#ChaySo wedding: శోభిత షాపింగ్ సందడి
స్వచ్ఛమైన బంగారంతో నేసిన కాంజీవరం చీర
చే కోసం మ్యాచింగ్ సెట్
టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటింగ్ వెడ్డింగ్ అంటే హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్‌బర్డ్స్ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు శోభితా పెళ్లి చీర, షాపింగ్ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
తన జీవితంలో అతి ముఖ్యమైన ఈరోజుకోసం శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్ లేకుండానే తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో షాపింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్ గోల్డ్ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్‌ను సెలెక్ట్ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.
కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ క్రీమ్ షేడ్స్‌లో, ఆరెంజ్ కలర్ బార్డర్‌చీరతో కనిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment