, ఏ వ్యూ టు ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూరే నటించారు. ఓ రెండు సినిమాల్లో (ది లివింగ్ డే లైట్స్, లైసెన్స్ టు కిల్) తిమోతీ డాల్టన్, నాలుగు సినిమాల్లో (గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే) పీర్స్ బ్రోస్నన్ బాండ్‌గా కనిపించారు. ప్రస్తుతం బాండ్‌గా ఉన్న డేనియల్ క్రెగ్ తాజాగా విడుదలవనున్న ‘నో టైమ్ టు డై’తో కలిపి ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించారు. ‘కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్కై ఫాల్, స్పెక్ట్రే’ గతంలో ఆయన బాండ్‌గా చేసిన సినిమాలు. ‘నో టైమ్ టు డై’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్‌లో ప్రకటన? బాండ్ 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ విడుదల సందర్భంగా నెక్ట్స్ బాండ్ ప్రకటన ఉంటుందని టాక్. జూన్‌లో టామ్ హార్డీ బాండ్ పాత్ర కోసం ఆడిషన్ చేశారని టాక్. తదుపరి బాండ్ ఆయనే అని హాలీవుడ్ పత్రికలు రాసేస్తున్నాయి. ‘మ్యాడ్ మాక్స్ ఫరీ రోడ్, ది డార్క్ నైట్ రైసస్, వెనమ్, ది రెవనంట్’ వంటి సినిమాల్లో పాపులారిటీ పొందారు హార్డీ. మరి రాబోయే కొత్త బాండ్ ఈ జేమ్స్ బాండ్ ఇమేజ్ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నది కాలమే చెబుతుంది. బాండ్ రేసులో ఎవరున్నారు? ‘ఇక నేను బాండ్ సినిమాల్లో నటించను’ అని డేనియల్ క్రెగ్ ప్రకటించేశారు. మరి.. తదుపరి బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ నటులు టామ్ హార్డీ, టామ్ హిడిల్స్టన్, ఇద్రిస్ ఎల్బా వంటి నటులు నెక్ట్స్ బాండ్‌గా కనిపించేందుకు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ ఉందని హాలీవుడ్ టాక్. ఈ ముగ్గురూ కాకుండా హెన్రీ కావిల్ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. నెక్ట్స్ బాండ్ ఎవరు? -
కరోనానుంచి కోలుకున్న హీరోయిన్
జేమ్స్‌బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకో కరోనా వైరస్ బారినుంచి బయటపడ్డారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకున్నారు. సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓల్గా స్పందిస్తూ తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. కుమారుడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘ నేను పూర్తిగా కోలుకున్నాను. మొదటి వారం రోజులు చాలా కష్టంగా గడిచింది. విపరీతమైన జ్వరం, తలనొప్పితో బాధపడ్డాను. రెండో వారంలో జ్వరం తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు ప్రారంభమైంది! చాలా అలసిపోయినట్లు ఉండేది. రెండో వారం చివర్లో ఆరోగ్యం కుదుట పడింది. దగ్గు తగ్గినప్పటికి ఉదయాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టేది. కానీ, ఈ రోజు అది కూడా లేదు. ( హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు! ) ఇప్పుడు నా కుమారుడితో కలిసి సమయాన్ని గడుపుతున్నా’నని పేర్కొన్నారు. కాగా, కొద్దివారాల క్రితం ఓల్గాకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈమె 2008లో వచ్చిన జేమ్స్‌బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. View this post on Instagram Happy Mother’s Day! #mothersday P.S. I have completely recovered 🙏 To recapitulate: For one week I felt pretty bad and was mostly in bed, sleeping, with high fever and strong headache. The second week, the fever was gone but some light cough appeared and I felt very tired. By the end of the second week I felt totally fine. Cough is almost gone although I still cough in the mornings but then it completely goes away for the day! I’m fine! And now I’m just enjoying this time to reflect on many things and spend my time with my son. 🙏 Я думаю я полностью выздоровела. Коротко о течении болезни: В первую неделю мне было очень плохо и я почти все время лежала с высокой температурой и много спала. Я спала 12 часов за ночь и потом ещё часа 3-4 днём!!! Подняться было тяжело. Усталость сумасшедшая. Головная боль дикая. Во вторую неделю температура полностью ушла и появился легкий кашель. Усталость осталась. Теперь практически никаких симптомов нет. Только немного кашель есть по утрам, но потом он полностью уходит на весь день. Теперь я наслаждаюсь отдыхом и провожу время с сыном. Держитесь!!! 💪 #coronavirus #коронавирус A post shared by Olga Kurylenko (@olgakurylenkoofficial) on Mar 22, 2020 at 2:13pm PDT -
హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్!
ప్రపంచాన్ని గజగజవణికిస్తోన్న కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని ఆమె తెలిపింది. ఓల్గాకు కరోనా సోకడంతో ఆమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు పలు సూచనలు ఇస్తోంది. అలాగే తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్‌ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని ఓల్గా చెప్పుకొచ్చింది. విటమిన్ బీ5, విటమిన్-ఈ, విటమిన్-సీ, జింక్ కరోనా నియంత్రణకు ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని ఓల్గా చెప్పింది. కాగా ఆమె కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారు. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: కరోనా బారిన పడ్డాను Hello everyone! I’m feeling better today. My fever is gone! I hear people can’t figure out where I currently am. I’m in London... Head over to my Instagram for full post and updates - https://t.co/j1ICouSFxb pic.twitter.com/pxe1ih4l6Z — Olga Kurylenko (@OlyaKurylenko) March 18, 2020 -
‘నో టైమ్ టు డై’కి ఇది సమయం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని నేడు కొవిడ్ వైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ‘నో టైమ్ టు డై’ అనే 25వ జేమ్స్ బాండ్ చిత్రం విడుదలతోపాటు, దాని ప్రమోషన్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాల్సిందిగా జేమ్స్ బాండ్ చిత్రాల అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు అభిమానుల వెబ్సైట్ ‘ఎంఐ6–హెచ్‌క్యూ’ చిత్రం పంపిణీదారులైన ‘ఎంజీఎం, యూనివర్శల్’ సంస్థలు ఓ లేఖ రాసింది. లండన్‌తోపాటు యూరప్‌లో మార్చి 31వ తేదీన, ఉత్తర అమెరికాలో ఏప్రిల్ పదవ తేదీన, చైనాలో ఏప్రిల్ 30వ తేదీన విడుదలకు ఏర్పాట్లు చేశారు. (‘కరోనాపై భయపడాల్సిన అవసరం లేదు’) కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో ‘నో టైమ్ టు డై’ చిత్రం విడుదలను ఇప్పటికే నిలిపి వేశారు. అలాగే చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిలిపివేశారు. అయితే లండన్‌లో, ఇతర దేశాల్లో చిత్రం విడుదలనుగానీ, ప్రమోషన్ కార్యక్రమాలనుగానీ నిలిపి వేయలేదు. అందుకనే జేమ్స్ బాండ్ చిత్రాల అభిమానుల వెబ్సైట్ ఓ లేఖను రాసింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సినిమా హాళ్లను మూసివేసే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా చిత్రం విడుదలను ముందుగానే వాయిదా వేసుకోవడం మంచిదని ఆ లేఖలో అభిమానులు కోరారు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో మార్చి 31వ తేదీన ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ హాల్లో ఐదువేల మంది ప్రేక్షకులు పడతారు. కొవిడ్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ప్రజలు ఒకచోట గుమికూడడాన్ని నిషేధించిన విషయం తెల్సిందే. అమెరికా, లండన్‌లో ఇప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ మున్ముందు తీసుకునే అవకాశం ఉంది. (అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్–19 దెబ్బ) -
‘జేమ్స్ బాండ్స్’కు స్పైబార్
‘ఎంఐ5, ఎంఐ6’ బ్రిటన్‌కు చెందిన రెండు గూఢచారి సంస్థలు. ఎంఐ5, అంటే మిలటరీ ఇంటలెజెన్స్ 5. ఇది దేశ అంతర్గత ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు పరిమితం కాగా, ఎంఐ6, అంటే మిలటరీ ఇంటలిజెన్స్ 6. అంతర్జాతీయ కార్య కలాపాలకు పరిమితం అవుతుంది. వీటిల్లో గూఢచారులుగా పనిచేసే సిబ్బంది ఎవరికి తమ వృత్తి వివరాలను వెల్లడించడానికి వీల్లేదు. చివరకు భార్యకు కూడా చెప్పరాదు. ఎవరైనా ఏదో గుమాస్తా ఉద్యోగమో చేస్తున్నట్లు చెప్పుకుంటారు. ఇక అస్తమానం విదేశాలు తిరిగే ఎంఐ6 గూఢచారులకు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అందుకేనేమో వారిలో ఎక్కువ మంది పెళ్ళిళ్లు చేసుకోరు. ఇంటా బయట తాము పడుతున్న పాట్ల గురించి ఎంత ఆప్త మిత్రులకైనా ఏమీ చెప్పుకోవడానికి వీల్లేదు. మరి వారు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలి ? ఎలా సేదతీరాలి? ఎంఐ5 గూఢాచారుల గురించి తెలియదుగానీ ఎంఐ6 గూఢాచారుల కోసం ఓ ప్రత్యేకమైన ‘స్పై బార్’ ఉందట. ఆ బారులోకి వెళ్లాక వారు ఏమైనా తాగవచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు. గోడలకు ఎలాంటి చెవులుండవట. ఈ విషయాన్ని మొట్టమొదటి సారిగా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్ఐఎస్) చీఫ్ సర్ అలెక్స్ యంగర్ తెలియజేశారు. రెండు ఇంటెలిజెన్స్ సర్వీసులు ఎస్ఐఎస్ పరిధిలోకి వస్తాయి, ఈ స్పైబార్ ఎంఐ6 ప్రధాన కార్యాలయంలో ఉందని ‘సీ’ కోడ్ నేమ్‌తో వ్యవహరించే సర్ అలెక్స్ చెప్పారు. ఈ ప్రధాన కార్యాలయం పశ్చిమ లండన్‌లోని ‘వాక్సాహాల్ వంతెన’కు సమీపంలో ఉంది. 20 అంతస్తులుగల ఆ భవనంలో ‘స్పైబార్’ ఏ అంతస్తులో ఉందో తెలపలేదు. బ్రిటన్ ఎస్ఐఎస్ తరఫున తెరపై ‘007 జేమ్స్ బాండ్’గా కనిపించే ప్రస్తుత పాత్రధారి డేనియల్ క్రేగ్ తాగే ‘మార్టిని’ మందు ఆ స్పైబార్లో దొరుకుతుందో, లేదో కూడా చెప్పలేదు. థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ భవనంకు సరైన భద్రత కూడా లేదని ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. థేమ్స్ నది గుండా ఓ నౌకలో వచ్చిన రష్యా గూఢాచారులు భవనంపైకి కాల్పులు జరిగినప్పుడు ఈ విమర్శలు వచ్చాయి. భవనానికి ఎక్కువ అద్దాలు ఉండడం కూడా భద్రతకు ముప్పు. -
‘బాండ్ 25’ టైటిల్ ఫిక్స్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన యాక్షన్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. ఇప్పటికే ఈ సిరీస్‌లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నో టైం టు డై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 3న యూకేలో, 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల కానుందని తెలిపారు. ముందుగా ఈ సినిమాకు ఏ రీజన్ టు డైగా నిర్ణయించినా చివరి నిమిషంలో నో టైం టు డైగా మార్చారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. Daniel Craig returns as James Bond, 007 in… NO TIME TO DIE. Out in the UK on 3 April 2020 and 8 April 2020 in the US. #Bond25 #NoTimeToDie pic.twitter.com/qxYEnMhk2s — James Bond (@007) August 20, 2019 -
బాండ్ ఈజ్ బ్యాక్
జమైకా లొకేషన్లోకి జేమ్స్ బాండ్ తిరిగొచ్చారు. డేనియల్ క్రెగ్ హీరోగా క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో బాండ్ సిరీస్‌లో 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జమైకాలో జరిగిన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్లో భాగంగా హీరో డేనియల్ కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు నెల రోజుల విరామం తీసుకున్న క్రెగ్ తిరిగి సెట్లోకి అడుగుపెట్టారు. జమైకా యాక్షన్ షూట్లో జాయిన్ అయ్యారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ రమీ మాలిక్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. -
ది గ్రేట్ తెలుగు బ్రాండ్
ఇంగ్లిష్ వాళ్లకు ‘జేమ్స్‌బాండ్’ ఉన్నాడు. హిందీ వాళ్ళకు ‘టైగర్’ ఉన్నాడు. మరి తెలుగు వాళ్లకు? నెల్లూరు నుంచి ‘ఏజెంట్ ఆత్రేయ’ దొరికాడు. ఈ క్యారెక్టర్‌తో సిరీస్‌గా ఎన్ని సినిమాలైనా తీయవచ్చు. ఈ క్యారెక్టర్ని స్క్రీన్ ఐకాన్‌గా మార్చవచ్చు.మనకు డిటెక్టివ్ రచయితలు ఉన్నారు కానీ డిటెక్టివ్ హీరోలు లేరు. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు, పానుగంటి వీరంతా తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం లేదా ‘సీక్రెట్ ఏజెంట్’ సాహిత్యం సృష్టించారు. వీళ్లు సృష్టించిన డిటెక్టివ్లు ‘డిటెక్టివ్ వాలి’, ‘యుగంధర్’, ‘షాడో’, ‘బుల్లెట్’ వీరంతా పాఠకులకు ఇష్టులు. హీరోలు.బెంగాలీ సాహిత్యం తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపుతున్న 1950ల కాలంలో బెంగాలీలో విపరీతంగా వస్తున్న డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితమైన తెలుగువారు ఉన్నారు. చక్రపాణి వంటివారు అందుకే ‘మిస్సమ్మ’లో తొలి లోకల్ డిటెక్టివ్‌ను చూపించారు. మిస్సమ్మలో అక్కినేని స్కూల్ సూపర్వైజర్ కమ్ డిటెక్టివ్. ఎప్పుడూ హ్యాట్, చేతిలో స్టిక్, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. ప్రతి డిటెక్టివ్‌కు ఒక అసిస్టెంట్ ఉన్నట్టే అక్కినేనికి కూడా అంజిగాడు అసిస్టెంట్‌గా ఉంటాడు. మిన్ను విరిగి మీద పడినా అతడు చలించకుండా ఏదో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కినేని చేసిన ఈ పాత్ర ఎంత హాస్యం పండించినా తుదకు సావిత్రే మిస్సమ్మ అని తేల్చడంలో కీలకంగా మారి తన వృత్తి ధర్మానికి న్యాయం చేకూర్చింది. అక్కినేని టాలెంట్ వల్ల ఆ పాత్ర హిట్ అయ్యింది కాని అలాంటి పాత్రలు రిపీట్ కాలేదు. కాని సినిమా రంగంలో ఉంటూ డిటెక్టివ్ సాహిత్యాన్ని బాగా ఔపోసన పట్టినవాడు ఆరుద్ర. ఆయన చొరవతోనే ‘గూఢచారి 116’ వంటి సినిమాలు తెలుగులో సాధ్యమయ్యాయి. తెలుగు తెర మీద తొలి జేమ్స్‌బాండ్‌గా కృష్ణ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నారు. కాని ఆ తర్వాత ఆ స్థాయిలో ఏజెంట్ సినిమాలు హిట్ కాలేదు. కృష్ణ హీరోగా ‘ఏజెంట్ గోపి’, ‘రహస్య గూఢచారి’ తదితర సినిమాలు తయారయ్యాయి. చిరంజీవి హీరోగా ‘గూఢచారి నం.1’ సినిమా వచ్చింది. ఈ సందర్భంలోనే కొమ్మూరి సాంబశివరావు వీర శిష్యుడు అయిన మల్లాది వెంకటకృష్ణమూర్తి తెలుగులో లోకల్ డిటెక్టివ్ పాత్రను సృష్టించారు. ‘చంటబ్బాయ్’ నవలలో ఆయన సృష్టించిన పాండురంగారావు పాత్ర ఆ తర్వాత వెండితెర మీద చిరంజీవి పోషించడంతో ‘జేమ్స్పాండ్’ అయ్యింది. ‘చంటబ్బాయ్’ ఒక కామెడీ డ్రామాగా నిలిచింది తప్ప పూర్తిస్థాయి ఏజెంట్ సినిమా కాలేకపోయింది. ఆ తర్వాత సస్పెన్స్ సినిమాలలో ఆరితేరిన దర్శకుడు వంశీ– మోహన్‌బాబు హీరోగా ‘డిటెక్టివ్ నారద’ తీశారు. ఒక ఇంట్లో జరుగుతున్న గూడుపుఠాణీని ఆ ఇంటికి డిటెక్టివ్‌గా వచ్చిన నారద ఛేదించడం కథ. ఇందులో మోహన్‌బాబు అసిస్టెంట్ అల్లావుద్దీన్‌గా మల్లికార్జునరావు నటించాడు. ఆ సినిమా హిట్ అయితే ఎలా ఉండేదో కాని జనం నిరాదరించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగు సినిమా ఈ లాంగ్ కోట్, నల్ల కళ్లద్దాలు, తలమీద హ్యాట్, జేబులో భూతద్దంతో తిరిగే ఏజెంట్ పాత్రను పట్టించుకోలేదు. తమిళంలో కూడా ఇదే పరిస్థితిగా ఉండగా దర్శకుడు మిష్కిన్ ‘డిటెక్టివ్’ పాత్రను మళ్లీ తెర మీదకు తెచ్చి విశాల్‌తో సూపర్ హిట్ కొట్టాడు. ఆధారాలు ఏమీ దొరక్కుండా భారీ మొత్తాలకు వ్యక్తుల అడ్డు తొలగించే ఒక కరడు కట్టిన ముఠాను డిటెక్టివ్ విశాల్ ఎలా పట్టుకున్నాడన్నది ఈ సినిమాలో మిష్కిన్ చాలా రోమాంచితంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో డిటెక్టివ్‌కు అసిస్టెంట్‌గా వేసిన నటుణ్ణి హాస్యగాడిగా కాకుండా అతణ్ణి కూడా ఒక సమవుజ్జీగా దర్శకుడు చూపించాడు. తెలుగులో కూడా ఇది హిట్ కావడంతో డిటెక్టివ్ సినిమాల మూడ్ సెట్ అయ్యింది. ఇప్పుడు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఆ మూడ్‌ను స్థిరపరచడమే కాదు తెలుగు ప్రేక్షకులకు ఒక లోకల్ ఏజెంట్‌ను సక్సస్‌ఫుల్‌గా ఇచ్చింది. సాధారణంగా ఏజెంట్లు, డిటెక్టివ్లు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తిరుగుతుంటారు. కాని ఈ సాయి శ్రీనివాస ఆత్రేయ మాత్రం కోస్తా జిల్లా అయిన నెల్లూరు చుట్టుపక్కల తిరుగుతుంటాడు. అసలు ఈ పాత్రకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ అని పెట్టడమే ఒక నేటివిటి. ‘ఏజెంట్ విక్రమ్’లాగా పెట్టి ఫిక్షనల్ చేయకుండా సినిమాలో చెప్పినట్టు ‘నాది ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు రియల్ క్యారెక్టర్’ అనేవిధంగా చూపి ప్రేక్షకులకు దగ్గర చేశాడు దర్శకుడు స్వరూప్. ఇక హీరో నవీన్ పోలిశెట్టి అసలు సిసలు తెలుగు డిటెక్టివ్‌గా కనిపించి ఇతను కేసు ఛేదించే తీరుతాడు అనే నమ్మకం కలిగిస్తాడు. సాధారణంగా డిటెక్టివ్ కథలు నలిగిన ఇతివృత్తాలతో ఉంటాయి. కాని ఇందులో కొంచెం రియల్ క్రైమ్‌ను బేస్ చేసుకున్నారు. రైల్వే ట్రాక్‌ల దగ్గర తరచూ కనిపించే అనాథ శవాలు ఎవరివి, అవి ఎందుకు ఉంటున్నాయి, ఆ మరణాలకు కారణం ఎవరు అనేది ఈ సినిమా కథ. దీనికి ‘రెలిజియస్ క్రైమ్స్ ఇన్ ఇండియా’ అనే స్టడీ నేపథ్యం కావడం కూడా ప్రేక్షకుల్లో చైతన్యం పెంచే అంశం. చాలా తక్కువ బడ్జెట్ ఉన్నా, వనరులు తక్కువ ఉన్నా ఒక తెలుగు డిటెక్టివ్ పూనుకుంటే క్రైమ్‌ను ఛేదించే సత్తా ఉంటే ఒక జత బట్టలతో కూడా సినిమా మొత్తం నడిపి మెప్పించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది. నిజానికి ఈ ఏజెంట్ పాత్రలు కత్తి మీద సాము. హిందీలో వందలకోట్ల ఖర్చుతో సల్మాన్ ఖాన్‌ను హీరోగా పెట్టి తీసిన ‘ఏక్ థా టైగర్’ కలెక్షన్ల పరంగా బాగున్నా సినిమా పెద్దగా టాక్ సంపాదించుకోలేదు. అయినప్పటికీ టైగర్ సిరీస్‌ను కంటిన్యూ చేయడానికి ‘టైగర్ జిందా హై’ తీశారు. అది ఘనవిజయం సాధించింది. కాని అంతే భారీగా సైఫ్ అలీఖాన్‌ను హీరోగా పెట్టి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తీసిన ‘ఏజెంట్ వినోద్’ ఫ్లాప్ అయ్యింది. అలాంటి నేపథ్యంలో తెలుగు నుంచి ఒక పాత పద్మిని ప్రీమియర్ కారులో తిరిగే డిటెక్టివ్ జనానికి నచ్చడం విశేషమే. సమాజంలో నేరం పెరిగింది. నేరం చేసే మనుషులు మన ఇరుగు పొరుగే ఉంటారు అన్నంతగా వార్తలు కలవర పరుస్తున్నాయి. సైబర్ నేరాలకైతే అంతే లేదు. ఇందుకు ఆడా మగా తేడా లేదు. దొంగ ఐడీ సృష్టించి వేరే ఫొటోలు డిస్ప్లే పిక్చర్లుగా పెట్టి పెళ్లి కూతురుగా ఒక మహిళ ఒకతన్ని మోసం చేస్తే, సినిమా ప్రొడ్యూసర్‌గా మరో మహిళ మరొకతన్ని మోసం చేసిన ఘటనలు వారం రోజుల వ్యవధిలో బయటపడ్డాయి. డ్రగ్స్ సరఫరాలు నిర్వహించే ముఠాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ముఠాలు... వీటిని ఛేదించే ఆత్రేయలు ఇవాళ చాలామంది అవసరం. ఆ ముఠాల గుట్టు బట్టబయలు చేసి ప్రేక్షకులను అలెర్ట్ చేయడం కూడా ముఖ్యం. బహుశా రాబోయే రోజుల్లో ‘ఆత్రేయ ఇన్ పూణె’, ‘ఆత్రేయ ఇన్ అమలాపురం’, ‘ఆత్రేయ ఇన్ ఫలక్‌నుమా’ అనే సినిమాలు రావచ్చు. అలాంటి సినిమాలకు చాన్స్ ఉన్న పాత్రను సృష్టించినందుకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ యూనిట్‌కు రీసౌండ్ వచ్చేలా చప్పట్లు కొట్టాలి. తప్పకుండా నల్ల కళ్లద్దాలు కొని గిఫ్ట్‌గా బహూకరించాలి.– కె బ్రేక్ కోసంఎదురు చూశాం– విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి, శృతీ శర్మ హీరోయిన్లుగా స్వరూప్ తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా కొసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్‌గా ఉన్నప్పటి మెమొరీస్‌ను గుర్తు చేసుకున్నట్టుంది నాకు ప్రస్తుతం. నవీన్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం కలసి థియేటర్ చేశాం. కలసి యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాం. మాకు బ్రేక్ ఎప్పుడు వస్తుందా? అని కలసి ఎదురు చూసే వాళ్లం. థియేటర్ చేస్తున్న రోజుల్లో నవీన్ మమ్మల్ని అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసేవాడు. నాకు ‘పెళ్లి చూపులు’ సినిమాతో బ్రేక్ రావడాన్ని వాడు చాలా సంతోషించాడు. ఇప్పుడు వాడికి బ్రేక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికాడు. చాలా హ్యాపీగా ఉంది. నాకు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది (నవ్వుతూ). స్వరూప్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. రాహుల్‌గారు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ఈ సినిమాను అందరూ చూడాలి. కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు’’ అన్నారు. -
ట్రాక్‌లోనే ఉన్నాం
జేమ్స్‌బాండ్ చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బాండ్ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్స్‌కు క్యూ కడతారు. అందుకే బాండ్ 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్. క్యారీ జోజి ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో ప్రారంభమైంది. ఓ యాక్షన్ సీన్లో భాగంగా డేనియల్ క్రెగ్ గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని టీమ్ ధృవీకరించింది. ‘‘క్రేగ్ గాయపడ్డ మాట నిజమే. ఆయన చీలమండల గాయంతో బాధపడుతున్నారు. సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత రెండు వారాలు ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్లో జాయిన్ అవుతారు. రిలీజ్ విషయంలో ఏ మార్పు లేదు. ట్రాక్‌లోనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.