
డేనియల్ క్రెగ్
చెప్పిన డేట్‌కి, చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకి రావడం బాండ్ స్టయిల్. బాండే కాదు బాండ్ సినిమా కూడా ఇదే స్టయిల్‌ను పాటిస్తుందని చిత్రబృందం అంటోంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో రానున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. కరోనా వల్ల ఈ చిత్రం విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్‌లో అయినా వస్తుందా? అని సందేహాలు ఉన్నాయి. కానీ నవంబర్‌లో బాండ్ రావడం పక్కా అని తెలుస్తోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందులో నవంబర్‌లో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటిస్తారట. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచొట్లే థియేటర్స్‌ను తెరిచారు. మరి.. బిజినెస్ పరంగా బాండ్ ఎలా లాక్కొస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment