ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ హీరో డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ సిరీస్ నో టైమ్ టు డై. సంచలనాత్మక విజయాలు నమోదు చేసుకున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ ఐదుసార్లు హీరోగా నటించారు. ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో అలరించింది. మరోవైపు ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందుకవసరమైన డబ్బింగ్ కూడా పూర్తైపోయింది. (మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం)
ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయలు) ఖర్చవడం విశేషం. కథ విషయానికొస్తే సీఐఏ సంస్థ డేనియల్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. కానీ డేనియల్ మిషన్‌కు విలన్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని డేనియల్ ఎలా ఎదుర్కొన్నారనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో డేనియల్ పలు మార్లు గాయపడ్డారు. కాగా 'నో టైమ్ టు డై' గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అని టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. అదీ కుదరలేదు. ఎలాగైనా సరే.. ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేస్తాం అన్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితులు బాగోలేవని నవంబర్‌లో వస్తాం అంటున్నారు. ఈ చిత్రాన్ని మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి. (కరోనా దెబ్బకు తేదీలు తారుమారు)
Comments
Please login to add a commentAdd a comment