హాలీవుడ్‌కి హాయ్‌ | Tollywood Actor Ali To Enter Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కి హాయ్‌

Published Wed, Jan 29 2020 12:03 AM | Last Updated on Wed, Jan 29 2020 12:03 AM

Tollywood Actor Ali To Enter Hollywood - Sakshi

సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ తన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు అలీ. ఇప్పుడీ స్టార్‌ కమెడియన్‌ ప్రయాణం హాలీవుడ్‌లోనూ మొదలుకానుంది. జగదీష్‌ దానేటి దర్శకత్వంలో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఈ ఇండో–హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారాల శాఖమంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ను న్యూఢిల్లీలో కలిశారు అలీ, దర్శకుడు జగదీష్‌ దానేటి. అలీ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌ సినిమా చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అలీగారిని హాలీవుడ్‌కి పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను’’ అన్నారు జగదీష్‌ దానేటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement