shobitha dhulipala
-
మల్లన్న సన్నిధిలో కొత్త జంట
-
సమంతను దాటేసిన శోభిత ధూళిపాళ్ల.. టాప్ ర్యాంక్‌లో ఎవరంటే?
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్‌ను అధిగమించింది.ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.కాగా.. ఏడాది నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024ట్రిప్తి డిమ్రీదీపికా పదుకొణెఇషాన్ ఖట్టర్షారుఖ్ ఖాన్శోభితా ధూళిపాళ్లశార్వరిఐశ్వర్యరాయ్ బచ్చన్సమంతఅలియా భట్ప్రభాస్ -
ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్
తారలు ప్రేమలో పడితే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. జంటగా విహారయాత్రలకు వెళ్లినా, విందుకు వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో లీకైపోతుంటుంది. మరికొద్ది గంటల్లో భార్యాభర్తలు కాబోతున్న శోభిత ధూళిపాళ- నాగచైతన్య కూడా డేటింగ్ చేసుకునేటప్పుడు ఎంచక్కా ట్రిప్పులకు వెళ్లారు. డిన్నర్ డేట్స్‌కు వెళ్లారు. చై-శోభిత డేటింగ్ పిక్స్ కానీ ఎక్కడా తమ ఫోటోలు రిలీజ్ కాకుండా వీలైనంతవరకు జాగ్రత్తపడ్డారు. మీడియా గుచ్చిగుచ్చి అడిగినా మౌనం వహించారే తప్ప తమ ప్రేమ కహానీని బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు నాగచైతన్య-శోభితల డేటింగ్ పిక్స్ బయటకు వచ్చాయి. అదెలాగంటే.. హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ద రానా దగ్గుబాటి షోకి చై అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యాడు.లైఫ్ అలా ఉందన్న చైలైఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు చై.. శుభ్రంగా, బాగానే ఉందన్నాడు. పనిలోపనిగా ఈ ప్రేమజంట కలిసున్న కొన్ని ఫోటోలను ప్రోమోలో చూపించారు. అందులో ఒకదాంట్లో చై.. శోభిత బ్యాగు పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటోలో శోభిత.. ప్రియుడి భుజంపై చేయేసి దర్జాగా నిలుచుంది. ఇక ఈ వినోదాత్మక ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ శనివారం (డిసెంబర్ 7న) అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం -
నయనతార దారిలో నాగ చైతన్య..? రూ. 50 కోట్లకు?
-
ఎమ్మీ అవార్డ్స్‌లో 'ది నైట్ మేనేజర్'కు నిరాశ
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.భారత్ నుంచి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్‌తో పోటీ పడి అవార్డ్ కోల్పోయింది. ‘ది నైట్ మేనేజర్’ చిత్రంలో అనిల్ కపూర్ , ఆదిత్యరాయ్ కపూర్ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ నటించారు. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన ‘ది నైట్ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.ఉత్తమ డ్రామా సిరీస్- లెస్ గౌట్స్ డి డైయుఉత్తమ నటుడు- తిమోతి స్పాల్ఉత్తమ కామెడీ సిరీస్- డివిజన్ పలెర్మోఉత్తమ యానిమేషన్- టాబీ మెక్‌టాట్ ఉత్తమ కిడ్స్ లైవ్ యాక్షన్ సిరీస్- ఎన్ అఫ్ డ్రెంగెన్ఉత్తమ షార్ట్ ఫామ్ సిరీస్- పాయింట్ ఆఫ్ నో రిటర్న్ -
శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర
టాలీవుడ్లో మోస్ట్ ఎవైటింగ్ వెడ్డింగ్ అంటే హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్‌బర్డ్స్ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా ఆన్లైన్లో వైరల్‌గా మారింది. మరోవైపు శోభితా పెళ్లి చీర, షాపింగ్ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన ఈరోజుకోసం శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్ లేకుండానే తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో షాపింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్ గోల్డ్ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్‌ను సెలెక్ట్ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ క్రీమ్ షేడ్స్‌లో, ఆరెంజ్ కలర్ బార్డర్చీరతో కనిపించిన సంగతి తెలిసిందే. -
కౌంట్‌డౌన్ మొదలైంది..చైతూ- శోభిత పెళ్లి పనులపై సమంత పోస్ట్! (ఫొటోలు)
-
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆయన ఇన్‌స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్‌స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్‌ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. -
దివాళీ బాష్‌లో శోభిత ధూళిపాళ్ల.. కల్కి బ్యూటీ స్టన్నింగ్ లుక్స్!
న్యూ లుక్‌తో కల్కి భామ పోజులు..ఫుడ్ ఎంజాయ్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ..దివాళీ బాష్‌లో సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల..మ్యూజియంలో బాలీవుడ్ భామ కంగనా సందడి..ఫేవరేట్ శారీలో హీరోయిన్ సోనాలి బింద్రే..వైట్ డ్రెస్‌లో బుల్లితెర భామ మౌనీరాయ్.. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
డైరెక్ట్‌గా ఓటీటీకి శోభిత ధూళిపాళ్ల చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కినేని హీరో నాగచైతన్యతో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం 'లవ్, సితార'. ఈ సినిమాను వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు.చైతూతో ఎంగేజ్మెంట్టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్యతో శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్లో పంచుకున్నారు.A tale of love, heartbreak, and self-discovery! Watch #LoveSitara, premiering on 27th September, only on #ZEE5. #LoveSitaraOnZEE5 pic.twitter.com/zHGnSUmUmr— ZEE5 (@ZEE5India) September 10, 2024 -
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. పెళ్లికూతురిలా ప్రేమలు హీరోయిన్!
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్ పెళ్లికూతురిలా ముస్తాబైన ప్రేమలు హీరోయిన్ బ్లూ శారీలో కీర్తి సురేశ్ హోయలు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
అలాంటి సైగతో ఫొటో.. సమంత కోపం ఎవరి మీద..?
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రెగ్యూలర్‌గా తన అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. అందుకు వేదికగా సోషల్‌మీడియాను ఎంచుకున్న ఆమె తరచూ పలు పోస్టులు పెడుతూ ఉంటారని తెలిసిందే. అలా ఎప్పుడు నెట్టింట ఆమె పేరు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా సమంత ఒక సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె కేవలం ఫోటో మాత్రమే షేర్ చేసినా ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది.ఫొటోలో స్వెట్ షర్ట్ ధరించి సమంత ఉన్నారు. కళ్లకు బ్లాక్ గ్లాసెస్‌తో చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే , షర్ట్‌పై రాసున్న కొటేషన్ నెజన్లను ఆకర్షిస్తుంది. ఆమె వేసుకున్న షర్ట్ పై రాసి ఉన్న అక్షరాలతోపాటు ఆమె తలకు అలా చేయి ఆనించి తన మిడిల్ ఫింగర్ చూపించిందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం' అని రాసి ఉన్నా కొటేషన్‌కు 'Now We Are Free' అనే సాంగ్‌ను కూడా ఆమె కలిపారు. తన తల వద్ద చేతిని ఉంచిన సమంత మిడిల్ ఫింగర్‌ను మాత్రమే ఇండికేట్ చేస్తూ ఫోజు ఇచ్చింది. ఇప్పుడు అందరి కళ్లూ ఆమె వేలివైపే వెళ్లాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్, ఫింగర్‌ను చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక్క ఫోటోతో అన్నింటికీ సమంత క్లారిటీ ఇచ్చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్వీన్స్ ఎప్పటికీ ఇలాగే సమాధానం చెప్తారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షేర్ చేసిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇండస్ట్రీల నిలబడాలంటే హీరోలకు హిట్స్ ఉండాలి. హీరోయిన్లకు అందం ఉండాలి. దీని కోసం మేకప్ దగ్గర నుంచి మేకోవర్ వరకు ఇలా చాలానే ఉంటాయి. కొన్ని విషయాల గురించి సదరు నటీనటులు పెద్దగా బయటపెట్టరు. కానీ ఒకప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఈ తేడా కనిపిస్తుంది.తాజాగా హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి పెళ్లి బంధంలోకి చైతూ అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడికి కాబోయే భార్య శోభిత గురించి ఫ్యాన్స్ బాగానే మాట్లాడుకుంటున్నారు. అలానే ఈమె పాత ఫొటోలని కూడా ట్రెండింగ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)పైన ఫొటో శోభితదే. కాకపోతే దాదాపు పదేళ్ల క్రితం ఫెమినా మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా ఎర్త్-2013 పోటీల్లో పాల్గొన్నప్పుడు శోభిత ఒకలా ఉంది. ఇప్పుడు చూస్తే మరోలా ఉంది. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడానో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఈమె ఒక్కరేనా అని తెలిసి అవాక్కవుతున్నారు.శోభిత కెరీర్ విషయానికొస్తే.. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో అడివి శేష్ హీరోగా చేసిన 'గూఢచారి', 'మేజర్' చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. పలు వెబ్ సిరీసుల్లోనూ లీడ్ రోల్స్ చేసిన ఈమె ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. పెళ్లి తర్వాత నటిగా కొనసాగుతుందా? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత) -
చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!
హీరో నాగచైతన్యతో హీరోయిన్ శోభిత నిశ్చితార్థం జరిగి ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది. కానీ ఇప్పటికే ఏదో విషయమై మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్లు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారనేది రివీల్ కాలేదు. కానీ తాజాగా శోభిత చెల్లి సమంత తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్‌తో క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం)హీరోయిన్ సమంతని 2017లోనే నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లకే వీళ్ల బంధం ముక్కలైంది. 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో చై-సామ్ అభిమానులు చాలా బాధపడ్డారు. దీని తర్వాత చైతూ-సమంత ఎవరికీ వాళ్లు సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయారు.కానీ గత కొన్నాళ్లుగా శోభిత-చైతూ రిలేషన్ గురించి రూమర్స్ వచ్చాయి. తాజాగా నిశ్చితార్థం చేసుకోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అయితే వీళ్ల మధ్య ప్రేమ 2022లోనే మొదలైందని శోభిత చెల్లి సమంత బయటపెట్టింది. చైతూ-శోభిత ఎంగేజ్మెంట్ ఫొటోలు పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయటపెట్టింది. 2022లోనే సమంత ధూళిపాళ్ల పోస్ట్ చేసిన ఓ ఫొటోకు చైతూ లైక్ కూడా కొట్టాడు. కాకపోతే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ సరిగ్గా గమనించి ఉంటే.. శోభితతో ప్రేమ వ్యవహారం బయటపడేదేమో?(ఇదీ చదవండి: ‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!) View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) -
పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ!
సమంత ఇప్పుడేం సినిమా చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం నాగచైతన్య ఎంగేజ్మెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఏదో సందర్భంలో వీళ్ల డివోర్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు చైతన్య, శోభితతో నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత పాత వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)'ఏ మాయ చేశావె' సినిమాతో చైతూ-సమంత ఒకరికొకరు పరిచయం. కొన్నాళ్లకు స్నేహం కాస్త ప్రేమగా మారింది. కుటుంబాల్ని ఒప్పించి 2017లో ఒక్కటయ్యారు. కానీ నాలుగేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. కారణం ఏంటనేది పక్కనబెడితే విడాకులు తర్వాత సమంత పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాను 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఏమన్నారో చెప్పుకొచ్చింది. ఇంతకీ సమంత అప్పుడు ఏమని చెప్పిందంటే?'విడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. ఇప్పుడెందుకు ఐటమ్ సాంగ్ చేస్తున్నావ్, వద్దు ఇంట్లో కూర్చో అని అన్నారు. చాలా విషయాల్లో ప్రోత్సాహించే నా స్నేహితులు కూడా ఐటమ్ సాంగ్ వద్దంటే వద్దని అన్నారు. ఇదంతా విన్న తర్వాత.. అసలు నేనెందుకు దాక్కోవాలి? నేనేం తప్పు చేయలేదుగా, పెళ్లి అనే బంధానికి పూర్తిగా న్యాయం చేశా. కానీ వర్కౌట్ కాలేదు. అంతమాత్రన నేను చేయని తప్పునకు గిల్టీగా ఫీలై, నన్ను నేనే బాధపెట్టుకోలేనుగా' అని సమంత చెబుతున్న పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)Samantha: “Why should I hide, I DID NOT DO ANY WRONG. I gave my marriage 100%” pic.twitter.com/JbKc945bHm— BigBoss Telugu Views (@BBTeluguViews) August 9, 2024 -
చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు. ఎంగేజ్మెంట్ జరగడం మాటేమో గానీ శోభిత ఎవరు? తొలిసారి వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.నాగచైతన్య విషయానికొస్తే.. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే హీరోయిన్ సమంతని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నాడు. కారణాలు తెలియవు కానీ వివాహ బంధంలో కలతలు రావడంతో 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన దాదాపు మూడేళ్లకు నటి శోభిత ధూళిపాళ్లతో చైతూ నిశ్చితార్థం జరిగింది.(ఇదీ చదవండి: Samantha: హార్ట్ బ్రేక్ అయింది.. సమంత పోస్ట్ వైరల్)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టిన శోభిత.. వైజాగ్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. తండ్రి మర్చంట్ నేవీ ఇంజినీర్ కావడంతో ముంబయిలో స్థిరపడింది. బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో అడివి శేష్ 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో మాత్రమే నటించింది. హీరోయిన్గా కంటే నటిగానే ఈమె గుర్తింపు తెచ్చుకుంది. 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటించింది. హాలీవుడ్‌లోనూ 'మంకీమ్యాన్' అనే సినిమాలో నటించింది.'మేజర్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే చైతూ-శోభితకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ గతేడాది ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అయితే అక్కడి చెఫ్ పోస్ట్ చేసిన ఫొటోల వల్ల వీళ్ల డేటింగ్ బయటపడింది. ఇన్నాళ్లకు బంధాన్ని నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!) -
శోభిత- నాగచైతన్య ఎంగేజ్మెంట్.. కాబోయే జంట వయస్సు తేడా ఎంతంటే?
టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్లో పంచుకున్నారు.అయితే ప్రస్తుతం వీరిద్దరి వయసు గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతనే విషయంపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే శోభిత ధూలిపాళ్ల 31 మే 1992లో జన్మించారు. ఏపీలోని తెనాలిలో ఆమె తల్లిదండ్రుల స్వస్థలం కాగా.. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. మరోవైపు హీరో నాగచైతన్య నవంబర్ 23, 1986లో హైదరాబాద్‌లో పుట్టారు. ప్రస్తుతం చైతూ వయస్సు 37 ఏళ్లు కాగా.. వీరిద్దరి మధ్య కేవలం 5 ఏళ్ల తేడా మాత్రేమే ఉంది. కాగా.. నాగచైతన్య 2009లో వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే శోభిత ధూళిపాళ్ల రామన్ రాఘవ్ 2.0 అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతేకాకుండా గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ మెరిసింది.రూమర్స్ నిజం చేశారు!కాగా.. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట రూమర్స్ తెగ వైరలయ్యాయి. గతేడాది లండన్‌లో ఓ రెస్టారెంట్లో కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరు విదేశాల్లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా ఇవాళ వాటిని నిజం చేస్తూ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది మే 31న శోభిత పుట్టినరోజును జరుపుకోవడానికి వీరిద్దరు యూరప్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే డేటింగ్‌పై శోభిత, నాగ చైతన్య ఎక్కడా కూడా స్పందించలేదు. -
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్లను ఆశీర్వదించండి: నాగార్జున
అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంలో అడుగుపెట్టబోతున్నట్లు అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం గురించి ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా నాగార్జున తన ఎక్స్ పేజీలో అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.నాగచైతన్య నిశ్చితార్థం గురించి నాగార్జున ఇలా పంచుకున్నారు. 'ఈ రోజు ఉదయం 9:42 గంటలకు మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళ్లతో జరిగింది. ఈ విషయాన్ని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను.' అని నాగ్ తెలిపారు.ఎవరీ శోభితా ధూళిపాళ్ల..?శోభితా ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన అమ్మాయి. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. ఆపై ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది.ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. శోభితా ధూళిపాళ్ల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా నటించింది. అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్ ,ది నైట్ మేనేజర్ 2, గూఢాచారి,మేజర్,కురుప్ వంటి చిత్రాల్లో మెప్పించింది. కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్కు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. సమంతతో బ్రేకప్2017లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య అనుకోని కారణాలతో 2021లో విడిపోయారు. అయితే, వారిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ వారు రివీల్ చేయలేదు. కానీ, వారు తమ కెరీర్‌పై దృష్టి పెట్ వివిధ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. "We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!We are overjoyed to welcome her into our family.Congratulations to the happy couple! Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024 -
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం.. నిజమెంత?
టాలీవుడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ కొన్ని గంటలుగా ఒక వార్త నెట్టింట ప్రచారం జరుగుతుంది. దీనిని బేస్ చేసుకుని కొన్న ప్రధాన వెబ్ సైట్లు కూడా వాటిని ప్రచురించడం ప్రారంభించాయి. అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరగనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అతికొద్ది మంది సమక్షంలో నేడు (ఆగష్టు 8) ఈ కార్యక్రమం జరగనుందని వైరల్ అవుతుంది. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని వారి కుటుంబంతో పాటు శోభితా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.2017లో నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య లవ్‌లో పడ్డారని చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకు సంబంధించిన మొదటి అడుగు నేడు పడుతుందని కొందరు చెబుతున్నారు.నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినా వాటిని వారిద్దరూ ఖండించలేదు. దీంతో అభిమానుల్లో కూడా నిజమే ఉంటుంది అనే భావన కలిగింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. నేడు ఈ కాకర్యక్రమం పూర్తి అయిన తర్వాత నాగార్జునే అధికారికంగా ఈ విషయాన్ని తెలుపుతారని సమాచారం. శోభితా ధూళిపాళ్ల పొన్నియిన్ సెల్వన్ ,ది నైట్ మేనేజర్ 2, గూఢాచారి,మేజర్,కురుప్ వంటి చిత్రాల్లో మెప్పించింది. కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్కు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈ బ్యూటీ ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. -
రెడ్ కార్పెట్‌పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
-
కిరాక్ పోజుల్లో టిల్లు గాని రాధిక.. శోభిత ఏకంగా అలా!
హీరోయిన్ సమంత టాప్ లెస్ పోజులు.. కేక అంతే హీట్ పెంచేస్తున్న టిల్లు గాని రాధిక అలియాస్ నేహాశెట్టి అందంతో మత్తెక్కించేలా హాట్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల కొంటె చూపులతో చంపేస్తున్న 'జాతిరత్నాలు' చిట్టి రెడ్ డ్రస్ లో మరింత అందంగా సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నవ్వుతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ ఓరగా చూస్తూ కవ్విస్తున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
హాలీవుడ్‌కి హాయ్ చెప్తున్న మన హీరోయిన్స్
హాలీవుడ్లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్‌కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► శ్రుతీహాసన్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్‌కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్‌కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదర్శితం కానుంది. బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్‌లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌కు లీడ్ పెయిర్‌గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు. ► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత. ► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. -
బ్లాక్ డ్రెస్‌లో ఆషిక రంగనాథ్.. కళ్లతో మాయ చేస్తోన్న ఆర్జీవీ బ్యూటీ!
►బ్లాక్ డ్రెస్‌లో ఆషిక రంగనాథ్ హోయలు ►వేకేషన్లో చిల్ అవుతోన్న అనసూయ ►స్టన్నింగ్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల హాట్ ట్రీట్ ►కళ్లతోనే మాయ చేస్తోన్న ఆర్జీవీ బ్యూటీ ►షూటింగ్ సెట్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ లుక్స్ View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aghosh D Prasad (@aghoshvyshnavam_avm) -
జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా శోభిత ధూళిపాళ
హైదరాబాద్: జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెల్స్ ప్రముఖ నటి శోభిత ధూళిపాళను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘మేడ్ టు సెలబ్రేట్ యు’ టీవీ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ‘‘మా బ్రాండ్ ప్రచారానికి శోభితను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. భీమా బ్రాండ్‌కు ఆమె మరింత గుర్తింపు తీసుకొస్తుంది’’ అని సంస్థ ఎండీ అభిõÙక్ బిందుమాధవ్ అన్నారు. అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన భీమా జ్యువెల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం కలిగిస్తుందని శోభిత అన్నారు. -
49 ఏళ్ల బ్యూటీ హాట్ లుక్.. దేవకన్యలా ఆ తెలుగు హీరోయిన్
వైట్ అండ్ వైట్‌లో రుహానీ అందాల విందు సోఫాపై పడుకుని హీరోయిన్ శ్రద్ధా దాస్ వయ్యారాలు ఈ వయసులోనూ రెచ్చిపోతున్న మలైకా అరోరా చాలారోజుల తర్వాత ఐశ్వర్యా రాజేశ్ గ్లామర్ వీడియో సెల్ఫీ పోజుల్లో హెబ్బా పటేల్ సోయగాలు చీరకట్టులోనూ అందాల్ని చూపిస్తున్న శోభిత బ్లాక్ స్కిన్ ఫిట్ డ్రస్‌లో నభా నటేశ్ పింక్ ఫ్రాక్‌లో మెగా డాటర్ నిహారిక View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) -
డ్యాన్స్‌తో దుమ్మురేపిన శ్రీలీల, నెమలిలా మారిన శోభిత
► శాంతి కోరుకుంటున్న అనసూయ ► నెమలిలా మారిపోయిన శోభిత ధూళిపాళ ► ఇండియన్ బార్బీ ఎలా ఉంటుందో చూపించిన వితికా ► భోళా శంకర్ ప్రమోషన్స్‌లో మెరిసిన యాంకర్ శ్రీముఖి ► స్లో మోషన్ పాటకు శాన్వీ డ్యాన్స్.. నెక్స్ట్ మీరే చేయాలంటూ శ్రీలీల, సంయుక్త హెగ్డేలకు ఛాలెంజ్ విసిరిన హీరోయిన్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) -
శోభిత ధూళిపాల హోయలు.. కలర్‌ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత!
►బ్లూ డ్రెస్‌లో స్మైలీగా యామీ గౌతమ్! ►కలర్‌ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత! ►బాలీవుడ్ భామ సన్నీలియోన్ హాట్ పోజులు! ►స్టెలిష్ డ్రెస్‌లో శోభిత ధూళిపాల హోయలు! ►బాలీవుడ్ భామ దిశా పటానీ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
తెలుగమ్మాయి శోభిత ధూళిపాల తారాఖన్నాగా నటించిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. ఈ సిరీస్‌లో శోభిత నటించిన తారా అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 2019 మార్చి 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైందీ సిరీస్. నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, ప్రశాంత్ నాయర్, అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అద్భుతమైన ట్విస్ట్‌తో మేకర్స్ ఈ సిరీస్‌ను ముగించారు. రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్-2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్ 2' ఓటీటీ డేట్ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?) అయితే సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. అయితే సీజన్-2కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరైన నటి స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది ఆమె. ఇంతకీ ఎవరామె? ఎందుకంత స్పెషల్ అనేది ఓసారి తెలుసుకుందాం. కాగా.. తొలి సీజన్లో ఉన్న శోభిత, అర్జున్, కల్కి కొచ్లిన్, జిమ్ సారబ్, శశాంక్ అరోరా, శివంగి రాస్తోగి సహా తదితరులు సీక్వెల్లోనూ నటించారు. అయితే ఇష్వాక్ సింగ్, త్రినేత్ర వంటి కొత్తముఖాలు కూడా సీక్వెల్లో కనిపిస్తాయి. ఇందులో కొత్తగా త్రినేత్ర ఈ సీజన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. అసలు త్రినేత్ర ఎవరు? త్రినేత్ర మరెవరో కాదు.. తొలిసారి నటనా రంగ ప్రవేశం చేయబోతున్న కర్ణాటక తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్. ఆమె అసలు పేరు త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు. ఈ వెబ్ సిరీస్‌లో మేడ్ ఇన్ హెవెన్' కంపెనీలో వెడ్డింగ్ ప్లానర్ల బృందంతో కలిసి పనిచేసే మహిళగా ట్రాన్స్-ఉమెన్‌గా కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన ఆమె తన పాత్ర పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ పాత్రను మొదట విన్నప్పుడు చేయలేకపోతానని భయమేసిందని తెలిపారు. మేడ్ ఇన్ హెవెన్- 2 ప్రారంభం మాత్రమేనని వెల్లడించింది. తాను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఈ పాత్ర కోసం ఆడిషన్ జరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను నటనపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలిపింది. త్రినేత్ర మాట్లాడుతూ..'అప్పట్లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నందున ఇది నాకు కొంచెం భయంగా అనిపించింది. కానీ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు సాధించగలనని అనుకున్నా. ఎందుకంటే ఇది ట్రాన్స్-ఉమెన్‌గా నాకు చాలా దగ్గరి పాత్రలా ఉంది. ఈ సిరీస్‌లో చిత్రబృందం తనకు మద్దతుగా నిలిచారని ప్రశంసించింది. వారితో తన అనుబంధం మరిచిపోలేనిది. ఇప్పుడు నాకు ఒక కల నిజమైంది.' అని ఆమె పంచుకుంది. (ఇది చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) View this post on Instagram A post shared by Trinetra (@trintrin) -
శోభిత హీరోయిన్ కావడానికి కారణం ఆ కాయిన్!?
చాలామంది భామలు.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కృతిశెట్టి, శ్రీలీల లాంటి బ్యూటీస్ మాత్రం ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే, మరోవైపు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శోభిత ధూళిపాళ్ల మాత్రం ఓ కాయిన్ వల్ల హీరోయిన్ అయిపోయింది. ఏంటి నమ్మట్లేదా? అయితే మొత్తం చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: స్టార్ సింగర్‌కి బెదిరింపు.. తలకు తుపాకీ గురిపెట్టి!) బాలీవుడ్లో ప్రస్తుతం సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తున్న శోభిత.. వైజాగ్‌లో పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇది జరిగిన మూడేళ్లకు హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హిందీతోపాటు తమిళ, మలయాళ భాషల్లో వరస చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది. తెలుగులో అడివి శేష్ 'గూఢచారి'లో మాత్రమే నటించిన శోభిత.. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొంది. తన కెరీర్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టింది. 'వైజాగ్ లో చదువు పూర్తయిన తర్వాత పెద్ద సిటీకి వెళ్లాలని అనుకున్నా. అప్పుడు నా ఛాయిస్ బెంగుళూరు, ముంబై. ఈ రెంటింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు కాయిన్ తో టాస్ వేశాను. ముంబై ఛాయిస్ గా వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లా. నా లైఫ్ మొత్తం మారిపోయింది' అని శోభిత చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్) -
నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న రూమర్స్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. ఓసారి లండన్ వెకేషన్లో, మరోసారి రెస్టారెంట్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో డేటింగ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: చైతో డేటింగ్ అంటూ రూమర్స్.. స్పందించిన శోభిత ధూళిపాళ) శోభిత మాట్లాడుతూ.. 'నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. జీవితంలో ఎంత ఎదిగినా అణగిమణిగి ఉండాలి. సింపుల్‌గా, మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.' అని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ... 'అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఎవరైనా నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తా. ఎందుకంటే.. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి రోజు కష్టపడుతున్నా. అని అన్నారు. కాగా.. నాగ చైతన్యతో శోభితా రిలేషన్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు! ) కాగా.. గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్ చేసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ శోభిత నటించింది. ప్రస్తుతం ఆమె ది నైట్ మేనేజర్-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
రొంబ సూపర్ ఇంటర్వ్యూ విత్ కార్తీ అండ్ విక్రమ్!
-
Sobhita Dhulipala Photos: గ్లామర్ డోస్ పెంచిన శోభిత.. ఫొటోలు వైరల్
శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ శోభిత ధూళిపాళ లేటెస్ట్ స్టిల్స్ -
నాగచైతన్య-శోభిత డేటింగ్ చేస్తున్నారా? అఖిల్ ఏమన్నాడంటే..
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌పై ఇంతవరకు అటు చై, శోభిత దూళిపాళ స్పందించకపోయినా వారి ప్రేమ వ్యవహారం మాత్రం ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. రీసెంట్గా లండన్‌లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరు కలిసున్న ఓ ఫోటో లీక్ అయ్యి ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చై-శోభితల రిలేషన్షిప్ నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై అఖిల్ అక్కినేని స్పందించారు. ఏజెంట్ మూవీ ప్రెస్మీట్లో భాగంగా పాల్గొన్న అఖిల్‌కు.. ''మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించి(శోభిత దూళిపాళను ఉద్దేశిస్తూ) నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. మరి మీ పరిస్థితి ఏంటి''?అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అఖిల్ బదులిస్తూ..'నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీని మెయిన్టైన్ చేయడమే సరిపోయింది. నా దృష్టి మొత్తం సినిమాలపైనే' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
టీ కొట్టు దగ్గర శోభిత, గ్రీన్ సారీలో కట్టిపడేస్తున్న స్నేహ
► పింక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా ► స్కూటీ నడుపుతున్న కీర్తి సురేశ్ ► గ్రీన్ చీరలో అల్లు స్నేహా ► తండ్రికి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుపమ పరమేశ్వరన్ ► వీధి చివర కొట్టులో టీ తాగిన శోభిత ధూళిపాళ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
నాగ చైతన్య - శోభిత ... హ్యాపీ స్టేటస్
-
శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య.. నెట్టింట ఫోటో లీక్
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య గతేడాది సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న చై-సామ్‌లు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక సామ్‌తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్ లైఫ్‌పై అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు నాగ చైతన్య ఇటు శోభిత ఇద్దరు కూడా స్పందించలేదు. తాజాగా శోభితతో కలసున్న నాగచైతన్య ఫోటో ఒకటి నెట్టింట లీక్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనడానికి ఈ ఫోటోనే కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్‌లో 'శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?'అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నాగ చైతన్య చిన్న స్మైల్ ఇచ్చి సమాధానం దాటవేశారు. అలాగే ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగ్గా హ్యాపీ స్టేటస్ అంటూ బదులిచ్చారు. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చై- శోభిత ఫోటోలో ఎంతవరకు నిజముంది? ఇది ఇద్దరూ కలిసిన దిగిన ఫోటోనా? లేక ఎడిటింగ్ ఫోటోనా అన్నది తేలాల్సి ఉంది. -
‘మేజర్’ విషయంలో అదే మాకు పెద్ద సవాల్ : అడివి శేష్
‘‘ఆల్ ఇండియా పర్సన్ మేజర్ సందీప్‌గారి బయోపిక్ చేశాను కాబట్టి నా కెరీర్ కూడా ఆ స్థాయికి వెళ్లిందని భావిస్తున్నాను. సందీప్‌గారు కేరళలో పుట్టి, బెంగళూరులో పెరిగారు. హైదరాబాద్ కంటోన్మెంట్లో కెప్టెన్.. కార్గిల్, కశ్మీర్లో పోరాడారు. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్.. ముంబైలో వందల మందిని కాపాడారు. అందుకే ‘మేజర్’ ఆల్ ఇండియా సినిమా’’ అన్నారు అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్‌గా అడివి శేష్ నటించారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా నిర్మించింది. శశికిరణ్ తిక్క దర్శకుడు. జూన్ 3న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా అడివి శేష్ చెప్పిన విశేషాలు. ముంబైలో 26/11 దాడులు జరిగాయి. ఆ తర్వాతి రోజు 27న సందీప్‌గారి ఫోటో టీవీలో కనిపించింది. ఎవరీయన? మా కజిన్ పవన్ అన్నయ్యలా ఉన్నారే అనుకున్నాను. ఆ తర్వాత సందీప్‌గారి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఈ క్రమంలో ఆయనకు అభిమానిగా మారిపోయాను. యాక్టర్‌గా నాకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత సందీప్‌గారి జీవితం గురించి నేను ఎందుకు చెప్పకూడదనే ఫీలింగ్ నాలో మొదలైంది. ‘క్షణం’ టైమ్‌లో బాగా ఆలోచించాను. ‘గూఢచారి’ టైమ్‌లో వేడి వచ్చింది. ‘ఎవరు’ సినిమా అప్పుడు సందీప్‌గారి బయోపిక్ చేయాలని నిర్ణయించుకున్నాను. మనకు గాంధీ, భగత్ సింగ్గార్ల గురించి తెలుసు. ఇప్పుడు సందీప్‌గారి జీవితం గురించి పాఠ్యాంశాల్లో కూడా బోధిస్తున్నారు. అదే మాకు సవాల్ సందీప్‌గారి జీవితాన్ని ఓ బయోపిక్‌గా రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమే. అయితే కశ్మీర్, కార్గిల్ యుద్ధం, ముంబై తాజ్ ఇన్సిడెంట్, ఆయన బెంగళూరు స్కూల్ డేస్.. ఇలాంటి అన్ని ముఖ్యమైన సీన్స్ సినిమాలో ఉంటాయి. ఓ సందర్భంలో తన స్నేహితుడికి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి రెండు రోజుల పాటు సందీప్‌గారు ఏమీ తినకుండా ఉండిపోయారు. ఇలాంటి సినిమాటిక్ అంశాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఇంకా సందీప్‌గారి లైఫ్‌లో మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయి. సందీప్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు బాలీవుడ్, మాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ సందీప్ బయోపిక్ తీయడానికి ప్రయత్నించారు. అయితే ఫలానా హీరోలు మా కొడుకులా లేరు అని సందీప్‌గారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. మేం అప్రోచ్ అయినప్పుడు నాలోని నిజాయితీ, వారి కొడుకు పోలికలకు దగ్గరగా నావి ఉండటంతో ఒప్పుకున్నారు. ‘మేజర్’ సినిమాకు ఓ ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చి నా కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్లాడు డైరెక్టర్ శశి. శ్రీచరణ్ పాకాల ఇంటర్నేషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘హిట్ 2’, ‘గూఢచారి’ సినిమాలు చేస్తున్నాను. అంతా మహేశ్‌గారి సపోర్ట్ వల్లే.. మేం ముందడుగు వేయాలనుకున్న ప్రతిసారీ మహేశ్‌బాబుగారు మమ్మల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు దర్జాగా దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ వేస్తున్నాం. ఆడియన్స్‌కు సినిమా చూపించి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం మనం ఎక్కడా చూడలేదు. ఇది మహేశ్‌గారి సపోర్టే వల్లే. ప్రొడక్షన్ పరంగా నమ్రతగారు కూడా హెల్ప్ చేశారు. -
మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో శనివారం జైపూర్‌లో మేజర్ మూవీ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. అలాగే సినిమాలో మేజర్ సందీప్‌ను చూసి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కోడుతూ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో అడివి శేష్ తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘జైపూర్.. థియేటర్లో సినిమా చూస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహై! నా కెరీర్లో ఇదో గొప్ప క్షణం’ అంటూ అడివి శేష్ రాసుకొచ్చాడు. కాగా జైపూర్‌లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు చూసేందుకు 100 మందికి పైగా జవాన్లు థియేటర్‌కు వచ్చారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్ మూవీ టీం జవాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్. అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. #Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX — Adivi Sesh (@AdiviSesh) May 28, 2022 -
ఆ తర్వాత ప్రేమలో పడిపోయా, ఇంతకంటే ఏం కావాలి?
‘‘నా కెరీర్లో నేను ఎక్కువగా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం వల్లనేమో నన్ను అందరూ సీరియస్‌గానే చూస్తున్నారు. కానీ నేను చాలా హ్యాపీ గాళ్‌ని. నాకు సరదాగా, ఫన్నీగా ఉండే అమ్మాయి పాత్రలు కూడా చేయాలని ఉంది’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఇందులో సందీప్‌గా అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్ ఫిలింస్ నిర్మించింది. ‘మేజర్’ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన శోభితా ధూళిపాళ్ల చెప్పిన విశేషాలు. ► మా ఫ్యామిలీలో సినిమా వాతావరణం లేదు. కాలేజీ తర్వాత మిస్ ఇండియా గెలిచాను. ఉత్సాహంగా మోడలింగ్ చేశాను. మోడలింగ్ నచ్చింది కానీ ఆ వర్క్ ఇస్తున్న తృప్తి నా మనసుకు సరిపోలేదు. నటన అంటే నాకు ఇష్టం అని ఆడిషన్స్ వల్ల తెలుసుకున్నాను. ఆ తర్వాత యాక్టింగ్‌తో ప్రేమలో పడిపోయా. నాకు నచ్చిన పని చేస్తూ అందరితో మెప్పు పొందగలుగుతున్నాను. లైఫ్‌లో ఇంతకంటే ఏం కావాలి! ఇక గ్లిజరిన్ అవసరం లేదు ‘మేజర్’లో బందీ అయిన ఎన్ఆర్ఐ యువతి ప్రమోద పాత్ర చేశాను. 26/11 దాడులు జరిగినప్పుడు ఎంతో భయాన్ని, బాధను బందీలు అనుభవించి ఉంటారు. వారిలా ఆలోచించి ఈ సినిమా చేశా. నా కెరీర్లో ఇప్పటివరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడలేదు. ప్రమోద పాత్ర చేశాక ఇక యాక్టర్‌గా లైఫ్‌లో నాకు గ్లిజరిన్ అవసరం ఉండదేమో అనిపిస్తోంది. ఇది అంత బరువైన, భావోద్వేగంతో కూడిన పాత్ర. మహేశ్‌గారు ఆ భరోసా ఇచ్చారు మేజర్ సందీప్ తల్లిదండ్రులు తమ కొడుకు జీవితం ఆధారంగా తీసిన ‘మేజర్’ను చూసి గర్వపడాలని అడివి శేష్ కష్టపడి చేశారు. దర్శకుడు శశి కాన్ఫిడెంట్ అండ్ ఎమోషనల్ పర్సన్. కరోనా టైమ్‌లో ‘మేజర్’ ఓటీటీకి వెళ్తుందా? అనే భయం కలిగింది కానీ నిర్మాత మహేశ్‌బాబుగారు ఇది థియేట్రికల్ ఫిల్మ్.. థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దామని భరోసా ఇచ్చారు. అది నేరవేరినందుకు హ్యాపీ ఒక హిస్టారికల్ ఫిల్మ్ చేయాలనే నా ఆకాంక్ష ‘పొన్నియిన్ సెల్వన్’తో నెరవేరింది. ఈ సినిమా వల్ల మణిరత్నంగారితో వర్క్ చేయగలిగే అదృష్టం కలిగింది నాకు. హాలీవుడ్లో నేను చేసిన ‘మంకీ మాన్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఓటీటీలో ‘మేడిన్ ఇన్ హెవెన్’ సెకండ్ సీజన్, బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట! టీజర్: సక్సెస్ అయితే నీ లవర్‌తో, ఫెయిల్ అయితే పక్కోడి లవర్‌తో పెళ్లి! -
అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు!
స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌పై తొలి ఫిర్యాదు నమోదు అయ్యింది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీ షార్ట్ ఫిల్మ్ కిందటి ఏడాది జవనరిలో రిలీజ్ అయ్యి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టర్ మృత శిశువును చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్ తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని జులై 27న నమోదు అయిన ఆ ఫిర్యాదు పేర్కొని ఉంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్‌ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్‌ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్-2021’ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ‘సాక్రెడ్ గేమ్స్, ఏ సూటబుల్ బాయ్’ ద్వారా నెట్‌ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
మిస్ సితారమిస్ సితార
రాజీవ్ సిద్ధార్థ్, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన హిందీ చిత్రం ‘సితార’. ‘నోబుల్ మ్యాన్’ ఫేమ్ వందనా కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకునే ఒక అమ్మాయి, చెఫ్ కావాలనుకునే ఓ అబ్బాయి చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్రంలోని శోభిత లుక్‌ను విడుదల చేశారు. చేతిలో పువ్వు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో ‘మేజర్’ చిత్రంలో నటించారు శోభిత. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ, అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్’లోనూ నటిస్తున్నారు. మలయాళంలో ఆమె నటించిన ‘కురూప్’ చిత్రం విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. -
ఎవరూ రాకండి, వాళ్ల అంతు నేను చూస్తా: అడివి శేష్
గూఢచారి తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వస్తున్న సినిమా మేజర్. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం మేజర్ టీజర్ రిలీజైంది. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళం వర్షన్‌ను పృథ్వీరాజ్ రిలీజ్ చేశారు. ఇందులో అగ్నికీలల్లో కాలిపోతున్న హోటల్లో అమాయకులను కాపాడేందుకొచ్చిన వీరుడిలా అడివి శేష్ కనిపిస్తున్న సీన్‌తో టీజర్ మొదలవుతుంది. 'బార్డర్లో ఆర్మీలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మ్యాచ్ అయినా గెలవాలి.. అందరూ ఇదే ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్లను కాపాడటం సోల్జర్ పని', 'డోంట్ కమ్ అప్.. ఐ విల్ హ్యాండిల్ దెమ్(ఎవరూ రాకండి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను)' అని హీరో చెప్పిన డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బీజీఎమ్ మాత్రం అదరగొడుతోంది. ఈ టీజర్ చూసిన నెటిజన్లు గూస్బంప్స్ వస్తున్నాయ్.. దీని గురించి చెప్పడానికి మాటల్లేవ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హీరో నాని సైతం ఈ మధ్యకాలంలో ఇంత మంచి టీజర్‌ను చూడలేదని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం విశేషం. ‘మేజర్’ను ఈ జూలై 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. I have watched #MajorTeaser And I think it’s the BEST teaser I have watched in a very long time 🔥@AdiviSesh — Nani (@NameisNani) April 11, 2021 చదవండి: మేజర్: ఉగ్రవాదులతో పోరాడిన ధీర వనిత.. అమెరికన్లు ఈ హీరోను అధ్యక్షుడిగా కావాలనుకుంటున్నారంట -
మేజర్: ఉగ్రవాదులతో పోరాడిన ధీర వనిత..
26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్". ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. ఇటీవలే ఆమె లుక్ రిలీజ్ చేయగా తాజాగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. "ఉగ్రవాదులు హోటల్లోకి చొరబడ్డారు. ఆమె కోసం లోపలకు వచ్చారు. కానీ ఆమె ఎదురు తిరిగి వారితో పోరాడింది" అంటూ ఈ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. అందులో ఆ యువతి పడ్డ వేదనను కళ్లకు కట్టినట్లు చూపించారు. పోస్టర్ చూస్తుంటే ఇది సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాల్లో ఒకటి అని తెలుస్తోంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 12న టీజర్ రిలీజ్ కానుండగా జూలై 2న సినిమా విడుదల అవుతోంది. ఇదిలా వుంటే ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శోభితా చివరగా ‘ఘోస్ట్ స్టోరీస్’లో కనిపించింది. ఆ మధ్య వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. Introducing a new dimension in the #PeopleOfMajor The Terrorists came into the hotel. Then they came for her. She fought back. @sobhitaD IS PRAMODA#MajorTheFilm#MajorTeaserOnApril12 pic.twitter.com/PgEmDy5JhL — Adivi Sesh (@AdiviSesh) April 9, 2021 చదవండి: హాలీవుడ్ సినిమాలో శోభితా దూళిపాళ్ల.. ‘మేజర్’ అప్డేట్ : అడివి శేష్, సయీ మంజ్రేకర్ లుక్ వైరల్ -
హాలీవుడ్ సినిమాలో శోభితా దూళిపాళ్ల..
తెలుగు హీరోయిన్ శోభితా దూళిపాళ్ల హాలివుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆమె ఇప్పటికే తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ ఫేం, బ్రిటన్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కే ‘మంకీ మాన్’ చిత్రంలో శోభితా నటించనున్నారు. దేవ్ పటేల్ దర్శకతం వహిస్తున్న మొదటి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. పాల్ అంగునావెలా, జాన్ కొలీ రచన సహాకారంతో దేవ్ పటేల్ ఈ చిత్రానికి తెరకెక్కించనున్నారు. ఇందులో దేవ్ పటేల్‌తో పాటు షార్ల్టో కోప్లీ, సికందర్ ఖేర్ నటించనున్నారు. ఈ సినిమా 2022లో విడుదల కానుంది. చివరగా శోభతా ‘ఘోస్ట్ స్టోరీస్’లో కనిపించిన విషయం తెలిసిందే. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. తెలుగులో తన మొదటి సినిమా ‘గూఢచారి’. ఆమె అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’లో నటిస్తోంది. ‘మంకీ మాన్’ చిత్రం భారతదేశంలోని ముంబై నగరం ఆధారం తెరకెక్కనుందని దేవ్ పటేల్ తెలిపారు. ఎందుకంటే తాను భారతదేశం నుంచి ప్రేరణ పోందినట్లు చెప్పారు. జైలు ఖైదీల నేపథ్యమున్న థ్రిల్లర్ మూవి ‘మంకీ మాన్’ అని తెలిపారు. చదవండి: కలలో కూడా అనుకోలేదు: శోభితా దూళిపాళ్ల -
ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. ఇందులో శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ లుక్ టెస్ట్ వీడియోను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘మేజర్’ విశేషాలను అడివి శేష్ ఆ వీడియోలో వెల్లడిస్తూ– ‘‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 2008 నుంచి నా మైండ్‌లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ దాడి జరిగినప్పుడు అమెరికాలో ఉన్నాను. ఆ దాడిలో సందీప్ మరణించినట్లు అక్కడి న్యూస్ ఛానల్స్‌లో 27వ తేదీ ఆయన ఫోటో వేశారు. ఆయన కళ్లల్లో ఒక ప్యాషన్, స్పిరిట్ కనిపించింది. దాంతో ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్‌ను కట్ చేసి పెట్టుకున్నాను. ఆయన ఇంటర్వ్యూలు చూశాను. ‘మేజర్’ లాంటి ప్యాన్ ఇండియన్ స్టోరీ చెప్పగలననే నమ్మకం వచ్చాక సందీప్ పేరెంట్స్‌ని కలిశాను. ఆ తర్వాతే ఈ సినిమా మొదలు పెట్టాం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
సయీ.. ఆయా
బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కి రావడం కొత్తే కాదు. ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆమె ఎవరో కాదు.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. తండ్రి బాటలో సయీ కూడా తెలుగుకి ఆయా (వచ్చింది) అన్నమాట. ‘మేజర్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనుందామె. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్–3’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సయీ అందర్నీ ఆకట్టుకున్నారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘మేజర్’ షూటింగ్లో పాల్గొననున్నారామె. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ అడివి నటిస్తున్నారు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. జి.యం.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి Ô¶ శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. -
ప్రతిభకు కొదవ లేదు
మనం పని చేస్తున్న రంగంలో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకుంటారు కొందరు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్లకు కూడా ఇదే ఆలోచన వచ్చినట్టుంది. అందుకే స్టూడియో స్థాపిస్తున్నానని ప్రకటించారు. అయితే ఇది షూటింగ్‌లు చేసుకునే స్టూడియో కాదు. షూటింగ్ చేయాలంటే కావాల్సిన కథలకు స్టూడియో... క్రియేటివ్ స్టూడియో. ఈ విషయం గురించి శోభితా మాట్లాడుతూ – ‘‘నాకు రాయడం అన్నా, చదవడం అన్నా ఎంతిష్టమో నా పరిచయస్తులందరికీ తెలుసు. ఆ ఇష్టమే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. పరిశ్రమలో సాధించిన ఏడెనిమిదేళ్ల అనుభవంతో మన దగ్గర ప్రతిభకు లోటు లేదని తెలిసింది. భిన్నమైన ఆలోచనలతో ఉన్న ప్రతిభ కలిగినవాళ్లను చాలామందిని చూశాను. క్రి యేటివ్ స్టూడియో అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. నేనో ప్లాట్‌ఫామ్ స్థాపించాలనుకుంటున్నాను. కొత్త కొత్త ఆలోచనలు, కథలు, ఐడియాలను ఇక్కడ తయారు చేయించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పటికి కార్యరూపం దాల్చడం చాలా సంతోషం’’ అన్నారామె. -
కలలో కూడా అనుకోలేదు
శోభిత ధూళిపాళ... తెలుగు అమ్మాయే అని చెప్పి ఆమె ప్రతిభను ప్రాంతానికి పరిమితం చేయడం కాదు.. మన శోభను ప్రపంచం గుర్తించింది అని గర్వంగా చెప్పుకోవడం. అన్నట్టు శోభితను ఆప్యాయంగా శోభా అని పిలుస్తారు. టైటిల్‌తో సంబంధం లేకుండా కాస్ట్ అండ్ క్య్రూలో ఆమె పేరు చూసి మరీ ఆ సినిమాను లేదా ఆ సిరీస్‌ను సెలెక్ట్ చేసుకుంటారు ప్రేక్షకులు, వీక్షకులు. ఆమె గురించి వివరాలు.. పుట్టింది తెనాలిలో.. పెరిగింది విశాఖపట్టణంలో. తల్లిదండ్రులు.. శాంత రావు, వేణుగోపాల్ రావు. చదివింది.. ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్‌లో డిగ్రీ, పీజీ (కామర్స్). భరతనాట్యం, కూచిపూడి, గిటార్ వాద్యంలోనూ ప్రావీణ్యం. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నది. సెకండ్ రన్నరప్‌గా ఎంపికైంది. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్‌తో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. రామన్ రాఘవ 2.0.. శోభిత ఫస్ట్ సినిమా. విక్కీ కౌశల్ పక్కన నటించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో క్రిటిక్స్ చాయిస్ ఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్కూ నామినేట్ అయింది. మేడ్ ఇన్ హెవెన్.. శోభిత ఫస్ట్ వెబ్ సిరీస్. బ్యూటీ విత్ టాలెంట్ అని అబ్బుర పడుతూ ఆమె గురించి వీక్షకులు గూగుల్ చేసేంతగా ఇంపాక్ట్ చూపించింది. గూఢచారి.. తెలుగులో శోభితను చూపించిన మూవీ. అందులో ఆమె నటనను ప్రశంసిస్తూ మహేశ్‌బాబూ ట్వీట్ చేశాడు. ‘థాంక్యూ’ అని బదులు ఇచ్చిన శోభిత .. మహేశ్ అభిమానుల ట్రోలింగ్కి లోనైంది.. అంత పెద్ద హీరో కితాబిస్తే మర్యాద లేకుండా థాంక్యూ అనడమేంటి అని. ‘థాంక్యూ చెప్పడం మర్యాద కాదా? సిల్లీ’ అంటూ కొట్టిపారేసింది. ఆమె తలపుల్లో సినిమా లేదు.. ఆ మాటకొస్తే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ‘రామన్ రాఘవ 2.0’ లో నటించే వరకు ఆమె చూసిన సినిమాలు ఇరవై అయిదే. అందులో ఎనిమిది ‘హ్యారీ పాటర్’ సిరీసే. ‘ఆనంద్’ తెలుగు మూవీ కూడా ఉంది. సాహిత్యంతోనే చెలిమి చేసింది చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ పుస్తకాలతోనే దోస్తీ. ఎప్పటికైనా రచయిత కావాలనేదే ఆమె లక్ష్యం. ఆమె ఇతర చిత్రాలు.. షెఫ్, కాలకండి, మూతోన్ (మలయాళం), ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్, బార్డ్ ఆఫ్ బ్లడ్ (వెబ్ సిరీస్).. ఎట్సెట్రా. ‘‘ మిస్ ఇండియా’ నా సెల్ఫ్ ఎస్టీమ్‌ను దెబ్బతీసింది. నా నుంచి నన్ను వేరుచేసింది. సినిమాల విషయానికి వస్తే.. కలలో కూడా అనుకోలేదు యాక్ట్రెస్నవుతానని. అనుకోనిది నేరవేరినందుకు చాలా హ్యాపీ. అనుకున్నది కూడా నెరవేర్చుకోవాలి. రైటర్ననిపించుకోవాలి. మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడమే తెలుసు’’ అంటుంది శోభిత ధూళిపాళ. -
నాలో మార్పు తెచ్చింది
‘‘కొన్ని సినిమాల చిత్రీకరణ పూర్తవగానే ఎంతో నేర్చుకున్నాం, ఎన్నో జ్ఞాపకాల్ని సంపాదించుకున్నాం అనే అనుభూతి మిగులుతుంది. ‘కురుప్’ చిత్రం ఓ మంచి జ్ఞాపకం’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘కురుప్’. శోభితకి ఇది రెండో మలయాళ చిత్రం. కేరళ ప్రాంతంలో నివసించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ – ‘‘కురుప్’ నా తొలి పూర్తి స్థాయి మలయాళ (గతంలో ‘మూతాన్’లో గెస్ట్ రోల్ చేశారు) చిత్రం. ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. దానికి కారణం ఈ ప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్‌గా, క్రియేటివ్‌గా నాలో వచ్చిన మార్పు. నా పర్సనల్ క్యారెక్టర్ని ప్రభావితం చేసిన ప్రయాణమిది. ఇది మర్చిపోలేని ప్రయాణం’’ అన్నారు. -
పొన్నియిన్.. శోభితా ఇన్
చోళసామ్రాజ్యంలో రాణిగా స్థానం సంపాదించారు హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో ప్రధానతారాగణం. వీరితో పాటు తాజాగా శోభితా ధూళిపాళ్ల కూడా ఈ చిత్రంలో చోటు సంపాదించారు. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శోభిత. కూచిపూడి, భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యత, నైపుణ్యం ఉన్న ఓ రాణి పాత్రలో శోభిత నటించబోతున్నారని టాక్. నిజజీవితంలోనూ శోభితా మంచి క్లాసికల్ డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. -
ఫలితాన్ని పట్టించుకోను
‘నటీనటులకు భాషా భేదాలు అనేవి ఉండకూడదు. ఒకకథ చెప్పడానికి ఏ భాషకైనా, ఏ ప్లాట్‌ఫామ్‌కి అయినా వెళ్లాలి’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. ‘గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హైదరాబాదీ భామ ప్రస్తుతం హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. విభిన్న భాషల్లో సినిమాలు చేయడం గురించి శోభిత మాట్లాడుతూ – ‘‘యాక్టర్‌గా నన్ను నేను కథకురాలిగా చూస్తాను. కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్‌ఫామ్‌లో చెబుతున్నాం అనేది పెద్దగా పట్టించుకోను. ఫీచర్ ఫిల్మ్ అయినా వెబ్ అయినా ఒకటే ఆసక్తితో నా పాత్రను చేస్తాను. ఒక మంచి కథ ఉంటే నటిగా వంద శాతం కష్టపడతాను. ఫలితం పెద్ద పట్టింపు కాదు. ఆ ప్రక్రియను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. -
రౌడీకి జోడీ
దుల్కర్ సల్మాన్ ఓ పెద్ద క్రిమినల్‌గా మారబోతున్నారు. తనకు పార్టనర్‌గా శోభితా ధూళిపాళ రెడీ అయ్యారు. ఇదంతా మలయాళ సినిమా ‘కురుప్’ కోసమే. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్ సుకుమార కురుప్. అతని జీవితం ఆధారంగా ‘కురుప్’ తెరకెక్కుతోంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శోభితా కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. శోభితకి ఇది రెండో మలయాళ సినిమా. నివీన్ పౌలీతో శోభిత చేసిన ‘మూతాన్’ రిలీజ్‌కు రెడీ అయింది. -
హిట్ హిట్ హుర్రే
సాధారణంగా బిజినెస్ ఇయర్ మార్చి టు మార్చి జరుగుతుంది. ఆ ఏడాది జరిగిన లావాదేవీలన్నీ లెక్కలేస్తుంటారు. బిజినెస్ ఇయర్‌ను మేం కొంచెం మార్చాం. ఉగాది టు ఉగాది చేశాం. గత ఏడాది ఉగాది నుంచి ఈ ఉగాది వరకూ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన కొత్త టాలెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఉగాది పచ్చడిలానే సినీపరిశ్రమలో ఫలితాలు కూడా షడ్రుచుల్లా ఉంటాయి. చేదు, పులుపు, తీపి, కారంలా హిట్టు, ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్లు ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే తీపి రుచి చూసిన హీరో, హీరోయిన్లు, దర్శకులు గురించి చర్చించుకుందాం. వాళ్లపై స్పెషల్ స్టోరీ. లక్కీయారా తొలి పరిచయంలోనే స్టేట్ సీయంను ప్రేమలో పడేసిన హీరోయిన్ కియారా అద్వానీ. అదేనండీ.. ‘భరత్ అనే నేను’లో సీయం భరత్‌ని ప్రేమలో పడేశారు కదా. మహేశ్‌బాబు నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘భరత్ అనే నేను’తో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ కియారా. ‘భరత్ అనే నేను’ రిలీజ్ కాకముందే ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేశారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇద్దరు టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి లక్కీయారా అనిపించుకున్నారు. ‘భరత్..’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా, ‘వినయ..’ సినిమా అంచనాలను అందుకోలేదు. అయినా నో ప్రాబ్లమ్. కియారాకి అవకాశాలు కొదవ లేదు. అఖిల్ కొత్త చిత్రంలో కియారా నటించే అవకాశముందని తెలిసింది. మజిలీ ఎటువైపు హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ’తో పరిచయమయ్యారు రుహానీ శర్మ. సినిమా ఆకట్టుకుంది. రుహానీ నటన కూడా బాగుందనే అన్నారు. కానీ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. రుహానీలా హిట్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా కూడా నెక్ట్స్ సినిమాను ఇంకా సైన్ చేయని హీరోయిన్లలో శోభితా ధూళిపాళ, ప్రియాంకా జవాల్కర్ ఉన్నారు. ‘గుఢచారి’ ద్వారా శోభిత, ‘టాక్సీవాలా’ ద్వారా ప్రియాంకా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశారు. నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నారు? అంటే.. ఇంకా ప్రకటించలేదు ఈ తెలుగమ్మాయిలు. ఇక నాగచైతన్య, సమంత చేసిన ‘మజిలీ’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు దివ్యాన్షాకౌశిక్. ఆమె నటనను మెచ్చుకున్నారు ప్రేక్షకులు. మరి.. ఈ సినిమా తర్వాత దివ్యాన్ష మజిలీ ఎటువైపో చూడాలి. సమ్మోహిని అదితీరావ్ హైదరీకి బాలీవుడ్లో తొమ్మిదేళ్ల కెరీర్ ఉంది. మణిరత్నం ‘చెలియా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫస్ట్ టైమ్ పలకరించారు అదితీ. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ద్వారా తెలుగుకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో సమ్మోహనపరచడమే కాకుండా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని మెప్పించారు. ఆ వెంటనే వరుణ్ తేజ్‌తో కలసి ‘అంతరిక్షం’లో ప్రయాణం చేశారు. ‘అంతరిక్ష’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తాజాగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారని తెలిసింది. సుధీర్‌బాబు, నానిలతో మోహనకృష్ణ ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో నాని సరసన హీరోయిన్గా కనిపిస్తారట అదితీ. ఒక్క హిట్ నిధీ అగర్వాల్‌ది స్పెషల్ కేస్. వరుస సినిమాలను సంతకం చేస్తున్నారు కానీ ఫస్ట్ హిట్‌ను ఇంకా టేస్ట్ చేయలేదీ ఈ బెంగళూర్ భామ. నాగచైతన్య ‘సవ్యసాచి’తో పరిచయమైన నిధీ, ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో నటించారు. లేటెస్ట్గా రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా కనిపిస్తున్నారు. మరి.. అవకాశాలు అందుకుంటున్నట్లుగానే హిట్ ఎప్పుడు అందుకుంటారో చూడాలి. అది ‘ఇస్మార్ట్ శంకర్’తోనే దక్కుతుందనే ఊహలున్నాయి. భల్లే భల్లే పాయల్ గత ఏడాది ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన వారిలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఈ పంజాబీ భామ చేసిన బోల్డ్ రోలే అందుకు కారణం. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేసే పనిలో పడ్డారు పాయల్. ‘వెంకీ మామా’లో వెంకటేశ్ సరసన, ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన, ‘మన్మథుడు 2’లో యాక్ట్ చేస్తున్నారు పాయల్. తమిళంలో ఆమె చేసిన ‘ఏంజెల్’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల తెలుగులో ‘ఆర్డీఎక్స్’ అనే ఓ కొత్త చిత్రం కూడా స్టార్ట్ చేశారు. హాట్ ఎంట్రీతో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు పాయల్. కొత్త ఐడియాలు క్లిక్ 2018 తెలుగు సినిమా విభిన్న కథలను చూసింది. సరికొత్త ఐడియాలతో కొత్త దర్శకులు ముందుకొచ్చారు. ‘ఆర్ఎక్స్100’ లాంటి బోల్డ్ అటెంప్ట్‌తో అజయ్ భూపతి ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు అజయ్. తక్కువ బడ్జెట్లోనూ బాండ్ తరహా చిత్రాలు తెరకెక్కించవచ్చని ‘గూఢచారి’ సినిమా ద్వారా శశికిరణ్ తిక్క నిరూపించారు. మహేశ్‌బాబు నిర్మాణంలో ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు శశికిరణ్. ‘చి. ల. సౌ’ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు హీరో రాహుల్ రవీంద్రన్. మంచి పేరు వచ్చింది. సెకండ్ సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే చాన్స్ లభించింది. నాగ్ సూపర్ హిట్ ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు రాహుల్. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మిడిల్ క్లాస్ కథను చూపించిన వేణు ఉడుగుల ఈసారి పీరియడ్ ఫిల్మ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. రానా, సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథను తయారు చేశారట. ‘కేరాఫ్ కంచెరపాలెం’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకటేశ్ మహా, ‘నన్ను దోచుకుందువటే’ ఆర్ఎస్ నాయుడు, ‘టాక్సీవాలా’ రాహుల్ సంక్రిత్యాన్ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలింకా చెప్పలేదు. విజయ కార్తికేయం గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కార్తికేయ బాగా మెరిశారు. ‘ఆర్ఎక్స్ 100’ బండిలానే దూసుకెళ్లారు. సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ వెంటనే తమిళ బడా చిత్రాల నిర్మాత కలైఫులి యస్ థాను నిర్మాణంలో ‘హిప్పీ’ సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, సంవత్సరం తిరక్కముందే విలన్ వేషాలకు కూడా రెడీ అయ్యారు. నాని– విక్రమ్ కె కుమార్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. శభాష్ నటేశ్ నిర్మాతగా హీరో సుధీర్‌బాబు తొలి ప్రయత్నం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు కన్నడ నటి నభా నటేశ్. సినిమా సక్సెస్‌లో తన పాత్ర ఎంతో ఉందనే ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నటనకు కూడా శభాష్ అనిపించుకున్నారు. ఆ హిట్‌తో వరుస సినిమాలతో బిజీ అయ్యారు నభా. రవితేజ ‘డిస్కో రాజా’లో ఓ హీరోయిన్గా, పూరి జగన్నాథ్–రామ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా చేస్తూ బిజీగా ఉన్నారు. – గౌతమ్ మల్లాది -
సీక్వెల్ షురూ
సెట్స్‌లో ఉన్నప్పుడు ‘గూఢచారి’ చిన్న సినిమా. రిలీజయ్యాక పెద్ద సినిమా. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి, పెద్ద సినిమా అయింది. అడవి శేష్, శోభిత, సుప్రియ తదితరులతో శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ సీక్వెల్ పనులు మొదలయ్యాయి. ‘గూఢచారి’ సినిమా స్క్రిప్ట్ వర్క్‌కి అసిస్టెంట్‌గా చేసిన రాహుల్ పాకాల సీక్వెల్‌కి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్‌ని అనౌన్స్ చేశారు. ‘‘రెండో భాగాన్ని భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశాం. ఫస్ట్ పార్ట్ సంచలనం సృష్టించిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఇంకా పెద్ద స్కేల్లో ఉండాలన్నది మా ఆలోచన. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తాం. 2020లో సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
నేను క్రియేటర్‌ని కాదు
‘‘గూఢచారి’ టీమ్ అంతా న్యూ జనరేషన్ యాక్టర్స్, టెక్నీషియన్స్. మీరంతా తెలుగు సినిమా భవిష్యత్తు. మీతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనకబడిపోతాను’’ అని నాగార్జున అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి నాగార్జున మాట్లాడుతూ– ‘‘గూఢచారి’ బడ్జెట్ తెలుసుకుని ఎలా సాధ్యమైందని ఆలోచించా. ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలు చూసి మేం అంత సోంబేరులా? బద్ధకస్తులమా? సినిమా తీయడం మాకు తెలియదా? అనిపించింది. ఈ చిత్రం చూశాక నాకు తెలియని లొకేషన్స్ అన్నపూర్ణలో ఉన్నాయా? అనిపించింది. సిగ్గేసింది. నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) ఉండుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. నాకు ఇలాంటి సినిమా చేసే అవకాశం రాలేదు. నేను క్రియేటర్‌ని కాను. అందుకనే డైరెక్టర్స్, రైటర్స్పైన ఆధారపడతాను. ఓ స్పై మూవీ తెలుగులో ఎలా ఆడుతుంది? మణిరత్నం ‘బాంబే’ సినిమా కంటే ఏం చేస్తారు? అనిపించింది. ఈ సంవత్సరం ‘రంగస్థలం, మహానటి’ తర్వాత ‘గూఢచారి’ మాత్రమే ఆడింది. అలాగని ఇతర సినిమాలను తక్కువ చేయడం లేదు. సుప్రియను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. తను రా ఆఫీసర్ రోల్‌కి చక్కగా సూట్ అయింది. 1989లో ‘శివ’ వచ్చినప్పుడు దర్శకులకు, నిర్మాతలకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందో.. ‘గూఢచారి’ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలి. ‘గూఢచారి 2’కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం నా నిర్మాతలే.మా కలను, మా సినిమాను ప్రపంచానికి చూపించిన అనిల్‌గారికి థ్యాంక్స్. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇచ్చిన శశికి థ్యాంక్స్. మా సినిమాని సపోర్ట్ చేసినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అడివి శేష్. నిర్మాతలు అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, కెమెరామేన్ షానీల్ డియో, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, నటీమణులు సుప్రియ, మధుశాలిని పాల్గొన్నారు. -
ఆ ఆలోచన శేష్‌దే
‘‘శేఖర్ కమ్ములగారి దగ్గర ‘లీడర్’ సినిమాకు పనిచేశా. నేను, శేష్ కలిసి ‘గూఢచారి’ రాయడం వల్ల యాక్షన్ సినిమా చేశాం. శేష్ లేకుండా ఉంటే ‘గూఢచారి’ వంటి యాక్షన్ సినిమా చేయలేకపోయేవాణ్ని. ఎందుకంటే నాకు గొడవలంటే ఇష్టం ఉండదు’’ అని డైరెక్టర్ శశికిరణ్ తిక్క అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘గూఢచారి’ ఈ నెల 3న విడుదలైంది. దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘స్పై సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అది కూడా మాకు మంచిదే అయింది. అప్పట్లో కృష్ణగారు, చిరంజీవిగారు చేసిన స్పై మూవీస్ అప్పటి టెక్నాలజీకి తగ్గట్టు అప్డేటెడ్గా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పటి టెక్నాలజీ ప్రకారం సినిమా చేయాలి. ‘గూఢచారి’ రిజల్ట్ గురించి ఆలోచించలేదు. మంచి సినిమా తీయాలనే ఓ మొండి ధైర్యంతో ముందుకెళ్లిపోయా. సినిమా చూసిన వాళ్లు పొగడ్తలతో ముంచెత్తుతారని అనుకోలేదు. చిన్నప్పట్నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూడటం వల్ల ఆ ప్రభావం ఉంది. సడెన్‌గా ఓ హాలీవుడ్ స్క్రిప్ట్ ఇచ్చి సినిమా చేయమంటే చేయలేను. ఎందుకంటే కల్చర్ ప్రకారం నేను తెలుగువాణ్ణి. ‘గూఢచారి’ మేకింగ్, స్టైలిష్‌నెస్ ఇంగ్లీష్ సినిమాలా అనిపించినా, కంటెంట్ పరంగా తెలుగు సినిమానే. సుప్రియగారిని ఈ సినిమాలో నటింప చేయాలనే ఆలోచన అడివి శేష్‌దే. తనకు సుప్రియ మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’ సీక్వెల్ చేస్తే బావుంటుందని శేష్ కూడా అన్నాడు. తను వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నేను బయట సినిమా చేసిన తర్వాత ఈ సీక్వెల్ గురించి ఇద్దరం ఆలోచిస్తాం. ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. నా మైండ్‌లో కొన్ని ఐడియాలున్నాయి. ఇంకా పూర్తి స్థాయి కథలు ప్రిపేర్ చేయలేదు. -
అందుకే నటన వద్దనుకున్నా
‘‘ఓ రోజు శేష్, శశి నా వద్దకొచ్చి ‘గూఢచారి’ కథ చెప్పి, నాదియా పాత్ర నన్ను చేయమన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. నేను నటించి దాదాపు 22 ఏళ్లవుతోంది. ఇప్పుడు నటించగలనా? లేదా? అనే నమ్మకం లేదు. ‘నేను ఆడిషన్ ఇస్తా. తర్వాత మీరే నో అంటారు’ అన్నా. ఆడిషన్ ఇచ్చాక మీకు నచ్చితే ఓకే’ అని చెప్పా. ‘ఓ నటి అయ్యుండి ఆడిషన్ ఇస్తానన్న ఫస్ట్ వ్యక్తి మీరే’ అంటూ జోక్ చేశారు. కథ, నా పాత్ర బాగా నచ్చడంతో ‘గూఢచారి’ సినిమా చేశా’’ అని సుప్రియ అన్నారు. అడివి శేష్, శోభిత ధూళిపాళ జంటగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన సుప్రియ శనివారం విలేకరులతో మాట్లాడారు. ► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత నేను కెమెరా ముందుకు రాకపోయినా ప్రొడక్షన్ చూసుకుంటూ సెట్స్‌పైనే ఉంటాను కాబట్టి కెమెరా కొత్తేం కాదు. అయితే.. ఇప్పుడు కెమెరా ముందుకు అంటే కొంచెం కష్టంగా అనిపించింది. కెమెరా మన ముందున్నా లేనట్టు పలు హావభావాలతో నటించాలి. మనల్ని ఎవరో జడ్జ్ చేస్తున్నారనే భావన ఉండకూడదు. అది నిజంగా గ్రేట్ క్వాలిటీ. నిజం చెప్పాలంటే అది నాకు కొంచెం భయంగా అనిపించింది. అందుకే యాక్టింగ్ వద్దనుకున్నానేమో. నటనకు దూరమయ్యా నని ఫీల్ అవ్వలేదు. ‘గూఢచారి’ టీమ్ వల్ల కంఫర్ట్‌గా కెమెరాను ఎదుర్కొన్నా. కాకపోతే ఫస్ట్ డే అడ్జస్ట్ అవడానికి టైమ్ పట్టింది. ► నేను సినిమా చేస్తానన్నప్పుడు ‘ఎందుకమ్మా.. నీకు నచ్చదు’ అని అప్పుడు తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) అన్నారు. చేయకపోతే నచ్చదనే విషయం తెలియదు కదా తాతగారు అన్నా. కట్ చేస్తే.. ఈవీవీ సత్యనారాయణగారి డైరెక్షన్లో సినిమా చేశా. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాకి నేను డైలాగ్స్ రిహార్సల్స్ చేసుకుని వెళితే ‘ఏంటి డల్‌గా ఉన్నావు’ అనేవారు. ఆ సినిమా నాకు సరిగ్గా వర్కవుట్ కాలేదు. ‘తర్వాత ఏంటి?’ అనుకుని ప్రొడక్షన్లోకి వచ్చేశాను. అయితే ప్రొడక్షన్లో చాలా కష్టం ఉంటుంది. ► ‘గూఢచారి’లో క్లైమాక్స్ బాగా నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్ సూపర్బ్. ఓ సినిమాని మహిళలు, పురుషులు చూసే ఫీలింగ్ వేర్వేరుగా ఉంటుంది. ‘గూఢచారి’ సినిమా చూసి, ఏఎన్ఆర్ మనవరాలు బాగా చేసిందని రాజమండ్రి నుంచి ఫోన్ చేశారని నిర్మాత చెప్పినప్పుడు వెరీ హ్యాపీ. ఇప్పటికీ తాతగారి ఫ్యాన్స్ ఫోన్ చేసి బాగా చేశానని అంటుంటే హ్యాపీగా ఉంది. వారికి హ్యాట్సాఫ్. మహేశ్‌బాబు సినిమా చూసి బాగా చేశావన్నారు. ► రెగ్యులర్ కథలను మనం బ్రేక్ చేయాలి. ‘బాహుబలి, అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి, ఆర్ఎక్స్ 100’ వంటి సినిమాలు చక్కటి కథాంశంతో వచ్చాయి. శుక్రవారం వచ్చిందంటే సినిమాల మధ్య పోటీ ఉండాలి. ఏ సినిమా చూద్దాం అనే ఛాయిస్ ప్రేక్షకులకు ఉండాలి. ► పవన్ కల్యాణ్ హీరోయిన్ మళ్లీ వచ్చింది అని సోషల్ మీడియాలో అంటుంటే ఫీల్ అవడం లేదు. మేం నటించి 22ఏళ్లవుతోంది. ఇప్పుడు తను స్టార్. అయితే నాకంటూ ఇప్పుడు ఓ ఐడెంటిటీ ఉంది కదా?. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేను ఫుల్ టైమ్ ఉద్యోగిని (నవ్వుతూ). ► డైరెక్షన్ గొప్ప కళ. నాకు ప్రొడక్షన్వైపు అన్ని విభాగాల్లో పట్టు ఉన్నా డైరెక్షన్ చేసేంత కళ లేదు. అందుకే అటువైపు వెళ్లను. కథలు రాయాలనే ఇండస్ట్రీకి వచ్చా. కానీ, ప్రొడక్షన్లోకి దిగాల్సి వచ్చింది. కథలు రాస్తా. అయితే అవి సినిమాకన్నా పెద్దగా ఉంటాయి. ► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత టైమ్ వేస్ట్ చేయకూడదని చిన మావయ్య (నాగార్జున)కి ఫోన్ చేసి బోర్ కొడుతోంది ఏం చేయాలన్నాను. అన్నపూర్ణ బ్యానర్లో ‘ఆహా’ సినిమా చేస్తున్నాం. ఆ వ్యవహారాలు చూసుకో అనడంతో వెరీ హ్యాపీ. ఆ సినిమాకి జయసుధగారితో రెమ్యునరేషన్ గురించి ఫోనులో మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది (నవ్వుతూ). అప్పుడు నాన్నగారు ఫోన్ తీసుకుని, జయసుధగారితో మాట్లాడారు. అప్పుడే తెలిసింది.. నాకు ఎలా మాట్లాడాలో. ► ‘గూఢచారి’కి ముందు ఓ తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. భాష రాదని చేయలేదు. ‘గూఢచారి’ తర్వాత నటించాలా? వద్దా? అని ఆలోచించలేదు. ఇందులో నా పాత్ర కొంచెం నెగటివ్ షేడ్స్‌లో ఉంటుంది. ప్రతినాయక పాత్రలంటే ఇష్టం. వాటికి నేను బాగా సరిపోతానన్నది నా ఫీలింగ్. పాత్ర నన్ను ఎగై్జట్ చేస్తే చేస్తా. -
‘గూఢచారి’ మూవీ రివ్యూ
టైటిల్ : గూఢచారి జానర్ : స్పై థ్రిల్లర్ తారాగణం : అడివి శేష్, శోభితా దూళిపాల, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్ సంగీతం : శ్రీచరణ్ పాకల దర్శకత్వం : శశి కిరణ్ తిక్క నిర్మాత : అభిషేక్ నామా, అనిల్ సుంకర, విశ్వప్రసాద్ క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి హాలీవుడ్ బాండ్ సినిమాలను తలపించే గూఢచారి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తానే లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించాయి. శశి కిరణ్ దర్శకుడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.? రచయితగా అడివి శేష్ మరోసారి విజయం సాధించాడా..? కథ ; గోపి (అడివి శేష్) ‘రా’ అధికారి రఘువీర్ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్ చనిపోతాడు. దీంతో రఘువీర్ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్ కుమార్ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్ రాదు. (సాక్షి రివ్యూస్) ఫైనల్‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్ కొడుకుని అని మెన్షన్ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్.. త్రినేత్ర 11గా అపాయింట్ అవుతాడు. కానీ అర్జున్ అపాయింట్ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద ఎటాక్ అవుతుంది. ఎటాక్‌లో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్ కూడా చనిపోతారు. ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్ బైక్ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అసలు ఆచారి మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్లు అర్జున్ చేసినట్టుగా ఎందుకు సృష్టించారు..? అర్జున్ ఈ మిస్టరీని ఎలా చేదించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బాండ్ తరహా కథ కావటంతో సినిమా అంతా అడివి శేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇండియన్ బాండ్లా అడవి శేష్ అద్బుతంగా నటించాడు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు. తనే రాసుకున్న కథా కథనాలు కావటంతో అవకాశం ఉన్న ప్రతీ చోట తనని తాను చాలా బాగా ఎలివేట్ చేసుకున్నాడు. సినిమాలో జగపతి బాబు ఎంట్రీ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. మరోసారి ప్రతినాయక పాత్రలో జగపతి బాబు మెప్పించాడు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అక్కినేని వారసురాలు సుప్రియ రీ ఎంట్రీకి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నారు. త్రినేత్ర టీం ఆఫీసర్ పాత్రలో ఆమె నటన సూపర్బ్. నెగెటివ్ షేడ్స్ ను కూడా చాలా బాగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయిన శోభితా దూళిపాలకు మంచి పాత్ర దక్కింది. ఆమె.. గ్లామర్ షోతో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు. తాను సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, మధుశాలిని, అనీష్ కురివిల్లా తదితరులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; తెలుగు తెర మీద బాండ్ తరహా చిత్రాలు చాలా ఏళ్ల కిందటే వచ్చినా.. ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అలాంటి ఓ రేర్ కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్న అడివి శేష్.. మనం కూడా బాండ్ సినిమాలను తెరకెక్కించగలమని మరోసారి ప్రూవ్ చేశాడు. ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు హాలీవుడ్ స్థాయిని తీసుకువచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కాస్త బోరింగ్ గా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్ చూసిన తరువాత లవ్ సీన్స్ కూడా ఓకె అనిపిస్తాయి. అండర్ కవర్ ఆపరేషన్ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్ శానెల్ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల విజయం సాధించారు. అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్నీ కలిసి సినిమాను విజయం వైపు నడిపించాయి. నిర్మాణ విలువలు సినిమాకు మరో ఎసెట్. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : లవ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
టీజర్ చూసి థ్రిల్ అయ్యా
‘‘సినిమాలపై ఆసక్తితో అడివి శేష్ అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాడు. ‘క్షణం’ తర్వాత చేసిన చిత్రమిది. విజువల్స్ చూస్తేనే సినిమా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 160 రోజుల్లో 168 లొకేషన్స్‌లో ‘గూఢచారి’ చిత్రం షూట్ చేయడం గొప్ప విషయం’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ్ల జంటగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ శశితో నేను సింక్ కావడానికి టైమ్ పట్టింది. తనను నేను నమ్మితే... తను నన్ను నమ్మాడు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి హీరో అనొచ్చు. అద్భుతమైన రీ రికార్డింగ్ ఇచ్చాడు. ఈ సినిమాను హిందీ, తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నారు’’ అన్నారు. ‘‘శేష్ విజన్‌ని నేను షేర్ చేసుకోగలనా? అనుకున్నాను. 10 నెలలు నేను, రాహుల్, శేష్ కలిసి స్క్రిప్ట్ రాశాం. మధ్య మధ్యలో అబ్బూరి రవిగారిని కలిసేవాళ్లం. ఆయన దగ్గర రియల్ ఫిల్మ్ స్కూల్ అంటే ఏంటో నేర్చుకున్నా’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘నేను తెలుగమ్మాయినే. తెలుగులో నాకిది ఫస్ట్ మూవీ. మంచి టీమ్‌తో పనిచేశాననే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు శోభితా దూళిపాళ్ల. ‘‘గూఢచారి’ వంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలనుకుంటున్నాం’’ అన్నారు టి.జి. విశ్వప్రసాద్. ‘‘ఈ సినిమా టీజర్ చూసి థ్రిల్ అయ్యాను. అంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమా చేయడం కుదురుతుందా? నేనైతే చేయలేను. 20–30 కోట్ల రూపాయల సినిమాలా అనిపిస్తో్తంది’’ అని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాత అనిల్ సుంకర అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ బాబీ, నిర్మాత భరత్ చౌదరి పాల్గొన్నారు. -
50 సినిమాలు తిరస్కరించా
‘‘క్షణం’ రిలీజ్ తర్వాత ఓ 50 సినిమాలకు ఆఫర్ వచ్చింది. కానీ ఆ కథలు నచ్చక ఒప్పుకోలేదు. మనసుకు నచ్చిన సినిమా చేస్తే అది ఫ్లాప్ అయినా సంతృప్తి ఉంటుంది. నచ్చని సినిమా చేసి, అది ఫ్లాప్ అయితే చాలా బాధగా ఉంటుంది. ‘క్షణం’ రిలీజ్ అయిన 20 రోజులకు ‘గూఢచారి’కి సంతకం చేశా’’ అని అడవి శేష్ అన్నారు. ఆయన హీరోగా నటించి, కథ అందించిన చిత్రం ‘గూఢచారి’. శోభిత ధూళిపాళ కథానాయిక. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర ఈ శుక్రవారం ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అడవి శేష్ చెప్పిన చిత్ర విశేషాలు. ► నేను హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘కిస్’ విడుదల తర్వాత కొందరు నాతో ‘డైరెక్షన్ లేదా యాక్టింగ్.. ఏదో ఒకటే చేయండి. రెండూ కష్టం’ అన్నారు. కరెక్టే అనిపించింది. అప్పటి నుంచి డైరెక్షన్ చేయలేదు. నా డైరెక్షన్లో నేను నటించను. ► పది నెలలు కష్టపడి ‘గూఢచారి’ కథ రాశా. గతంలో నా సినిమా విడుదలవుతోందంటే ప్రేక్షకులకు నచ్చుతుందో? లేదో? అని నెర్వస్‌గా ఉండేది. కానీ నా కెరీర్లో ఫస్ట్ టైమ్ ‘గూఢచారి’ విషయంలో ప్రశాంతంగా ఉన్నా. సినిమా రషెస్ చూసిన వారి ఉత్సాహం చూస్తుంటే నెర్వస్నెస్ పోయి కాన్ఫిడెన్స్ వచ్చింది. ► ఓ సామాన్య స్టూడెంట్ ‘గూఢచారి’గా ఎలా మారాడు? అన్నదే కథ. ‘గూఢచారి 116’లో కృష్ణగారి కౌబాయ్ పాత్ర నన్ను ప్రభావితం చేసింది. మా సినిమాలో నటించమని ఆయన్ని అడిగాం. ఇప్పుడు నేను నటించడం లేదు అన్నారు. ► నా సినిమా, రాహుల్ చేసిన ‘చి..ల..సౌ’ శుక్రవారం విడుదలవుతుండటం పోటీగా భావించం. మా కలలు నెరవేర్చుకుంటున్నామనే సంతోషం. ‘చి..ల..సౌ’ చాలా బాగుంది. ► ప్రస్తుతం నేను చేస్తున్న ‘టు స్టేట్స్’ రీమేక్ 50 శాతం çపూర్తయింది. ఆ తర్వాత రామ్జీతో పీవీపీ బ్యానర్లో ఓ సినిమా, మరో కొత్త డైరెక్టర్‌తో మరో సినిమా ఉంటుంది. -
ఇంట గెలిచేందుకు....
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కొందరి విషయంలో ఇది రివర్స్‌లో జరుగుతుంది. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ముందు రచ్చ గెలిచి, ఇప్పుడు ఇంట గెలవడానికి రెడీ అయ్యారు. అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ‘గూఢచారి’లో ఆమె కథానాయికగా నటించారు. ఆగస్టు 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శోభిత గురించి కొన్ని విశేషాలు.. తెనాలికి చెందిన శాంతాకామాక్షి, వేణుగోపాలరావు దంపతులకు 1992లో జన్మించారు శోభిత. తండ్రి మెరైన్ ఇంజినీర్. వృత్తిరీత్యా విశాఖకు మకాం మార్చారు. శోభిత ముంబైలో చదువుకున్నారు. కామర్స్‌లో డిగ్రీ చేసిన శోభిత, సింబయాసిస్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పీజీలో చేరారు. చిన్నతనంలోనే కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్న శోభితకు విభిన్న రంగాల్లో ప్రవేశం, విజయం సాధించాలనేది ఆసక్తి. 2013లో బెంగళూరులో ఫెమీనా మిస్ ఇండియా పోటీలో ‘మిస్ ఇండియా ఎర్త్’ కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ టాలెంటెడ్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్, మిస్ ఎటిమెస్ డిజిటల్ దివా బహుమతులను గెలుచుకున్నారు. ఫిలిప్పైన్స్‌లో జరిగిన మిస్ ఎర్త్–2013 పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. మిస్ ఫొటోజెనిక్, మిస్ ఎకో బ్యూటీ, మిస్ టాలెంట్ అవార్డులను గెలిచారామె. మోడల్‌గా అవకాశాల వెల్లువ రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు వచ్చినట్టుగా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు శోభిత. 2014 కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో మెరిసిన శోభితకు ఫ్యాషన్ ప్రపంచం ఆహ్వానం పలికింది. జాతీయస్థాయిలో పలు అగ్రశ్రేణి పత్రికలు ఆమె ఫొటోలను ప్రచురించాయి. ప్రముఖ ఫ్యాషన్, జ్యూవెలరీ డిజైనర్ల ఫ్యాషన్ షోలు, భారీ అవార్డు ఫంక్షన్లు శోభితకు రెడ్ కార్పెట్ పరిచాయి. రాష్ట్రంలోని ఓ ప్రముఖ వస్త్రపరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. హిందీలో తొలి అడుగు బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన శోభితకు తొలి ఆడిషన్స్‌లోనే దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాలో లీడ్ రోల్ దక్కింది. ఈ చిత్రంలో శోభిత నటనకు ‘క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్’ లభించింది. తర్వాత అక్షయవర్మ దరకత్వంలో ‘కాలాకాండీ’ సినిమా చేశారామె. ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ‘మూథూన్’ సినిమాలో శోభిత సెక్స్‌వర్కర్‌గా నటిస్తున్నారు. ‘దృశ్యం’ సినిమా దర్శకుడు హిందీలో తొలిసారిగా తీస్తున్న ‘ది బాడీ’ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ, రిషికపూర్‌తో నటిస్తున్నారు. మాతృభాషలో సినిమా ఎప్పుడూ స్పెషలే ‘‘సొంత భాషలో సినిమా అవకాశమంటే స్పెషలే. నా తొలి హిందీ సినిమా విడుదలయ్యాక ‘గూఢచారి’ కోసం ఫోన్ చేశారు. భిన్నమైన థీమ్ కావటంతో అంగీకరించా. దర్శకత్వం నుంచీ అన్ని విభాగాల్లో అందరూ కష్టపడ్డారు. మంచి రిజల్ట్ వస్తుంది. తెలుగు పరిశ్రమలో పరిచయాల్లేవు. చాన్స్ వచ్చినపుడు నిరూపించుకోవాలనుకున్నా. తొలి సినిమానే సంతృప్తినిచ్చింది. మంచి కథ ఉన్నపుడు అన్ని పాత్రలూ ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి. నాకైతే తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుంది. భాషలు వేరైనా మనిషి ఎమోషన్స్ ఒకేలా ఉంటాయి కదా. – బి.ఎల్. నారాయణ (సాక్షి, తెనాలి) -
శేష్‌కు ఆ లోటు ఈ సినిమాతో తీరిపోతుంది
‘‘లాస్ట్ టైమ్ నేను ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్ చేశాను. అది సూపర్ హిట్. శేష్ అద్భుతమైన నటుడు. ఎందుకో తనకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదని ఫీల్ అయ్యేవాణ్ని. కానీ ఆ లోటు ‘గూ«ఢచారి’ సినిమా తీరుస్తుంది. ఇది శేష్‌కి కరెక్ట్ సినిమా’’ అని హీరో నాని అన్నారు. ‘క్షణం’ తర్వాత హీరో అడవి శేష్ కథను అందించి, నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామా, టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆగస్ట్ 3న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం ఈ చిత్రం టీజర్‌ను హీరో నాని రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘శేష్ ఏ సినిమా గురించి అయినా సోషల్ మీడియాలో చాలా పాజిటివ్‌గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తికి నేను సపోర్ట్‌గా ఉండాలని ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ట్రైలర్ అదిరిపోయింది. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, రీ రికార్డింగ్, పెర్ఫార్మెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలరే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో? ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో మా సినిమా కంటెంట్ ఏంటి అనేది చూపిస్తున్నాం. సాధారణ కాలేజ్ స్టూడెంట్ గూఢచారిలా మారితే ఎలా ఉంటుంది? అనేది మా చిత్రం కాన్సెప్ట్. చాలా నెర్వస్‌గా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్ ముఖ్య కారణం. అందరం రాత్రీ పగలు కష్టపడ్డాం. ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నానికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు అడవి శేష్. ‘‘ టీమ్ అంతా కమిట్మెంట్తో వర్క్ చేశారు. ఇలాంటి చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. ఈ చిత్రానికి సంగీతం : శ్రీచరణ్ పాకల, మాటలు: అబ్బూరి రవి, కెమెరా : షానీ డియోల్. -
గూఢచారి ట్రైలర్ విడుదల చేసిన నాని
అడివి శేష్ ఓ స్పై గా కనిపించనున్న గూఢచారి చిత్ర ట్రైలర్‌ను హీరో నాని శుక్రవారం విడుదల చేశారు. చిత్ర బృందంతో కలసి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నాని వారితో సరదాగా గడిపారు. ప్రధాన పాత్రలన్నింటిని చూపిస్తూ సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతంగా పెంచింది. ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు లవ్ ట్రాక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విభిన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని శేషు నమ్ముతున్నాడు. నాని కూడా ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ ట్విటర్లో తెలిపారు. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ టీ దర్శకుడు. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తరువాత నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న రిలీజ్ కానుంది. -
గూఢచారి ట్రైలర్ విడుదల
-
116 రోజుల్లో 158 లొకేషన్లలో..!
క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీ గూఢచారితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్ తరహా కథా కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను వెల్లడించారు చిత్రయూనిట్. ఈ సినిమాను 116 రోజుల్లో దాదాపు 158 డిఫరెంట్ లోకేషన్లలో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో చిత్రీకరించినట్టుగా వెల్లడించారు. అడివి శేస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో 2013 మిస్ ఇండియా శోభిత ధూళిపాళ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.. ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుండటం మరో విశేషం. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ సయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. -
త్రినేత్ర... ఓ సీక్రెట్ ఏజెంట్
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు పవన్ కల్యాణ్, సుప్రియ. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సుప్రియ తర్వాత నటనకు ఫుల్స్టాప్ పెట్టి, సినిమా నిర్మాణం చూసుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సుప్రియ మళ్లీ నటనవైపు అడుగులేసి ‘గూఢచారి’ సినిమాతో రీ–ఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ల జంటగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అభిషేక్ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రంలో సుప్రియ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన నదియా ఖురేషి పాత్ర లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే మిస్టీరియస్ ఏజెంట్‌గా ఆమె కనిపిస్తారు. రా ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ చీఫ్ టాస్క్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటూ 92 ఎఫ్ఎస్ తుపాకీని క్యారీ చేస్తుంటారు. సుప్రియ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు.. సినిమాకి కీలకం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 3న సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షానిల్ డియో, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిట్టు సూర్యన్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
టాలీవుడ్ జేమ్స్ బాండ్ : గూఢచారి
క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్ తరహా సినిమాతో రెడీ అవుతున్నాడు శేష్. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచేస్తూ ఇంట్రస్టింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టైలిష్ గా ఉన్న శేష్ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ టీ దర్శకుడు. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తరువాత నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆగస్ట్ 3న రిలీజ్ కానుంది. -
గూఢచారి టీజర్ రిలీజ్
-
గూఢచారి వస్తున్నాడు
ఎటువంటి రహస్యాలనైనా ఇట్టే శోధించగలిగే గూఢచారి అతడు. తను చేసిన సాహసాలను చూడాలంటే ఆగస్ట్ 3 వరకూ ఆగాల్సిందే అని అడవి శేష్ అంటున్నారు. అడవి శేష్, శోభిత ధూలిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశికరణ్ తిక్కా రూపొందించిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఆగస్ట్ 3న రిలీజ్ చేయనున్నారు. ‘‘షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పూణే, ఢిల్లీలో షూటింగ్ జరిపాం. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా ద్వారా రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె ఓ మంచి పాత్ర చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల. కెమెరా: షనీల్ డియో. -
ఎముకలు కొరికే చలిలో షూటింగ్
క్షణం సినిమాతో హీరోగా మంచి విజయం సాధించిన అడివి శేష్ ప్రస్తుతం గూఢాచారి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శశికిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తూ ఈ సినిమాకు అడివి శేష్ కథా కథనాలు అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్స్ లో జరుగుతోంది. మైనస్ డిగ్రీల చలిలో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ లోకేషన్లు, అక్కడి వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు అడివి శేష్. ఈ సినిమాతో 2013 మిస్ ఇండియా శోభితా ధూళిపాల టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అమెరికాలో గూఢచారి
అడివి శేష్, మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ల జంటగా నటిస్తోన్న చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్–విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. అడివి శేష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. నిర్మాతలు అభిషేక్ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కొత్త కాన్సెప్ట్‌తో ‘గూఢచారి‘ తెరకెక్కుతోంది. అడివి శేష్ గూఢచారి పాత్రను అద్భుతంగా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
అమెరికాలో ‘గూఢచారి’
‘క్షణం’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ తరువాత అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘గూఢచారి’.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్ తో ‘గూఢచారి’ తెరకెక్కుతోంది. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. వేసవి కానుకగా ‘గూఢచారి’ సినిమా విడుదల చేయనున్నాం’ అన్నారు. -
ఫస్ట్ లుక్.. పర్ఫెక్ట్ గూఢచారి
క్షణం, అమీ తుమీ హిట్లతో జోరు మీదున్న యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. స్టైలిష్ గా ఉన్న శేష్ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్ అధికారి రవి పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమ్మర్లో గూఢచారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
'గూడచారి'గా అడవి శేష్
విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, క్షణం సినిమాతో హీరోగానూ సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో కథ రచయితగా కూడా ఘన విజయం సాధించిన శేష్, తన నెక్ట్స్ సినిమా విషయంలో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. క్షణం సక్సెస్ అయిన వెంటనే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమాను శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు. గూడచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడవి శేష్ ఆసక్తికరమైన పాత్రలో అలరించనున్నాడట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా దూళిపాల హీరోయిన్గా నటిస్తోంది. దర్శకద్వయం రాహుల్ పాకల, శశి కిరణ్‌లు డైరెక్ట్ చేస్తున్నారు. -
తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్
మన తెలుగు నేల మీద పుట్టి.. ఇక్కడే పెరిగిన శోభిత ధూళిపాళ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మిస్ ఇండియా ఎర్త్ కిరీటం గెలిచిన ఈ ముద్దగుమ్మ చాలా రోజులుగా వెండితెర అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. అయితే తెలుగు తెర మీద ఈ అమ్మడి అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ మాత్రం పిలిచి మరి అవకాశం ఇచ్చింది. త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీతో వెండితెర మీద దర్శనమివ్వబోతుంది శోభిత. ఇప్పటికే ఫెమినా, మాండేట్, హై బ్లిట్జ్ లాంటి మేగజైన్ కవర్ పేజీల మీద దర్శనమిచ్చిన ఈ భామను అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు. వర్సటైల్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధీఖీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓ బయోగ్రఫికల్ డ్రామలో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. సంచలనం సృష్టించిన సైకో కిల్లర్ రమణ్ రాఘవన్ జీవితకథ ఆధారంగా రాఘవ్ 2.0 పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో శోభిత వెండితెరకు పరిచయం అవుతోంది .