హాలీవుడ్‌ ఆహ్వానం | Radhika Apte Approached for New James Bond and Star wars | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ ఆహ్వానం

Published Fri, Nov 8 2019 6:22 AM | Last Updated on Fri, Nov 8 2019 6:22 AM

Radhika Apte Approached for New James Bond and Star wars - Sakshi

రాధికా ఆప్టే

గూడఛారి అనగానే మనకు గుర్తొచ్చేది జేమ్స్‌ బాండ్‌. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్‌ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్‌ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్‌. ఇప్పుడు బాండ్‌ గురించి ఎందుకంటే.. జేమ్స్‌ బాండ్‌ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్‌ ఇవ్వమని రాధికాకు వచ్చిన ఆ కబురు సారాంశం. అంతే.. వాళ్లు అడిగినట్లుగా తన లుక్, నటనను రికార్డ్‌ చేసి పంపించారు. ఈ సినిమాతో పాటు రాధికా ఆప్టేకు ‘స్టార్‌ వార్స్‌’ ఆఫర్‌ కూడా రావడం విశేషం.

‘‘ఈ పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని ఓ గీత గీయకుండా నాలాంటి ఆర్టిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని, అవకావం ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా శుభవార్తే’’ అని ఈ సందర్భంగా రాధికా ఆప్టే అన్నారు. మరి.. రాధికా ఇచ్చిన ఆడిషన్‌ నచ్చితే బాండ్‌ సినిమాలోనూ, స్టార్‌ వార్స్‌ మూవీలోనూ మన దేశీ భామ కనిపిస్తారు. అయితే రాధికాని హాలీవుడ్‌ సంస్థ తిరస్కరించే అవకాశమే లేదు. ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్స్‌ని హోమ్లీగా, గ్లామర్‌ క్యారెక్టర్స్‌లో హాట్‌గా... ఇలా పాత్రకు తగ్గట్టు మారిపోతుంటారు రాధికా. అందుకు ఉదాహరణ ‘లెజెండ్, కబాలీ’ తదితర చిత్రాలు. వీటిలో రాధికా హోమ్లీగా కనిపించారు. ఇక హిందీ చిత్రాలు ‘బద్లాపూర్‌’, ‘పర్చెడ్‌’ వంటివాటిలో హాట్‌గా కనిపించి, ‘రాధికాయేనా ఇలా?’ అనుకునేలా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement