ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నటించిన యాక్టర్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సుదీర్ఘకాలం అలాంటి కేరక్టర్ చేసిన హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్. ఆయనకి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌తో డేనియల్‌ని సత్కరించింది హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఈయనే.
అయితే ఇప్పటి వరకు అయిదు బాండ్ సినిమాల్లో నటించిన డేనియల్‌కి తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ చివరిది. దీంతో తన టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 53 ఏళ్ల స్టార్ బాండ్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లేకుండా తాను అలాంటి అరుదైన గౌరవాన్ని పొందేవాన్ని కాదని చెప్పాడు.
అయితే ఇటీవలే విడుదలైన 24 వ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధించింది. ఈ తరుణంలో 2006లో ‘క్యాసినో రాయల్’తో బ్రిటీష్ గూఢచారిగా ప్రస్థానం ప్రారంభించి.. సుదీర్ఘకాలం బాండ్ పాత్రలో జీవించిన డేనియల్‌కి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది హాలీవుడ్.
Comments
Please login to add a commentAdd a comment