ట్రాక్‌లోనే ఉన్నాం | Daniel Craig to undergo ankle surgery following Bond injury | Sakshi
Sakshi News home page

ట్రాక్‌లోనే ఉన్నాం

Published Mon, May 27 2019 5:35 AM | Last Updated on Mon, May 27 2019 5:35 AM

Daniel Craig to undergo ankle surgery following Bond injury - Sakshi

డేనియల్‌ క్రెగ్‌

జేమ్స్‌బాండ్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది. బాండ్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్స్‌కు క్యూ కడతారు. అందుకే బాండ్‌ 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్‌. క్యారీ జోజి ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాండ్‌గా డేనియల్‌ క్రెగ్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో ప్రారంభమైంది. ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా డేనియల్‌ క్రెగ్‌ గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని టీమ్‌ ధృవీకరించింది. ‘‘క్రేగ్‌ గాయపడ్డ మాట నిజమే. ఆయన చీలమండల గాయంతో బాధపడుతున్నారు. సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ట్రీట్‌మెంట్‌ తర్వాత రెండు వారాలు ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్‌లో జాయిన్‌ అవుతారు. రిలీజ్‌ విషయంలో ఏ మార్పు లేదు. ట్రాక్‌లోనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్‌లోనే రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement