No Time to Die
-
Aaron Taylor-Johnson: కొత్త జేమ్స్ బాండ్?
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’లోనూ డేనియల్ క్రెగ్ బాండ్‌గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించింది. కానీ మరోసారి బాండ్‌గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్ బాండ్‌గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్‌గా ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు కొందరు హాలీవుడ్ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్‌బాండ్ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్ టేలర్. -
ప్రముఖ డైరెక్టర్.. ముగ్గురం ఒకేసారి బెడ్ షేర్ చేసుకుందామన్నాడు
జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది 'నో టైమ్ టు డై'. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన ఈ చివరి మూవీకి క్యారీ జోజీ ఫుకునాగా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ డైరెక్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు క్యారీపై ముగ్గురు మహిళలు తమపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. తనతో లైంగిక సంబంధం కోసం ఒత్తిడి చేశాడని 18 ఏళ్ల అమ్మాయి గతవారం మొదటిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్యారీతో దిగిన సెల్ఫీని పంచుకుంటూ 'నాకు గతిలేక 30 ఏళ్ల క్యారీతో లైంగిక సంబంధం కొనసాగించాను. అతను రోజు నాతో పడకసుఖం అనుభవించేవాడు. అతనికి భయపడుతూనే సంవత్సరాలు గడిపాను' అని తెలిపింది. అయితే తమ రిలేషన్షిప్ గురించి ఎవరైనా అడిగితే అందరిముందు తన మేనకోడలు, బంధువు లేదా సోదరిగా నటించమని క్యారీ చెప్పాడని ఆమె పేర్కొంది. తన గురించి ఎవరికీ నిజం చెప్పేవాడు కాదని రాసుకొచ్చింది. అతనితో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత ఆ రిలేషన్ నుంచి బయటపడ్డానని, తనకు పీటీఎస్డీ ఉన్నట్లు గుర్తించి ఒక సంవత్సరం పాటు చికిత్స తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే మరో ఇద్దరు మహిళలు సైతం క్యారీపై లైంగిక ఆరోపణలు చేశారు. '20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు క్యారీ డైరెక్ట్ చేసిన ఒక షోలో కలిసి పనిచేశాం. ఆ సమయంలో అతడు మూడేళ్లుగా మమ్మల్ని లైంగికంగా వేధించాడు. ఓ సారైతే క్యారీ ఇంటికి వచ్చి, అక్కడ ముగ్గురం కలిసి బెడ్ షేర్ చేసుకుందామని అడిగాడు. దానికి మేము ఒప్పుకోలేదు' అని ఆ ఇద్దరు నటీమణులు ఫేస్బుక్లో సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై డైరెక్టర్ క్యారీ జోజీ ఇప్పటివరకు స్పందించలేదు. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆస్కార్ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్
No Time To Die Movie In Oscar 2022 With 4 Categories: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు సంబంధించి అత్యంత ఆదరణ పొందిన చిత్రాల్లో ముందుగా ఉండేది జేమ్స్ బాండ్ సినిమాలు. బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఈ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అందులో బాండ్ చేసే యాక్షన్ సీన్స్, ఉపయోగించే గ్యాడ్జెట్స్ ప్రేక్షకులను, అభిమానులను అబ్బురపరుస్తాయి. అంతేకాదు ఈ ఐకానిక్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీలో నటించేందుకు ప్రముఖ హాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మొత్తం 25 సినిమాలు రాగా ఏడుగురు హీరోలు బాండ్‌గా అలరించారు. అయితే రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 30 సెప్టెంబర్ 2021న విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో నాలుగు విభాగాల్లో 'నో టైమ్ టు డై' చిత్రం నామినేట్ అయింది. ఆస్కార్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో నాలుగింటికి ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం. ఆ నాలుగు విభాగాలు 1. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ 2. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) 3. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్-చిత్రం టైటిల్ సాంగ్) 4. సౌండ్. అయితే ఈ నాలుగింటిలో 'నో టైమ్ టు డై' సినిమా ఎన్ని ఆస్కార్లు కొల్లగొడుతుందో చూడాలి. సినిమా ప్రత్యేకతలు: తొలిసారిగా ఈ చిత్రం కోసం ఒక అమెరికన్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. బీస్ట్ ఆప్ నో నేషన్తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆకర్షించిన కారీ జోజి ఈ సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ సినిమా సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కూడా బాండ్ చిత్రాలకు తొలిసారిగా పనిచేశారు. ఈయన 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్', 'గ్లాడియేటర్', 'లయన్ కింగ్' వంటి చిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. బాండ్ చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం టైటిల్ సాంగ్. ఈ సాంగ్‌పై ప్రతీ బాండ్ చిత్రానికి భారీ అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్కకుండా 'నో టైమ్ టు డై' ఒరిజినల్ సాంగ్ అదరగొట్టింది. ఈ పాటను 18 ఏళ్ల యువ సంగీత సంచలనం బిల్లీ ఐలిష్ పాడటం విశేషం. బాండ్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడిన అతిపిన్న వయస్కురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. అలాగే 'స్పెక్టర్' సినిమాకు సామ్ స్మిత్ పాడిన 'రైటింగ్ ఆన్ ది వాల్' సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. హాలీవుడ్ ప్రేమకథా చిత్రం 'లాలా ల్యాండ్'తో ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'లైనస్ సాండ్‌గ్రెన్' ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు -
కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా ఇది
కరోనా వల్ల థియేటర్లు మూతపడి సినీ వ్యాపారానికి భారీ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోగా, మరికొన్నింటి షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇక బిజినెస్‌కి దెబ్బపడుతుందనే భయంతో ఇంకొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ తరుణంలో థియేటర్ల గేట్లు తెరుచుకోవడంతో.. ధైర్యంగా కొందరు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమకు ధైర్యాన్నిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ బాక్సాఫీస్‌ను శాసిస్తాయని భావించిన సినిమాలు.. పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఈమధ్యే టామ్ హార్డీ ‘వెనోమ్ 2’, డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండూ కాకుండా.. మరో సినిమా ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అదే చైనీస్ వార్‌డ్రామా ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’. అవి అంతంతగానే.. క్యారీ జోజి ఫుకునగ డైరెక్షన్లో రీసెంట్గా రిలీజ్ అయ్యింది ‘నో టైం టు డై’. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ కమ్ ఎమోషనల్ డ్రామా.. వీకెండ్ కలెక్షన్ల పరంగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం 119 మిలియన్ డాలర్లు(ఓవర్సీస్లో) వసూలు చేసింది. ఇక ‘వెనోమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’.. డొమెస్టిక్ సర్క్యూట్లో 12.9 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, రష్యా షోల ద్వారా మరో 13.8 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. 110 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వెనోమ్-2.. ఇప్పటిదాకా 131.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇక అమెరికన్ సైఫై డ్రామా ‘డునే’ 13.7 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. 165 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. కేవలం 103 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. బాక్సాఫీస్ కింగ్.. చైనా వార్ డ్రామా ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’(2021) కలెక్షన్ల సునామీతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కొరియన్ యుద్ధ నేపథ్యంగా చైనా వర్సెస్ అమెరికా కోణంలో ఈ సినిమా తీశారు దర్శక త్రయం చెన్ కైగె, సుయి హార్క్, డాంటే లామ్. చైనీస్ సైనికుల పోరాటాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ‘ది బ్యాటిల్ ఎట్ లేక్ చంగ్జిన్’ కేవలం వీకెండ్ కలెక్షన్లతోనే 237 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఫీట్ సినిమా ట్రేడ్ అనలిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మాండరిన్ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటిదాకా 405 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సందడే కొనసాగుతోంది. దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్కార్ సహాకారంతోనే.. ది బ్యాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్.. కొరియా యుద్దం టైంలో బ్యాటిల్ ఆఫ్ చోసిన్ రిజర్వాయర్, ఆ పోరాటంలో అమెరికా ఓటమి నేపథ్యాలుగా తీసిన సినిమా. దేశభక్తి నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు నెగెటివ్ రివ్యూ ఇవ్వడంతో పాటు కొరియన్ వార్‌లో చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసినందుకుగానూ.. లూవో చాంగ్‌పింగ్(40) అనే ప్రముఖ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేయించింది చైనా సర్కార్. ఇక బలవంతంగా ఆడించేందుకు ప్రభుత్వమే చైనాలో ఎక్కువ స్క్రీన్లను కేటాయించిందన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. కానీ, చైనా స్క్రీన్లను మినహాయించినా.. ఓవర్సీస్లో ఈ చిత్రం రాబట్టిన కలెక్షన్లు చాలాఎక్కువేనని సినిమా ట్రేడ్ అనలిస్టులు తేల్చేశారు. చైనాలో వరుస సెలవులు కావడంతో ది బాటిల్ ఎట్ లేక్ చాన్గ్జిన్కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో హాలీవుడ్‌తో పోలిస్తే.. చైనా సినిమాల డామినేషన్ విపరీతంగా కనిపించింది. ‘డిటెక్టివ్ చైనాటౌన్ 3’ 690 మిలియన్ డాలర్లు, ‘హై, మామ్’ 840 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాయి. చదవండి: ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ జీవితం నేర్పే పాఠాలివే! -
జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నటించిన యాక్టర్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సుదీర్ఘకాలం అలాంటి కేరక్టర్ చేసిన హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్. ఆయనకి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌తో డేనియల్ని సత్కరించింది హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఈయనే. అయితే ఇప్పటి వరకు అయిదు బాండ్ సినిమాల్లో నటించిన డేనియల్‌కి తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ చివరిది. దీంతో తన టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 53 ఏళ్ల స్టార్ బాండ్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లేకుండా తాను అలాంటి అరుదైన గౌరవాన్ని పొందేవాన్ని కాదని చెప్పాడు. అయితే ఇటీవలే విడుదలైన 24 వ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధించింది. ఈ తరుణంలో 2006లో ‘క్యాసినో రాయల్’తో బ్రిటీష్ గూఢచారిగా ప్రస్థానం ప్రారంభించి.. సుదీర్ఘకాలం బాండ్ పాత్రలో జీవించిన డేనియల్‌కి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది హాలీవుడ్. చదవండి: ఓకే ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్! -
‘జేమ్స్ బాండ్’ కోసం లండన్ థియేటర్ మొత్తం బుక్ చేసిన బాలీవుడ్ నిర్మాత
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరోపంతి 2’. లండన్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం గురువారం విడుదలై జేమ్స్ బాండ్ సిరీస్ ‘నో టైమ్ టు డై’ సినిమాను అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసింది. ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చూసేందుకే నిర్మాత సాజిద్ నడియద్వాలా ‘హీరోపంత్ 2 మూవీ టీం, క్రూడ్ కోసం ఏకంగా లండన్‌లోని థియేటర్ మొత్తం బుక్ చేశాడట. లండన్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెలబ్రెషన్స్‌లో భాగంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి చిత్రం బృందంతో కలిసి ఆయన సినిమా చూశాడు. చదవండి: ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు నిర్మాతతో పాటు హీరో టైగర్ ష్రాఫ్, నటి తార సుతరియా, డైరెక్టర్ అహ్మద్ ఖాన్‌తో పాటు మిగతా తారగణం, క్రూడ్ ఉన్నారు. నెల రోజుల పాటు లండన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ‘హీరోపంత్ 2’ టీం ఈ నేపథ్యంలో ‘నో టైమ్ టూ డై’ సినిమాను చూసి సెలబ్రెట్ చేసుకున్నారు. కాగా ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హీరోపంత్ 2’ వచ్చే ఏడాది మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా! -
జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా!
జేమ్స్ బాండ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్ బాండ్ నుంచి 24పైగా సిరీస్‌లు వచ్చాయంటే ఈ బాండ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్ అత్యంత క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: జేమ్స్ బాండ్.. బై బై డేనియల్ ఇటీవల ఈ సిరీస్ నుంచి ‘నో టైమ్ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విడుదలైంది. భారత్‌లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో ఈ సిరీస్ రూ. 2. 25 కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. చదవండి: OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్ సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో 5 సార్లు జేమ్స్ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్‌కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని లండన్, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు. -
జేమ్స్ బాండ్.. బై బై డేనియల్
No Time To Die: బ్రిటిష్ నటుడు డేనియల్ క్రెయిగ్ బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఈ నెల 30న యూకేతో పాటు భారత్‌లోనూ(తెలుగులో కూడా) రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మంగళవారం లండన్‌లో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్ యాక్టర్స్ తరలివచ్చారు. ఇక బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా యాభై మూడేళ్ల డేనియల్ క్రెయిగ్ రెడ్ కార్పెట్‌పై కనిపించారు. క్రెయిగ్‌తో పాటు ఈ సినిమాలో బాండ్‌గర్ల్‌గా కనిపించనున్న అన డె ఆర్మస్, విలన్ పాత్ర పోషించిన రామీ మాలేక్ కూడా సందడి చేశారు. Rami Malek, the villainous Safin in #NoTimeToDie, has made his appearance at the @RoyalAlbertHall. pic.twitter.com/vwj4u59aMl — James Bond (@007) September 28, 2021 Ana de Armas (Paloma) is lighting up the @RoyalAlbertHall's red carpet at the #NoTimeToDie World Premiere. pic.twitter.com/oyzjLVou8d — James Bond (@007) September 28, 2021 ఇదిలా ఉంటే బాండ్ ఫ్రాంచైజీలో ఏడో జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్. ఈ బ్రిటిష్ స్పై సిరీస్‌లో డెనియల్ క్రెయిగ్ 2006 కాసినో రాయల్‌లో తొలిసారి బాండ్‌గా కనిపించాడు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తన నటనతో అలరిస్తూ వచ్చాడు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008), స్కైఫాల్(2012), Spectre (2015)లో బాండ్‌గా అలరించాడు డేనియల్ క్రెయిగ్. నిజానికి నో టైం టు డై సినిమా కంటే ముందే రిటైర్ అవ్వాలని భావించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ కమిట్మెంట్ కారణంగా చేయాల్సి వచ్చిందని క్రెయిగ్ క్లారిటీ ఇచ్చాడు. We've been expecting you... Daniel Craig has arrived on the red carpet at the World Premiere of #NoTimeToDie at the @RoyalAlbertHall. pic.twitter.com/WhG226rKus — James Bond (@007) September 28, 2021 క్రెయిగ్ రిటైర్మెంట్ తరుణంలో తర్వాతి బాండ్ ఎవరనే చర్చ కూడా నడుస్తోంది. నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను లేదంటే ఫిమేల్ బాండ్‌ను జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఈయోన్ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం. చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా? -
త్రీడీలో విడుదల కానున్న మొదటి జేమ్స్‌బాండ్ మూవీ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్ చిత్రాలకి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో 25వ మూవీగా ‘నో టైమ్ టూ డై’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొట్టమొదటి సారి ఓ బాండ్ మూవీని ఇండియాలో 3డీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కరోనా ఉన్న ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారో లేదోనని అందరూ సంశయంలో ఉన్నారు. ఈ తరుణంలో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘షాంగ్ ఛీ: ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. దీంతో జేమ్స్‌బాండ్ ‘నో టైమ్ టూ డై’ చిత్రాన్ని భారీ స్థాయిలో 1600పైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీలో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఇంతకుముందు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 వంటి ఇతర సినిమాలు ప్రపంచం అంతా త్రీడిలో విడుదలైన ఇక్కడ మాత్రం 2డీలోనే రిలీజ్ చేశారు. ఈ సమయంలో ఈ సినిమాని 3డీ విడుదల చేయనుండడం విశేషం. అయితే గతేడాది విడుదల అవ్వాల్సిన ఈ మూవీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకాదరణని పొందింది. కారీ జోజి దర్శకత్వం వహిస్తున్న ‘నో టైమ్ టూ డై’ అమెరికాలో మాత్రం కొంచెం లేట్‌గా అక్టోబరు 8న ప్రేక్షకులను పలకరించనుంది. చదవండి: జేమ్స్‌బాండ్ ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్! -
ఒకే ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్!
హాలీవుడ్ మూవీస్‌లో జేమ్స్‌బాండ్ సిరీస్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాటిలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే మరో రేంజ్లో ఉంటాయి. అంతేకాకుండా వాటికి అదే రేంజ్ ఖర్చు కూడా పెడుతుంటారు మేకర్స్. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ సిరీస్‌లో ప్రస్తుతం 25 జేమ్స్‌బాండ్ మూవీగా ‘నో టైమ్ టు డై’ రూపొందుతోంది. ఇటలీలో ఇటీవల ఓ ఫైట్ సీన్‌ని చిత్రికరించింది చిత్రబృందం. దాని కోసం ఏకంగా 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్‌ను ఉపయోగించారంట. ఆ ఒక్క సీన్ కోసమే ఏకంగా 50లక్షలకు పైగా ఖర్చుయిందట. గత నాలుగు చిత్రాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించిన డేనియల్ క్రేగ్ ఈ సినిమాలోనూ గూఢచారిగా చేస్తున్నారు. దాదాపు 2000 వేల కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం 2019 నుంచి అభిమానులు నిరీక్షిస్తున్నప్పటికీ అది ఇంతవరకూ రిలీజ్ కాలేదు. కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అది సాధ్యపడటం లేదు. ప్రధానంగా లాక్డౌన్ నిబంధనలు కారణంగా నో టైమ్ టు డై’ విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. -
బాండ్ మళ్లీ వాయిదా
జేమ్స్ బాండ్ చెప్పిన చోటుకి, చెప్పిన టైమ్‌కి వచ్చేస్తాడు. కానీ జేమ్స్ బాండ్ చిత్రం మాత్రం చెప్పిన టైమ్‌కి రావడంలేదు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటించారు. ఆయన నటించిన ఐదో బాండ్ చిత్రం ఇది. గత ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి ఈ సినిమా రావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి వాయిదా వేశారు. నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేశారు. అయితే ఏప్రిల్‌లో కాదు ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుందని తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. -
బాండ్ మళ్లీ వాయిదా
కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాల్లానే బాండ్ సినిమా పరిస్థితి కూడా అయోమయంగా మారింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. ఇందులో డానియల్ క్రెగ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ అన్నింట్లో మా సినిమాను చూపించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం’ అన్నారు నిర్మాతలు. -
బాండ్ వస్తున్నాడు
చెప్పిన డేట్‌కి, చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకి రావడం బాండ్ స్టయిల్. బాండే కాదు బాండ్ సినిమా కూడా ఇదే స్టయిల్‌ను పాటిస్తుందని చిత్రబృందం అంటోంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో రానున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. కరోనా వల్ల ఈ చిత్రం విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్‌లో అయినా వస్తుందా? అని సందేహాలు ఉన్నాయి. కానీ నవంబర్‌లో బాండ్ రావడం పక్కా అని తెలుస్తోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందులో నవంబర్‌లో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటిస్తారట. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచొట్లే థియేటర్స్‌ను తెరిచారు. మరి.. బిజినెస్ పరంగా బాండ్ ఎలా లాక్కొస్తాడో చూడాలి. -
తెలుగు జేమ్స్ బాండ్ రెడీ
ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ హీరో డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ సిరీస్ నో టైమ్ టు డై. సంచలనాత్మక విజయాలు నమోదు చేసుకున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ ఐదుసార్లు హీరోగా నటించారు. ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో అలరించింది. మరోవైపు ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లిష్తో పాటు, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందుకవసరమైన డబ్బింగ్ కూడా పూర్తైపోయింది. (మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం) ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయలు) ఖర్చవడం విశేషం. కథ విషయానికొస్తే సీఐఏ సంస్థ డేనియల్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. కానీ డేనియల్ మిషన్‌కు విలన్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని డేనియల్ ఎలా ఎదుర్కొన్నారనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో డేనియల్ పలు మార్లు గాయపడ్డారు. కాగా 'నో టైమ్ టు డై' గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అని టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. అదీ కుదరలేదు. ఎలాగైనా సరే.. ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేస్తాం అన్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితులు బాగోలేవని నవంబర్‌లో వస్తాం అంటున్నారు. ఈ చిత్రాన్ని మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి. (కరోనా దెబ్బకు తేదీలు తారుమారు) -
తేదీలు తారుమారు
కరోనా వల్ల ఏర్పడ్డ అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్ల తాళం ఎప్పుడు తీస్తారో తెలియదు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేకొద్దీ సినిమాలు మరింత దూరం జరుగుతున్నాయి. ఈ ఏడాది రెండో భాగం కళకళలాడుతుంది అనుకున్న హాలీవుడ్ వెలవెలబోయింది. భారీ సినిమాలన్నీ మరోసారి విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. అంతరాయాల అవతార్ 2009లో వచ్చిన ప్రపంచ బ్లాక్ బస్టర్‘అవతార్’కి ఒకటి కాదు నాలుగు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కేమరూన్. 2020, 2021, 2022.. ఇలా ఒక్కో సీక్వెల్‌ని ఒక్కో ఏడాది విడుదల చేయాలనుకున్నారు. సీక్వెల్స్ చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి విడుదల ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన మొదటి భారీ చిత్రం కూడా ఇదే. అనుకున్న సమయానికే వస్తాం అని నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అయితే లాస్ ఏంజెల్స్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పని కుదిరేలా లేదని, వాయిదా అనివార్యం అయిందని చిత్రబృందం తెలిపింది. దీంతో ముందుగా అనుకున్న సీక్వెల్స్ విడుదల తేదీలన్నీ ఓ ఏడాదికి వాయిదా పడ్డాయి. స్టార్‌వార్స్ ఇప్పట్లో లేనట్టే బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్ స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో మరో మూడు సినిమాలను ప్రకటించింది నిర్మాణ సంస్థ డిస్నీ. అయితే ఈ చిత్రాలు కుడా అనుకున్న తేదీ కంటే ఓ ఏడాది వెనక్కి వెళ్లాయి. స్టార్ వార్స్ కొత్త సిరీస్ చిత్రాలకు పేర్లు ఇంకా ప్రకటించలేదు. వాయిదాల జాబితాలో... ఈ ఏడాది వేసవిలో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్ – మావరిక్’ విడుదల కావాల్సింది. కానీ కాలేదు. ఇంకా ‘ఏ క్వైట్ ప్లేస్’ సీక్వెల్ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడింది. యాక్షన్ చిత్రం ‘మూలాన్’, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘టెనెట్’, వెస్ యాండర్ సన్ తెరకెక్కించిన ‘ఫ్రెంచ్ డిస్పాచ్’ చిత్రాలు వాయిదా పడ్డాయి. చెప్పిన తేదీకి రావడం లేదంటున్న ఈ చిత్రాల నిర్మాతలు వాయిదా వేసిన తేదీని మాత్రం చెప్పలేదు. మరి.. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియదు.. తెరిచాక ప్రేక్షకులు వస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక విడుదల తేదీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వగలం అంటున్నారు. జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ని గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు టైమ్ కి రాలేదు. ఫిబ్రవరిలోనే ఏప్రిల్ కి వచ్చేస్తాం అన్నారు.. అప్పటికి థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది నవంబర్‌కి వస్తాం అంటున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే మళ్లీ టైమ్ తప్పేట్లు ఉంది. -
డాడీ బాండ్
జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అందుకే బాండ్ సిరీస్‌లో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. షూటింగ్ సమయంలో ఏర్పడిన భారీ ప్రమాదం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాండ్ రావాల్సింది. కానీ కరోనా రానివ్వలేదు. ఏడాది చివర్లో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయితే అప్పుడు బాండ్ వచ్చేస్తాడు. ఈలోపు ఓ స్పెషల్ న్యూస్. గత 24 సినిమాల్లో బాండ్‌కి ప్రేయసి ఉంది. బైక్ ఛేజ్‌లు, భారీ స్టంట్ సీన్స్ అద్భుతంగా చేసే బాండ్ ప్రేయసితో రొమాంటిక్ సీన్స్‌లోనూ అలరించాడు. ఈసారి మనం మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం అని తెలుస్తోంది. ఎందుకంటే ‘నో టైమ్ టు డై’లో బాండ్ తండ్రిగా కనిపించబోతున్నాడట. దానికి ఆధారం సినిమా చిత్రీకరణంలో భాగంగా బయటపడిన ఫొటో ఒకటి. సినిమాలో జేమ్స్ బాండ్ ప్రేయసి డా. మడేలిన్ స్వాన్, ఐదేళ్ల పాప (పాత్ర పేరు మాథిల్డే) కాంబినేషన్లో దక్షిణ ఇటలీలో చిత్రీకరించిన సీన్‌కి సంబంధించిన ఫొటో ఇది. దాంతో బాండ్, మడేలిన్లకు పాప ఉంటుందని, 25వ సిరీస్‌లో బాండ్ తండ్రిగా కనిపించబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి. సినిమాలో తండ్రీ కూతురి బంధం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లాంటి ఓ వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాండ్ కథతో ఈ 25వ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో బాండ్‌గా డేనియల్ క్రెగ్, ఆయన ప్రేయసిగా లియా డౌక్స్ నటించారు. ఐదేళ్ల పాపగా లిసా డోరా సోన్నె నటించింది. -
డేంజర్లో హలీవుడ్
అంతరిక్ష జీవులు దాడి చేస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. యుగాంతం వచ్చి భూమి బద్దలవుతుంది. హాలీవుడ్ కాపాడుతుంది. సునామీ వచ్చి కెరటాలు ఆకాశానికి ఎగుస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. ప్రపంచానికి ముప్పు వచ్చిన ప్రతిసారీ హాలీవుడ్ హీరో ఒకడు నిలబడతాడు. ఇప్పుడు కరోనా వచ్చింది. కాని– హాలీవుడ్ తనను రక్షించేది ఎవరా అని పిపిఇ ధరించి ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో నంబర్ వన్ హాలీవుడ్. ఏడాదికి దాదాపు 9 లక్షల కోట్లు దాని టర్నోవర్. 120 సంవత్సరాల ఘన చరిత్ర, ఇంత వ్యాపారం ఉన్న హాలీవుడ్ కరోనా వల్ల ఏం కాబోతున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అది కరోనా వల్ల 9 బిలియన్ల డాలర్లను నష్టపోయిందని ఒక అంచనా. నిజానికి చిన్న అవాంతరాలకే కుప్పకూలే వ్యవస్థ ఇది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 57 వేల మంది హాలీవుడ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అదే సమయంలో తమ పారితోషికం పెంచమని 12 వేల మంది హాలీవుడ్, టెలివిజన్ రంగ రచయితలు సమ్మె చేశారు. వీటన్నింటి వల్ల 380 మిలియన్ డాలర్లు నష్టపోయింది హాలీవుడ్. ఆ సమయానికి ఇప్పటిలా డిజిటల్ స్ట్రీమింగ్ లేదు. జనం థియేటర్లలోనే సినిమాలు చూడాల్సిన పరిస్థితి. కాని జనం దగ్గర డబ్బు లేదు. ఆ సమయంలోనే హైవైగల్ అనే ఒక సినీ విశ్లేషకుడు ‘కరువు కాలంలో ఆల్కహాల్ అయినా కొంటారు కాని సినిమా టికెట్ కొనరు’ అని వ్యాఖ్యానించారు. అది అక్షరాలా నిజమైంది. దాదాపు రెండేళ్లపాటు పోరాడి ఆ గడ్డుకాలాన్ని దాటేసింది హాలీవుడ్. కరోనా సమయం హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’ అని కూడా అంటారు. కరోనా దెబ్బకు ఆ కలల వ్యాపారం కుప్పకూలి పోయింది. హాలీవుడ్లో పని చేసే వారందరూ ధనవంతులు కారు. హాలీవుడ్ మీద ఆధారపడి దాదాపు 9 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు రెండు లక్షల మంది మాత్రమే బాగా గడిచే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. మిగిలినవాళ్లంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. వీళ్లలో చాలామంది కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయారు. డిస్నీలాండ్ తన పార్క్‌లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలని తొలగించింది. అలాగే థియేటర్లలో పని చేసే వాళ్లల్లో లక్షా యాభై వేల మందిని తీసేశారు. వాళ్లని పనిలో నుంచి తీసేస్తున్న యజమానులు ఇందుకు వేదన అనుభవిస్తున్నారు. జూన్, జూలై నుంచి సినిమా కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంతమందికి ఉపాధి కల్పించడం కష్టం కావచ్చు. ‘ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం’ అని సినిమాటోగ్రాఫర్లు అంటున్నారు. ‘కేవలం డోమినోలో మాత్రం ఉద్యోగాలున్నాయి. అక్కడ పని వెతుక్కుంటున్నాం’ అని ప్రొడక్షన్ కో ఆర్డినేటర్లు అంటున్నారు. ‘కింగ్డమ్’ సీరియల్లో పాపులర్ అయిన నటుడు మాక్ బ్రిండెట్ తన రెగ్యులర్ ఈఎంఐలు కట్టలేక నిరుద్యోగ భృతికి అప్లై చేశాడు. రానున్న పోటీ రాబోయే రోజుల్లో ఎలా పని చేయాలి అనే విషయం మీద హాలీవుడ్ కసరత్తు చేస్తోంది. ఎలా చేసినా గతంలాంటి స్థితి తిరిగి రాదని అందరికీ తెలుసు. స్టూడియోలు, యూనియన్ల మధ్య చర్చలు ఏ నిర్ణయాలకు వస్తాయో తెలియదు. కాని తక్కువ మందితోనే షూటింగ్ చేయాలి. అవకాశాలు కొద్దిమందికే ఉంటాయి. వాటి కోసం అందరూ దారుణమైన పోటీ పడతారు. వేతనాలు తగ్గిస్తారనే వార్త కార్మికులను కలవర పరుస్తోంది. ప్రపంచాన్ని కాపాడే హీరో హాలీవుడ్లో ఉండొచ్చు. కాని ఆ హీరోను కూడా కాపాడే సూపర్ హీరో ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చి కూచునే వరకు హాలీవుడ్డే కాదు ఏ సినిమా రంగమైనా డేంజర్లో ఉన్నట్టే. రక్షించేవాడు క్రిస్టఫర్ నోలన్? ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్‌ను కాపాడనున్నాడా? కాపాడాలనే సమస్త హాలీవుడ్ భావిస్తోంది. క్రిస్టఫర్ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్’ జూలై 17న విడుదల కానుంది. లాక్డౌన్ తర్వాత కరోనాతో ‘సహజీవనం’ దాదాపు స్థిరపడ్డాక హాలీవుడ్ ప్రపంచం మీదకు ప్రేక్షకుల స్పందన కోసం వదలనున్న సినిమా ఇదే. ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్’ కథ. మన డింపుల్ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది. దీని తర్వాత బాండ్ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై’ విడుదలవుతుంది.ఎలాగైనా అనుకున్న డేట్‌కే సినిమా విడుదల చేయాలని నోలన్ పట్టు పట్టి ఉన్నాడట. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న థియేటర్లతోపాటు కరోనా వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా విడుదలైన ‘ట్రోల్స్ వరల్డ్ టూర్’ వివాదం రేపింది. థియేటర్ల కంటే డిజిటల్‌గా ఇది బాగా కలెక్ట్ చేయడంతో అమెరికాలోని థియేటర్స్ వ్యవస్థ భగ్గుమంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యూనివర్సల్ స్టూడియో వారి ఏ సినిమాలనూ విడుదల చేయబోమని అల్టిమేటం జారి చేసింది. దాంతో ఆ స్టూడియో నుంచి రాబోతున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, ‘జూరాసిక్ వరల్డ్: డొమినియన్’ తదితర సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. స్పానిష్ ఫ్లూ– హాలీవుడ్ సరిగ్గా వందేళ్ల క్రితం 1919 నవంబర్‌లో స్పానిష్ ఫ్లూ ప్రారంభమైంది. 1921 ఫిబ్రవరి వరకూ ఉధృతంగా తన ప్రభావం చూపి వెళ్లిపోయింది. అప్పటికి హాలీవుడ్ పసిపాప. న్యూజెర్సీ నుంచి 1912లో వలస వచ్చి ప్రస్తుతం హాలీవుడ్ ఉన్న చోట స్థిరపడుతూ ఉంది. అప్పటికి అమెరికా వ్యాప్తంగా 20 వేల థియేటర్లలో మూకీ సినిమాలు ఆడుతున్నాయి. అటువంటి సమయంలో స్పానిష్ ఫ్లూ దెబ్బతో హాలీవుడ్లో భయానక వాతావరణం నెలకొంది. ఎవర్ని కదిపినా అప్పుడే ఫ్లూ వ్యాధి బారిన పడ్డ వ్యక్తో లేదా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వ్యక్తో. మొదట్లో స్పానిష్ ఫ్లూని తేలిగ్గా తీసుకున్నాయి చాలా స్టూడియోలు, థియేటర్లు. అప్పుడే షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ తారలు బ్రియాంట్ వాష్‌బర్న్, అన్నా క్యూ నీల్సన్లకు ఫ్లూ వచ్చింది. దాంతో హాలీవుడ్ కలవరపడిపోయింది. షూటింగ్స్ ఆపేశారు. స్పానిష్ ఫ్లూ సమయంలో తీసిన మూకీ సినిమా ‘డాడీ లాంగ్ లెగ్స్’లో జనం ముఖాలకు మాస్క్‌లు హాలీవుడ్ స్టార్స్ తమ నెల జీతాలు తగ్గించుకుని ఆ మొత్తంతో స్టూడియోల్లోకి ఇతర సిబ్బందికి డబ్బులిచ్చారు. మాట్నీ ఐడియల్గా పేరొందిన హెరాల్డ్ లాక్వుడ్ స్పానిష్ ఫ్లూతో చనిపోయాడు. అయితే స్టూడియోలు నెలల తరబడి మూసి ఉంచడానికి మొరాయించాయి. స్టూడియోల్లో వర్క్ చేసుకుంటామని, అందుకు అనుమతి ఇవ్వమని విన్నపాలు ప్రారంభించాయి. దాంతో షూటింగ్స్‌కు పర్మిషన్ వచ్చింది. పోలీసులు చాలా నిబంధనలు పెట్టారు. సినిమాల్లో గుంపులు ఉండే సీన్స్ ఉండకూడదు. కేవలం ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల మీదే సీన్స్ తీయాలి. అయితే దీనివల్ల మరికొందరు స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అప్పట్లో స్టూడియోలకి వచ్చేవాళ్ల మీద క్రిమి సంహారక మందులు జల్లేవాళ్లు. రెడ్‌క్రాస్‌కి చెందిన నర్స్ షూటింగ్‌కి వచ్చినవాళ్ల మీద పౌడర్ చల్లుతుండేది. 1921 ఫిబ్రవరి వరకూ ఈ అవస్థ తప్పలేదు. ప్రేక్షకుల మీద ప్రయోగాలు అమెరికాలో దాదాపు ఆరు వేల థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లలో 40 వేల స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో అధిక శాతం రీగల్, ఎ.ఎమ్.సి, సినీమార్క్ అనే మూడు ప్రధాన సంస్థలవి. అమెరికాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప మిగిలిన నిర్ణయాధికారాలు స్టేట్ గవర్నర్స్కే ఉంటాయి. థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొదటగా టెక్సాస్‌లో మే 8న కొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 25 శాతానికి తగ్గించేశారు. టికెట్ రేట్లలో బాగా డిస్కౌంట్ ఇచ్చారు. హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’డిస్నీలాండ్ టెనెట్’ ఎయిర్ పోర్ట్‌లో ఎలా సెక్యూరిటీ చెక్ ఉంటుందో అంతకు మించి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అయితే పాత సినిమాలే ప్రదర్శిస్తున్నారు. ఒక్లహామా రాష్ట్రంలో థియేటర్లకి గ్లాస్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ థియేటర్లను ఓపెన్ చేయమని ఆదేశాలిచ్చినా అక్కడ కొందరు థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. అట్లాంటాలోని ప్లాజా థియేటర్ ఓనర్ కరోనా ఇంకా ఉండగా ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయలేను అని తేల్చి చెప్పాడు. ‘ఈ పరిస్థితుల్లో ఆదాయం లేకపోగా శానిటైజేషన్ కోసం కొత్త పెట్టుబడి పెట్టాలి. పైగా సీటింగ్ కెపాసిటీ తగ్గించాలి. ఖర్చెక్కువ, రాబడి తక్కువ ఉండే ఇలాంటి పరిస్థితిలో థియేటర్లని మరికొంత కాలం మూసి ఉంచడం బెటర్’ అని మరో థియేటర్ ఓనర్ చెప్పాడు. కొందరు థియేటర్ల ఓనర్ల డిమాండ్ ఏమిటంటే కరోనా ఉండటం వల్ల ప్రేక్షకుల ఇళ్లకు నేరుగా క్యూబ్ సిస్టమ్ ద్వారా సినిమాలను విడుదల చేయాలి అయితే వచ్చిన దానిలో థియేటర్లకు కొంత వాటా ఇవ్వాలి అనేది. ఏమైనా జూలై నుంచి థియేటర్లు సంపూర్ణంగా తెరుచుకుంటాయని అక్కడి ప్రదర్శనారంగ దిగ్గజాలు భావిస్తున్నాయి. – తోట ప్రసాద్ (సినీ రచయిత) -
‘నో టైమ్ టు డై’ వెరీ కాస్ట్లీ గురూ..
డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాణానికి ఇంతవరకు వచ్చిన అన్ని బాండ్ చిత్రాలకన్నా ఎక్కువ ఖర్చు అయిందట. డేనియల్ క్రేగ్ నటించిన ‘స్పెక్టర్’కు అత్యధికంగా 182 మిలియన్ పౌండ్లు ఖర్చుకాగా, ‘స్కైఫాల్’ చిత్రానికి 138 మిలియన్ పౌండ్లు ఖర్చు కాగా తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు (దాదాపు 1837 కోట్ల రూపాయలు ) ఖర్చయ్యాయని చిత్ర నిర్మాణ సంస్థ ‘బీ 25’ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ‘నో టైమ్ టు డై’ చిత్రం కరోనా వైరస్ విజృంభణ కారణంగా డిసెంబర్ నెలకు వాయిదా పడింది. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన మొదటి చిత్రం ‘స్కైఫాల్’కాగా, ఆ తర్వాత వరుసగా క్యాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సొలేస్, స్పెక్టర్ చిత్రాల్లో నటించారు. నో టైమ్ టు డై ఆయన ఐదవ చిత్రం. శియాన్ క్యానరీ నటించిన తొలి జేమ్స్ బాండ్ చిత్రం ‘డోర్ నెం.’ నిర్మాణానికి 1962లో 800కే పౌండ్లు (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ఖర్చుకాగా ఇప్పుడు 200 మిలియన్ పౌండ్లు ఖర్చవడం విశేషమని హాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి నో టైమ్ టు డై చిత్ర నిర్మాణానికి మరో 47 పౌండ్లు ఖర్చు అయ్యేవని, హాలీవుడ్ స్టూడియోలు రాయితీలు ఇవ్వడం ఈ మేరకు ఖర్చు తగ్గిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. -
నవంబర్‌కు ‘నో టైమ్ టు డై’
న్యూఢిల్లీ : జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ చిత్రం విడుదల తర్జనభర్జనల అనంతరం నవంబర్ నెలకు వాయిదా పడింది. ఈ చిత్రం బ్రిటన్‌లో ఏప్రిల్ రెండున, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ పదవ తేదీన విడుదల కావాల్సి ఉండింది. కరోనా వైరస్ భయాందోళనల కారణంగా పలు దేశాల్లో థియేటర్లను మూసివేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరి జోజి ఫుకునాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రమే జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రేగ్‌కు చివరిది. ఈ చిత్రాన్ని నవంబర్ 12వ తేదీన బ్రిటన్‌లో, నవంబర్ 25వ తేదీన అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర నిర్మాతలు మైఖేల్ జీ విల్సన్, బార్బర బ్రొకోలి ప్రకటించారు. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పటికే కరోనా భయాందోళనల వల్ల సినిమా థియేటర్లను మూసివేశారు. ఒక్క చైనాలో థియేటర్లను మూసివేయడం వల్ల ఇప్పటికే రెండు వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందట. పలు దేశాల్లో థియేటర్లను మూసివేయడం వల్ల దాదాపు 500 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందన్నది అంచనా. -
ఇలా అయితే ఎలా కరోనా?
కాదేదీ సినిమా షూటింగ్‌కి అవాంతరం అంటారో నిర్మాత. అవును, సినిమా షూటింగ్ ఆగిపోవడానికి.. ఆగకుండా కురిసే వర్షం నుండి అనుకోకుండా వచ్చే వైరస్ కూడా కారణం అవొచ్చు. ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉన్నా, నటీనటుల కాల్షీట్లు కావాల్సినన్ని ఉన్నా, కొన్ని సార్లు షూటింగ్ అనుకున్నట్టుగా సాగదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ – కరోనా. చాలా దేశాలు ప్రాణ భయంలో ఉన్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ దెబ్బ అన్ని పరిశ్రమలపై పడింది. సినీ పరిశ్రమ మీద కూడా. ఇలా అకారణంగా ఊడిపడ్డ ఈ వైరస్ కారణంగా పలు సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఇలా అయితే ఎలా కరో (చెయ్య)నా అనే డైలమాలో కొన్ని యూనిట్లు పడ్డాయి. మొత్తానికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ప్రమోషన్లు డైలమాలో పడుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా అనూహ్య ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాల గురించి వివరాలు. థాయ్ వద్దోయ్ నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సీరియస్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఏసీపీ విజయ్ వర్మ అనే పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అహిషోర్ సోల్మాన్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో జరపాలనుకున్నారు. కరోనా ప్రభావం థాయ్‌ల్యాండ్‌లో కనిపించడంతో ఈ షెడ్యూల్‌ను వాయిదా వేసింది చిత్రబృందం. మరి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి కరోనా హడావిడి తగ్గాక థాయ్‌ల్యాండ్ వెళతారా? లేకపోతే లొకేషన్‌నే షిఫ్ట్ చేస్తారా? వేచి చూడాలి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయుడు మళ్లీ వెతుకుతున్నాడు చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ చెన్నైలో రెడీ అవుతున్న ‘ఇండియన్ 2’ను ఇబ్బందుల్లో పడేసింది. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1995లో వచ్చిన ‘ఇండియన్’కి సీక్వెల్ ఇది. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో పలు లొకేషన్లలో ప్లాన్ చేశారు శంకర్. దీనికి సంబంధించిన లొకేషన్లను కూడా గత ఏడాది సందర్శించి ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేయడం రిస్క్. దీంతో లొకేషన్‌ను మార్చాలనే ప్లాన్‌లో ఉందట చిత్రబృందం. దీనికోసం మళ్లీ లొకేషన్లు వెతకడం నుంచి ప్రారంభించాలి. దీనివల్ల షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏజెంట్ ప్లాన్ ఇంపాజిబుల్ ఏజెంట్ ఈతన్ హంట్ తన సరికొత్త మిషన్ కోసం ఇటలీ ప్రయాణించాల్సిన పని. అందుకు తగ్గ ప్లాన్‌ని సిద్ధం చేసుకున్నారు కూడా. కానీ అనుకోకుండా కరోనా అతని ప్రయాణానికి బ్రేక్ వేసింది. టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సిరీస్‌లో వస్తున్న ఏడో సినిమా ఇది. ఈ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలను ఇటలీలో షూట్ చేయాలనుకున్నారు. ఇటలీలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. నో వే టు డూ ప్రపంచాన్ని చుట్టేయగల యాక్షన్ హీరో జేమ్స్‌బాండ్ . ప్రస్తుతం ఈ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రమిది. ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే చైనాలో ఓ ప్రమోషనల్ టూర్‌తో పాటు స్పెషల్ ప్రీమియర్స్‌ను ప్లాన్ చేసింది ‘నో టైమ్ టు డై’ టీమ్. అయితే నో వే టు డూ అనే పరిస్థితి. కరోనా కారణంగా చైనాలో థియేటర్స్ అన్నీ కొన్ని రోజులుగా మూతబడి ఉన్నాయి. కరోనా కారణంగా ప్రమోషనల్ టూర్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. చైనా మార్కెట్లో బాండ్ సినిమా విడుదల కాకపోతే సుమారు సుమారు 70 నుంచి 100 మిలియన్ డాలర్ల బిజినెస్ కోల్పోయినట్టే. ఇలా అనూహ్యంగా వచ్చిన ఈ వైరస్ వల్ల మరికొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఎంతో సమయం, డబ్బు వృథా కాక మానదు. పరిస్థితులన్నీ చక్కబడి షూటింVŠ లు, రిలీజ్లు ఎప్పటిలానే చకచకా అయిపోవాలని కోరుకుందాం. -
తెల్లజుట్టు బాండ్
మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 57 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ప్రస్తుతం బాండ్ 25వ సినిమా రూపొందుతోంది. ‘నో టైమ్ టు డై’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 8 విభిన్న లుక్స్‌లో బాండ్ కనిపిస్తారట. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ (సగం నెరిసిన జుట్టు)లోనూ కనిపిస్తారట. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
ఒకటికి మూడు
‘జేమ్స్‌బాండ్’ సిరీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఎప్పటికీ తగ్గకపోవడం వల్లే జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు 24 చిత్రాలు వచ్చాయి. తాజాగా బాండ్ సిరీస్‌లో వస్తోన్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత రమీ మాలిక్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఒకటికి మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించాలనుకుంటున్నారట క్యారీ జోజీ. అలా చిత్రీకరణ జరిపేలా యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారట. ఏ క్లైమాక్స్‌ను ఫైనల్‌గా ఫిక్స్ చేస్తారో హీరోకి కూడా చివరివరకు చెప్పరట. సాధారణంగా ఇలా మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట క్యారీ. మరి. .‘నో టైమ్ టు డై’ సినిమాలో ఫైనల్‌గా ఏ క్లైమాక్స్ ఉండబోతుందో తెలిసేది వెండితెరపైనే అన్నమాట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘బాండ్ 25’ టైటిల్ ఫిక్స్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన యాక్షన్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. ఇప్పటికే ఈ సిరీస్‌లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నో టైం టు డై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 3న యూకేలో, 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల కానుందని తెలిపారు. ముందుగా ఈ సినిమాకు ఏ రీజన్ టు డైగా నిర్ణయించినా చివరి నిమిషంలో నో టైం టు డైగా మార్చారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. Daniel Craig returns as James Bond, 007 in… NO TIME TO DIE. Out in the UK on 3 April 2020 and 8 April 2020 in the US. #Bond25 #NoTimeToDie pic.twitter.com/qxYEnMhk2s — James Bond (@007) August 20, 2019