బంగారు చీర నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు
200 గ్రాముల బంగారంతో తయారీ
రూ.18 లక్షల వ్యయం
పసిడి చీర. ఇన్‌సెట్‌లో చీరను నేసిన విజయ్‌కుమార్
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్.. పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ మేరకు విజయకుమార్ బంగారంతో నిలువు, అడ్డం పోగులను చేనేత మగ్గంపై నేశారు. 800 నుంచి 900 గ్రాముల బరువు.. 49 అంగుళాల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీరను రూపొందించారు.
కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశాడు. ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం రూ.18 లక్షలు ఖర్చయినట్టు విజయ్‌కుమార్ తెలిపారు. అక్టోబరు 17న సదరు వ్యాపారి కూతురు పెళ్లి ఉండడంతో.. ఆరు నెలల కిందటే ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, సువాసన వచ్చే చీర, కుట్టులేని జాతీయ జెండాను చేనేత మగ్గంపై నేసిన విజయ్‌కుమార్.. తాజాగా బంగారు చీరను నేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment