![Ali to play a prominent role in Welcome to Agra](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/4/Ali-well-como-to-agra.jpg.webp?itok=XWx9HFCP)
అలీ ప్రధాన పాత్రలో ‘వెల్‌కమ్ టు ఆగ్రా’ అనే హిందీ సినిమా రూపొందుతోంది. ఆశిష్ కుమార్ దూబే రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్ ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ‘వెల్‌కమ్ టు ఆగ్రా’ సినిమాప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాన్ని ముంబైలో చిత్రీకరించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– ‘‘ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు. గతంలో సల్మాన్ ఖాన్ వంటి పలువురు హీరోల కాంబినేషన్‌లో హిందీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ‘వెల్‌కమ్ టు ఆగ్రా’లో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేయనుండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ మూవీలో అన్షుమాన్ ఝా, సారా అంజలి, ఆకాశ్ ధబాడే, రౌనక్ ఖాన్, ఫైజల్ మాలిక్, అంచల్ గాంధీ, కైరా చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment