Hollywood Entry
-
హాలీవుడ్‌కి హాయ్ చెప్తున్న మన హీరోయిన్స్
హాలీవుడ్లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్‌కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► శ్రుతీహాసన్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్‌కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్‌కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదర్శితం కానుంది. బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్‌లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌కు లీడ్ పెయిర్‌గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు. ► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత. ► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. -
హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోన్న సమంత!
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే లక్ష్యం తీరాలు చేరుకోవచ్చనే నానుడి నటి సమంతకు సరిగ్గా సెట్ అవుతుంది. హీరోయిన్గా ఈ చైన్నె భామ పయనం పూలబాటేమీ కాదు. ఆదిలో ఆశలు, అడియాశల సంగమంగానే సమంత సినీ జీవితం సాగింది. అలా తమిళ చిత్రాలతో సాదాసీదాగా సాగిన సమంత నట జీవితాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మార్చేసింది. తెలుగులో తొలి చిత్రం ఏమాయ చేశావే అనూహ్య విజయాన్ని సాధించి సమంతను క్రేజీ హీరోయిన్ను చేసేసింది. ఆ తరువాత బృందావనం, దూకుడు వంటి చిత్రాలు స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. అలా అక్కడ తొలి చిత్రం హీరో నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వంటి జీవితంలో ఆనందకరమైన ముఖ్య ఘట్టాలు చకచకా జరిగాయి. అంతా సంతోషం అయితే జీవితం ఎలా అవుతుంది. నాగచైతన్యతో మనస్పర్థలు, విడిపోవడం వంటి పెద్ద కుదుపునకు సమంత గురైంది. ఆ చేదు అనుభవాలను మరచిపోకముందే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి సమంతని తాకింది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అనుకుందో ఏమో సమంత ఆ వ్యాధితోనూ గట్టిగానే పోరాటం చేసింది. ప్రస్తుతం ఈ పోరాటంలో విజయవంతం అయ్యారనే చెప్పాలి. తాజాగా సమంత ఇప్పుడు నేను రెడీ మళ్లీ వస్తున్నా అంటూ ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ చేశారు. ఎంతక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఒక పక్క వైద్యం కోసం దేశాల బాట పడుతూనే.. మరో పక్క యోగాలు, వ్యాపారాలు అంటూ ఆధ్యాత్మిక పయనం చేస్తూ.. ఇంకో పక్క శారీరక వ్యాయామాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తను చేసే ప్రతి కార్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేస్తూ అభిమానులు తనను మర్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తను వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలను, అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. కాగా ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. అదే విధంగా సమంత తమిళం, ఆంగ్ల భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంతో ఈమె హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తొలి పరిచయం!
సమంత... ఇక్కడ స్టార్ హీరోయిన్.. ఆలియా భట్... ఇక్కడ స్టార్.. శోభితా ధూళిపాళ్ల... ఇక్కడ ఫామ్‌లోకి వస్తున్నారు.. అయితే ఈ ముగ్గురూ అక్కడ ‘తొలి పరిచయం’. ‘అక్కడ’ అంటే.. హాలీవుడ్లో! ఈ ముగ్గురూ హాలీవుడ్‌కి తొలిసారిగా పరిచయం కానున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం.. హీరోయిన్గా సౌత్‌లో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు యాభై సినిమాలు చేసిన సమంత కెరీర్లో సక్సెస్ రేట్ బాగానే ఉంది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సౌత్ సంగతి ఇలా ఉంటే.. అటు నార్త్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లోని రాజీ పాత్రలో అద్భుతంగా నటించి బీ టౌన్ ప్రేక్షకుల మనసులను కూడా గెల్చుకున్నారామె. ఇప్పుడు సమంతకు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇక హాలీవుడ్‌లోనూ నటిగా తన సత్తా చాటాలనుకుంటున్నారీ బ్యూటీ. ఇంగ్లిష్ ఫిల్మ్ ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో సమంత లీడ్ రోల్ చేయనున్నారు. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమాను హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా భట్‌ది సెపరేట్ క్రేజ్ అనే చెప్పాలి. ఇటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే అటు ‘రాజీ’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటిగా తన ప్రతిభను మరింత నిరూపించుకున్నారు ఆలియా. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తో దక్షిణాది ప్రేక్షకులనూ పలకరించారామె. ఇప్పుడు హిందీలో తన సీనియర్స్ ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ల మాదిరి హాలీవుడ్‌కి వెళుతున్నారు ఆలియా. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంగ్లిష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి ఆలియా నటిస్తున్నారు. స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకుడు. వచ్చే ఏడాది ఈ వెబ్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఫామ్‌లోకి వస్తున్న తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల హాలీవుడ్‌కి హాయ్ చెప్పారు. స్వీయ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ నటుడు దేవ్ పటేల్ నటించిన ‘మంకీ మేన్’ చిత్రంలో శోభిత ఓ లీడ్ రోల్ చేశారు. శోభితాకు ఇది తొలి హాలీవుడ్ ఫిల్మ్ అయితే దర్శకుడిగా దేవ్ పటేల్‌కు తొలి చిత్రం. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుంది. తెలుగులో ‘గూఢచారి’, మలయాళంలో ‘కురూప్’, హిందీ ‘ఘోస్ట్ స్టోరీస్’తో శోభిత నటిగా నిరూపించుకున్నారు. ఆమె నటించిన ‘మేజర్’ జూన్ 3న రిలీజ్ కానుంది. ఆ భాష.. ఈ భాష అని కాదు.. ఉన్నది ఒక్కటే భాష... అదే ‘సినిమా భాష’ అని పరిశ్రమవారు అంటుంటారు. అనడమే కాదు.. హద్దులు చెరిపేస్తున్నారు. భారతీయ చిత్రాలకే పరిమితం కాకుండా విదేశీ చిత్రాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో హాలీవుడ్లో నటించనున్న భారత నటీనటుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. -
దీపికా, ప్రియాంక చోప్రా బాటలో అలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వరుసగా హాలీవుడ్‌పై కన్నేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెలు హాలీవుడ్లో తమ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఏకంగా ప్రియాంక వరుసగా హాలీవుడ్ ఆఫర్లను అందుకుంటూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. తాజాగా వారి బాటలో అలియా భట్ కూడా నడుస్తోంది. బాలీవుడ్లో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న అలియా ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆమె హాలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎమ్ అనే హాలీవుడ్ టాలెంటెడ్ ఎజెన్సీతో ఆమె ఓ కంట్రాక్ట్ కుదుర్చుకుందటని, ఈ సంస్థతో ఓ మూవీకి సంతకం కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం అలియా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 2గంగూబాయ్ కతియావాడి’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ చిత్రంతో కూడా నటిస్తుంది. మరోపక్క డ్రీమ్స్ అనే మూవీలో నటిస్తునే ఈ మూవీకి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. -
హాలీవుడ్‌కి హాయ్
సౌత్ నుంచి నార్త్ వరకూ తన ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు అలీ. ఇప్పుడీ స్టార్ కమెడియన్ ప్రయాణం హాలీవుడ్‌లోనూ మొదలుకానుంది. జగదీష్ దానేటి దర్శకత్వంలో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఈ ఇండో–హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారాల శాఖమంత్రి ప్రకాష్ జవడేకర్‌ను న్యూఢిల్లీలో కలిశారు అలీ, దర్శకుడు జగదీష్ దానేటి. అలీ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ సినిమా చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అలీగారిని హాలీవుడ్‌కి పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను’’ అన్నారు జగదీష్ దానేటి. -
హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అలీ
బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు. తాజాగా ఈ స్టార్ కమేడీయన్.. హాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు జగదీష్ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రబృందం మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్ హాలీవుడ్ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చెప్పింది. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుమతుల విషయమై నటుడు అలీ, దర్శకుడు జగదీష్.. సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హాలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్ జవదేకర్గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. జగదీష్ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు. -
హాలీవుడ్ ఆహ్వానం
గూడఛారి అనగానే మనకు గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్ ఇవ్వమని రాధికాకు వచ్చిన ఆ కబురు సారాంశం. అంతే.. వాళ్లు అడిగినట్లుగా తన లుక్, నటనను రికార్డ్ చేసి పంపించారు. ఈ సినిమాతో పాటు రాధికా ఆప్టేకు ‘స్టార్ వార్స్’ ఆఫర్ కూడా రావడం విశేషం. ‘‘ఈ పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని ఓ గీత గీయకుండా నాలాంటి ఆర్టిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని, అవకావం ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా శుభవార్తే’’ అని ఈ సందర్భంగా రాధికా ఆప్టే అన్నారు. మరి.. రాధికా ఇచ్చిన ఆడిషన్ నచ్చితే బాండ్ సినిమాలోనూ, స్టార్ వార్స్ మూవీలోనూ మన దేశీ భామ కనిపిస్తారు. అయితే రాధికాని హాలీవుడ్ సంస్థ తిరస్కరించే అవకాశమే లేదు. ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్స్‌ని హోమ్లీగా, గ్లామర్ క్యారెక్టర్స్‌లో హాట్‌గా... ఇలా పాత్రకు తగ్గట్టు మారిపోతుంటారు రాధికా. అందుకు ఉదాహరణ ‘లెజెండ్, కబాలీ’ తదితర చిత్రాలు. వీటిలో రాధికా హోమ్లీగా కనిపించారు. ఇక హిందీ చిత్రాలు ‘బద్లాపూర్’, ‘పర్చెడ్’ వంటివాటిలో హాట్‌గా కనిపించి, ‘రాధికాయేనా ఇలా?’ అనుకునేలా చేశారు. -
హాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ యాక్షన్ హీరోల లిస్ట్‌లో టైగర్ ష్రాఫ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఏ ‘ప్లైయింగ్ జాట్, భాగీ సిరీస్’ చిత్రాల్లో టైగర్ యాక్షన్ టాలెంట్ ఏంటో చూశాం. ఇప్పుడీ యాక్షన్ హీరో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. ఇటీవల టైగర్ ష్రాఫ్‌ను హాలీవుడ్ నిర్మాత లారెన్స్ కసోనోఫ్ మీట్ అవ్వడమే ఇందుకు కారణం. టైగర్ ఫిజిక్కు లారెన్స్ ఇంప్రెస్ అయ్యారట. తాను తీయాలనుకుంటున్న యాక్షన్ మూవీకి టైగర్ నప్పుతాడని భావించారట. గతంలో ‘బ్లడ్ డిన్నర్, ఫార్ ఫ్రమ్ హోమ్, ట్రూ లైస్’ వంటి భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు లారెన్స్. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ఫిల్మ్ ‘రాంబో’ హిందీ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. -
నిద్రపోనివ్వం!
భయానికి అర్థం చెబుతా అంటున్నారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. కానీ హిందీ చిత్రంలో కాదు. ఇంగ్లీష్ మూవీలో. అంటే ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అని చెప్తున్నాం. జేమ్స్ సింప్సన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కేథరిన్ బార్రెల్, బ్లిత్ హుబ్బార్డ్, మెర్సిడీస్ పాపాలియా ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ లాంటి సినిమాతో హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మూవీ రిలీజ్ కోసం ఎగై్జటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు జాక్వెలిన్. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మిమ్మల్ని నిద్రపోనివ్వదు. జాక్వెలిన్ యాక్టింగ్ అమేజింగ్’’ అన్నారు దర్శకుడు జేమ్స్. నలుగురు అమ్మాయిలు టూర్ కోసం ఓ ఫారెస్ట్ వెళ్లిన తర్వాత జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుందట. -
టాలీవుడ్ టు హాలీవుడ్
‘భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ’లో హీరోగా నటించిన శ్రీ రాజ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘రష్ అవర్’ మూడు భాగాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బ్రెట్ రాట్నర్ ఈ చిత్రానికి దర్శకుడు. హాలీవుడ్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సందర్భంగా శ్రీరాజ్ మాట్లాడుతూ– ‘‘నటనంటే నాకు ప్రాణం. అందుకే అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ ఆకాడమీలో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్సు చేశాను. ‘రష్ అవర్’ వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలను రూపొందించిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. న్యూయార్క్ నేపథ్యంలో రెండు జంటల మధ్య సాగే మ్యూజికల్ లవ్స్టోరియే ఈ చిత్రం. ఇందులో నాది టాక్సీ డ్రైవర్ పాత్ర. తెలుగులో రెండు పెద్ద బేనర్లు నిర్మిం చనున్న రెండు సినిమాల్లో హీరోగా చేయబోతున్నా’’ అన్నారు.