కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి హీరో.. ఫస్ట్ లుక్ లాంచ్ | New Hero From Comedian Ali Family First Look Launch | Sakshi
Sakshi News home page

కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి హీరో.. ఫస్ట్ లుక్ లాంచ్

Published Sat, Jun 15 2024 9:42 PM | Last Updated on Sun, Jun 16 2024 3:01 PM

New Hero From Comedian Ali Family First Look Launch

డిఫరెంట్ సినిమాలు తీస్తూ కొత్త దర్శకులు ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఓ సినిమానే 'ప్రణయ గోదారి'. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)

పోస్టర్ చూస్తుంటే గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్‪‌పై ప్రయాణం చేయడం చూస్తుంటే వింటేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తోంది. మార్కండేయ సంగీతమందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement