
రియల్ లైఫ్‌లో వీళ్ల వెనుక ఉన్న జీనియస్ ఓ అమ్మాయి!
జేమ్స్ బాండ్ సినిమాల్లో ‘క్యు’ అనే క్యారెక్టర్ ఉంటాడు.
జేమ్స్ బాండ్ సినిమాల్లో ‘క్యు’ అనే క్యారెక్టర్ ఉంటాడు. అతడి పని జేమ్స్ బాండ్‌కి కొత్త కొత్త గ్యాడ్జెట్స్‌ని డిజైన్ చేసి ఇవ్వడం. ఆ గ్యాడ్జెట్స్‌తో మన హీరో అవలీలగా స్పయింగ్ చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం నిజ జీవితంలో మాత్రం ‘క్యు’అనే ఆ టెక్ జీనియస్ అబ్బాయి కాదు.. ఓ అమ్మాయి! ఈ సంగతి చాలామందికి తెలీదు.
ఇప్పుడైనా ఎలా తెలిసిదంటే.. ‘ఎం16’ చీఫ్ అలెక్స్ ఎంగర్ బయటపెట్టాడు. ఎం16 అనేది బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్. దాని హెడ్ ఈయన. అమ్మాయిల్ని స్పయింగ్‌లోకి ప్రోత్సహించడానికి ఈయన ఆ నిజం చెప్పాల్సి వచ్చింది. దీనివల్ల ప్రమాదమైతే ఏమీ లేదు కానీ, ఎం16లోకి కొత్తగా వచ్చే అమ్మాయిలలో ఎవరైనా ఇప్పుడున్న లేడీ ‘క్యు’కి పోటీ కావచ్చు. మరీ మంచిది.