
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’లోనూ డేనియల్ క్రెగ్ బాండ్‌గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించింది.
కానీ మరోసారి బాండ్‌గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్ బాండ్‌గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్‌లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్‌గా ఆరోన్ పర్‌ఫెక్ట్ చాయిస్ అంటున్నారు కొందరు హాలీవుడ్ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్‌బాండ్ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్ టేలర్.
Comments
Please login to add a commentAdd a comment