హాలీవుడ్‌లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్‌కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం.
► శ్రుతీహాసన్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్‌గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్‌ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్‌లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్‌డమ్’ వంటి సిరీస్‌లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్‌కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్‌కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పదర్శితం కానుంది.
బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్‌లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌కు లీడ్ పెయిర్‌గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు.
► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత.
► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు.
ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment