James Bond Series
-
నెక్ట్స్ జేమ్స్ బాండ్ అతడేనా !.. మేకర్స్ ఏమంటున్నారంటే ?
జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన చివరి బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై'. ఈ సిరీస్‌లో 25వ బాండ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఏజెంట్ బాండ్ చనిపోవడంతోపాటు చక్కని భావోద్వేగపు వీడ్కోలు ఇచ్చారు మేకర్స్. అయితే డేనియల్ తర్వాత జేమ్స్ బాండ్‌గా సందడి చేయనుంది ఎవరా అనే అంశం ఆసక్తిగా మారింది. అనేక మంది హాలీవుడ్ స్టార్స్ సైతం ఆ పాత్రను చేయాలని ఉత్సుకతతో ఉన్నారు. ఈ క్రమంలో తర్వాతి జేమ్స్ బాండ్‌గా 'మండేలా: లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' యాక్టర్ 'ఇడిస్ ఎల్బా' (Idris Elba) నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నిర్మాతలు బార్బరా బ్రోకలీ, మైఖేల్ జీ విల్సన్‌లు స్పందించారు. స్క్రీన్రాంట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాతలు ఇలా చెప్పుకొచ్చారు. 'మాకు ఇడిస్ చాలా బాగా తెలుసు. మాకు అతను మంచి స్నేహితుడు. అలాగే అద్భుతమైన నటుడు. కానీ జేమ్స్ బాండ్ గురించి ఇలా మాట్లాడటం ఎప్పుడూ కష్టమే. మీకు తెలుసా. నో టైమ్ టు డై సినిమా విడుదల వరకు డేనియల్నే బాండ్‌గా నిర్ణయించుకున్నాం. అలాగే అతను బాండ్‌గా ఎంతగా అలరించాడో చూశాం. తర్వాత బాండ్ గురించి మేము ఇంకా ఎవరి గురించి ఆలోచించలేదు. ఎవరితో మాట్లాడలేదు.' గతేడాదే తదుపరి జేమ్స్ బాండ్ తానే అనే పుకార్లకు చెక్ పెట్టాడు ఇడిస్. లండన్‌లో ఒక సంభాషణల మధ్య 'కాదు. నేను జేమ్స్ బాండ్‌ను కాను. మార్పును కోరుకున్నట్లయితే నలుపు, తెలుగు వంటి వర్ణం గురించి మాట్లాడనప్పుడే ఆ పాత్ర చేస్తాను.' అని ఇడిస్ తెలిపాడు. అయితే ఈ తర్వాతి బాండ్ కోసం నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను తీసుకోనుట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇడిస్ అలా మాట్లాడి ఉండోచ్చని తెలుస్తోంది. -
జేమ్స్ బాండ్‌గా చేయాలనుందన్న ఆ స్టార్ హీరో
Dwayne Johnson Wants To Play James Bond Character: హాలీవుడ్ ఐకానిక్ స్పై థ్రిల్లర్ 'జేమ్స్ బాండ్' సినిమా ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అభిమానులైతే చిన్న చిన్న స్పైలు చేస్తూ తాము జేమ్స్ బాండ్ల ఫీల్ అవుతుంటారు. ఆ పాత్రలో నటించేందుకు యాక్టర్స్ సైతం బాండ్ అనే బ్రాండ్ కోసం ఎంతో ఆరాటపడుతారు. అలాంటి జాబితాలో 'సూపర్ మ్యాన్'గా పాపులర్ అయిన 'కావిల్ హెన్రీ'తోపాటు హాలీవుడ్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా చేరారు 'డ్వేన్ జాన్సన్ (ది రాక్)'. ఇటీవల ఈ స్టార్ నటించిన రెడ్ నోటీస్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న డ్వేన్ ఓ ఇంటర్య్వూలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. కాగా జేమ్స్ బాండ్ పాత్రలో తర్వాత ఎవరినీ తీసుకోవాలనే చర్చ నడుస్తోంది. '1967లో వచ్చిన 007 సినిమా యూ ఓన్లీ లివ్ ట్వైస్లో మా తాత పీటర్ మైవియా విలన్‌గా నటించారు. అవును, 'సీన్ కానరీ' బాండ్‌గా చేసిన సినిమాలో మా తాత విలన్. నేను ఆ 'సీన్ కానరీ'లా కూల్ బాండ్‌గా నటించాలనుకుంటున్నాను. నాకు విలన్ అవ్వాలని లేదు. నేను బాండ్ అవ్వాలి' అని 'ఎస్కైవర్ వీడియో సిరీస్ అయిన ఎక్స్‌ప్లేన్ దిస్ షో'లో జాన్సన్ తెలిపాడు. అయితే ఇంతకుముందు ఏ ఒక్క అమెరికన్ బాండ్ పాత్ర పోషించకపోగా, అమెరికన్లందరూ బాండ్ ఫ్రాంచైజీలో విలన్లుగా కనిపించారు. అందుకే జాన్సన్‌కు విలన్‌గా చేయాలని లేనట్లు తెలుస్తోంది. డేనియల్ క్రేగ్‌కు బాండ్‌గా ఐదో చిత్రమైన 'నో టైమ్ టూ డై' అక్టోబర్ మొదటి వారంలో విడుదలై యూఎస్ బాక్సాఫీస్ వద్ద 56 మిలియన్ల అమెరికన్ డాలర్లు కొల్లగొట్టింది. తదుపరి బాండ్ చిత్రం ఎప్పుడూ అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే డేనియల్‌కి ప్రత్యామ్నాయంగా తర్వాతి బాండ్ ఎవరూ అనేది ప్రకటించలేదు. ఈ జేమ్స్ బాండ్ పాత్ర ఎంపికపై 2022 వరకు చర్చించలేమని దర్శకనిర్మాతలు తెలిపారు. మరోవైపు జాన్సన్ 'బ్లాక్ ఆడమ్' సినిమాతో డీసీ ఫ్రాంచైజీలోకి అడుగుపెడుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన డిస్నీ వెంచర్ 'జంగిల్ క్రూజ్'కు సీక్వెల్ కూడా రానుంది. -
జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా!
జేమ్స్ బాండ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్ బాండ్ నుంచి 24పైగా సిరీస్‌లు వచ్చాయంటే ఈ బాండ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్ అత్యంత క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: జేమ్స్ బాండ్.. బై బై డేనియల్ ఇటీవల ఈ సిరీస్ నుంచి ‘నో టైమ్ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విడుదలైంది. భారత్‌లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో ఈ సిరీస్ రూ. 2. 25 కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. చదవండి: OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్ సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో 5 సార్లు జేమ్స్ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్‌కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని లండన్, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు. -
జేమ్స్ బాండ్.. బై బై డేనియల్
No Time To Die: బ్రిటిష్ నటుడు డేనియల్ క్రెయిగ్ బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఈ నెల 30న యూకేతో పాటు భారత్‌లోనూ(తెలుగులో కూడా) రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మంగళవారం లండన్‌లో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్ యాక్టర్స్ తరలివచ్చారు. ఇక బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా యాభై మూడేళ్ల డేనియల్ క్రెయిగ్ రెడ్ కార్పెట్‌పై కనిపించారు. క్రెయిగ్‌తో పాటు ఈ సినిమాలో బాండ్‌గర్ల్‌గా కనిపించనున్న అన డె ఆర్మస్, విలన్ పాత్ర పోషించిన రామీ మాలేక్ కూడా సందడి చేశారు. Rami Malek, the villainous Safin in #NoTimeToDie, has made his appearance at the @RoyalAlbertHall. pic.twitter.com/vwj4u59aMl — James Bond (@007) September 28, 2021 Ana de Armas (Paloma) is lighting up the @RoyalAlbertHall's red carpet at the #NoTimeToDie World Premiere. pic.twitter.com/oyzjLVou8d — James Bond (@007) September 28, 2021 ఇదిలా ఉంటే బాండ్ ఫ్రాంచైజీలో ఏడో జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్. ఈ బ్రిటిష్ స్పై సిరీస్‌లో డెనియల్ క్రెయిగ్ 2006 కాసినో రాయల్‌లో తొలిసారి బాండ్‌గా కనిపించాడు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తన నటనతో అలరిస్తూ వచ్చాడు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008), స్కైఫాల్(2012), Spectre (2015)లో బాండ్‌గా అలరించాడు డేనియల్ క్రెయిగ్. నిజానికి నో టైం టు డై సినిమా కంటే ముందే రిటైర్ అవ్వాలని భావించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ కమిట్మెంట్ కారణంగా చేయాల్సి వచ్చిందని క్రెయిగ్ క్లారిటీ ఇచ్చాడు. We've been expecting you... Daniel Craig has arrived on the red carpet at the World Premiere of #NoTimeToDie at the @RoyalAlbertHall. pic.twitter.com/WhG226rKus — James Bond (@007) September 28, 2021 క్రెయిగ్ రిటైర్మెంట్ తరుణంలో తర్వాతి బాండ్ ఎవరనే చర్చ కూడా నడుస్తోంది. నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను లేదంటే ఫిమేల్ బాండ్‌ను జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఈయోన్ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం. చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా? -
జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?
అందమైన లొకేషన్లలో మత్తెక్కించే.. కైపెక్కించే అమ్మాయిలతో సరదా షికారు. ‘‘ ఏమి హాయిలే హలా’’ అంటూ ఆహ్లాదమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న టైంలో.. ఊహించని విధంగా ఊడిపడే ముప్పు. ఒక్కసారిగా మీద దూకే శత్రువులు.. వాళ్లతో ఫేస్ టు ఫేస్ ఫైట్, ‘ధడేల్’మంటూ పేలే బాంబులు.. దడ్దడ్ అంటూ బుల్లెట్ల వర్షం.. వాటి మధ్య నుంచే కారులో ‘జుయ్’ మంటూ దూసుకుపోతుంటాడు జేమ్స్ బాండ్.. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో హీరోలు మాత్రమే రాయల్ లుక్‌లో కనిపించరు. ఆ సినిమాల్లో కనిపించే ప్రతీదానికి ఓ రిచ్‌నెస్, ప్రత్యేకతలు ఉంటాయి. జేమ్స్ బాండ్ నడిపే కారుకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ కారు బుల్లెట్లను కక్కుతుంది. కత్తులు దూస్తుంది. కొండలు ఎగబాగుతుంది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో దూసుకుపోతుంది. అద్దాలు బద్దలు గొట్టుకుని ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌లోకి పోతుంది. అవసరమైతే గాల్లో అమాంతం ఎగురుతుంది. ఛేజింగ్‌లో బుల్లెట్లను, బాంబులను తట్టుకునే కార్లు బాండ్ బాబుకి శ్రీరామ రక్షగా నిలుస్తుంటాయి. అందుకే బాండ్ బాబు వాడే బ్రాండ్ కార్లకు అంతే క్రేజ్ ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ ఆ కార్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు. బాండ్.. జేమ్స్ బాండ్ పేరుకే ఈ 007 ఏజెంట్.. ఓ గూఢచారి బ్రిటిష్ క్యారెక్టర్. కానీ, ఏళ్లుగా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ వస్తున్నాడు. బాండ్ రోల్లో కనిపించేది ఎవరైనాసరే.. అభిమానులు మాత్రం ఆ క్యారెక్టర్‌ను అతుక్కుపోతుంటారు. జేమ్స్ బాండ్ ఇరవై ఐదవ సినిమా ‘నో టైం టు డై’.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈమూవీ.. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌లో రిలీజ్ కానుంది. అమెరికా నుంచి అక్టోబరు 8న కొంచెం ఆలస్యంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా దాదాపు యాభై ఏళ్లుగా బాండ్ వాడిన కార్ల మీద ఓ లుక్కేద్దాం. సన్‌బీమ్ అల్పైన్ బాండ్ ఎక్కువగా లోకల్ మేడ్ కంపెనీ కార్లను ఉపయోగిస్తుంటాడు. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో 1962లో ‘నో డాక్టర్’ నుంచి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ స్పెషల్ కార్లను ఉపయోగిస్తోంది. సన్‌బీమ్ అల్పైన్ కంపెనీ సిరీస్ 2 కారును ఉపయోగించాడు. క్లాసిక్ ఫ్యాషన్‌లో ఈ బ్లూ కలర్ కారులో నటుడు సీన్ కానరీ వెళ్తుంటే.. ఎంతో స్టైలిష్‌గా అనిపించకమానదు. అయితే సినిమాలో బాండ్ పర్సనల్ కారు కాదు. జమైకా ఏజెంట్ జాన్ వేస్ సొంత కారు. బెంట్లీ మార్క్ ఫ్రమ్ రష్యా విత్ లవ్(1963) లో అప్పటికే మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు గడిచిన బెంట్లీ మార్క్ IV కారును ఉపయోగించారు. టయోటా యూ ఓన్లీ లివ్ ట్వైస్(1967)లో జపాన్ ఫస్ట్ సూపర్ కార్ టయోటా 2000 జీటీని ఉపయోగించారు. అయితే సీన్ కానరీ పొడగరి కావడంతో ఆ కారుకు కొన్ని మార్పులు చేసి ప్రత్యేకంగా కారును డిజైన్ చేశారు. మెర్క్యూరీ కూగర్ ఆన్ హర్ మెజెస్టీస్ సీక్రెట్ సర్వీస్(1969)లో ప్రేయసి ట్రేసీ కారును ఉపయోగిస్తాడు బాండ్. అందులో ఆమెది మెర్క్యూరీ కూగర్ ఎక్స్ఆర్-7 మోడల్ కారు. ఫోర్డ్ డైమండ్స్ ఆర్ ఫర్ఎవర్(1971)లో అప్పటిదాకా సినిమాల్లోకెళ్లా బెస్ట్ ఛేజింగ్ సీన్ ఉంటుంది. ఎర్రకలర్ ఫోర్డ్ మస్టాంగ్ మాచ్ 1 మోడల్ కారును అందుకోసం ఉపయోగించారు. ఈ ఛేజ్ సీన్ బాండ్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. డై అనదర్ డే(2002)లో ఐదు దశాబ్దాల కిందటి మోడల్ ఫోర్డ్ ఫెయిర్లేన్ను ఉపయోగించారు. ఏఎంసీ హోర్నెట్ ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్(1974) హోర్నెట్ ఎక్స్ హాట్చ్బ్యాక్ కారును ఉపయోగించారు. మేరీ గుడ్నైట్ను కాపాడే ప్రయత్నంలో బాండ్ చేసే ఛేజింగ్ కోసం ఈ కారును ఉపయోగించారు. లోటస్ ఎస్ప్రిట్ ది స్పై హు లవ్డ్ మీ(1977) కోసం ఎస్ప్రిట్ ఎస్1 కారును ఉపయోగించారు. అయితే సినిమాలో ఇదొక సూపర్ కార్గా చూపించేశారు. నీరు, గాలి, నేల మీద ఛేజ్ సీన్ల కోసం డిజైనింగ్ ఉండడం ప్రత్యేకం. రాకెట్లు సైతం పేల్చేది ఈ కారు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981) కోసం లోటస్ ఎస్ప్రిట్ ఎస్సెక్స్ టర్బో మోడల్ కారును ఉపయోగించారు. సిట్రోయిన్ పాపం.. బాండ్ లోటస్ కారు నాశనం అయ్యాక కొత్త కారును వాడుతుంటాడు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981)లో సిట్రోయిన్ 2 సీవీ కారును ఉపయోగించారు. బజాబ్ ఆర్ఈ ఆటో బాండ్ కేవలం కార్లు మాత్రమే వాడతాడా? అనే అనుమానాలు రావొచ్చు. అవసరమైతే బైకులు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఫస్ట్ టైం బాండ్ కోసం భారత్ ‘దేశీ’ టచ్ ఇచ్చారు. ఆక్టోపస్సీ(1983) సినిమాలో ఓ సీన్లో బాండ్ ఛేజింగ్ బజాజ్ ఆర్ మోడల్ ఆటోలో నడుస్తుంది. రెనాల్ట్ ఏ వ్యూ టు కిల్(1985)లో రెనాల్ట్ ట్యాక్సీని ఉపయోగించారు. రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ 2 మోడల్ కారును ‘ ఏ వ్యూ టు ఏ కిల్’(1985) సినిమా కోసం ఉపయోగించారు. మార్కెట్లోకి వచ్చిన దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ మోడల్‌ను బాండ్ మూవీలో ఉపయోగించారు. బీఎండబ్ల్యూ గోల్డెన్‌ఐ(1995) కోసం బీఎండబ్ల్యూ జీ3 మోడల్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత టుమారో నెవర్ డైస్(1997) కోసం బీఎండబ్ల్యూ 740ఐఎల్ను(750ఐఎల్ బ్యాడ్జ్‌లు) కారును బాండ్ వాడాడు. ఇక 1999లో వచ్చిన ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’ కోసం బీఎండబ్ల్యూ జీ8 మోడల్ కారును ఉపయోగించారు. ఆస్టోన్ మార్టిన్ బాండ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించిన కారు బ్రాండ్ ఇది. సుమారు పది సినిమాలకు పైగా ఈ కారునే బాండ్ క్యారెక్టర్ వాడుతుంది. ‘ది లివింగ్ డేలైట్స్’(1987) అస్టోన్ మార్టిన్ వీ8, గోల్డెన్ ఐ(1995), టుమారో నెవర్ డైస్(1997) కోసం అస్టోన్ మార్టిన్ డీబీ5, డై అనదర్ డే(2002) కోసం అస్టోన్ మార్టిన్ వీ12 వాన్క్విష్, కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008) కోసం డీబీఎస్ వీ12, అస్టోన్ మార్టిన్ డీబీ5 మోడల్ కారును కాసినో రాయల్(2006), స్కైఫాల్(2012) కోసం ఉపయోగించారు. రాబోయే ‘నో టైం టు డై’(2021)లోనూ జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్ కోసం ఈ కంపెనీ కారునే ఉపయోగిస్తున్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి: గన్నులున్న బాండ్ కారు.. ధరెంతో తెలుసా? -
Land Rover : జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.సెప్టెంబర్ 30న విడుదల కానున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది. కేవలం 300 యూనిట్లే డిఫెండర్ వీ8 బాండ్ 300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. 5.0 లీటర్ సూపర్చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 386 కిలోవాట్ పవర్, 625 ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్ డార్క్ గ్రే వీల్స్‌తో ఎక్స్టెండెడ్ బ్లాక్ ప్యాక్, సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డిఫెండర్ 007 రేర్ బ్యాడ్జ్ పొందుపరిచారు. డిఫెండర్ వీ8 90 వేరియంట్ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. చదవండి: ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్! -
ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట!
జేమ్స్‌బాండ్ సినిమాలంటే మీకు ఇష్టమా? జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సినిమాలను మీరు ఇప్పటికే చూసేశారా? పోనీ మరోసారి వాటన్నింటినీ చూసే ఇంట్రస్ట్ ఉందా? ఉంటే ఈ వార్త మీకోసమే.. జేమ్స్‌బాండ్ ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటివరకు రిలీజైన 24 సినిమాలు అన్నీ చూస్తే వెయ్యి డాలర్లు ఇస్తామంటోంది నెర్డ్బియర్ అనే వెబ్సైట్. అయితే ఓ షరతు విధించింది. కేవలం 30 రోజుల్లోనే వాటన్నింటినీ వరుస పెట్టి చూసేయాలని మెలిక పెట్టింది. దీనికి గానూ వెయ్యి డాలర్లు అంటే 72 వేల రూపాయలు ఇస్తామని ఆఫరిచ్చింది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు చూసేందుకు ఏడు వేల రూపాయల గిఫ్ట్ కార్డు, త్వరలో విడుదల కానున్న జేమ్స్‌బాండ్ 25వ సినిమా టికెట్ కొనుక్కునేందుకు మూడున్నర వేల రూపాయల విలువ చేసే ఏఎమ్‌సీ గిఫ్ట్ కార్డు సైతం ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం Nerd Bear- a nerd culture వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్ 16 దరఖాస్తులకు చివరి తేదీ. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్. కేవలం అమెరికా వాసులకు మాత్రమే! కాగా జేమ్స్‌బాండ్ 25వ సినిమా 'నో టైమ్ టు డై' సెప్టెంబర్ 30న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా గతేడాది వేసవిలో థియేటర్లలోకి రావాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల నవంబర్‌కు, ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అయితే అప్పుడు కూడా కుదరకపోవడంతో చివరాఖరకు సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించారు. జేమ్స్‌బాండ్ 24 సినిమాల లిస్టు ఇదే.. 1. Dr. No (1962) 2. From Russia with Love (1963) 3. Goldfinger (1964) 4. Thunderball (1965) 5. You Only Live Twice (1967) 6. On Her Majesty’s Secret Service (1969) 7. Diamonds Are Forever (1971) 8. Live and Let Die (1973) 9. The Man with the Golden Gun (1974) 10. The Spy Who Loved Me (1977) 11. Moonraker (1979) 12. For Your Eyes Only (1981) 13. Octopussy (1983) 14. A View to a Kill (1985) 15. The Living Daylights (1987) 16. Licence to Kill (1989) 17. GoldenEye (1995) 18. Tomorrow Never Dies (1997) 19. The World Is Not Enough (1999) 20. Die Another Day (2002) 21. Casino Royale (2006) 22. Quantum of Solace (2008) 23. Skyfall (2012) 24. Spectre (2015) -
బాండ్ మళ్లీ వాయిదా
జేమ్స్ బాండ్ చెప్పిన చోటుకి, చెప్పిన టైమ్‌కి వచ్చేస్తాడు. కానీ జేమ్స్ బాండ్ చిత్రం మాత్రం చెప్పిన టైమ్‌కి రావడంలేదు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటించారు. ఆయన నటించిన ఐదో బాండ్ చిత్రం ఇది. గత ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి ఈ సినిమా రావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి వాయిదా వేశారు. నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేశారు. అయితే ఏప్రిల్‌లో కాదు ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుందని తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. -
జేమ్స్ బాండ్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పెట్టింది. జేమ్స్‌బాండ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కానరీ ఎంత ప్రాచుర్యం సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాండ్ జేమ్స్ బాండ్ అంటూ ఆయన పేరు దేశ విదేశాలలో మారుమ్రోగింది. అందుకే ఆయన గౌరవార్థం, ది నేమ్ ఆఫ్ ద రోజ్’ చిత్రంలో ఆయన ప్రతిభకు గుర్తుగా ఒక ఆస్ట్రనాయిడ్కు సీన్ కానరీ పేరు పెట్టినట్లు నాసా తెలిపింది. సీన్ కానరీ 1979లో మీటియర్ (ఉల్కపాతం) అనే చిత్రంలో నటించారు. గ్రహశకలం, భూమిని ఢీకొట్టకుండా నాసా ఎలా కాపాడింది అనే నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కానరీ ముఖ్యపాత్ర పోషించారు. నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి కంటే దశాబ్దాల ముందుగానే ఆయన ఈ పాత్రను పోషించారు అని నాసా సోమవారం తాను చేసిన ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదిలా వుండగా అంగారక, గురు గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు సీన్‌కానరీ పేరును పెట్టింది. ఆయన పేరులాగే ఇది ఎంతో కూల్‌గా ఉందని ఆ ఉల్క గురించి నాసా అభివర్ణించింది. లెమ్మన్ శిఖరంపైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్ ద్వారా ఆస్టరాయిడ్ 13070 సీన్ కానరీని ఈ ఏడాది ఏప్రిల్ 4న నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా నాసా ఇటీవల తన ట్విటర్ ద్వారా షేర్ చేసింది. జేమ్స్ బాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సీన్ కానరీ 90 ఏళ్ల వయసులో అక్టోబర్ 31వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. Sir Sean Connery starred in the movie “Meteor” where he led NASA's efforts to defend Earth against an #asteroid impact threat...decades before @NASA appointed its first #PlanetaryDefense Officer! https://t.co/DVCBeRQLgQ — NASA Asteroid Watch (@AsteroidWatch) November 1, 2020 చదవండి: తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు -
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు. బాండ్‌కి బ్రాండ్ సీన్ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది జేమ్స్ బాండ్ సిరీస్ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు సీన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అయితే ‘బాండ్ జేమ్స్ బాండ్’ అంటూ తెరపై సందడి చేసిన సీన్ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట. అయితే చివరికి రిస్క్ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. సూపర్ బాండ్ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్ నవలా రచయిత ఇయామ్ ఫ్లెమింగ్ మాత్రం ఈ పాత్రకు సీన్ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్ నో’ ప్రీమియర్స్ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట. బాండ్ అంటే చిరాకొచ్చింది బాండ్ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్గానే ఎక్కువగా పేరు రావడం సీన్ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్. బియాండ్ బాండ్ బాండ్ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘మేల్’, ‘ది మ్యాన్ హూ ఉడ్ బీ కింగ్’, ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది అన్‌టచబుల్స్’, ‘ది నేమ్ ఆఫ్ ది రోజ్’, ‘ఇండియన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ సినిమాల్లో సీన్ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు సీన్ కానరీ. రిటైర్మెంట్ 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్ అంటే జోక్ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్ బిల్లీ’ అనే యానిమేషన్ చిత్రంలో సర్ బిల్లీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం 1930 ఆగస్ట్ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్ కానరీ. తండ్రి లారీ డ్రైవర్. తల్లి క్లీనింగ్ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారు. మోడలింగ్ చేస్తూ, మిస్టర్ యూనివర్స్ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్ చేశారు. 1954లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్ బ్యాక్’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ మైక్లిన్ రోక్బ్రూన్ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్ కానరీ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంతంగా కన్నుమూశారు ఈ ఏడాది ఆగస్ట్ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్ తనయుడు జాసన్ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్’’ అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. సెక్స్ సింబల్ సీన్ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్’గా ఓటు వేయబడ్డారు సీన్. ‘స్కాంట్ల్యాండ్ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్’ మేగజీన్ అయితే ‘సెక్సియస్ట్ మేన్ ఎలైవ్’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్ మేన్’ అని బిరుదులు ఇచ్చింది. -
జేమ్స్ బాండ్ హీరో కన్నుమూత
బహమాస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు యూకే మీడియా వెల్లడించింది. జేమ్స్ బాండ్ పాత్రలతో అలరించిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆస్కార్‌తో పాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సీన్ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఇక బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. -
బాండ్ మళ్లీ వాయిదా
కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాల్లానే బాండ్ సినిమా పరిస్థితి కూడా అయోమయంగా మారింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. ఇందులో డానియల్ క్రెగ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ అన్నింట్లో మా సినిమాను చూపించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం’ అన్నారు నిర్మాతలు. -
బాండ్ వస్తున్నాడు
చెప్పిన డేట్‌కి, చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకి రావడం బాండ్ స్టయిల్. బాండే కాదు బాండ్ సినిమా కూడా ఇదే స్టయిల్‌ను పాటిస్తుందని చిత్రబృందం అంటోంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో రానున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. కరోనా వల్ల ఈ చిత్రం విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్‌లో అయినా వస్తుందా? అని సందేహాలు ఉన్నాయి. కానీ నవంబర్‌లో బాండ్ రావడం పక్కా అని తెలుస్తోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందులో నవంబర్‌లో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటిస్తారట. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచొట్లే థియేటర్స్‌ను తెరిచారు. మరి.. బిజినెస్ పరంగా బాండ్ ఎలా లాక్కొస్తాడో చూడాలి. -
తెలుగు జేమ్స్ బాండ్ రెడీ
ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ హీరో డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ సిరీస్ నో టైమ్ టు డై. సంచలనాత్మక విజయాలు నమోదు చేసుకున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ ఐదుసార్లు హీరోగా నటించారు. ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో అలరించింది. మరోవైపు ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లిష్తో పాటు, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందుకవసరమైన డబ్బింగ్ కూడా పూర్తైపోయింది. (మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం) ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయలు) ఖర్చవడం విశేషం. కథ విషయానికొస్తే సీఐఏ సంస్థ డేనియల్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. కానీ డేనియల్ మిషన్‌కు విలన్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని డేనియల్ ఎలా ఎదుర్కొన్నారనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో డేనియల్ పలు మార్లు గాయపడ్డారు. కాగా 'నో టైమ్ టు డై' గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అని టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. అదీ కుదరలేదు. ఎలాగైనా సరే.. ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేస్తాం అన్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితులు బాగోలేవని నవంబర్‌లో వస్తాం అంటున్నారు. ఈ చిత్రాన్ని మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి. (కరోనా దెబ్బకు తేదీలు తారుమారు) -
డాడీ బాండ్
జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అందుకే బాండ్ సిరీస్‌లో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. షూటింగ్ సమయంలో ఏర్పడిన భారీ ప్రమాదం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాండ్ రావాల్సింది. కానీ కరోనా రానివ్వలేదు. ఏడాది చివర్లో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయితే అప్పుడు బాండ్ వచ్చేస్తాడు. ఈలోపు ఓ స్పెషల్ న్యూస్. గత 24 సినిమాల్లో బాండ్‌కి ప్రేయసి ఉంది. బైక్ ఛేజ్‌లు, భారీ స్టంట్ సీన్స్ అద్భుతంగా చేసే బాండ్ ప్రేయసితో రొమాంటిక్ సీన్స్‌లోనూ అలరించాడు. ఈసారి మనం మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం అని తెలుస్తోంది. ఎందుకంటే ‘నో టైమ్ టు డై’లో బాండ్ తండ్రిగా కనిపించబోతున్నాడట. దానికి ఆధారం సినిమా చిత్రీకరణంలో భాగంగా బయటపడిన ఫొటో ఒకటి. సినిమాలో జేమ్స్ బాండ్ ప్రేయసి డా. మడేలిన్ స్వాన్, ఐదేళ్ల పాప (పాత్ర పేరు మాథిల్డే) కాంబినేషన్లో దక్షిణ ఇటలీలో చిత్రీకరించిన సీన్‌కి సంబంధించిన ఫొటో ఇది. దాంతో బాండ్, మడేలిన్లకు పాప ఉంటుందని, 25వ సిరీస్‌లో బాండ్ తండ్రిగా కనిపించబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి. సినిమాలో తండ్రీ కూతురి బంధం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లాంటి ఓ వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాండ్ కథతో ఈ 25వ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో బాండ్‌గా డేనియల్ క్రెగ్, ఆయన ప్రేయసిగా లియా డౌక్స్ నటించారు. ఐదేళ్ల పాపగా లిసా డోరా సోన్నె నటించింది. -
తెల్లజుట్టు బాండ్
మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 57 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ప్రస్తుతం బాండ్ 25వ సినిమా రూపొందుతోంది. ‘నో టైమ్ టు డై’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 8 విభిన్న లుక్స్‌లో బాండ్ కనిపిస్తారట. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ (సగం నెరిసిన జుట్టు)లోనూ కనిపిస్తారట. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
హాలీవుడ్ ఆహ్వానం
గూడఛారి అనగానే మనకు గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్ ఇవ్వమని రాధికాకు వచ్చిన ఆ కబురు సారాంశం. అంతే.. వాళ్లు అడిగినట్లుగా తన లుక్, నటనను రికార్డ్ చేసి పంపించారు. ఈ సినిమాతో పాటు రాధికా ఆప్టేకు ‘స్టార్ వార్స్’ ఆఫర్ కూడా రావడం విశేషం. ‘‘ఈ పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని ఓ గీత గీయకుండా నాలాంటి ఆర్టిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని, అవకావం ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా శుభవార్తే’’ అని ఈ సందర్భంగా రాధికా ఆప్టే అన్నారు. మరి.. రాధికా ఇచ్చిన ఆడిషన్ నచ్చితే బాండ్ సినిమాలోనూ, స్టార్ వార్స్ మూవీలోనూ మన దేశీ భామ కనిపిస్తారు. అయితే రాధికాని హాలీవుడ్ సంస్థ తిరస్కరించే అవకాశమే లేదు. ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్స్‌ని హోమ్లీగా, గ్లామర్ క్యారెక్టర్స్‌లో హాట్‌గా... ఇలా పాత్రకు తగ్గట్టు మారిపోతుంటారు రాధికా. అందుకు ఉదాహరణ ‘లెజెండ్, కబాలీ’ తదితర చిత్రాలు. వీటిలో రాధికా హోమ్లీగా కనిపించారు. ఇక హిందీ చిత్రాలు ‘బద్లాపూర్’, ‘పర్చెడ్’ వంటివాటిలో హాట్‌గా కనిపించి, ‘రాధికాయేనా ఇలా?’ అనుకునేలా చేశారు. -
ఒకటికి మూడు
‘జేమ్స్‌బాండ్’ సిరీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఎప్పటికీ తగ్గకపోవడం వల్లే జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు 24 చిత్రాలు వచ్చాయి. తాజాగా బాండ్ సిరీస్‌లో వస్తోన్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత రమీ మాలిక్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఒకటికి మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించాలనుకుంటున్నారట క్యారీ జోజీ. అలా చిత్రీకరణ జరిపేలా యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారట. ఏ క్లైమాక్స్‌ను ఫైనల్‌గా ఫిక్స్ చేస్తారో హీరోకి కూడా చివరివరకు చెప్పరట. సాధారణంగా ఇలా మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట క్యారీ. మరి. .‘నో టైమ్ టు డై’ సినిమాలో ఫైనల్‌గా ఏ క్లైమాక్స్ ఉండబోతుందో తెలిసేది వెండితెరపైనే అన్నమాట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ట్రాక్‌లోనే ఉన్నాం
జేమ్స్‌బాండ్ చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బాండ్ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్స్‌కు క్యూ కడతారు. అందుకే బాండ్ 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్. క్యారీ జోజి ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో ప్రారంభమైంది. ఓ యాక్షన్ సీన్లో భాగంగా డేనియల్ క్రెగ్ గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని టీమ్ ధృవీకరించింది. ‘‘క్రేగ్ గాయపడ్డ మాట నిజమే. ఆయన చీలమండల గాయంతో బాధపడుతున్నారు. సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత రెండు వారాలు ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్లో జాయిన్ అవుతారు. రిలీజ్ విషయంలో ఏ మార్పు లేదు. ట్రాక్‌లోనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బాండ్ 0025
‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్’ అంటూ 57 ఏళ్లుగా, 24 సినిమాలతో అలరిస్తోంది ‘జేమ్స్ బాండ్’ సిరీస్. లేటేస్ట్‌గా సిల్వర్ జూబ్లీ సినిమాకు రెడీ అయింది బాండ్ సిరీస్. గత నాలుగు సినిమాల్లో బాండ్‌గా యాక్ట్ చేసిన డానియల్ క్రెగ్ ఇందులోనూ హీరోగా యాక్ట్ చేయనున్నారు. జమైకా విల్లాలో బాండ్ సృష్టికర్త ఐయాన్ ఫ్లెమింగ్ 25వ సినిమాలోని నటీనటులను అనౌన్స్ చేశారు. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆస్కార్ అవార్డ్ విజేత రామీ మలేక్ విలన్‌గా నటించనున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ బాండ్ గాళ్స్గా కనిపిస్తారు. సినిమా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు. -
దర్శకుడు కావలెను
హీరో ఫిక్స్ అయ్యాడు. స్క్రిప్ట్ పనులన్నీ కంప్లీట్. షూటింగ్ షెడ్యూల్ వేసేశారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఇంకో రెండు నెలల్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లాలి. సడన్‌గా ‘ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటున్నాను’ అనేశారు దర్శకుడు. బాండ్ సినిమాలో ట్విస్ట్ లాంటిదే ఆఫ్ స్క్రీన్ ఇచ్చారు దర్శకుడు డ్యానీ బోయేల్. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ సినిమా నుంచి తప్పుకున్నారాయన. ఆల్రెడీ నాలుగుసార్లు బాండ్‌గా కనిపించిన డేనియల్ క్రేగ్ ఐదోసారి బాండ్‌గా కనిపించనున్నారు. ‘‘జేమ్స్ బాండ్ 25వ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుంచి డానీ బోయేల్ తప్పుకుంటున్నారు. క్రియేటీవ్ డిఫరెన్స్‌లే అందుకు కారణం’’ అని నిర్మాతలు మైఖెల్ జీ విల్సన్, బార్బరా బ్రూకలీ, హీరో డేనియల్ క్రేగ్ ‘జేమ్స్ బాండ్007’ అఫీషియల్ ట్వీటర్ అకౌంట్ నుంచి అధికారికంగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 25 (యూకే) నవంబర్ 8, 2019 (యుఎస్) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందానికి కొత్త దర్శకుడు ఎవరు వస్తారు? అనే విషయం పై క్లారిటీ లేదు. -
కళ్లు చెదిరే పారితోషకం.. టెంప్ట్ అయ్యాడు
హాలీవుడ్లో జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 56 ఏళ్ల బ్రాండ్.. ఏడుగురు హీరోలు మారారు. అయినా ప్రేక్షకుల ఆదరణ, కలెక్షన్ల హవా ఏ మాత్రం తగ్గట్లేదు. అయితే ప్రస్తుతం బాండ్ హీరో అయిన డేనియల్ క్రెయిగ్.. ఇకపై ఈ సీరిస్‌లో నటించకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. దీంతో కళ్లు చెదిరే రీతిలో నిర్మాతలు అతనికి పారితోషకం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ది మిర్రర్ కథనం ప్రకారం... కొత్త బాండ్ చిత్రానికి డానీ బోయెల్ దర్శకత్వ బాధత్యలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో తన చిత్రంలో డేనియల్ క్రెయిగ్‌నే హీరోగా పెట్టాలని డానీ నిర్ణయించుకున్నాడంట. ఎలాగోలా క్రెయిగ్‌ను ఒప్పించిన దర్శకుడు.. ఈ డిసెంబర్ చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. కేవలం భారీ పారితోషకంతోనే టెంప్ట్ అయిన క్రెయిగ్ ఈ చిత్రం కోసం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు(భారత కరెన్సీ ప్రకారం రూ. 450 కోట్లు) రెమ్యునరేషన్ ఈ చిత్రం కోసం అతను తీసుకోబోతున్నాడు. క్రెయిగ్ క్రేజ్ కారణంగానే గత రెండు బాండ్ చిత్రాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాయి. అందుకే అతగాడికి ఇంత పెద్ద మొత్తం ముట్టజెప్పేందుకు మేకర్లు ముందుకొచ్చారంట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో డేనియల్ మాట్లాడుతూ...‘బాండ్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను ఇంకో చిత్రం చేయాల్సి వస్తే మాత్రం. అది కేవలం డబ్బు కోసమే’ అని స్పష్టం చేశాడు కూడా. బాండ్ ఫ్రాంచైజీలో ఇది 25వ చిత్రం కాగా, డేనియల్‌కు 5వ చిత్రం. వచ్చే ఏడాది నవంబర్‌లో సినిమా విడుదల కానుంది. -
జేమ్స్‌బాండ్ పక్కన మనోళ్ళు?
ఇవాళ హాలీవుడ్‌లోనూ మన దేశం జెండా ఎగరేస్తున్న అందాల తారలంటే - ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే. వీరిద్దరూ ఇప్పుడు తమ తమ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో అమెరికాలో బిజీగా ఉన్నారు. ఒకపక్క దీపిక ‘ఎక్స్ ఎక్స్ ఎక్స్ - ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో ఛాన్స్‌తో అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు. మరోపక్క ప్రియాంకా చోప్రా ‘బే వాచ్’లో విలన్ తరహా పాత్ర దక్కించుకొని, సంచలనం రేపారు. ఇలా భారతీయ సినిమా ఖ్యాతిని హాలీవుడ్ దాకా తీసుకెళ్ళిన ఈ దేశీ భామలు ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో గర్వకారణం కానున్నారా? జేమ్స్‌బాండ్ సిరీస్‌లో తీసే కొత్త చిత్రంలో జేమ్స్‌బాండ్ ప్రియురాలి పాత్రకు వీరిద్దరిలో ఒకరిని తీసుకోవాలనే ఆలోచన సాగుతోందట! జేమ్స్‌బాండ్ సిరీస్‌లోని తాజా చిత్రం ‘స్పెక్టర్’ గత ఏడాదే జనం ముందుకొచ్చి, విజయం సాధించింది. గడచిన కొన్ని సినిమాలుగా జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తూ వచ్చారు. అయితే, వచ్చే కొత్త బాండ్ సినిమాలో ఆయన స్థానంలో ఎవరు బాగుంటారా అని దర్శక, నిర్మాతలు వెతుకుతున్నారు. పనిలోపనిగా కొత్త జేమ్స్‌బాండ్‌కి కొత్త ప్రేయసిని కూడా అన్వేషిస్తున్నారట. ఆ పాత్ర కోసం మన దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాలు కూడా బరిలో ఉన్నారు. ‘‘దీపిక ‘ఎక్స్ఎక్స్ఎక్స్...’ షూటింగ్ ఆఖరి దశలో పాల్గొంటున్నారు. ఇక, ప్రియాంకా చోప్రా అయితే గత ఏణ్ణర్ధంగా ‘క్వాంటికో’ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ‘బే వాచ్’లో కూడా నటించడం మొదలుపెట్టారు. ఈ ఇద్దరి తారలకూ డేట్లు, వర్క్ షెడ్యూల్స్‌ను నేర్పుగా నిర్వహించేందుకు బలమైన బృందాలు ఉన్నాయి. ఆ బృందాలు వీళ్ళను తీసుకొని, వివిధ హాలీవుడ్ స్టూడియోల చుట్టూ తిప్పుతున్నారు. చిన్నాచితకా పాత్రలు, వట్టి అందాల ఆరబోత పాత్రలు చేయడం తమకు ఇష్టం లేదని ఈ ఇద్దరు తారలూ తమ ఏజెంట్స్‌కు చెప్పేశారు. కాబట్టి, ఈ కొత్త బాండ్ గర్ల్ పాత్రకు వీరిద్దరూ మంచి పోటీదారులే’’ అని ఆంతరంగిక వర్గాల కథనం. మొన్నటి ‘స్పెక్టర్’ సినిమాలో ముగ్గురు బాండ్ గర్ల్స్ కనువిందు చేశారు. మరి, రానున్న బాండ్ ఫిల్మ్‌లో ఆ అదృష్టం మన దీపిక, ప్రియాంకల్లో ఎవరికైనా దక్కుతుందేమో చూడాలి.